15 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
14 July 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - మీరు వికారాలను దానమిచ్చినట్లయితే, రాహు గ్రహణం తొలగిపోతుంది, దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది”
ప్రశ్న: -
వృక్షపతి అయిన తండ్రి తమ భారతవాసీ పిల్లలపై బృహస్పతి దశను కూర్చోబెట్టేందుకు ఏ స్మృతినిప్పిస్తున్నారు?
జవాబు:-
ఓ భారతవాసీ పిల్లలూ, మీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం అతి శ్రేష్ఠమైనదిగా ఉండేది. మీరు సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. సాగరుడైన నా పిల్లలు, మీరు కామ చితిపై కూర్చొని నల్లగా అయిపోయారు, మీకు గ్రహణం పట్టింది. ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ సుందరంగా చేసేందుకు వచ్చాను, ఈ స్మృతి కలగడంతో బృహస్పతి దశ కూర్చుంటుంది.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఓం నమః శివాయ….
ఓంశాంతి. ఎవరి మహిమను విన్నారు? అనంతమైన తండ్రి. పరమపిత పరమాత్మయే ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి. లౌకిక తండ్రి గురించి ఎవరూ ఇలా చెప్పరు. ఆత్మలందరి పారలౌకిక తండ్రి ఉన్నతాతి ఉన్నతమైనవారని పిల్లలకు తెలుసు. వారి పేరే శివ. నామ, రూపాలు లేని వస్తువేదీ ఉండదు. ఈ సమయంలో అందరికీ రాహు గ్రహణం పట్టి ఉంది. అందుకే, దీనిని ఇనుప యుగపు ప్రపంచమని అంటారు. ఇందులో దశలు కూడా ఉంటాయి. బృహస్పతి దశ, శుక్ర దశ….. ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉంది. శివబాబా ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు, వారి మహిమను విన్నారు. వారి అసలు పేరు శివ. ఇకపోతే, అనేక రకాల పేర్లు పెట్టేసారు. అసలు పేరు శివబాబా. నేను బీజ రూపుడను, చైతన్యుడను అని తండ్రి అర్థం చేయిస్తారు. వారిని సత్యమైనవారు, చైతన్యమైనవారు అని అంటారు, వారిని సుఖ సాగరుడు, ఆనంద సాగరుడు, శాంతి సాగరుడు అని కూడా అంటారు. మహిమ అంతా ఆ ఒక్కరిదే. భారతవాసులు మహిమను పాడుతారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు. రాతిబుద్ధి కలవారిగా ఎవరు తయారుచేసారు? రావణుడు తయారుచేసాడు. సత్యయుగంలో భారతవాసులు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం, ఈ భారత్ పారసపురిగా ఉండేది, అందులో దేవీ-దేవతలు ఉండేవారు. భారత్ యే అవినాశీ ఖండముగా గాయనం చేయబడింది. భారత్ లోనే పారసబుద్ధి గల దేవతలుండేవారు. ఈ సమయంలో రాతిబుద్ధి గల పతితులు ఉన్నారు. పతితులుగా ఎలా అవుతారు అనేది కూడా తండ్రి అర్థం చేయించారు. ద్వాపరం నుండి కామ చితిపై కూర్చున్నప్పటి నుండి నల్లగా అయిపోతారు. అందరూ కామాగ్నిలో భస్మమైపోయారు. అందులో కూడా విశేషంగా ఇది భారత్ కు చెందిన విషయము. భారత్ లో పారసబుద్ధి గల దేవతల రాజ్యముండేది. దానిని విష్ణుపురి, రామ రాజ్యమని కూడా అనేవారు. ఈ విషయాన్ని తండ్రి వచ్చి తెలియజేస్తారు. మధురాతి-మధురమైన గారాబాల పిల్లలూ, మీరు సత్యయుగంలో ఉన్నప్పుడు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. ఇది మీ మహిమ. అక్కడ వికారాలుండవు. ద్వాపరం నుండి రావణుని 5 వికారాల రాజ్యం ప్రారంభమయ్యింది. అప్పుడు రామ రాజ్యం మారి రావణ రాజ్యంగా అవుతుంది. ఇప్పుడు గ్రహణం పట్టి ఉంది. భారత్ పూర్తిగా నల్లగా అయిపోయింది. బృహస్పతి దశ అన్నింటికంటే బాగుంటుంది. సత్యయుగంలో భారత్ పై బృహస్పతి దశ ఉండేది. తర్వాత త్రేతా యుగంలో శుక్ర దశ వస్తుంది, అప్పుడు 2 కళలు తగ్గిపోయాయి. దానిని వెండి యుగం అని అంటారు. తర్వాత ద్వాపర యుగం, కలియుగం వచ్చాయి. మెట్లు దిగుతూ వచ్చారు, శని దశ ఏర్పడింది. ఈ సమయంలో అందరిపై రాహు దశ ఉంది. సూర్యునికి గ్రహణం పట్టినప్పుడు, దానమిస్తే గ్రహణం తొలగిపోతుందని అంటారు.
ఇది ఆత్మిక జ్ఞానం అని ఆత్మిక తండ్రి ఇప్పుడు పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇది శాస్త్రాల జ్ఞానమేమీ కాదు. శాస్త్రాల జ్ఞానాన్ని భక్తి మార్గమని అంటారు. సత్య-త్రేతా యుగాలలో భక్తి ఉండదు. జ్ఞానం మరియు భక్తి, తర్వాత వైరాగ్యము అనగా ఈ పాత ప్రపంచాన్ని వదలాల్సి ఉంటుంది. ఇది శూద్ర వర్ణము. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య….. వర్ణాలను విరాట రూపంలో చూపిస్తారు. ఇది భారత్ యొక్క కథనే. విరాట రూపాన్ని తయారుచేస్తారు కూడా, కానీ రాతిబుద్ధి కలవారు అర్థం చేసుకోరు. రాతిబుద్ధి ఎందుకుంది? ఎందుకంటే పతితులుగా ఉన్నారు. భారతవాసులే పారసబుద్ధి కలవారిగా ఉండేవారు, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం, భారత్ స్వర్గంగా ఉండేది, ఇంకే ఖండమూ ఉండేది కాదు. ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. ఈ రాజయోగాన్ని ఎవరు నేర్పిస్తారు? శివాచార్యుడు. వీరు జ్ఞానసాగరుడు. మనుష్యులెవ్వరినీ జ్ఞాన సాగరుడు, సర్వుల పతితపావనుడు అని అనలేరు. సర్వుల ముక్తిదాత ఒక్క తండ్రి మాత్రమే. దుఃఖం సమయంలో రావణుని నుండి ముక్తులుగా చేసేందుకు తండ్రి స్వయంగా వస్తారు. తర్వాత గైడ్ అయ్యి తీసుకువెళ్తారు. వారిని ఆత్మిక పండా అని అంటారు. తండ్రి అంటారు – నేను ఆత్మలైన మీ అందరికీ పండాను, అందరినీ తిరిగి తీసుకువెళ్తాను. నా లాంటి గైడ్ ఇంకెవ్వరూ ఉండరు. గాడ్ ఫాదర్ యే ముక్తిదాత, గైడ్, ఆనంద స్వరూపుడు….. అని అంటారు కూడా. అందరి పైన దయ చూపిస్తారు, ఎందుకంటే సాగరుని పిల్లలందరూ కామ చితిపై కూర్చొని కాలిపోయి మరణించారు. అందులో కూడా విశేషంగా ఇది భారత్ యొక్క విషయము. తండ్రి అంటారు – మీరు 16 కళల సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఇప్పుడు కామ చితిపై కూర్చొని మీరు ఎలా తయారయ్యారు! ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. వృక్షపతి తండ్రి వచ్చి మనుష్యమాత్రులపై బృహస్పతి దశను కూర్చోబెడతారు. పూర్తి విశ్వానికి, ముఖ్యంగా భారత్ కు ఈ సమయంలో రాహు గ్రహణం పట్టి ఉంది. తండ్రి అంటారు – నేనే వచ్చి పూర్తి ప్రపంచానికి, ముఖ్యంగా భారత్ కు గతి, సద్గతులనిస్తాను. మీరు పారసబుద్ధి కలవారిగా అయ్యేందుకే ఇక్కడకు వచ్చారు. వారు అతి ప్రియమైనవారు తండ్రి. ప్రేయసులందరి ప్రియుడు ఒక్కరే. అన్ని దేశాలలో లింగాన్ని తప్పకుండా తయారుచేస్తారు, ఎందుకంటే వారు అందరికీ తండ్రి కదా. భారత్ లో శివుని మందిరాలు చాలా ఉన్నాయి, వాటిని శివాలయమని అంటారు, అనగా నివాస స్థానము. సత్యయుగంలో దేవీ-దేవతా ధర్మానికి చెందిన మనుష్యులున్నారు కానీ ఆ ధర్మం ఎప్పుడుండేది, వారి రాజ్యం ఎప్పుడుండేది అనేది తెలియదు. సత్యయుగం ఆయువును ఎక్కువగా రాసేసారు. ఇప్పుడు మీపై 21 జన్మల కోసం బృహస్పతి దశ కూర్చుంటుందని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. వృక్షపతి అనగా జ్ఞాన సాగరుడు, పతితపావనుడు. అందరూ వారినే పిలుస్తారు. నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలమని అందరూ వారి మహిమను చేస్తారు. తప్పకుండా సత్య-త్రేతా యుగాలలో అపారమైన సుఖముండేది. తండ్రి హెవెన్లీ గాడ్ ఫాదర్, స్వర్గ రచయిత అన్నప్పుడు, తప్పకుండా మనం కూడా స్వర్గంలోనే ఉండాలి. మీరంతా స్వర్గవాసులుగా ఉండేవారని, ఇప్పుడు నరకవాసులుగా అయ్యారని తండ్రి అర్థం చేయిస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం భారత్ కు చెందినదే. క్రిస్టియన్ ధర్మానికి చెందినవారు ఆ క్రిస్టియన్ ధర్మంలోనే కొనసాగుతూ వస్తారు. మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు, మరి దేవీ-దేవతా ధర్మానికి చెందిన మీరు మీ ధర్మాన్ని ఎందుకు మర్చిపోయారు అని తండ్రి అంటారు.
మీ ధర్మం, కర్మ అందరికన్నా శ్రేష్ఠంగా ఉండేవని తండ్రి స్మృతినిప్పిస్తున్నారు. ఇప్పుడు మీరు నీచులుగా, పాపులుగా, నిరుపేదలుగా అయిపోయారు. మీరు దేవతల పూజారులు అన్నప్పుడు స్వయాన్ని హిందువులుగా ఎందుకు చెప్పుకుంటున్నారు? భారత్ కు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరైతే దేవతా ధర్మానికి చెందినవారో, వారు వికారులుగా అయిన కారణంగా స్వయాన్ని దేవతలుగా చెప్పుకోరు. ఇప్పుడిది ఈ పతిత ప్రపంచం యొక్క అంతిమమని, మహాభారత యుద్ధం కూడా నిలబడి ఉందని తండ్రి అంటారు. భగవానువాచ – నేను మీకు సత్యయుగం కోసం రాజయోగం నేర్పిస్తాను. భగవంతుడు ఒక్కరే. వారి పిల్లలైన మనం సాలిగ్రామాలము. తండ్రి అంటారు – పూజ్యులుగా ఉన్న మీరే పూజారులుగా, భక్తులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పూజ్య దేవతలుగా అయ్యేందుకు జ్ఞానం తీసుకుంటారు. మళ్ళీ ద్వాపరం నుండి పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు. మీరు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఎవరైతే 84 జన్మలను తీసుకున్నారో, వారే వచ్చి బ్రహ్మాకుమార-కుమారీలుగా అవుతారు. బ్రహ్మా ద్వారా ఆది సనాతన ధర్మ స్థాపన జరుగుతుందని కూడా గాయనం చేయబడింది. ప్రజాపిత ఉన్నప్పుడు, చాలా మంది పిల్లలు కూడా ఉంటారు. వారు తప్పకుండా ఇక్కడే ఉండాలి. ఎంత మంది ప్రజలున్నారు. ఈ బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవ్వాలి. తండ్రి వచ్చి శూద్రులను మార్చి, బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ సంగమయుగంలోనే ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. ఇది కళ్యాణకారీ సంగమయుగము. ఈ యుద్ధాన్నే కళ్యాణకారీ యుద్ధమని అంటారు. ఈ వినాశనం తర్వాతనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. మీరిక్కడకు స్వర్గవాసులుగా అయ్యేందుకు మరియు విష్ణుపురిలోకి వెళ్ళేందుకు వచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీపై అవినాశీ బృహస్పతి దశ ఉంది. 16 కళల సంపూర్ణులు అని అంటారు. తర్వాత 2 కళలు తగ్గిపోతాయి, అప్పుడు శుక్ర దశ అని అంటారు. సత్యయుగంలో బృహస్పతి దశ ఉంటుంది, తర్వాత త్రేతాలో శుక్ర దశ ఉంటుంది. తర్వాత కిందకు దిగుతూ వచ్చారు. మంగళ దశ, శని దశ, రాహు దశలు కూడా ఉంటాయి. జన్మ-జన్మలుగా తప్పుడు దశలు ఏర్పడుతూ వచ్చాయి. ఇప్పుడు తండ్రి ద్వారా బృహస్పతి దశ కూర్చొని ఉంది. ఈ అనంతమైన తండ్రి జ్ఞానసాగరుడు, పతితపావనుడు. వారే మీకు తండ్రి కూడా, శిక్షకుడు కూడా, సద్గురువు కూడా. మిగిలినవారంతా అసత్యమైనవారు, వాళ్ళు ఎవరికీ సద్గతినివ్వలేరు. దీనిని వికారీ ప్రపంచమని అంటారు. అది నిర్వికారీ ప్రపంచము. ఇప్పుడు వికారీ ప్రపంచంలో అందరూ చాలా దుఃఖితులుగా ఉన్నారు. యుద్ధాలు, మారణహోమం ఏమేమి జరుగుతున్నాయి. దీనినే అనవసర రక్తపాతము…. అని అంటారు. ఏ తప్పు లేకపోయినా కూడా, ఏమేమో చేస్తూ ఉంటారు. ఒకే ఒక్క బాంబును వేస్తారు, అది ఎటువంటిదంటే, ఒక్కదానితో అంతా వెంటనే సమాప్తమైపోతుంది. ఇది అదే సంగమయుగ సమయము. దేవతలైన మీ కోసం, మళ్ళీ కొత్త ప్రపంచం కావాలి. కనుక ఇప్పుడు తండ్రి అంటారు – మధురాతి-మధురమైన పిల్లలూ, మన్మనాభవ. ఏ తండ్రి ఇలా అన్నారు? శివబాబా. వారు నిరాకారుడు. మీరు కూడా నిరాకారి. కానీ మీరు పునర్జన్మలలోకి వస్తారు, నేను రాను. ఈ సమయంలో అందరూ పతితంగా ఉన్నారు, పావనమైనవారు ఒక్కరు కూడా లేరు. పతితంగా అవ్వాల్సిందే. సతో, రజో, తమోలలోకి దిగవలసి ఉంటుంది. ఈ సమయంలో మొత్తం వృక్షం శిథిలావస్థకు చేరుకుంది. ప్రపంచం పూర్తిగా పాతదైపోయింది. ఇప్పుడు మళ్ళీ దీనిని కొత్తదిగా తయారుచేయవలసి ఉంటుంది. పతిత ప్రపంచంలో ఎంతమంది మనుష్యులున్నారో చూడండి. పావన ప్రపంచంలో చాలా కొద్దిమంది రాజ్యం చేస్తారు. అక్కడ ఒకే ధర్మముండేది, ఇంకే ధర్మము ఉండేది కాదు. భారత్ నే హెవెన్ అని అంటారు. ఒక్క సెకండులో సూర్యుడే చంద్రునిగా మారుతాడు….. అని గాయనం చేయడం జరుగుతుంది. సత్యయుగంలో 9 లక్షల మంది ఉంటారు. తర్వాత వృద్ధి జరుగుతుంది. ముందు పుష్పాల వృక్షం చాలా చిన్నదిగా ఉంటుంది, ఇప్పుడు ఎంత పెద్ద ముళ్ళ అడవిగా ఉంది. ఢిల్లీలో మొఘల్ గార్డెన్ ఎంత బాగుందో చూడండి. దాని కంటే పెద్ద గార్డెన్ ఏదీ లేదు. అడవి ఎంత పెద్దదిగా ఉంటుందో చూడండి. సత్యయుగపు తోట కూడా చాలా చిన్నది. తర్వాత వృద్ధి చెందుతూ-చెందుతూ పెద్దదవుతూ ఉంటుంది. ఇప్పుడిది ముళ్ళ అడవిగా అయిపోయింది. రావణుడు రావడంతో ముళ్ళగా అయిపోతారు. ఇది ముళ్ళ అడవి. పరస్పరంలో కొట్లాడుకుంటూ ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు. ఎంత క్రోధముంది, కోతి కన్నా నీచమైనవారని అంటారు. కనుక తండ్రి అంటారు – నా గారాబాల పిల్లలూ, మీపై ఇప్పుడు వృక్షపతి దశ ఉంది. ఇప్పుడు దానమిచ్చినట్లయితే, గ్రహణం తొలగిపోతుంది. సంపూర్ణ నిర్వికారులుగా ఇప్పుడు ఇక్కడే అవ్వాలి. తర్వాత ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి శివాలయంలోకి వస్తారు. శివాలయంలో చాలా సుఖముంటుంది. దేవీ-దేవతల రాజ్యముంటుంది. సత్యయుగాన్ని శివాలయమని అంటారు, కలియుగాన్ని వేశ్యాలయమని అంటారు. ఈ వేశ్యాలయాన్ని రావణుడు స్థాపన చేసాడు. ఇప్పుడు తండ్రి అంటారు – పతితుల నుండి పావనంగా అవ్వాలి, ఎలా అవుతారు? త్రివేణిలో, గంగలో స్నానం చేయడంతో పావనంగా అవుతారా? ఇలా అయితే జన్మ-జన్మలుగా చేస్తూ వచ్చారు. కోట్లాది మంది మనుష్యులు వెళ్ళి స్నానం చేస్తారు. చాలా నదులు, కాలువలు, చెరువులు మొదలైనవి ఉన్నాయి, ఎక్కడ నీటిని చూస్తే అక్కడకు వెళ్ళి స్నానం చేస్తారు ఎందుకంటే తమను తాము పతితులుగా భావిస్తారు. ఇప్పుడు పారసనాథుడు మిమ్మల్ని పారసబుద్ధి కలవారిగా చేస్తున్నారు. మరి ఇటువంటి పారసనాథుడైన తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల తోటలోకి వెళ్ళేందుకు, ఏవైతే ముళ్ళు (వికారాలు) ఉన్నాయో, వాటిని తొలగించుకోవాలి. పారసంగా తయారుచేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి.
2. ఈ కళ్యాణకారీ సంగమయుగంలో శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, తర్వాత దేవతలుగా అయ్యే పురుషార్థం చేయాలి. రాహు గ్రహణాన్ని తొలగించుకునేందుకు వికారాలను దానం చేయాలి.
వరదానము:-
సంగఠనలో, ఒకరు చెప్పినదానికి ఇంకొకరు అంగీకరించడమే సత్యమైన స్నేహానికి రెస్పాన్స్ ఇవ్వడము. ఇటువంటి స్నేహీ పిల్లల ఉదాహరణను చూసి, ఇతరులు కూడా సంపర్కంలోకి వచ్చేందుకు ధైర్యం చేస్తారు. సంగఠన కూడా సేవకు సాధనంగా అవుతుంది. వీరి మధ్యన యూనిటీ (ఐక్యత) బాగుంది, వీరు మంచి గ్రూప్ లా ఉన్నారనేది మాయ చూస్తే, అక్కడికి రావడానికి ధైర్యం చేయదు. ఏకమతము మరియు ఏకరస స్థితి యొక్క సంస్కారమే సత్యయుగంలో ఏక రాజ్యాన్ని స్థాపన చేస్తుంది.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!