17 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris

17 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

16 July 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - జ్ఞాన సాగరుడైన తండ్రి మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చేందుకు వచ్చారు, దీని ద్వారా ఆత్మ జ్యోతి వెలుగుతుంది”

ప్రశ్న: -

తండ్రిని కరన్-కరావన్హార్ (చేసేవారు చేయించేవారు) అని ఎందుకు అనడం జరిగింది? వారు ఏమి చేస్తారు మరియు ఏమి చేయిస్తారు?

జవాబు:-

తండ్రి అంటారు – నేను పిల్లలైన మీకు మురళీ వినిపించే కార్యం చేస్తాను. మురళీ వినిపిస్తాను, మంత్రాన్ని ఇస్తాను, మిమ్మల్ని యోగ్యులుగా చేస్తాను మరియు మీ ద్వారా స్వర్గం యొక్క ప్రారంభోత్సవాన్ని చేయిస్తాను. మీరు సందేశకులుగా అయి అందరికీ సందేశాన్ని ఇస్తారు. నేను పిల్లలైన మీకు డైరెక్షన్ ఇస్తాను, ఇదే నా కృప మరియు ఆశీర్వాదము.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఈ రోజు ఉదయాన్నే ఎవరు వచ్చారు….. (కౌన్ ఆజ్ ఆయా సవేరే-సవేరే…..)

ఓంశాంతి. పిల్లలు పాట విన్నారు. మన జ్ఞానము యొక్క మూడవ నేత్రం పూర్తిగా తెరుచుకునేందుకు పిల్లలైన మనల్ని ఉదయాన్నే మేల్కొల్పడానికి ఎవరు వచ్చారు? జ్ఞానసాగరుడైన పరమపిత పరమాత్మ ద్వారా మన జ్ఞానం యొక్క మూడవ నేత్రం తెరుచుకుంది. తండ్రిని జ్యోతి వెలిగించేవారని కూడా అంటారు. కానీ వారు తండ్రి అన్న విషయం ఎవరికీ తెలియదు. వారు దీపమని, జ్యోతి అని బ్రహ్మ-సమాజం వారంటారు. మందిరాలలో ఎప్పుడూ జ్యోతినే వెలిగిస్తారు, ఎందుకంటే వారు పరమాత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు, అందుకే అక్కడ మందిరాలలో జ్యోతిని వెలిగిస్తూనే ఉంటారు. ఇప్పుడు తండ్రి అగ్గిపుల్లలతో జ్యోతిని వెలిగించరు. ఈ విషయం పూర్తిగా అతీతమైనది. ఈశ్వరుని గతి-మతి అతీతమైనవని అంటూ ఉంటారు. తండ్రి సద్గతినిచ్చేందుకు వచ్చి జ్ఞాన-యోగాలను నేర్పిస్తారని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. నేర్పించేవారు తప్పకుండా కావాలి కదా. శరీరమైతే నేర్పించదు. అంతా ఆత్మనే చేస్తుంది. ఆత్మలోనే మంచి-చెడు సంస్కారాలుంటాయి. ఈ సమయంలో రావణుడు ప్రవేశించిన కారణంగా మనుష్యుల సంస్కారాలు కూడా చెడుగా ఉన్నాయి అనగా 5 వికారాలు ప్రవేశించి ఉన్నాయి. దేవతల్లో ఈ 5 వికారాలుండవు. భారత్ లో దైవీ స్వరాజ్యం ఉన్నప్పుడు ఈ చెడు సంస్కారాలు ఉండేవి కావు. సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు, దేవీ-దేవతల సంస్కారాలు ఎంత బాగుండేవి, వాటిని ఇప్పుడు మీరు ధారణ చేస్తున్నారు. తండ్రియే వచ్చి క్షణంలో సర్వులకు సద్గతినిస్తారు. ఇకపోతే గురువులు-సత్పురుషులు మొదలైనవారు భక్తి మార్గంలో ఉన్న వారు, వారు ఒక్కరికి కూడా గతి-సద్గతిని ఇవ్వలేరు. తండ్రి రావడంతోనే సర్వుల సద్గతి జరుగుతుంది. పతిత ప్రపంచాన్ని వినాశనం చేసి, పావన ప్రపంచ ప్రారంభోత్సవాన్ని చేయమని మరియు ద్వారాలు తెరవమని పరమపిత పరమాత్మను పిలుస్తారు. తండ్రి వచ్చి శివశక్తి మాతల ద్వారా గేటు తెరిపిస్తారు. వందే మాతరం అని గాయనం చేయబడింది. ఈ సమయంలోని మాతలెవరికీ వందనం చేయడం జరగదు ఎందుకంటే ఎవరూ శ్రేష్ఠాచారి మాతలుగా లేరు. యోగబలంతో జన్మించినవారిని శ్రేష్ఠాచారులని అంటారు. లక్ష్మీనారాయణులను శ్రేష్ఠాచారులని అంటారు. భారత్ లో దేవీ-దేవతలు ఉన్నప్పుడు భారత్ శ్రేష్ఠాచారిగా ఉండేది. ఈ విషయాల గురించి మనుష్యులకు అసలు తెలియదు. వారు తమ-తమ ప్లాన్లు తయారుచేసుకుంటున్నారు. గాంధీ కూడా రామ రాజ్యాన్ని కోరుకునేవారు, దీని ద్వారా ఇది రావణ రాజ్యమని ఋజువవుతుంది. భారత్ పతితంగా ఉంది. కానీ రామ రాజ్యాన్ని స్థాపించేందుకు అనంతమైన బాపూజీ కావాలి, వారు రామ రాజ్యాన్ని స్థాపన చేసి, రావణ రాజ్యాన్ని వినాశనం చేస్తారు. ఇప్పుడు రావణ రాజ్యానికి నిప్పు అంటుకోనున్నదని పిల్లలకు తెలుసు. ఆత్మలందరూ అజ్ఞాన అంధకారంలో నిద్రిస్తున్నారు. మనం కూడా నిద్రపోతూ ఉండేవారము, తండ్రి వచ్చి మేల్కొల్పారని మీకు తెలుసు. భక్తి యొక్క రాత్రి పూర్తయ్యి, పగలు మొదలవుతుంది. రాత్రి పూర్తయ్యి ఇప్పుడు పగలు వస్తుంది. తండ్రి సంగమంలో వచ్చి ఉన్నారు. పిల్లలకు దివ్య దృష్టి మరియు జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని ఇస్తారు, దీని ద్వారా మీరు మొత్తం విశ్వాన్ని తెలుసుకున్నారు. ఇది తయారై తయారవుతున్న అవినాశీ డ్రామా అని, ఇది తిరుగుతూనే ఉంటుందని మీ బుద్ధిలో కూర్చొంది. ఇప్పుడు మీరు ఎంతగా మేల్కొన్నారు, ప్రపంచమంతా నిద్రిస్తూ ఉంది.

ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం విశ్వం యొక్క ఆదిమధ్యాంతాలు, మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం గురించి తెలుసు. మిగిలిన ప్రపంచమంతా కుంభకర్ణుని అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉంది. పతితపావనుడు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఓ పతితపావనా రండి, అని పిలుస్తారు. మీరు వచ్చి సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించండి అని ఎవరూ అనరు. మీరు ఈ సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారానే చక్రవర్తి రాజులుగా అవుతారని తండ్రి అంటారు. స్మృతితోనే పావనంగా అవుతారు. వినాశనం ఎదురుగా నిలబడి ఉందని, యుద్ధం కూడా జరగనున్నదని మీకు తెలుసు. ఇకపోతే కౌరవులకు, పాండవులకు యుద్ధం జరగలేదు. పాండవులు ఎవరు అనేది కూడా ఎవరికీ తెలియదు. సైన్యం మొదలైనవాటి విషయమేమీ లేదు. మీ వైపు సాక్షాత్తు పారలౌకిక పరమపిత ఉన్నారు. ఆ తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది. కృష్ణుని ఆత్మ 84 జన్మలను అనుభవించి, ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటుందని మీరు తెలుసుకున్నారు. ప్రపంచ చరిత్ర-భూగోళాలు రిపీట్ అవుతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు వినాశనం కన్నా ముందే తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. భగవానువాచ – గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి అని కూడా గాయనం చేయడం జరిగింది. పాస్ట్ ఈజ్ పాస్ట్ (గతం గతః). ఇది డ్రామాలో నిశ్చయించబడి ఉంది. సృష్టి సతోప్రధానంగా అవ్వాల్సిందే, ఇది డ్రామా యొక్క రాత. ఇది ఈశ్వరుని రాత కాదు, డ్రామా రాత ఈ విధంగా నిశ్చితమై ఉంది. ఇప్పుడిది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. అర్ధకల్పం పూర్తయినప్పుడు తండ్రి వస్తారు. రాత్రి పూర్తయ్యి పగలు ప్రారంభమైనప్పుడే నేను వస్తానని తండ్రి అంటారు. శివరాత్రి అని కూడా అంటారు కదా. శివుని పూజారులు శివరాత్రిని నమ్ముతారు. గవర్నమెంట్ అయితే సెలవును కూడా రద్దు చేసింది. లేకపోతే తక్కువలో తక్కువ ఒక నెల అయినా సెలవులు ఉండాలి. శివబాబా సర్వులకు సద్గతినిచ్చేవారని, వారే సర్వుల దుఃఖహర్త-సుఖకర్త అని ఎవరికీ తెలియదు. వారి జయంతిని అన్ని ధర్మాలవారు చాలా ఘనంగా ఒక నెలంతా జరుపుకోవాలి. తండ్రి విశేషంగా భారత్ కు డైరెక్టుగా వచ్చి సద్గతినిస్తారు. భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు దేవీ-దేవతల రాజ్యముండేది, ఆ సమయంలో ఇతర ధర్మాలేవీ ఉండేవి కాదు, దేవతలు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. విభజనలు మొదలైనవేవీ ఉండేవి కాదు, అందుకే స్థిరమైన, అఖండమైన, సుఖ-శాంతి-సంపత్తుల దైవీ రాజ్యాన్ని మేము మళ్ళీ పొందుతున్నామని అంటారు. 5 వేల సంవత్సరాల క్రితం కూడా అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభించింది. సూర్యవంశ, చంద్రవంశ రాజ్యాలలో దుఃఖం అన్న పేరే లేదు. రాముని రాజ్యంలో ప్రజలు కూడా షావుకారులే మరియు ఆ నగరంలో అందరూ దాతలే కాబట్టి ధర్మానికి సదా ఉపకారం జరుగుతుంది….. అక్కడ అధర్మమనే మాటేమీ ఉండదని గాయనం చేయడం జరుగుతుంది. బాబా మీకు, బ్రహ్మా మరియు విష్ణువుకు పరస్పరంలో కల సంబంధం ఏమిటి అనేది కూడా అర్థం చేయించారు. బ్రహ్మా నాభి ద్వారా విష్ణువు వెలువడినట్లుగా….. ఎంత అద్భుతమైన చిత్రాన్ని తయారుచేసారు. ఈ లక్ష్మీనారాయణులే చివర్లో బ్రహ్మా-సరస్వతులుగా, జగదంబ-జగత్పితలుగా అవుతారని తండ్రి అర్థం చేయిస్తారు. వీరిద్దరు మళ్ళీ విష్ణువుగా అనగా లక్ష్మీనారాయణులుగా అవుతారు. మీరు చూసే చిత్రాలేవీ యథార్థమైనవి కావు అని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. శివునికి పెద్ద చిత్రాన్ని తయారుచేస్తారు, అది కూడా అయథార్థమైనదే. భక్తి కారణంగా పెద్దదిగా తయారుచేసారు. లేదంటే బిందువుకు పూజ ఎలా జరుగుతుంది? అచ్ఛా, బ్రహ్మా-విష్ణు-శంకరుల గురించి కూడా అర్థం చేసుకోలేరు. త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు. బ్రహ్మా ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన….. అని కూడా అంటారు కానీ బ్రహ్మా అయితే స్థాపన చేయరు. స్వర్గ స్థాపన బ్రహ్మా చేస్తారా? చేయరు. స్వర్గాన్ని స్థాపన పరమపిత పరమాత్మయే చేస్తారు. వీరి ఆత్మ పతితంగా ఉంది, వీరిని వ్యక్త బ్రహ్మా అని అంటారు. ఈ ఆత్మయే పావనంగా అవుతుంది మరియు వెళ్ళిపోతుంది. తర్వాత సత్యయుగంలోకి వెళ్ళి నారాయణునిగా అవుతుంది. కావున ప్రజాపిత బ్రహ్మా తప్పకుండా ఇక్కడే కావాలి కదా. అక్కడ ఉన్నట్లుగా చిత్రంలో చూపించారు. వాస్తవానికి జ్ఞానం యొక్క ఈ అలంకారాలు మీవి, కానీ విష్ణువుకు చూపించారు. నవ విధ భక్తిలో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. మీరా పేరు కూడా గాయనం చేయబడింది కదా. పురుషులలో నంబర్ వన్ భక్తుడు నారదుడు. మాతలలో మీరా గాయనం చేయబడ్డారు. మీరిప్పుడు నారాయణుడిని లేక లక్ష్మిని వరించేందుకు ఈ జ్ఞానాన్ని వింటున్నారు. మీకే స్వయంవరం జరుగుతుంది. సభలోకి వచ్చి, నేను లక్ష్మిని వరించవచ్చా అని అడిగినట్లుగా నారదుని గురించి కూడా చూపిస్తారు. ఇప్పుడు మీరు లక్ష్మిని వరించేందుకు యోగ్యులుగా అవుతున్నారు. ఇకపోతే, అవన్నీ భక్తి మార్గపు కథలు. తండ్రి కూర్చుని వాస్తవిక విషయాలను అర్థం చేయిస్తారు. లక్ష్మి సత్యయుగంలో, భక్తుడైన నారదుడు ద్వాపరంలో ఉంటారు. సత్యయుగంలోకి నారదుడు ఎక్కడ నుండి వస్తాడు? రాధా-కృష్ణులకే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులనే పేర్లు పెడతారు. ఈ విషయం కూడా భారతవాసులకు తెలియదు. ఎంతటి అజ్ఞాన అంధకారముంది. తండ్రి కళ్యాణకారి. మిమ్మల్ని కూడా కళ్యాణకారులుగా తయారుచేస్తారు. ఇతరులకు కూడా ఎలా అర్థం చేయించాలని ఇప్పుడు విచార సాగర మథనం చేయాలి. చిత్రాలు మొదలైనవి ఎలా తయారుచేయబడ్డాయి అనేది ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. గాంధీ నాభి నుండి నెహ్రూ వెలువడినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు దేవత అయిన ఆ విష్ణువు ఎక్కడ, ఈ మనుష్యులెక్కడ….. ఇప్పుడు ఈ విషయాలన్నింటి గురించి పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. మీకు నంబరువారుగా సంతోషం ఉంటుంది. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఇది ఎప్పుడూ వినలేదు, ఎందుకంటే గీతలో కృష్ణ భగవానువాచ అని రాసేసారు. భగవంతుడు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వచ్చి గీతను వినిపించారు, దీనికి సంబంధించిన తిథి-తారీఖులు ఏమీ లేవు. కల్పం ఆయువును లక్షల సంవత్సరాలని చెప్తారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోకీ రావు. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. బ్రాహ్మణుల వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. వృద్ధి చెందుతూ-చెందుతూ లెక్కలేనంతమంది అవుతారు. వర్ణాలు ఎలా చక్రం తిరుగుతాయి అనేది పిల్లలైన మీకు తెలుసు. మన బ్రాహ్మణుల వర్ణం అన్నింటికన్నా ఉన్నతమైనది. మనం భారత్ యొక్క గుప్తమైన, సత్యమైన ఆత్మిక సమాజ సేవకులము. పరమపిత పరమాత్మ మన ద్వారా సేవ చేయిస్తున్నారు. మనం ఆత్మిక సేవ చేస్తాము, వారు దైహిక సేవ చేస్తారు. మీరు భారత్ కు ఏమి సేవ చేస్తారని మిమ్మల్ని అడుగుతారు? మేము ఆత్మిక సేవాధారులము అని చెప్పండి. మా ద్వారా స్వర్గాన్ని ప్రారంభోత్సవం చేయిస్తున్నారని, స్థాపన చేయిస్తున్నారని చెప్పండి. శివబాబా చేసేవారు చేయించేవారు. ఎవరైతే చేయిస్తున్నారో, వారు చేస్తారు కూడా. మురళీని ఎవరు వినిపిస్తారు? అంటే, వారు కర్మ చేస్తున్నట్లు. మురళీని ఇలా వినిపించండని మీకు కూడా నేర్పిస్తారు. ‘మన్మనాభవ’ అనే మహామంత్రాన్ని ఇస్తారు. కర్మను నేర్పించారు కదా. తర్వాత ఇతరులకు నేర్పించండి అని మీతో అంటారు. అందుకే చేసేవారు చేయించేవారని అంటారు. పిల్లలైన మీరు కూడా ఇదే శిక్షణ ఇస్తారు. తండ్రిని స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని కూడా స్మృతి చేయండి. పిల్లలైన మీరు ఈ సందేశాన్ని అందించాలి. అలాగని ఇతరులకు సందేశాన్నిచ్చి, స్వయం స్మృతిలో లేకపోతే ఏమవుతుంది? ఇతరులు పురుషార్థం చేసి పైకి వెళ్ళిపోతారు, సందేశాన్ని ఇచ్చినవారు ఉండిపోతారు. స్మృతి యొక్క పురుషార్థం చేయకపోతే అంత ఉన్నతమైన పదవిని పొందలేరు. రెండు – స్మృతియాత్రతో పావనంగా అవుతారు. బాబా బంధనంలో ఉన్నవారి ఉదాహరణ ఇస్తారు. వారు స్మృతిలో ఎక్కువగా ఉంటారు. బాబాను చూడకపోయినా సరే, ఉత్తరం రాస్తారు – బాబా, మేము మీవారిగా అయిపోయాము, మేము పవిత్రంగా తప్పకుండా ఉంటాము. పిల్లలైన మీకు తండ్రి పట్ల ప్రీతి బుద్ధి ఉంది. మీ మాలయే తయారుచేయబడింది. విష్ణు మాల మరియు రుద్రాక్ష మాలలో పైన జంటపూస ఉంటుంది. మాలను చేతిలోకి తీసుకోగానే ముందు పుష్పము మరియు రెండు పూసలు చేతికి వస్తాయి, వాటికి నమస్కరిస్తారు. తర్వాత మిగతా మాల ఉంటుంది. మీరు భారత్ ను స్వర్గంగా తయారుచేస్తున్నారు కనుక ఈ మాల మీ స్మృతిచిహ్నమే. తండ్రి ఈ గీతా జ్ఞాన యజ్ఞాన్ని రచించారు, ఇందులో ఈ పాత ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది. తండ్రి అతి ప్రియమైన ఫాదర్. మీకు భవిష్య 21 జన్మల కోసం సదా సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. ఎవరైతే కల్పక్రితం వారసత్వాన్ని తీసుకున్నారో, వారు తప్పకుండా డ్రామా ప్లాను అనుసారంగా వస్తారు. తండ్రి అంటారు – పిల్లలూ, సుఖధామానికి వెళ్ళాలంటే పవిత్రంగా అవ్వాలి. నన్ను స్మృతి చేయండి. కృప చూపించండి లేక సహాయం చేయండి అని అడగకూడదు. నేను అందరికీ సహాయం చేస్తాను. పురుషార్థమైతే మీరు చేయాలి. ఇక్కడ ఆశీర్వాదాల విషయమేమీ లేదు. నన్నొక్కడినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. స్మృతి చేయడం మీ పని. డైరెక్షన్ ఇవ్వడమే కృప చూపించడము. ఇకపోతే తినండి, తాగండి, తిరగండి….. మీరు పవిత్ర భోజనాన్నే తినాలి. మనం దేవీ-దేవతలుగా అవుతాము, అక్కడ ఉల్లిపాయలు మొదలైనవి ఉండవు. అవన్నీ ఇక్కడే వదిలేయాలి. ఈ వస్తువులు అక్కడ ఉండవు. ఆ విత్తనాలే ఉండవు. సత్యయుగంలో అనారోగ్యాలు మొదలైనవి ఉండవు. ఇప్పుడు ఎన్ని అనారోగ్యాలు వచ్చాయో చూడండి. అక్కడ తమోగుణీ వస్తువేదీ ఉండదు. ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. ఇక్కడ మనుష్యులు ఏమేమి తింటున్నారో చూడండి. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు – నన్ను స్మృతి చేయండి, ఇతర సాంగత్యాలను వదిలి నాతో సాంగత్యాన్ని జోడించినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పాస్ట్ ఈజ్ పాస్ట్ (గతం గతః), గతించిపోయిన దానిని మరచి గృహస్థ వ్యవహారంలో ఉంటూ, సతోప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి. వినాశనానికి ముందే తప్పకుండా పావనంగా అవ్వాలి.

2. భారత్ ను స్వర్గంగా చేసే సత్యాతి-సత్యమైన సేవలో తత్పరులై ఉండాలి. ఆహార-పానీయాలను చాలా శుద్ధంగా ఉంచుకోవాలి. పవిత్ర భోజనాన్నే తినాలి.

వరదానము:-

ఆత్మిక గులాబి పుష్పాలు తమ ఆత్మిక వృత్తి ద్వారా, ఆత్మికత యొక్క సుగంధాన్ని దూర-దూరాల వరకు వ్యాపింపజేస్తారు. వారి దృష్టిలో సదా సుప్రీమ్ రూహ్ (పరమ ఆత్మ) ఇమిడి ఉంటారు. వారు సదా ఆత్మనే చూస్తూ, ఆత్మతోనే మాట్లాడుతారు. నేను ఆత్మను, సదా పరమ ఆత్మ ఛత్రఛాయలో నడుస్తున్నాను, ఆత్మనైన నాతో చేయించేవారు పరమ ఆత్మ – ఈ విధంగా ప్రతి సెకండు ప్రభువును హాజరై ఉన్నట్లుగా అనుభవం చేసేవారు, సదా ఆత్మిక సుగంధంలో అవినాశీగా మరియు ఏకరసంగా ఉంటారు. ఇదే ఆత్మిక సేవాధారుల నంబర్ వన్ విశేషత.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top