16 April 2021 TELUGU Murli Today – Brahma Kumaris

April 15, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (వారసత్వం) ను స్మృతి చేసినట్లయితే రమణీయకంగా తయారవుతారు, తండ్రి రమణీయకమైనవారు కనుక వారి పిల్లలు కూడా రమణీయకంగా ఉండాలి”

ప్రశ్న: -

దేవతల చిత్రాల పట్ల అందరికీ ఆకర్షణ ఎందుకు కలుగుతుంది? వారిలో ఏ విశేషమైన గుణముంది?

జవాబు:-

దేవతలు చాలా రమణీయకమైనవారు మరియు పవిత్రమైనవారు. రమణీయకత కారణంగా వారి చిత్రాల పట్ల కూడా ఆకర్షణ కలుగుతుంది. దేవతలలో పవిత్రత యొక్క విశేషమైన గుణముంది, ఈ గుణం కారణంగానే అపవిత్రమైన మనుష్యులు వారి ఎదురుగా తల వంచుతూ ఉంటారు. ఎవరిలోనైతే సర్వ దైవీ గుణాలు ఉంటాయో, ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో, వారే రమణీయకంగా ఉంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా ఎంత అద్భుతమైనది. ఇటువంటి అనంతమైన తండ్రికి మీరందరూ పిల్లలు కావున పిల్లలైన మీరు కూడా ఎంత రమణీయకంగా ఉండాలి. దేవతలు కూడా రమణీయకమైనవారు కదా. కానీ రాజధాని చాలా పెద్దది. అందరూ ఒకేలా రమణీయకంగా ఉండలేరు. అయినా తప్పకుండా కొందరు పిల్లలు చాలా రమణీయకంగా ఉన్నారు. రమణీయకంగా ఎవరు ఉంటారు? ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో, ఎవరిలోనైతే దైవీ గుణాలు ఉంటాయో, వారు రమణీయకంగా ఉంటారు. ఈ రాధాకృష్ణులు మొదలైనవారు రమణీయకమైనవారు కదా. వారిలో చాలా ఆకర్షణ ఉంది. ఏ ఆకర్షణ ఉంది? పవిత్రత యొక్క ఆకర్షణ ఉంది, ఎందుకంటే వీరి ఆత్మ కూడా పవిత్రమైనది మరియు శరీరం కూడా పవిత్రమైనది. కావున పవిత్ర ఆత్మలు అపవిత్ర ఆత్మలను ఆకర్షిస్తారు. వారి చరణాలకు నమస్కరిస్తారు. వారిలో ఎంత శక్తి ఉంటుంది. సన్యాసులైనా సరే, దేవతల ఎదురుగా తప్పకుండా తల వంచుతారు. కొందరు చాలా అహంకారులుగా ఉంటారు కానీ దేవతల ఎదురుగా లేదా శివుని ఎదురుగా తప్పకుండా తల వంచుతారు. దేవీల చిత్రాల ఎదురుగా కూడా తల వంచుతారు ఎందుకంటే తండ్రి రమణీయకమైనవారు కావున తండ్రి తయారుచేసిన దేవీదేవతలు కూడా రమణీయకమైనవారే. వారిలో పవిత్రత యొక్క ఆకర్షణ ఉంది. వారి ఆ ఆకర్షణ ఇప్పటికీ కొనసాగుతుంది. కావున – మేము ఈ లక్ష్మీనారాయణులు వలె అవుతామని ఎవరైతే అనుకుంటున్నారో, మరి వీరిలో ఎంత ఆకర్షణ ఉందో, అంత ఆకర్షణ మీలో కూడా ఉండాలి. ఈ సమయంలోని మీ ఆకర్షణ ఇక అవినాశీగా అయిపోతుంది. అందరి విషయంలోనూ ఇలా జరగదు. నంబరువారుగా ఉన్నారు కదా. ఎవరైతే భవిష్యత్తులో ఉన్నత పదవిని పొందుతారో, వారిలో ఇక్కడి నుండే ఆకర్షణ ఉంటుంది ఎందుకంటే ఆత్మ పవిత్రంగా తయారవుతుంది. మీలో ఎవరైతే ముఖ్యంగా స్మృతియాత్రలో ఉంటారో, వారిలో ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. యాత్రలో పవిత్రత తప్పకుండా ఉంటుంది. పవిత్రతలోనే ఆకర్షణ ఉంటుంది. పవిత్రత యొక్క ఆకర్షణ అనేది, చదువు పట్ల కూడా ఆకర్షణను కలిగిస్తుంది. ఈ విషయం మీకు ఇప్పుడే తెలిసింది. మీకు వారి (లక్ష్మీనారాయణుల) కర్తవ్యం గురించి తెలుసు. వారు కూడా తండ్రిని ఎంతగా స్మృతి చేసి ఉంటారు. వారు అంతటి రాజ్యాన్ని ఏదైతే పొందారో, అది తప్పకుండా రాజయోగం ద్వారానే పొంది ఉంటారు. ఈ సమయంలో మీరు ఈ పదవిని పొందేందుకు వచ్చారు. తండ్రి కూర్చొని మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ నిశ్చయాన్ని పక్కా చేసుకొని ఇక్కడకు వచ్చారు కదా. తండ్రి కూడా వారే, చదివించేవారు కూడా వారే. తమతో పాటు తీసుకువెళ్ళేవారు కూడా వారే. కావున ఈ గుణాలు సదా ఉండాలి. సదా హర్షితముఖులుగా ఉండండి. అల్ఫ్ అయిన తండ్రి స్మృతిలో ఉన్నప్పుడు సదా హర్షితంగా ఉంటారు. అప్పుడు బే అనగా వారసత్వం కూడా స్మృతిలో ఉంటుంది, మరియు దీని ద్వారా చాలా రమణీయకంగా కూడా అవుతారు. మనమిక్కడ రమణీయకంగా అయ్యి మళ్ళీ భవిష్యత్తులో ఇలా రమణీయకంగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడి చదువే అమరపురిలోకి తీసుకువెళ్తుంది. ఈ సత్యమైన తండ్రి మీకు సత్యమైన సంపాదనను చేయిస్తున్నారు. ఈ సత్యమైన సంపాదనయే 21 జన్మలు మీతో పాటు వస్తుంది. తర్వాత భక్తి మార్గంలో మీరు చేసే సంపాదన అల్పకాలికమైన సుఖం కోసమే. అది సదా మీతో పాటు ఉండదు. కావున పిల్లలు ఈ చదువులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సాధారణమైనవారు, మిమ్మల్ని చదివించేవారు కూడా పూర్తిగా సాధారణ రూపంలో ఉన్నారు కావున చదువుకునేవారు కూడా సాధారణంగానే ఉంటారు, లేదంటే సిగ్గుగా అనిపిస్తుంది. మేము ఉన్నతమైన వస్త్రాలను ఎలా ధరించగలము. మా మమ్మా-బాబాలు ఎంత సాధారణంగా ఉన్నారు, కావున మేము కూడా సాధారణంగా ఉంటాము. వీరెందుకు సాధారణంగా ఉంటారు? ఎందుకంటే వనవాహంలో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు వెళ్ళాలి, ఇక్కడేమీ వివాహం చేసుకోరు. వారు వివాహం చేసుకున్నప్పుడు కుమారి వనవాహంలో ఉంటుంది. మురికి బట్టలను ధరిస్తుంది, మొత్తం నూనె పెట్టుకుంటుంది, ఎందుకంటే అత్తవారింటికి వెళ్తుంది. బ్రాహ్మణుడి ద్వారా నిశ్చితార్థం జరుగుతుంది. మీరు కూడా అత్తవారింటికి వెళ్ళాలి. రావణపురి నుండి రామపురిలోకి అనగా విష్ణుపురిలోకి వెళ్ళాలి. ఎటువంటి దేహాభిమానం లేదా వస్త్రాల అభిమానం కలగకూడదని ఈ వనవాహ పద్ధతిని పెట్టారు. ఎవరి వద్దనైనా సాధారణమైన చీర ఉన్నప్పుడు, వారు ఇతరుల వద్ద ఖరీదైన చీర ఉండడం చూస్తే, ఆలోచన నడుస్తుంది. వీరు వనవాహంలో లేరు కదా అని భావిస్తారు. కానీ మీరు వనవాహంలో ఇలా సాధారణంగా ఉంటూ కూడా, ఎవరికైనా ఇంత ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే, అంతటి నషా కలిగి ఉంటే, వారికి కూడా బాణం తగులుతుంది. పాత్రలు తోముతున్నా లేదా బట్టలు ఉతుకుతున్నా సరే, మీ ముందుకు ఎవరైనా వస్తే వారికి వెంటనే అల్ఫ్ యొక్క స్మృతిని కలిగించండి. మీకు ఆ నషా ఎక్కి ఉండాలి. సాధారణ వస్త్రాలను ధరించి ఎవరికైనా జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే, వీరిలో ఎంత ఉన్నతమైన జ్ఞానముంది అని వారు కూడా ఆశ్చర్యపోతారు. ఇది గీతా జ్ఞానము మరియు భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానము. రాజయోగము అంటే గీతా జ్ఞానమే. మరి ఈ విధంగా నషా కలుగుతుందా? బాబా తమ ఉదాహరణను చెప్తారు. నేను పిల్లలతో ఏదైనా ఆట ఆడుతున్నప్పుడు, ఎవరైనా జిజ్ఞాసువు ఎదురుగా వచ్చారంటే, వారికి వెంటనే తండ్రి పరిచయాన్నిస్తాను. యోగ శక్తి, యోగబలం ఉన్న కారణంగా, ఆ వ్యక్తి కూడా అక్కడే నిలబడిపోయి, వీరు ఇంత సాధారణంగా ఉన్నారు కానీ వీరిలో ఎంతటి శక్తి ఉంది అని ఆశ్చర్యపోతారు. అప్పుడిక ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేరు. నోటి నుండి ఏ మాట రాదు. ఎలాగైతే మీరు వాణి నుండి అతీతంగా ఉన్నారో, అలా అతను కూడా వాణి నుండి అతీతంగా అయిపోతారు. లోలోపల ఈ నషా ఉండాలి. సోదరి లేదా సోదరుడు ఎవరైనా వస్తే, వారిని అలా నిలబెట్టి, విశ్వానికి యజమానులుగా తయారుచేసే మతాన్ని ఇవ్వవచ్చు. లోలోపల అంతటి నషా ఉండాలి. మీ తపనతో నిలబడిపోవాలి. మీ వద్ద జ్ఞానమైతే ఉంది కానీ యోగము యొక్క పదును లేదు అని బాబా సదా అంటూ ఉంటారు. పవిత్రతతో మరియు స్మృతిలో ఉండడంతోనే పదును వస్తుంది. స్మృతి యాత్ర ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. శక్తి లభిస్తుంది. జ్ఞానము ధనానికి సంబంధించిన విషయము. ఉదాహరణకు స్కూల్లో చదువుకుని ఎమ్.ఎ., బి.ఎ. మొదలైనవి చేస్తే, వారికి దానికి తగినంత ధనం లభిస్తుంది. కానీ ఇక్కడి విషయం వేరు. భారత్ యొక్క ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. ఇది స్మృతి. తండ్రి సర్వశక్తివంతుడు కావున పిల్లలకు తండ్రి నుండి శక్తి లభిస్తుంది. పిల్లలకు లోలోపల ఏమని ఉండాలంటే – ఆత్మలమైన మేము బాబా సంతానము, కానీ మేము బాబా అంత పవిత్రంగా లేము, ఇప్పుడు అలా తయారవ్వాలి. ఇదే మీకు లక్ష్యము-ఉద్దేశ్యము. యోగం ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. అనన్యులైన పిల్లలెవరైతే ఉన్నారో, వారు రోజంతా ఇవే ఆలోచనలతో ఉంటారు. ఎవరైనా వస్తే, మేము వీరికి మార్గాన్ని చూపించాలి, పాపం వీరు అంధులుగా ఉన్నారు అని వారి పట్ల దయ కలగాలి. అంధులకు చేతికర్రను అందించి తీసుకువెళ్తారు కదా. వీరంతా అంధులే, జ్ఞాన నేత్రం లేదు.

ఇప్పుడు మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రం లభించింది కావున అంతా తెలుసుకున్నారు. మనమిప్పుడు మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నాము. ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్ (చెడు వినకండి, చెడు చూడకండి)…… ఈ చిత్రం ఎందుకు తయారుచేయబడింది అనేది మీకు ఇంతకుముందేమైనా తెలుసా? ప్రపంచంలోని వారెవరికీ దీని అర్థం తెలియదు, మీకు ఇప్పుడు తెలుసు. ఎలాగైతే తండ్రి నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారో, అలా వారికి పిల్లలైన మీరు కూడా ఇప్పుడు నంబరువారు పురుషార్థమనుసారంగా నాలెడ్జ్ ఫుల్ గా అవుతున్నారు. కొంతమందికి చాలా నషా ఎక్కుతుంది. వాహ్! బాబాకు బిడ్డగా అయి బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోలేదంటే, వారికి బిడ్డగా అయి ఏమి చేసినట్లు! రోజూ రాత్రి తమ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. బాబా వ్యాపారి కదా. వ్యాపారస్థులకు లెక్కలు తీయడం సహజమనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు లెక్కలు తీయడం రాదు, వారు వ్యాపారస్థులు కూడా కారు. వ్యాపారస్థులు బాగా అర్థం చేసుకుంటారు. మీరు వ్యాపారస్థులు. మీరు మీ లాభ-నష్టాలను అర్థం చేసుకుంటారు, రోజూ ఖాతాను చూసుకోండి. లెక్కలను సంభాళించండి. నష్టముందా లేదా లాభముందా అని చూడండి. మీరు వ్యాపారస్థులు కదా. బాబా వ్యాపారస్థుడు, రత్నాకరుడు అన్న గాయనముంది కదా. అవినాశీ జ్ఞాన రత్నాల వ్యాపారాన్ని ఇస్తారు. ఇది కూడా నంబరువారు పురుషార్థం అనుసారంగా మీకు తెలుసు. అందరూ చురుకైన బుద్ధి కలవారు కాదు, ఒక చెవితో వింటారు, మరొక చెవి నుండి బయటకు వెళ్ళిపోతుంది. జోలిలో ఉన్న రంధ్రము నుండి బయటకు వెళ్ళిపోతుంది. జోలి నిండదు. ధనం ఇచ్చినట్లయితే ధనం తరగదు అని తండ్రి అంటారు. ఇవి అవినాశీ జ్ఞాన రత్నాలు కదా. తండ్రి రూప్-బసంత్. వారు కూడా ఆత్మనే, వారిలో జ్ఞానముంది. వారి పిల్లలైన మీరు కూడా రూప్ (యోగయుక్తులు) మరియు బసంత్ (జ్ఞానయుక్తులు). ఆత్మలో జ్ఞానం నింపబడుతుంది. ఆత్మకు రూపముంది. ఆత్మ చిన్నదే కానీ రూపమైతే ఉంది కదా. ఆత్మను తెలుసుకోవడం జరుగుతుంది, పరమాత్మను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సోమనాథుని భక్తి చేస్తారు, అప్పుడు ఇంత చిన్న నక్షత్రానికి ఎలా పూజ చేస్తారు. పూజ కోసం ఎన్ని లింగాలను తయారుచేస్తారు. శివలింగాన్ని పైకప్పంత పెద్దదిగా కూడా తయారు చేస్తారు. వాస్తవానికి చిన్న రూపమే కానీ వారి పదవి ఉన్నతమైనది కదా.

ఈ జప-తపాలు మొదలైనవాటి ద్వారా ఏ ప్రాప్తి ఉండదని తండ్రి కల్పక్రితం కూడా చెప్పారు. ఇవన్నీ చేస్తూ కిందకే పడిపోతూ ఉంటారు. మెట్లు కిందకే దిగుతారు. ఇప్పుడు మీది ఎక్కే కళ. బ్రాహ్మణులైన మీరు మొదటి నంబరు జిన్ను భూతము వంటివారు. కథ ఉంది కదా – నాకు పని ఇవ్వకపోతే నేను తినేస్తాను అని జిన్ను అంటుంది. అప్పుడు మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఉండమని ఆ జిన్నుకు పని ఇవ్వడం జరిగింది. కావున దానికి ఇక పని దొరికింది. ఈ అనంతమైన మెట్లను మీరు దిగుతారు, మళ్ళీ ఎక్కుతారని బాబా కూడా అన్నారు. మీరే మెట్లన్నీ దిగుతారు, మళ్ళీ ఎక్కుతారు. జిన్ను భూతం మీరే. ఇతరులెవ్వరూ మెట్లన్నీ ఎక్కరు. మెట్లు అన్నింటి యొక్క జ్ఞానాన్ని పొందడం ద్వారా మీరు ఎంత ఉన్నత పదవిని పొందుతారు. మళ్ళీ దిగుతారు, ఎక్కుతారు. తండ్రి అంటారు – నేను మీ తండ్రిని, మీరు నన్ను పతితపావనుడని అంటారు కదా, నేను సర్వశక్తివంతుడను, ఆల్మైటీని ఎందుకంటే నా ఆత్మ సదా 100 శాతం పవిత్రంగా ఉంటుంది. నేను బిందురూపుడను, అథారిటీని. నాకు శాస్త్రాలన్నింటి రహస్యము తెలుసు. ఇది ఎంత అద్భుతము. ఇదంతా అద్భుతమైన జ్ఞానము. ఆత్మలో 84 జన్మల అవినాశీ పాత్ర ఉంటుందని ఎప్పుడూ విని ఉండరు. అది ఎప్పుడూ అరగదు. అలా నడుస్తూనే ఉంటుంది. 84 జన్మల చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆత్మలో 84 జన్మల రికార్డు నిండి ఉంది. ఇంత చిన్న ఆత్మలో ఎంత జ్ఞానముంది. ఈ జ్ఞానం బాబాలో కూడా ఉంది మరియు పిల్లలైన మీలో కూడా ఉంది. ఎంత పాత్రను అభినయిస్తారు. ఈ పాత్ర ఎప్పటికీ అంతమవ్వదు. ఆత్మను ఈ కళ్ళ ద్వారా చూడలేము. అది ఒక బిందువు, నేను కూడా అలాంటి బిందువునేనని బాబా కూడా అంటారు. ఇది కూడా పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. మీరు అనంతమైన త్యాగులు మరియు రాజఋషులు. మీకు ఎంత నషా ఎక్కాలి. రాజఋషులు పూర్తిగా పవిత్రంగా ఉంటారు. రాజఋషులు అనగా సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, కానీ మీలానే వారు కూడా రాజ్యాన్ని ఇక్కడే పొందుతారు. మేము వెళ్తున్నామని, నావికుని స్టీమర్లో కూర్చొన్నామని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇది పురుషోత్తమ సంగమయుగమని కూడా మీకు తెలుసు. తప్పకుండా పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచానికి వయా శాంతిధామం వెళ్ళాలి అని పిల్లల బుద్ధిలో సదా ఉండాలి. మనము సత్యయుగంలో ఉన్నప్పుడు వేరే ఖండమేదీ ఉండేది కాదు. మన రాజ్యమే ఉండేది. ఇప్పుడు మళ్ళీ యోగబలంతో మన రాజ్యాన్ని తీసుకుంటున్నాము ఎందుకంటే యోగబలంతోనే విశ్వరాజ్యాన్ని పొందగలమని అర్థం చేయించడం జరిగింది. బాహుబలంతో ఎవరూ పొందలేరు. ఇది అనంతమైన డ్రామా. ఈ ఆట తయారై ఉంది. ఈ ఆటను గురించిన వివరణ బాబానే ఇస్తారు. ప్రారంభం నుండి మొదలుకొని మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర-భూగోళాలను వినిపిస్తారు. మీకు సూక్ష్మవతనం, మూలవతనం యొక్క రహస్యాలు కూడా మంచి రీతిలో తెలుసు. స్థూలవతనంలో వీరి రాజ్యముండేది అనగా మన రాజ్యముండేది. మీరు మెట్లు ఎలా దిగుతారు అనేది కూడా గుర్తుకొచ్చింది. మెట్లు ఎక్కడము మరియు దిగడమనే ఆట పిల్లల బుద్ధిలో కూర్చొంది. ఈ ప్రపంచం యొక్క చరిత్ర-భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది ఇప్పుడు బుద్ధిలో ఉంది, ఇందులో మనది హీరో-హీరోయిన్ల పాత్ర. మనమే ఓడిపోతాము, మళ్ళీ మనమే గెలుపొందుతాము, కావుననే హీరో-హీరోయిన్ అన్న పేర్లు పెట్టడం జరిగింది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడు మనం వనవాహములో ఉన్నాము కావున చాలా-చాలా సాధారణంగా ఉండాలి. ఏ రకమైన దేహాభిమానం లేక వస్త్రాలు మొదలైనవాటి పట్ల అభిమానం ఉండకూడదు. ఏ కర్మ చేస్తున్నా సరే తండ్రి స్మృతి యొక్క నషా ఎక్కి ఉండాలి.

2. మేము అనంతమైన త్యాగులము మరియు రాజఋషులము అనే నషాలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. జ్ఞాన ధనంతో నిండుగా అయి దానం చేయాలి. సత్యాతి-సత్యమైన వ్యాపారులుగా అయి తమ లెక్కాపత్రాన్ని పెట్టుకోవాలి.

వరదానము:-

సేవాధారి ఆత్మల మస్తకంపై విజయ తిలకం దిద్దబడి ఉంటుంది, కానీ ఏ స్థానం యొక్క సేవ చేయాలో, ఆ స్థానంలో ముందు నుండే సెర్చ్ లైట్ యొక్క ప్రకాశాన్ని ప్రసరింపజేయాలి. స్మృతి యొక్క సెర్చ్ లైట్ ద్వారా ఎటువంటి వాయుమండలం తయారవుతుందంటే, దాని ద్వారా అనేక ఆత్మలు సహజంగా సమీపంగా వచ్చేస్తారు. అప్పుడిక తక్కువ సమయంలో సఫలత వేయి రెట్లు లభిస్తుంది. దీని కోసం – మేము విజయీ రత్నాలము కావున ప్రతి కర్మలో విజయం ఇమిడి ఉంది అనే దృఢ సంకల్పం చేయండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top