17 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris
16 May 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - పిల్లలైన మిమ్మల్ని తమ సమానంగా మహిమా యోగ్యులుగా చేసేందుకు బాబా వచ్చారు, తండ్రి మహిమ ఏదైతే ఉందో, దానిని ఇప్పుడు మీరు ధారణ చేస్తారు”
ప్రశ్న: -
భక్తి మార్గంలో ప్రియుడైన పరమాత్మను గురించి పూర్తిగా తెలియకపోయినా సరే, ఏ పదంతో చాలా ప్రేమగా పిలుస్తారు మరియు స్మృతి చేస్తారు?
జవాబు:-
ఓ ప్రియతముడా, మీరు వచ్చినప్పుడు, మేము కేవలం మిమ్మల్నే స్మృతి చేస్తాము మరియు అందరి నుండి బుద్ధి యోగాన్ని తెంచి మీతోనే జోడిస్తామని చాలా ప్రేమగా పిలుస్తారు మరియు స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు – పిల్లలూ, నేను వచ్చి ఉన్నాను కనుక దేహీ-అభిమానులుగా అవ్వండి. తండ్రిని ప్రేమగా స్మృతి చేయడము మీ మొదటి బాధ్యత.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. మధురాతి-మధురమైన జీవాత్మలకు, పరమపిత పరమాత్మ (వారిప్పుడు శరీరాన్ని లోన్ గా తీసుకున్నారు) కూర్చొని అర్థం చేయిస్తారు – నేను సాధారణ వృద్ధ తనువులో వస్తాను. వచ్చి చాలా మంది పిల్లలను చదివిస్తాను. బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు. తప్పకుండా నోటి ద్వారానే అర్థం చేయిస్తారు మరియు ఎవరికి అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు – పిల్లలూ, భక్తి మార్గంలో మీరు నన్ను ఓ పతిత-పావనా, అని పిలుస్తూ వచ్చారు. విశేషంగా భారత్ లో మరియు మొత్తం ప్రపంచంలో అందరూ పిలుస్తారు. భారత్ యే పావనంగా ఉండేది, మిగిలినవారంతా శాంతిధామంలో ఉండేవారు. సత్య-త్రేతా యుగాలని వేటిని అంటారు, ద్వాపర-కలియుగాలని వేటినంటారు అనేది పిల్లలు స్మృతిలో ఉంచుకోవాలి. అక్కడ ఎవరెవరు రాజ్యం చేసేవారు అన్న పూర్తి నాలెడ్జ్ మీ బుద్ధిలో ఉంది. ఎలాగైతే తండ్రికి రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానముందో, అదే విధంగా మీ బుద్ధిలో కూడా ఉంది. తండ్రి ఏ జ్ఞానాన్ని అయితే ఇస్తారో, అది పిల్లల్లో కూడా తప్పకుండా ఉండాలి. తండ్రి వచ్చి పిల్లలను తమ సమానంగా తయారుచేస్తారు. తండ్రికి ఎంత మహిమ ఉందో, పిల్లలకు కూడా అంత మహిమ ఉంది. తండ్రి పిల్లలను అధిక మహిమా యోగ్యులుగా తయారుచేసారు. శివబాబా వీరి ద్వారా నేర్పిస్తారని ఎల్లప్పుడూ అనుకోండి. ఆత్మయే ఇతరులతో మాట్లాడుతుంది. కానీ మనుష్యులు దేహాభిమానులుగా ఉన్న కారణంగా ఫలానావారు చదివిస్తున్నారని భావిస్తారు. వాస్తవానికి అంతా చేసేది ఆత్మనే. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. దేహీ-అభిమానులుగా అవ్వాలి. పదే-పదే స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఎప్పటివరకైతే స్వయాన్ని ఆత్మగా భావించరో, అప్పటివరకు తండ్రిని కూడా స్మృతి చేయలేరు, మర్చిపోతూ ఉంటారు. మీరు ఎవరి సంతానం అని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అప్పుడు, మేము శివబాబా సంతానమని అంటారు. విజిటర్ బుక్ లో కూడా, మీ తండ్రి ఎవరు అని వ్రాయబడి ఉంది. అప్పుడు వెంటనే దేహం యొక్క తండ్రి పేరును చెప్తారు. అచ్ఛా, ఇప్పుడు దేహీ (ఆత్మ) తండ్రి పేరు చెప్పండి. అప్పుడు కొందరు కృష్ణుని పేరు, కొందరు హనుమంతుని పేరు వ్రాస్తారు లేదా మాకు తెలియదు అని రాస్తారు. అరే, మీకు లౌకిక తండ్రి గురించి తెలుసు, కానీ ఏ పారలౌకిక తండ్రినైతే మీరు దుఃఖంలో ఎల్లప్పుడూ స్మృతి చేస్తారో, వారి గురించి తెలియదా. ఓ భగవంతుడా, దయ చూపించండి అని కూడా అంటారు. ఓ భగవంతుడా, ఒక బిడ్డను ఇవ్వండి అని అడుగుతారు కదా. ఇప్పుడు తండ్రి పూర్తిగా సహజమైన విషయాన్ని తెలియజేస్తారు. మీరు దేహాభిమానంలో ఎంతగానో ఉంటారు, అందుకే తండ్రి వారసత్వం యొక్క నషా ఎక్కడం లేదు. మీకైతే చాలా నషా ఎక్కాలి. భగవంతుడిని కలుసుకునేందుకే భక్తిని చేస్తారు. యజ్ఞ తపాదులు, దాన-పుణ్యాలు మొదలైనవి చేయడము, ఇదంతా భక్తి. అందరూ ఒక్క భగవంతుడిని స్మృతి చేస్తారు. నేను మీకు పతులకే పతిని, తండ్రులకే తండ్రిని అని బాబా అంటారు. అందరూ తండ్రి అయిన భగవంతుడిని తప్పకుండా స్మృతి చేస్తారు. ఆత్మనే స్మృతి చేస్తుంది. భృకుటి మధ్యలో ప్రకాశించే అద్భుతమైన నక్షత్రము….. అని కూడా అంటారు. కానీ దీని అర్థం తెలియకుండానే అలా అనేస్తారు. రహస్యం గురించి ఏమీ తెలియదు. మీకు ఆత్మ గురించే తెలియనప్పుడు, ఆత్మల తండ్రి గురించి ఎలా తెలుసుకోగలరు. భక్తి మార్గం వారికి సాక్షాత్కారాలైతే జరుగుతాయి. భక్తి మార్గంలో పూజ కోసం పెద్ద-పెద్ద లింగాలను పెడతారు ఎందుకంటే ఒకవేళ బిందు రూపాన్ని చూపించినా సరే, ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇది సూక్ష్మమైన విషయము. ఏ పరమాత్మనైతే అఖండ జ్యోతి స్వరూపుడని అంటారో, వారి రూపం చాలా పెద్దదని మనుష్యులంటారు. బ్రహ్మ సమాజ్ మఠం వారు జ్యోతిని పరమాత్మ అని అంటారు. పరమపిత పరమాత్మ ఒక బిందువని ప్రపంచంలో ఎవరికీ తెలియదు, అందుకే తికమకలో ఉన్నారు. పిల్లలు కూడా అంటారు – బాబా, ఎవరిని స్మృతి చేయాలి. ఇంతకుముందు మేము వారు పెద్ద లింగమని, వారిని ఆ రూపంలో స్మృతి చేయడం జరుగుతుందని విన్నాము, ఇప్పుడు బిందువును ఎలా స్మృతి చేయాలి. అరే, ఆత్మలైన మీరు కూడా బిందువే, తండ్రి కూడా బిందువే. ఆత్మను పిలుస్తారు, వారు తప్పకుండా ఇక్కడే వచ్చి కూర్చుంటారు. భక్తి మార్గంలో సాక్షాత్కారాలు మొదలైనవి ఏవైతే జరుగుతాయో, అదంతా భక్తి. భక్తి కూడా ఒక్కరికే చేయరు, అనేకమందిని భగవంతుడిగా చేసేసారు. ఏ భక్తులైతే భక్తి చేస్తూ ఉంటారో, వారిని భగవంతుడని ఎలా అంటారు. ఒకవేళ పరమాత్మను సర్వవ్యాపి అన్నట్లయితే, మరి ఎవరికి భక్తి చేస్తారు. అది కూడా అనేక రకాల భక్తిని చేస్తారు.
బాబా అర్థం చేయిస్తారు – పిల్లలూ, మేము అనేక సంవత్సరాలు జీవిస్తామని అనుకోకండి. ఇప్పుడు సమయం చాలా సమీపంగా వస్తూ ఉంది. బాబా బ్రహ్మా ద్వారా స్థాపన చేయించనున్నారని నిశ్చయముంచుకోవాలి. తండ్రి స్వయంగా అంటారు – నేను ఇతని ద్వారా మీకు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తెలియజేస్తాను. బ్రహ్మా ద్వారా స్థాపన అని కూడా పాడుతారు. కొత్త ప్రపంచాన్ని విష్ణుపురి అని అంటారని అనగా విష్ణువు యొక్క రెండు రూపాలు రాజ్యం చేసేవారని వారికి తెలియదు. విష్ణువు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఈ బ్రహ్మా-సరస్వతులే మళ్ళీ విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీనారాయణులుగా అయి పాలన చేస్తారని మీకు తెలుసు. బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు, విష్ణుపురి అనగా స్వర్గం యొక్క పాలనను చేస్తారు. తండ్రి జ్ఞానసాగరుడు అని, మనుష్య సృష్టికి బీజరూపుడని మీ బుద్ధిలోకి రావాలి. వారికి ఈ డ్రామా ఆదిమధ్యాంతాలను గురించి తెలుసు. వారే పతిత-పావనుడు, తండ్రి వ్యాపారం ఏదైతే ఉందో, అదే మీ వ్యాపారము. మీరు కూడా పతితుల నుండి పావనులుగా చేస్తారు. ప్రపంచంలో ఒక తండ్రికి ముగ్గురు లేక నలుగురు పిల్లలుంటారు. అందులో ఒక బిడ్డ చాలా ఉన్నతమైన స్థానాన్ని పొంది ఉంటారు, ఒకరు పూర్తిగా కింద ఉంటారు. మీరు పతితులను పావనంగా చేయండి అని తండ్రి మీకు ఇక్కడ ఒకే వ్యాపారాన్ని నేర్పిస్తారు. నన్ను స్మృతి చేయండి అని శివబాబా చెప్తున్నారని అందరికీ ఇదే లక్ష్యాన్ని ఇవ్వండి. గీతలో కృష్ణ భగవానువాచ అని తప్పుగా రాసారు. భగవంతుడు అయితే నిరాకారుడు, పునర్జన్మ రహితుడని మీరు అర్థం చేయించాలి. కేవలం ఈ పొరపాటే జరిగింది. ఇప్పుడు పిల్లలైన మీరు కృష్ణపురికి యజమానులుగా అవుతున్నారు. కొందరు రాజధానిలోకి వస్తారు, కొందరు ప్రజల్లోకి వస్తారు. దానిని కృష్ణపురి అని అంటారు ఎందుకంటే కృష్ణుడు అందరికీ చాలా ప్రియమైనవారు. పిల్లలు ప్రియమనిపిస్తారు కదా. పిల్లలకు కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉంటుంది. తర్వాత ప్రేమ అంతా చెదిరిపోతుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు – మీరు స్వయాన్ని శరీరముగా భావించకండి. పదే-పదే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మాభిమానులుగా అవ్వండి. తండ్రి కూడా నిరాకారుడు. మీకు అర్థం చేయించేందుకు, ఇక్కడ శరీరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. శరీరం లేకుండా అర్థం చేయించలేరు. మీకైతే మీ శరీరముంది, తండ్రి లోన్ తీసుకుంటారు. ఇకపోతే ఇందులో ప్రేరణ మొదలైన విషయాలేవీ లేవు. తండ్రి స్వయంగా అంటారు – నేను ఈ శరీరాన్ని ధారణ చేసి పిల్లలను చదివిస్తాను ఎందుకంటే తమోప్రధానమైన మీ ఆత్మను ఇప్పుడు సతోప్రధానంగా చేయాలి. పతితపావనా రండి అని పాడుతారు కూడా కానీ అర్థం తెలుసుకోరు. తండ్రి ఎలా వచ్చి పావనంగా చేస్తారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగంలో కేవలం మనదే ఒక చిన్న వృక్షం ఉంటుందని కూడా మీకు తెలుసు. మీరు స్వర్గంలోకి వెళ్తారు. ఇకపోతే ఈ మిగతా ఖండాలన్నింటి నామ రూపాలు కూడా మిగలవు. భారత ఖండమే స్వర్గంగా అవుతుంది. పరమపిత పరమాత్మయే వచ్చి, హెవెన్ ను స్థాపన చేస్తారు. ఇప్పుడిది నరకము. ప్రాచీన భారత ఖండంలోనే దేవతల రాజ్యముండేది, ఇప్పుడది లేదు. ఇక్కడ వారి మందిరాలు, చిత్రాలు ఉన్నాయి. కనుక ఇది భారత్ కు మాత్రమే సంబంధించిన విషయము. భారత్ స్వర్గంగా ఉండేదని, ఈ లక్ష్మీనారాయణులు యజమానులుగా ఉండేవారని, అప్పుడు ఇంకే ఖండమూ ఉండేది కాదని భారతవాసులెవరి బుద్ధిలోకి రాదు. ఇప్పుడైతే అనేక ధర్మాలు వచ్చేసాయి. భారతవాసులు ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిపోయారు. కృష్ణుడిని శ్యామసుందరుడని అంటారు కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. నిజంగా వారు శ్యామంగా (నల్లగా) ఉండేవారు కదా. కృష్ణుడిని పాము కాటేసింది కనుక నల్లగా అయిపోయారని అంటారు. వారు సత్యయుగ రాకుమారుడిగా ఉండేవారు, నల్లగా ఎలా అయ్యారు, ఇప్పుడు మీరు ఈ విషయాలను అర్థం చేసుకున్నారు. కృష్ణుని తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు. తల్లిదండ్రుల కన్నా శ్రీకృష్ణుడే ఉత్తమునిగా గాయనం చేయబడ్డారు. వారి తల్లిదండ్రులకు మహిమ ఏమీ లేదు. లేదంటే ఏ తల్లిదండ్రులకైతే ఇటువంటి బిడ్డ జన్మించారో, ఆ తల్లిదండ్రులు కూడా ప్రియంగా ఉండాలి. కానీ అలా లేదు, మహిమ అంతా రాధా-కృష్ణులకే ఉన్నది. తల్లిదండ్రులకు ఏ మహిమ లేదు. మీ బుద్ధిలో జ్ఞానముంది. జ్ఞానము పగలు, భక్తి రాత్రి. అంధకారమయమైన రాత్రిలో ఎదరుదెబ్బలు తింటూ ఉంటారు.
ఇంట్లో ఉండండి, ఈ సేవను కూడా చేస్తూ ఉండండి అని ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఒక్క ప్రియునికి, మీరు అర్ధకల్పపు ప్రేయసులు అని ఎవరికైనా సరే అర్థం చేయించండి. భక్తి మార్గంలో అందరూ వారిని స్మృతి చేస్తారు కనుక ప్రేయసులు అయినట్లు కదా. కానీ ప్రియుని గురించి పూర్తిగా తెలియదు. ఓ ప్రియతముడా, మీరు వచ్చినప్పుడు, మేము కేవలం మిమ్మల్నే స్మృతి చేస్తాము మరియు అందరి నుండి బుద్ధియోగాన్ని తెంచి మీతో జోడిస్తామని చాలా ప్రేమగా స్మృతి చేస్తారు. ఇంతకుముందు ఇలాగే పాడేవారు కదా, కానీ మనకు తండ్రి నుండి ఏ వారసత్వం లభిస్తుంది అనేది ఎవరికీ తెలియదు. మీరు దేహీ-అభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయడమనేది పిల్లలైన మీ మొదటి బాధ్యత. కొడుకు ఎప్పుడూ తండ్రిని, కూతురు ఎప్పుడూ తల్లిని స్మృతి చేస్తారు. తోటివారు కదా. నేను తండ్రికి వారసుడినవుతానని కొడుకు భావిస్తారు. కూతురు అలా అనరు, నేను పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళాల్సి ఉంటుందని భావిస్తారు. ఇప్పుడు మీకు నిరాకార పుట్టినిల్లు మరియు సాకార పుట్టినిల్లు ఉన్నాయి. ఓ పరమపిత పరమాత్మ, దయ చూపించండి, దుఃఖాన్ని హరించండి, సుఖాన్నివ్వండి, మమ్మల్ని విముక్తి చేయండి, మాకు మార్గదర్శకులుగా అవ్వండి అని పిలుస్తారు కూడా. కానీ దీని అర్థం పెద్ద-పెద్ద విద్వాంసులు, ఆచార్యులకు కూడా తెలియదు. తండ్రి అయితే సర్వుల ముక్తిదాత, వారే అందరి కళ్యాణకారి. ఇకపోతే మనుష్యులు తమ కళ్యాణమే చేసుకోలేనప్పుడు, ఇతరులకేమి చేస్తారు. ఇక్కడ తండ్రి అంటారు – నేను గుప్తంగా వస్తాను, ఖుదా-దోస్త్ కథను విన్నారు కదా. ఇప్పుడిది కలియుగం మరియు సత్యయుగం మధ్యనున్న వంతెన, అటువైపుకు వెళ్ళాలి. ఇప్పుడు ఖుదా అయితే తండ్రి, స్నేహితుడు కూడా. తల్లి, తండ్రి, శిక్షకుని పాత్రను కూడా అభినయిస్తారు. ఇక్కడ మీకు సాక్షాత్కారాలు జరిగినట్లయితే, ఇంద్రజాలం-ఇంద్రజాలం అని అంటారు. సాక్షాత్కారాలైతే నవ విధ భక్తి చేసేవారికి కూడా జరుగుతాయి, చాలా తీవ్రమైన భక్తులుంటారు. దర్శనమివ్వకపోతే మేము శిరస్సును ఖండించుకుంటామని అంటారు, అప్పుడు సాక్షాత్కారం జరుగుతుంది, వారిది నవ విధ భక్తి అని అంటారు. ఇక్కడ నవ విధ భక్తి విషయము లేదు. ఇంట్లో కూర్చొని ఉండగానే, చాలామందికి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. దివ్యదృష్టి తాళంచెవి నా వద్ద ఉంది. అర్జునుడికి కూడా నేను దివ్యదృష్టినిచ్చాను కదా – ఈ వినాశనాన్ని చూడు, నీ రాజ్యాన్ని చూడు, ఇప్పుడు నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే ఈ విధంగా తయారవుతావు అని చెప్పారు. విష్ణువు ఎవరు అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వయంగా మందిరాలను నిర్మించేవారికి ఈ విషయం తెలియదు. విష్ణువు ద్వారా పాలన జరుగుతుంది. నాలుగు భుజాల అర్థము – రెండు భుజాలు పురుషునివి, రెండు స్త్రీవి. విష్ణువు యొక్క రెండు రూపాలు లక్ష్మీనారాయణులు. కానీ వారేమీ అర్థం చేసుకోరు. ఎవరి గురించిన జ్ఞానము లేదు. శివబాబా గురించి గాని, విష్ణువు గురించి గాని జ్ఞానం లేదు. మొదట్లో బాబా ఆకర్షణ ఉండేది, చాలామంది వచ్చేవారు. ప్రారంభంలో పూర్తి ప్రాంగణమంతా నిండిపోయేది. జడ్జి, మెజిస్ట్రేట్ అందరూ వచ్చేవారు. తర్వాత వికారాల గురించి గొడవలు ప్రారంభమయ్యాయి. పిల్లలు జన్మించకపోతే సృష్టి ఎలా నడుస్తుందని, ఇది సృష్టి వృద్ధి చెందే నియమము అని అనడం మొదలుపెట్టారు. భగవానువాచ – కామం మహాశత్రువు అని, దానిపై విజయం పొందాలి అని గీతలో ఉన్న విషయాలను మర్చిపోయారు. స్త్రీ-పురుషులిరువురూ కలిసి వచ్చినట్లయితే, వారికి జ్ఞానాన్నివ్వండి, కేవలం ఒక్కరికైతే ఇవ్వకండి అని అనడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇరువురూ వచ్చినట్లయితే, ఇవ్వాలి కదా. చూడండి, ఇరువురికీ కలిపి ఇచ్చినా సరే, కొందరు జ్ఞానాన్ని తీసుకుంటారు, కొందరు తీసుకోరు. భాగ్యంలో లేకపోతే ఏమి చేయగలరు. ఒకరు హంసగా, ఒకరు కొంగగా అయిపోతారు. ఇక్కడ బ్రాహ్మణులైన మీరు దేవతల కన్నా ఉత్తమమైనవారు. మేము ఈశ్వరీయ సంతానమని, శివబాబా సంతానమని మీకు తెలుసు. అక్కడ స్వర్గంలో మీకు ఈ జ్ఞానముండదు. అలాగే నిరాకారీ ప్రపంచమైన ముక్తిధామంలో ఉన్నప్పుడు కూడా ఈ జ్ఞానముండదు. ఈ జ్ఞానం శరీరంతో పాటే సమాప్తమైపోతుంది. ఒక్క బాబా చదివిస్తున్నారని ఇప్పుడు మీకు జ్ఞానముంది. ఇప్పుడు ఈ ఆట పూర్తవుతుంది, పాత్రధారులందరూ హాజరై ఉన్నారు. బాబా కూడా వచ్చారు. ఇంకా మిగిలి ఉన్న ఆత్మలు కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అందరూ వచ్చేస్తారో, అప్పుడు వినాశనమవుతుంది, తర్వాత తండ్రి అందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు. అందరూ వెళ్ళాల్సిందే, ఈ పతిత ప్రపంచ వినాశనం జరగనున్నది. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పతితులను పావనంగా చేసే తండ్రి వ్యాపారం ఏదైతే ఉందో, ఆ వ్యాపారాన్నే చేయాలి. తండ్రిని స్మృతి చేయండి మరియు పావనంగా అవ్వండి అనే లక్ష్యాన్ని అందరికీ ఇవ్వాలి.
2. ఈ బ్రాహ్మణ జీవితం దేవతల కన్నా కూడా ఉత్తమమైన జీవితం, ఈ నషాలో ఉండాలి. అందరి నుండి బుద్ధియోగాన్ని తెంచి ఒక్క ప్రియుడిని స్మృతి చేయాలి.
వరదానము:-
శక్తి స్వరూపంగా అయ్యేందుకు ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేయండి. తమ దేహం పట్ల గాని, సంబంధాల పట్ల గాని, పదార్థం పట్ల గాని, ఎక్కడైనా ఆసక్తి ఉన్నట్లయితే, మాయ కూడా రాగలదు మరియు మీరు శక్తి రూపంగా అవ్వలేరు. అందుకే ముందు అనాసక్తులుగా అవ్వండి, అప్పుడు మాయ విఘ్నాలను ఎదుర్కోగలరు. విఘ్నాలు వచ్చినప్పుడు, ఆర్తనాదాలు చేసేందుకు బదులుగా లేదా భయపడేందుకు బదులుగా శక్తి రూపాన్ని ధారణ చేసినట్లయితే, విఘ్న వినాశకులుగా అయిపోతారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!