19 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

18 July 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - జీవిస్తూనే ఈ శరీరం నుండి వేరవ్వండి, అశరీరులుగా అయి తండ్రిని స్మృతి చేయండి, దీనినే డెడ్ సైలెన్స్ అని అంటారు”

ప్రశ్న: -

పిల్లలైన మీరిప్పుడు మీ పునాదిని దృఢంగా చేసుకుంటున్నారు, దృఢత్వమనేది దేని ఆధారంగా వస్తుంది?

జవాబు:-

పవిత్రత ఆధారంగా. ఎంతెంతగా ఆత్మ పవిత్రంగా అనగా సత్యమైన బంగారంగా అవుతూ ఉంటుందో, అంతగా దృఢత్వం వస్తుంది. బాబా స్వరాజ్యం యొక్క పునాదిని ఎంత దృఢంగా వేస్తారంటే, అర్ధకల్పం ఆ పునాదిని ఎవ్వరూ కదిలించలేరు. మీ రాజ్యాన్ని ఎవరూ లాక్కోలేరు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓం నమః శివాయ…..

ఓంశాంతి. బాబా అంటారు – నన్ను స్మృతి చేయండి అనగా అశరీరులుగా అవ్వండి అనగా డెడ్ సైలెన్స్. మనుష్యులు మరణించినప్పుడు డెడ్ సైలెన్స్ ఏర్పడుతుంది. వీరి శరీరం శాంతిగా అయిపోయిందని అంటారు. శరీరం మరియు ఆత్మ వేరైపోయాయి, అంతా సమాప్తమైపోయినట్లు. ఇక్కడ కూడా పిల్లలైన మీరు కూర్చున్నప్పుడు, దీనిని డెడ్ సైలెన్స్ అని అంటారు. జీవిస్తూనే అశరీరులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. ఇది సత్యమైన శాంతి అని మీకు తెలుసు. మనుష్యులకు శాంతి గురించి తెలియదు. డెడ్ సైలెన్స్ యొక్క అర్థం అసలు తెలియదు. డెడ్ సైలెన్స్ అని ఎందుకంటారు? వ్యక్తి డెడ్ అయ్యి (మరణించి) సైలెన్స్ (శాంతి) అయిపోయారని స్మృతినిప్పిస్తారు. మీరు కూడా మరణించండి, మీరు కూడా శాంతిగా అయిపోండి. గాంధీ సమాధి వద్దకు పెద్ద-పెద్ద వ్యక్తులు వెళ్తారు. అక్కడకు వెళ్ళి, డెడ్ సైలెన్స్ లో అనగా శాంతిగా కూర్చోండి అని అంటారు. నేను ఆత్మను, శాంత స్వరూపాన్ని అని – మీకు కూడా తెలుసు. ఇది ప్రపంచంలోని వారికి తెలియదు. మనం మన స్వరూపంలో స్థితులవుతాము. మన స్వధర్మము శాంతి. మన ఆత్మ శాంతి స్వరూపము. వారికి ఈ విషయం తెలియదు, అందుకే శాంతి కావాలని అడుగుతారు. శాంతి కావాలని ఆత్మ అంటుంది. ఆత్మ తన స్వధర్మాన్ని మర్చిపోయింది. వాస్తవానికి ఆత్మ ధర్మమే శాంతి. అటువంటప్పుడు, అశాంతి ఉందని ఆత్మ ఎందుకు అంటుంది? అశరీరులుగా అయి కూర్చుండిపోండి. వారు హఠంతో ప్రాణాయామం చేస్తారు, దానితో మరణించినట్లుగా అయిపోతారు. దానిని కృత్రిమమైన శాంతి అని అంటారు. మా స్వధర్మం శాంతి అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మలైన మీరు స్వరాజ్యాన్ని తీసుకుంటున్నారు. ఆత్మయే అన్నీ అవుతుంది. ఆత్మయే బ్యారిస్టరుగా అవుతుంది. నాకు రాజ్యం కావాలని, ఆత్మయే అంటుంది. ఇంతకుముందు కూడా తండ్రి నుండి రాజ్యం తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ తీసుకునేందుకు వచ్చారు. మనుష్యులు దేహాభిమానంలో ఉన్నారు కనుక దుఃఖంలో ఉన్నారు.

నేను ఆత్మను, పరమపిత పరమాత్మ నుండి స్వరాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చానని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలైన మీకు రాజ్యం కావాలి. ఈ సమయంలో ఆత్మ అనంతమైన తండ్రిని స్వరాజ్యం అడుగుతుంది. శ్రీకృష్ణునికి స్వరాజ్యముండేది, అది తర్వాత మాయమైపోయింది. ఇప్పుడు తండ్రి వచ్చి ఆత్మలైన మీకు రాజ్యాన్ని ఇస్తారు. దీనిని రాజయోగమని అంటారు. పరమపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పిస్తారు. మనుష్యులు దేహాభిమానులుగా ఉన్న కారణంగా, నేను ఫలానా అని అంటారు. ‘నేను’ అంటే దేహమని అనుకుంటారు. వాస్తవానికి నేను, నేను అని ఆత్మ అంటుంది. నేను ఈ వస్తువును తీస్తున్నాను అని ఆత్మ అంటుంది. నేను తీస్తున్నాను అని స్త్రీ అంటుంది (స్త్రీ లింగంలో). వాస్తవానికి ఆత్మ మేల్. ఆత్మనైన నేను తండ్రి సంతానాన్ని. బాబా, నేను మీ నుండి స్వరాజ్యాన్ని తీసుకుంటున్నానని ఆత్మ అంటుంది. పరమాత్మ ఆత్మకు స్వరాజ్యాన్ని ఇస్తారు. భక్తికి మరియు జ్ఞానానికి ఎంత తేడా ఉందో చూడండి. శివుని మందిరం కూడా ఉంటుంది. గంటలను కూడా అన్నింటికన్నా ఎక్కువగా శివుని మందిరాలలోనే మ్రోగిస్తారు. వారిని మేల్కొల్పుతారు. వాస్తవానికి అందరినీ మేల్కొల్పుతారు. ఉదయాన్నే వాయిద్యాలు మోగిస్తారు. ఇక్కడ తండ్రి పిల్లలను మేల్కొల్పి దేవతలుగా చేస్తారు. ఇక్కడ గంటలు మొదలైనవి మోగించే విషయమేమీ లేదు. తండ్రి అంటారు – మీకు స్వరాజ్యం కావాలంటే, ముందు పవిత్రంగా అవ్వండి. లక్ష్యం-ఉద్దేశ్యం బుద్ధిలో ఉంటుంది. నేను మెట్రిక్ పాస్ అయిన తర్వాత ఇది చేస్తానని విద్యార్థి అంటాడు. మాకు శాంతి లభించాలని సన్యాసులు కోరుకుంటారు. ఒక కథ కూడా ఉంది కదా – రాణి మెడలోనే హారం ఉంది కానీ బయట వెతికారు అని. అలాగే, మనుష్యులు కూడా శాంతిని బయట వెతుకుతున్నారు. కానీ ఆత్మ అయితే స్వయంగా శాంత స్వరూపము. ఆత్మ తన స్వధర్మాన్ని మర్చిపోయి, స్వయాన్ని శరీరంగా భావిస్తూ కూర్చుంది. మీరు ఆత్మలు, ఆత్మలైన మీరు 84 జన్మలు అనుభవించారని తండ్రి మళ్ళీ స్మృతినిప్పిస్తున్నారు. ఈ విషయాలను ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. మీకు మీ జన్మల గురించి తెలియదని, నేను తెలియజేస్తానని తండ్రి అంటారు. మీరు బ్రహ్మాకుమార-కుమారీలు. పవిత్రత లేకుండా జ్ఞాన ధారణ జరగదని తండ్రి అర్థం చేయించారు. పులి-పాల కోసం బంగారు పాత్ర కావాలని అంటారు కదా. అలా ఇక్కడ కూడా బంగారు పాత్ర కావాలి. ఆత్మ తండ్రిని స్మృతి చేయడంతో బంగారంగా అయిపోతుంది. తండ్రి కూడా సత్యమైన బంగారము. ఆత్మ తండ్రిని స్మృతి చేయడంతో, బుద్ధిలోకి జ్ఞానం కూడా వచ్చేస్తుంది. మీరు సత్యమైన బంగారంగా, పవిత్రంగా ఉండేవారు. ఈ జ్ఞానం యొక్క ప్రభావం ఎవరిపైనా పడదు. నేను ఆత్మలైన మీకు స్వరాజ్యాన్ని ఇస్తాను అని తండ్రి అంటారు. ఎప్పుడైతే పాత సృష్టి యొక్క అంతము మరియు కొత్త సృష్టి యొక్క ఆది జరుగుతుందో, అప్పుడు ఈ స్వరాజ్యం లభిస్తుంది. మనుష్యులకు హద్దు రాజ్యము ఉంటుంది. అనంతమైన రాజ్యం మనుష్యులకెప్పుడూ లభించదు. వారు విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. మీరు తండ్రి ద్వారా అలా అవుతారు. భగవంతుడైన తండ్రికి మాత్రమే మీ 84 జన్మల గురించి తెలుసు. దేవతలు తమ జన్మల గురించి తెలుసుకోలేరు. ఒకవేళ తెలుసుకున్నట్లయితే, మేము మెట్లు దిగుతూ వెళ్తామా అని దుఃఖితులు అవుతారు. రాజ్యం యొక్క సుఖమే మాయమైపోతుంది. ఇక్కడ మీకు తెలుసు. నేను ఆత్మను అని మీకు తెలుసు. ఇందులో సంశయం యొక్క విషయమేమీ లేదు. ఒకరి నుండి ఒకరు వింటూ ఉంటారు, వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ దైవీ ధర్మం యొక్క వృక్షం స్థాపన అవుతుంది. ఎవరైనా వస్తే, మా బ్రాహ్మణ కులం వారు వచ్చారు, వీరి భక్తి పూర్తయ్యింది, మళ్ళీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారని మీరు అర్థం చేసుకోవచ్చు. జ్ఞానం పూర్తయిన తర్వాత మళ్ళీ భక్తి ప్రారంభమవుతుంది. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇల్లు కూడా కొత్తదిగా ఉంటుంది, తర్వాత పాతదవుతుంది కదా. పునాది కచ్చాగా ఉన్న ఇంటికి, తప్పకుండా ఆయువు తక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఇళ్ళను చాలా పక్కాగా నిర్మిస్తున్నారు. భూకంపాలు మొదలైనవి సంభవించినా కూడా, ఇల్లు కూలిపోకుండా, నష్టం జరగకుండా చాలా దృఢంగా నిర్మిస్తారు. పునాదిని చాలా పక్కాగా వేస్తారు. ఇప్పుడు స్వరాజ్యానికి పునాది పడుతూ ఉంది. ఆత్మకు 21 జన్మల కోసం రాజ్యం లభిస్తుంది. ఇక్కడి రాజ్యాలు అసలేమీ కావు. ఈ రోజు రాజ్యముంటుంది, రేపు ఎవరైనా ఆక్రమిస్తే సమాప్తమైపోతుంది. దేనికీ పునాది అనేదే లేదు. మనుష్యులకు కూడా పునాది లేదు, ఈ రోజు ఉంటారు, రేపు మరణిస్తారు. ఇప్పుడు బాబా మీ పునాదిని పక్కాగా వేస్తున్నారు, దీనితో మీరు 21 జన్మల రాజ్య భాగ్యాన్ని పొందుతారు. మీ రాజ్యం యొక్క పునాది పక్కాగా పడుతుంది. ఏ ధరణి యొక్క తుఫాన్లు మిమ్మల్ని కదిలించలేవు. గీతలో కూడా చెప్తారు – బాబా మాకు స్వరాజ్యాన్ని ఇస్తారు, దానిని ఎవరూ తీసుకోలేరు, కింద పడవేయనూ లేరు. ఎటువంటి రాజ్యాధికారాన్ని ఇస్తారంటే, అక్కడ కొద్దిగా కూడా దుఃఖమనే మాట ఉండదు. ఆత్మకు ఎంత సంతోషముండాలి. నిశ్చయమైతే ఉంది కదా. నిశ్చయం లేకపోతే స్వర్గంలోకి వెళ్ళేందుకు యోగ్యులు కారు. ఎంతమంది బ్రహ్మాకుమార-కుమారీలు వృద్ధి చెందుతూ ఉంటారు.

జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు మనల్ని చదివించి, రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీకు తెలుసు. వారేమో కృష్ణుడు నేర్పించారని అంటారు. శివబాబా మనిషి తనువులోకి వచ్చి నేర్పించారని వారెలా అర్థం చేసుకుంటారు. భారత్ యే పవిత్రంగా ఉండేది. ఇప్పుడు అపవిత్రంగా, పతితంగా ఉంది. దేవతల ముందుకు వెళ్ళి, వారి మహిమను పాడుతారు. మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు అని శివుని ముందుకు వెళ్ళి ఎప్పుడూ ఇలా పాడరు. శివుని మహిమ వేరు. వారు జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, సర్వులకు సద్గతినిచ్చేవారు, సర్వుల జోలిని నింపేవారు, భోళానాథుడు. ఇటువంటి తండ్రిని అందరూ మర్చిపోయారు. మీరు వచ్చి దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని పరమపిత పరమాత్మను పిలుస్తారు. దుఃఖహర్త-సుఖకర్త అయితే ఒక్కరే. వారి మతమే శ్రేష్ఠమైనది. ఇది శ్రీ శ్రీ అయిన భగవంతుని మతం, దీనితో పిల్లలైన మీరు కూడా శ్రేష్ఠంగా అవుతారు. ఇది భ్రష్టాచార ప్రపంచమని గవర్నమెంట్ కూడా అంటుంది. ఇప్పుడు శ్రేష్ఠంగా ఎవరు తయారుచేస్తారు అనేది ఏమీ తెలియదు. సాధువులు తయారుచేస్తారని భావిస్తారు కానీ వారు శ్రేష్ఠంగా తయారుచేయలేరు. ఇది తండ్రి పని మాత్రమే. ఇంతకుముందు, ఒక్క రాజు ఆజ్ఞానుసారంగా నడుచుకునేవారు. మీకు సత్యయుగంలో మంత్రులు మొదలైనవారెవరూ ఉండరు. చక్రవర్తిలో కూడా శక్తి ఉంటుంది. మంత్రి పేరే ఉండదు. మేము విశ్వానికి యజమానులుగా అయి రాజ్యం చేసామని మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు ఎలాగైతే రాజ్యం చేసారో, అలాగే వెళ్ళి చేయాలి. తప్పకుండా సత్యయుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. ప్రతి ఒక్కరికి తమ-తమ రాజధాని లభిస్తుంది. కృష్ణుడికి తన రాజధాని ఉంటుంది. వేరే రాజులు కూడా ఉంటారు కదా. తక్కువలో తక్కువ 8 మంది ఉంటారు కదా, తర్వాత 8 మంది ఉంటారా లేక 108 మంది ఉంటారా అనేది మున్ముందు తెలుస్తుంది. ఏ జ్ఞానమైతే అంతిమంలో ఇవ్వాలో, దానిని ఇప్పుడే ఇస్తారని కాదు. ఎవరైతే జీవించి ఉంటారో, వారికి తండ్రి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. ఇవ్వాల్సిందే. ఇది డ్రామాలో నిశ్చయించబడి ఉంది. పరమాత్మ పాత్ర ఇప్పుడే ఉంది. ఈ జ్ఞానాన్నిచ్చే పాత్ర ఇప్పుడే నిశ్చయించబడి ఉంది. మున్ముందు మీరు చాలా అర్థం చేసుకుంటారని తండ్రి అంటారు. రోజురోజుకు అర్థం చేయిస్తూ ఉంటారు. అక్కడ మనం రాజ్యం ఎలా చేస్తాము, స్వయంవరం ఎలా జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. మీరు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు, వైకుంఠానికి వెళ్ళి అక్కడ బంగారు మహళ్ళు ఎలా ఉంటాయి అనేది చూస్తారు కూడా. అక్కడ బంగారమే బంగారముంటుంది. స్వయాన్ని పారసపురిలో చూసుకుంటారు. బంగారు ఇటుకల ఇల్లు తయారవ్వడాన్ని చూస్తారు. కొన్ని ఇటుకలను తీసుకువెళ్దామని అనుకుంటారు. తర్వాత ధ్యానం నుండి తిరిగి వచ్చినప్పుడు, స్వయాన్ని ఇక్కడ ఉన్నట్లుగా చూసుకుంటారు. మీరా కూడా ధ్యానంలో కృష్ణునితో రాస్ చేస్తున్నట్లుగా స్వయాన్ని చూసేవారు. మీరు సూక్ష్మవతనానికి వెళ్తారు. అక్కడ ఎముకలు, మాంసం ఉండవు, ఫరిశ్తాలుగా అవుతారు. బ్రహ్మా సూక్ష్మ శరీరం కూడా కనిపిస్తుంది. వీరే ఫరిశ్తాగా అవుతారు. మీరు తోటలు మొదలైనవాటిని చూస్తారు. తండ్రి వీటిని సాక్షాత్కారం చేయిస్తారు. బాబా మాకు శూబీ రసాన్ని తాగించారని మీరంటారు. ఇప్పుడు సూక్ష్మ వతనంలోనైతే తాగించలేరు. పుష్పాలు, ఫలాలు వైకుంఠంలో చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. సూక్ష్మవతనంలో తోట మొదలైనవి ఉండవు. తోటలోకి వెళ్ళాను, అక్కడ రాకుమారుడు ఉన్నాడని మీరు చెప్తారు. అది వైకుంఠం అయినట్లు కదా. వైకుంఠంలోని వైభవాలు ఇక్కడ లభించవు. అక్కడ ఫస్ట్ క్లాస్ వైభవాలుంటాయి. నేను మిమ్మల్ని వైకుంఠానికి యజమానులుగా చేస్తానని తండ్రి అంటారు. ఇక్కడ దుఃఖమే దుఃఖముంది. ఓ భగవంతుడా, దుఃఖం నుండి విడిపించండి అని అడిగే మనుష్యులెవరూ అక్కడ ఉండరు. దుఃఖంలోనే స్మృతి చేస్తారు. కృష్ణుని పూజారులు కృష్ణ అని అనమంటారు. హనుమంతుని పూజారులు హనుమంతునికి జై అని అంటారు….. నిరంతరం తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని ఇక్కడ తండ్రి అంటారు. అంతిమ సమయంలో ఇంకెవ్వరి స్మృతి రాని విధంగా స్మృతి చేయండి. కాశీలో కత్తుల బావిలోకి దూకేవారు, అందులోకి దూకినప్పుడు, వారు చేసిన పాపాలకు జన్మ-జన్మల శిక్షలు అనుభవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. చాలా పాపాలు చేసారు. దీనినే పాపాత్ముల ప్రపంచమని అంటారు. ఆత్మ పాపిగా ఉంది. ఓ పరమపిత పరమాత్మ, పరంధామంలో నివసించే ఓ శివబాబా, అని ఆత్మయే తండ్రిని పిలుస్తుంది. వారి అసలు పేరు ఒక్కటే. వారు ఆత్మలకు తండ్రి. రుద్రుడు అనే పదంతోపాటు సాలిగ్రామాలనే పదం శోభించదు. శివుడు మరియు సాలిగ్రామాలు – ఈ పదాలు శోభిస్తాయి. మట్టితో శివలింగాన్ని తయారుచేసినప్పుడు సాలిగ్రామాలను కూడా తయారుచేస్తారు. పతితపావనుడైతే వారే కదా. ఇక్కడ యజ్ఞాలను కూడా రచిస్తారు. భారత్ అన్నింటికంటే ఉన్నతమైనది. కానీ దేవతా ధర్మాన్ని మర్చిపోయారు. మీది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము. అదైతే కొనసాగాలి. హిందూ అనే ధర్మమేదీ లేదు. దేవతా ధర్మంవారే సతో, రజో, తమోలలోకి వస్తారు. తమోలోకి వచ్చినప్పుడు తమను తాము దేవతలుగా చెప్పుకోలేరు. వాస్తవానికి హిందూ ధర్మమనేది లేదు. మీరు దేవీ-దేవతలుగా అవ్వగలరు, వచ్చి తెలుసుకోండి అని అర్థం చేయించడం జరుగుతుంది. అప్పుడు వారు, తీరిక ఎక్కడ ఉంది అని అంటారు. తండ్రి అంటారు – సుఖ-శాంతుల వారసత్వాన్నిచ్చేందుకు నేను మిమ్మల్ని నావారిగా చేసుకుంటాను. కొన్ని పరివారాలు పరస్పరంలో కలిసి ఉంటారు, చాలా ప్రేమగా నడుచుకుంటారు. అందరి సంపాదన కలిపి జరుగుతుంది. ఎటువంటి హంగామాలు ఉండవు. కానీ దానిని స్వర్గమని అనరు కదా. సత్యయుగంలో ఒక్క ఇంట్లో కూడా అనారోగ్యం కలవారు, దుఃఖితులు ఉండరు. దాని పేరే స్వర్గము. అక్కడ అందరూ సుఖంగా ఉంటారు. మీరు తండ్రి నుండి సదా సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. మీకు జ్ఞానం లభించింది. బాబా, మీరు పతితపావనుడు, మమ్మల్ని కూడా పావనంగా చేయండి అని అంటారు. తండ్రితో పాటు పిల్లలైన మీరు కూడా ఈశ్వరీయ సేవాధారులు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వరాజ్యాన్ని తీసుకునేందుకు పవిత్రత యొక్క పునాదిని ఇప్పటి నుండే ధృఢంగా చేసుకోండి. ఎలాగైతే తండ్రి పతితపావనుడో, అలా తండ్రి సమానంగా పావనంగా అవ్వాలి.

2. తమ స్వధర్మమైన శాంతిలో స్థితులై ఉండాలి. ఎంత వీలైతే అంత దేహాభిమానాన్ని వదిలి, దేహీ-అభిమానులుగా ఉండాలి. డెడ్ సైలెన్స్ అనగా అశరీరులుగా ఉండే అభ్యాసం చేయాలి.

వరదానము:-

ఎలాగైతే తండ్రి లోన్ తీసుకుంటారో, బంధనంలోకి రారో, అదే విధంగా మరజీవా జన్మ కల పిల్లలైన మీరు శరీరం యొక్క, సంస్కారాల యొక్క, స్వభావము యొక్క బంధనాల నుండి ముక్తులుగా అవ్వండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎలా కావాలనుకుంటే అలా, మీ సంస్కారాలను తయారుచేసుకోండి. ఎలాగైతే తండ్రి నిర్బంధనులుగా ఉన్నారో, అలా నిర్బంధనులుగా అవ్వండి. మూలవతనపు స్థితిలో స్థితులై, తర్వాత కిందకు రండి. తమ అనాది-ఆది స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి. అవతరించిన ఆత్మగా భావిస్తూ కర్మ చేసినట్లయితే, ఇతరులు కూడా మిమ్మల్ని ఫాలో చేస్తారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top