16 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen BK Murli Of 16 June 2021 in Telugu Murli Today | Daily Murli Online
15 June 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - మీ వద్ద అవినాశీ జ్ఞాన రత్నాల అపారమైన ఖజానా ఉంది, మీరు వాటిని దానం చేయండి, మీ ద్వారం నుండి ఎవరూ తిరిగి వెళ్ళిపోకూడదు”
ప్రశ్న: -
సర్వ సంబంధాల శ్యాక్రిన్ అయిన తండ్రి తన పిల్లలకు ఏ శ్రీమతాన్నిస్తారు?
జవాబు:-
మధురమైన పిల్లలూ – మీ బుద్ధి యోగాన్ని అన్ని వైపుల నుండి తొలగించి, నన్నొక్కడినే స్మృతి చేస్తూ ఉండండి. ఈ ప్రపంచానికి సంబంధించిన వస్తువులు, మిత్ర-సంబంధీకులు మొదలైనవేవీ గుర్తుకు రాకూడదు ఎందుకంటే ఈ సమయంలో అందరూ దుఃఖాన్నిచ్చేవారు. విశ్వానికి యజమానులుగా అవ్వాలంటే, తప్పకుండా 63 జన్మల లెక్కాచారాన్ని సమాప్తం చేసుకునే శ్రమ చేయవలసి ఉంటుంది. అన్నీ మర్చిపోయి అశరీరులుగా అవ్వండి, అప్పుడు లెక్కాచారాలు సమాప్తమవుతాయి. నేను సర్వ సంబంధాల శ్యాక్రిన్ ను.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. మీరు ఎవరి స్మృతిలో కూర్చున్నారు అని బాప్ దాదా పిల్లలను అడుగుతున్నారు. (శివబాబా స్మృతిలో). శివబాబా స్మృతిలో కూర్చున్నామని గట్టిగా చెప్పాలి. పిల్లలైన మీ కనెక్షన్ అనగా ఆత్మల కనెక్షన్ శివబాబాతో ఉంది. మీరు వీరి (బ్రహ్మా) ద్వారా శివబాబాకు చెందినవారిగా అవుతారు ఎందుకంటే శివబాబా వీరి ద్వారానే కలుస్తారు. వీరిని మధ్యవర్తి అని కూడా అంటారు. మీకు మధ్యవర్తితో ఎటువంటి కనెక్షన్ లేదు. మీరు వీరి ద్వారా వారిని కలుస్తారు. అందరి ఇచ్చి పుచ్చుకునే లెక్కలు తండ్రితో ఉండాలి, వీరితో కాదు. వీరి ఇచ్చి పుచ్చుకోవడం కూడా తండ్రితోనే ఉంటుంది. వీరు కూడా, బాబా, నాదంతా మీది అని ఆ తండ్రితో అంటారు. మీకు కూడా – ఒకటేమో, మేము ఆత్మలము అన్న నిశ్చయం ఉంది మరియు రెండవది – ఇప్పుడు ఆత్మలైన మేము పరమపిత పరమాత్మ నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అన్న నిశ్చయం కూడా ఉంది. మనసా-వాచా-కర్మణా, తనువు-మనుస్సు-ధనములతో మనం శివబాబాకు సహాయకులుగా అవుతాము. ఇవన్నీ శివబాబాకు అర్పణ చేయడం జరిగింది. అప్పుడు శివబాబా, ఇది ఇలా-ఇలా చేయండి అని డైరెక్షన్లు ఇస్తారు. దీనినే శ్రీమతం అని అంటారు. నేను ఈ పాత తనువులో ప్రవేశిస్తానని తండ్రి స్వయంగా అంటారు. వీరు కూడా పతితం నుండి పావనంగా అవుతున్నారు. ఇలా ఎవరన్నారు? శివబాబా అన్నారు. వీరు (బ్రహ్మా) కూడా పావనంగా అవుతున్నారు. వీరికి కూడా నాతోనే లెక్క ఉంది. వీరితో ఎవరికీ ఏ లెక్క లేదు. శివబాబా, కేర్ ఆఫ్ బ్రహ్మా అని మీరు ఉత్తరం రాస్తారు. కానీ మాయ ఎటువంటిదంటే, అది నిరంతరం స్మృతి చేయనివ్వదు. బుద్ధి యోగాన్ని పదే-పదే తెంచి వేస్తుంది. ఒకవేళ ఈ పురుషార్థాన్ని పక్కాగా చేసినట్లయితే, ఇక మిగిలినదంతా మర్చిపోతారు. శరీరాన్ని కూడా మర్చిపోతారు. శరీరమనేది ఉండడం ఉంటుంది కానీ ఆత్మకు వీటన్నింటి పట్ల ద్వేషం కలుగుతుంది. ఇటువంటి అవస్థను తయారుచేసుకునే అభ్యాసం చేయవలసి ఉంటుంది. మనకు అంతిమంలో మన శరీరం కూడా గుర్తుకు రాకూడదు. స్వయాన్ని అశరీరిగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. నేను సదా అశరీరిని, మీరు కూడా అశరీరులుగా ఉండేవారు, తర్వాత మీరు పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్ళీ మీరు పాత్రను అభినయించాలి, ఇదే శ్రమ. విశ్వానికి యజమానులుగా అవ్వడమనేది చిన్న విషయమా. మనుష్యులే విశ్వానికి యజమానులుగా అవ్వగలరు. ఈ దేవతలు కూడా మనుష్యులే కానీ వీరిని దైవీ గుణాలు కలిగిన దేవతలని అంటారు. లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, వీరికి తమ పిల్లలుంటారు. ఆ పిల్లలు వీరిని తల్లిదండ్రులుగా భావిస్తారు. కానీ ఈ రోజుల్లో మనుష్యులు అంధ శ్రద్ధ కారణంగా, ఈ లక్ష్మీనారాయణులను త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ….. అని అంటారు. వాస్తవానికి ఈ మహిమ శివబాబాది. మీరు సర్వగుణ సంపన్నులు….. అని దేవతల మహిమను పాడుతారు కానీ వారిని ఎందుకు పూజిస్తారు అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు, నీవే తల్లివి-తండ్రివి….. అనే మహిమను పాడరు. అయితే ఆ శివబాబా నిరాకార పరమపిత పరమాత్మ అని మీకు తెలుసు. వారి నుండే అపారమైన సుఖం లభిస్తుంది. మిగిలిన సంబంధీకులు మొదలైనవారి నుండి దుఃఖమే లభిస్తుంది. వీరు శ్యాక్రిన్ వంటివారు, వీరి ద్వారా సర్వ సంబంధాల మాధుర్యం అనుభవమవుతుంది. అందుకే చిన్నాన్న, మామయ్య మొదలైనవారందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించి నన్నొక్కడినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. దుఃఖహర్త-సుఖకర్త….. అని మీరు పాడుతారు కూడా. సర్వుల సద్గతిదాత ఒక్కరే, వారే మనకు సర్వస్వము. లౌకిక తండ్రి నుండి కూడా దుఃఖం లభిస్తుంది. ఇకపోతే టీచరు అయితే ఎవరికీ దుఃఖాన్నివ్వరు. టీచరు వద్దకు వెళ్ళి చదువుకోవడంతో, మీరు శరీర నిర్వహణార్థం సంపాదిస్తారు. కళలు నేర్పించేవారు కూడా ఉంటారు. వారంతా అల్పకాలానికి మాత్రమే టీచింగ్ చేస్తారు. భక్తిలో కూడా ఒక్క రామునికి లేక పరమపిత పరమాత్మకు మాత్రమే మహిమ చేస్తారు, వారినే స్మృతి చేస్తారు. వాస్తవానికి భక్తి కూడా ఒక్కరికే చేయాలి. వారొక్కరే మిమ్మల్ని పూజ్యులుగా చేస్తారు. మీరు మొట్టమొదట ఒక్క శివబాబానే పూజిస్తారు. దానిని సతోప్రధాన భక్తి అని అంటారు. తర్వాత ఆత్మ కూడా సతోప్రధానం నుండి సతో, రజో, తమోగా అవుతుంది. మనం పూజారులుగా అవుతామని మీరు అర్థం చేసుకున్నారు. ముందు మీరు ఒక్క శివునికే పూజ చేస్తారు, తర్వాత కళలు తగ్గిపోతూ వస్తాయి. భక్తి కూడా సతోప్రధానం నుండి సతో, రజో, తమోగా అయిపోతుంది. డ్రామా అంతా మీపైనే తయారుచేయబడింది. మీరే పూజ్యులు, మీరే పూజారులు. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో, ఈ కథ వారిదే. 84 జన్మలు ఎలా తీసుకున్నారు అనేది తండ్రి వారికే తెలియజేస్తారు, ఈ లెక్క అంతా వారిదే. ఎవరైతే మొట్టమొదట పూజ్య దేవీ దేవతలుగా అవుతారో, వారే పూజారులుగా అవుతారు. తండ్రి అంటారు – నేను కల్ప-కల్పము వచ్చి మిమ్మల్ని చదివిస్తాను మరియు దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను, రాజయోగాన్ని నేర్పిస్తాను. గీతలో పొరపాటున కృష్ణ భగవానువాచ అని రాసేసారు. భగవంతుడైతే ఒక్కరే ఉంటారు, వాళ్ళు రాయి-రప్పల్లో, కణ కణంలో పరమాత్మ ఉంటారని అంటారు. కానీ అలా ఉండరు. భగవంతుని మహిమ అపారమైనది. ఓ బాబా, మీ గతి-మతి అతీతమైనవి అని అంటారు అనగా మీకు ఏ శ్రీమతం అయితే లభిస్తుందో, అది అన్నింటికన్నా అతీతమైనది. తండ్రినే గతి సద్గతిదాత, పరమపిత పరమాత్మ అని అంటారు, అప్పుడు బుద్ధి పైకి వెళ్తుంది. దుఃఖం సమయంలో వారి స్మృతే కలుగుతుంది. ఒకవేళ సీతా-రాములు బుద్ధిలో ఉంటే, రామాయణం అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీరు ఆ ఒక్క తండ్రినే పిలుస్తారు. ఒక్క తండ్రితో తప్ప ఏ సాకారీ మనిషితో గాని, ఆకారీ దేవతతో గాని బుద్ధిని జోడించకూడదు. పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే. ఏ సత్సంగంలోనైనా సరే, పతితపావన సీతా-రామ అని పాడుతారు కానీ అర్థమేమీ తెలియదు. ఇదంతా భక్తి మార్గపు గాయనము. అందరూ రావణుని జైలులో ఉన్నారు. భక్తి మార్గంలో చాలా భ్రమిస్తారు. ఇక్కడ భ్రమించే విషయమేమీ లేదు. పిల్లలు బుద్ధిలో మంచి రీతిగా పాయింట్లను ధారణ చేయాలని, రెగ్యులర్ గా చదువుకోవాలని తండ్రి అర్థం చేయిస్తారు. ఒకవేళ ఏ కారణంగానైనా ఉదయం వెళ్ళలేకపోతే మధ్యాహ్నం వెళ్ళాలి. అలాగని ఎవరినీ విసిగించకూడదు. రోజంతా ఉంది కదా, ఏదో ఒక సమయంలో వెళ్ళి చదువుకోవాలి. ఈ కుమార్తెలు (అక్కయ్యలు) ఉదయం నుండి మొదలుకొని సాయంత్రం వరకు సేవలో ఉంటారు. సర్వీస్ స్టేషన్లు రోజంతా తెరిచి ఉంటాయి. ఎవరైనా వస్తే, వారికి మార్గాన్ని తెలియజేయాలి. మీకు ఇద్దరు తండ్రులున్నారు, ఈ విషయం గురించి ఆలోచించండి అని మొట్టమొదట తెలియజేయాలి. దుఃఖంలో పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు కదా. నన్నొక్కడినే స్మృతి చేయండి అని ఇప్పుడు శివబాబా అంటారు. మృత్యువు అయితే ఎదురుగా నిలబడి ఉంది. ఇది అదే మహాభారత యుద్ధము. పెద్ద లక్షాధికారులు, కోటీశ్వరులు, పెద్ద-పెద్ద భవనాలు మొదలైనవి నిర్మిస్తారు కానీ అవి మిగలవు, అవన్నీ కూలిపోనున్నాయి. వారు కలియుగం ఆయువు లక్షల సంవత్సరాలని భావిస్తారు. దీనినే ఘోర అంధకారమని అంటారు. ఎవరి వద్దనైనా ధనముంటే, ఇల్లు కట్టుకోవచ్చా అని అడుగుతారు. ధనముంటే, కట్టుకుంటే కట్టుకోండి అని బాబా అంటారు. ధనం కూడా మట్టిలో కలిసిపోనున్నది. ఇదంతా తాత్కాలికము. ఈ ధనమంతా సమాప్తమైపోతుంది. ఏమీ మిగలదు, కావున కట్టుకుంటే కట్టుకోండి. అందులో గీతా పాఠశాలను ఏర్పాటు చేయండి. మీ ద్వారం వద్దకు ఎవరు వచ్చినా సరే, వారికి ఎటువంటి భిక్ష ఇవ్వాలంటే, దానితో వారిని విశ్వానికి యజమానులుగా తయారుచేయాలి. మీ వద్ద అపారమైన జ్ఞాన ధనముంది, ఇంత జ్ఞానం ఎవరి వద్దా లేదు. మీలో ఎవరికైతే అనేక జ్ఞాన రత్నాలు బుద్ధిలో నిండి ఉన్నాయో, వారే అందరికన్నా షావుకార్లు. ఎవరు వచ్చినా సరే, మీరు వారి జోలిని నింపండి. మీ వద్ద అంతటి ఖజానా ఉంది. కేవలం ఈ బోర్డు పెట్టండి – రండి, మేము మీకు సదా సుఖమయంగా ఉండే స్వర్గ వారసత్వాన్ని పొందే మార్గాన్ని తెలియజేస్తాము. కానీ పిల్లల్లో ఆ నషా ఉండటం లేదు. ఇక్కడ నషా ఎక్కుతుంది, బయటకు వెళ్ళడంతో మర్చిపోతారు. అభిరుచి ఉండాలి. ఎవరు వచ్చినా సరే, వారి నావ తీరానికి చేరే మార్గాన్ని తెలియజేయాలి. మీ వద్ద చాలా భారీ ధనముంది. మీ వద్దకు ఏ బికారి వచ్చినా, లక్షాధికారి వచ్చినా మీరు వారికి కూడా అనేక రత్నాలను ఇవ్వచ్చు. ఇక్కడ బాబా నషా ఎక్కిస్తారు, మళ్ళీ సోడా వాటర్ వలె అయిపోతారు. బాబా మీ జోలిని అవినాశీ జ్ఞాన రత్నాలతో నింపుతారు. కానీ నంబరువారుగా ఉన్నారు. ఎవరి భాగ్యంలో ఉంటే, వారు పూర్తిగా ధారణ చేస్తారు. బాబా అంటారు – ప్రయత్నం చేసి మీరు నిరంతర స్మృతిలో ఉండండి. సెంటరుకు వెళ్ళి ఒక చోట కూర్చోవాలని కాదు. నడుస్తూ-తిరుగుతూ సమయం లభించినప్పుడల్లా తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. చేతులు పని వైపు, హృదయం అనగా బుద్ధి యోగం తండ్రితో పాటు ఉండాలి. తండ్రి స్మృతితో మీకు చాలా కళ్యాణం జరుగుతుంది. 21 జన్మలకు మీరు షావుకార్లుగా అవుతారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. భారత్ స్వర్గంగా ఉండేది. ఇప్పుడు నరకంగా ఉంది.
ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే, మీ ఆత్మ సతోప్రధానంగా అయిపోతుందని తండ్రి అంటారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే నషా ఎక్కుతుంది. మన అంతటి ధనవంతులు సృష్టిలో ఎవరూ లేరు. తండ్రియే గుర్తు ఉండకపోతే ధనం ఎక్కడ నుండి వస్తుంది. స్వర్గంలోనైతే పిల్లలైన మీకు అపారమైన సుఖం లభిస్తుంది. శాస్త్రాలలో ఎన్ని కట్టుకథలను రాసేసారు. రామ రాజా, రామ ప్రజ….. (రాముని రాజ్యంలో ప్రజలు కూడా షావుకారులే మరియు ఆ నగరంలో అందరూ దాతలు కావున ధర్మానికి సదా ఉపకారము జరుగుతుంది) అని పాడుతారు కూడా. మరో వైపు రాముని సీత అపహరించబడినారు అని, వానర సైన్యాన్ని తీసుకున్నారు అని….. చెప్తారు. ఇంతకుముందు మీరు కూడా చదివేవారు, ఏమీ అర్థం చేసుకునేవారు కాదు. ఇప్పుడు ఎంత బాగా అర్థమవుతాయి. ఎంత విచిత్రమైన విషయాలను రాసేసారు. నేను ప్రకృతిని ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుందని తండ్రి అంటారు. త్రిమూర్తి చిత్రంలో కూడా బ్రహ్మా, విష్ణు, శంకరులను చూపిస్తారు. కానీ విష్ణువు ఎవరు, ఎక్కడ ఉంటారు అనేది అర్థం చేసుకోరు. విష్ణు మందిరాన్ని నర-నారాయణుని మందిరమని అంటారు. కానీ అర్థమేమీ తెలుసుకోరు. ఈ లక్ష్మీనారాయణులు విష్ణువు యొక్క రెండు రూపాలు, వీరు సత్యయుగంలో రాజ్యం చేసేవారు. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. ఎవరు వచ్చినా సరే, మనము బ్రహ్మాకుమార-కుమారీలము కనుక ప్రజాపిత బ్రహ్మా అందరికీ తండ్రి అవుతారని చెప్పండి. వారికి అనేకమంది ప్రజలున్నారు. వారి పేరునైతే విన్నారు కదా. భగవంతుడు బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను రచించారు. తండ్రి తప్పకుండా పిల్లలకు వారసత్వాన్నిచ్చి ఉంటారు కదా. పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. మీరు శివబాబా నుండి వారసత్వాన్ని పొందుతారు. ఒకరేమో లౌకిక తండ్రి, రెండవవారు పారలౌకిక తండ్రి. ఇప్పుడు మీకు ఈ అలౌకిక తండ్రి లభించారు, వీరు వజ్రాల వ్యాపారిగా ఉండేవారు. ఇంతకుముందు వీరికి కూడా ఏమీ తెలియదు. అందుకే, వీరి అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమంలో, వీరిలో ప్రవేశిస్తానని అంటారు. వానప్రస్థులుగా అయ్యే ఆచారం కూడా భారత్ లో ఉంది. 60 సంవత్సరాల తర్వాత గురువు వద్దకు వెళ్ళిపోతారు. తండ్రి వీరిలో ప్రవేశించి, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి అని చెప్తారు. అందరూ ముక్తిని కోరుకుంటారు కానీ ముక్తి గురించి ఎవరికీ తెలియదు. బ్రహ్మములోనైతే ఎవరూ లీనమవ్వలేరు. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. అందరూ పాత్రను అభినయించాల్సిందే. ప్రపంచ చరిత్ర-భూగోళాలు రిపీట్ అవుతాయని అంటారు. ఈ అనాది డ్రామా తయారుచేయబడింది. మీరు 84 జన్మల పాత్రను అభినయించాల్సిందే. ఇక్కడ జ్ఞాన డ్యాన్స్ జరుగుతుంది. వారేమో ఢమరుకాన్ని చూపిస్తారు. సూక్ష్మవతనవాసి అయిన శంకరుడు ఇప్పుడు ఢమరుకాన్ని ఎలా మోగిస్తాడు.
మీరు కోతుల వలె ఉండేవారని తండ్రి అర్థం చేయించారు. కనుక వానర సైన్యమైన మిమ్మల్ని తీసుకున్నారు. బాబా మీ ఎదురుగా జ్ఞానమనే ఢమరుకాన్ని మోగిస్తున్నారు. మీకు జ్ఞానాన్నిస్తారు. ఇప్పుడు మీ ముఖాన్ని మరియు గుణాలను, రెండింటినీ పరివర్తన చేస్తున్నారు. కామ చితిపై కూర్చొని మీరు నల్లగా అయిపోయారు. బాబా మిమ్మల్ని మళ్ళీ జ్ఞాన చితిపై కూర్చొబెట్టి ముఖాన్ని మరియు గుణాలను, రెండింటినీ పరివర్తన చేసి, నల్లగా ఉన్నవారి నుండి సుందరంగా చేస్తారు. ఇక్కడ బాబా ఎంతటి నషాను ఎక్కిస్తారు, మరి ఆ నషా ఎందుకు మాయమైపోవాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి ఏదైతే అపారమైన జ్ఞాన ధనాన్ని ఇచ్చారో, అది ధారణ చేసి స్వయం కూడా షావుకార్లుగా అవ్వాలి మరియు అందరికీ దానం కూడా చేయాలి. ఎవరు వచ్చినా సరే, వారి జోలిని నింపాలి.
2. తండ్రి స్మృతితోనే కళ్యాణం జరగనున్నది, అందుకే నడుస్తూ-తిరుగుతూ ఎంత వీలైతే అంత తండ్రి స్మృతిలో ఉండాలి. సర్వ సంబంధాల మాధుర్యాన్ని ఒక్క తండ్రి ద్వారా తీసుకోవాలి.
వరదానము:-
తపస్వీలు వృక్షం కింద కూర్చొని తపస్య చేస్తున్నట్లుగా భక్తి మార్గంలో చూపిస్తారు. దీని వెనుక కూడా ఒక రహస్యముంది. పిల్లలైన మీ నివాసం ఈ సృష్టి రూపీ కల్పవృక్షం యొక్క వేర్లలో ఉంది. వృక్షం కింద కూర్చోవడంతో మొత్తం వృక్షం యొక్క నాలెడ్జ్ బుద్ధిలో స్వతహాగా ఉంటుంది. కనుక మొత్తం వృక్షం యొక్క నాలెడ్జ్ ను స్మృతిలో ఉంచుకొని, సాక్షీగా అయి, ఈ వృక్షాన్ని చూడండి. అప్పుడు ఆ నషా, సంతోషాన్ని కలిగిస్తుంది మరియు దీనితో బ్యాటరీ చార్జ్ అవుతుంది మరియు సేవ చేస్తున్నప్పుడు, దానితో పాటు తపస్య కూడా ఉంటుంది.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!