19 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 18, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మిమ్మల్ని ఈ దుఃఖం యొక్క లోకం నుండి బయటకు తీసి సుఖం యొక్క ధామంలోకి తీసుకువెళ్ళడానికి వచ్చారు, ధామము అని పవిత్ర స్థానాన్ని అనడం జరుగుతుంది’’

ప్రశ్న: -

ఈ అనంతమైన ఆట ఏ రెండు పదాల ఆధారంగా తయారయింది?

జవాబు:-

‘‘వారసత్వము మరియు శాపము’’. తండ్రి సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తారు, రావణుడు దుఃఖం యొక్క శాపాన్ని ఇస్తాడు, ఇది అనంతమైన విషయము. దేవీ-దేవతా ధర్మం వారు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. అర్ధకల్పం తర్వాత మళ్ళీ రావణుడు శాపాన్ని ఇస్తాడు. పిల్లలైన మీకు ఇప్పుడు స్మృతి కలిగింది – మేము నిరాకారీ ప్రపంచంలో ఉండేవారము, తర్వాత సుఖం యొక్క పాత్రను అభినయించాము. మేమే దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయి దేవతలుగా అవుతాము.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓం నమః శివాయ…

ఓంశాంతి. ఇది అనంతమైన తండ్రి యొక్క మహిమ. ఉన్నతోన్నతమైనవారు ఆ భగవంతుడు – ఇదైతే అందరికీ తెలుసు. ఉన్నతోన్నతమైన భగవంతుని మతం కూడా తప్పకుండా ఉన్నతంగా ఉంటుంది, అందుకే శ్రీమతము అనగా శ్రేష్ఠ మతము అని అంటారు. భక్తురాళ్ళందరూ వారిని స్మృతి చేస్తారు. వారు భగవంతుడు, కావున భగవతి కూడా కావాలి. తండ్రి ఉన్నారంటే తల్లి కూడా కావాలి. ఒకరేమో లౌకిక తల్లిదండ్రులు, రెండవవారు పారలౌకిక తల్లిదండ్రులు. లౌకిక తల్లిదండ్రులు ఉన్నా కానీ, ఎప్పుడైనా ఎవరైనా దుఃఖితులుగా అయితే, పారలౌకికమైనవారిని స్మృతి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు లౌకిక సంబంధాలు కూడా ఉన్నాయి. పారలౌకిక తల్లిదండ్రులు మిమ్మల్ని పరలోకంలోకి తీసుకువెళ్తారు. లౌకికాన్ని బంధనము అని అంటారు, అందులో దుఃఖముంది. రెండు పరలోకాలున్నాయి – ఒకటి నిరాకారీ లోకము, అక్కడ ఆత్మలు నివసిస్తాయి, రెండవది సాకారీ లోకము, దానిని సుఖధామము అని అంటారు. అది శాంతిధామము, అది సుఖధామము. తండ్రి వచ్చి ఈ దుఃఖం యొక్క లోకము నుండి, దేనినైతే మృత్యులోకము లేక పతిత భ్రష్టాచారీ ప్రపంచము అని అంటారో, ఇక్కడ నుండి తీసుకువెళ్తారు, ఇక్కడ అందరూ పతితులుగా ఉన్నారు. ఎవరైతే వికారాల్లోకి వెళ్తారో, పతితులు అని వారిని అనడం జరుగుతుంది. సత్యయుగంలో పావనమైనవారు, సంపూర్ణ నిర్వికారులు ఉంటారు. ఇంతకుముందు లక్ష్మీ-నారాయణుల మహిమను పాడేవారు మరియు తమను తాము వికారులుగా భావించేవారు. మహారాజు-మహారాణి అయిన లక్ష్మీ-నారాయణులు పవిత్రంగా ఉండేవారు కావున ప్రజలను కూడా పవిత్రమైనవారని అంటారు. అది సుఖధామము, వైకుంఠము. నరకాన్ని ధామము అని అనరు. ధామము అని పవిత్రమైనదానిని అంటారు. ఇది అపవిత్ర ప్రపంచము. భారత్ సుఖధామంగా ఉండేది. ఇప్పుడు పతిత భ్రష్టాచారీ నరకంగా ఉంది. ఇప్పుడు అందరినీ సుఖం యొక్క ధామంలోకి తీసుకువెళ్ళాలి, కావున తప్పకుండా తండ్రికి రావాల్సి ఉంటుంది, వారు వచ్చి పిల్లలను సుఖమయంగా చేయాల్సి ఉంటుంది. బాబా స్వర్గ రచయిత. వారంటారు – ఓ బాబా, మొట్టమొదట మీరు మాకు స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇచ్చారు. అర్ధకల్పం మనం స్వర్గంలో ఉండేవారము, దానినే సూర్యవంశీ-చంద్రవంశీ రాజధాని అని అంటారు. తండ్రి స్మృతినిప్పిస్తారు, 21 జన్మలు మీరు స్వర్గంలో ఉండేవారు. 8 జన్మలు సత్యయుగంలో, 12 జన్మలు త్రేతాలో తీసుకున్నారు, ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. వారంటారు – పిల్లలూ, మీకు మీ జన్మల గురించి తెలియదు, నేను మీకు అంతా తెలియజేస్తాను. నిరాకార తండ్రి, నిరాకార పిల్లలతో మాట్లాడుతారు. వారంటారు, ఈ సాధారణ తనువును లోన్ గా తీసుకొని నేను మీకు అర్థం చేయిస్తాను. అర్ధకల్పం మీరు అశోక వాటికలో ఉండేవారు, తర్వాత మీరు శోక వాటికలోకి వచ్చేసారు. సుఖం పూర్తి అయి దుఃఖం వచ్చింది. వామ మార్గము అనగా నరకము. అందులో మీరు దుఃఖం పొందుతారు, తర్వాత తండ్రి వచ్చి రావణ రాజ్యం నుండి విడిపించి రామ రాజ్యంలోకి తీసుకువెళ్తారు. ఈ ఆట తయారై ఉంది. తండ్రి సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తారు, రావణుడు దుఃఖం యొక్క శాపాన్ని ఇస్తాడు. ఇది అనంతమైన విషయము. ఇప్పుడు తండ్రి మీకు 21 జన్మల కోసం సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. భగవంతుడు స్వర్గాన్ని రచిస్తారు కనుక స్వర్గం యొక్క వారసత్వం లభించాలి. వారసత్వాన్ని ఒకప్పుడు పొందారు. మాయ అర్ధకల్పము శాపం ఇచ్చింది. మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా ఉంది. ఈ చక్రం ఎప్పుడూ అంతమవ్వదు. మళ్ళీ వారసత్వాన్ని ఇవ్వడానికి తండ్రి తప్పకుండా రావాల్సిందే. ఇప్పుడు తండ్రి వచ్చారు, ఎవరైతే కల్పక్రితం కూడా తీసుకున్నారో, వారే వారసత్వాన్ని తీసుకుంటారని తెలుసు. దేవీ-దేవతా ధర్మం వారు తప్ప ఇతరులెవ్వరూ వారసత్వాన్ని తీసుకోలేరు. మొదట బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా అవ్వలేరు. ఆత్మలమైన మనం మొదట నిరాకారీ ప్రపంచంలో ఉండేవారము. తర్వాత సుఖం యొక్క పాత్రను అభినయించడానికి వస్తాము. మనమే దేవతలుగా అయ్యాము, తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాము. మనము ఈ వర్ణాలలోకి వస్తాము. ఇప్పుడు ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారు తమను తాము బ్రహ్మాకుమారులు మరియు కుమారీలుగా పిలిపించుకుంటారు. మేము సోదరీ-సోదరులుగా అయ్యామని భావిస్తారు. ఇక వికార దృష్టి ఉండజాలదు. మేము పవిత్రంగా అయి, పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతామని తెలుసు. తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చేస్తారు మరియు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉంటారు. ఇది మృత్యులోకము. ఇది నశించనున్నది మరియు అమరలోకము వర్థిల్లనున్నది. అక్కడ 5 వికారాలు ఉండనే ఉండవు, రావణ రాజ్యమే సమాప్తమైపోతుంది. సత్య-త్రేతాయుగాలను రామ రాజ్యమని, ద్వాపర-కలియుగాలను రావణ రాజ్యమని అంటారు. అదే భారత్ వజ్రతుల్యంగా ఉండేది, ఇప్పుడు గవ్వతుల్యంగా అయిపోయింది. ఇప్పుడు తండ్రి అంటారు, మీకు వజ్రతుల్యమైన జన్మను ఇవ్వడానికి వచ్చాను. మీరు నా శ్రీమతంపై నడవండి. లేదంటే మీరు స్వర్గం యొక్క సుఖాన్ని చూడలేరు. స్వర్గంలో దుఃఖం యొక్క పేరే ఉండదు, ఇంకే ఇతర ఖండము ఉండదు. భారత్ యే నిజానికి ప్రాచీన ఖండము. కేవలం దేవీ-దేవతల రాజ్యమే ఉంటుంది, అందుకే దానిని స్వర్గమని అంటారు. అర్ధకల్పము మీరు స్వర్గం యొక్క సుఖాన్ని అనుభవించారు, తర్వాత రావణ రాజ్యం మొదలైంది. సత్యయుగాన్ని శివాలయమని అంటారు. శివబాబా ద్వారా స్థాపన చేయబడినది. శివబాబా బ్రహ్మా ద్వారా స్వర్గం యొక్క స్థాపనను, శంకరుని ద్వారా నరకం యొక్క వినాశనాన్ని చేయిస్తారు. ఎవరైతే స్థాపన చేస్తారో, వారే స్వర్గంలో పాలన కూడా చేస్తారు. వారే విష్ణుపురి యొక్క యజమానులుగా కూడా అవుతారు. శివబాబానే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. ఈ సమయంలో మీది బ్రాహ్మణ వర్ణము. తర్వాత దేవతల వర్ణముగా అవుతుంది. ఇప్పుడు మీరు ఈశ్వరుని ద్వారా బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు, తర్వాత మీరు ఈశ్వరీయ వర్ణంలో తండ్రితో పాటు పరంధామంలో ఉంటారు. మళ్ళీ అక్కడ నుండి దేవతా వర్ణంలోకి వస్తారు. సత్యయుగంలో ఒక్క దేవతల రాజ్యమే ఉండేది, ఆ సమయంలో ఇంకే ఖండమూ ఉండేది కాదు. తర్వాత ఇస్లాములు, బౌద్ధులు మొదలైనవారు వచ్చారు.

ఇప్పుడు పాండవులైన మీరు యోగబలంతో 5 వికారాలపై విజయాన్ని పొంది జగత్ జీతులుగా, విశ్వానికి యజమానులుగా అవుతారు. లక్ష్మీ-నారాయణులు సూర్యవంశీయులుగా, స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. వారికి కూడా సంగమంలో తండ్రి నుండే వారసత్వం లభించింది. సంగమయుగము బ్రాహ్మణులది, ఎవరైతే బ్రాహ్మణులుగా అవ్వరో, వారు కలియుగంలో ఉన్నట్లు. తండ్రి మిమ్మల్ని వేశ్యాలయం నుండి బయటకు తీసి శివాలయంలోకి తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు మీరు బ్రహ్మాకు పిల్లలు, బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలు. మీరు సోదరీ-సోదరులు, ఎప్పుడూ కూడా విష పానము చేయలేరు. అయితే, గృహస్థ వ్యవహారంలో ఉండాల్సిందే, కానీ వికారాల్లోకి వెళ్ళలేరు. ఈ రావణ రాజ్యంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. మరి ఈ సృష్టి ఎలా వృద్ధి చెందుతుంది అనే ప్రశ్న ఉత్పన్నమవ్వజాలదు. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే – నేను పవిత్ర ప్రపంచాన్ని తయారుచేయడానికి వచ్చాను, మీరు ఈ అంతిమ జన్మ పవిత్రంగా అయినట్లయితే మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వగలరు. దీని గురించే అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. రుద్ర జ్ఞాన యజ్ఞంలో అసురుల విఘ్నాలు కూడా కలుగుతాయి. తండ్రి అంటారు, శ్రీమతంపై నడవటంతోనే మీరు శ్రేష్ఠంగా అవుతారు. ఇంత సమయమూ మీరు ఆసురీ మతముపై అనగా 5 భూతాల మతముపై ఉండేవారు. నేను ఆత్మను, నేను ఈ శరీరంతో పాత్రను అభినయించాలి అని ఎవ్వరికీ తెలియదు. ఆత్మ అని సాలిగ్రామమునే అంటారు. సాలిగ్రామము కూడా అంత పెద్దగా ఏమీ ఉండదు. పరమాత్మ కూడా అంత పెద్దగా ఏమీ ఉండరు. ఆత్మ మరియు పరమాత్మ నక్షత్రం వలె ఉంటారు. ఆత్మలో మొత్తం పాత్రంతా నిండి ఉంది. ఆత్మ అంటుంది, నేను పాత్రను అభినయించడం కోసం ఒక శరీరాన్ని వదిలి మరొకదానిని ధరిస్తాను. శ్రీ నారాయణుని ఆత్మ అంటుంది, నేను శ్రీ నారాయణుని రూపాన్ని ధరించి ఇన్ని జన్మలు రాజ్యం చేస్తాను అని. ఆత్మలోనే మొత్తం అవినాశీ పాత్ర నిండి ఉంది, దీనినే గాడ్ ఫాదర్లీ నాలెడ్జ్ (ఈశ్వరీయ జ్ఞానం) అని అంటారు. భగవానువాచ, స్పిరిచ్యుల్ ఫాదర్ (ఆత్మిక తండ్రి) కూర్చుని ఆత్మలను చదివిస్తారు, మనుష్యులెవ్వరూ చదివించరు. ఈ చక్రం ఎలా తిరుగుతుంది అనేది ఈ అనంతమైన తండ్రి చదివిస్తారు. ఈ సృష్టి చక్రం మరియు రచయిత లేక రచనల జ్ఞానము గురించి మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు శివాలయమైన సత్యయుగంలో రాజ్యం చేయడానికి యోగ్యులుగా అవుతారు. భారత్ ఎప్పుడైతే యోగ్యముగా ఉండేదో, అప్పుడు చాలా తెలివైనదిగా ఉండేది. ఇప్పుడు తండ్రి మళ్ళీ వజ్రతుల్యంగా తయారుచేయడానికి వచ్చారు కనుక వారి శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది. రావణుని మతం మిమ్మల్ని గవ్వతుల్యంగా చేస్తుంది.

ఈ ప్రపంచం యొక్క ఆయువు 5 వేల సంవత్సరాలని, అందులోనే పాతదిగా మరియు కొత్తదిగా అవుతుందని మీకు తెలుసు. సత్య-త్రేతాయుగాలు కొత్త ప్రపంచము, ద్వాపర-కలియుగాలు పాత ప్రపంచము. తండ్రి మళ్ళీ దైవీ ప్రపంచం యొక్క స్థాపన చేయడానికి వచ్చారు. ఆత్మలైన మీరు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఆత్మనే ఈ ఇంద్రియాల ద్వారా మాట్లాడుతుంది మరియు వింటుంది. ఒక పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటుంది. ఆత్మలకు తండ్రి ఈ జ్ఞానాన్ని ఇచ్చారు, ఏమనంటే, మనం తండ్రితో పాటు మొదట మధురమైన ఇంటిలో ఉండేవారము, తర్వాత మనమే దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాము. ఇప్పుడిది మన అంతిమ జన్మ. బ్రాహ్మణులైన మనము స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుని దేవతలుగా అవుతాము. కొత్త శరీరాన్ని ధారణ చేస్తాము. ఈ చక్రం బుద్ధిలో తిరగాలి. పవిత్రంగా ఉండడంతో మీరు స్వర్గం యొక్క చక్రవర్తీ మహారాజుగా అవుతారు. ఎవరైతే కల్పక్రితం వలె తయారై ఉంటారో, ఈ విషయం వారి బుద్ధిలోకే వస్తుంది. లేదంటే బుద్ధిలోకి రానే రాదు. ప్రపంచ చరిత్ర-భౌగోళికము అర్థం చేసుకోవాల్సినది. కొందరైతే తెలుసుకుని కూడా ఈ చదువును వదిలేస్తారు. స్వర్గంలోకైతే వస్తారు కానీ యోగిగా అయి వికర్మలను వినాశనం చేసుకోలేదంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. స్వర్గంలోకి వస్తారు కానీ ప్రజల్లో కూడా తక్కువ పదవిని పొందుతారు. స్వర్గంలో మొదట పావనమైన మహారాజా-మహారాణులు ఉండేవారు, వారే మళ్ళీ పతిత రాజా-రాణులుగా అయ్యారు. ఇప్పుడైతే ఆ రాజా-రాణులు కూడా లేరు. ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా పావనమైన రాజా-రాణులుగా అవుతున్నారు. ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని నిరాకార తండ్రే చదివిస్తారు. సాకారంలో ఈ బ్రహ్మా కూడా ఆ నిరాకారుడి నుండే వింటున్నారు. నిరాకార తండ్రి కూర్చొని చదివిస్తారు. ఈ జ్ఞానంతోనే మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు, ఈ బ్రహ్మా ఆత్మ కూడా చదువుకుంటుంది. పిల్లల ఆత్మ కూడా చదువుకుంటుంది. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. మంచి సంస్కారాలు ఉన్నట్లయితే మంచి ఇంటిలో జన్మ తీసుకుంటారు. చదువుతూ-చదువుతూ తర్వాత జ్ఞానాన్ని కూడా విడిచిపెట్టేస్తారు. మాయ తన వైపుకు లాక్కుంటుంది. ఒక వైపు రావణుని మతము, రెండవ వైపు రాముని మతము. ఈ అంతిమ జన్మలో రాముని మతంపై నడవాలి. రావణుడు జయించడంతో అప్పుడప్పుడు అటువైపుకు వెళ్ళిపోతారు. అప్పుడు రామునికి శత్రువులుగా అవుతారు. అటువంటివారికి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. మీరు రాముని శరణు తీసుకున్నారు. మళ్ళీ ఒకవేళ ద్రోహులుగా అయి రావణుని శరణు తీసుకున్నట్లయితే రాముడిని నిందింపజేస్తారు. తప్పకుండా ఈ రామ రాజ్యము మరియు రావణ రాజ్యము యొక్క ఆట తయారై ఉందని మీ బుద్ధిలో ఉంది. సత్యయుగము సతోప్రధానము, త్రేతా సతో, తర్వాత ద్వాపరము రజో, కలియుగంలో తమో, మీరు ఇప్పుడు సతోప్రధానంలోకి వెళ్తారు. బాబా వచ్చి సతోప్రధానంగా చేస్తారు. తర్వాత 16 కళల నుండి 14 కళలలోకి రావాలి. మళ్ళీ రావణుని సాంగత్యంలో కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు కలియుగంలో ఏ కళ మిగల్లేదు. అందరూ అంటారు, మేము పతితులము, భ్రష్టాచారులము. పతిత ప్రపంచం యొక్క వినాశనం జరగనున్నది, పావన ప్రపంచం స్థాపన అవుతూ ఉంది. అనంతమైన తండ్రి పిల్లలను తెలుసుకోగలరు. ఇప్పుడు మీరు భగవంతుని ఇంట్లో కూర్చున్నారు. బ్రాహ్మణ, బ్రాహ్మణీలైన మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు, తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా… ఇది చక్రము. చక్రవర్తులు బ్రాహ్మణులైన మీరు. రాజయోగం నేర్చుకొని జ్ఞాన ధారణ చేయడంతో చక్రవర్తీ రాజా-రాణులుగా అవుతారు. కనుక పురుషార్థం చేసి స్వర్గంలో ఉన్నత పదవిని పొందాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ అంతిమ జన్మలో రాముని మతముపై నడవాలి. ఎప్పుడూ కూడా రాముని శరణును వదిలి రావణుని శరణులోకి వెళ్ళి తండ్రిని నిందింపజేయకూడదు.

2. శిక్షల నుండి విడుదలయ్యేందుకు యోగిగా అయి వికర్మలను వినాశనం చేసుకోవాలి. పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళేందుకు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి.

వరదానము:-

సంగమయుగంలో పిల్లలైన మీకు వారసత్వం కూడా ప్రాప్తించింది, చదువు ఆధారంగా సంపాదన యొక్క ఆధారం కూడా ఉంది మరియు వరదానాలు కూడా లభించి ఉన్నాయి. మూడు సంబంధాలతోనూ ఈ అధికారాన్ని స్మృతిలో ఇమర్జ్ చేసుకుని ప్రతి అడుగు వేయండి. ఇప్పుడు సమయం, ప్రకృతి మరియు మాయ వీడ్కోలు కోసం వేచి ఉన్నాయి, కేవలం మాస్టర్ రచయిత పిల్లలైన మీరు, సంపూర్ణత యొక్క అభినందనలను జరుపుకోండి, అప్పుడు అవి వీడ్కోలు తీసుకుంటాయి. జ్ఞానం యొక్క దర్పణంలో చూసుకోండి, ఒకవేళ ఈ ఘడియనే వినాశనం జరిగినట్లయితే నేను ఏమవుతాను?

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top