17 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
16 January 2022
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - ప్రేమగా మురళీని వినండి మరియు వినిపించండి, జ్ఞాన రత్నాలతో తమ జోలిని నింపుకోండి, అప్పుడు భవిష్యత్తులో రాజ్యాధికారులుగా అవుతారు’’
ప్రశ్న: -
శివబాబాను భోళానాథుడు అని ఎందుకు అన్నారు?
జవాబు:-
ఎందుకంటే శివబాబా పిల్లలందరి దుర్భాగ్యాన్ని ఒక్క సెకెండులో సరి చేస్తారు. జనక మహారాజుకు సెకెండులో జీవన్ముక్తి లభించింది అని కూడా అంటారు, అది ఒక్క జనకుని విషయం కాదు, మీ అందరికీ తండ్రి ఒక్క సెకెండులో జీవన్ముక్తిని ఇచ్చేస్తారు. భారత్ యొక్క దుర్భాగ్యాన్ని సరి చేస్తారు. దుఃఖితులైన పిల్లలను సదా కోసం సుఖమయంగా చేస్తారు, అందుకే వారిని అందరూ భోళానాథుడు అని అంటూ గుర్తు చేసుకుంటారు. శంకరుడిని భోళానాథుడు అని అనరు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
భోళానాథుని కన్నా అతీతమైనవారు ఎవరూ లేరు..
ఓంశాంతి. పిల్లలకు భోళానాథుడైన తండ్రి యొక్క మొట్టమొదటి డైరెక్షన్ ఏమిటంటే, భోళానాథుని స్మృతిలో ఉండండి. మనుష్యులను భోళా అని అనడం జరగదు. భోళానాథుడు అని శివబాబాను మాత్రమే అంటారు. శంకరుడిని కూడా భోళానాథుడు అని అనలేరు. ఎవరైతే దుర్భాగ్యాన్ని సరి చేసేవారిగా అనగా దుఃఖితులను సుఖమయంగా చేసేవారిగా ఉంటారో, వారినే భోళానాథుడు అని అంటారు. పాడైపోయింది భారతవాసుల భాగ్యమే కావున భారత్ యొక్క దుర్భాగ్యాన్ని సరి చేసేవారు కూడా తప్పకుండా భారత్ లోనే వస్తారు కదా. దుర్భాగ్యాన్ని సరి చేసే యుక్తిని సెకెండులో తెలియజేస్తారు. జనకునికి కూడా యుక్తిని ఇచ్చారు. దుర్భాగ్యం కూడా ఎవరో ఒక్కరిది మాత్రమే సరిదిద్దబడదు. ఒకవేళ జనకుని దుర్భాగ్యాన్ని సరి చేసి ఉంటే మరియు వారు జీవన్ముక్తిని పొంది ఉంటే తప్పకుండా రాజధాని కూడా ఉంటుంది. వారితో పాటు అనేకులకు జీవన్ముక్తి లభించి ఉంటుంది. భారత్ జీవన్ముక్తిగా ఉండేదని కూడా భారతవాసులు భావిస్తారు. జీవన్ముక్తి అని స్వర్గాన్ని అంటారు. జీవనబంధనము అని నరకాన్ని అంటారు. ఇది రాజయోగము. రాజయోగంతోనే రాజ్యం యొక్క స్థాపన జరుగుతుంది. ఒక్క జనకుని విషయం కాదు. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు మరియు రాజ్యాన్ని కూడా ఇచ్చారు. సత్యయుగ లక్ష్మీ-నారాయణులు రాజ్యాన్ని ఎలా పొందారు అనేది తప్పకుండా చూస్తారు. ఇప్పుడు ఇది కలియుగము. ప్రజలపై ప్రజల యొక్క రాజ్య స్థాపన జరిగింది. ఇది పంచాయతీ రాజ్యము. దీని తర్వాత సత్యయుగము. లక్ష్మీ-నారాయణులు ముందు జన్మలో అటువంటి కర్తవ్యాన్ని చేసారు కావుననే సూర్యవంశీ రాజ్యాన్ని పొందారు అని మీకు తెలుసు. ఆ తర్వాత చంద్రవంశీయులు. అంటే రాజ్యం బదిలీ అవుతుంది. మీకు తెలుసు, గీత సర్వోత్తమ ధర్మ శాస్త్రము, దీని ద్వారా మూడు ధర్మాలు స్థాపనవుతాయి. మరియు ప్రతి ధర్మం యొక్క శాస్త్రం ఒక్కటే ఉంటుంది. సంగమానికి కూడా ఒకటే శాస్త్రం ఉంది. మహిమ కూడా గీతకే ఉంది, దీని ద్వారా అందరి సద్గతి జరుగుతుంది. కావున సద్గతిని ఇచ్చేవారు ఒక్కరే. గీతలో తప్పకుండా రుద్ర జ్ఞాన యజ్ఞం యొక్క వర్ణన కూడా ఉంది, దీని ద్వారా ఈ పాత నరకం యొక్క వినాశనం జరుగుతుంది మరియు స్వర్గం యొక్క స్థాపన కూడా జరుగుతుంది. ఇందులో తికమకపడాల్సిన విషయమేమీ లేదు. తండ్రి అర్థం చేయించారు – విశ్వంలో స్వర్గ స్థాపన చేసేవారు విశ్వం యొక్క యజమాని అని చెప్తూ మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారు అందరికీ తండ్రి తర్వాత ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వానికి యజమానులు. వారికి తప్పకుండా శివబాబా రాజ్యాన్ని ఇచ్చి ఉంటారు. ఇప్పుడు ఇది కలియుగము. భారత్ గవ్వ వలె ఉంది, అప్పు పెరిగిపోతూ ఉంది అందుకే బంగారాన్ని తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. భారత్ మళ్ళీ వజ్రం వలె ఎలా అవుతుంది. లక్ష్మీ-నారాయణులకు స్వర్గం యొక్క రాజ్యం లభించింది కదా.
ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు – నిందలు అయితే పడాల్సిందే. భారత్ లో దేవతలు కూడా నిందలు పడుతూ వచ్చారు. ఇతర దేశాల వారైతే చాలా మహిమ చేస్తారు, వారికి తెలుసు, ఈ దేవతలు ప్రాచీన భారత్ యొక్క యజమానులుగా ఉండేవారు అని. ఇప్పుడు పిల్లలైన మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు. పిల్లలైన మీలో ఎవరైతే విశాల బుద్ధి కలవారు ఉన్నారో, వారికే సంతోషం ఉంటుంది. ఎవరైతే ధారణ చేసి, మళ్ళీ ఇతరుల చేత చేయిస్తారో, వారు విశాలబుద్ధి కలవారు. ఇలా అనుకోకండి, అక్కడ సత్సంగాలు మొదలైనవాటికి అయితే 5-10 వేల మంది ప్రతి రోజు వెళ్తారు, ఇక్కడికైతే అంతమంది రారు అని. భక్తి అయితే తప్పకుండా వృద్ధి చెందుతూ ఉంటుంది. దాని నుండి ఈ అంటు కట్టబడుతూ ఉంటుంది. ఎవరైతే కల్పక్రితం అర్థం చేసుకున్నారో, వారే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. మనుష్యులైతే కథలను వినిపిస్తారు మరియు వినేవారు విని, ఇంటికి వెళ్ళిపోతారు, అంతే. ఇక్కడైతే ఎంత శ్రమ చేయాల్సి ఉంటుంది. పవిత్రతపై ఎన్ని గొడవలు జరుగుతాయి. గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదు. ఈ పాండవ గవర్నమెంట్ అయితే గుప్తమైనది. అండర్ గ్రౌండ్ సైన్యము అని ఒక పేరు ఉంది. శక్తి సైన్యం అయిన మీరు గుప్తంగా ఉన్నారు. మిమ్మల్ని ఎవరూ తెలుసుకోలేరు. మీరు అహింసాయుతమైన శక్తి సైన్యము, దీని అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. గీతలోని పదాల యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోలేరు. తండ్రి స్వయంగా చెప్తారు, ఈ జ్ఞానం ప్రాయః లోపమైపోతుంది. లక్ష్మీ-నారాయణులలో కూడా ఈ జ్ఞానం ఉండదు. నేను ఏ జ్ఞానాన్ని అయితే వినిపించి రాజధానిని స్థాపన చేస్తానో, అది ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. ఈ బాబా కూడా గీత మొదలైనవి చదివేవారు. కానీ ఈ విషయాలు ఏమైనా బుద్ధిలో ఉండేవా. ఇప్పుడు చూడండి, సెంటర్లు కూడా ఎన్ని తెరుచుకుంటూ ఉంటాయి. పవిత్రత విషయంలో విఘ్నాలు కూడా ప్రాక్టికల్ గా కలుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు కూడా కలిగేవి. ఆ గీతా పాఠశాలల్లో విఘ్నం యొక్క విషయము ఉండదు. ఇక్కడైతే మీరు బ్రహ్మాకుమారులుగా-కుమారీలుగా అవుతారు. ఈ పదాలైతే గీతలో కూడా లేవు. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. మనుష్యులు ప్రతి ఒక్కరూ ప్రజాపిత బ్రహ్మా యొక్క పిల్లలు, బ్రహ్మాకుమారులు-కుమారీలు. కేవలం భారతవాసులు మాత్రమే కాదు, కానీ మొత్తం సృష్టిలోని మనుష్యులందరూ వారి పిల్లలు. అందరూ ప్రజాపిత బ్రహ్మాను ఆడమ్ అని అంటారు. వారు మనుష్య సృష్టి యొక్క మొదటి హెడ్, మానవాళిని స్థాపన చేసేవారు అని తెలుసు. అలాగని మొదట్లో సృష్టి ఉండదు, తర్వాత బ్రహ్మా జన్మిస్తారు, వారి ముఖం ద్వారా మనుష్యులు రచించబడతారు అని కాదు. అలా కాదు. ఒకవేళ మనుష్యులెవ్వరూ ఉండకపోతే, ఇక ముఖవంశావళి కూడా జన్మించలేరు. బ్రహ్మా ముఖవంశావళి ఉండజాలరు, బ్రహ్మా కుఖవంశావళి కూడా ఉండజాలరు. సృష్టి మొత్తం ఉంటుంది, దాని అంటు కట్టడం జరుగుతుంది. ఈ కొత్త-కొత్త విషయాలు అర్థం చేసుకోవాల్సినవి. ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవడానికి సమయం పడుతుంది. కొందరైతే ఒక నెలలో కూడా నిలబడిపోతారు. ఎలాగైతే, బెంగుళూరులోని అంగనా బిడ్డకు ఎంత నషా ఎక్కి ఉండేదో చూడండి. మన వద్ద ఉన్న 20 సంవత్సరాల వారికి కూడా అంత నషా లేదు. వారు సంతోషంలో డ్యాన్స్ చేసేవారు. భగవంతుడు లభించారు, సంతోషకరమైన విషయం కదా. భగవంతుడు వచ్చి మాయ నుండి రక్షిస్తారు. తర్వాత స్వర్గం యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తారు. బాబా అయితే చాలా స్పష్టంగా అర్థం చేయిస్తారు. నేను ఈ సాధారణ తనువు ద్వారా మళ్ళీ పిల్లలైన మీకు అదే సహజ రాజయోగాన్ని మరియు సృష్టి చక్రం యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని నేర్పిస్తాను. మీరు చెప్పవచ్చు, మీరు వచ్చినట్లయితే మేము మీకు సత్యయుగం నుండి మొదలుకొని కలియుగ అంతిమం వరకు కల చరిత్రను వినిపించగలము, ఇప్పుడు మళ్ళీ సత్యయుగం ఎలా రానున్నది అనేది వినిపించగలము. తప్పకుండా నేర్పించేవారు కూడా ఉండాలి. మనకు నేర్పిస్తారు, అప్పుడే మనం అర్థం చేయించగలము కదా. ఇకపోతే, ఎవరైతే గీతను వినిపించేవారు ఉన్నారో, వారి నుండి మీరు చాలా విన్నారు. చాలా లెక్చర్లు జరుగుతూ ఉంటాయి. కానీ వారు ఈ ధర్మానికి చెందినవారు కాకపోవడం వలన ఇటువైపు ఆకర్షించబడరు. ఎప్పుడైతే మీ ప్రభావం వెలువడుతుందో, అప్పుడు వృద్ధి జరుగుతుంది. మెల్ల-మెల్లగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. భారత్ ఎంత నిరుపేదగా ఉంది అన్నదైతే తెలుసు. చాలామంది మనుష్యులు ఆకలితో మరణిస్తారు. దుఃఖితులుగా అవుతారు. వచ్చి దుఃఖం నుండి విడిపించండి అని భగవంతుడిని భక్తి చేస్తారు. సుఖమయమైన సృష్టి ఎప్పుడు ఉంటుందో పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ పిల్లలైన మీ జోలి, ఈ అవినాశీ జ్ఞాన రత్నాలతో నిండుతుంది. ఇంతకుముందు అందరూ వింటూ, వినిపిస్తూ ఉండేవారు కానీ అక్కడ జోలిని నింపుకునే ప్రశ్న లేదు. ఇప్పుడు కేవలం మీ జోలి మాత్రమే నిండుతుంది మరియు ఎవరైతే టేప్ వింటారో లేక మురళీ చదువుకుంటారో లేక వింటూ ఉండవచ్చో, వారు కూడా జోలిని నింపుకుంటున్నారు.
మీరు శివశక్తి సైన్యము, భారత్ యొక్క జోలిని నింపేవారు. భారత్ చాలా షావుకారుగా అయిపోతుంది. కానీ ఎవరైతే జోలి నింపుతారో, రాజ్యాన్ని కేవలం వారే చేస్తారు కదా. భారత్ బంగారు పిచ్చుకగా ఉండేది, మళ్ళీ అలా తయారైపోతుంది. అందరూ సుఖమయంగా ఉంటారు. కానీ భారత్ లో ఎన్ని కోట్లమంది ఉన్నారో, ఇంతమంది అయితే అక్కడ ఉండరు. ఎవరైతే జోలిని నింపుతారో, రాజ్య భాగ్యాన్ని వారే తీసుకుంటారు. ఎలా జరుగుతుంది అని ఇందులో తికమకపడే విషయమేమీ లేదు. అరే, ఈ లక్ష్మీ-నారాయణులను చూడండి కదా. వీరు సత్యయుగం యొక్క యజమానులు కదా. స్వర్గం యొక్క రచయిత శివబాబా మరియు ఈ లక్ష్మీ-నారాయణులు సత్యయుగం యొక్క యజమానులు. తప్పకుండా ముందు జన్మలో పురుషార్థం చేసారు. ముందు జన్మ సంగమంలో ఉంటుంది. సంగమము కళ్యాణకారి కదా ఎందుకంటే సంగమయుగంలోనే ప్రపంచం మారుతుంది, కావున తప్పకుండా కలియుగానికి మరియు సత్యయుగానికి మధ్యన జ్ఞానం ఇచ్చి ఉంటారు. దానిని ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు. ఒకవేళ ఎవరైనా నిరాకార పరమాత్మ ఎలా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు అని అడిగితే, అప్పుడు మీరు త్రిమూర్తులను చూపించండి. బ్రహ్మా ద్వారా స్థాపన… కావున ఎవరైతే స్థాపన చేస్తారో, వారే పాలన కూడా చేస్తారు. ఉదాహరణకు క్రైస్ట్ స్థాపన చేసారు, మళ్ళీ పాలన చేసేందుకు తప్పకుండా వారే పోప్ గా అవ్వాల్సి వచ్చింది. తిరిగి అయితే ఎవ్వరూ వెళ్ళలేరు. పాలన తప్పకుండా చేయాలి. పునర్జన్మలు తీసుకోవాల్సిందే, లేదంటే సృష్టి ఎలా వృద్ధి చెందుతుంది. సత్య-త్రేతాయుగాలలో మొదట దేవతల రాజ్యముండేది అన్నప్పుడు అందరికన్నా ఎక్కువ జనాభా తప్పకుండా వారిదే ఉండాలి. మరి క్రిస్టియన్లది ఎక్కువ ఎందుకు ఉంది? అలానే లక్షల సంవత్సరాల విషయం కూడా ఏమీ లేదు. ఎవరైతే మన వంశానికి చెందినవారు ఉంటారో, ఈ విషయాలన్నింటినీ వారే అర్థం చేసుకుంటారు. ఇతరులకు బాణం తగలదు. ఇది జ్ఞానం యొక్క బాణం కదా. బాబా అంటారు, ఎవరినైనా సరే తీసుకురండి, వారికి జ్ఞాన బాణాలు వేయండి. బ్రాహ్మణ కులానికి చెందిన వారు అయి ఉంటే బాణం తగులుతుంది. శాస్త్రాలలో చూపిస్తారు – యుద్ధంలో యాదవులు, కౌరవులు మరణించారు, పాండవులు ఐదుగురు ఉండేవారు, వారు తర్వాత హిమాలయాల పైకి వెళ్ళి కరిగిపోయారు అని. ఇప్పుడు ఇలా అయితే జరగజాలదు. జీవహత్య చేసుకునేవారు మహాపాపులు అని కూడా అంటూ ఉంటారు. ఆత్మ యొక్క హత్య ఎప్పుడూ జరగదు. ఆత్మ స్వయంగా వెళ్ళి శరీరం యొక్క హత్య లేక వినాశనం చేస్తుంది. ఇప్పుడు, ఏ పాండవులకైతే శ్రీమతాన్ని ఇచ్చేవారు పరమాత్మనో, వారు వెళ్ళి పర్వతాలపై కరిగిపోవడము అనేదైతే జరగలేదు. అచ్ఛా, వారైతే ఐదుగురు పాండవులు. మిగిలిన పాండవులు ఎక్కడకు వెళ్ళారు? సైన్యమునైతే చూపించలేదు. వినాశనం ఎలా జరుగుతుందో మీకు తెలుసు. మీరు చూస్తారు కూడా. పిల్లలైన మీకు సాక్షాత్కారాలు కూడా చాలా జరుగుతాయి. మొదట్లో మీకు చాలా సాక్షాత్కారాలు జరిగేవి. అప్పుడప్పుడు లక్ష్మీని, అప్పుడప్పుడు నారాయణుడిని ఆహ్వానించేవారు. ఎన్ని సాక్షాత్కారాలు జరిగేవి, మళ్ళీ చివరి సమయంలో ఎప్పుడైతే హాహాకారాలు జరుగుతాయో, అప్పుడు మీకు మళ్ళీ సాక్షాత్కారాలు జరుగుతాయి. గొడవలు జరిగినప్పుడు పిల్లలైన మీరు ఇక్కడకు వచ్చి చేరుకుంటారు, అందుకే మధుబన్ లో ఎక్కువ ఇళ్ళు నిర్మిస్తూ ఉంటారు. మళ్ళీ పిల్లలైన మిమ్మల్ని ఈ సాక్షాత్కారాల ద్వారా సంతోషంలోకి తీసుకొస్తూ ఉంటారు. కానీ అందరూ ఇక్కడకు రావడమనేది, పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువైన విషయం ఏమీ కాదు. సుపుత్రులైన పిల్లలు, ఎవరైతే బాబాకు సహాయకులుగా ఉంటారో, వారే వస్తారు. ఒకవేళ పాండవులు కరిగిపోయే విషయం ఉన్నట్లయితే మరి ఇళ్ళను ఎందుకు నిర్మిస్తారు! ఏ విషయంలోనైనా తికమకపడితే అనన్యులైన పిల్లలను అడగవచ్చు. లేదంటే ఈ బ్రహ్మాబాబా కూర్చుని ఉన్నారు. వీరు చెప్పలేకపోతే పెద్ద బాబా (శివబాబా) కూర్చుని ఉన్నారు. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఎంతో మిగిలి ఉంది అని చెప్పడం జరిగింది. మొత్తం చక్రం యొక్క రహస్యాన్ని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎన్ని పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా సమయం మిగిలి ఉంది కావున ఇంకా అర్థం చేయించాల్సి ఉంటుంది. కానీ మొదట ముఖ్యమైన విషయం తప్పకుండా రాయించాలి, పూర్తిగా రక్తంతో రాయించాలి, ఖచ్చితంగా పరమపిత పరమాత్మ చదివిస్తున్నారని మాకు నిశ్చయం ఉంది అని. అలాగని కేవలం రాసినంత మాత్రాన మారిపోతారని కాదు. మేము ఏదో అలా రాసేసాము అని అంటారు. ఎవరి వెనుక ఎక్కువగా తల బాదుకోకూడదు. భగవానువాచ అని చెప్పండి. మేము శివబాబాను భగవంతునిగా నమ్ముతాము. వారు జ్ఞానసాగరుడు, సత్యమైనవారు, చైతన్యమైనవారు. వారికి తమ శరీరమైతే లేదు. కావున తప్పకుండా సాధారణ తనువు యొక్క ఆధారం తీసుకుంటారు కదా. కావున మొట్టమొదట తండ్రి చెప్తారు – నన్నొక్కరినే స్మృతి చేయండి. దేహం యొక్క ధర్మాలన్నింటినీ వదిలి నన్ను స్మృతి చేసినట్లయితే, వికర్మలు వినాశనమవుతాయి మరియు నా వద్దకు వచ్చేస్తారు, మరియు చక్రాన్ని స్మృతి చేసినట్లయితే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. బాబా ఎంత మధురమైనవారు మరియు తయారుచేయడం కూడా ఎంత మధురంగా తయారుచేస్తారో చూడండి. సత్యయుగం యొక్క గుర్తులు ఉన్నాయి, అవి తప్పకుండా మళ్ళీ రిపీట్ అవుతాయి. కలియుగం కూడా ఉంది. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు, వినాశనం ఎదురుగా నిలబడి ఉంది, ఇంకేమి ఋజువు ఇవ్వాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి సమానంగా అవ్వాలి. భగవంతుడు వచ్చి మాయ నుండి మమ్మల్ని రక్షిస్తారు, ఈ సంతోషంలో ఉండాలి.
2. ఏ విషయంలోనూ తికమకపడకూడదు, సుపుత్రులైన పిల్లలుగా అయి తండ్రికి పూర్తి-పూర్తి సహాయకులుగా అవ్వాలి.
వరదానము:-
ఎలాగైతే బ్రహ్మాబాబా ఏ సంస్కారాలనైతే తమ సంస్కారాలుగా చేసుకున్నారో, వాటిని పిల్లలందరికీ అంతిమ సమయంలో స్మృతిని ఇప్పించారు – నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి – కావున ఈ బ్రహ్మా తండ్రి యొక్క సంస్కారాలే బ్రాహ్మణుల యొక్క సంస్కారాలుగా, న్యాచురల్ గా అవ్వాలి. సదా ఈ శ్రేష్ఠ సంస్కారాలనే ఎదురుగా పెట్టుకోండి. మొత్తం రోజంతటిలో ప్రతి కర్మ చేసే సమయంలో మూడు సంస్కారాలు ఇమర్జ్ రూపంలో ఉన్నాయా అని చెక్ చెసుకోండి. ఈ సంస్కారాలను ధారణ చేయడంతో స్వ పరివర్తక సో విశ్వ పరివర్తకులుగా అయిపోతారు.
స్లోగన్:-
లవలీన స్థితిని అనుభవం చేయండి
తండ్రికి పిల్లలైన మీ పట్ల ఎంత ప్రేమ ఉందంటే, జీవితంలో సుఖ-శాంతుల అన్ని కామనలను పూర్తి చేస్తారు. తండ్రి సుఖాన్ని ఇవ్వడం మాత్రమే కాదు కానీ సుఖం యొక్క భాండాగారానికి యజమానిగా చేస్తారు. దానితో పాటు శ్రేష్ఠ భాగ్యం యొక్క రేఖను గీసే కలమును కూడా ఇస్తారు, ఎంత కావాలనుకుంటే అంత భాగ్యాన్ని తయారుచేసుకోవచ్చు – ఇదే పరమాత్మ ప్రేమ. ఈ ప్రేమలోనే ఇమిడి ఉండండి.
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!