16 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
15 August 2022
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - మీరు పవిత్రంగా ఉండే వ్రతాన్ని తీసుకోవాలి, ఇకపోతే, నిర్జలముగా ఉండాల్సిన, నిరాహార దీక్ష మొదలైనవి చేయాల్సిన అవసరం లేదు, పవిత్రంగా అయినట్లయితే విశ్వానికి యజమానిగా అవుతారు’’
ప్రశ్న: -
ఈ సమయములో ప్రపంచంలో అందరికన్నా మంచివారు ఎవరు మరియు ఎలా?
జవాబు:-
ఈ ప్రపంచంలో ఈ సమయములో అందరికన్నా మంచివారు పేదవారు ఎందుకంటే పేదివారినే తండ్రి వచ్చి కలుస్తారు. షావుకార్లు అయితే ఈ జ్ఞానాన్ని వినను కూడా వినరు. తండ్రి ఉన్నదే పేదల పెన్నిధి. పేదవారినే షావుకార్లుగా చేస్తారు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఈనాటి మానవునికి… (ఆజ్ కే ఇన్సాన్ కో…)
ఓంశాంతి. పిల్లలు పాటను విన్నారు. ఆ దైవీ ప్రేమను ఈశ్వరీయ ప్రేమ అని అంటారు. ఇప్పుడు ఈశ్వరుడు ఏ విధంగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని ప్రేమను నేర్పిస్తారు. భారత్ లో ఎప్పుడైతే సత్య ఖండము ఉండేదో, అప్పుడు ఎంత సత్యమైన ప్రేమ ఉండేది. సత్య ఖండాన్ని ఎవరు తయారుచేసారు? సద్గురువు, సత్యమైన బాబా, సత్యమైన టీచర్ తయారుచేసారు. ఇప్పుడు మీరు ఎవరి ఎదురుగా కూర్చున్నారు? సత్యమైన బాబా అనగా ఎవరైతే సత్యమైన సుఖాన్ని ఇచ్చేవారో, సత్యమైన ప్రేమను నేర్పించేవారో, సత్యమైన జ్ఞానాన్ని ఇస్తారో, వారి సమ్ముఖంలో కూర్చున్నారు. అసత్య ఖండంలో అయితే అంతా అసత్యమే. సత్యమైన సాంగత్యాన్ని చేయండి అని అంటూ ఉంటారు కూడా. సత్యమైన వారు అయితే ఒక్కరే. అసత్యమైనవారు అనేకులు ఉన్నారు. ఏ తండ్రి అయితే భారత్ ను స్వర్గంగా చేస్తారో, అనంతమైన వారసత్వాన్ని ఇస్తారో, ఆ అనంతమైన తండ్రి సమ్ముఖంలో మీరు కూర్చున్నారు. వారు మళ్ళీ మనకు అనంతమైన రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. సత్యమైన బాబా ఒక్కరే, వారి సాంగత్యంతో మీరు విశ్వానికి యజమానిగా అవుతారు. భక్తిలో మొట్టమొదట ఒక్క శివబాబాకు మాత్రమే సత్యాతి-సత్యమైన భక్తి జరుగుతుంది. దానినే సత్యమైన అవ్యభిచారి భక్తి అని అంటారు. బాబా కూర్చుని పిల్లలైన మీకు మొత్తం చక్రం యొక్క జ్ఞానాన్ని వినిపిస్తారు. మొట్టమొదట ఒక్క శివబాబా యొక్క భక్తి ఉండేది, దానిని అవ్యభిచారి భక్తి అని అనేవారు. మళ్ళీ ఇప్పుడు జ్ఞానం కూడా మీకు సత్యమైనది వినిపిస్తారు. అసత్యమైన భక్తి నుండి విడిపిస్తారు. సత్యమైన బాబా ద్వారా మీరు జ్ఞానాన్ని వింటున్నారు. మీకు తెలుసు, ఈ సత్యమైన సాంగత్యము మనల్ని స్వర్గములోకి తీసుకువెళ్తుంది. సత్యమైన జ్ఞానంతోనే నావ తీరానికి చేరుతుంది మరియు ఎవరైతే అసత్య జ్ఞానాన్ని వినిపిస్తారో, వారి వలన నావ మునిగిపోతుంది. దానిని అజ్ఞానమని అంటారు. సత్యమైన జ్ఞానం కేవలం తండ్రి మాత్రమే వినిపిస్తారు. పిల్లలైన మీరు మొత్తం చక్రం యొక్క చరిత్ర-భౌగోళికాలను అర్థం చేసుకున్నారు. కనుక వీరు సత్యాతి-సత్యమైన బాబా, సత్యాతి-సత్యమైన టీచరు. సత్యయుగంలో కూడా సత్యమైన తండ్రి అని అంటారు ఎందుకంటే అక్కడ అసత్యం ఉండనే ఉండదు. ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అనరు. ఎప్పుడైతే అసత్యంగా తయారుచేసే 5 వికారాలు వస్తాయో, అప్పటి నుండే అసత్యం మొదలవుతుంది.
ఇప్పుడు మనం అనంతమైన నిరాకార తండ్రి సమ్ముఖములో కూర్చున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ బాబా కూడా అంటారు, నేను ఆ బాబా సమ్ముఖంలో కూర్చున్నాను, వారిని స్మృతి చేస్తాను, ఘడియ-ఘడియ స్మృతి చేస్తాను. బాబాకు బిడ్డను కదా. మీరైతే ఈ సాకారుడిని విడిచిపెట్టి వారిని స్మృతి చేయాలి. నాకైతే బాబా ఒక్కరే ఉన్నారు. మీకైతే కొద్దిగా ఆటంకం కలుగుతుంది, నాకెందుకు ఆటంకం కలుగుతుంది. మీ దృష్టి వీరిపైకి వెళ్తుంది, నా దృష్టి ఎవరి పైకి వెళ్తుంది? నాదైతే డైరెక్ట్ శివబాబాతోనే కనెక్షన్ అయిపోయింది. మీరు శివబాబాను స్మృతి చేయవలసి ఉంటుంది. వీరి స్మృతి రాకూడదు అని ఈ సాకారుడిని దాటవలసి ఉంటుంది. నాకైతే ఒక్క శివబాబా మాత్రమే ఉన్నారు. మీ ఎదురుగా ఇద్దరు కూర్చున్నారు. నా ఎదురుగా అయితే కేవలం ఒక్కరే ఉన్నారు. నేను వారి బిడ్డను. అయినా కూడా నిరంతరము స్మృతి చేయలేను ఎందుకంటే బాబా అంటారు, మీరు కర్మయోగులు. మీ బుద్ధిలో మొత్తం చక్రము తిరుగుతూ ఉంటుంది. సత్య-త్రేతా యుగాలలో ఇన్ని జన్మలు దాటాము, మళ్ళీ ఇన్ని జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసాము. లెక్క ఉంది కదా. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమం వచ్చేసింది. మళ్ళీ తర్వాత కొత్త చక్రము తిరుగుతుంది. చరిత్ర-భౌగోళికాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. సత్యయుగంలో ఎవరు ఉండేవారు, ఎక్కడ రాజ్యం చేసేవారు. మొత్తం విశ్వము పైన దేవతలే రాజ్యం చేసేవారని కూడా మీకు తెలుసు. ఇప్పుడైతే మీరు మా హద్దులోకి రావద్దు, మా నీరు తీసుకోకండి అని అంటారు. బాబా అయితే అనంతమైన యజమాని. బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి. ఈ బాబా చెప్పరు. వీరి ద్వారా నిరాకార బాబా ఆత్మలైన మీకు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ఎప్పుడూ రోగులుగా లేక వ్యాధిగ్రస్తులుగా అవ్వరు అని చెప్తారు. ఇక్కడైతే తండ్రి పిల్లలకు జన్మనిచ్చి పెద్దవారిగా చేసి మళ్ళీ ఒకవేళ అకస్మాత్తుగా మరణిస్తే(శరీరం విడిచిపెడితే), అప్పుడు అందరూ ఎంత దుఃఖితులుగా అవుతారు. అప్పుడిక శరీర నిర్వహణ కోసం స్వయముగా పని చేయవలసి వస్తుంది. ఇది ఉన్నదే దుఃఖధామము. తండ్రి అయితే మీకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వరు. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని అంటారు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. తండ్రి నుండి నాకు వారసత్వము లభిస్తుంది అని కొడుకుకు తెలిసినా కూడా తన వ్యాపార-వ్యవహారాలనైతే తప్పకుండా నేర్చుకుంటాడు. వారసత్వము కోసం కేవలం కూర్చుని ఉండిపోడు. ఇకపోతే, కేవలం ఎవరైతే రాజుల వద్ద జన్మ తీసుకుంటారో, వారు వారసత్వము కోసం వేచి ఉంటారు. చాలా దాన-పుణ్యాలు చేయడం వలన రాజుల ఇంట్లో జన్మ లభిస్తుంది. రాజ్యాన్నే సంభాళించాల్సి ఉంటుంది. ఆ రాజులైతే పతితులు. ఇప్పుడు మీరు పావన రాజుల వద్ద జన్మ తీసుకోవాలి. లక్ష్మీ-నారాయణుల ఇంట్లో లేక సూర్యవంశీ రాజుల వద్ద జన్మ తీసుకోవాలి, అక్కడ ఏ రకమైన దుఃఖము ఉండదు. అన్ని దుఃఖాల నుండి విడుదలవుతారు. బాబా వచ్చి ఓర్పునిస్తారు. ఇప్పుడిది అంతిమ జన్మ. జన్మ-జన్మాంతరాలుగా మీ పరిస్థితి ఇలా అవుతూ వచ్చింది. పిల్లలు దుఃఖధామంలో పడిపోతూనే వచ్చారు, సుఖధామము ఎక్కడ నుండి వచ్చింది. ఇక్కడైతే చాలా దుఃఖము ఉంది, అల్పకాలికమైన సుఖము ఉంది. పెద్ద-పెద్ద వ్యక్తులు ఉన్నారు, వారికి కూడా దుఃఖమే దుఃఖము ఉంది. ఈ సమయంలో ఎవరైతే పేదవారిగా ఉన్నారో, వారు అందరికన్నా మంచివారు. తండ్రి పేదవారిని షావుకార్లుగా చేయడానికే వచ్చారు. దానము కూడా పేదవారికే ఇవ్వాల్సి ఉంటుంది. అందరూ సాధారణమైనవారే కదా. ఇకపోతే, ఎవరైతే లక్షాధికారులు ఉంటారో, ఎవరి వద్దనైతే కోట్ల ధనం ఉంటుందో, వారికి ఎంతగా అర్థం చేయించినా కూడా, తమ ధనము యొక్క గర్వం వారికి ఎంతగా ఉంటుంది. బాబా అంటారు, అటువంటివారికి ఏం ధనాన్ని ఇవ్వగలము. నేను ఉన్నదే పేదల పెన్నిధిని. అటువంటి కన్యలు, మాతలే జ్ఞానాన్ని తీసుకుంటారు. కన్యకు ఎంతగా గౌరవం ఉంటుంది, అందరూ ఆమెను పూజిస్తారు, మళ్ళీ వివాహం చేసుకుంటే ఆమె పూజారిగా అయిపోతుంది. మనం అర్ధకల్పము పూజ్యులుగా, మళ్ళీ అర్ధకల్పము పూజారులుగా అయ్యాము. కన్య అయితే ఈ జన్మలోనే పూజారిగా అయిపోతుంది. ఎంత పావనంగా ఉంటుంది, వివాహం చేసుకోవడంతోనే పూజారిగా, పతితముగా అయిపోతుంది. పతిని పరమేశ్వరునిగా భావించి తల వంచి నమస్కరిస్తూ ఉంటుంది. పతి ఎదురుగా దాసిగా అయి ఉంటుంది. మరి బాబా వచ్చి దాసత్వము నుండి విడిపిస్తారు. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. మేము ప్రజాపిత బ్రహ్మా పిల్లలము, శివబాబాకు మనవలమని మీరు అర్థం చేయించగలరు. వారి ఆస్తిపైన మనకు హక్కు ఉంటుంది. వారి ఆస్తి అనంతమైనది. వారు విశ్వానికి యజమానులుగా చేస్తారు. వారి ఆజ్ఞ ఉంది, పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే, నేను సత్యం చెప్తున్నాను – మీరు నారి నుండి లక్ష్మిగా అవుతారు. ఇందులో వ్రతాలు, నోములు చేయవలసిన, ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మీరు చాలా వ్రతాలు, నోములు పెట్టుకునేవారు. 7 రోజులు భోజనం తినేవారు కాదు. వ్రతాలు, నోములు పెట్టుకుంటూ కృష్ణపురిలోకి వెళ్ళిపోతామని భావించేవారు. వాస్తవానికి పవిత్రంగా ఉండడమే సత్యమైన వ్రతము. వారైతే హఠముతో ఆకలితో ఉంటారు. పిల్లలైన మీరు ఎటువంటి నిరాహార దీక్షలు మొదలైనవి చేయవద్దు. అయితే, మీరు పావనంగా అయ్యేటువంటి దీక్ష చేయాలి. మనం అందరినీ పావనంగా చేస్తాము. మీ వ్యాపారమే ఇది. ఇకపోతే, నిర్జలముగా ఉండడము, భోజనం చేయకుండా ఉండడము, దీని వలన ఏమీ జరగదు. మీరు కేవలం పవిత్రంగా ఉండే ప్రతిజ్ఞ చేయండి. మాతలకు పతి మరణిస్తే, చాలా దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు పతులకే పతి వచ్చి ఉన్నారని వారికి వెళ్ళి అర్థం చేయించాలి. వారంటారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే స్వర్గానికి యజమానిగా అవుతారు. వీరైతే పతులకే పతి, తండ్రులకే తండ్రి. పతి మరణించినట్లయితే స్త్రీకి జ్ఞానాన్ని అర్థం చేయించి శివబాబాతో నిశ్చితార్థం చేయించాలి. మీరు ఎందుకు ఏడుస్తున్నారు, సత్యయుగంలో ఎవ్వరూ ఏడ్వరు అని వారికి అర్థం చేయించాలి. ఇక్కడ చూడండి, అందరూ ఏడుస్తూ ఉంటారు. భారత్ లో సత్యాతి-సత్యమైన దేవతల రాజ్యం ఉండేది. ఈ రోజుల్లోనైతే ఒకరినొకరు హతమార్చుకుంటూ, గాయపర్చుకుంటూ ఉంటారు. ఆసురీ రాజ్యము కదా. లక్ష్మీ-నారాయణుల చిత్రము చాలా మంచిగా ఉంది. ఇందులో మొత్తం సెట్ అంతా ఉంది – త్రిమూర్తి, లక్ష్మీ-నారాయణులు, రాధే-కృష్ణులవి కూడా చిత్రాలు ఉన్నాయి, ఈ చిత్రాలను కూడా ఒకవేళ ఎవరైనా రోజూ చూస్తున్నట్లయితే, శివబాబా బ్రహ్మా ద్వారా మమ్మల్ని ఈ విధంగా తయారుచేస్తున్నారని గుర్తుంటుంది. ఇంట్లో కూడా చిన్న-చిన్న బోర్డులు తయారుచేసి రాయండి – అనంతమైన తండ్రిని తెలుసుకోవడం వలన మీరు 21 జన్మల కోసం స్వరాజ్య పదవిని పొందగలరు. నెమ్మది-నెమ్మదిగా చాలామంది మనుష్యులు బోర్డును చూసి మీ వద్దకు వస్తారు.
మీరు ఆత్మిక అవినాశీ సర్జన్లు. ఆత్మిక సర్జరీ యొక్క కోర్సు పాస్ అవుతున్నారు. బోర్డు పెట్టుకోవలసి ఉంటుంది. ఈ తండ్రిని స్మృతి చేస్తే మీకు అనంతమైన రాజ్యం లభిస్తుందని చెప్పండి. బాబా చాలా మంచి ప్రశ్నలు రాసారు. బాబాకు ఎంత మంది ఆత్మిక పిల్లలు ఉన్నారు? పిల్లలు కలవారు కదా. ఇందులో సోదరులు-సోదరీలు ఇరువురూ వచ్చేస్తారు. బాబా వద్దకు వస్తే, ఎంతమంది బి.కె.లు ఉన్నారు, ఎంతమంది పిల్లలు కలవాడిని అన్నది అర్థం చేయిస్తాను. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. మేము సోదరీ-సోదరులము, వికారీ దృష్టి ఉండదని మీరు అర్థం చేయించవచ్చు. తండ్రి అంటారు, దేహ సహితంగా దేహం యొక్క అసత్యమైన సంబంధాలన్నింటినీ విడిచిపెట్టి నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. మీరు ప్రతిజ్ఞ కూడా చేసారు, నాకైతే ఒక్క శివబాబా తప్ప వేరొకరు ఎవ్వరూ లేరు. వృద్ధ మాతలు కూడా ఈ రెండు పదాలను గుర్తు పెట్టుకున్నట్లయితే చాలా కళ్యాణము జరగగలదు. మనము 84 జన్మలు తీసుకున్నాము, ఇప్పుడు మనము బ్రాహ్మణులుగా అయ్యాము, మళ్ళీ దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వాలి మరియు తప్పకుండా కల్పక్రితము వలె అవుతారు కూడా. లెక్కలేనంతమంది తయారవుతారు. ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలు ఎవరైతే విదేశాలు మొదలైన వైపుకు వెళ్ళిపోయారో, వారు కూడా వెలువడి వస్తారు. స్మృతి అయితే చేస్తూ ఉంటారు. బాబా అంటారు, మీరు కుటుంబ పరివారంలో ఉంటూ స్వయాన్ని ఆత్మగా భావించండి. స్వయాన్ని శివబాబా యొక్క మనవడిగా భావించండి. మనము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. కలియుగంలో మనుష్యులు ఉన్నారు, సత్యయుగంలో దేవతలుగా అవుతారు. కలియుగంలో అందరూ ఆసురీ మనుష్యులు ఉన్నారు. ఇప్పుడు మీరు దైవీ సంప్రదాయానికి చెందినవారిగా అవుతున్నారు. ఈ విషయాలు తండ్రే చెప్తారు, ఇతరులెవ్వరూ చెప్పలేరు. ఈ వర్ణాల గురించి ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణులైన మీరే జ్ఞానాన్ని అర్థం చేయించగలరు. ఎప్పటివరకైతే ఎవరూ బి.కె.లైన మీ ద్వారా జ్ఞానాన్ని తీసుకోరో, అప్పటి వరకు అర్థము చేసుకోలేరు. మీరే ఇవ్వగలరు, ఇందులో హృదయం చాలా స్వచ్ఛంగా ఉండాలి, హృదయము స్వచ్ఛంగా ఉంటే సర్వ మనోకామనలు స్వతహాగా నెరవేరతాయి. కొంతమంది హృదయము స్వచ్ఛంగా ఉండదు, సత్యమైన హృదయంతో సత్యమైన తండ్రి సేవలో నిమగ్నమవ్వాలి. అభిరుచి ఉండాలి. అర్థం చేయించడము మన పని. ఇది కూడా మీకు తెలుసు, 108 మంది వెనుక కష్టపడితే ఎవరో ఒకరికి బుద్ధిలో కూర్చుంటుంది. ఒకరిద్దరు వెలువడుతారు, కల్పక్రితము ఎవరైతే వెలువడి ఉంటారో, వారే వెలువడుతారు. కల్పక్రితము బి.కె.లుగా అయి ఉంటే, వారే వస్తారు. అలసిపోకూడదు. మీరు శ్రమిస్తూ ఉండండి. ఎవరో ఒకరు వెలువడతారు. ఎక్కడికైనా వెళ్ళండి, మిత్ర-సంబంధీకుల వద్దకు వెళ్ళండి, వివాహాలు మొదలైనవాటికి వెళ్ళండి – ప్రతి ఒక్కరి కర్మల అనుసారముగా సలహా ఇవ్వడము జరుగుతుంది. ముఖ్యమైన విషయము పవిత్రంగా ఉండడము. ఒక్కోసారి బయట తినవలసి వస్తుంది కూడా. అచ్ఛా పిల్లలూ, శివబాబా స్మృతిలో ఉన్నట్లయితే మాయ యొక్క ప్రభావం ఉండదు. బాబా అందరికి అనుమతినివ్వరు. తప్పనిసరి పరిస్థితిలో చూడడము జరుగుతుంది. లేదంటే ఉద్యోగం పోతుంది. ప్రతి ఒక్కరికి వేర్వేరుగా సలహాను ఇవ్వడము జరుగుతుంది. ప్రపంచం చాలా చెడుగా ఉంది. చాలామందితో ఉండవలసి ఉంటుంది. ఒక కథ కూడా ఉంది. గురువు శిష్యునికి చెప్పారు, సింహం యొక్క గుహలో ఉండు, వేశ్య వద్దకు వెళ్ళు … అని పరీక్ష తీసుకోవడానికి పంపించారు. వాస్తవానికి అదేమీ పరీక్ష కాదు. ఇది పిల్లలైన మీ కోసమే. మిమ్మల్ని సింహం వద్దకైతే పంపించరు. ఎవరైనా సరే వారికి తండ్రి పరిచయాన్ని ఇవ్వండి అని తండ్రి అర్థం చేయిస్తారు. రోజు రోజుకు బుద్ధి యొక్క తాళము తెరుచుకుంటూ ఉంటుంది. వృక్షమైతే పెరగాల్సిందే కదా, అప్పుడే వినాశనం కూడా మొదలవ్వాలి, దీనికన్నా ముందు అయితే వినాశనము జరగదు. ఇక్కడైతే రాజధాని స్థాపన అవుతుంది. కేవలం నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. నాలెడ్జ్ ను ధారణ చేయడం కోసం హృదయాన్ని చాలా స్వచ్ఛంగా పెట్టుకోవాలి. సత్యమైన హృదయంతో తండ్రి సేవలో నిమగ్నమవ్వాలి. సేవలో ఎప్పుడూ కూడా అలసిపోకూడదు.
2. నాకైతే ఒక్క శివబాబా తప్ప వేరే ఎవ్వరూ లేరు అని ప్రమాణము చేయాలి. దేహ సహితంగా దేహం యొక్క అన్ని అసత్యమైన సంబంధాలను విడిచిపెట్టి ఒక్కరితో సర్వ సంబంధాలు జోడించాలి. పేదవారికి జ్ఞాన ధనాన్ని దానము ఇవ్వాలి.
వరదానము:-
సంగమయుగము సంతోషాల యుగము, ఆనందాల యుగము, కనుక సదా సంతోషంగా ఉండండి మరియు సంతోషాలను పంచుతూ ఉండండి. భాగ్యము మరియు భాగ్య విధాత సదా స్మృతిలో ఉండాలి. తండ్రి లభించారు అంటే అన్నీ లభించినట్లు – ఈ స్మృతియే సహజయోగిగా తయారుచేస్తుంది. ప్రపంచంవారు, కష్టము లేకుండా పరమాత్మ లభించలేరు అని అంటారు. మరియు మీరంటారు, ఇంట్లో కూర్చుని ఉండగానే తండ్రి లభించారు, ఏదైతే ఆలోచనలో కూడా లేదో, అది లభించింది. సంతోషాల సాగరుడు లభించారు… ఈ సంతోషంలోనే ఉండండి – ఇది కూడా సహజయోగమే.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!