16 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

15 July 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీకు ఈ డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు, మీకు తండ్రి ద్వారా జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది కావున మీరు ఆస్తికులు”

ప్రశ్న: -

తండ్రికి చెందిన ఏ టైటిల్ ను ధర్మ స్థాపకులకు ఇవ్వలేము?

జవాబు:-

తండ్రి సద్గురువు. ఏ ధర్మ స్థాపకుడను గురువు అని అనలేము ఎందుకంటే గురువు అనగా దుఃఖం నుండి విముక్తులుగా చేసి సుఖంలోకి తీసుకువెళ్ళేవారు. ధర్మ స్థాపన చేసేవారి వెనుక వారి ధర్మానికి చెందిన ఆత్మలు పై నుండి కిందకు వస్తారు, ధర్మ స్థాపన చేసేవారు ఎవరినీ తీసుకువెళ్ళరు. తండ్రి వచ్చినప్పుడు ఆత్మలందరినీ ఇంటికి తీసుకువెళ్తారు కావున వారు అందరికీ సద్గురువు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఈ పాపపు ప్రపంచం నుండి… ..(ఇస్ పాప్ కీ దునియా సే…..)

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని లైను విన్నారు. ఇది పాపపు ప్రపంచము. ఇది పాపాత్ముల ప్రపంచమని పిల్లలకు కూడా తెలుసు. ఇది ఎంత చెడు పదము. కానీ, నిజంగానే ఇది పాపాత్ముల ప్రపంచమని మనుష్యులు అర్థం చేసుకోలేరు. తప్పకుండా పుణ్యాత్ముల ప్రపంచమనేది కూడా ఉండేది, దానిని స్వర్గమని అంటారు. పాపాత్ముల ప్రపంచాన్ని నరకమని అంటారు. భారత్ లోనే స్వర్గం మరియు నరకం గురించి చాలా చర్చ జరుగుతుంది. మనుష్యులు మరణిస్తే వారు స్వర్గవాసులయ్యారని అంటారు, దీని ద్వారా వారు ఇంతవరకు నరకవాసులుగా ఉండేవారని నిరూపించబడుతుంది. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి వెళ్ళారని అంటున్నట్లు. కానీ మనుష్యులకు అసలేమీ తెలియదు, ఏది తోస్తే అది మాట్లాడుతారు. యథార్థ అర్థాన్ని అసలు తెలుసుకోరు.

తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఓదార్చుతారు – ఇప్పుడు కొద్దిగా ఓర్పు వహించండి. మీరు పాపాల బరువుతో చాలా భారంగా అయిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని పుణ్యాత్ములుగా చేసి స్వర్గమని అనబడే ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. అక్కడ ఎటువంటి పాపము ఉండదు, ఎటువంటి దుఃఖము ఉండదు. పిల్లలకు ఇప్పుడు ఓర్పు లభించింది. ఈ రోజు ఇక్కడ ఉన్నారు, రేపు తమ శాంతిధామానికి, సుఖధామానికి వెళ్తారు. ఉదాహరణకు అనారోగ్యం కల మనిషి కొంచెం కోలుకుంటున్నప్పుడు, మీరు త్వరలోనే చాలా బాగవుతారు అని అతనికి డాక్టర్ ఓదార్పునిస్తారు. ఇక్కడిది అనంతమైన ఓదార్పు. మీరు చాలా దుఃఖమయంగా, పతితులుగా అయిపోయారని అనంతమైన తండ్రి అంటారు. ఇప్పుడు నేను పిల్లలైన మిమ్మల్ని ఆస్తికులుగా చేస్తాను. తర్వాత రచన యొక్క పరిచయాన్ని కూడా ఇస్తాను. మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదని ఋషులు మొదలైనవారు అంటూ వచ్చారు. మరి ఇప్పుడు వారి గురించి ఎవరికి తెలుసు? ఎప్పుడు మరియు ఎవరి ద్వారా తెలుసుకోగలరు అనేది ఎవరికీ తెలియదు. డ్రామా ఆదిమధ్యాంతాల గురించి అసలెవరికీ తెలియదు. తండ్రి అంటారు – నేను సంగమయుగంలో వచ్చి డ్రామానుసారంగా పిల్లలైన మిమ్మల్ని ముందుగా ఆస్తికులుగా తయారుచేస్తాను, తర్వాత మీకు రచన ఆదిమధ్యాంతాల రహస్యాన్ని వినిపిస్తాను అనగా మీ జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని తెరుస్తాను. మీకు ప్రకాశం లభించింది. కనుల వెలుగు పోయినట్లయితే మనుష్యులు అంధులవుతారు. ఈ సమయంలో మనుష్యులకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లేదు. మనుష్యులై ఉంటూ ఆ తండ్రిని మరియు రచన ఆదిమధ్యాంతాలను తెలుసుకోకపోతే వారిని బుద్ధిహీనులని అనడం జరుగుతుంది. కొందరేమో అంధులకు పిల్లలు అంధులుగా ఉన్నారు, మరి కొందరు నేత్రాల కలవారు అని పాటలో కూడా ఉంది. మహాభారత యుద్ధం జరిగినట్లుగా మరియు ఆ ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన జరిగినట్లుగా చూపిస్తారు. సత్యయుగ స్వరాజ్యాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చి ఆత్మలకు రాజయోగాన్ని నేర్పించారు. నేను రాజును, నేను బ్యారిస్టరును అని ఆత్మ అంటుంది. ఇప్పుడు మనం విశ్వ రచయిత అయిన తండ్రి ద్వారా విశ్వ స్వరాజ్యాన్ని పొందుతున్నామని ఆత్మలైన మీకు తెలుసు. వారు దేనికి రచయిత? కొత్త ప్రపంచానికి రచయిత. తండ్రి కొత్త సృష్టిని రచిస్తారు. వారు క్రియేటర్ కావున వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర గురించి ఏ ఒక్కరికీ కూడా తెలియదు. ఎవరికీ జ్ఞానం యొక్క మూడవ నేత్రం లేదు. తండ్రి తప్ప ఇంకెవరూ మూడవ నేత్రాన్ని ఇవ్వలేరు. ప్రపంచ చరిత్ర, భూగోళాలు, మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం….. ఇవన్నీ మీకు తెలుసు. మూలవతనం ఆత్మల సృష్టి. మేము బ్రహ్మములో లీనమైపోతామని లేదా జ్యోతి జ్యోతిలో కలిసిపోతుందని సన్యాసులు అంటారు. కానీ అలా జరగదు. బ్రహ్మతత్వంలోకి వెళ్ళి నివసిస్తామని మీకు తెలుసు. ఆ శాంతిధామం మీ ఇల్లు. వారు బ్రహ్మతత్వమే భగవంతుడని అంటారు, ఎంత తేడా ఉంది. బ్రహ్మము తత్వము. ఎలాగైతే ఆకాశము ఒక తత్వమో, అలాగే బ్రహ్మము కూడా ఒక తత్వము. అక్కడ ఆత్మలైన మనము మరియు పరమపిత పరమాత్మ నివసిస్తాము, దానిని స్వీట్ హోమ్ అని అంటారు. అది ఆత్మల ఇల్లు. బ్రహ్మ మహాతత్వంలో ఆత్మలు లీనమవ్వవని మరియు ఆత్మ ఎప్పుడూ వినాశనం చెందదని పిల్లలకు తెలిసింది. ఆత్మ అవినాశి. తయారై తయారవుతున్న ఈ డ్రామా కూడా అవినాశి. ఈ డ్రామాలో ఎంత మంది పాత్రధారులున్నారు. ఇప్పుడిది సంగమయుగము, ఈ సమయంలో పాత్రధారులందరూ హాజరై ఉన్నారు. నాటకం పూర్తయితే పాత్రధారులందరూ, రచయిత మొదలైనవారంతా వచ్చి హాజరవుతారు. ఈ సమయంలో ఈ అనంతమైన డ్రామా కూడా పూర్తవుతుంది, తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ హద్దు నాటకాలలో మార్పులు జరగవచ్చు. డ్రామా పాతదైపోతుంది. ఈ అనంతమైన డ్రామా అనాది, అవినాశి అయినది. తండ్రి త్రికాలదర్శులుగా, త్రినేత్రులుగా తయారుచేస్తారు. దేవతలు త్రికాలదర్శులుగా ఉండరు. శూద్ర వర్ణం వారు త్రికాలదర్శులుగా ఉండరు. బ్రాహ్మణ వర్ణానికి చెందిన మీరు మాత్రమే త్రికాలదర్శులు. బ్రాహ్మణులుగా అవ్వనంత వరకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించడం జరగదు. వృక్షం యొక్క ఆదిమధ్యాంతాల గురించి మరియు అన్ని ధర్మాల గురించి కూడా మీకు తెలుసు. మీరు కూడా మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అవుతారు. తండ్రి పిల్లలను తమ సమానంగా తయారుచేస్తారు కదా. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే, వారు ఆత్మలందరికీ తండ్రి. పిల్లలందరినీ ఆస్తికులుగా చేసి త్రికాలదర్శులుగా తయారుచేస్తారు. శివబాబా వచ్చారు, వారిని స్మృతి చేయండి అని ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ చెప్పాలి. ఎవరైతే ఆస్తికులుగా అవుతారో, వారు తండ్రిని చాలా బాగా ప్రేమిస్తారు. మీపై తండ్రికి కూడా ప్రేమ ఉంది. మీకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి మరియు వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అని అంటూ ఉంటారు. గీతలో కొన్ని విషయాలు సత్యమైనవి ఉన్నాయి. శ్రీమద్భగవద్గీత సర్వోత్తమమైన శాస్త్రము. ఇది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం యొక్క శాస్త్రము. ముఖ్యమైన ధర్మ శాస్త్రాలు 4 అని అర్థం చేయించడం జరిగింది, మిగిలిన ధర్మాలవారు కేవలం వారి ధర్మాలను స్థాపన చేయడానికి వస్తారు. రాజ్యం మొదలైనవాటి విషయమేమీ ఉండదు, వారిని గురువులని కూడా అనలేరు. తిరిగి తీసుకువెళ్ళడమే గురువు కర్తవ్యము. ఇబ్రహిమ్, బుద్ధుడు, క్రీస్తు మొదలైనవారు వస్తారు, తర్వాత వారి వెనుక వారి వంశావళి కూడా వస్తుంది. గురువు అనగా దుఃఖం నుండి విముక్తులుగా చేసి సుఖంలోకి తీసుకువెళ్ళేవారు. ఆ ధర్మ స్థాపకులు కేవలం ధర్మస్థాపనను చేసేందుకు వస్తారు. ఇక్కడ చాలామందిని గురువులని అంటూ ఉంటారు. బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా గురువులని అనలేము. ఒక్క శివబాబా మాత్రమే సర్వుల సద్గతిదాత. పిలవడం కూడా ఒక్క రాముడినే పిలుస్తారు. శివబాబాను కూడా రాముడని అంటారు. చాలా భాషలున్నాయి కావున పేర్లు కూడా చాలా పెట్టేసారు. వారి అసలు పేరు శివ. వారిని సోమనాథుడని కూడా అంటారు. సోమ రసాన్ని తాగించారు అనగా జ్ఞాన ధనాన్ని ఇచ్చారు. ఇకపోతే నీరు మొదలైనవాటి విషయమేమీ లేదు. మిమ్మల్ని సమ్ముఖంలో నాలెడ్జ్ ఫుల్ గా, బ్లిస్ ఫుల్ గా తయారుచేస్తున్నారు. తండ్రి జ్ఞానసాగరుడు. పిల్లలైన మిమ్మల్ని జ్ఞాన నదులుగా తయారుచేస్తారు. సాగరం ఒకటే ఉంటుంది. ఒకే సాగరం నుండి అనేక నదులు వెలువడతాయి. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఈ సమయంలో ఈ భూమి అంతా రావణుని స్థానంగా ఉంది. కేవలం లంకలో మాత్రమే కాదు, మొత్తం భూమిపై రావణుని రాజ్యముంది. రామ రాజ్యంలో చాలా కొద్ది మంది మనుష్యులు ఉంటారు. ఇది కేవలం ఈ సమయంలో మాత్రమే మీ బుద్ధిలో ఉంది. తండ్రి అర్థం చేయించారు – నేను 3 ధర్మాలను స్థాపన చేస్తాను – బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలు. తర్వాత వైశ్య, శూద్ర వర్ణాలలో మిగిలినవారంతా వచ్చి తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు. బాబా అనేక ధర్మాల వినాశనం కూడా చేయిస్తారు. భారత్ లో త్రిమూర్తి చిత్రాన్ని కూడా తయారుచేస్తారు కానీ అందులో శివుని చిత్రాన్ని మాయం చేసేసారు. పరమపిత పరమాత్మ శివుడు బ్రహ్మా ద్వారా స్థాపన మరియు విష్ణువు ద్వారా పాలన చేయిస్తారని, వారిని కరన్ కరావన్ హార్ (చేసి చేయించేవారు) అని అంటారని శివుని చిత్రం ద్వారానే నిరూపించబడుతుంది. వారు స్వయము కర్మలు చేస్తారు, పిల్లలైన మీకు కూడా నేర్పిస్తారు. కర్మ-అకర్మ-వికర్మల గతులను కూడా అర్థం చేయిస్తారు. రావణ రాజ్యంలో మీరు చేసే కర్మలు వికర్మలు అవుతాయి. సత్యయుగంలో మీరు చేసే కర్మలు అకర్మలు అవుతాయి. ఇది రావణ రాజ్యం కావున ఇక్కడ వికర్మలే జరుగుతాయి. సత్యయుగంలో 5 వికారాలు అసలు ఉండవు. ఒక్కొక్క విషయము అర్థం చేసుకోవలసినది మరియు అది క్షణంలో అర్థం చేయించడం జరుగుతుంది. ఓం యొక్క అర్థాన్ని వారు చాలా విస్తారంగా అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు – ఓం అనగా నేను ఆత్మ మరియు ఇది నా శరీరము. ఇది ఎంత సహజము. మనం సుఖధామానికి వెళ్తున్నామని మీరు భావిస్తారు. కృష్ణుని మందిరాన్ని సుఖధామమని అంటారు. అది కృష్ణపురి. మాతలు కృష్ణపురికి వెళ్ళేందుకు చాలా కృషి చేస్తారు. ఇప్పుడు మీరు భక్తి చేయరు. మీకు జ్ఞానం లభించింది, మిగిలిన మనుష్యమాత్రులు ఎవరిలోనూ ఈ జ్ఞానం లేదు. నేను మిమ్మల్ని పావనంగా తయారుచేసి తీసుకువెళ్తాను, మళ్ళీ పతితులుగా ఎవరు చేస్తారు? ఈ విషయాన్ని ఎవరూ చెప్పలేరు. మేల్ మరియు ఫిమేల్ అందరూ భక్తురాళ్ళు, సీతలు. అందరి సద్గతి చేసేవారు తండ్రి. అందరూ రావణుని జైలులో ఉన్నారు. ఇది దుఃఖధామము. తండ్రి మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేస్తారు. ఇటువంటి తండ్రిని 5 వేల సంవత్సరాల తర్వాత కేవలం మీరు మాత్రమే చూస్తారు. లక్ష్మీనారాయణుల ఆత్మలకు ఇప్పుడు జ్ఞానముంది. నేను చిన్నప్పుడు ఇలా (కృష్ణునిగా) ఉండేవాడిని, పెద్దవాడిగా అయిన తర్వాత ఈ విధంగా శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాను అన్న జ్ఞానముంది, ఇంకెవరికీ ఈ జ్ఞానం లేదు.

మీరంతా పార్వతులు అని తండ్రి అంటారు, శివబాబా మిమ్మల్ని అమరులుగా తయారుచేసేందుకు, అమరలోకానికి తీసుకువెళ్ళేందుకు మీకు అమరకథను వినిపిస్తున్నారు. ఇది మృత్యులోకము. పార్వతులైన మీరంతా అమరనాథుని ద్వారా అమరకథను వింటున్నారు. మీరు నిజంగా అలా తయారవుతారు. కేవలం తండ్రిని స్మృతి చేయడంతో ఆత్మలైన మీరు అమరులుగా అవుతారు, అక్కడ దుఃఖమనే మాటే ఉండదు. ఉదాహరణకు సర్పము ఒక కుబుసాన్ని వదిలి మరొకటి ధరిస్తుంది. ఈ ఉదాహరణలన్నీ ఇక్కడికి చెందినవే. భ్రమరి ఉదాహరణ కూడా ఇక్కడికి చెందినదే. బ్రాహ్మణులైన మీరు ఏమి చేస్తారు? వికారీ పురుగులను మార్చి దేవతలుగా తయారుచేస్తారు. ఇది మనుష్యుల విషయమే. ఇది భ్రమరికి సంబంధించిన ఒక ఉదాహరణ. బ్రాహ్మణ పిల్లలైన మీరు ఇప్పుడు తండ్రి ద్వారా అమరకథను వింటున్నారు, ఇతరులకు కూడా కూర్చుని జ్ఞానాన్ని భూ-భూ చేస్తారు, దీని ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా, స్వర్గంలోని దేవకన్యలుగా తయారవుతారు. అంతేకానీ మానస సరోవరంలో మునక వేయడంతో ఎవరూ దేవకన్యలుగా అవ్వరు. ఇదంతా అసత్యము. మీరు అసత్యమే వింటూ వచ్చారు, ఇప్పుడు తండ్రి సత్యం వినిపిస్తారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి అంటారు. నిరాకార పరమపిత పరమాత్మ ఈ నోటి ద్వారా వినిపిస్తున్నారని మీరు అర్థం చేసుకుంటారు. మనం ఈ చెవుల ద్వారా వింటున్నాము. ఆత్మాభిమానులుగా అవ్వాలి, తర్వాత పరమాత్మ తాను ఎవరు అనేది రియలైజ్ చేయిస్తారు. ఇతరులెవరూ ఆత్మాభిమానులుగా తయారుచేయలేరు. మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి తప్ప ఇంకెవరూ చెప్పలేరు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారి జయంతి ఎలా జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. తండ్రియే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు – నేను సాధారణ వృద్ధ తనువులోకి ప్రవేశిస్తాను. లేదంటే బ్రహ్మా ఎక్కడ నుండి వస్తారు? పతిత తనువే కావాలి. సూక్ష్మవతనవాసి అయిన బ్రహ్మాలో విరాజమానమై బ్రాహ్మణులను రచించరు. నేను పతిత ప్రపంచంలో, పతిత శరీరంలోకి వస్తానని వారు అంటారు. బ్రహ్మా ద్వారా స్థాపన అని అంటూ ఉంటారు. తర్వాత ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో, వారు దేవతలుగా అవుతారు. మనుష్యులు బ్రహ్మా చిత్రాన్ని చూసి తికమకపడతారు. ఇది దాదా చిత్రము అని అంటారు. ప్రజాపిత బ్రహ్మా తప్పకుండా ఇక్కడే ఉంటారు. సూక్ష్మ వతనంలో ప్రజలను ఎలా రచిస్తారు? ప్రజాపితకు పిల్లలైన బ్రహ్మాకుమార-కుమారీలు వేల సంఖ్యలో ఉన్నారు. ఇది అసత్యమైతే కాదు. మనం శివబాబా ద్వారా వారసత్వాన్ని పొందుతున్నాము. వారు అవ్యక్త బ్రహ్మా అని పిల్లలైన మీకు అర్థం చేయించారు. ప్రజాపిత అయితే సాకారంలో ఉండాలి. పతితంగా ఉన్న వీరే పావనంగా అవుతారు. తతత్వమ్. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మాభిమానులుగా అయి ఈ చెవుల ద్వారా అమరకథను వినాలి. జ్ఞానాన్ని భూ-భూ చేస్తూ తమ సమానంగా తయారుచేసే సేవలో ఉండాలి.

2. తండ్రి సమానంగా నాలెడ్జ్ ఫుల్ గా, బ్లిస్ ఫుల్ గా అవ్వాలి. సోమరసాన్ని తాగాలి మరియు తాగించాలి.

వరదానము:-

‘సీ ఫాదర్ – ఫాలో ఫాదర్’ ఈ మంత్రాన్ని సదా ముందుంచుకొని ఎక్కే కళ వైపు వెళ్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి. ఎప్పుడూ ఆత్మలను చూడకండి ఎందుకంటే ఆత్మలందరూ పురుషార్థులు, పురుషార్థులలో మంచి ఉంటుంది మరియు కొంత లోపము కూడా ఉంటుంది, వారు సంపన్నంగా ఉండరు. అందుకే ఫాదర్ ను ఫాలో చేయాలి, అంతేకానీ బ్రదర్, సిస్టర్ ను కాదు. అప్పుడు, ఎలాగైతే తండ్రి ఏకరసంగా ఉన్నారో, అలా ఫాలో చేసేవారు స్వతహాగా ఏకరసంగా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top