14 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
13 January 2022
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - ఈ తనువు రావణుని ఆస్తి, దీనిని రావణునికి ఇచ్చి అశరీరిగా అయి ఇంటికి వెళ్ళాలి, అందుకే దీని నుండి మమకారాన్ని తొలగించండి’’
ప్రశ్న: -
మొత్తం సృష్టికి శాంతి మరియు సుఖం యొక్క దానం ఇచ్చేటువంటి విధి ఏమిటి?
జవాబు:-
ఉదయముదయమే లేచి అశరీరిగా అయి తండ్రి స్మృతిలో కూర్చోవడము, ఇది విశ్వానికి శాంతి యొక్క దానమిచ్చేటువంటి విధి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పడము – ఇది సుఖం యొక్క దానమిచ్చేటువంటి విధి. జ్ఞానం మరియు యోగంతోనే మీరు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు. సృష్టి కొత్తదిగా అయిపోతుంది.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
నన్ను మీ శరణులోకి తీసుకోండి రామా..
ఓంశాంతి. భక్తులు భక్తి మార్గంలో ఈ పాటను పాడుతారు – ఓ రామా, మీ శరణులోకి తీసుకోండి. ఎసైలమ్ (ఆశ్రయం) లోకి తీసుకోండి అని ఇంగ్లీషులో అంటారు. హిందీ పదము, శరణాగతి. భక్తులు పాడుతారు ఎందుకంటే ఇది రావణ రాజ్యము. రావణుడిని కాలుస్తారు కూడా, దీని ద్వారా కూడా ఇది రావణ రాజ్యం అని నిరూపించబడుతుంది. దీని అర్థాన్ని కూడా ఎవరూ తెలుసుకోరు. రావణుని వినాశనం చేసేందుకు దసరా జరుపుతారు. ఇది కూడా ఒక గుర్తు. ఇప్పుడిది సంగమము, కావున ఈ సమయంలోనే రాముని శరణులోకి వెళ్ళి ఉంటారు మరియు రావణుని వినాశనం చేసి ఉంటారు. గతంలో ఎవరెవరైతే ఉండి వెళ్తారో, వారి నాటకాలనే తయారుచేస్తారు. మేము ఇప్పుడు రావణుని జైలు నుండి బయటకు వచ్చి రాముని ఆశ్రయంలోకి వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. రామరాజ్యంలో రావణ రాజ్యం ఉండజాలదు మరియు రావణ రాజ్యంలో రాముని రాజ్యం ఉండజాలదు. అర్ధకల్పం రామ రాజ్యము, అర్ధకల్పం రావణ రాజ్యము అని అంటూ ఉంటారు. రామ రాజ్యము అని సత్య-త్రేతాయుగాలను అంటారు. సంగమయుగంలో ఎవరైతే రాముని శరణు తీసుకున్నారో, వారే రామరాజ్యంలోకి వెళ్ళి ఉంటారు. మేము ఇప్పుడు రాముని శరణులో ఉన్నామని మీకు తెలుసు. ఈ మొత్తం ప్రపంచమంతా ఒక ద్వీపము, నలువైపులా నీరు ఉంది. మధ్యలో ద్వీపం ఉంది. పెద్ద-పెద్ద ద్వీపాలలో మళ్ళీ చిన్న-చిన్న ద్వీపాలు కూడా ఉన్నాయి. రావణ రాజ్యం మొత్తం ప్రపంచంపై ఉందని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఎప్పటి నుండి మొదలవుతుంది? సగం-సగం ఉంటాయని అర్థం చేయించడం జరుగుతుంది. రామరాజ్యంలో సుఖము, బ్రహ్మా యొక్క పగలు, రావణ రాజ్యంలో దుఃఖము అనగా బ్రహ్మా యొక్క రాత్రి. అర్ధకల్పము వెలుగు ఉంటుంది, అర్ధకల్పము అంధకారము. సత్య-త్రేతాయుగాలలో భక్తి యొక్క నామ రూపాలు కూడా ఉండవు. తర్వాత అర్ధకల్పం ద్వాపర-కలియుగాలలో భక్తి మార్గం నడుస్తుంది. భక్తి రెండు రకాలుగా ఉంటుంది. ద్వాపరంలో మొట్టమొదట అవ్యభిచారీ భక్తి ఉంటుంది. కలియుగంలో వ్యభిచారీ భక్తిగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, తాబేలు-చేప మొదలైనవాటి అన్నింటికీ భక్తి చేస్తారు. మనుష్యుల బుద్ధి సతోప్రధానంగా, సతో, రజో, తమోగా అవ్వాల్సిందే. ఈ స్థితులను దాటాల్సి ఉంటుంది.
తండ్రి అర్థం చేయిస్తారు, మీరిప్పుడు రాముని అనగా శివబాబా ఒడిని తీసుకున్నారు. ఈశ్వరుడిని బాబా అని అంటారు. వారు తండ్రి అన్నప్పుడు, మళ్ళీ తండ్రిని సర్వవ్యాపి అని అనడము – ఇది ఎక్కడైనా విన్నారా? ఫలానా శాస్త్రంలో వ్యాస భగవానుడు రాసారు అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు, సర్వవ్యాపి జ్ఞానంతో మీకు ఏ లాభము కూడా కలగలేదు. సద్గతినిచ్చేవారు తప్పకుండా ఎవరో కావాలి. వారు తప్పకుండా వేరే వారై ఉంటారు. గాడ్ ఫాదర్ యే సద్గతినిస్తారు. ఇది మీ ఈశ్వరీయ జన్మ. మీరు ఇప్పుడు సంగమంలో ఉన్నారు. ఈ సంగమ సమయము పగలులో లేక రాత్రిలో లెక్కించబడదు. ఇది చిన్న సంగమము, ఇప్పుడు ప్రపంచం మారనున్నది. ఇనుప యుగం నుండి మారి బంగారుయుగంగా అవుతుంది. రావణ రాజ్యం నుండి మారి రామ రాజ్యంగా అవుతుంది, ఈ రామరాజ్యం కోసం మీరు పురుషార్థం చేస్తున్నారు. కావున ఇలాంటి-ఇలాంటి పాటలు కూడా ఉపయోగపడతాయి. ఇది శ్లోకం వలె ఉంది, దీని అర్థం చెప్పడం జరుగుతుంది. రాముని శరణులోకి వెళ్ళడంతో, మళ్ళీ మీరు సుఖంలోకి అనగా రామరాజ్యంలోకి వస్తారు. ఒక కథ కూడా ఉంది, మీకు మొదట సుఖం కావాలా లేక దుఃఖమా? సుఖం అని అన్నారు ఎందుకంటే సుఖంలోకైతే యమదూతలు తీసుకువెళ్ళడానికి రారు. కానీ అర్థాన్ని తెలుసుకోరు. తండ్రి కూర్చుని మంచి రీతిగా అర్థం చేయిస్తారు. మా దేవీ-దేవతా కులం చాలా ఉన్నతంగా ఉండేది అని మీ బుద్ధిలో ఉంది. మొదట బ్రాహ్మణ కులం ఉంటుంది, తర్వాత దేవతలుగా అవుతారు, తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. మేమే ఈ వర్ణాలను దాటుతూ వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు వచ్చి బ్రాహ్మణులుగా అయ్యాము. ఈ విరాట రూపం చాలా సరైనది. వర్ణాలు నిరూపించబడతాయి. మొత్తం 84 జన్మలను ఒక్క సత్యయుగంలోనే తీసుకోలేరు. ఈ వర్ణాలు తిరుగుతూ ఉంటాయి. డ్రామా చక్రం పూర్తి అయ్యింది అంటే 84 జన్మలు పూర్తి అయినట్లు. చక్రంలోనైతే తిరగాల్సిందే అందుకే, దైవీ వర్ణంలో ఇంత సమయం, క్షత్రియ వర్ణంలో ఇంత సమయం అని చూపించడం జరుగుతుంది. ఇంతకుముందు ఇదేమైనా తెలుసా. ఇలా వర్ణాలలోకి రావాల్సి ఉంటుంది అని ఎప్పుడూ శాస్త్రాలలో కూడా వినలేదు. 84 జన్మలు ఎవరు తీసుకుంటారో మీకు తెలుసు. ఆత్మ మరియు పరమాత్మ బహుకాలం వేరుగా ఉన్నారు… ఈ విషయాన్ని నిరూపించి చెప్పాలి. మొట్టమొదట దేవీ-దేవతలే భారత్ లో ఉండేవారు. భారత్ బంగారు యుగంగా ఉండేది. ఆ సమయంలో వేరే ఏ ధర్మమూ ఉండేది కాదు, మళ్ళీ చక్రం తిరగాల్సిందే. మనుష్యులు పునర్జన్మలు తీసుకోవాల్సిందే. చక్రంపై అర్థం చేయించడం చాలా సహజము. ప్రదర్శినీలలో ఇలా-ఇలా అర్థం చేయించాలి అని బాబా డైరెక్షన్ ఇస్తారు. మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళాల్సిన ఈ సమయంలో, తండ్రి, ఇది పాత ప్రపంచము అని చెప్తారు. ఈ పాత ప్రపంచాన్ని, పాత శరీరం యొక్క సంబంధీకులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, వాటిని బుద్ధి ద్వారా త్యాగం చేయండి. బుద్ధి ద్వారా కొత్త ఇంటిని ఆహ్వానించడం జరుగుతుంది. ఇది అనంతమైన సన్యాసము. దేహ సహితంగా పాత ప్రపంచం యొక్క సంబంధాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, వాటన్నింటినీ మర్చిపోవాలి. తండ్రి అంటారు, స్వయాన్ని దేహీగా భావించండి. మీరు వాస్తవానికి ముక్తిధామంలో నివసించేటువంటివారు. అన్ని ధర్మాల వారికి తండ్రి చెప్తారు, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ముక్తినైతే అందరూ గుర్తు చేస్తారు కదా. ఇప్పుడు మీ ఇంటికి పదండి. ఎక్కడ నుండైతే మీరు నగ్నం (అశరీరి) గా వచ్చారో, ఇప్పుడు మళ్ళీ అశరీరిగా అయ్యే వెళ్ళాలి. శరీరాన్ని అయితే తీసుకువెళ్ళలేరు. రావడం అశరీరిగా వచ్చారు కనుక వెళ్ళడం కూడా అశరీరిగా వెళ్ళాలి. కేవలం ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళాలి అనే చక్రాన్ని అర్థం చేసుకోవాలి. వాస్తవానికి, సత్యయుగంలో మొట్టమొదట దేవీ-దేవతా ధర్మం వారే వస్తారు తర్వాత నంబరువారుగా వస్తూ ఉంటారు. ఎప్పుడైతే మూలవతనం నుండి అందరూ వచ్చేస్తారో, అప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళడం మొదలవుతుంది. అక్కడికైతే ఆత్మనే వెళ్తుంది, ఈ తనువు అయితే రావణుని ఆస్తి కావున దీనిని రావణునికే ఇచ్చి వెళ్ళాలి. ఇదంతా ఇక్కడే వినాశనం అవుతుంది. మీరు అశరీరిగా అయి పదండి. తండ్రి అంటారు, నేను తీసుకువెళ్ళడానికి వచ్చాను. బాబా ఎంత సహజం చేసి అర్థం చేయిస్తారు, మళ్ళీ ధారణ కూడా ఉండాలి. తర్వాత వెళ్ళి ఇతరులకు అర్థం చేయించాలి. మీరు గ్యారెంటీ ఇస్తారు – బాబా, మేము విని మళ్ళీ వినిపిస్తాము. ఎవరికైతే ఈ ప్రాక్టీస్ ఉంటుందో, వారు వినిపించగలరు. మేము ఈ ప్రపంచాన్ని పవిత్రంగా తయారుచేయాలి అని మీకు తెలుసు. యోగంలో ఉంటూ శాంతి మరియు సుఖం యొక్క దానం ఇవ్వాలి, అందుకే బాబా అంటారు, రాత్రి లేచి యోగంలో కూర్చోండి, అప్పుడు సృష్టికి దానమివ్వండి. ఉదయముదయమే అశరీరిగా అయి కూర్చున్నట్లయితే, మీరు భారత్ కే కాక, మొత్తం సృష్టికి యోగంతో శాంతి యొక్క దానాన్ని ఇస్తారు. మరియు చక్రం యొక్క జ్ఞానాన్ని స్మరణ చేయడంతో మీరు సుఖం యొక్క దానాన్ని ఇస్తారు. సుఖం, ధనం ద్వారా లభిస్తుంది. కనుక ఉదయాన్నే లేచి స్మృతిలో కూర్చోండి. బాబా, ఇప్పుడిక మీ వద్దకు వచ్చేస్తున్నాము. ఇప్పుడు మా 84 జన్మలు పూర్తయ్యాయి. కావున ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేసి, శాంతి మరియు సుఖం యొక్క దానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. యోగం మరియు జ్ఞానంతో ఆరోగ్యం మరియు ఐశ్వర్యం లభిస్తుంది. ఎప్పుడైతే మనం సదా ఆరోగ్యవంతులుగా ఉంటామో, అప్పుడు సృష్టియే కొత్తదిగా అవుతుంది. సత్య-త్రేతా యుగాలలో ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. కలియుగంలో అనారోగ్యంగా, నిరుపేదలుగా ఉన్నారు. ఇప్పుడు మనం ఆరోగ్యవంతులుగా మరియు ఐశ్వర్యవంతులుగా అవుతాము. తర్వాత అర్ధకల్పం మన రాజ్యమే నడుస్తుంది. బుద్ధిలో ఎప్పుడైతే ఈ జ్ఞానం ఉంటుందో, అప్పుడు సంతోషం ఉండగలదు. ఇది కూడా రాయవచ్చు, 2500 సంవత్సరాల కోసం సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవ్వాలి అంటే, ఈ ఈశ్వరీయ నేచర్ క్యూర్ సెంటర్ కు రండి అని. కానీ ఎవరిలోనైతే జ్ఞానం ఉంటుందో, వారే ఇది రాస్తారు. అంతేకానీ, సెంటర్ మేము తెరుస్తాము, మీరు వచ్చి సేవ చేయండి, అన్నట్లు అవుతుందా. ఎవరైతే తెరుస్తారో, వారు స్వయంగా సేవ చేయాలి. గొడవంతా పవిత్రతపైనే నడుస్తుంది. విషం లభించకపోవడంతో అత్యాచారాలు జరుగుతాయి. ఇప్పుడిది సంగమము. కావున బుద్ధిలో సుఖధామాన్ని మరియు శాంతిధామాన్ని మాత్రమే స్మృతి చేయాలి. ఇది దుఃఖధామము, కావుననే సుఖధామాన్ని స్మృతి చేస్తారు. అందుకే, దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు… అని పాడుతారు. ఇది పతిత ప్రపంచము. ఎప్పటివరకైతే సంగమము రాదో మరియు రామరాజ్యం యొక్క స్థాపన జరగదో, అప్పటివరకు కలియుగాంతం వరకు అందరూ పతితులుగా అవ్వాల్సిందేనని నియమం చెప్తుంది, తర్వాత రావణ రాజ్యం యొక్క వినాశనం జరుగుతుంది. ఇప్పుడు వినాశనం యొక్క తయారీ జరుగుతుంది. రావణ రాజ్యం సమాప్తం అవ్వాల్సిందే. ఇకపోతే, ఈ బొమ్మలాటను ఆడుతారు. ఎన్ని బొమ్మలను తయారుచేస్తారు, అందుకే దానిని అంధ శ్రద్ధ అని అంటారు. భారత్ లో ఎన్ని చిత్రాలైతే తయారవుతాయో, అన్ని ఇంకెక్కడా తయారవ్వవు. భారత్ లో అనేక చిత్రాలున్నాయి. బ్రహ్మా పగలు, బ్రహ్మా రాత్రి అని అంటారు కూడా. మరి పగలును పెద్దదిగా ఎందుకు చూపించారు, ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. మొదట అవ్యభిచారీ భక్తి, తర్వాత వ్యభిచారీ. మొదట 16 కళలు, తర్వాత 14, చివర్లో ఎంతో కొంత కళ మిగులుతుంది కానీ ఈ సమయంలో ఏ కళ లేదు. ఈ సమయంలో తమోప్రధాన ప్రపంచం ఉంది. తమో అనేది కలియుగం నుండి మొదలవుతుంది, తర్వాత అంతిమంలో తమోప్రధానము అని అంటారు. ఇప్పుడు ప్రపంచం శిథిలావస్థకు చేరుకుంది. పాత వస్తువుకు దానంతట అదే నిప్పు అంటుకుంటుంది. ఎలాగైతే వెదురు అడవికి దానంతట అదే నిప్పు అంటుకుంటుంది, దీనికి కూడా నిప్పు అంటుకోనున్నది. పరస్పరంలో కొద్దిగా ఏమైనా జరిగినా నిప్పు రాజుకుంటుంది. ఇంట్లో ఏదైనా చిన్న విషయంపై గొడవ జరుగుతుంది. పరస్పరంలో స్నేహితులుగా ఉంటారు, చిన్న విషయంలో ఎలాంటి శత్రుత్వం ఏర్పడుతుంది అంటే ఇక ఒకరిదొకరు గొంతులు కోసుకోవడం కూడా మొదలుపెడతారు. క్రోధం కూడా తక్కువేమీ కాదు. ఒకరినొకరు హతమార్చుకోవడానికి చూడండి ఎంత తయారీ చేస్తున్నారు. ఇది డ్రామా. క్రిస్టియన్లు ఇరువైపులా వారు పెద్దవారు, పరస్పరంలో కలిసిపోతే అన్నీ చేయగలరు. పోప్ కూడా క్రిస్టియన్ల హెడ్, వారి పట్ల చాలా గౌరవముంచుతారు. కానీ వారిది కూడా వినరు. ఇక్కడ కూడా ఏ పిల్లలైతే తండ్రిది అంగీకరించరో, వారు వినాశీ పదవిని పొందుతారు. శ్రీమతంపై నడుచుకోవాలి. శ్రీమద్భగవద్గీత ఉంది కదా, ఇంకే శాస్త్రంలోనూ శ్రీమతం లేదు. శ్రీ అనగా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు, వారు ఎప్పుడూ పునర్జన్మలలోకి రారు. మనుష్యులైతే పునర్జన్మలోకి వస్తారు. విద్వాంసులైతే, జనన-మరణ రహితుడు వినిపించిన గీతలో, పూర్తి 84 జన్మలు తీసుకున్నవారి పేరును వేసేసారు. వాస్తవానికి పరమపిత పరమాత్మనే జ్ఞానసాగరుడు, పవిత్రత సాగరుడు, పతిత-పావనుడు అని అంటూ ఉంటారు. వారే పిల్లలకు వరదానాలు ఇస్తారు. వారికి బదులుగా కృష్ణుని పేరును వేసేసారు. మొట్టమొదట శివజయంతి, తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. శివబాబా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వస్తారు, కావున మొదట తండ్రి జన్మ, ఆ తర్వాత పుత్రుడి జన్మ. తండ్రి జన్మ ద్వారానే కృష్ణుడైన పుత్రుడు జన్మించారు. వారు కూడా ఒక్కరే ఉండరు కదా, దైవీ సంప్రదాయము అని అంటారు కదా. కావున ఎంత పొరపాటు చేసేసారు. ఒక్కరు ఎవరైనా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నా, వారి జిజ్ఞాసువులు అందరూ వెళ్ళిపోతారు. అందరి ముఖాలు పాలిపోతాయి. ఇది ఎంత పెద్ద పొరపాటు, అందుకే తండ్రి రావలసి వస్తుంది. ఎవరికైనా అర్థం చేయించేందుకు కూడా సమయం కావాలి. మొదట ఈ నిశ్చయం చేయించండి, పరమపిత పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది? అప్పుడే, భగవంతుడు తండ్రి అని అర్థం చేసుకుంటారు. భగవంతుడిని, భగవంతుడి పదవిపైన అయితే ఉంచండి. అందరూ ఒకేలా ఎలా ఉంటారు. వారంటారు, అంతా భగవంతుని లీలే, ఒక రూపాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు అని. కానీ పరమాత్మ ఏమైనా పునర్జన్మలు తీసుకుంటారా. ఈ బాప్ దాదాలు ఇరువురూ కంబైండ్ గా ఉన్నారు మరియు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బాప్ దాదా యొక్క అర్థం కూడా ఎవరి బుద్ధిలోనూ లేదు. త్వమేవ మాతాశ్చ పితా… అని అంటారు. ఓ గాడ్ ఫాదర్, అని కూడా అంటారు మరి తప్పకుండా మదర్ (తల్లి) కావాలి. కానీ ఎవరి బుద్ధిలోకి రాదు.
శరణు ఎప్పుడు తీసుకోవడం జరుగుతుందో పిల్లలకు అర్థం చేయించారు. ఎప్పుడైతే రావణ రాజ్యం సమాప్తమైపోతుందో, అప్పుడు రాముడు వస్తారు. రాముని శరణు తీసుకోవడంతోనే సద్గతి లభిస్తుంది. రామరాజ్యం కావాలి అని అంటారు. వారికి సూర్యవంశీ రాజ్యం గురించి తెలియనే తెలియదు. రామరాజ్యం, కొత్త ప్రపంచం, కొత్త భారత్ ఉండాలి అని అంటారు. అది ఇప్పుడు తయారవుతూ ఉంది. తప్పకుండా తయారవ్వాలి. డ్రామా తప్పకుండా నడవాలి. ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే చదువు. మనుష్యులు ఎవరినీ దేవతలుగా తయారుచేయలేరు. బాబా వచ్చి మనుష్యులను దేవతలుగా తయారుచేస్తారు ఎందుకంటే బాబానే స్వర్గం యొక్క స్థాపన చేస్తారు. బ్రాహ్మణుల మాల అని అనడం జరగదు. వైజయంతి మాల విష్ణువుది. ఇది ఈశ్వరీయ వంశము, ఇది ఇప్పుడు కొత్తగా మొదలవుతుంది. ఒకప్పుడు రావణుని ఆసురీ వంశం ఉండేది. రావణుడిని అసురుడు అని అంటారు. ఈ కంసుడు, జరాసంధుడు అనే పేర్లు ఈ సమయానికి చెందినవే. జన్మ-జన్మాంతరాలు మీకు సాకారుని నుండి వారసత్వం లభిస్తుంది. సత్యయుగంలో కూడా సాకారుని నుండి లభిస్తుంది. కేవలం ఈ సమయంలో మీకు నిరాకార తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. అచ్ఛా.
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. దేహ సహితంగా పాత ప్రపంచం యొక్క సంబంధీకులు మొదలైన వారందరినీ మరచి స్వయాన్ని దేహీగా భావించాలి. బుద్ధితో కొత్త ఇంటిని ఆహ్వానించాలి.
2. ఉదయముదయమే లేచి మొత్తం ప్రపంచానికి శాంతి మరియు సుఖం యొక్క దానం ఇవ్వాలి.
వరదానము:-
ఎలాగైతే సాకారంలో ఉండడం న్యాచురల్ (సహజం) అయిపోయిందో, అలాగే నేను ఆకారీ ఫరిశ్తాను మరియు నిరాకారీ శ్రేష్ఠాత్మను – ఈ రెండు స్మృతులు న్యాచురల్ అవ్వాలి ఎందుకంటే శివ తండ్రి నిరాకారుడు మరియు బ్రహ్మా తండ్రి ఆకారీ. ఒకవేళ ఇరువురి పట్ల ప్రేమ ఉన్నట్లయితే, సమానంగా అవ్వండి. సాకారంలో ఉంటూ అభ్యాసం చేయండి – ఇప్పుడిప్పుడే ఆకారీ మరియు ఇప్పుడిప్పుడే నిరాకారీ. అప్పుడు ఈ అభ్యాసమే అలజడిలో అచలంగా చేస్తుంది.
స్లోగన్:-
లవలీన స్థితిని అనుభవం చేయండి
ఎవరైతే ప్రియమైనవారిగా ఉంటారో, వారిని స్మృతి చేయడం జరగదు, వారి స్మృతి స్వతహాగా ఉంటుంది. కేవలం ఆ ప్రేమ హృదయపూర్వకమైనదిగా ఉండాలి, సత్యమైనదిగా మరియు నిస్వార్థమైనదిగా ఉండాలి. మేరా బాబా, ప్యారా బాబా (నా బాబా, ప్రియమైన బాబా) అని అన్నప్పుడు ప్రియమైనవారిని ఎప్పుడు మర్చిపోలేరు మరియు నిస్వార్థమైన ప్రేమ కేవలం తండ్రి నుండి తప్ప ఇంకే ఆత్మ నుండి లభించజాలదు, అందుకే ఎప్పుడూ ఉద్దేశ్య పూర్వకంగా స్మృతి చేయకండి, నిస్వార్థ ప్రేమలో లవలీనులై ఉండండి.
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!