18 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

17 May 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీరు సత్యాతి-సత్యమైన ప్రేయసులుగా అయి ఒక్క ప్రియుడినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆయువు పెరుగుతుంది, యోగం మరియు చదువు ద్వారానే మీరు ఉన్నత పదవిని పొందగలరు’’

ప్రశ్న: -

భారత్ ను స్వర్గంగా తయారుచేసేందుకు తండ్రి పిల్లలను ఏ సహాయం కోరుతారు?

జవాబు:-

పిల్లలూ – నాకు పవిత్రత యొక్క సహాయం కావాలి. ప్రతిజ్ఞ చేయండి – మేము కామ వికారాన్ని కాలదన్ని పవిత్రంగా తప్పకుండా అవుతాము అని. ఉదయముదయాన్నే లేచి మీతో మీరు మాట్లాడుకోండి – మధురమైన బాబా, మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము పవిత్రంగా అయి భారత్ ను పవిత్రంగా తప్పకుండా చేస్తాము. మేము మీ శిక్షణ అనుసారంగా తప్పకుండా నడుచుకుంటాము. ఎటువంటి పాప కర్మను చేయము. బాబా, ఇది మీ అద్భుతము. మేము విశ్వానికి యజమానులుగా అవుతామని స్వప్నంలో కూడా అనుకోలేదు. మీరు ఎలా ఉన్న మమ్మల్ని ఎలా తయారుచేస్తున్నారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నిన్ను పిలవాలని నా మనసు కోరుకుంటుంది… (తుమ్హారే బులానే కో…)

ఓంశాంతి. ప్రియమైన పిల్లలకు తెలుసు, ఆత్మలమైన మేము ఆ ఒక్క ప్రియుడైన తండ్రికి ప్రేయసులము అని. ప్రేయసి మరియు ప్రియుని యొక్క సంబంధం ఎంత గాఢంగా ఉంటుంది అనేది పిల్లలకు తెలుసు. ఆ దైహిక ప్రేయసులు ఎవరైతే ఉంటారో, వారు దేహం పట్ల ప్రియులుగా అవుతారు, వికారాల కోసం కాదు. పిల్లలకు తెలుసు, ఎప్పుడైనా ఎవరికైనా వివాహం జరిగినప్పుడు వారిని పతి-పత్ని అని అంటారు కానీ వారు కూడా ప్రేయసీ-ప్రియులే, అయితే వారు ఒకరినొకరు పతితం చేసుకునేవారు. వారికి ముందు నుండే తెలుసు, వికారులుగా అవుతామని తెలుసు. ఇప్పుడు పిల్లలైన మీరు ఆ ఒక్క ప్రియునికి ప్రేయసులుగా అయ్యారు. వారు ఆత్మలందరికీ ప్రియుడు. అందరూ ఆ ఒక్కరికే ప్రేయసులు. భక్తులందరూ భగవంతునికి ప్రేయసులు. కానీ భక్తులకు భగవంతుని గురించి తెలియదు. భగవంతుని గురించి తెలియని కారణంగా శక్తి మొదలైనవేవీ వారి నుండి పొందలేరు. సాధు-సన్యాసులు మొదలైనవారు పవిత్రంగా ఉంటారు కావున వారికి ఎంతో కొంత అల్పకాలికముగా లభిస్తుంది. మీరైతే ఒక్క ప్రియుడిని స్మృతి చేస్తారు. వారితో బుద్ధియోగాన్ని జోడించడం జరుగుతుంది. వారు తండ్రి కూడా, శిక్షకుడు కూడా, పతితపావనుడు, సర్వశక్తివంతుడు. ఆ తండ్రితో మీరు యోగం జోడించి శక్తిని తీసుకుంటారు. మీ జ్ఞానమే వేరు, మాయపై విజయం పొందేందుకు శక్తిని తీసుకుంటారు. ఈ విధంగా విశ్వానికి యజమానులుగా చేసే ప్రియుడు ఎంత మధురమైనవారు. ఎవరైతే తండ్రిని తమవారిగా చేసుకున్నారో, వారికి – వీరు ఎంత మంచి ప్రియుడు అనేది తెలుసు. వీరిని అర్ధకల్పం నుండి అందరూ స్మృతి చేస్తారు. ఆ దైహిక ప్రేయసి-ప్రియులైతే ఒక్క జన్మ కోసం అలా ఉంటారు. మీరైతే అర్ధకల్పం స్మృతి చేసారు. ఇప్పుడు మీరు తండ్రిని తెలుసుకున్నారు కావున మీకు చాలా శక్తి లభిస్తుంది. మీరు శ్రీమతంపై నడుస్తూ, స్వర్గానికి శ్రేష్ఠాతి-శ్రేష్ఠమైన యజమానులుగా అవుతారు. ఆత్మ ప్రేయసిగా అవుతుంది, ఆత్మ కర్మేంద్రియాల ద్వారా కర్తవ్యం చేయిస్తుంది.

ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అన్న ఈ చింత పట్టుకుంది. విషాన్ని ఇచ్చి-పుచ్చుకునేందుకు కంకణం ఏదైతే కట్టుకుంటారో, దానిని తండ్రి వచ్చి ఇప్పుడు క్యాన్సిల్ చేసారు. వారంటారు, ఈ విషయాలన్నింటినీ వదిలి ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. దైహిక ప్రేయసికి కూడా అన్ని వేళలా తింటూ-తాగుతూ, లేస్తూ-కూర్చుంటూ ప్రియుని స్మృతి ఉంటుంది కదా. వారిలో చెడు భావన ఉండదు. వికారాల విషయం ఉండదు. ఇప్పుడు మీరు ఒక్కరిని మాత్రమే స్మృతి చేస్తారు. స్మృతి యొక్క పురుషార్థం అనుసారంగా మీరు మీ ఆయువును పెంచుకోగలరు. ఒకవేళ ఎవరైనా బ్రాహ్మణుడు, మీ ఆయువు 50 సంవత్సరాలు అని చెప్పారనుకోండి, తండ్రి అంటారు – ఇప్పుడు మీరు యోగబలంతో మీ ఆయుష్షును పెంచుకోవచ్చు. యోగములో ఎంత ఎక్కువగా ఉంటారో, అంతగా ఆయుష్షు పెరుగుతుంది. ఇక తర్వాత, భవిష్య జన్మ-జన్మాంతరాలకు దీర్ఘాయువు కలవారిగానే అవుతారు. యోగం లేకపోతే మరి, శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది, అప్పుడు పదవి కూడా తగ్గిపోతుంది. అయితే, అందరూ సుఖమయంగా అవుతారు కానీ యోగం మరియు చదువు ద్వారా అవుతారు. వ్యత్యాసమంతా పదవిలో ఉంటుంది కదా. ఎంత పురుషార్థమో, అంత ఉన్నత పదవి. ధనమైతే నంబరువారుగా ఉంటుంది కదా. అందరూ ఒకే విధమైన ధనవంతులుగా ఉండలేరు. కావున తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, ఎంత వీలైతే అంత నా మతంపై నడుచుకోండి. అర్ధకల్పము ఆసురీ మతంపై నడుస్తారు, దాని వలన మీ ఆయువు తగ్గిపోతూ వచ్చింది. ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఈ రోజు జన్మ తీసుకుంటారు, రేపు మరణిస్తారు. దాన-పుణ్యాలు చేయడంతో పెద్ద ఇంట్లో జన్మ లభిస్తుంది కదా. ఇప్పుడు తండ్రి మీకు అవినాశీ జ్ఞాన రత్నాల దానమునిచ్చి జోలిని నింపుతున్నారు. మీరు ఎంత షావుకార్లుగా అవుతారు. ఈ అవినాశీ జ్ఞాన రత్నాల దానమనండి లేక వారసత్వమనండి, ఇది తండ్రి నుండి లభిస్తూ ఉంది. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు కనుక మీరు ఇతరులకు మార్గాన్ని తెలియపరచాలి. మనము భగవంతుని పిల్లలము కనుక తప్పకుండా భగవాన్-భగవతీల పదవి లభించాలి. భారత్ లో గాడెస్ లక్ష్మీ, గాడ్ నారాయణ అని అంటూ ఉంటారు. కొత్త ప్రపంచంలో దేవీ-దేవతలే రాజ్యం చేస్తారు ఎందుకంటే భగవంతుని ద్వారా పదవి లభించింది. కానీ తండ్రి అర్థం చేయిస్తారు, ఒకవేళ వారిని గాడ్-గాడెస్ అని పిలిస్తే యథా రాజా, రాణి తథా ప్రజను కూడా గాడ్-గాడెస్ అని పిలవాల్సి ఉంటుంది, అందుకే దేవీ-దేవతలని అనడం జరుగుతుంది.

మనము భారత్ ను స్వర్గంగా చేస్తున్నామని మీకు తెలుసు. పరమపిత పరమాత్ముని శ్రీమతము ద్వారా మనము రాజయోగాన్ని నేర్చుకుంటాము. తర్వాత రాజ్యభాగ్యాన్ని పొందుతాము. పరమాత్మనే స్వర్గాన్ని స్థాపన చేస్తారు కావున వారు తప్పకుండా నరకంలోనే రావాలి, అప్పుడే నరకాన్ని స్వర్గంగా తయారుచేయగలరు. ఎవరైతే కల్పక్రితము తయారై ఉంటారో, వారే మళ్ళీ తయారవుతారు. అందరూ ఏకరసంగానైతే ఉండరు, నంబరువారుగా పురుషార్థం చేస్తారు. ఈ రోజుల్లో పిల్లలు ధైర్యము చేసి ప్రతిజ్ఞ చేస్తారు – బాబా, ఫలానా కన్యకు చాలా దెబ్బలు పడుతున్నాయి, నేను ఆమెను రక్షించేందుకు యుగళ్ గా అవుతాను. అచ్ఛా, అది మంచిదే కానీ జ్ఞానం యొక్క శక్తి కావాలి, ధారణ కావాలి. ఎంతమంది వారసులను, ప్రజలను తయారుచేస్తారో, ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే సేవ చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. ఎంతగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ విధంగా విదేశాలలో కూడా చాలా మంది ఉంటారు. కంపానియన్ గా ఉంటూ పవిత్రంగా ఉంటారు. తర్వాత ఆస్తినంతా స్త్రీకి ఇచ్చేస్తారు లేక దానంగా ఇచ్చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు పరమపిత పరమాత్మ ప్రియునిగా లభించారు, వారు మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు కావున వారి స్మృతి ఎంతగా ఉండాలి. ఇటువంటి తండ్రినైతే చాలా స్మృతి చేయాలి. మీకు మాత్రమే తండ్రి గురించి తెలుసు, ఇతర సాధు-సత్పురుషులు మొదలైన వారెవ్వరికీ తండ్రి గురించి తెలియదు. ఇక్కడ తండ్రి పిల్లల సమ్ముఖంలో కూర్చుని ఉన్నారు. ఈ సమయంలో ఒకవేళ వారెవరైనా పవిత్రంగా ఉన్నా కానీ, పతితపావనుడైన తండ్రి నుండి మీకు ఎంతైతే లభిస్తుందో, వారికి ఆ పవిత్రతా బలము లభించదు ఎందుకంటే వారికి తండ్రి గురించి తెలియదు. ఆత్మనే పరమాత్మ అని లేక బ్రహ్మతత్వమే పరమాత్మ అని అంటూ ఉంటారు. అనేకానేక అభిప్రాయాలు మరియు ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ మీ అందరిదీ ఒకే అద్వైత మతము. తండ్రి ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే మతము లభిస్తుంది. నిజానికి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి సమయం పట్టదు. వారు వచ్చి అపవిత్రమైన మనుష్యులను పవిత్రంగా చేస్తారు. మహిమ అయితే ఉంది కదా. ఇకపోతే, శాస్త్రాలనైతే ఎన్నో వింటూ, చదువుతూ వచ్చారు కానీ వాటి ద్వారా ఎలాంటి ఫలము లభించదు. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక వారికి సత్యాతి-సత్యమైన ప్రేయసిగా అవ్వాలి. బుద్ధియోగము ఇంకెక్కడికీ భ్రమించకూడదు. గృహస్థ వ్యవహారంలో ఉంటే ఉండండి కానీ కమలపుష్ప సమానంగా ఉండండి. భక్తి మార్గంలోనైతే కొందరు హనుమంతుడిని, కొందరు గణేశుడిని, కొందరు ఇంకెవరినో పట్టుకుంటూ వచ్చారు. కానీ వారెవ్వరూ భగవంతులైతే కారు. అయితే, శివబాబా పేరు కూడా గుర్తుంటుంది కానీ వారి గురించి తెలియదు. పరమాత్మను రాయి-రప్పలలో వేసేసారు. దారమంతా చిక్కుపడిపోయింది, కేవలం తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఈ చిక్కును విప్పలేరు. భగవంతుడు ఎవ్వరికీ లభించరు. స్వయంగా భగవంతుడు అంటారు, భక్తి పూర్తి అయినప్పుడు నేను వస్తాను. అర్ధకల్పము భక్తి మార్గం నడుస్తుంది, పగలు మరియు రాత్రి. ప్రారంభంలో కూడా మొట్ట మొదట్లో ప్రవేశించినప్పుడు, గోడలపై చిన్న పిల్లల వలె చక్రాలు గీస్తూ ఉండేవారు. ఏమీ అర్థమయ్యేది కాదు. నేను, మీరు అందరూ బేబీలు వలె ఉండేవారము, తర్వాత నెమ్మది-నెమ్మదిగా బుద్ధిలోకి రావడం మొదలయింది. ఇప్పుడు మీరు చదువుకుని తెలివైనవారిగా అయ్యారు కావున చాలా సహజ రీతిలో అర్థం చేయించగలరు. వీరు చాలా పాత పిల్లలు, కావున మాకన్నా తెలివైనవారు, మేమైతే అంతగా చదవలేము అని భావించకండి. తండ్రి అంటారు – చివర్లో వచ్చేవారు చాలా ముందుకు వెళ్ళగలరు. ఆలస్యంగా వచ్చేవారు రాత్రింబవళ్ళు ఇంకా యోగంలో ఆనందంగా నిమగ్నమవుతారు. రోజురోజుకు పాయింట్లు చాలా మంచి-మంచివి లభిస్తూ ఉంటాయి. పరమపిత పరమాత్మ స్వర్గ రచయిత కావున వారి నుండి వారసత్వం లభించాలి కదా. సత్యయుగంలో ఉండేది. ఇప్పుడు లేదు, అందుకే తండ్రి మళ్ళీ ఇచ్చేందుకు వచ్చారు. పిల్లలకు ఎంతోకొంత అర్థమై యోగంలో నిమగ్నమైపోవాలని ఎన్ని యుక్తులు రచించడం జరుగుతుంది. కొంతమంది, మాకు తీరిక లేదు అని అంటారు. ఈ స్మృతి ద్వారానే మీరు సదా కోసం నిరోగులుగా అవుతారు. కావున ఈ వ్యాపారంలో నిమగ్నమైపోవాలి కదా. ఇందులో స్థూలంగా చేసేది ఏమీ లేదు. లౌకిక తండ్రి స్మృతి ఉండగలిగినప్పుడు మరి పారలౌకిక తండ్రిని ఎందుకు మర్చిపోతారు. తండ్రి అంటారు, భారతవాసులైన మీకు 5 వేల సంవత్సరాల క్రితము కూడా వారసత్వాన్ని ఇచ్చాను కదా. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా – ఈ విషయాలను మర్చిపోయారా ఏమిటి? మీరు సూర్యవంశీయులుగా ఉండేవారు, తర్వాత చంద్రవంశీయులుగా, వైశ్యవంశీయులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశీయులుగా తయారుచేయడానికి వచ్చాను. బ్రాహ్మణులుగా అయితేనే యజ్ఞాన్ని సంభాళించగలుగుతారు. బ్రాహ్మణులు ఎప్పుడూ వికారులుగా అవ్వలేరు. చివరివరకు అయితే పవిత్రంగా ఉండాల్సిందే, అప్పుడే కొత్త ప్రపంచానికి యజమానులుగా అవ్వగలరు. ఎంత గొప్ప ప్రాప్తి. మీరు తండ్రిని స్మృతి చేయరు. పిల్లలుగా అయి తండ్రిని స్మృతి చేయకపోవడమనేది ఎప్పుడూ జరగదు. తండ్రిని మర్చిపోతే వారసత్వము ఎలా లభిస్తుంది? ఇది సంపాదన కదా. సాధు-సత్పురుషుల వద్దనైతే ప్రాప్తి ఏమీ లేదు. కేవలం పవిత్రత యొక్క బలము ఉంది, ఈశ్వరీయ బలము లేదు. ఈశ్వరుని గురించి తెలియనే తెలియకుంటే బలము ఎలా లభిస్తుంది? బలము మీకు లభించింది. తండ్రి స్వయంగా అంటారు, నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేయడానికి వచ్చాను. మీరు ఈ కొద్ది సమయం కోసం పవిత్రంగా ఉండలేరా? క్రోధము రెండవ నంబరు భూతము. అన్నిటికంటే పెద్ద భూతము కామము. సత్యయుగంలో భారత్ నిర్వికారిగా ఉండేది, ఎంతో సుఖమయంగా ఉండేది. ఇప్పుడు వికారీగా అయ్యింది కావున భారత్ పరిస్థితి ఎలా అయిపోయింది! తండ్రి మళ్ళీ భారత్ ను నిర్వికారిగా తయారుచేయడానికి వచ్చారు, మరి ఇటువంటి తండ్రిని స్మృతి చేయడం మీరు మర్చిపోతారా? మాయ చాలా త్వరగా వికర్మలు చేయిస్తుంది! ఇది చాలా పెద్ద గమ్యము. మీరు ఇటువంటి తండ్రి శ్రీమతంపై నడవరా! ఇటువంటి తండ్రి పట్ల ప్రేమ లేదా! మర్చిపోతాము అని అంటారు, అచ్ఛా, ఒక్క ఘడియ, అర్ధ ఘడియ… తక్కువలో తక్కువ ఈ మాత్రమైనా ప్రయత్నం చేయండి, అంతిమ సమయంలో తండ్రి స్మృతి ఉండే విధంగా ప్రయత్నించండి. ఇది అంత్యకాలం కదా. అంత్యకాలంలో ఎవరైతే నారాయణుని స్మరిస్తారో… నేను నారాయణునిగా అవుతాను, మీరు కూడా అవుతారు కదా. తండ్రి అంటారు, పూర్తి ప్రేయసులుగా కూడా అవ్వండి కదా. తండ్రి అయితే దాత. తండ్రిని మీ వారిగా చేసుకుంటే తండ్రి సలహాను లేక మతాన్ని ఇస్తారు. సవతి పిల్లలకైతే సలహా ఇవ్వరు. తండ్రి అయితే దాత. మీ నుండి ఏమైనా తీసుకుంటారా? మీరు ఏదైతే చేస్తారో, అదంతా మీ కోసమే. నేనైతే విశ్వానికి యజమానిగా కూడా అవ్వను. మేము శివబాబాకు దానమిస్తున్నామని ఎప్పుడూ భావించకండి. అలా కాదు, శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మరణించే సమయంలో దానం చేయిస్తారు కదా. కాటికాపరికి అంతా ఇచ్చేస్తారు. మీ వద్ద అసలు ఏముందని? పరమాత్మకు రాయి-రప్పలను దానం చేస్తారు. మీ వద్ద ఉన్న ఇదంతా సమాప్తమవ్వనున్నది. మరణించేందుకు భయపడడం లేదు కదా! తండ్రి అంటారు, ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి మరణించడము మంచిది. 5 వేల సంవత్సరాల క్రితం కూడా దోమల వలె అందరినీ తీసుకువెళ్ళాను. నేను మీకు కాలుడికే కాలుడినైన తండ్రిని కూడా. మిమ్మల్ని అర్ధకల్పము కోసం కాలుడి పంజా నుండి విడిపిస్తాను. అక్కడైతే ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది. శరీరము పాతదైనప్పుడు, దానిని వదిలి కొత్తది తీసుకుంటారు. బాబా వద్దకు వెళ్ళాలని ఇప్పుడు కూడా భావిస్తారు, కావున ఉదయాన్నే లేచి బాబాతో మాట్లాడండి. బాబా, మీదైతే అద్భుతము, మీరు వచ్చి మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారని స్వప్నంలో కూడా అనుకోలేదు. మేమైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉండేవారము. బాబా మీది అద్భుతము. మీ శిక్షణల అనుసారంగా తప్పకుండా నడుచుకుంటాము. ఏ పాప కర్మను చేయము. కామము యొక్క భూతాన్ని మొదట కాలదన్నుతాము. పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయండి. బాబా, మధురమైన బాబా, నేను మీకు సహాయం చేయడానికి హాజరై ఉన్నాను… ఈ విధమైన మాటలను మాట్లాడాల్సి ఉంటుంది. బాబా ఏ విధంగా పురుషార్థం చేస్తారో, అది పిల్లలకు వినిపిస్తారు. బాబా, మేము అశరీరిగా వచ్చాము, ఇప్పుడు గుర్తుకొచ్చింది… ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోయే పురుషార్థం చేయాలి. శివబాబాకు ఎంతోమంది పిల్లలున్నారు. చింత అయితే ఉంటుంది కదా! బ్రహ్మాకు కూడా చింత ఉంటుంది కదా. ఎంతమంది పిల్లలున్నారు, ఎంతగా సంభాళించడం జరుగుతుంది. పిల్లలు పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ మీరు ఈశ్వరీయ ఇంట్లో ఉన్నారు కదా. ఎటువంటి సాంగత్య దోషము లేదు. తండ్రి సమ్ముఖంలో కూర్చుని ఉన్నారు. మీతోనే తింటాను, మీతోనే కూర్చుంటాను… శివబాబా వీరిలోకి వచ్చి బచ్చే, బచ్చే అని అంటారని మీకు తెలుసు. వారు అంటారు, నా ప్రియమైన పిల్లలూ, వికారాల్లోకి ఎప్పుడూ వెళ్ళమని ప్రతిజ్ఞ చేయండి. నాకు పవిత్రత యొక్క సహాయం చేసినట్లయితే భారత్ ను పవిత్రంగా చేస్తాను. పిల్లలు ధైర్యము చేస్తే తండ్రి సహాయం లభిస్తుంది… అన్నది గుర్తుకు రాదా. కల్ప-కల్పము మనము ఇదే వ్యాపారం చేస్తాము, భారత్ ను స్వర్గంగా తయారుచేస్తాము. ఎవరైతే కష్టపడతారో, వారే స్వర్గానికి యజమానులుగా అవుతారు. కాంగ్రెస్ వారు బాపూజీకి ఎంత సహాయం చేసారు, ఇప్పుడు చూడండి, రాజ్యం లభించింది… కానీ రామరాజ్యమైతే తయారవ్వలేదు. రోజురోజుకు ఇంకా తమోప్రధానమవుతూ ఉంటారు. తండ్రి వచ్చి సుఖధామానికి యజమానులుగా చేస్తున్నారు. అర్ధకల్పము మీరు సుఖంగా ఉంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సత్యాతి-సత్యమైన ప్రేయసులుగా అవ్వాలి. బుద్ధియోగాన్ని ఒక్క ప్రియునితో జోడించాలి. బుద్ధి ఇటు-అటు భ్రమించకూడదు, దీని పట్ల అటెన్షన్ పెట్టాలి.

2. ప్రాప్తిని ఎదురుగా పెట్టుకుంటూ, తండ్రిని నిరంతరం స్మృతి చేయాలి. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. భారత్ ను స్వర్గంగా తయారుచేసే వ్యాపారం చేయాలి.

వరదానము:-

మహావీరులు ఎవరైతే ఉంటారో, వారు ఎప్పుడూ ఈ విధంగా సాకులు చెప్పలేరు – పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, సమస్య అటువంటిది, అందుకే ఓడిపోయాము అని. సమస్య యొక్క పని రావడము మరియు మహావీరుల పని సమస్యను సమాధానపరచడము, అంతేకానీ ఓడిపోవడం కాదు. ఎవరైతే సదా నిర్భయులుగా ఉంటూ విజయులుగా అవుతారో, చిన్న-చిన్న విషయాలలో బలహీనంగా అవ్వరో, వారే మహావీరులు. మహావీర విజయీ ఆత్మలు ప్రతి అడుగులో తనువుతో, మనసుతో సంతోషంగా ఉంటారు. వారు ఎప్పుడూ ఉదాసీనులుగా అవ్వరు, వారి వద్దకు దుఃఖం యొక్క అల స్వప్నంలో కూడా రాదు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top