18 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

November 17, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఇది చాలా భారీ గమ్యము కనుక తమ సమయాన్ని వృథా చేసుకోకుండా సతోప్రధానంగా తయారయ్యే పురుషార్థము చేయండి”

ప్రశ్న: -

పిల్లలు ఎక్కే కళలో లేకపోవడానికి ముఖ్యమైన కారణమేమిటి?

జవాబు:-

నడుస్తూ-నడుస్తూ కాస్త అహంకారం వచ్చినా, తమను తాము తెలివైనవారిగా భావించినా, మురళీని మిస్ చేసినా, బ్రహ్మా బాబా ఆజ్ఞను ఉల్లంఘించినా, ఎప్పుడూ ఎక్కే కళ జరగదు. సాకారుని హృదయం నుండి దిగిపోయారంటే నిరాకారుని హృదయం నుండి కూడా దిగిపోయినట్లే.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ప్రపంచం వారు లక్ష చేసినా సరే…

ఓంశాంతి. పిల్లలు పాటను విన్నారు. పిల్లలు అంటారు – మమ్మల్ని సంశయబుద్ధి కలవారిగా చేసేందుకు ఎవరు ఏం చేసినా కానీ, మేము సంశయబుద్ధి కలవారిగా అవ్వము. ఎవరు ఎన్ని తప్పుడు మాటలు వినిపించినా కానీ, మేము సంశయబుద్ధి కలవారిగా అవ్వము. శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉంటాము. తండ్రి ప్రతి రోజు భిన్న-భిన్న పాయింట్లను అర్థం చేయిస్తూ ఉంటారు. సత్యయుగంలో 9 లక్షల మంది ఉండేవారు, అంటే మిగిలిన ఇంతమంది మనుష్యులందరి వినాశనం తప్పకుండా జరుగుతుంది. ఎవరైతే తెలివైనవారిగా ఉంటారో, వారు సూచన ద్వారా అర్థం చేసుకుంటారు – తప్పకుండా ఈ యుద్ధం ద్వారానే అనేక ధర్మాల వినాశనం జరిగి ఒక్క దేవీ-దేవతా ధర్మ స్థాపన జరగనున్నది. ఎవరైతే యోగ్యులుగా అవుతారో, వారే మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. తండ్రి తప్ప ఎవ్వరూ మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయలేరు. కనుక పిల్లలకు, ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి అని గుర్తుండాలి కానీ మాయ పదే-పదే మరపింపజేస్తుంది. ఇప్పుడు ఇక్కడ బాబాను స్మృతి చేసి సతోప్రధానంగా అవ్వాలి. ఏ సమయంలోనైనా యుద్ధం పెద్దది అవ్వచ్చు, దీనికి నియమమేమీ లేదు. బహుశా ఆపలేనంత పెద్ద యుద్ధం కూడా జరగవచ్చు అని కూడా అంటూ ఉంటారు. అందరూ పరస్పరంలో కొట్లాడుకోవడం మొదలుపెడతారు. కావున వినాశనమయ్యేందుకు ముందే మనం స్మృతిలో ఉంటూ తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యే పురుషార్థం ఎందుకు చేయకూడదు. స్మృతి యాత్రలోనే మాయ విఘ్నాలు వేస్తుంది, అందుకే బాబా ప్రతి రోజు, చార్టు రాయండి అని చెప్తారు. కష్టం మీద ఇద్దరూ, నలుగురో వ్రాస్తారు. మిగిలినవారు తమ వ్యాపార వ్యవహారాల్లోనే రోజంతా ఉండిపోతారు. అనేక రకాల విఘ్నాలలో చిక్కుకుని ఉంటారు. మేము సతోప్రధానంగా తప్పకుండా అవ్వాలి అని పిల్లలకు తెలుసు. కనుక ఎక్కడ ఉన్నా సరే, పురుషార్థం చేయాలి. మనుష్యులకు అర్థం చేయించడానికి చిత్రాలు మొదలైనవి కూడా తయారుచేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ సమయంలో మనుష్యులు 100 శాతం తమోప్రధానంగా ఉన్నారు. మొదట, ముక్తిధామం నుండి వచ్చేటప్పుడు సతోప్రధానంగా ఉంటారు. తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తూ-వస్తూ ఈ సమయంలో అందరూ తమోప్రధానులుగా అయ్యారు. తండ్రిని స్మృతి చేయడంతో తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు – అనే బాబా సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. వినాశనం కూడా ఎదురుగా నిలబడి ఉంది. సత్యయుగంలో ఒకే ధర్మముండేది, మిగిలినవారంతా నిర్వాణధామంలో ఉండేవారు. పిల్లలు చిత్రాలపై అటెన్షన్ పెట్టాలి. పెద్ద చిత్రాలు ఉంటే మంచి రీతిగా అర్థం చేసుకోగలరు. అందరికీ బాబా సందేశాన్ని ఇవ్వాలి. మన్మనాభవ అనే పదం ముఖ్యమైనది కావున అల్ఫ్ మరియు బే – ఇది అర్థం చేయించడానికి ఎంత శ్రమించాల్సి ఉంటుంది. అర్థం చేయించేవారు కూడా నంబరువారుగా ఉన్నారు, అనంతమైన తండ్రి పట్ల ప్రేమ ఉండాలి. మేము బాబా సేవ చేస్తున్నామని బుద్ధిలో ఉండాలి. ఈశ్వరీయ సేవాధారులుగా అవ్వాలి. వారు ఈ పదాన్ని వాడుతారు కానీ అర్థాన్ని తెలుసుకోరు. ఇప్పుడు బాబా పిల్లల సేవ చేసేందుకు వచ్చారు. ఎంత ఉత్తమమైన దేవీ-దేవతలుగా తయారుచేస్తారు. ఈ రోజు మనం ఎంత నిరుపేదగా అయిపోయాము. సత్యయుగంలో ఎంత సర్వగుణ సంపన్నులుగా అవుతాము. ఇక్కడ ఒకరితో ఒకరు కొట్లాడుతూ-గొడవపడుతూ ఉంటారు. వినాశనం జరగనున్నదని ఎవ్వరికీ తెలియదు. శాంతి ఏర్పడుతుందని భావిస్తారు. పూర్తిగా ఘోరమైన అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు వారికి అర్థం చేయించేవారు కావాలి. విదేశాలలో కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వవచ్చు. సభలో కూర్చుని ఒక్క విషయాన్ని అర్థం చేయించండి – మహాభారీ యుద్ధమైతే ప్రసిద్ధమైనది, దీనితో పాత ప్రపంచ వినాశనం జరగనున్నది. ఇప్పుడు గాడ్ ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారు, తప్పకుండా వారే బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపన చేస్తున్నారు. శంకరుని ద్వారా కలియుగ వినాశనం కూడా జరగనున్నది ఎందుకంటే ఇప్పుడిది సంగమము. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగనున్నాయి. మూడవ ప్రపంచ యుద్ధము చివరి యుద్ధమని అంటారు. ఆఖరి వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే ముక్తిధామానికి వెళ్తారు అనే విషయాన్ని ఇప్పుడు అందరికీ చెప్పాల్సి ఉంటుంది. వారు తమ ధర్మంలో ఉన్నా కానీ, బాబాను స్మృతి చేయడంతో తమ ధర్మంలో మంచి పదవిని పొందగలరు.

అనంతమైన తండ్రి మనకు ప్రజాపిత బ్రహ్మా తనువు ద్వారా జ్ఞానం ఇస్తున్నారని మీకు తెలుసు. తర్వాత ఇతరులకు కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. చుట్టు పక్కల ఉన్న వారందరికీ సందేశాన్ని ఇవ్వాలి. ఇతర ధర్మాల వారికి కూడా బాబా పరిచయాన్ని ఇవ్వాలి. బయట వారికి, రాజులకు కూడా జ్ఞానాన్ని ఇవ్వాలి. దాని కోసం ఏర్పాట్లు చేయాలి. బాబా అంటారు, ఈ ముఖ్య చిత్రాలు ఏవైతే ఉన్నాయో – త్రిమూర్తి, సృష్టి చక్రం, కల్పవృక్షము, ఇవి కూడా వస్త్రంపై ముద్రించినట్లయితే, బయటకు కూడా తీసుకువెళ్ళచ్చు. పెద్ద సైజులో ముద్రించలేకపోతే, రెండు భాగాలుగా చేయండి. ఈ త్రిమూర్తి, వృక్షం, సృష్టి చక్రంలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మెట్ల చిత్రంలోని జ్ఞానం కూడా సృష్టి చక్రంలో ఉంది. 84 జన్మలు ఎలా తీసుకుంటారు అనేది మెట్ల చిత్రంలో విస్తారంగా చూపించబడింది. చక్రంలో అన్ని ధర్మాలవారు వస్తారు. సతోప్రధానం నుండి సతో, రజో, తమోలలోకి ఎలా వస్తారు, కిందకు ఎలా దిగుతారు అనేది మెట్ల చిత్రంలో చూపిస్తారు. ఇప్పుడు బాబా అంటారు – నన్నొక్కడినే స్మృతి చేయండి. బాబాకు రోజంతా ఆలోచన నడుస్తూ ఉంటుంది. ఎవరైనా కొత్తగా పెద్ద ఇంటిని నిర్మించేటప్పుడు, అందులో గోడలు ఎంత పెద్దగా ఉండాలంటే వాటిపై 6×9 అడుగుల సైజు ఉన్న చిత్రాలను పెట్టే విధంగా ఉండాలి. దీనికి 12 అడుగులు ఉన్న గోడ కావాలి. ఈ సమయంలో భాషలు కూడా చాలా ఉన్నాయి. అన్ని ధర్మాల వారికి అర్థం చేయించాలంటే ఎన్ని భాషలలో తయారుచేయాల్సి ఉంటుంది. ఇంతటి విశాల బుద్ధితో యుక్తిని రచించాలి. సేవ పట్ల అభిరుచి ఉండాలి. ఖర్చు అయితే చేయాల్సిందే. ఇకపోతే, మీకు ఎవరినీ యాచించాల్సిన అవసరం లేదు. హుండీ దానంతట అదే నిండిపోతుంది. డ్రామాలో నిశ్చయించబడింది. పిల్లల బుద్ధి నడవాలి. కానీ పిల్లలు కొద్దిగా చేసినా సరే, మేము చాలా తెలివైనవారము అనే నషా ఎక్కుతుంది. బాబా అంటారు – రూపాయిలో 4 అణాలు కూడా నేర్చుకోలేదు. కొందరు 2 అణాలు, కొందరు ఒక అణా, కొందరు ఒక పైసా అంత, అది కూడా కష్టం మీద నేర్చుకున్నారు. ఏమీ అర్థం చేసుకోరు. మురళీ చదివే అభిరుచి కూడా లేదు. షావుకారు ప్రజలు, పేద ప్రజలు అందరూ ఇక్కడే తయారవ్వాలి. కొందరైతే తండ్రితో ప్రతిజ్ఞ చేసి మళ్ళీ నల్ల ముఖం చేసుకుంటారు. బాబా, ఓడిపోయాము అని అంటారు. తండ్రి అంటారు – మీరు పాదచారుల కన్నా తక్కువగా ఉన్నారు, పైసా అంత విలువ కూడా లేనివారిగా ఉన్నారు. ఇటువంటి వారు ఏ పదవిని పొందుతారు! ఇప్పుడు సూర్యవంశీ రాజధాని స్థాపనవుతుంది. ఎవరికైతే బాబా స్మృతి ఉంటుందో, వారే సంతోషంగా ఉంటారు. తండ్రి ద్వారా ఏ వారసత్వాన్ని తీసుకుంటున్నాము – కేవలం ఈ విషయం గుర్తున్నా కూడా, చాలా లాభం ఉంటుంది. ధారణ చేసి, తర్వాత తమ సమానంగా తయారుచేయాలి. పిల్లలు అంతటి సేవను చేయలేకపోతున్నారు. కొంచెం సేవ చేయగానే, మేము పాస్ అయిపోయామని భావిస్తారు. దేహాభిమానంలోకి వచ్చి పడిపోతారు. ఒకవేళ బాబాను (బ్రహ్మా) అగౌరవపరిస్తే, నన్ను అగౌరవపరిచినట్లే అని శివబాబా అంటారు. బాప్ దాదా, ఇరువురూ కలిసి ఉన్నారు కదా. మాకైతే శివబాబాతో కనెక్షన్ ఉంది అని కాదు. అరే, వారసత్వమైతే వీరి ద్వారా లభిస్తుంది కదా. వీరికి మనస్సులోని సమాచారాన్ని వినిపించాలి, సలహా తీసుకోవాలి. శివబాబా అంటారు – నేను సాకారుని ద్వారా సలహా ఇస్తాను. బ్రహ్మా లేకుండా శివబాబా నుండి వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు. తండ్రి లేకుండా ఏ పని జరగదు. అందుకే, పిల్లలు చాలా-చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు అహంకారంలోకి వచ్చి స్వయాన్ని నష్టపరచుకుంటారు. సాకారుని హృదయం నుండి దిగిపోతే నిరాకారుని హృదయం నుండి కూడా దిగిపోతారు. ఇలా చాలా మంది ఉన్నారు – ఎప్పుడూ మురళీని కూడా వినరు, లెటర్ కూడా వ్రాయరు, మరి బాబా ఏమనుకుంటారు! ఇది చాలా భారీ గమ్యము. పిల్లలు సమయాన్ని వృథా చేసుకోకూడదు. ఎవరైతే స్వయాన్ని మహారథులుగా భావిస్తారో, వారు ఉన్నతమైన కార్యాలలో సహాయం చేయాలి. అప్పుడు తండ్రి సంతోషించి అభినందిస్తారు – వీరి ద్వారా అనేకుల కళ్యాణం జరుగుతుందని అంటారు. ప్రదర్శనీలకైతే ఎంతోమంది వస్తారు. ప్రజలైతే తయారవుతారు. బాబాకు సర్వీసబుల్ పిల్లలపై దృష్టి ఉంటుంది. ఈ ఇంద్రసభకు సూర్యవంశీ రాజా-రాణులుగా అయ్యేవారు రావాలి. ఎవరైతే సేవ చేయరో, వారు యోగ్యులు కారు. ఎవరెవరు ఏమవుతారో మున్ముందు అంతా తెలుస్తుంది! మేము రేపు స్వర్గంలోకి వెళ్ళి రాజకుమారులుగా అవుతామని పిల్లలకు చాలా నషా ఉండాలి. ఇక్కడికి మీరు రాజయోగం నేర్చుకోవడానికి వచ్చారు. మంచి రీతిలో చదువుకోకపోతే, తక్కువ పదవిని పొందుతారు. బాబా వద్దకు సేవా సమాచారం రావాలి – బాబా, ఈ రోజు నేను ఈ సేవ చేసాను అని. లెటర్ కూడా ఎప్పుడూ రాయకపోతే బాబా ఏమనుకుంటారు? మరణించారని అనుకుంటారు. ఏ పిల్లలైతే సేవలో ఉంటారో, తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉంటారో, బాబాకు కూడా ఆ పిల్లలే గుర్తుంటారు. శివబాబా బ్రహ్మా ద్వారా, బ్రహ్మాకుమార-కుమారీలకు వారసత్వాన్ని ఇస్తారు. శివబాబా బ్రహ్మా ద్వారా బ్రాహ్మణుల రచనను రచిస్తారు. ఇప్పుడు మిగతా ధర్మాలన్నీ ఉన్నాయి, ఇకపోతే, పునాది అయిన దేవీ-దేవతా ధర్మం మాయమైపోయింది. ఈ ఆటంతా తయారుచేయబడింది. మెట్ల చిత్రంలో అన్ని ధర్మాలు లేవు. ఈ కారణంగా సృష్టి చక్రం చిత్రంపై అర్థం చేయించాల్సి ఉంటుంది. సృష్టి చక్రం చిత్రంలో స్పష్టంగా ఉంది. సత్యయుగంలో దేవీ-దేవతలు డబల్ కిరీటధారులుగా ఉండేవారని కూడా అర్థం చేయించాలి. ఈ సమయంలో పవిత్రతా కిరీటం ఎవ్వరికీ లేదు. మనం లైట్ (ప్రకాశ) కిరీటం ఇవ్వదగిన వారు ఒక్కరు కూడా లేరు. స్వయానికి కూడా ఇచ్చుకోలేరు. మనం ప్రకాశం కోసం పురుషార్థం చేస్తున్నాము. శరీరమైతే ఇక్కడ పవిత్రంగా లేదు. ఆత్మ యోగబలంతో పవిత్రంగా అవుతూ-అవుతూ చివరికి పవిత్రంగా అయిపోతుంది. కిరీటమైతే సత్యయుగంలో లభిస్తుంది. సత్యయుగంలో డబల్ కిరీటము, భక్తి మార్గంలో సింగిల్ కిరీటము. ఇక్కడ ఏ కిరీటము లేదు. ఇప్పుడు మీకు కేవలం పవిత్రతా కిరీటాన్ని ఎక్కడ చూపించాలి? ప్రకాశాన్ని ఎక్కడ ఉంచాలి? జ్ఞానులుగా అయితే అయ్యారు కానీ పూర్తిగా పవిత్రంగా అయినప్పుడు ప్రకాశముండాలి. మరి సూక్ష్మవతనంలో ప్రకాశాన్ని చూపించాలా? మమ్మా సూక్ష్మవతనంలో పవిత్ర ఫరిశ్తాగా ఉన్నారు కదా! అక్కడ సింగిల్ కిరీటముంటుంది. కానీ ఇప్పుడు ప్రకాశాన్ని ఎలా చూపించాలి? చివర్లో పవిత్రంగా అవుతారు. యోగంలో కూర్చున్నప్పుడు అక్కడ ప్రకాశాన్ని చూపించాలా? ఈ రోజు ప్రకాశాన్ని చూపించి, రేపు పతితంగా అయితే ప్రకాశమే మాయమైపోతుంది, అందుకే అంతిమంలో కర్మాతీత అవస్థ ఏర్పడినప్పుడు ప్రకాశం ఉండగలదు. కానీ మీరు సంపూర్ణంగా అవుతూనే సూక్ష్మవతనానికి వెళ్ళిపోతారు. ఉదాహరణకు బుద్ధుడిని, క్రీస్తును చూపిస్తారు! మొట్టమొదట పవిత్రాత్మ ధర్మ స్థాపన చేయడానికి వస్తుంది, వారికి ప్రకాశాన్ని చూపించవచ్చు కానీ కిరీటాన్ని చూపించలేము. మీరు కూడా బాబాను స్మృతి చేస్తూ-చేస్తూ పవిత్రంగా అవుతారు. మీరు స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ-తిప్పుతూ రాజ్య పదవిని పొందుతారు. అక్కడ మంత్రులుండరు. ఇక్కడ అనేకుల నుండి సలహా తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అందరూ సతోప్రధానంగా ఉంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బాప్ దాదా నుండి అభినందనలను అందుకునేందుకు తండ్రి యొక్క ఉన్నతమైన కార్యంలో పూర్తిగా సహాయకులుగా అవ్వాలి. బాబాకు మీ సేవల యొక్క సమాచారాన్ని తెలియజేయాలి.

2. దేహాభిమానములోకి వచ్చి ఎప్పుడూ అగౌరవపరచకూడదు. తప్పుడు నషాలోకి రాకూడదు. మీ సమయాన్ని వ్యర్ధం చేసుకోకూడదు. సేవ కోసం యుక్తులను రచించాలి. సేవాధారులుగా అవ్వాలి.

వరదానము:-

ఏ విధంగా ప్రారంభంలో జ్ఞాన శక్తి తక్కువగా ఉండేది కానీ త్యాగం మరియు స్నేహం ఆధారంగా సఫలత లభించింది. బుద్ధిలో రాత్రింబవళ్ళు బాబా మరియు యజ్ఞము వైపే లగనము ఉండేది, బాబా మరియు యజ్ఞము అనే మాటలు హృదయం నుండి వెలువడేవి. ఈ స్నేహమే అందరినీ సహయోగంలోకి తీసుకువచ్చింది. ఈ శక్తి ద్వారానే సేవా కేంద్రాలు తయారయ్యాయి. సాకార స్నేహం ద్వారానే మన్మనాభవగా అయ్యారు, సాకార స్నేహమే సహయోగులుగా చేసింది. ఇప్పుడు కూడా త్యాగం మరియు స్నేహం యొక్క శక్తులతో చుట్టుముడితే సఫలత లభిస్తుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top