19 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

18 November 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - సేవతో పాటు స్మృతి యాత్రను కూడా చేస్తూ ఉండాలి, ఈ ఆత్మిక యాత్రలో ఎప్పుడూ చల్లబడకూడదు”

ప్రశ్న: -

ఒకవేళ పిల్లల మనస్సు ఆత్మిక సేవలో నిమగ్నమవ్వకపోతే, దానికి కారణమేమిటి?

జవాబు:-

ఒకవేళ ఆత్మిక సేవలో మనస్సు నిమగ్నం అవ్వకపోతే తప్పకుండా దేహాభిమానం యొక్క గ్రహచారం ఉన్నట్లు. నడుస్తూ-నడుస్తూ దేహాభిమానం కారణంగా ఎప్పుడైతే పరస్పరంలో అలుగుతారో, అప్పుడు సేవను వదిలేస్తారు. ఒకరి ముఖాన్ని ఒకరు చూడగానే సేవా ఆలోచనలు ఎగిరిపోతాయి. అందుకే బాబా అంటారు – ఈ గ్రహచారం నుండి సంభాళించుకోండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మా తీర్థం అతీతమైనది.

ఓంశాంతి. ఈ పాటలోని లైన్ పిల్లలను అప్రమత్తం చేసింది. ఇది ఏం చెప్తుంది? మేము తీర్థ యాత్రలో ఉన్నాము మరియు మా ఈ యాత్ర అన్నిటికంటే అతీతమైనది అని బుద్ధిలో గుర్తుంచుకోవాలి. ఈ యాత్రను మర్చిపోకండి. యాత్ర పైనే అంతా ఆధారపడి ఉంది. మిగతా వారు దైహిక యాత్రలకు వెళ్ళి తిరిగి వస్తారు మరియు జన్మజన్మలుగా యాత్రలను చేస్తూనే ఉంటారు. కానీ మన తీర్థ యాత్ర అటువంటిది కాదు. అమరనాథ్ కు వెళ్ళి తిరిగి మృత్యులోకంలోకి వచ్చేటటువంటిది కాదు. మీది అటువంటి యాత్ర కాదు. మిగతా మనుష్యులందరివి అటువంటి యాత్రలు. తీర్థ స్థానాలకు వెళ్ళి, అంతా తిరిగి, మళ్ళీ వచ్చి పతితులుగా అవుతారు. రకరకాల యాత్రలు ఉన్నాయి కదా. దేవీల మందిరాలు కూడా చాలా ఉన్నాయి. వికారులతో కలిసి ఎన్నో యాత్రలకు వెళ్తారు. పిల్లలైన మీరైతే నిర్వికారులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేసారు. ఇది నిర్వికారులైన మీ యాత్ర. నిర్వికారుడైన తండ్రి, ఎవరైతే సదా పవిత్రులో, వారిని స్మృతి చేయాలి. నీటి సాగరాన్ని వికారీ లేక నిర్వికారీ అని అనరు, అంతేకాక దాని నుండి వెలువడిన గంగలు నిర్వికారీగా తయారుచేయవు. మనుష్యమాత్రులు ఎంత పతితులుగా అయ్యారంటే, ఏమీ అర్థం చేసుకోరు. ఆ దైహిక యాత్రలు అల్పకాలికమైన క్షణ భంగుర యాత్రలు. ఈ యాత్ర సుదీర్ఘమైనది. పిల్లలైన మీరు లేస్తూ-కూర్చుంటూ యాత్ర గురించి ఆలోచిస్తూ ఉండాలి. యాత్రలకు వెళ్ళినప్పుడు వ్యాపార వ్యవహారాలు, గృహస్థ వ్యవహారాలు మొదలైన వాటన్నిటినీ మర్చిపోవాల్సి ఉంటుంది. అమర్నాథ్ కు జై… అని అంటూ వెళ్తారు. నెల, రెండు నెలలు తీర్థ యాత్రలు చేసి వచ్చి మళ్ళీ అశుద్ధమవుతారు. అప్పుడు గంగా స్నానం చేయడానికి వెళ్తారు. మేము రోజూ పతితంగా అవుతున్నాము – అని వారికి తెలియనే తెలియదు. గంగా, యమునా తీరాలలో నివసించేవారు కూడా రోజూ పతితంగా అవుతారు. రోజూ గంగలో స్నానం చేస్తారు. ఒకటేమో నియమంగా చేస్తారు, రెండవది పండుగ రోజులలో వెళ్తారు, గంగను పతితపావనిగా భావిస్తారు. కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే గంగ పావనంగా చేసేదిగా ఉంటుంది, తర్వాత అలా ఉండదు అని కాదు. ఏ రోజు అయితే మేళా జరుగుతుందో, ఆ రోజు అది పతితపావనిగా అవుతుంది అని కాదు. ఆ నది అయితే సదా ఉంటుంది. రోజూ స్నానం చేయడానికి వెళ్తారు. మేళాలు జరిగినప్పుడు కూడా విశేషమైన రోజులలో వెళ్తారు. కానీ అందులో అర్థమేమీ లేదు. గంగ, యమున అయితే అవే కదా. వాటిలో శవాలను కూడా వేస్తూ ఉంటారు.

ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మిక యాత్రలో ఉండాలి, అంతే. ఇప్పుడిక మనము ఇంటికి వెళ్తాము. ఇందులో గంగా స్నానం చేసే లేక శాస్త్రాలను చదివే విషయమేమీ లేదు. తండ్రి కూడా కేవలం ఒక్కసారి మాత్రమే వస్తారు. మొత్తం ప్రపంచం కూడా పతితం నుండి పావనంగా ఒక్కసారి మాత్రమే అవుతుంది. సత్యయుగం కొత్త ప్రపంచమని, కలియుగం పాత ప్రపంచమని కూడా తెలుసు. తండ్రి కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనం చేయడానికి తప్పకుండా రావాలి. ఇది వారి పనే. కానీ మాయ ఎటువంటి తమోప్రధాన బుద్ధి కలవారిగా తయారుచేసిందంటే, ఇక ఏమీ అర్థం చేసుకోరు. ప్రదర్శనీలలో ఎంత మంది పెద్ద-పెద్ద వారు వస్తారు, సన్యాసులు కూడా వస్తారు. కానీ కోట్లలో కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు. మీరు లక్షలాది, కోట్లాది మందికి అర్థం చేయిస్తే, ఎవరో కొందరు వస్తారు. చాలా మందికి అర్థం చేయించాల్సి ఉంటుంది. చివరికి మీ ఈ వివరణ మరియు చిత్రాలు మొదలైనవన్నీ వార్తాపత్రికలలో కూడా పడతాయి. మెట్ల చిత్రం కూడా వార్తాపత్రికలలో పడుతుంది. వారు అంటారు – ఇది కేవలం భారత్ కు సంబంధించే ఉంది, మిగిలిన ధర్మాల వారు ఎక్కడ ఉన్నారు? వినాశన సమయం అని కూడా అంటూ ఉంటారు. వినాశన సమయం అంటే తిరిగి వెళ్ళే సమయం. పాత ప్రపంచ వినాశనం, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుందంటే, తప్పకుండా అందరూ తిరిగి వెళ్తారు కదా. అందరి వినాశనం జరగనున్నది. కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. ఈ విషయాలు పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియవు. నరకవాసుల వినాశనం, స్వర్గవాసుల స్థాపన జరుగుతుందని మీకు తెలుసు. కల్ప-కల్పము ఇలాగే జరుగుతుంది. ఇప్పుడిక కొద్ది సమయం ఏదైతే మిగిలి ఉందో, ఇందులో కూడా అనేక మందికి వివరణ లభిస్తూ ఉంటుంది. మేళాలు జరుగుతూ ఉంటాయి. మేము మేళా చేయాలా, ప్రదర్శనీ చేయాలా అని అన్ని వైపుల నుండి వ్రాస్తూ ఉంటారు. కానీ వాటితో పాటు తమ స్మృతి యాత్రను కూడా మర్చిపోకూడదు. పిల్లలు పూర్తిగా చల్లగా నడుస్తున్నారు. యాత్రను వృద్ధుల వలె చేస్తున్నారు. శక్తియే లేనట్లు, ఏమీ తిననట్లు చేస్తున్నారు. బాబాకు ఎంత ఆలోచన నడుస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ-ఆలోచిస్తూ నిద్ర కూడా ఎగిరిపోతుంది. విచార సాగర మథనమును అందరూ చేయాలి కదా. మమ్మల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. కావున పిల్లలకు ఎంత అపారమైన సంతోషముండాలి. ఈ చదువుతో మేము విశ్వానికి యజమానులుగా అవుతాము. కొందరి నడవడిక పీతల వలె ఉంటుంది. పీతలను తండ్రి దేవతలుగా తయారుచేస్తారు. అయినా, కష్టం మీద కొందరి నడవడిక చక్కబడుతుంది. ఈ మెట్ల చిత్రంలో చాలా మంచి జ్ఞానముంది. కానీ పిల్లలు అంత పని చేయడం లేదు. యాత్రను చేయడమే లేదు. తండ్రిని స్మృతి చేస్తే బుద్ధి తాళము కూడా తెరుచుకుంటూ ఉంటుంది. బంగారు బుద్ధి తయారవుతూ ఉంటుంది. పిల్లలైన మీది పారసబుద్ధి వలె ఉండాలి, అనేకుల కళ్యాణం చేయాలి. ఇప్పుడు మీరు సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయ్యారు, మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి అంటారు – నన్ను స్మృతి చేయండి. కృష్ణుడిని భగవంతుడు అని అనలేరు. వారిని నల్లనివారు అని అంటారు. తండ్రి నల్లగా ఉన్న ఆత్మకు కూర్చుని అర్థం చేయించారు. తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తున్నారంటే బుద్ధి సంతోషంతో ఎంత నిండుగా ఉండాలి. ఇందులో అహంకారం యొక్క విషయమేమీ లేదు. తండ్రి ఎంత నిరహంకారి. బుద్ధిలో ఎంత సంతోషముంటుంది. రేపు మనం వజ్రవైఢూర్యాల మహళ్ళను తయారుచేస్తాము. కొత్త ప్రపంచంలో రాజ్య పాలన చేస్తాము. ఇది పూర్తిగా పతిత ప్రపంచము. ఈ ప్రపంచంలోని మనుష్యులు దేనికీ పనికిరారు, వారికేమీ తెలియదు. ఒకప్పుడు వజ్ర సమానమైన జీవితముండేదని, వారే మళ్ళీ 84 జన్మలను తీసుకుని గవ్వ సమానంగా అవుతారు అని కూడా చూపించాలి. ఈ మెట్ల చిత్రం నంబర్ వన్, రెండవ నెంబరు త్రిమూర్తి చిత్రం.

సమీప భవిష్యత్తులో శ్రేష్ఠాచారీ భారత్ తయారవుతుంది అని మీరు అంటారు. శ్రేష్ఠాచారీ ప్రపంచంలో చాలా కొద్దిమంది మనుష్యులు ఉంటారు. ఇప్పుడు ఎంతమంది మనుష్యులున్నారు. మహాభారత యుద్ధము కూడా ఎదురుగా నిలబడి ఉంది. ఆత్మలన్నీ దోమల వలె వెళ్తాయి. అగ్ని వ్యాపిస్తూ ఉంది. సరిదిద్దేందుకు ఎంతగా ప్రయత్నిస్తూ ఉంటారో, అంతగా దిగజారుతూ ఉంటారు. తండ్రి పిల్లలకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పిల్లలకు ఎంతగా నషా కలిగిస్తారు. కొందరైతే ఇక్కడి నుండి బయటకు వెళ్ళగానే మొత్తం జ్ఞానమంతా ఎగిరిపోతుంది. ఏమీ గుర్తుండదు. లేదంటే వెళ్ళి సేవ చేయాలి అనే అభిరుచి ఉండాలి. బాబా కూడా గుణాలను చూసి సేవకు పంపిస్తారు కదా. ఇందులో చాలా హర్షితంగా ఉంటారు. సేవలో సంతోషపు పాదరసం పైకి ఎక్కుతుంది. మంచి-మంచి పాత పిల్లలు పరస్పరంలో చిన్న-చిన్న విషయాలకు కూడా అలుగుతారు. ఈ విషయాల కారణంగా మీరు సేవ చేయకుండా ఉండకూడదు. సేవను సంతోషంగా చేయాలి. ఎవరితోనైనా పడకపోతే, వారి ముఖాన్ని చూడడంతోనే సేవా ఆలోచన ఎగిరిపోతుంది. సేవలో మనస్సు నిమగ్నమవ్వకపోతే పక్కకు వెళ్ళిపోతారు. అప్పుడిక జ్ఞానులకు, అజ్ఞానులకు తేడా ఏమీ లేనట్లు. దేహాభిమానమనే గ్రహచారం వచ్చి కూర్చుంటుంది. ఇది మొదటి నంబరు వ్యాధి. బాబా అంటారు – పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి. ఆత్మనే అంతా చేస్తుంది కదా. ఆత్మనే వికారీగా మరియు నిర్వికారీగా అవుతుంది. స్వర్గంలో నిర్వికారీగా ఉండేది. రావణ రాజ్యంలో ఆత్మనే వికారీగా అయ్యింది. డ్రామా కూడా ఇలా తయారుచేయబడి ఉంది, అందుకే ఓ పతితపావనా రండి అని పిలుస్తారు. నిర్వికారులుగా ఉండేవారే పతితులుగా, వికారులుగా అయ్యారు. మేమే నిర్వికారులుగా ఉండేవారము, ఇప్పుడు వికారులుగా అయ్యాము అని ఎవరి బుద్ధిలోనూ లేదు. ఆత్మలమైన మనము మూలవతనంలో ఉండేవారము. అక్కడైతే ఆత్మలమైన మనము నిర్వికారులుగా ఉంటాము. ఇక్కడ శరీరంలోకి వచ్చి పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ వికారులుగా అయ్యాము. ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఆత్మ శాంతిధామం నుండి వచ్చినప్పుడు తప్పకుండా పవిత్రంగానే ఉంటుంది. తర్వాత అపవిత్రంగా అయ్యింది. పవిత్ర ప్రపంచంలో 9 లక్షల మంది ఉంటారు. మరి ఇంతమంది ఆత్మలు ఎక్కడి నుండి వచ్చాయి? తప్పకుండా శాంతిధామం నుండి వచ్చి ఉంటాయి. అది శాంతిమయమైన నిరాకారీ లోకము. అక్కడ ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి, తర్వాత పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ సతో, రజో, తమోలలోకి వస్తాయి. పావనం నుండి పతితంగా అయ్యేది ఉంటుంది. మళ్ళీ తండ్రి వచ్చి అందరినీ పావనంగా తయారుచేస్తారు. ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. డ్రామా ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ తెలియజేయలేరు. ఆ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. ఋషులు, మునులు కూడా తెలియదు, తెలియదు అని అంటూ వచ్చారు. మాకు భగవంతుడు మరియు వారి రచన గురించి తెలియదు అని అంటారు. మళ్ళీ గాడ్ ఫాదర్ నాలెడ్జ్ ఫుల్ అని కూడా అంటారు. ఆ పరమాత్మ సర్వాత్మల తండ్రి, బీజరూపుడు. వారు ఆత్మలకు బీజరూపుడు మరియు ఈ ప్రజాపిత బ్రహ్మా మనుష్య సృష్టికి బీజరూపుడు. ఆ నిరాకార తండ్రి వీరిలో ప్రవేశించి మనుష్యుని ద్వారా మనుష్యులకు అర్థం చేయిస్తారు. వారిని మనుష్య సృష్టికి బీజరూపుడని అనరు. వారు ఆత్మల తండ్రి మరియు ఈ బ్రహ్మా మనుష్య సృష్టికి ప్రజాపిత. వీరి ద్వారా తండ్రి వచ్చి జ్ఞానాన్నిస్తారు. శరీరము వేరు, ఆత్మ వేరు కదా. మనస్సు, బుద్ధి మరియు చిత్తము ఆత్మలో ఉన్నాయి. ఆత్మ వచ్చి పాత్రను అభినయించేందుకు శరీరంలో ప్రవేశిస్తుంది.

ఎవరైనా శరీరం వదిలితే, వెళ్ళి మరో పాత్రను అభినయిస్తారని మీకు తెలుసు. ఇందులో ఏడవడం వలన ఏం జరుగుతుంది. పోయినవారు పోయారు. వారు మళ్ళీ వచ్చి మన మావయ్యగా, చిన్నాన్నగా అవ్వరు. ఏడవడం వలన లాభమేముంటుంది. మీ మమ్మా వెళ్ళిపోయారు, డ్రామానుసారంగా పాత్రను అభినయిస్తున్నారు. ఇలా చాలా మంది వెళ్ళిపోతారు. ఎక్కడికో వెళ్ళి జన్మ తీసుకుంటారు. ఎవరు ఎంతగా ఆజ్ఞాకారీ బిడ్డగా ఉంటారో, వారు తప్పకుండా అంత మంచి ఇంటిలో జన్మ తీసుకుని ఉండవచ్చు అని అర్థమవుతుంది. ఇక్కడి నుండి వెళ్ళడమే మంచి ఇంటిలోకి వెళ్తారు. నంబరువారుగా అయితే ఉంటారు కదా. ఎవరు ఎలాంటి కర్మలు చేస్తారో, వారు అలాంటి ఇంటికి వెళ్తారు. చివర్లో మీరు వెళ్ళి రాజ కుటుంబాలలో జన్మ తీసుకుంటారు. ఎవరెవరు రాజుల వద్దకు వెళ్తారు అనేది స్వయం అర్థం చేసుకోగలరు కదా. అయినా దైవీ సంస్కారాలను తీసుకువెళ్తారు కదా. ఇందులో చాలా విశాల బుద్ధితో విచార సాగర మథనము చేయాల్సి ఉంటుంది. తండ్రి జ్ఞానసాగరుడు. కావున పిల్లలు కూడా జ్ఞానసాగరులుగా అవ్వాలి. నంబరువారుగా అయితే ఉండనే ఉంటారు. మున్ముందు ఉన్నతి జరుగుతూ ఉంటుందని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు పని చేయలేని వారు రేపు చాలామంది కంటే చురుకుగా ముందుకు వెళ్ళిపోవచ్చు. గ్రహచారం తొలగిపోవచ్చు. కొందరిపై రాహు గ్రహచారం కూర్చుంటే మురికి కాలువలో పడిపోతారు. ఎముకలే విరిగిపోతాయి. అనంతమైన తండ్రికి ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పడిపోతే ధర్మరాజు ద్వారా చాలా శిక్షలు లభిస్తాయి. వీరు అనంతమైన తండ్రి, అనంతమైన ధర్మరాజు కనుక అనంతమైన శిక్షలు లభిస్తాయి. ఏదైనా విషయాన్ని పెడచెవిన పెడితే లేక ఏవైనా తప్పుడు పనులు చేస్తే, తప్పకుండా శిక్షలు అనుభవిస్తారు. మేము భగవంతుని ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నామని అర్థం చేసుకోరు. ఈ విషయాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. శ్రీమతాన్ని అనుసరించండి. సేవలో సహాయకులుగా అవ్వండి. యోగము యొక్క యాత్రలో ఉండండి. చిత్రాలపై అర్థం చేయించే ప్రాక్టీసు చేస్తే అలవాటైపోతుంది లేదంటే ఉన్నత పదవి ఎలా లభిస్తుంది. అజ్ఞాన కాలంలో కొంతమందికి చాలా సుపుత్రులైన పిల్లలు ఉంటారు. కొందరు చాలా కుపుత్రులుగా ఉంటారు. ఇక్కడ కూడా కొంతమంది వెంటనే బాబా కార్యాన్ని చేసి చూపిస్తారు. కావున పిల్లలు అనంతమైన సేవ చేయాలి. అనంతమైన ఆత్మలకు కళ్యాణం చేయాలి. మన్మనాభవ యొక్క సందేశాన్నివ్వాలి. తండ్రిని స్మృతి చేయడంతో మీ బుద్ధి తమోప్రధానం నుండి సతోప్రధానం అవుతుంది. ఇప్పుడిది ఈ కలియుగీ తమోప్రధానమైన ప్రపంచం యొక్క అంతిమము. ఇప్పుడు సతోప్రధానంగా అవ్వాలి. అక్కడ ఆత్మలు కూడా నంబరువారుగా ఉండే ప్రపంచం ఉంది కదా. వారు మళ్ళీ నంబరువారుగా వచ్చి పాత్రను అభినయిస్తారు. రావడం కూడా నంబరువారుగా, డ్రామానుసారంగా వస్తారు. ఇప్పుడు ఆత్మలందరూ రావణ రాజ్యంలో దుఃఖితులుగా ఉన్నారు, అయినా ఏమీ అర్థం చేసుకోరు. మీరు పతితులు అని ఎవరితోనైనా అంటే డిస్టర్బ్ అవుతారు. తండ్రి అర్థం చేయిస్తారు – ఇది ఉన్నదే వికారీ ప్రపంచము. తండ్రి అంటారు – మీరు మీ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. మిగిలినవారంతా వినాశనమై తిరిగి వెళ్ళిపోతారు. మహాభారత యుద్ధం జరగనున్నది అని అంటూ ఉంటారు. తద్వారా అన్ని ధర్మాలు సమాప్తమై ఒకే ధర్మము ఉంటుంది. ఈ యుద్ధం తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. ఎంత మంచి రీతిలో పిల్లలకు అర్థం చేయిస్తారు. మున్ముందు మీరు చెప్పే విషయాలను వింటూ ఉంటారు మరియు వస్తూ ఉంటారు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, ఎవరైతే పతితులుగా అయ్యారో, వారే వచ్చి నంబరువారుగా తమ వారసత్వాన్ని తీసుకుంటారు. ప్రజలైతే అనేక మంది తయారవుతారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. భగవంతుని ఆజ్ఞలను ఎప్పుడూ ఉల్లంఘించకూడదు. అనంతమైన సేవలో సుపుత్రులైన పిల్లలుగా అయి సహాయకులుగా అవ్వాలి.

2. జ్ఞాన ధనం యొక్క గుప్తమైన సంతోషంతో బుద్ధిని నిండుగా ఉంచుకోవాలి. పరస్పరంలో ఎప్పుడూ అలగకూడదు.

వరదానము:-

ఏ పిల్లలైతే సర్వశక్తులతో సంపన్నంగా ఉంటారో, వారే సంపన్న మరియు సంపూర్ణ స్థితి యొక్క సమీపతను అనుభవం చేస్తారు. వారిలో ఎలాంటి భక్తి యొక్క సంస్కారాలు లేక బికారితనపు సంస్కారాలు ఇమర్జ్ అవ్వవు. తండ్రి సహాయం కావాలి, ఆశీర్వాదాలు కావాలి, సహయోగం కావాలి, శక్తి కావాలి – ఈ ‘కావాలి’ అన్న పదం దాత, విధాత, వరదాత పిల్లల ముందు అస్సలు శోభించదు. వారు విశ్వంలోని ప్రతి ఆత్మకు ఏదో ఒక దానమును లేక వరదానమును ఇచ్చేవారిగా ఉంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top