19 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

18 April 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - తండ్రి భక్తులకు మరియు పిల్లలకు సంరక్షణ చేసేటటువంటి భక్త-వత్సలుడు, పతితం నుండి పావనంగా చేసి ఇంటికి తీసుకువెళ్ళే బాధ్యత తండ్రిది, పిల్లలది కాదు’’

ప్రశ్న: -

తండ్రి యొక్క కల్ప-కల్పపు కర్తవ్యం ఏమిటి? ఏ చింత తండ్రికి మాత్రమే ఉంటుంది?

జవాబు:-

తండ్రి యొక్క కర్తవ్యమేమిటంటే, పిల్లలకు రాజయోగాన్ని నేర్పించి పావనంగా చేయడము, అందరినీ దుఃఖం నుండి విడిపించడము. తండ్రికే చింత ఉంటుంది, నేను వెళ్ళి నా పిల్లలను సుఖమయంగా చేయాలి అని.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ముఖాన్ని చూసుకో ప్రాణీ… (ముఖడా దేఖ్లే ప్రాణీ…)

ఓంశాంతి. ఇది ఎవరు అడుగుతున్నారు? తండ్రి, ఎవరినైతే ఆల్మైటీ అథారిటీ అంటారో, వారు అడుగుతున్నారు. తండ్రి మహిమనైతే చేస్తారు మరియు లిబరేటర్ (ముక్తిదాత), గైడ్ (మార్గదర్శకుడు) అని కూడా అంటారు. వారు అందరి సద్గతిని చేసేవారు. వారు సర్వుల దుఃఖహర్త, సుఖకర్త. వారు పరంధామంలో నివసించేవారని భావిస్తారు. కానీ అజ్ఞానానికి వశమై, సర్వవ్యాపి అని అన్నారు. భక్తులందరూ పిల్లలు మరియు భగవంతుడు తండ్రి. ఇదైతే తప్పకుండా పిల్లలందరికీ అర్థం చేయించాలి, దుఃఖహర్త, సుఖకర్త మన తండ్రి అని. భక్త-వత్సలుడు అని వారి పేరును గాయనం చేయడం జరుగుతుంది. ఈ పేరును ఏ గురువులకు, సాధువులకు ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలు లేక భక్తులు అయితే చాలామంది ఉన్నారు, వారిపై దయ చూపించేవారు ఒక్క తండ్రి మాత్రమే. మొత్తం ప్రపంచానికి ఒక్క తండ్రే వచ్చి సుఖ-శాంతులను ఇస్తారు. లక్ష్మీ-నారాయణుల రాజ్యాన్ని వైకుంఠము లేక స్వర్గము అని అంటారని అర్థం చేయిస్తారు కూడా. ఈ సమయంలో కలియుగం ఉంది కనుక బాబాకు ఎంత చింత ఉంటుంది. హద్దు తండ్రికి కూడా చింత ఉంటుంది. వీరు అనంతమైన తండ్రి. భక్తులందరి కళ్యాణకారి ఒక్క తండ్రి మాత్రమే అని తెలియాలి, వారికే చింత ఉంటుంది, వెళ్ళి పిల్లలను సుఖమయంగా చేయాలి అని. ఎప్పుడైతే మనుష్యులకు ఆపదలు వస్తాయో, అప్పుడు అందరూ భగవంతుడిని స్మృతి చేస్తారు, ఓ పరమపిత పరమాత్మ రక్షించండి, అని పిలుస్తారు. ఇప్పుడు పిల్లలైన మీ సమ్ముఖంలో తండ్రి కూర్చున్నారు. తండ్రి అంటారు, నాకు ఆలోచన ఉండదా ఏమిటి – ఇప్పుడు అందరూ పతితంగా అయిపోయారు, నేను వెళ్ళి అందరికీ రాజయోగాన్ని నేర్పించి, పావనంగా తయారుచేయాలి అని. ఇదైతే నా కల్ప-కల్పపు కర్తవ్యము. ఈ సమయంలో పిలవడమైతే అందరూ పిలుస్తారు కానీ ఆ ప్రేమ లేదు. ఇప్పుడు మీరు మొత్తం డ్రామాను అర్థం చేసుకున్నారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని పావనంగా చేయడానికి వచ్చాను. నా ఈ మాటను వినండి కదా. సన్యాసులు కూడా ఈ వికారాలను విడిచిపెడతారు. వారిది హద్దు సన్యాసము. మనది మొత్తం పాత ప్రపంచం యొక్క అనంతమైన సన్యాసము. తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ప్రజాపిత బ్రహ్మాకుమారులు మరియు కుమారీలు ప్రాక్టికల్ గా ఉన్నారు కదా. బోర్డు కూడా పెట్టి ఉంది. ఎంతమంది పిల్లలున్నారు, అందరూ మమ్మా-బాబా అని అంటారు. గాంధీని కూడా జాతి పిత అని అంటారు. వారు కూడా భారత్ కు ఫాదర్ గా ఉండేవారు, వారిని మొత్తం ప్రపంచానికి తండ్రి అని అయితే అనరు కదా. మొత్తం ప్రపంచానికి తండ్రి అయితే ఒక్కరే. ఆ తండ్రి అంటారు, కామం మహాశత్రువు, మీరు దీనిపై విజయం పొందండి. ఇందులో ఏ సుఖమూ లేదు. పవిత్ర దేవీ-దేవతల ఎదురుగా వెళ్ళి తల వంచుతారు. ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి కేవలం అంటారు, పిల్లలూ, ఈ అంతిమ జన్మ పవిత్రంగా అయినట్లయితే 21 జన్మల కోసం మీ శరీరాన్ని కల్పతరువుగా చేస్తాను. ఇది చాలా సహజము. కానీ మాయ ఎటువంటిదంటే ఓడించేస్తుంది. 4-6 మాసాలు పవిత్రంగా ఉంటారు, అయినా కూడా నడుము విరిగిపోతుంది. మీకు తెలుసు, బాబా కల్ప పూర్వం వలె అర్థం చేయిస్తున్నారు. కౌరవులు, పాండవులు సోదరులు అని చూపిస్తారు. వేరే గ్రామం లేక దేశానికి చెందినవారు కాదు. పతిత-పావనుడైన తండ్రి, అవినాశీ ఖండమైన భారత్ లోనే వస్తారు. ఇది వారి జన్మ స్థలము. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. నిరాకార శివ పరమాత్మ జన్మ తీసుకుంటారు, పేరు శివ. శరీరమైతే లేదు. మిగిలిన వారందరికీ, బ్రహ్మా-విష్ణు-శంకరులకు కూడా చిత్రాలున్నాయి. ఉన్నతాతి ఉన్నతమైనవారు ఒక్క భగవంతుడు, వారు వీరిలో ప్రవేశిస్తారు. కానీ ఎలా వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ఇది ఎవ్వరికీ తెలియదు. భారత్ లోనే శివజయంతిని జరుపుకుంటారు. మందిరాలలో కూడా అన్నింటికన్నా పెద్దది ఇక్కడే ఉంది, అందులో కూడా లింగాన్ని పెట్టారు. శివుడు తప్పకుండా వస్తారని అర్థం చేయించాలి. శరీరం లేకుండా అయితే అసలేమీ జరగదు. సుఖ-దుఃఖాలను ఆత్మ శరీరంతోనే అనుభవిస్తుంది. ఆత్మ వేరైపోతే, అప్పుడేమీ చేయలేదు. శివబాబా కూడా ఏదో చేసి ఉంటారు. వారు పతిత-పావనుడు, కానీ ఎలా వచ్చి అందరినీ పావనంగా చేస్తారు, ఇది ఎవరికీ తెలియదు. ఇప్పుడు బాబా సాధారణ తనువులో ప్రవేశించి పాత్రను అభినయిస్తారు. బ్రహ్మా ద్వారా స్థాపన అని అంటూ ఉంటారు కూడా. మరి పతిత ప్రపంచంలో బ్రహ్మా ఎక్కడ నుండి వచ్చారు? పరమాత్మ స్వయంగా అంటారు, నాకు శరీరమైతే లేదు. నేను వీరిలో ప్రవేశించాను. నా పేరు శివ. మీరు వచ్చి నాకు చెందినవారిగా అయ్యారు, అప్పుడు మీ పేరు కూడా మారుతుంది. సన్యాసుల వద్దకు వెళ్ళి సన్యసించినప్పుడు, వారి పేరు కూడా మారుతుంది. ఇప్పుడు తండ్రి సమ్ముఖంగా వచ్చారు. ఈశ్వరుడు, ఎవరినైతే మీరు అర్ధకల్పము స్మృతి చేసారో, మళ్ళీ నడుస్తూ-నడుస్తూ మీరు వారిని కూడా మర్చిపోతారు. సన్యాసులైతే సుఖాన్ని నమ్మరు, వారు సుఖాన్ని కాకి రెట్టతో సమానమని భావిస్తారు. స్వర్గం పేరైతే ప్రసిద్ధమైనది. ఎవరైనా మరణించినప్పుడు కూడా, స్వర్గానికి వెళ్ళారని అంటారు. కొత్త ప్రపంచాన్ని సుఖధామమని, పాత ప్రపంచాన్ని దుఃఖధామమని అంటారు. తండ్రి ఇంతగా అర్థం చేయిస్తారు కనుక వారి మతంపై పూర్తిగా ఎందుకు నడుచుకోకూడదు. తండ్రి అందరికీ ముక్తి-జీవన్ముక్తులను ఇవ్వడానికి వచ్చారు. బాబా పాత్ర ఉంది, పిల్లలకు వారసత్వాన్ని ఇవ్వడము. నిరాకార రచయిత అయిన తండ్రి నుండి వారసత్వం ఎలా లభిస్తుంది, ఇది కూడా మీకు తెలుసు. నా పరిచయం మీకు ఎక్కడ నుండి లభించింది? భగవానువాచ – నేను ఏమైనా కృష్ణుడినా! నేను బ్రహ్మానా! కాదు. నేనైతే ఆత్మలందరి యొక్క నిరాకార తండ్రిని. ఇంకెవ్వరూ ఇలా అనలేరు. స్వయాన్ని శివోహమ్ అని చెప్పుకుంటారు కానీ నేను ఆత్మలందరికీ తండ్రిని అని అనలేరు. వారు స్వయాన్ని గురువులని చెప్పుకుంటారు. అక్కడ తండ్రి అయితే లభించలేదు, టీచరు లభించలేదు, వెంటనే గురువు లభించారు. ఇక్కడ నియమానుసారమైన జ్ఞానం ఉంది. ఇక్కడ మీ తండ్రి, టీచరు, గురువు, నేనొక్కడినే. మొత్తం పతిత ప్రపంచాన్ని ఎలా పావనంగా చేస్తూ ఉండవచ్చు అని ఆశ్చర్యపోవాలి. 21 జన్మల వారసత్వాన్ని ఇచ్చేటటువంటి తండ్రి మతంపై అడుగడుగునా నడుచుకోండి. మాయ ప్రబలమైనది. బాబా-బాబా అని అంటారు, చదువుకుంటారు కూడా, అయినా, అహో, మాయకు వశమై తండ్రిని వదిలి వెళ్ళిపోతారు, అందుకే అంటారు, జాగ్రత్తగా ఉండండి అని. తండ్రిని పిల్లలు వదలి వెళ్ళిపోయినట్లయితే అంటారు కదా, నేను నీకు ఇంత పాలన ఇచ్చాను, అయినా కూడా నన్ను విడిచిపెట్టావు. ఇక్కడైతే ఇతరుల సేవ చేయాలి, ఇతరులను తమ సమానంగా చేసే సేవ చేయాలి. ఈ సహాయం నాకు చేయరా? వదిలి వెళ్ళిపోయి పేరును అప్రతిష్టపాలు చేస్తారు. ఎంత కష్టమవుతుంది. అబలలపై చాలా అత్యాచారాలు జరుగుతాయి. జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు కలుగుతాయి. మాయ ఎన్ని తుఫానులు తీసుకువస్తుంది. భక్తి మార్గంలో ఇది జరగదు.

తండ్రి అంటారు – తెలివైన పిల్లలూ, మీరు నా మతంపై నడుచుకోండి. తమ హృదయం రూపీ దర్పణంలో చూసుకోవాలి, నేను ఏ వికర్మను అయితే చేయలేదు కదా. తండ్రికి చెందినవారిగా అయ్యి కొద్దిగా వికర్మ చేసినా, వంద రెట్లు శిక్ష పడుతుంది. చాలా నష్టం కలిగిస్తారు. మేము మా ఖాతాను జమ చేసుకుంటున్నామా లేక చేసుకోవడం లేదా అని చూసుకోవాలి. మాయా భూతాలను పారద్రోలాలి. ఇటువంటి అవస్థ ఉన్నప్పుడు హృదయాన్ని అధిరోహిస్తారు, సింహాసనంపై కూడా కూర్చుంటారు. మా సింహాసనం ఏమిటి అన్నది కూడా అర్థం చేసుకుంటారు. శివబాబా మందిరాలను తయారుచేస్తారు కనుక మీ మహళ్ళు ఎంత సుందరంగా మరియు ఉన్నతంగా ఉంటాయి. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తాను, మీ వద్ద అపారమైన ధనం ఉంటుంది. తర్వాత మీరు నా మందిరాలను తయారుచేస్తారు. మొత్తం ధనాన్ని మందిరాలు తయారుచేయడంలోనైతే పెట్టరు. ఇప్పుడు మీకు తెలుసు, మనం విశ్వానికి యజమానులుగా ఉండేవారము అని. అక్కడ విశ్వ మహారాజును ధన దాత అని అంటారు, వారు భక్తి మార్గంలో ఎంత పెద్ద మందిరాన్ని తయారుచేసారు. మీరు కూడా తయారుచేస్తారు. అక్కడ ద్వాపరంలో రాజులందరి వద్ద మందిరాలు ఉంటాయి. మొట్టమొదట శివుని మందిరాలను తయారుచేస్తారు, తర్వాత దేవతలవి తయారుచేస్తారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు ఎంత సత్యమైన సమాచారాన్ని వినిపిస్తారు. పిల్లలైన మీకు ఈ చదువు ద్వారా చాలా సంతోషం కలగాలి. పిల్లలైన మీకు తెలుసు, పురుషార్థంతో మనం ఈ విధంగా అవుతాము, మరి శ్రీమతంపై ఎందుకు నడుచుకోరు, మీరు ఎందుకు మర్చిపోతారు. ఇదైతే కథ. ఇంట్లో మిత్ర-సంబంధీకులు కథలను వినిపిస్తారు. తండ్రి కూడా మీకు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల కథను వినిపిస్తారు. మీరు 5 వేల సంవత్సరాల క్రితం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. బాబా రోజూ ఈ కథను వినిపిస్తారు. మీరు పిల్లలుగా అవ్వండి. స్వయాన్ని రాజ్య భాగ్యం తీసుకునేందుకు యోగ్యులుగా చేసుకోండి. ఇది సత్యనారాయణుని కథ. ఈ కథను మీరు విని మళ్ళీ ఇతరులకు వినిపించాలి, అమరులుగా తయారుచేయడానికి. మళ్ళీ భక్తి మార్గంలో కథలను వినిపిస్తారు. తర్వాత సత్య-త్రేతా యుగాలలో ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు. తండ్రి ఎంత సాధారణంగా నడుచుకుంటారు. నేను పిల్లలైన మీకు సేవకుడిని అని అంటారు. ఎప్పుడైతే మీరు దుఃఖితులుగా అవుతారో, అప్పుడు నన్ను పిలుస్తారు, వచ్చి మమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేయండి, పతితులను పావనంగా చేయండి అని. మనుష్యులు ఏమైనా అర్థం చేసుకుంటారా. మీరు అర్థం చేసుకుంటారు, బాబా మనల్ని పతితం నుండి పావనంగా తయారుచేస్తున్నారు కనుక బాబాను మర్చిపోకూడదు. మీరు ఉన్నతమైన సేవను చేయాలి. తండ్రిని స్మృతి చేయాలి మరియు ఇంటికి వెళ్ళాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. రోజూ తమ హృదయం రూపీ దర్పణంలో చూసుకోవాలి, ఏదైనా వికర్మ చేసి స్వయానికి లేక ఇతరులకు నష్టమైతే కలిగించడం లేదు కదా! తెలివైనవారిగా అయి తండ్రి మతంపై నడుచుకోవాలి, భూతాలను పారద్రోలాలి.

2. తండ్రి ఏదైతే సత్యమైన సమాచారాన్ని లేక కథను వినిపిస్తారో, అది విని ఇతరులకు కూడా వినిపించాలి.

వరదానము:-

ఎలాగైతే స్నేహం కారణంగా ప్రతి ఒక్కరి హృదయంలో – మేము తండ్రిని ప్రత్యక్షం చేయాల్సిందే అని అనిపిస్తుంది. అలాగే, మీ సంకల్పం, మాట మరియు కర్మ ద్వారా హృదయంలో ప్రత్యక్షత యొక్క జెండాను ఎగురవేయండి, సదా సంతోషంగా ఉండే డాన్స్ చేయండి, అప్పుడప్పుడు సంతోషం, అప్పుడప్పుడు ఉదాసీనత – ఇలా కాదు. ఇటువంటి దృఢ సంకల్పాన్ని అనగా వ్రతాన్ని ధారణ చేయండి, ఎప్పటివరకైతే జీవించి ఉండాలో, అప్పటివరకు సంతోషంగా ఉండాలి. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా – ఈ పాట ఆటోమేటిక్ గా మోగుతూ ఉన్నట్లయితే ప్రత్యక్షత యొక్క జెండా ఎగురుతూ ఉంటుంది.

స్లోగన్:-

మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు

‘‘పరమాత్మ సుఖ దాతదుఃఖ దాత కాదు’’

ఇదైతే మనుష్యులందరికీ తెలుసు, అదృష్టాన్ని తయారుచేసేవారు ఒక్కరే, వారే పరమాత్మ. అదృష్టాన్ని తయారుచేసేవారా, కాస్త ఎదురుగా రండి… అనే సామెత కూడా ఉంది. కనుక ఈ మొత్తం మహిమ లేక గాయనం ఒక్క పరమాత్మదే. ఇంతగా అర్థం చేసుకున్నా కూడా, ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే, అప్పుడు దుఃఖితులుగా అయిన కారణంగా ఈ సుఖ-దుఃఖాలను, మంచి-చెడులను, ఈ అదృష్టాన్ని పరమాత్మ తయారుచేసారు అని అంటారు. మళ్ళీ అంటారు, ప్రభువు ఇచ్చిన దానిని మధురంగా చేసుకుని అనుభవించాలి, దానితోనే స్వయాన్ని సంతుష్టంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రభువు ఇచ్చినటువంటి ఫలం కూడా వారిని ఏమైనా మధురంగా ఉండనిస్తుందా. కానీ మనుష్యులకు ఈ మాత్రం బుద్ధి కూడా ఉండదు, మేము పరమాత్మపై ఈ దోషాన్ని ఎందుకు వేస్తున్నాము అని. ఈ దోషమైతే స్వయం మనిషిది. మనిషి ఏ కర్మలనైతే చేసారో, వాటిని అనుభవించాల్సి ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ తమ-తమ కర్మల అనుసారంగా అనుభవిస్తారు. మళ్ళీ ఒకవేళ ఎవరైనా శ్రేష్ఠ కర్మలను చేసినట్లయితే, సుఖాన్ని అనుభవిస్తారు మరియు ఎవరైనా భ్రష్ట కర్మలు చేస్తే దుఃఖితులుగా అవుతారు. ఇప్పుడు ఆ ఫలాన్ని కూడా మధురంగా చేసి అనుభవించడం కోసం మనుష్యులకు మొదట వివేకం కావాలి, అందుకే పరమాత్మ వచ్చి స్వయంగా జ్ఞానాన్ని మరియు యోగాన్ని నేర్పిస్తారు. ఇప్పుడిది నియమము, ఎవరెవరైతే మాయ తోడును విడిచి పరమాత్మ తోడును తీసుకుంటారో, మాయ వారి వెనుక పడడం వదలదు, చాలా విఘ్నాలు వేస్తుంది. ఇప్పుడు పరమాత్మ కోసం ఏదైతే సహనం చేస్తారో, అది అనుభవించడం మధురంగా అనిపిస్తుంది. వారు మనకు మైట్ మరియు లైట్ ను (శక్తి, ప్రకాశము) ఇస్తారు. ఇప్పుడు పరమాత్మ అంటారు, పిల్లలూ, పాడైపోయిన అదృష్టాన్ని నేను తయారుచేస్తాను కనుక నేను అదృష్టాన్ని తయారుచేసేవాడిని. ఇకపోతే, ఏ మనుష్యులైతే తమ గురించి తాము విస్మృతి చెందుతారో, వారు తమ అదృష్టాన్ని తామే పాడు చేసుకుంటారు కానీ ఏ మనుష్యులైతే నన్ను కలుసుకోవడం కోసం కష్టాలను అనుభవిస్తారో, వారి కోసం నేను బాధ్యుడిని. ఇప్పుడు అది కూడా ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడైతే అంటారో – పరమాత్మా, మీ ఇష్టము, నా ఇష్టము ఒక్కటే, అప్పుడు. ప్రపంచంలోని లక్షలాది మంది ఏమన్నా కూడా, వారికి పూర్తి నిశ్చయం ఉంది, మమ్మల్ని చదివించేవారు స్వయం పరమాత్మ, నేను వారితో బేరం కుదుర్చుకున్నాను, ఇప్పుడు నేను ఎవరిని పట్టించుకోవాలి. అందుకే అంటారు, పార బ్రహ్మములో ఉండేవారిని పొందాలని చింత ఉండేది, వారు లభించారు… ఇప్పుడు పరమాత్మ అంటారు, ఎవరైతే కేవలం నేను చెప్పేదే వింటారో మరియు నన్నే చూస్తారో, ఇటువంటి నిచ్చెనపై ఎవరైతే అడుగు పెట్టారో, వారిని మాయ అల కదిలిస్తుంది కూడా, కానీ ఎవరికైతే పూర్తి నిశ్చయం ఏర్పడిందో, వారైతే ప్రభువు చేతిని ఎప్పుడూ విడిచిపెట్టరు. అంతేకానీ, కాస్త మాయ కుదుపు వచ్చినా కూడా, తమ అదృష్టానికి అడ్డుగీత గీసుకోవడమనేది జరగకూడదు. అదృష్టాన్ని పాడు చేసుకోవడము మరియు తయారుచేసుకోవడము, ఇది మనుష్యుల చేతుల్లో ఉంది. అచ్ఛా – ఓం శాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top