14 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

13 May 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు శూద్ర వంశం నుండి బయటకు వచ్చి బ్రాహ్మణ వంశంలోకి వచ్చారు. తండ్రి బ్రహ్మా ముఖం ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు - కనుక ఇదే సంతోషంలో ఉండండి”

ప్రశ్న: -

ఏ గుహ్యమైన రహస్యాన్ని బ్రాహ్మణ కులం యొక్క పిల్లలే అర్థం చేసుకోగలరు?

జవాబు:-

నిరాకార శివబాబా మా తండ్రి మరియు ఈ బ్రహ్మా మా తల్లి. నిరాకార భగవంతుడు తల్లి-తండ్రి, బంధు-సఖునిగా ఎలా అవుతారు అనేటువంటి ఈ గుహ్యమైన, గుప్తమైన రహస్యాన్ని బ్రాహ్మణ కులంలోని పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు. అందులోనూ ఎవరైతే దైవీ కులంలో ఉన్నత పదవిని పొందేవారు ఉంటారో, వారే ఈ రహస్యాన్ని యథార్థ రీతిగా అర్థం చేసుకుంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. మా బాప్ దాదా వచ్చేసారని ఇక్కడ కూర్చొన్న పిల్లలు అర్థం చేసుకున్నారు. తండ్రి అయితే దాదాతో కలిసే ఉంటారు కనుక బాప్ దాదా వచ్చారని అంటారు. వారు టీచరు కూడా. తండ్రి, దాదా లేకుండా ఏమీ చెప్పలేరు. బుద్ధిని ఉపయోగించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది కొత్త విషయం కదా. అజ్ఞాన కాలంలో ఒక్కరినే స్మృతి చేస్తారు. మా గురువు ఫలానా స్థానంలో ఉన్నారని అంటారు, అతని శరీరం పేరు వారికి తెలుసు. మా తండ్రి, మా తల్లి ఫలానా స్థానంలో ఉన్నారని అంటారు. వాళ్ళకు పేర్లు, రూపాలు అన్నీ ఉంటాయి. మనుష్యులైతే క్లుప్తంగా రాసేసారు, మనుష్యులు ఏదైతే తయారుచేసారో, అందులో ఎంతో కొంత తప్పు ఉంది. త్వమేవ మాతాశ్చ పితా….. అని ఒక్కరి కోసమే గాయనం చేయడం జరుగుతుంది. బ్రహ్మా కోసం ఇలా గాయనం చేయడం జరగదు. అతని నామ రూపాలు బుద్ధిలోకి రావు. అలాగే విష్ణువు నామ రూపాలు లేదా శంకరుని నామ రూపాలు కూడా బుద్ధిలోకి రావు. నీవే తల్లివి, తండ్రివి, మేము నీ సంతానము….. అని అయితే పాడుతారు. అప్పుడు కూడా బుద్ధి పైకి వెళ్తుంది. కృష్ణుడిని ఎవరూ స్మృతి చేయలేరు. ఎంతైనా నిరాకారుడినే స్మృతి చేస్తారు, వారికే మహిమ ఉంది. కనుక తండ్రి అర్థం చేయిస్తారు – ఇక్కడ కూర్చొన్నప్పుడు లౌకిక సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తొలగించి, పారలౌకిక తండ్రిని స్మృతి చేయండి. ఈ సమయంలో వారు సమ్ముఖంగా ఉన్నారు. భక్తి మార్గంలో పాడేటప్పుడు, కళ్ళతో పైకి చూస్తూ – నీవే తల్లివి-తండ్రివి….. ఓ భగవంతుడా అని అంటూ స్మృతి చేస్తారు. భగవంతుడా, అని అన్నప్పుడు శివలింగాన్ని కూడా స్మృతి చేయరు. చిలుక వలె పాడుతారు అంతే. లక్ష్మీనారాయణుల గురించి కూడా అలా అనలేరు, వారు మహారాజు-మహారాణి. వారి పిల్లలు మాత్రమే వారిని తల్లి-తండ్రి అని అంటారు, వారిని బంధువు అని కూడా అనరు. భక్తులు పతితపావన అని పాడుతారు కానీ వారు శివలింగమై ఉంటారని బుద్ధిలోకి రాదు. ఓ భగవంతుడా, అని ఊరికినే అనేస్తారు. ఓ భగవంతుడా, అని ఎవరు అన్నారు, ఎవరిని అన్నారు – అసలు ఏమీ తెలియదు. నేను ఆత్మను, వారిని పిలుస్తున్నాను అనే జ్ఞానం ఒకవేళ ఉన్నట్లయితే, వారు నిరాకార పరమాత్మ అని, వారి రూపం లింగమని అర్థం చేసుకుంటారు. ఎవరూ తండ్రిని యథార్థ రీతిగా స్మృతి చేయరు. వారి నుండి ఏమి ప్రాప్తిస్తుంది, ఎప్పుడు ప్రాప్తిస్తుంది అనేది ఏమీ తెలియదు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. ఇప్పుడు తండ్రికి చెందినవారిగా అయ్యారు. మమ్మల్ని శివబాబా బ్రహ్మా ద్వారా తమ పిల్లలుగా చేసుకున్నారని మీకు తెలుసు. ఈ బ్రహ్మా తల్లి, ఈ బ్రహ్మా తల్లి ద్వారా శివబాబా దత్తత తీసుకున్నారు. మేము శివబాబా సంతానమని ఈ సమయంలో మీకు మంచిరీతిగా తెలుసు. మళ్ళీ సాకారంలో ప్రజాపిత బ్రహ్మా సంతానము. ప్రజాపిత బ్రహ్మా ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. అలాగని ఏదో కొత్త సృష్టిని రచిస్తారని కాదు. అలా జరగదు, ఈ సమయంలో వచ్చి, ఒడిలోకి తీసుకుంటారు, దత్తత తీసుకుంటారు. ఇప్పుడు తల్లి-తండ్రి అని అంటున్నారంటే శివుడు తండ్రి అవుతారు మరియు బ్రహ్మా తల్లి అవుతారు. వారిని తల్లి-తండ్రి అని అంటారు. తండ్రి బ్రహ్మా ద్వారా – ఆత్మలైన మీరు నా సంతానమని అంటారు. తర్వాత ఆత్మ అంటే ఏమిటి అని ఆత్మకు పరిచయాన్ని ఇస్తారు. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుందని, నక్షత్రంలా ఉంటుందని కూడా అంటారు, వారికి ఇంకేమీ తెలియదు. ఆత్మ 84 జన్మలను అనుభవిస్తుందని వారు చెప్పలేరు. ఆత్మ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది. రకరకాల నామ, రూప, దేశ, కాలాలతో ఉన్న ఆత్మ, ఒక శరీరాన్ని వదిలినప్పుడు, పూర్తి పరివారమంతా మారిపోతుంది. ఎవరైనా దత్తత తీసుకున్నప్పుడు కూడా పరివారమే మారిపోతుంది. ఏ తల్లిదండ్రుల వద్దనైతే జన్మ తీసుకున్నారో, వారి గురించి కూడా తెలిసి ఉంటుంది. కానీ ఎవరైతే దత్తత తీసుకున్నారో, వారి ఇంటి వారిగా అయిపోతారు. ఇక్కడ మీరు శూద్ర వంశం నుండి బయటకు వచ్చి ఇప్పుడు బ్రాహ్మణ వంశంలోకి వచ్చారు. బ్రహ్మా తనువు ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. మీరైతే బ్రాహ్మణ కులంలోకి వచ్చేసారు. ఈ విషయాలను శాస్త్రాలలో రాయలేరు, వీటిని అర్థం చేయించడం జరుగుతుంది. వీటిని రాయడం ద్వారా ఎవరూ అర్థం చేసుకోరు.

మేము పరమపిత పరమాత్ముని సంతానంగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వీరు (బ్రహ్మా) తల్లి అయ్యారు. బ్రహ్మాను ప్రజాపిత అనే అంటారు. వీరి ద్వారా పిల్లలైన మిమ్మల్ని దత్తత తీసుకుంటాను – ఇది ఎంత గుప్తమైన విషయము. సమ్ముఖంగా ఉన్నవారు తప్ప ఎవరూ అర్థం చేసుకోలేరు. అది కూడా, ఈ బ్రాహ్మణ కులానికి చెందినవారు ఎవరైతే ఉంటారో, వారే అర్థం చేసుకుంటారు. వారు దైవీ కులంలో ఉన్నత పదవిని పొందేవారిగా ఉంటారు. ఈ విషయాలు కొత్తవారు ఎవరి బుద్ధిలోనూ కూర్చోవు. వారి బుద్ధిలోనూ కూర్చోవు, అలాగే వారు ఎవరికీ అర్థం చేయించలేరు కూడా. మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారంగా బుద్ధిలో కూర్చొంటాయి. త్వమేవ మాతాశ్చ పితా….. అని గాయనం చేయడం జరుగుతుంది. శివబాబాను స్మృతి చేయడం జరుగుతుంది. మళ్ళీ నీవే తల్లివి-తండ్రివి అని అంటారు. ఒక్క తండ్రియే తల్లి-తండ్రిగా ఎలా అవుతారు? ఈ విషయాలను ఇతరులెవరూ అర్థం చేయించలేరు. ఎలాగైతే శాస్త్రాలలో వ్యాసుడు రాసినదానిని మనుష్యులు కంఠస్థం చేసారో, అలాగే మీకు ఎవరో చెప్పారని, దానిని మీరు కంఠస్థం చేసారని మనుష్యులు మీతో కూడా అంటారు. కొత్తవారికి అర్థం చేసుకోవడం చాలా కష్టము. మీరు ఆత్మలు అని, మీ తండ్రి పరమపిత పరమాత్మ అని ఇక్కడ ఉన్నవారెవరూ ఎవరికీ ఈ మాత్రం కూడా అర్థం చేయించలేరు. ఆ అనంతమైన తండ్రియే అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఇంతకుముందు వారసత్వాన్ని ఇచ్చారు, తర్వాత పునర్జన్మలను తీసుకుంటూ-తీసుకుంటూ 84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడు తండ్రి మళ్ళీ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం ఎంత సహజము. నీవే తల్లివి-తండ్రివి అని ఎవరిని అంటారు అనేది ఆలోచించాల్సిన విషయం కదా. బ్రహ్మా ద్వారా దత్తత తీసుకుంటారు, తర్వాత తల్లి కూడా తప్పకుండా కావాలి. కనుక అనన్యమైన కుమార్తె ఎవరైతే ఉన్నారో, డ్రామా ప్లాన్ అనుసారంగా వారికి జగదంబ అనే టైటిల్ ను ఇవ్వడం జరుగుతుంది. పురుషుడిని జగత్ అంబ అని అనలేము, వీరిని జగత్ పిత అని అంటారు. వీరికి ప్రజాపిత అనే పేరు ప్రసిద్ధమైనది. అచ్ఛా, మరి ప్రజా మాత ఎక్కడున్నారు? కనుక మాతను దత్తత తీసుకోవడం జరుగుతుంది. ఆదిదేవ్ అయితే ఉన్నారు, తర్వాత ఆదిదేవిని నియమించడం జరుగుతుంది. జగదంబ అయితే ఒక్కరే – వారికే మహిమ ఉంటుంది. జగదంబకు ఎన్ని మేళాలు జరుగుతాయి. కానీ వారి కర్తవ్యాన్ని గురించి ఎవరికీ తెలియదు. కలకత్తాలో కాళీ మందిరముంది, బొంబాయిలో కూడా జగదంబ మందిరముంది. కానీ ముఖకవళికలు వేర్వేరుగా ఉంటాయి. జగదంబ ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఆమెను భగవతి అని కూడా అంటారు. కానీ ఇప్పుడు జగదంబను భగవతి అని అనలేము. ఆమె బ్రాహ్మణి, జ్ఞాన-జ్ఞానేశ్వరి, ఆమెకు తండ్రి నుండి జ్ఞానం లభించింది. మీరంతా జగదంబ సంతానము. జ్ఞానాన్ని విని, మళ్ళీ వినిపిస్తారు. ఇదే మీ వ్యాపారము. మిమ్మల్ని ఈశ్వరుడు చదివిస్తున్నారు, మనుష్యులెవరూ చదివించడం లేదు. ఈ బ్రహ్మా కూడా మనిషే. మనుష్యులు ఎవరినీ పావనంగా చేయలేరు. మనుష్యుల బుద్ధి ఎంత డల్ గా అయిపోయిందంటే, అసలు ఏమీ అర్థం చేసుకోవడం లేదు. పతితపావనుడు అయితే ఒక్క తండ్రి మాత్రమే. వారు పతితులను పావనంగా చేసేందుకే వస్తారు. ఈ ప్రపంచమంతా తమోప్రధానంగా ఉంది, అందరూ పతితులుగా ఉన్నారు. కొత్త ప్రపంచం పావనమైనది, పాత ప్రపంచం పతితమైనది. పాత ప్రపంచంలో నరకవాసులుంటారు, కొత్త ప్రపంచంలో స్వర్గవాసులుంటారు. సత్యయుగంలో కేవలం భారతవాసులైన దేవీ-దేవతలే ఉంటారని, ఇంకెవరూ ఉండరని బుద్ధి కూడా చెప్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం లభించింది. కొత్త ప్రపంచంలో మొదట సూర్యవంశీ దేవతలుండేవారు, తర్వాత చంద్రవంశీయులు ఉండేవారు, కనుక సూర్యవంశము గతించిపోయింది అని అర్థము. చంద్రవంశీయుల తర్వాత మళ్ళీ వైశ్యవంశీయులు….. మొదలైనవారు వస్తారు. తప్పకుండా లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. అచ్ఛా, వారికన్నా ముందు ఏముండేది అన్నది ఎవరూ అర్థం చేసుకోలేరు. తండ్రి పిల్లలైన మీకు చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయించారు. ద్వాపరంలో వైశ్యవంశీయులు ఉంటారు, కలియుగంలో శూద్రవంశీయులు ఉంటారు.

మేము బ్రాహ్మణులుగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. మిమ్మల్ని తండ్రి తమవారిగా చేసుకున్నారు అనగా శూద్ర ధర్మం నుండి దేవతా ధర్మంలోకి ట్రాన్స్ఫర్ చేసారు. ఇప్పుడైతే సూర్యవంశీయులు, చంద్రవంశీయులు లేరు. లక్ష్మీనారాయణుల రాజ్యము లేదు, రామ రాజ్యము లేదు. ఇప్పుడిది కలియుగ అంతిమము. కలియుగం తర్వాత తప్పకుండా సత్యయుగం వస్తుంది. కలియుగంలో ఈ పాత పతిత ప్రపంచముంది, మహాన్ దుఃఖితులుగా ఉన్నారు, అందుకే వెళ్ళి దేవతల మహిమను పాడుతారు, తల వంచి నమస్కరిస్తారు. అచ్ఛా, లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు అనేది చెప్పగలిగేవారు ఎవరైనా ఉన్నారా. ఇది ఎవరి ఆలోచనల్లోనూ ఉండదు, ఎందుకంటే కలియుగం ఇంకా చిన్న బిడ్డ అని, ఇంకా 40 వేల సంవత్సరాలున్నాయని వారి బుద్ధిలో ఉంది. అందుకే వారికి ఈ ఆలోచనే రాదు. ఇప్పుడు మీకు ఈ ఆలోచన వస్తుంది. మాకు స్మృతి ఉండడం లేదని చాలామంది పిల్లలంటారు. ఎందుకు ఉండడం లేదు? ఎందుకంటే ఉదయాన్నే లేచి, స్మృతిలో కూర్చొని ధారణ చేయరు. అర్థం చేసుకుంటారు కూడా, కానీ ఎవరికీ అర్థం చేయించలేరు. తప్పకుండా ఇలా జరుగుతుంది. అందరూ ఒకేలాంటి తెలివైనవారిగా అవ్వలేరు. తెలివైనవారు కూడా కావాలి, తెలివితక్కువవారు కూడా కావాలి. చాలా తెలివైనవారైతే వెళ్ళి రాజా-రాణులుగా అవుతారు. ఎవరైతే ఎంతో ఎక్కువగా అర్థం చేసుకుంటారో మరియు అర్థం చేయిస్తారో, వారి పేరు ప్రసిద్ధమవుతుంది. ప్రదర్శనీలు జరిగేటప్పుడు, బాబా, ఫలానావారిని పంపించండి అని రాస్తారు. అప్పుడు, మీరు అర్థం చేయించలేరా అని బాబా అడుగుతారు. బాబా, వారికి ఎక్కువ ప్రాక్టీస్ ఉంది, మేము కాస్త కచ్చాగా ఉన్నామని అంటారు. బాబా స్వయంగా కూడా అంటారు – ఎక్కడ నుండైనా ఆహ్వానం లభించినప్పుడు, ఎవరెవరికి ఆహ్వానం లభించింది అన్నది రాసి పంపించండి, అప్పుడు ఎవరెవరిని పంపాలి అనేది నేను చూస్తానని అంటారు. ఆ ఆహ్వానంలో సన్యాసులు కూడా ఉన్నారా? అలా అయితే, చాలా మంచి బ్రహ్మాకుమారీని పంపించవలసి ఉంటుంది. అచ్ఛా, కుమారకా ఉన్నారు, మనోహర్ ఉన్నారు, గంగే ఉన్నారు – వీరిలో ఎవరినైనా పంపించండి. పిల్లలైతే ఎంతోమంది ఉన్నారు. జగదీష్ ను పంపించండి, రమేష్ ను పంపించండి. వీరు ఒకరికన్నా ఒకరు తెలివైనవారని మీకు కూడా తెలుసు. ఎలా అయితే జడ్జి, మెజిస్ట్రేట్ ఉంటారు, వారు ఒకరికన్నా ఒకరు తెలివైనవారిగా ఉంటారు. ఒకరికన్నా ఒకరు తెలివైనవారని గవర్నమెంట్ కు తెలుసు. అందుకే కేసు ఒక కోర్టు నుండి పై కోర్టుకు వెళ్తుంది, తర్వాత హైకోర్టుకు వెళ్తుంది, తర్వాత దాని కన్నా పై కోర్టుకు వెళ్తుంది. అక్కడ కూడా సరైన తీర్పు ఇవ్వకపోతే, మళ్ళీ దాని కన్నా పై కోర్టుకు వెళ్తారు. మీరు వీరిపై దయ చూపించండి అని అడుగుతారు. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి, సత్య-త్రేతా యుగాలలో ఉండవు. తర్వాత ద్వాపరంలో రాజు-రాణుల రాజ్యముంటుంది. అక్కడైతే మహారాజు-మహారాణులే కేసులను సంభాళిస్తారు. కేసులు కూడా కొన్నే ఉంటాయి. ఇప్పుడైతే తమోప్రధానులుగా, పతితులుగా ఉన్నారు కదా. అక్కడ చక్రవర్తి వద్దకు కేసు వెళ్తే, కొద్దిగా శిక్ష విధిస్తారు. కఠినమైన పొరపాటు జరిగినట్లయితే, కఠినమైన శిక్షను విధిస్తారు. ఇక్కడైతే జడ్జిలు, వకీళ్ళు ఎంతోమంది ఉన్నారు. కార్యవ్యవహారాలలో ఎంతో తేడా ఉంటుంది. సత్యయుగంలో ఏమి జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు – ఈ లక్ష్మీనారాయణుల గురించి తెలుసా అని ఎవరినైనా అడగండి. ఉదాహరణకు బిర్లా ఉన్నారు, చాలా మందిరాలను నిర్మిస్తూ ఉంటారు. ఎవరైనా మంచి బిడ్డ ఉన్నట్లయితే, వారికి (బిర్లాకు) లెటర్ రాయండి. మీరు లక్ష్మీనారాయణుల మందిరాలనైతే చాలా కట్టిస్తారు, సత్యయుగానికి ముందు కలియుగముండేది అన్నప్పుడు ఈ రాజధాని వీరికి ఎలా లభించింది అని రాయండి. కలియుగంలోనైతే ఏమీ లేదు. దేవతలైతే ఎవరితోనూ యుద్ధం చేసి ఉండరు. యుద్ధం ద్వారా ఎవరూ విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. విశ్వానికి యజమానులుగా ఎవరైతే ఉండేవారో, ఆ లక్ష్మీనారాయణుల చిత్రాలే పెట్టి ఉన్నాయి. ఇప్పుడిది కలియుగము, ఇక్కడ ఆయుధాలతో యుద్ధాలు జరుగుతాయి. క్రిస్టియన్ ధర్మం వారు పరస్పరంలో ఒక్కటైనట్లయితే, పరస్పరంలో ప్రీతినుంచుకున్నట్లయితే, విశ్వానికి యజమానులుగా అవ్వగలరని తండ్రి అర్థం చేయించారు. కానీ విశ్వానికి యజమానులుగా అయితే లక్ష్మీనారాయణులే అవుతారు. వీరు పరస్పరంలో ఒక్కటైతే, యజమానులుగా అవ్వగలరని బుద్ధి చెప్తుంది కానీ సత్యయుగ రాజు-రాణులుగా అయితే ఎవరూ అవ్వలేరు. డ్రామాయే ఈ విధంగా తయారుచేయబడింది. ఇప్పుడు మనం మళ్ళీ యోగబలంతో స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. కల్పక్రితం కూడా సంగమంలో, తండ్రి నుండి పదవిని పొందామని, 84 జన్మలను పూర్తి చేసుకొని, మళ్ళీ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీరు తెలియజేయవచ్చు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయం ధారణ చేసేందుకు మరియు ఇతరులచేత చేయించేందుకు, ఉదయాన్నే లేచి తండ్రి స్మృతిలో కూర్చోవాలి. ఏదైతే అర్థం చేసుకున్నారో, దానిని ఇతరులకు అర్థం చేయించే ప్రాక్టీస్ చేయాలి.

2. లౌకిక సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి, ఒక్క పారలౌకిక తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి నుండి ఏ జ్ఞానమైతే లభించిందో, దానిని విని అందరికీ వినిపించాలి. ఇదే మీ వ్యాపారము.

వరదానము:-

ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ స్థితిలో స్థితులవుతారో, అప్పుడు ప్రకృతిపై కూడా విజయం అనగా అధికారం అనుభవమవుతుంది. సంపూర్ణ స్థితిలో ఏ రకమైన ఆధీనత ఉండదు. కానీ ఇటువంటి సంపూర్ణ స్థితిని తయారుచేసుకునేందుకు మూడు విషయాలు కలిపి ఉండాలి – 1. ఆత్మికత 2. ఆత్మిక నషా 3. దయా హృదయం యొక్క గుణము. ఎప్పుడైతే ఈ మూడు విషయాలు ప్రత్యక్ష రూపంలో, స్థితిలో, ముఖంలో మరియు కర్మలో కనిపిస్తాయో, అప్పుడు అధికారి మరియు ప్రకృతి జీత్ ఆత్మ అని అంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top