19 February 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

February 18, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - సదా ఇదే నషాలో ఉండండి, జ్ఞానసాగరుడైన తండ్రి జ్ఞానాన్ని ఇచ్చి, మమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా, త్రికాలదర్శులుగా తయారుచేసారు, మేము బ్రహ్మావంశీ బ్రాహ్మణులము’’

ప్రశ్న: -

పిల్లలైన మీరు బ్రాహ్మణులుగా అవుతూనే పదమాపదమ భాగ్యశాలిగా అవుతారు – ఎలా?

జవాబు:-

బ్రాహ్మణులుగా అవ్వడము అనగా క్షణంలో జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకోవడము. తండ్రికి పిల్లలుగా అవుతూనే వారసత్వం యొక్క అధికారం లభిస్తుంది. కావున జీవన్ముక్తి మీ హక్కు. అందుకే మీరు పదమాపదమ భాగ్యశాలీ. ఇకపోతే, ఈ మృత్యులోకంలోనైతే ఎవ్వరూ సౌభాగ్యశాలిగా కూడా లేరు. అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి. పిల్లలైన మీరిప్పుడు కాలుడిపై విజయం పొందుతారు. మీకు త్రికాలదర్శీతనపు జ్ఞానం కూడా ఉంది. శివబాబా 21 జన్మల కోసం మీ జోలెను నింపుతున్నారు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. పిల్లలు అర్థం చేసుకున్నారు, మేము ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము అనగా మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము. ఇది ముళ్ళ అడవి అని, ఇప్పుడు మళ్ళీ పుష్పాల తోటలోకి వెళ్ళాలి అని పిల్లలకు తెలుసు. ఈ ఢిల్లీ కూడా ఒకప్పుడు పరిస్తాన్ గా ఉండేది. దేవతలుగా ఉన్నప్పుడు పిల్లలైన మీరు రాజ్యం చేసేవారు. అయితే, కొందరు రాజా-మహారాజా రూపంలో, కొందరు ప్రజా రూపంలో ఉండేవారు. తప్పకుండా, ఇప్పుడు సృష్టి శ్మశానవాటికగా అవ్వనున్నదని అయితే అందరికీ తెలుసు. దీనిపై మీరు పరిస్తాన్ ను తయారుచేస్తారు. ఈ మొత్తం ప్రపంచమంతా కొత్తదిగా అవుతుందని మీకు తెలుసు. యమునా నదీ తీరంలో రాధే-కృష్ణులు, లక్ష్మీ-నారాయణులు ఉండేవారు. అలాగని రాధే-కృష్ణులు రాజ్యం చేస్తారని కాదు. అలా కాదు, రాధే వేరే రాజధానికి చెందినవారు, కృష్ణుడు వేరే రాజధానికి చెందినవారు. ఆ తర్వాత ఇరువురికీ స్వయంవరం జరిగింది. స్వయంవరం తర్వాత మళ్ళీ వీరే లక్ష్మీ-నారాయణులుగా అవుతారు, అప్పుడు ఈ పరిస్తాన్ లో యమునా తీరంలో రాజ్యం చేస్తారు. ఈ సింహాసనం చాలా పాతది. ఆది సనాతన దేవీ-దేవతల సింహాసనం కొనసాగుతూ వచ్చింది. కానీ ఈ విషయాల గురించి కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీరే మీ పరిస్తాన్ ను తయారుచేసుకుంటున్నారు, రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు. ఎలా? యోగబలంతో. దేవీ-దేవతల రాజధాని యుద్ధంతో స్థాపనవ్వలేదు. మీరిక్కడకు రాజయోగ బలాన్ని నేర్చుకునేందుకు వచ్చారు, దీనిని 5000 సంవత్సరాల క్రితం కూడా నేర్చుకున్నారు. మీరంటారు, అవును బాబా, కల్పక్రితం కూడా ఇదే రోజున, ఇదే సమయంలో మేము బాబా నుండి చదవడం నేర్చుకున్నాము. ఇక్కడికి కేవలం పిల్లలే వస్తారు. పిల్లలతో తప్ప తండ్రి ఇంకెవ్వరితోనూ మాట్లాడలేరు. తండ్రి అంటారు, నేను పిల్లలకే నేర్పిస్తాను. మీకు ఎంత నషా ఉండాలి. జ్ఞానసాగరుడు తండ్రి, వారినే జ్ఞాన-జ్ఞానేశ్వరుడు అని అంటారు, దీని అర్థమేమిటింటే, ఈశ్వరుడు ఎవరైతే జ్ఞానసాగరుడో, వారు ఈ సమయంలో మీకు జ్ఞానాన్ని ఇస్తారు. ఏ జ్ఞానము? సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము. పిల్లలైన మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మీరు బ్రహ్మావంశీ. విష్ణు వంశీయులు ఎవరైతే రాజ్యం చేస్తారో, వారు స్వదర్శన చక్రధారులు లేక త్రికాలదర్శులు కారు. మీరు బ్రహ్మావంశీ, మీరే మళ్ళీ దేవతలుగా అవుతారు. మనమే సూర్య వంశీయులుగా ఉండేవారము, తర్వాత చంద్ర వంశంలోకి వెళ్ళాము, ఆ తర్వాత వైశ్య వంశీయులుగా, శూద్ర వంశీయులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ మనము బ్రాహ్మణ వంశీయులుగా అయ్యాము. మేము స్వదర్శన చక్రధారులము అని మీకు తప్పక తెలుసు. మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానం మనలో ఉంది. దీని ద్వారానే మళ్ళీ చక్రవర్తి రాజా-రాణులుగా అవుతారు. ఈ జ్ఞానం అన్ని ధర్మాల వారి కోసముంది. శివబాబా అందరికీ చెప్తారు – ఈ బ్రహ్మాకు కూడా చెప్తారు, వీరి ఆత్మ కూడా ఇప్పుడు వింటూ ఉంది. మీరిప్పుడు బ్రాహ్మణులు. మనుష్యమాత్రులు ప్రతి ఒక్కరూ శివబాబాకు కూడా పిల్లలు, అలాగే బ్రహ్మాబాబాకు కూడా పిల్లలు. బ్రహ్మా, గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్, దైహికమైనవారు మరియు శివబాబా, అందరికీ ఆత్మిక తండ్రి. శివబాబాను ప్రజాపిత అని అనరు. శివబాబా ఆత్మల తండ్రి. తండ్రి అంటారు, నేను భారతవాసులకు రాజ్య భాగ్యాన్ని ఇస్తాను, వజ్రం వలె సదా సుఖమయంగా తయారుచేస్తాను, 21 జన్మల కోసం వారసత్వాన్ని ఇస్తాను. మళ్ళీ ఎప్పుడైతే వారు పూజ్యుల నుండి పూజారులుగా అవుతారో, అప్పుడు నన్ను నిందించడం మొదలుపెడతారు. తండ్రి అంటారు – మీ తండ్రినైన నేను ఎంత ఉన్నతమైనవాడిని, నేనే భారత్ ను స్వర్గంగా, ప్యారడైజ్ గా తయారుచేస్తాను. మీరు మళ్ళీ సర్వవ్యాపి అని అంటూ నింద చేస్తారు. 5 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేది. ఇది నిన్నటి విషయము. మీరే రాజ్యం చేసేవారు, ప్రకాశం ఉండేది, నేడు అంధకారముంది. కానీ, ఇదే స్వర్గమని భావిస్తారు. కొత్త ప్రపంచంలో కొత్త భారత్, రామ రాజ్యంగా ఉండాలని భారతవాసులు పాడుతారు. కానీ మనుష్యులు దీనినే కొత్తదిగా భావిస్తున్నారు. ఇదైతే డ్రామా. ఈ సమయంలో మాయ యొక్క చివరి ఆర్భాటం ఉంది. ఇప్పుడు రావణ రాజ్యం ముర్దాబాద్ మరియు రామ రాజ్యం జిందాబాద్ అవ్వనున్నది. రామ రాజ్యము అని సీతా-రాముల రాజ్యాన్ని ఏమీ అనరు. సూర్యవంశీ రాజ్యాన్నే రామ రాజ్యమని అంటారు. మీరు సూర్యవంశీ రాజా-రాణులుగా అవ్వడానికి వచ్చారు. ఇది రాజయోగము. ఈ జ్ఞానాన్ని బ్రహ్మా లేక కృష్ణుడేమీ చదివించరు. ఇదైతే పరమపిత పరమాత్మనే చదివిస్తారు. పతితపావనుడు ఆ తండ్రి, మొత్తం విశ్వాన్ని స్వర్గంగా తయారుచేసేవారు, సుఖ-శాంతులు ఇచ్చేవారు. ఈ భారత్ మొదట సుఖధామంగా ఉండేది. రావడమైతే అందరూ శాంతిధామం నుండే వస్తారు. ఆత్మనైన నేను మొదట శాంతిధామంలో ఉండేవాడిని. ఆత్మనే పరమాత్మ కాదు. ఆత్మలైన మనం సూర్యవంశీయులుగా ఉండేవారము, తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశంలోకి వచ్చాము. ఇది చక్రము అనగా పిల్లి మొగ్గలాట. మొట్టమొదట పిలక స్థానంలో బ్రాహ్మణులు, ఆ తర్వాత క్షత్రియులు, అలా మొత్తం 84 జన్మలు అనుభవించాల్సి ఉంటుంది. పిల్లలూ, ఇందులో తికమకపడాల్సిన విషయమేమీ లేదు. సెకండులో జీవన్ముక్తి. తండ్రికి పిల్లలుగా అయ్యారు మరియు వారసత్వానికి యోగ్యులుగా అయిపోయారు. తల్లి గర్భం నుండి బయటకు వచ్చి రావడంతోనే వారసత్వాన్ని తీసుకుంటారు. ఇది కూడా సెకెండు యొక్క విషయము. జనకునికి సెకండులో జీవన్ముక్తి లభించింది కదా. మీరు కూడా ఈశ్వరునికి చెందినవారిగా అయ్యారు, కనుక జీవన్ముక్తి మీ హక్కు. మీరు అమరలోకానికి యజమానులుగా అవుతారు, ఇది మృత్యులోకము. మీ కన్నా సౌభాగ్యశాలురు ఇంకెవ్వరూ లేరు. ఇక్కడైతే అకాల మృత్యువులు జరుగుతాయి. ఇప్పుడు మీరు కాలుడిపై విజయం పొందుతారు. తండ్రి కాలుడికే కాలుడు, కనుక ఆ తండ్రి నుండి మీకు ఎంత వారసత్వం లభిస్తుంది. మీరు అన్ని ధర్మాల గురించి కూడా తెలుసుకోవాలి, అందుకే ఈ చిత్రాలను తయారుచేసారు. ఇది పాఠశాల. ఎవరు చదివిస్తారు? భగవానువాచ, కృష్ణుడు చదివించడు. జ్ఞానసాగరుడు కృష్ణుడు కాదు. వారు పరమపిత పరమాత్మ, వారే మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. మీరు జ్ఞాన గంగలు. దేవతలలోనైతే ఈ జ్ఞానం ఉండనే ఉండదు. బ్రాహ్మణులైన మీలోనే త్రికాలదర్శీతనపు ఈ జ్ఞానం ఉంది. మీరే ఈ సమయంలో ఈ జ్ఞానాన్ని నేర్చుకొని వారసత్వాన్ని పొందుతారు. రాజయోగాన్ని నేర్చుకొని స్వర్గానికి రాజు-రాణులుగా అవుతారు.

మేము బాబా ద్వారా కాలుడిపై విజయం పొందుతామని మీకు తెలుసు. ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళి, చిన్న బిడ్డగా అవుతామని అక్కడ మీకు సాక్షాత్కారం అవుతుంది. సర్పం యొక్క ఉదాహరణ… ఈ ఉదాహరణలన్నీ మీ కోసమే ఉన్నాయి. ఇదే భారత్ మొదట శివాలయంగా ఉండేది. చైతన్య దేవీ-దేవతల రాజ్యం ఉండేది, వారి మందిరాలు తయారుచేయబడి ఉన్నాయి. శివబాబా వచ్చి శివాలయాన్ని తయారుచేస్తారు, రావణుడు మళ్ళీ వేశ్యాలయాన్ని తయారుచేస్తాడు. రావణుడు అంటే ఎవరు అనేది పెద్ద-పెద్ద విద్వాంసులకు, పండితులకు కూడా తెలియదు. రావణ రాజ్యం అర్ధకల్పం నడుస్తుందని మీకు తెలుసు. ఢిల్లీలో మొదట భగవాన్-భగవతి అయిన లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేది. క్రైస్ట్ కు 3 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేది అని అంటారు కూడా. కానీ మళ్ళీ మర్చిపోయారు. ఎవరైనా మరణిస్తే, స్వర్గవాసులయ్యారని అంటారు. నోరు తీపి చేస్తారు. భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు పునర్జన్మలు కూడా స్వర్గంలోనే ఉండేవి. ఇప్పుడు భారత్ నరకంగా ఉంది, కనుక పునర్జన్మలు కూడా నరకంలోనే తీసుకుంటారు. తండ్రి అంటారు, పిల్లలూ, మీకు గుర్తుంది కదా – కల్ప-కల్పము నేను వచ్చి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను. ఇప్పుడు మీరు పతితం నుండి పావనంగా అవుతున్నారు. ఈ పని ఒక్క తండ్రిది మాత్రమే. ఉన్నతోన్నతమైన శివబాబా కూర్చుని ఈ బ్రహ్మా ద్వారా అన్ని వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారని పిల్లల బుద్ధిలో ఉంది. భక్తి మార్గంలోనైతే మనుష్యులు ఖర్చు చేస్తూ-చేస్తూ గవ్వల వలె అయిపోయారు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు వజ్ర-వైఢూర్యాల మహళ్ళను తయారుచేసి ఇచ్చాను. మళ్ళీ మీరు కిందకు దిగేదే ఉంది. కళలు తగ్గిపోయేదే ఉంది. ఆ సమయంలో ఎవ్వరూ పైకి ఎక్కలేరు ఎందుకంటే అది ఉన్నదే దిగే కళ యొక్క సమయము. ఈ సమయంలో మీరు అందరికన్నా ఉన్నతమైన ఈశ్వరీయ సంతానము మళ్ళీ దేవతలుగా, క్షత్రియులుగా… అవ్వాల్సిందే. ఎవరు ఎంతగా దాన-పుణ్యాలు చేసినా సరే, భక్తి మార్గంలో ఖర్చు చేస్తూ-చేస్తూ కళలు దిగాల్సిందే. బాబా కూడా పిల్లలను అడుగుతారు, నేను మిమ్మల్ని ఇంత షావుకార్లుగా చేసాను. మీరు ధనమంతటినీ ఏం చేసారు? పిల్లలంటారు, బాబా, మీ మందిరాలనే తయారుచేసాము. ఇప్పుడు, మళ్ళీ శివ్ భోళానాథ్ బాబా 21 జన్మల కోసం మా జోలిని నింపుతున్నారు. బాబా అంటారు, నేను మీ విధేయుడైన సేవకుడను… అతి విధేయుడైన తండ్రిని, అతి విధేయుడైన శిక్షకుడిని. పారలౌకిక తండ్రిని, పారలౌకిక టీచరును మరియు పరలోకంలో ఉండేటువంటి అతి విధేయుడైన సద్గురువును కూడా. మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను. ఇంకే గురువు మిమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్ళరు. ఇందులో భయపడాల్సిన విషయమేమీ లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది, ఈ నేత్రాలతో ఈ బాబాను చూస్తారు, శివబాబానైతే బుద్ధి యొక్క నేత్రం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. వారసత్వం శివబాబా నుండి లభిస్తుంది. ఈ బ్రహ్మాకు కూడా వారసత్వం శివబాబా నుండి లభిస్తూ ఉంది. ఉన్నతోన్నతమైనవారు శివబాబా, ఆ తర్వాత బ్రహ్మా, విష్ణు, శంకరులు, ఆ తర్వాత బ్రహ్మా-సరస్వతులు, ఆ తర్వాత లక్ష్మీ-నారాయణులు, అంతే. వారు అనేక చిత్రాలను ఎన్నో తయారుచేసారు. 6-8 భుజాల కలవారు ఎవ్వరూ లేరు. ఇదంతా భక్తి మార్గం యొక్క ఆట. సమయం వ్యర్థం అవుతుంది, శక్తి వ్యర్థం అవుతుంది… వాస్తవానికి, సర్వ శాస్త్రమయీ శిరోమణి గీత. అందులో కూడా తండ్రికి బదులుగా కొడుకు పేరును వేసి ఒకే ఒక్క పొరపాటును చేసారు. ఇది కూడా డ్రామా. సర్వుల సద్గతిదాత, పతిత-పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. ఆ తర్వాత, రెండవ తండ్రి ప్రజాపిత బ్రహ్మా, మూడవవారు లౌకిక తండ్రి. ప్రతి జన్మలో ఇద్దరు తండ్రులు లభిస్తారు. ఈ ఒక్క సమయంలోనే ముగ్గురు తండ్రులు లభిస్తారు. ఇందులో తికమకపడే విషయమేమీ లేదు. జ్ఞానం, భక్తి మరియు వైరాగ్యం అని అంటారు. ఇప్పుడు వైరాగ్యం కూడా రెండు రకాలు. ఒకటి హద్దు వైరాగ్యము, రెండవది అనంతమైన వైరాగ్యము. సన్యాసులైతే ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవులలోకి వెళ్ళిపోతారు. ఇక్కడైతే మీరు పాత ప్రపంచాన్నే బుద్ధితో వదిలేస్తారు. అది హఠయోగము, ఇది రాజయోగము. హఠయోగులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా మంచి-మంచి విషయాలు. పిల్లలైన మీరే ఈ సమయంలో ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. మొదటి నంబరులోనైతే దేహాభిమానం యొక్క పెద్ద ముల్లు ఉంది. దానిని తండ్రే విడిపిస్తారు, ఇంకెవ్వరికీ ఆ శక్తే లేదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరచి అనంతమైన వైరాగులుగా అవ్వాలి. దేహాభిమానం యొక్క భూతాన్ని తొలగించివేయాలి.

2. తండ్రి సమానంగా విధేయులుగా అయి సేవ చేయాలి. తమ సమానంగా తయారుచేయాలి. ఏ విషయంలోనూ తికమకపడకూడదు.

వరదానము:-

పరమాత్మ ప్రేమ ఎంతటి సుఖదాయకమైనది అంటే, అందులో ఒకవేళ మునిగిపోయినట్లయితే, ఈ దుఃఖపు ప్రపంచాన్ని మర్చిపోతారు. ఈ జీవితంలో కావాలనుకున్న సర్వ కామనలను పూర్తి చేయడము – ఇదే పరమాత్మ ప్రేమకు గుర్తు. తండ్రి కేవలం సుఖ-శాంతులను ఇవ్వడమే కాదు కానీ వాటి భాండాగారమునే తయారుచేస్తారు. ఎలాగైతే తండ్రి సుఖసాగరుడో, అంతేకానీ, నది, కొలను కాదో, అలా పిల్లలను కూడా సుఖపు భండారమునకు యజమానులుగా చేస్తారు, అందుకే యాచించే అవసరం లేదు, కేవలం లభించి ఉన్న ఖజానాలను విధి పూర్వకంగా సమయం ప్రతి సమయం కార్యంలో వినియోగించండి.

స్లోగన్:-

మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు

‘‘నిరాకార పరమాత్మ త సాకార బ్రహ్మా తనువులోకి ప్రవేశించే విచిత్రమైన యుక్తి’’

చూడండి, పరమాత్మ తమదైన ఈ యుక్తిని రచించారు అనగా తమ సాకార తనువును నిశ్చయం చేసుకున్నారు, ఆ ప్రకృతి యొక్క ఆధారాన్ని తీసుకొని వస్తారు. లేదంటే, సాకార మనుష్యాత్మలమైన మనము నిరాకారుని ఒడిలో ఎలా కూర్చోగలము, అందుకే పరమాత్మ అంటారు, సాకార రూపంలో వచ్చి మీరు నా ఒడి తీసుకోండి. ఇందులో ఏదో ఇచ్చే విషయమేమీ లేదు. కేవలం మిమ్మల్ని దుఃఖితులుగా, అశాంతిగా చేసిన 5 వికారాలను సన్యసించండి మరియు పరమాత్మనైన నన్ను నిరంతరం స్మృతి చేయండి. మనసా, వాచా, కర్మణా నా డైరెక్షన్లపై నడుచుకున్నట్లయితే, నేను మీ పాపాలను దగ్ధం చేస్తాను మరియు పరంధామానికి తీసుకువెళ్తాను. ఇది పరమాత్మ ఆత్మలైన మనతో చేసిన ప్రతిజ్ఞ. ఇప్పుడు వారి ఆజ్ఞను పాటించాలి. కేవలం మాట వరసకు తల్లి-తండ్రి అని అనడం కాదు కానీ సంపూర్ణంగా వారికి చెందినవారిగా అవ్వడంతో సంపూర్ణ ప్రాప్తి లభిస్తుంది, కొద్దిగా సంబంధం జోడిస్తే కొద్దిగా లభిస్తుంది. ఇప్పుడు తండ్రి వ్యాపారం ఏదైతే ఉందో, అదే పిల్లల వ్యాపారము. ఇక్కడ విడాకుల యొక్క విషయమేమీ లేదు. ఇక్కడైతే 21 తరాల వరకు ఆ ప్రాపర్టీని అనుభవించాలి. వీరి కన్నా గొప్ప అథారిటీ ఇంకెవ్వరూ లేరని ఇప్పుడు ఈ మాత్రం తెలుసుకోవాలి. అందుకే అంటాను, నేను ఎవరినో, ఎలా ఉన్నానో, ఆ రూపంతోనే నన్ను స్మృతి చేయండి. ఇప్పుడు తండ్రి తమ కర్తవ్యాన్ని పాటించారు మరియు పిల్లలు తమ కర్తవ్యాన్ని పాటించాలి. ఈ వికారీ ఐక్యతను అనగా వికారీ కులం యొక్క లోక మర్యాదలనైతే జన్మ-జన్మాంతరాలుగా పాటిస్తూ వచ్చారు. వాటితోనైతే ఇంకా ఎక్కువ కర్మ బంధనం తయారయ్యింది. ఇప్పుడైతే పారలౌకిక మర్యాదలలో అనగా పరమాత్మతో పాటు అలౌకిక కార్యంలో సహాయం చేయాలి. ఇప్పుడు మనకు ఉన్నతోన్నతమైన అథారిటీతో సంబంధం ఏర్పడింది. మనం ఆ సంపన్నుడి యొక్క సంతానము. వారు వచ్చి సాకారుని తనువు ద్వారా మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. కనుక, మనం గౌరవప్రదంగా ఎందుకు ఉత్తీర్ణం అవ్వకూడదు? వీరు సంపన్నులా కాదా అనేది ప్రతి ఒక్కరి పురుషార్థం ద్వారా తెలిసిపోతుంది. ఒకవేళ ఎవరైనా పరమాత్మ ఒడిని తీసుకొని, మేము వారి వారసులైన పిల్లలము, అని ఛాలెంజ్ చేసి, మళ్ళీ వెళ్ళి విడాకులిచ్చేస్తే అటువంటి పిల్లలను భస్మాసురులు అని అంటారు కదా. ఎక్కితే ఉన్నత పదవి, పడిపోతే భస్మాసురులుగా అవుతారు. ఇప్పుడు ఇది గుర్తుంచుకోండి, మన సంబంధం ఎవరితో ఉంది. ఈ సంబంధంలోకి రావడానికి స్వయంగా దేవతలు కూడా కోరుకుంటారు. అచ్ఛా – ఓం శాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top