15 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
14 April 2022
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - మీరు దేవీ-దేవతా కులానికి చెందినవారు, మీరు ఇప్పుడు పూజారుల నుండి పూజ్యులుగా అవ్వాలి, మీ అందరికీ భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వడానికి తండ్రి వచ్చారు’’
ప్రశ్న: -
దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తెంచడానికి సహజ విధి ఏమిటి?
జవాబు:-
నాకైతే ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు, ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి. బాబా అంటారు, పిల్లలూ, దేహం మరియు దేహం యొక్క అన్ని సంబంధాలు దుఃఖాన్నిచ్చేవి. మీరు నన్ను మీ కొడుకుగా చేసుకున్నట్లయితే నేను మీకు ఎంత సేవ చేస్తానంటే, 21 జన్మల వరకు మీరు సదా సుఖమయంగా ఉంటారు. వారసుడిగా చేసుకున్నట్లయితే వారసత్వాన్ని ఇస్తాను. ప్రియునిగా చేసుకున్నట్లయితే అలంకరించి స్వర్గానికి మహారాణిగా చేస్తాను. సోదరునిగా, సఖునిగా చేసుకున్నట్లయితే మీతో పాటు ఆడతాను. నాతో అన్ని సంబంధాలను జోడించినట్లయితే దేహం యొక్క సంబంధాల నుండి బుద్ధి తొలగిపోతుంది.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఎంత మధురమైనవారు, ఎంత ప్రియమైనవారు శివ భోళా భగవంతుడు… (కిత్నా మీఠా, కిత్నా ప్యారా, శివ భోలే భగవాన్…)
ఓంశాంతి. పిల్లలు ఎవరి మహిమను విన్నారు? తమ అనంతమైన తండ్రిది. వారినే శివబాబా అని అంటారు. బ్రహ్మాను కూడా బాబా అని అనడం జరుగుతుంది. ప్రజాపిత అయితే తండ్రి అనగా బాబా. ప్రజాపిత బ్రహ్మాకుమారీలు మరియు కుమారులు. మీరు ఇప్పుడు కూర్చున్నారు కదా. తప్పకుండా మీరు బ్రహ్మా యొక్క ధర్మ సంతానము. బ్రహ్మా ద్వారా శివబాబా ఒడిని తీసుకున్నారు. శివబాబాకు తమ శరీరమైతే లేదు. బ్రహ్మా, విష్ణు, శంకరులకు కూడా తమ శరీరాలున్నాయి. నిరాకార పరమాత్మకు ఎటువంటి ఆకార లేక సాకార శరీరం లేదు. వారిని పరమపిత అని అనడం జరుగుతుంది. ప్రజాపితను పరమపిత అని అనరు. పరమపిత అంటే అన్నింటికన్నా అతీతంగా ఉండేవారు. ఆత్మలైన మీరు కూడా అక్కడ నివసించేవారు. ఆ తండ్రి చాలా మధురమైనవారు, అందుకే వారికి ఇంత మహిమను చేస్తారు. త్వమేవ మాతాశ్చ పిత… చదివించేవారు కూడా మీ లాగ ఉండాలి, సోదరుడు కూడా మీ లాగ ఉండాలి, తండ్రి కూడా మీ లాగ ఉండాలి అని అంటారు. ఎలాగైతే లౌకిక తండ్రి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తాడు. ఈ రోజుల్లో పిల్లలకు వారసత్వమైతే లభిస్తుంది కానీ వారు తండ్రి యొక్క సేవను పూర్తిగా కూడా చేయరు. పత్ని లభించిన తర్వాత, చిన్న గొడవ జరిగినా చాలు, ఇంటిని వేరు చేస్తారు. ఇప్పుడు మీరు శివబాబాను మీ కొడుకుగా చేసుకోండి, వీరు మీకు ఎంత సేవ చేస్తారంటే 21 జన్మలు మీరు సదా సుఖమయంగా ఉంటారు. అచ్ఛా, కొడుకుకు బదులుగా ఒకవేళ తండ్రిగా కూడా చేసుకుంటే మీకు స్వర్గంలో సదా కోసం సుఖాన్ని ఇస్తారు. వీరిని ప్రియునిగా చేసుకుంటే మిమ్మల్ని అలంకరించి మిమ్మల్ని స్వర్గానికి మహారాణిగా చేస్తారు. దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాల నుండి బుద్ధిని తెంచండి ఎందుకంటే వారందరూ మీకు దుఃఖాన్ని ఇస్తారు. మేము మీకు సుఖమే సుఖాన్ని ఇస్తాము. చూడండి, బాబా మీతో ఆడుకుంటారు. మేము సోదరునితో ఆడుతున్నామని భావిస్తారు. సోదరునిగా కూడా సుఖాన్ని ఇస్తారు. మిమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారుచేస్తారు. కనుక అన్ని సంబంధాలను వారితోనే పెట్టుకోండి, ఇతరులు అందరి నుండి తెంచాలి. కేవలం నాకైతే ఒక్క శివబాబా… నేను కల్ప-కల్పము పిల్లలైన మీ సమ్ముఖంలో వచ్చి మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి విడిపించి సదా సుఖమయంగా తయారుచేస్తాను. అటువంటి తండ్రితో బుద్ధియోగాన్ని పెట్టుకోండి మరియు వారే స్వయంగా వచ్చి బ్రాహ్మణునిగా అయ్యి ఆత్మల యొక్క నిశ్చితార్థం చేయిస్తారు. వీరు ఫస్ట్ క్లాస్ బ్రాహ్మణుడు. మీకు ఎంత మంచి పేర్లు పెడతారు. డ్రామానుసారంగా మీకు పేర్లు పెట్టవలసే వచ్చింది ఎందుకంటే మీరు ఒక కుటుంబాన్ని వదిలి ఈశ్వరుని ఒడిలోకి వచ్చారు కనుక ఎంత రమణీకమైన పేర్లు పెట్టారు. ఓ పతిత-పావనా రండి, వచ్చి పావనంగా చేయండి, అని స్మృతి కూడా చేస్తారు. శ్రీకృష్ణుడిని ఎంతగా ప్రేమిస్తారు. శ్రీకృష్ణుడు లాంటి పతి లభించాలి, కొడుకు లభించాలి అని అంటారు. వారు స్వర్గానికి యజమాని అని భావిస్తారు కూడా, మళ్ళీ వారిని ద్వాపరంలోకి తీసుకువెళ్ళారు. ఇది పొరపాటు. ఈ పొరపాట్లు అన్నింటినీ నివారణ చేసి తండ్రి వచ్చి పొరపాట్లు లేనివారిగా చేస్తారు. స్వర్గంలో ఇలాంటి పొరపాట్లు చేయనే చేయరు. పొరపాటు చేయించేది మాయ. అక్కడ మాయే ఉండదు. లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని చూపించి మీరు అందరికీ అర్థం చేయించవచ్చు. వీరే స్వర్గానికి మహారాజ-మహారాణిగా ఉండేవారు. ఆ విధంగా ఎవరు తయారుచేసారు? అజ్ఞాన కాలంలో ఎవరి వద్దనైనా చాలా ధనం ఉన్నట్లయితే, ఇది మీకు ఎవరు ఇచ్చారు? అని అడగడం జరుగుతుంది. భగవంతుడు ఇచ్చారని అంటారు. తండ్రి ఉన్నారే దాత, బాబా మాకు అనంతమైన స్వరాజ్యాన్ని ఇస్తారు. మందిరంలో పూజకు యోగ్యులుగా తయారుచేస్తారు. అనంతమైన శివాలయంలో రాజ్యం చేసి మళ్ళీ భక్తి మార్గంలో జడ చిత్రాల శివాలయాలను తయారుచేస్తారు. ఆ సమయంలో దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. పతిత మనుష్యులను ఎప్పుడూ దేవతలు అని అనలేరు. ఇప్పుడు మీకు తెలుసు, మేము దేవతా కులానికి చెందినవారము. మీరే పూజ్యులు, మీరే పూజారులు. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా పూజారుల నుండి పూజ్యులుగా అవుతున్నారు. అర్ధకల్పము పూజ్యులుగా ఉన్నారు మరియు అర్ధకల్పము పూజారులుగా అవుతారు. నేనైతే సదా పూజ్యుడిని. భక్తి మార్గంలో మీరు స్మృతి చేస్తారు – నేను మీకు స్మృతి యొక్క ఫలాన్ని ఇస్తాను. నిరంతరం నన్ను స్మృతి చేసినట్లయితే మీకు చాలా ఫలం లభిస్తుందని మీకు చెప్తాను. మీకు ఈ పాత ప్రపంచంలో ఉండడం ఏమైనా మంచిగా అనిపిస్తుందా? నేను అన్ని రూపాలలో సుఖాన్ని ఇవ్వడానికి వచ్చాను. వారందరూ మీకు దుఃఖాన్ని ఇస్తారు. ఇప్పుడు నేను మీకు సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తాను. శివబాబా ఎంత మధురమైనవారు మరియు ఎంత ప్రియమైనవారు, అందుకే స్మృతి చేస్తారు, ఓ శివ భోళా భండారీ, జోలిని నింపండి. మీకు తెలుసు, మనం విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు ఏం యోగ్యులుగా ఉన్నాము. బాబా అయోగ్యులను యోగ్యులుగా తయారుచేస్తారు. రాజయోగాన్ని నేర్పించి 21 జన్మల కోసం మహారాజ-మహారాణిగా చేస్తారు. ఉన్నత పదవిని పొంది పేరును ప్రసిద్ధం చేయండి అని శిక్షణను ఇస్తారు. పిల్లల్లో నంబరువారుగా అయితే ఉంటారు కదా. ఎవరు ఎంతగా చదువుకుంటే, మంచి పిల్లలు తల్లిదండ్రులకు చాలా ఆజ్ఞాకారిగా ఉంటారు. మీకు అనంతమైన తండ్రి లభించారు కనుక వారికి ఎంతగా ఆజ్ఞాకారిగా అవ్వాలి. తండ్రి పేరే ఉంది కళ్యాణకారి. నరకాన్ని స్వర్గంగా తయారుచేస్తారు. మీరు స్వర్గం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎంతగా మీరు శ్రీమతంపై నడుచుకుంటారో, అందరి నుండి మమకారాన్ని తొలగించాలి. బాబా, ఎలా తొలగించాలి అని అంటారు. బాబా అంటారు, నన్ను ట్రస్టీగా చేయండి, తర్వాత, ఈ పరిస్థితిలో ఏం చేయాలి అని సలహా తీసుకుంటూ ఉండండి!. బాబా అంటారు, విడిచిపెట్టడమైతే సన్యాసుల వలె అవుతుంది. ఇళ్ళు-వాకిళ్ళను సన్యసించకూడదు. పాత ప్రపంచం యొక్క సన్యాసం చేయిస్తారు. వారు ఇళ్ళు-వాకిళ్ళను విడిచిపెడతారు, చాలా నష్టం కలిగిస్తారు. అయినా పవిత్రంగా ఉంటారు కనుక కొంత సహాయం చేస్తారు. అంతేకానీ, గురువుగా అయి ఎవరికైనా గతి-సద్గతి చేయగలరని కాదు. పవిత్రంగా చేస్తారు, అది కూడా కేవలం పురుషులను. బాబా అయితే ఇరువురినీ వివస్త్రగా అవ్వకుండా రక్షిస్తారు. బాబా శిక్షణనిస్తారు, ఒకవేళ మీరు పవిత్రంగా అయ్యి చూపించినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవుతారు. స్వర్గంలో అందరూ సుఖమయంగా ఉంటారు. మంచి రీతిలో పురుషార్థం చేస్తే, వీరిని తమ కొడుకుగా చేసుకున్నట్లయితే వారసత్వాన్ని ఇస్తారు. ఎవరు ఎంత వారసత్వాన్ని ఇస్తారో, అంతగా నేను కూడా మళ్ళీ రిటర్న్ లో ఇస్తాను. కానీ స్వర్గంలో ఇస్తాను, ఇక్కడ కాదు. ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో, దానిని కూడా పిల్లలైన మీ పనిలోనే ఉపయోగిస్తాను. నేను విశ్వానికి యజమానిగా అవ్వను, మీరు అవుతారు. మీ కోసమే ఈ ఇళ్ళు మొదలైనవి ఉన్నాయి. ఇది ప్రదర్శినీ. ఇది కూడా పిల్లలైన మీ సేవే, మళ్ళీ మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను. ఎంత కావాలనుకుంటే అంత నా నుండి తీసుకోండి. నన్ను వారసునిగా చేసుకోండి లేక చేసుకోకపోండి, మీ పిల్లలతోనే సుఖమయంగా ఉండండి. కానీ, పవిత్రంగా ఉండండి మరియు ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే అంత మతి సో గతి అవుతుంది. అంతేకానీ, ఏ అసత్యపు మంత్రం పని చేయదు. నేను మీకు కళ్యాణకారి మంత్రాన్ని ఇస్తాను – తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. కొడుకు జన్మిస్తే అతనికి వారసత్వం లభించాల్సిందే. మీకు తెలుసు, మనం శివబాబాకు చెందినవారిగా ఉండేవారము, స్వర్గంలో రాజ్యం చేసాము, మళ్ళీ ఓడించబడ్డాము. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. నాకు చెందినవారిగా అవ్వండి. నాకు చెందినవారిగా అవ్వడం వలన మీకు ఎంత లాభం ఉంటుంది. గురువులు మొదలైనవారందరితోనూ సంబంధాన్ని తెంచండి. నేను ఇంద్రియాల ద్వారా ఆత్మలతో మాట్లాడతాను. బాబా కూడా వీరిలో ప్రవేశించారు. ఎలాగైతే బ్రాహ్మణులకు తినిపిస్తారు, అప్పుడు పతి యొక్క ఆత్మ వీరిలోకి ప్రవేశించిందని భావిస్తారు. శరీరమైతే రాలేదు. బాబాకైతే తన శరీరం లేదు. అందుకే నన్ను అశరీరి అని అంటారు. మీరు కూడా అశరీరిగా అవ్వండి. దేహ అహంకారాన్ని వదిలేయండి. మొత్తం కల్పం మీరు దేహాభిమానంలో ఉన్నారు, సత్యయుగంలో ఆత్మాభిమానిగా ఉండేవారు. తర్వాత దేహాభిమానులుగా అయినప్పుడు ఆత్మ జ్ఞానాన్ని కూడా మర్చిపోయారు. మొదట సంతోషంగా శరీరాన్ని వదులుతూ మరియు తీసుకుంటూ ఉండేవారు, మీదేం పోతుంది. ఆత్మకు అనాదిగా పాత్ర లభించి ఉంది. స్వర్గంలో ఏడుపు అన్న పేరే ఉండదు. ఇప్పుడు మీరు 63 జన్మలు దుఃఖాన్ని అనుభవిస్తూ-అనుభవిస్తూ పూర్తిగా తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి, ఇంకెక్కడికి వెళ్ళినా కూడా, ఫలానా సన్యాసి వేద శాస్త్రాలను వినిపించడాన్నే చూస్తారు. ఇక్కడ నిరాకార పరమాత్మ అయితే ఏ శాస్త్రమూ చదవరు. వారు అన్ని వేద శాస్త్రాల సారాన్ని వినిపించేవారు. శాస్త్రాలను చదువుతూ-చదువుతూ మీరు పతితంగా అయిపోయారు, అప్పుడు పిలుస్తారు, ఓ సద్గతిదాత, ముక్తేశ్వరా, పాప కటేశ్వరా రండి. అచ్ఛా, తండ్రి వచ్చారు. మీరు నా మతముపై నడుచుకున్నట్లయితే ఉన్నత పదవిని పొందుతారని వారంటారు. ఇది శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతము. బాబా ఉన్నారే శ్రీ శ్రీ, వారు వచ్చి భ్రష్టాచారి నుండి శ్రేష్ఠాచారిగా చేస్తారు. ప్రతి ఒక్కరికి తమ-తమ పాత్ర లభించి ఉందని మీకు తెలుసు. చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆత్మ నాశనమవ్వదు, దాని పాత్ర కూడా నాశనమవ్వదు. ఇది తయారై తయారుచేయబడిన ఆట, దీని నుండి ఎవరూ విడుదల అవ్వలేరు. తండ్రి అంటారు, నేను కూడా పతిత శరీరంలోకి వచ్చి మీకు సేవ చేస్తాను. నేను మీకు స్వర్గ సుఖాన్ని ఇస్తాను. మీరు మళ్ళీ ఎన్ని వజ్ర వైఢూర్యాల మందిరాలను తయారుచేస్తారు, దానిలో నన్ను కూర్చోబెడతారు. ఇప్పుడు మిమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారుచేయడానికి వచ్చాను, అయినా నా గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. వదిలి కూడా వెళ్ళిపోతారు. మీరు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. కనుక బాబా ఎలా స్వర్గ స్థాపన చేస్తారు, ఎంత సహజమైన విషయము. మాయ వస్తుంది, మాయను పారద్రోలడము మీ పని. శివబాబా తప్ప ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. ఒక ఘడియ, అర్ధ ఘడియ… స్మృతి చేసే అభ్యాసం కూడా చేయండి. తర్వాత చివర్లో అంత మతి సో గతి అవుతుంది. ఒకవేళ బుద్ధి ఎక్కడైనా వేలాడి ఉన్నట్లయితే శిక్షలు చాలా అనుభవిస్తారు. ఎలాగైతే కాశీలో బలి అవుతారో, దానిని జీవహత్య అని అనడం జరుగుతుంది. ఆత్మ తన జీవాన్ని హతమార్చుకుంటుంది. అంతేకానీ, ఆత్మ యొక్క హత్య జరగదు. ఆత్మ అయితే అమరమైనది. ఇదంతా ధారణ చేసి తండ్రి స్మృతిలో ఉండాలి, అందరి నుండి మమకారాన్ని తొలగించాలి. ఇది పాత శరీరము, సాక్షిగా అయి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు తిరిగి వెళ్ళా్లి. ఇక్కడ ఆనందమేమీ లేదు. భూకంపంలో అందరూ మరణిస్తారు. మరణించే ముందుగా తమ అవస్థను మంచిగా తయారుచేసుకోవాలి.
మీరందరూ శివ శక్తులు. శివబాబా నుండి శక్తిని తీసుకోవడానికి స్త్రీ-పురుషులు ఇద్దరూ శ్రమ చేస్తారు. మాతలకు గౌరవం ఎక్కువగా ఉంది. మీరందరూ కన్యలు. బ్రహ్మాకుమారీలైతే కన్యలు కూడా ఉన్నారు, అధర్ కుమారీలు కూడా ఉన్నారు. వారు నిర్వికారిగా ఉంటారు. ఆ భీష్మ పితామహుడు మొదలైనవారు మహిమ చేయబడ్డారు. బాల్యం నుండి బ్రహ్మచారిగా ఉండేవారు కూడా చాలామంది ఉన్నారు. ఏ పని అయితే బాబా 5 వేల సంవత్సరాల క్రితం చేసి వెళ్ళారో, అది ఇప్పుడు చేస్తున్నారు. ఈ మందిరాలు ఇప్పుడు పడిపోతాయి, మళ్ళీ భక్తి మార్గంలో తయారవుతాయి. ఈ విషయాలన్నీ ధారణ చేయాల్సినవి. ఇది మీతో మీరు మాట్లాడుకోవాలి. దీనిని విచార సాగర మథనం చేయడమని అనడం జరుగుతుంది. భగవానువాచ, మిమ్మల్ని నరుని నుండి నారాయణునిగా చేస్తాను. మనుష్యులెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. వీరి ఆత్మ కూడా వింటుంది. ఇది ఘడియ-ఘడియ మీరు మర్చిపోతారు. తాబేలు, భ్రమరము ఉదాహరణలు కూడా మీ కోసమే. తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. వారి కర్తవ్యాన్ని తెలుసుకోకుండా శివుని పూజ చేయడంలో లాభమేమీ లేదు. మేము కూడా పూజ చేసేవారము కానీ ఇప్పుడు తెలుసుకున్నాము. శివబాబా మమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తున్నారు. తండ్రి అంటారు, మీరు గవ్వల వెనుక ఎందుకు కష్టపడతారు? ఇదంతా భస్మం కానున్నది. మనవలు, మనవరాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు. అందరూ మరణించనున్నారు. మీరు కళ్యాణకారీ తండ్రి పిల్లలు, అందరి కళ్యాణం చేసేవారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. దేహాభిమానాన్ని విడిచిపెట్టి తండ్రి సమానంగా అశరీరిగా అవ్వాలి. ఇది పాత శరీరము, దీనిని సాక్షిగా అయి నడిపించాలి. శ్రీ శ్రీ యొక్క శ్రేష్ఠ మతముపై నడుచుకుంటూ పావనంగా అవ్వాలి.
2. ధర్మరాజు యొక్క కఠినమైన శిక్షల నుండి రక్షించుకునేందుకు ఇప్పటి నుండే ఎలాంటి అవస్థను తయారుచేసుకోవాలంటే, అంతిమ ఘడియలో ఒక్క తండ్రి తప్ప ఎవ్వరూ గుర్తు రాకూడదు. బుద్ధి ఎక్కడా కూడా వేలాడుతూ ఉండరాదు.
వరదానము:-
ఎలాగైతే సేవలో చాలా ముందుకు వెళ్తున్నారో, అలాగే స్వ ఉన్నతిపై కూడా పూర్తి అటెన్షన్ ఉండాలి. ఎవరికైతే ఈ బ్యాలెన్స్ పెట్టుకోవడం వస్తుందో, వారు సదా ఆశీర్వాదాలను తీసుకుంటూ మరియు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. బ్యాలెన్స్ యొక్క ప్రాప్తియే బ్లెస్సింగ్స్ (ఆశీర్వాదాలు). బ్యాలెన్స్ పెట్టేవారికి బ్లెస్సింగ్స్ లభించకపోవడము, ఇది జరగజాలదు. తల్లి-తండ్రి మరియు పరివారం యొక్క ఆశీర్వాదాలతో సదా ముందుకు వెళ్తూ ఉండండి. ఈ ఆశీర్వాదాలే పాలన. కేవలం ఆశీర్వాదాలను తీసుకుంటూ వెళ్ళండి మరియు అందరికీ ఆశీర్వాదాలనిస్తూ వెళ్ళండి, అప్పుడు సహజంగా సఫలతా మూర్తులుగా అవుతారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!