15 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen BK Murli Of 15 June 2021 in Telugu Murli Today | Daily Murli Online
14 June 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసేందుకు, మేము ఎవరి పిల్లలము అనే స్మృతిలో సదా ఉండండి, తండ్రిని మర్చిపోయినట్లయితే సుఖం మాయమైపోతుంది”
ప్రశ్న: -
తండ్రి లభించారు అన్న స్థిరమైన సంతోషం ఏ పిల్లలకు ఉంటుంది?
జవాబు:-
ఏ పిల్లలైతే ఒక్కరితోనే తమ సర్వ సంబంధాలను జోడించారో, ఎవరైతే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండే శ్రమను చేస్తారో, ఏ దేహధారినీ గుర్తు చేయరో, వారికి మాత్రమే స్థిరమైన సంతోషం ఉంటుంది. దేహధారుల స్మృతి ఉన్నట్లయితే, చాలా ఏడవాల్సి ఉంటుంది. విశ్వానికి యజమానులుగా అయ్యేవారు ఎప్పుడూ ఏడవరు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
బాల్యపు రోజులను మర్చిపోవద్దు….. (బచ్పన్ కే దిన్ భులా న దేనా…..)
ఓంశాంతి. తండ్రి అంటారు – మధురమైన పిల్లలూ, మేము అనంతమైన తండ్రి పిల్లలము అనే విషయాన్ని మర్చిపోకండి. ఇది మర్చిపోయారంటే మిమ్మల్ని మీరు ఏడిపించుకుంటారు, ఛీ-ఛీ ప్రపంచంలోకి బుద్ధి వెళ్ళిపోతుంది. తండ్రి స్మృతి ఉన్నట్లయితే అతీంద్రియ సుఖం అనుభవమవుతుంది. తండ్రిని మర్చిపోతే ఆ సుఖం మాయమైపోతుంది. మేము బాబా పిల్లలము అన్నది ప్రతి క్షణం గుర్తుండాలి, లేదంటే మిమ్మల్ని మీరు ఏడిపించుకుంటారు. అందరూ భగవంతుని పిల్లలు. ఓ బాబా, ఓ పరమ పిత పరమాత్మ, రక్షించండి అని అందరూ అంటారు. కానీ తండ్రి నుండి రక్షణ ఎప్పుడు లభిస్తుంది అనేది ఎవరికీ తెలియదు. తండ్రి నుండి మనకు ముక్తి-జీవన్ముక్తి ఎప్పుడు లభించనున్నది అనేది సాధు-సత్పురుషులు మొదలైనవారెవరికీ తెలియదు, ఎందుకంటే భగవంతుడిని కణ-కణంలో ఉన్నారని అనేసారు. ఇప్పుడు పిల్లలైన మీరు అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు. వారు అత్యంత ప్రియమైన తండ్రి, వారికన్నా ప్రియమైన వస్తువు ఇంకేదీ ఉండదు. అటువంటి తండ్రిని తెలుసుకోకపోవడమనేది చాలా పెద్ద తప్పు. శివ జయంతిని ఎందుకు జరుపుకుంటారు, వారెవరు? ఇది కూడా ఎవరికీ తెలియదు. తండ్రి అంటారు – మీరు ఎంత తెలివిహీనులుగా అయిపోయారు, మాయా రావణుడు మిమ్మల్ని ఎలా తయారుచేసేసాడు. ఇది నా జన్మభూమి అని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తాను. వారేమో, 40 వేల సంవత్సరాల తర్వాత ఈ కలియుగం పూర్తి అయినప్పుడు వస్తానని చెప్తారు. త్రిమూర్తి చిత్రాన్ని కూడా చూపించడం జరుగుతుంది. త్రిమూర్తి మార్గం అనే పేరు కూడా పెట్టారు కానీ త్రిమూర్తులైన బ్రహ్మా-విష్ణు-శంకరులను గురించి ఎవరికీ తెలియదు. బ్రహ్మా ఏమి చేసి వెళ్ళారు, విష్ణు మరియు శంకరులు ఏమి చేస్తారు, ఎక్కడ ఉంటారు అనేది ఏమీ తెలియదు. పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. తండ్రి రచయిత, వారిది ఎంత పెద్ద రచన. ఇది అనంతమైన నాటకము. ఇందులో లెక్కలేనంత మంది మనుష్యులుంటారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం సత్యయుగం ఉన్నప్పుడు, భారత్ లో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు, ఇంకే రాజ్యం ఉండేది కాదు. భగవతి అని శ్రీ లక్ష్మిని, భగవాన్ అని శ్రీ నారాయణుడిని అంటారు. సీతా-రాములను కూడా భగవాన్ రామ, భగవతి సీత అని అంటారు. ఇప్పుడు ఈ భగవాన్ నారాయణ, భగవతి లక్ష్మి ఎక్కడ నుండి వచ్చారు? రాజ్యం చేసి వెళ్ళారు. కానీ వారి జీవిత కథ గురించి ఒక్కరికి కూడా తెలియదు. భగవంతుడు దుఃఖహర్త-సుఖకర్త అని కేవలం పాడుతూ ఉంటారు కానీ వారు దుఃఖహర్త-సుఖకర్తగా ఎలా అయ్యారు అనేది ఎవరి బుద్ధిలోకి రాదు. అందరికీ ఏ సుఖాన్ని ఇచ్చారు మరియు అందరి దుఃఖాలను ఎప్పుడు హరించారు అనేది ఏమీ తెలియదు.
పిల్లలైన మీరిప్పుడు భగవతి లక్ష్మిగా, భగవాన్ నారాయణునిగా అయ్యేందుకు ఇక్కడ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. భగవతి సీతగా, భగవాన్ రామునిగా కూడా అవ్వనున్నారని మీకు తెలుసు. సత్యయుగంలో 8 జన్మలు పూర్తి చేసుకుని సీతా-రాముల రాజ్యంలోకి వెళ్తారు. ఇక్కడ మీరు 21 జన్మల కోసం అనంతమైన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. మీరు భగవతి-భగవాన్ గా, స్వర్గానికి యజమానులుగా అవుతున్నారు. స్వర్గమనేది ఆకాశంలో ఏమీ లేదు, ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు. పూర్తిగా తుచ్ఛ బుద్ధి కలవారిగా ఉన్నారు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని అంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. అచ్ఛా, క్రిస్టియన్లు, బౌద్ధులు మొదలైన వారందరూ స్వర్గంలోకి వెళ్తారా? వారంతా తర్వాత వచ్చి తమ ధర్మ స్థాపన చేస్తారు. కావున వారు స్వర్గంలోకి ఎలా రాగలరు? స్వర్గమని దేనినంటారనేది కూడా వారికి తెలియదు. సన్యాసులు జ్యోతిలో జ్యోతి కలిసిపోయిందని అంటారు. మరికొందరు నిర్వాణధామానికి వెళ్తారని అంటారు. నిర్వాణము కూడా లోకం కదా. అది నివసించే స్థానము. జ్యోతి జ్యోతిలో లీనమయ్యే విషయమేమీ లేదు. జ్యోతిలో కలిసిపోతే, ఇక ఆత్మ సమాప్తమైపోతుంది. ఆటే సమాప్తమైపోతుంది. ఈ డ్రామా నుండి ఏ ఆత్మ విడుదల అవ్వలేదు, ఎవరూ మోక్షాన్ని పొందలేరు. పాట అర్థాన్ని కూడా ఎవరూ తెలుసుకోరు. జీవన్ముక్తి అర్థాన్ని తెలుసుకోరు, ఆత్మ-పరమాత్మల అర్థాన్ని తెలుసుకోరు. తండ్రి అంటారు – మీ ముఖాలు మనుష్యులవి, ఈ దేవతల ముఖాలు కూడా ఇలాగే ఉంటాయి. సత్యయుగం ఆదిలో దేవతలుండేవారు. వారి రాజ్యం 2500 సంవత్సరాలు నడిచింది, ఇక మిగిలినది 2500 సంవత్సరాలు, అందులో అన్ని ధర్మాలు వచ్చేస్తాయి. మనుష్యులు కల్పవృక్ష ఆయువును 5 వేల సంవత్సరాలకు బదులుగా లక్షల సంవత్సరాలని అంటారు. అలాగని, మీరు చెప్పే విషయాలను అర్థం చేసుకోవడానకి కూడా రారు. అయితే, ఎవరైతే కల్పక్రితం వచ్చి అర్థం చేసుకుని ఉంటారో వారే వస్తారు. ఒకటేమో హద్దు సన్యాసం, సన్యాసులు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవులలో ఉంటారని ముందు అర్థం చేయించాలి. మొదట్లో వారు సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయారు, అందుకే అడవుల నుండి తిరిగి వచ్చి పెద్ద-పెద్ద మహళ్ళను తయారుచేసుకున్నారు. ఈ సన్యాసులు కూడా తప్పకుండా పవిత్రత ఆధారంగా భారత్ ను నిలబెట్టారు, భారత్ యొక్క సేవను చేసారు. ఈ సన్యాస ధర్మమే లేకపోయుంటే, భారత్ పూర్తిగా వికారాలలో కాలిపోయుండేది, పతితంగా అయిపోయుండేది. డ్రామా ఈ విధంగా తయారుచేయబడింది. మొదట్లో వారిలో పవిత్రతా శక్తి ఉండేది, దానితో భారత్ ను నిలబెట్టారు. ఈ దేవతల రాజ్యమున్నప్పుడు భారత్ ఎంత షావుకారుగా ఉండేది. వీరికి ఎంతో పెద్ద-పెద్ద వజ్ర-వైఢూర్యాల మహళ్ళుండేవి. అవన్నీ ఏమైపోయాయి? అన్నీ కిందకు వెళ్ళిపోయాయి. లంక మరియు ద్వారకలు గురించి – సముద్రం కిందకు వెళ్ళిపోయాయని అంటారు. ఇప్పుడవి లేవు. ఇంతకుముందు బంగారు మహళ్ళు మొదలైనవన్నీ ఉండేవి కదా. మందిరాలు మొదలైనవాటిలోనే వజ్ర-వైఢూర్యాలను అమర్చగలిగినప్పుడు, ఇక అక్కడ సాధ్యం కానిది ఏముంటుంది! పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి. బాబా మళ్ళీ వచ్చి ఉన్నారు, తండ్రిని స్మృతి చేయండి అని అంటారు. ఒక్కరినే స్మృతి చేయాలి, దానితో వికర్మలు వినాశనమవుతాయి. కానీ ఈ విషయాన్ని మర్చిపోతారు మరియు దేహధారుల స్మృతి వచ్చేస్తుంది. దేహధారుల స్మృతితో లాభమేమీ ఉండదు. తండ్రి అంటారు – నన్నొక్కడినే స్మృతి చేయండి, ఏ దేహధారినీ గుర్తు చేయకండి. తల్లి మరణించినా హల్వా తినండి….. అని అంటారు, ఒక్క తండ్రి స్మృతితోనే సంపాదన జరుగుతుంది. మనం శివబాబా పిల్లలము, వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఈ సమయంలో తండ్రిని స్మృతి చేయకపోతే తర్వాత చాలా పశ్చాత్తాపపడవలసి ఉంటుంది, ఏడవాల్సి ఉంటుంది. విశ్వానికి యజమానులుగా అయ్యేవారికి ఏడవాల్సిన అవసరమేముంది. మీరు తండ్రిని మర్చిపోతారు, అప్పుడే మాయ చెంపదెబ్బ వేస్తుంది. అందుకే తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని బాబా పదే-పదే అర్థం చేయిస్తారు. అమరపురిలో అమరనాథుడు ఒక్క పార్వతికి మాత్రమే అమరకథను వినిపించి ఉండరు. తప్పకుండా చాలామంది ఉండి ఉంటారు. ఇప్పుడు పతితంగా అవ్వకండి, ఈ అంతిమ జన్మ పవిత్రంగా అవ్వండి అని మనుష్యమాత్రులందరికీ తండ్రి అర్థం చేయిస్తారు. అక్కడ స్వర్గంలో వికారాలేవీ ఉండవు. ఒకవేళ అక్కడ కూడా వికారాలున్నట్లయితే, ఇక స్వర్గానికి మరియు నరకానికి తేడా ఏముంటుంది? సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు….. అని దేవీ దేవతల మహిమను పాడుతారు. భగవంతుడు వచ్చి భగవాన్ భగవతీలుగా తయారుచేస్తారు. భగవంతుడు తప్ప అలా ఎవరూ తయారుచేయలేరు. భగవంతుడు అయితే ఒక్కరే. భగవాన్-భగవతీల రాజధాని అని కూడా గాయనం చేయడం జరుగుతుంది. యథా రాజా-రాణి, తథా ప్రజలు ఉంటారు. కానీ భగవాన్ భగవతి అని పిలవబడరు, అందుకే ఆది సనాతన దేవీదేవతా ధర్మం అని అంటారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. వీరి (బ్రహ్మా) ఆత్మకు కూడా తండ్రి అర్థం చేయిస్తారు. ఒకటి తండ్రిది, మరొకటి దాదాది – రెండు ఆత్మలున్నాయి కదా. ఒక ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది, మరొక ఆత్మ పునర్జన్మలు లేనిది. తండ్రి ఎప్పుడూ పునర్జన్మలు తీసుకోరు. ఒక్కసారి మాత్రమే వచ్చి, విశ్వమంతటినీ పవిత్రంగా చేసేందుకు మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి మీకు అర్థం చేయిస్తారు – నేను వీరిలో ప్రవేశించాను, వీరు 84 జన్మలను అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు వీరిది అనేక జన్మల అంతిమ జన్మ. నేను నిరాకారుడను, మరి నేను వచ్చి పిల్లలకు రాజయోగాన్ని ఎలా నేర్పించాలి? ప్రేరణతో ఏమీ జరగదు. కృష్ణ భగవానువాచ అయితే కాదు. అతను ఎలా రాగలరు? అతను సత్యయుగ రాకుమారుడు, 16 కళల సంపూర్ణుడు….. తర్వాత త్రేతాయుగంలో 14 కళల సంపూర్ణులు ఉంటారు. మరి కృష్ణుడిని ద్వాపరంలోకి ఎందుకు తీసుకువెళ్ళారు? అతను ముందే రావాల్సి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తారు – ముందు తండ్రిని స్మృతి చేయండి, లేదంటే మాయ గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది. ముట్టుకుంటే ముడుచుకుపోయే మొక్క ఒకటి ఉంటుంది. చేతితో ముట్టుకోగానే ముడుచుకుపోతుంది. మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. తండ్రిని స్మృతి చేయకపోతే అంతా సమాప్తమైపోతుంది. బాల్యపు రోజులను మర్చిపోవద్దు అని పాటలో కూడా విన్నారు. తండ్రిని మర్చిపోతే ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతుంది. తండ్రి అంటారు – మీరు నా పిల్లలు కదా. ఈ శరీరం విషంతో జన్మించినది. అలా జన్మనిచ్చినవారు లౌకిక తల్లిదండ్రులు. వీరు పారలౌకిక తండ్రి మరియు వీరిని (బ్రహ్మా) అలౌకిక తండ్రి అని అంటారు. వీరు (బ్రహ్మా) హద్దు తండ్రిగా ఉండేవారు, తర్వాత అనంతమైన తండ్రిగా అయ్యారు. వీరి లౌకిక కుమార్తె (నిర్మలశాంత దాదీ) కూర్చున్నారు చూడండి. ఈమె లౌకిక కుమార్తె కూడా, అలౌకిక కుమార్తె కూడా, పారలౌకిక కుమార్తె కూడా. ఇకపోతే శివబాబాకు సోదరీ-సోదరులు లేరు. లౌకికంగా గాని, అలౌకికంగా గాని, పారలౌకికంగా గాని లేరు. ఎంత తేడా ఉంది. ఒక్క తండ్రికి చెందినవారిగా అవ్వడమనేది పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభం కాదు. ఇటువంటి తండ్రితో సంబంధాన్ని జోడించాలి, దానికి సమయం పడుతుంది. శివబాబా స్మృతిలో ఉండడం చాలా శ్రమతో కూడినది. 50 సంవత్సరాల నుండి ఉన్నవారిలో కూడా ఎంతోమంది రోజంతటిలో శివబాబాను కనీసం స్మృతి కూడా చేయరు. అటువంటివారు కూడా ఉన్నారు. మిగిలిన వారందరినీ మరచి ఒక్కరినే స్మృతి చేయడమనేది చాలా చాలా శ్రమతో కూడినది. కొంతమంది ఒక శాతం స్మృతి చేస్తారు, కొంతమంది రెండు శాతం, కొంతమంది 1/2 శాతం కూడా కష్టం మీద స్మృతి చేస్తారు. ఇది చాలా పెద్ద భారీ గమ్యము. కనుక తండ్రి అర్థం చేయిస్తారు – బాల్యాన్ని మర్చిపోవద్దు. తండ్రి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది. మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు జీవిస్తూనే మరణించి తండ్రికి చెందినవారిగా అయ్యామని మీకు తెలుసు. కనుక మీకు స్థిరమైన సంతోషం ఉండాలి, ఓహో! మేము డబల్ కిరీటధారులుగా అవుతాము! సత్యయుగంలో ఈ దేవతలను 16 కళల సంపూర్ణులు మరియు 14 కళల సంపూర్ణులు అని ఎందుకు అంటారు అనేది మనుష్యులకు తెలియదు. ఏమీ తెలియదు. ఈ భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైనవి మళ్ళీ తయారవుతాయి. ఈ హఠయోగాలు, తీర్థ యాత్రలు మొదలైనవి మళ్ళీ ఉంటాయి. కానీ వీటి వల్ల ఏమి జరుగుతుంది? స్వర్గానికి వెళ్తారా? లేదు. రిద్ధి-సిద్ధులను ఉపయోగించి చాలా పనులు చేస్తారు. రిద్ధి-సిద్ధులు ఉన్నవారు చాలామంది ఉన్నారు. వేలాది మంది మనుష్యులు వారి వెంట పడుతూ ఉంటారు. రిద్ధి-సిద్ధితో గడియారాలు మొదలైన అనేక వస్తువులను బయటకు తీస్తూ ఉంటారు. ఇవన్నీ అల్పకాలికమైనవని అర్థం చేసుకోరు. ఇందులో చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. ఈ రిద్ధి-సిద్ధులు మొదలైనవి నేర్చుకునేందుకు కూడా పుస్తకాలుంటాయి. ఎన్ని లక్షల మంది మనుష్యులు వారి వెంట పడుతూ ఉంటారు. మనకు తండ్రి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. ఈ కళ్ళతో ఏదైతే చూస్తారో అది ఉండదు. మీరు అశరీరులుగా వచ్చారని, తర్వాత శరీరాలతో పాత్రను అభినయించారని తండ్రి అర్థం చేయిస్తారు. ఒకవేళ 84 లక్షల జన్మల లెక్కను తెలపాలంటే 12 నెలలు పడుతుంది, అది అసంభవం. 84 జన్మల లెక్కను తెలపడమైతే చాలా సహజము. మీరు 84 జన్మల చక్రంలో తిరుగుతూ ఉంటారు. సూర్యవంశీయులు ఉన్నప్పుడు చంద్రవంశీయులు ఉండరు. సూర్యవంశం సమాప్తమైన తర్వాత చంద్రవంశీయులుగా….. అవుతారు.
ఇప్పుడు మనం బ్రాహ్మణ వంశీయులమని, తర్వాత దేవతా వంశీయులుగా అవ్వనున్నామని మీకు తెలుసు. అందుకే మనం చదువు చదువుకుంటున్నాము. తర్వాత మెట్లు దిగుతూ-దిగుతూ వైశ్య, శూద్ర వంశీయులుగా అవుతాము. ఇప్పుడు మీ 84 జన్మల స్మృతి కలిగింది. ఈ చక్రాన్ని కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే సదా ఆరోగ్యవంతులుగా, సదా ధనవంతులుగా అవుతారు, పాపాలు తొలగిపోతాయి. చక్రాన్ని తెలుసుకోవడంతో చక్రవర్తులుగా అవుతారు. ఈ పాత ప్రపంచం శ్మశానవాటికగా అవ్వనున్నదని మీకు తెలుసు. ఏమీ మిగలదు, అంతా సమాప్తమైపోతుంది. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు….. అని అంటూ ఉంటారు. సత్యయుగంలో రాముని పరివారం ఎంత చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు రావణునిది ఎంత పెద్ద పరివారము. ఈ రాజధాని స్థాపనవుతుందని పిల్లలకు తెలుసు. ప్రతి విషయంలోనూ పురుషార్థం ఫస్ట్. పిల్లలూ, నన్ను స్మృతి చేయండి అని తండ్రి పురుషార్థం చేయిస్తారు. ఏ తండ్రి నుండైతే అపారమైన స్వర్గ రాజ్యాధికారం లభిస్తుందో, వారిని స్మృతి చేయరా? మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని తండ్రి స్మృతినిప్పిస్తారు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి స్వర్గానికి యజమానులుగా అవ్వండి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎప్పుడూ ఏ విషయంలోనూ, ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిలా అవ్వకూడదు. ఈశ్వరీయ బాల్యాన్ని మరచి వాడిపోకూడదు. ఈ కళ్ళకు ఏదైతే కనిపిస్తుందో, దానిని చూస్తూ కూడా చూడకూడదు.
2. ఒక్క తండ్రి స్మృతిలోనే సంపాదన ఉంది, అందుకే దేహధారులను గుర్తు చేసుకుని ఏడవకూడదు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసి, విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి.
వరదానము:-
నాలెడ్జ్ ఆధారంగా తమ బలహీన సంస్కారాల గురించి తెలుసుకుంటారు మరియు ఆ విషయం యొక్క వివరణ లభించినప్పుడు కొద్ది సమయం కోసం ఆ సంస్కారాలు లోపలే అణిగిపోతాయి, కానీ బలహీన సంస్కారాలను సమాప్తం చేసుకునేందుకు లైట్ మరియు మైట్ యొక్క ఎక్స్ ట్రా ఫోర్స్ అవసరము. దీనికోసం మాస్టర్ సర్వశక్తివంతులుగా, మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అవ్వడంతో పాటు చెకింగ్ మాస్టర్ గా అవ్వండి. నాలెడ్జ్ ద్వారా స్వయంలో శక్తిని నింపుకోండి, మనన శక్తిని పెంచుకోండి, అప్పుడు శక్తి సంపన్నులుగా అయిపోతారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!