16 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 15, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - బ్రాహ్మణులైన మీరు యజ్ఞ రక్షకులు, ఈ యజ్ఞమే మీకు మనసు కోరుకున్న ఫలాన్ని ఇచ్చేటువంటిది’

ప్రశ్న: -

ఏ రెండు విషయాల ఆధారంగా 21 జన్మల కోసం అన్ని దుఃఖాల నుండి విడుదల అవ్వగలరు?

జవాబు:-

ప్రేమతో యజ్ఞ సేవ చేయండి మరియు తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు 21 జన్మలు ఎప్పుడూ దుఃఖితులుగా అవ్వరు, దుఃఖం యొక్క కన్నీరును కార్చరు. పిల్లలైన మీకు తండ్రి శ్రీమతం ఏమిటంటే – పిల్లలూ, తండ్రిని తప్ప మిత్ర-సంబంధీకులు, స్నేహితులు మొదలైనవారెవ్వరినీ గుర్తు చేయకండి. బంధనముక్తులుగా అయి ప్రేమతో యజ్ఞాన్ని సంభాళించినట్లయితే, మనసు కోరుకున్న ఫలం లభిస్తుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

బాల్యపు రోజులను మర్చిపోకండి… (బచ్పన్ కే దిన్ భులా నా దేనా…)

ఓంశాంతి. మధురాతి-మధురమైన పిల్లలు పాటను విన్నారు మరియు దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకున్నారు, ఏమని అంటే, ఇది మన ఈశ్వరీయ జన్మ, ఈ జన్మలో మనం ఎవరినైతే తల్లి-తండ్రి అని అంటామో, వారి మతంపై నడవడంతోనే మనం విశ్వానికి యజమానులుగా అవుతాము ఎందుకంటే వారు కొత్త విశ్వం యొక్క రచయిత. ఈ నిశ్చయంతోనే మీరు ఇక్కడ కూర్చున్నారు మరియు విశ్వ యజమానత్వపు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఈ పాత విశ్వం ఏదైతే ఉందో, ఇది వినాశనం అవ్వనున్నది, ఇందులో ఏ సుఖమూ లేదు. అందరూ విషయ సాగరంలో మునకలు వేస్తున్నారు. రావణుడి సంకెళ్ళలో దుఃఖితులుగా అయి అందరూ మరణించనున్నారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. మనం ఎవరికి చెందినవారిగా అయ్యామో, వారి నుండి వారసత్వాన్ని పొందాలి అని పిల్లలకు తెలుసు. వారు మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఎలాగైతే బ్యారిస్టరు, మేము బ్యారిస్టరుగా తయారుచేస్తాము అని అంటారు. తండ్రి అంటారు, మిమ్మల్ని స్వర్గం యొక్క డబల్ కిరీటధారులుగా తయారుచేస్తాను. శ్రీ లక్ష్మీ-నారాయణుల మరియు వారి వంశం యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను. దాని కోసం మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఈ విషయాలను మర్చిపోకండి. మాయ మరపింపజేస్తుంది, పరమపిత పరమాత్మ నుండి విముఖులుగా చేస్తుంది. దాని వ్యాపారమే ఇది. ఎప్పటినుండైతే దాని రాజ్యం ఏర్పడిందో, అప్పటినుండి మీరు విముఖులుగా అవుతూ వచ్చారు. ఇప్పుడు దేనికీ పనికిరాకుండా ఉన్నారు. ముఖం మనుష్యులదే కావచ్చు కానీ గుణం పూర్తిగా కోతి వలె ఉంది. ఇప్పుడు మీ ముఖాన్ని మనుష్యులదిగా, గుణాన్ని దేవతలదిగా తయారుచేస్తున్నారు, అందుకే బాబా అంటారు, బాల్యాన్ని మర్చిపోకండి, ఇందులో ఏ కష్టము లేదు. ఎవరైతే నిర్బంధనులుగా ఉన్నారో, వారిదైతే అహో భాగ్యము అని అంటారు. ఆ లౌకిక మాతా-పితలైతే వికారాల్లోకి పడేసేవారు మరియు ఈ మాతా-పితలైతే స్వర్గంలోకి తీసుకువెళ్ళేవారు. జ్ఞాన స్నానాన్ని చేయిస్తున్నారు. ప్రశాంతంగా కూర్చున్నారు. అయితే, శరీరంతో పని కూడా చేయాలి. అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది, ఇంకెవ్వరి స్మృతి సతాయించదు. ఒకవేళ ఏదైనా బంధనం ఉన్నట్లయితే స్మృతి సతాయిస్తుంది. ఎవరైనా సంబంధీకులు గుర్తుకొచ్చారు, మిత్రులు, స్నేహితులు గుర్తుకొచ్చారు, సినిమా గుర్తుకొచ్చింది… మీకైతే తండ్రి చెప్తారు, ఇంకెవ్వరినీ గుర్తు చేయకండి. యజ్ఞ సేవ చేయండి మరియు తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు 21 జన్మలు మీరు ఎప్పుడూ దుఃఖాన్ని పొందరు, దుఃఖం యొక్క కన్నీరును కార్చరు. ఇటువంటి అనంతమైన తల్లిదండ్రులను ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. యజ్ఞ సేవను చేయాలి. మీరు యజ్ఞ రక్షకులు. యజ్ఞం యొక్క అన్ని రకాల సేవలను చేయాలి. ఈ యజ్ఞం మనసు కోరుకున్న ఫలాన్ని ఇస్తుంది అనగా జీవన్ముక్తిని, స్వర్గ రాజ్యాన్ని ఇస్తుంది. కనుక ఇటువంటి యజ్ఞాన్ని ఎంతగా సంభాళించాలి. ఎంత శాంతి ఉండాలి. ఎవరు వచ్చినా సరే, ఇక్కడైతే సుఖ-శాంతులు ఉన్నాయని భావించాలి. ఇక్కడ ఎలాంటి శబ్దం చేయడం అసలు ఇష్టమనిపించదు. రావణ రాజ్యం నుండి విడుదలై వచ్చాము. ఇప్పుడు మనం రామ రాజ్యంలోకి వెళ్తాము. ఎవరైతే బంధనముక్తులు ఉన్నారో, వారి కోసమైతే అహో సౌభాగ్యము. ఎవరైతే అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారో, వారు లక్షాధికారులు, కోటీశ్వరుల కన్నా కూడా మహాన్ సౌభాగ్యశాలురు. ఎవరి బంధనమైతే తెగిపోయిందో, వారిది కూడా అహో సౌభాగ్యము అని అంటారు. ఎవరైతే బంధనముక్తులుగా అయి బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారో, వారి అదృష్టం ఎంతగా తెరుచుకుంటుంది. బయటైతే రౌరవ నరకముంది, అందులో దుఃఖం తప్ప ఏ సుఖము లేదు. ఇప్పుడు తండ్రి అంటారు, మిగతా చింతలన్నింటినీ వదిలి యజ్ఞ సేవను ప్రేమగా చేయండి. ధారణ చేయండి. మొట్టమొదట తమ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారుచేసుకోవాలి. అది శ్రీమతంపైనే అలా తయారవుతుంది. ఇక్కడైతే పిల్లలందరూ బంధనాల నుండి విడుదలై ఉన్నారు. తమ స్వభావాన్ని కూడా చాలా మంచిగా ఉంచుకోవాలి, సతోప్రధానంగా అవ్వాలి. లేదంటే సతోప్రధాన రాజ్యంలో ఉన్నత పదవిని పొందలేరు. యజ్ఞం నుండి ఏదైతే లభిస్తుందో, దానిని స్వీకరించాలి. బాబా అనుభవజ్ఞులు. వీరు ఎంత పెద్ద రత్నాల వ్యాపారి అయినా కానీ, ఎక్కడైనా ఆశ్రమానికి వెళ్తే, ఆశ్రమం యొక్క నియమాలపై పూర్తిగా నడుచుకునేవారు. మాకు ఫలానా వస్తువును ఇవ్వండి అని అక్కడ అలా అడగడం జరగదు. చాలా రాయల్టీతో, ఏ భోజనమైతే అందరికీ లభిస్తుందో, అదే తినడం జరుగుతుంది. ఈ ఈశ్వరీయ ఆశ్రమంలో చాలా శాంతి కావాలి.

ఎవరైతే ప్రియునితో పాటు ఉన్నారో… అది కూడా బాప్ దాదా ఇరువురూ కూర్చున్నారు. సమ్ముఖంలో కూర్చుని వింటారు. ఒకవేళ ఇప్పుడు సేవా యోగ్యులుగా అవ్వకపోతే, ఇక కల్ప-కల్పాంతరాలు పదభ్రష్టులుగా అయిపోతారు. అంధులకు చేతికర్రగా అయి, ఈ మహామంత్రాన్ని అందరికీ ఇవ్వాలి. ఇదే సంజీవని మూలిక. కొందరిని మాయ పూర్తిగా అచేతనంగా చేసేస్తుంది. ఈ యుద్ధ మైదానంలోనైతే, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండని చెప్పడం జరుగుతుంది. ఇది సంజీవని మూలిక. హనుమాన్ అయితే మీరే, నంబరువారుగా మహావీరులుగా అవుతారు. అచేతనంగా పడి ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారిని స్పృహలోకి తీసుకురావాలి, అప్పుడు వారు ఎంతో కొంత జీవితాన్ని తయారుచేసుకుంటారు. దేహం పట్ల కూడా మోహం పెట్టుకోకూడదు. మోహం అనేది తండ్రి పట్ల మరియు అవినాశీ జానరత్నాల పట్ల పెట్టుకోవాలి. ఎంతగా ధారణ జరుగుతుందో, అంతగా ఇతరుల చేత కూడా చేయిస్తారు. తండ్రి అంటారు, మాకు జ్ఞాన యుక్త ఆత్మలు ప్రియమనిపిస్తారు. ప్రదర్శనీ సేవ కోసం బాబా జ్ఞానీ పిల్లలనే వెతుకుతారు. అర్థం చేయించడము చాలా సహజము. పెద్ద-పెద్ద వ్యక్తులు విని సంతోషిస్తారు. జీవితం ఈ సంస్థ ద్వారా తయారవుతుంది అని అర్థం చేసుకుంటారు. కానీ ఇది కూడా కోట్లలో కొందరే అర్థం చేసుకుంటారు. ఇది అనంతమైన సన్యాసము. ఈ పాత ప్రపంచంలో ఏదైతే చూస్తారో, ఇదంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడైతే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి, తిరిగి వెళ్ళాలి. మళ్ళీ మనం సూర్యవంశీ కులంలోకి వచ్చి రాజ్యం చేస్తాము. ఒకప్పుడు రాజ్యం చేసారు, మళ్ళీ మాయ లాక్కుంది. ఎంత సహజమైన విషయము. మధురాతి-మధురమైన తండ్రిని స్మృతి చేయాలి. మనసు తండ్రిపై నిమగ్నమై ఉండాలి. ఇకపోతే, కర్మేంద్రియాలతో కర్మలనైతే చేయాలి. శ్రీమతంపై నడుచుకోవాలి. ప్రియమైన, మధురాతి-మధురమైన పిల్లలూ, తండ్రి అంటారు, నోటి నుండి సదా జ్ఞాన రత్నాలే వెలువడాలి, రాళ్ళు వెలువడకూడదు. ప్రాపంచిక సమాచారానికి సంబంధించిన విషయాలేవీ మాట్లాడకండి. లేదంటే నోరు చేదుగా అయిపోతుంది. ఒకరికొకరు రత్నాలను ఇచ్చుకుంటూ ఉండండి, మీ వద్ద రత్నాల జోలి ఉంది. వినాశీ ధనాన్ని దానం చేస్తారు. భారత్ ను మహాదాని అని అంటారు. ఈ సమయంలో తండ్రి పిల్లలకు దానమిస్తారు, పిల్లలు తండ్రికి దానమిస్తారు. బాబా, శరీర సహితంగా ఇదంతా మీదే. అప్పుడు తండ్రి అంటారు, ఈ విశ్వ రాజ్యాధికారము మీది. ఈ పాత ప్రపంచానికి సంబంధించినదంతా సమాప్తం అవ్వనున్నది కావున మనం బాబాతో వ్యాపారం ఎందుకు చేయకూడదు. బాబా, ఇదంతా మీది, భవిష్యత్తులో మాకు రాజ్యాన్ని ఇవ్వండి. మేము ఇదే కోరుకుంటున్నాము, ఇంకే వస్తువు యొక్క అవసరం మాకు లేదు. మేము తనువు, మనసు, ధనాలను ఇచ్చినట్లయితే మేము ఆకలితో మరణిస్తామని ఎవ్వరూ ఇలా అనుకోకండి. అలా జరగదు, ఇది శివబాబా భండారము, దీని నుండి అందరి శరీర నిర్వహణ జరుగుతుంది మరియు జరుగుతూనే ఉంటుంది. ద్రౌపది ఉదాహరణ ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా పాత్ర నడుస్తుంది. శివబాబా భండారము సదా నిండుగా ఉంటుంది. ఇది కూడా ఒక పరీక్షగా నడిచింది, ఎవరికైతే భయం కలిగిందో, వారంతా వెళ్ళిపోయారు. ఇకపోతే, తోడును అందించేవారు వచ్చేసారు. ఆకలితో మరణించే విషయం లేదు. ఇప్పుడైతే పిల్లల కోసం మహళ్ళు తయారవుతున్నాయి. మంచిగా ఉండాలనుకుంటే, శ్రమించి తమ ఉన్నత పదవిని తయారుచేసుకోవాలి. ఇది కల్ప-కల్పపు ఆట. ఈ సారి పరీక్షలో ఫెయిల్ అయ్యారంటే, ఇక కల్ప-కల్పాంతరాలు ఫెయిల్ అవుతూనే ఉంటారు. పాస్ అవ్వడం కూడా ఎలా అవ్వాలంటే, మమ్మా-బాబా సింహాసనంపై కూర్చోవాలి. 21 జన్మలు ఒక సింహాసనం తర్వాత మరొకదానిపై కూర్చుంటారు.

ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకూడదు. మురళీ రాయడము చాలా మంచి సేవ, అందరూ సంతోషిస్తారు, ఆశీర్వదిస్తారు. బాబా, అక్షరాలు చాలా బాగున్నాయి. లేదంటే అక్షరాలు బాగా లేవని రాస్తారు. బాబా, మాకు వాణిని కట్ చేసి పంపిస్తున్నారు. మా రత్నాలు దొంగిలించబడుతున్నాయి. బాబా, మేము అధికారులము, మీ నోటి నుండి ఏ రత్నాలైతే వెలువడుతాయో, అవన్నీ మా వద్దకు రావాలి. ఇది కూడా, ఎవరైతే అనన్యులు ఉంటారో, వారే అంటారు. మురళీ సేవను చాలా మంచి రీతిలో చేయాలి. అన్ని భాషలను నేర్చుకోవాలి. మరాఠీ, గుజరాతి మొదలైనవి… ఎలాగైతే బాబా దయార్ద్రహృదయులో, పిల్లలు కూడా దయార్ద్రహృదయులుగా అవ్వాలి. పురుషార్థం చేసి జీవితం తయారుచేసేందుకు సహాయకులుగా అవ్వాలి. ఇకపోతే ఆ ప్రపంచం యొక్క జీవితమైతే పూర్తిగానే నిస్సారమైనది. ఒకరినొకరు ఖండించుకుంటూ ఉంటారు. ఎంత పతితులుగా ఉన్నారు. ఇప్పుడు మనం బాబా శ్రీమతంపై ఎందుకు నడుచుకోకూడదు. బాబా, నేను మీ వాడిని, మీరు ఏ సేవలో కావాలనుకుంటే, ఆ సేవలో పెట్టండి. అప్పుడు బాధ్యులు బాబా అవుతారు. ఆశ్రయ స్థానానికి వచ్చేవారిని బాబా అన్ని బంధనాల నుండి ముక్తులుగా చేస్తారు. ఇకపోతే, ఈ ప్రపంచంలోనైతే అశుద్ధత చేరి ఉంది. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటూ విముఖులుగా చేసేస్తారు. ఒకవేళ సర్వవ్యాపి అయినట్లయితే, సమీపంగా కూర్చున్నట్లయితే, మరి ఓ ప్రభూ, అని అంటూ పిలవాల్సిన అవసరం ఏముంది. అర్థం చేయిస్తే గుర్రు గుర్రుమంటూ ఉంటారు. అరే, భగవంతుడు స్వయంగా అంటున్నారు – నేను సర్వవ్యాపినని నేనైతే ఎప్పుడూ ఇలా చెప్పలేదు. ఇదైతే భక్తిమార్గం వారు రాసేసారు. స్వయం నేను కూడా ఇంతకుముందు చదివేవాడిని. కానీ ఆ సమయంలో ఇది ఒక నింద అని భావించేవాడిని కాదు. భక్తులకు ఏమీ తెలియదు, ఏం చెప్పినా అది సత్యమని నమ్ముతారు. బాబా ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు, మళ్ళీ బయటకు వెళ్ళి హంగామా చేస్తారు. అప్పుడు అక్కడకు వెళ్ళి దాస-దాసీలుగా, నౌకర్లుగా అవుతారు. బాబా అయితే చెప్పారు – చివరి సమయం ఎప్పుడైతే వస్తుందో, ఆ సమయంలో మీకు మొత్తం తెలిసిపోతుంది. సాక్షాత్కారాలు చేసుకుంటూ ఉంటారు మరియు ఫలానా-ఫలానా వారు ఇలా అవుతారని చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ సమయంలో తల దించుకోవాల్సి వస్తుంది, అప్పుడిక, రాజ్యం పొందిన వారికి ఉన్నంత సంతోషం ఉండదు. మనసు లోపల ముళ్ళు గుచ్చుకుంటున్నట్లుగా ఉంటుంది, ఏమిటి ఇలా అయిపోయింది! అని. కానీ టూ లేట్, చాలా పశ్చాత్తాపపడతారు. అప్పుడిక ఏమీ చేయలేరు. తండ్రి అంటారు, నీకు ఇంతగా అర్థం చేయించేవాడిని, అయినా నీవు ఇది చేసేవాడివి, ఇప్పుడు నీ పరిస్థితి చూడు. కల్ప-కల్పాంతరాలు పశ్చాత్తాపపడతారు. ప్రేయసులను నంబరువారుగా తీసుకువెళ్తారు కదా. నంబరువన్ నుండి లాస్ట్ వరకు ఇది అర్థం చేసుకుంటారు – చదువును బాగా చదువుకోలేదు కనుక లాస్ట్ లో కూర్చున్నారు అని. మేము ఎన్ని మార్కులతో పాస్ అవుతాము అన్నది పరీక్ష రోజుల్లో తెలిసిపోతుంది. మేము ఏ పదవిని పొందుతాము అన్నది మీరు అర్థం చేసుకుంటారు. సేవ చేయకపోతే ధూళి లభిస్తుంది. చదువు మరియు సేవ పట్ల అటెన్షన్ పెట్టాలి. మధురాతి-మధురమైన బాబా యొక్క పిల్లలు కనుక చాలా మధురంగా అవ్వాలి. శివబాబా ఎంత మధురమైనవారు, ఎంత ప్రియమైనవారు. మనల్ని మళ్ళీ ఆ విధంగా తయారుచేస్తారు. ఇది ఎంత పెద్ద యూనివర్సిటీ. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేహ సహితంగా అందరి నుండి మోహాన్ని తొలగించి, తండ్రి మరియు అవినాశీ జాన రత్నాల పట్ల మోహాన్ని పెట్టుకోవాలి.

జ్ఞాన రత్నాలను దానం చేస్తూ ఉండాలి.

2. చదువు మరియు సేవ పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి, తండ్రి సమానంగా మధురంగా అవ్వాలి. ప్రాపంచిక సమాచారాన్ని వినకూడదు, అలాగే ఇతరులకు వినిపించి నోటిని చేదుగా చేసుకోకూడదు.

వరదానము:-

ఎలాగైతే గులాబి పుష్పము ముళ్ళ మధ్యన ఉంటూ కూడా అతీతంగా మరియు సుగంధభరితంగా ఉంటుంది, ముళ్ళ కారణంగా పాడవ్వదు. అటువంటి ఆత్మిక గులాబీలు, ఎవరైతే సర్వ హద్దుల నుండి మరియు దేహం నుండి అతీతంగా ఉంటారో, ఎటువంటి ప్రభావంలోకి రారో, వారు ఆత్మికత యొక్క సుగంధంతో సంపన్నంగా ఉంటారు. ఇటువంటి సుగంధభరితమైన ఆత్మలు తండ్రికి మరియు బ్రాహ్మణ పరివారానికి ప్రియమైనవారిగా అయిపోతారు. పరమాత్మ ప్రేమ తరగనిది, స్థిరమైనది, ఎంత ఉందంటే అది అందరికీ ప్రాప్తించగలదు, కానీ దానిని ప్రాప్తించుకునే విధి – అతీతంగా అవ్వడము.

స్లోగన్:-

అమూల్యమైన జ్ఞాన రత్నాలు (దాదీల పాత డైరీల నుండి)

ఈ జ్ఞాన బలం చాలా గొప్పది, ఈ జ్ఞానం లోపల నిండి ఉంటుంది. బయటికి చేతులతో ఏ పని అయినా చేస్తూ ఉండవచ్చు కానీ ఆంతరిక మనసు యొక్క శుద్ధ వృత్తితోనే పదవి ప్రాప్తిస్తుంది. ఆంతరిక వృత్తితోనే అంతా స్వాహా చేయాలి. ఒకవేళ ఆంతరిక వృత్తితో అంతా స్వాహా చేయకుండా, బయటికి ఎంత పని చేసినా కూడా వారికి పదవి ప్రాప్తించదు. ఇంకా, స్వాహా చేయడంలో, నేను అంతా స్వాహా చేసాను అనేది రాకూడదు. నేను చేసాను, ఈ కర్తాపన్ (నేను చేసాను అన్న భావన) ఒకవేళ లోపల ఉన్నట్లయితే, దాని వలన లభించే ప్రాప్తి దూరమైపోతుంది. అప్పుడిక దాని నుండి ఏ ఫలము వెలువడదు, అది నిష్ఫలం అయిపోతుంది, అందుకే నేను చేసాను అన్న భావన ఉండకూడదు. ఎటువంటి ఆంతరిక వృత్తి ఉండాలంటే, విశాలమైన ఫిల్మ్ అనుసారంగా అంతా జరుగుతుంది, నేను నిమిత్తంగా అయి పురుషార్థం చేస్తాను, ఈ ఆంతరిక మనసా వృత్తితోనే పదవి ప్రాప్తిస్తుంది అని. ఓంశాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top