14 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
13 April 2022
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - యోగబలంతో నష్టం యొక్క ఖాతాను సమాప్తం చేసుకొని, సుఖం యొక్క ఖాతాను జమ చేసుకోండి, వ్యాపారస్థులుగా అయి తమ పూర్తి లెక్కను తీయండి’’
ప్రశ్న: -
పిల్లలైన మీరు తండ్రితో ఏ ప్రతిజ్ఞను చేసారు, ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి సహజ సాధనం ఏమిటి?
జవాబు:-
మీరు ప్రతిజ్ఞ చేసారు, నాకైతే ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు… భక్తిలో కూడా అనేవారు – బాబా, ఎప్పుడైతే మీరు వస్తారో, అప్పుడు మేము ఇతర సాంగత్యాలను తెంచి ఒక్క మీతో జోడిస్తాము. ఇప్పుడు బాబా అంటారు, పిల్లలూ, దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలను బుద్ధి ద్వారా త్యాగం చేసి ఒక్క నన్నే స్మృతి చేయండి. ఈ పాత శరీరం నుండి కూడా మనసును తొలగించండి, కానీ ఇందులో శ్రమ ఉంది. ఈ ప్రతిజ్ఞను నిలబెట్టుకునేందుకు ఉదయముదయమే లేచి, ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుందని మీతో మీరు మాట్లాడుకోండి లేదా ఆలోచించండి.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి… (చోడ్ భీ దే ఆకాశ్ సింహాసన్…)
ఓంశాంతి. పరంధామం నుండి రండి, అని పిల్లలు పిలుస్తారు. ఈ పాటను పతిత మనుష్యులు పాడారు. వారికి స్వయం దీని అర్థం తెలియదు. పతితులను పావనంగా చేయడానికి రండి, అని పిలుస్తారు కూడా ఎందుకంటే ఈ సమయంలో రావణ రాజ్యం ఉంది. ఇది కూడా పిల్లలకు తెలుసు, భారత్ లో దైవీ శ్రేష్ఠాచారీ రాజ్యం ఉండేది. ఇప్పుడు మీరు శేష్ఠాచారిగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు. తండ్రి అంటారు, పిల్లలూ, ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళాలి. పాత పాపపు ఖాతాను సమాప్తం చేసుకోవాలి. వ్యాపారస్థులు 12-12 నెలలకు ఒకసారి పాత ఖాతాను మూసి వేస్తారు. లాభం మరియు నష్టం యొక్క లెక్కను తీస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, భారత్ లో మేము అర్ధకల్పము లాభంలో, అర్ధకల్పము నష్టంలో ఉంటాము అనగా అర్ధకల్పము సుఖాన్ని, అర్ధకల్పము దుఃఖాన్ని పొందుతాము. అందులో కూడా ఎప్పుడైతే తమోప్రధాన అవస్థ ఉంటుందో, అప్పుడు దుఃఖం చాలా కొద్దిగా పొందుతారు, వ్యభిచారీ భక్తిలోకి వెళ్ళిపోతారు. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు లాభంలోకి వెళ్ళాలి. నష్టం యొక్క ఖాతాను ఇప్పుడు యోగబలంతో సమాప్తం చేయాలి. మీ పాపాల ఖాతా ఇప్పుడు తొలగిపోవాలి, మళ్ళీ సుఖం యొక్క ఖాతా జమ చేసుకోవాలి. ఎంతగా మీరు నన్ను స్మృతి చేస్తే, అంతగా మీ పాపాల ఖాతా భస్మమవుతుంది మరియు పవిత్రంగా అయ్యి గీతా జ్ఞానాన్ని ధారణ చేయాలి. ఇక్కడేమీ గీతా శాస్త్రాన్ని వినిపించరు. ఈ గీతా జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చారు. ఈ సమయంలో మనుష్యుల బుద్ధి తమోప్రధానంగా ఉన్న కారణంగా తండ్రి గురించి తెలియదు, అందుకనే వారిని అనాథలు అని అనడం జరుగుతుంది. మీరు అర్థం చేయిస్తారు, భారత్ పుణ్యాత్ముల, శ్రేష్ఠాచారుల ప్రపంచంగా ఉండేది. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. భారత్ సత్యయుగం ఆదిలో చాలా షావుకారుగా ఉండేది మరియు ఇస్లాములు, బౌద్ధులు మొదలైన ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ప్రారంభంలో కొద్ది మందే ఉంటారు. ధర్మ స్థాపకులు వస్తారు, తర్వాత ఆ ధర్మానికి సంబంధించిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారు వస్తూ ఉంటారు. వారేమీ రాజ్యంలోకి రారు. తమ ధర్మంలోకి వస్తారు. ఎప్పుడైతే సుమారుగా లక్షలాది మందిగా, కోట్లాది మందిగా అవుతారో, అప్పుడు రాజా-రాణి మొదలైనవారు అవుతారు. ఇక్కడ మీదైతే ప్రారంభం నుండి రాజ్యం నడుస్తుంది. సత్యయుగం ఆదిలోనే లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేది – భారత్ ఎప్పుడైతే శ్రేష్ఠాచారిగా ఉండేదో, అప్పుడు మహాన్ ఉన్నతంగా ఉండేది. ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడు అని గాయనం జరుగుతుంది. వారినే సత్యము అని అంటారు. వారు వచ్చి సత్యమైన జ్ఞానాన్ని ఇస్తారు, మిగిలిన వారంతా తండ్రి గురించి అసత్యమైన జ్ఞానాన్నే ఇస్తారు. ఓ గాడ్ ఫాదర్, అని అందరూ స్మృతి చేస్తారు. కానీ ఫాదర్ గురించి ఎవ్వరికీ కూడా తెలియదు. ఎప్పుడైనా మీరు, లౌకిక ఫాదర్ గురించి తెలుసా అని అడగండి, అప్పుడు వారు సర్వవ్యాపి అని ఏమైనా అంటారా. ఫాదర్ అంటే ఫాదర్. ఫాదర్ నుండైతే వారసత్వం లభిస్తుంది. తండ్రి అర్థం చేయిస్తారు – నేను అనంతమైన రచయితను. నన్ను పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. ప్రళయమైతే జరగదు. ఇదంతా పతిత ప్రపంచము. నేను పిల్లలైన మీ కోసమే రావాల్సి ఉంటుంది. పిల్లలైన మీకే అర్థం చేయిస్తాను. మనుష్యులు శాంతి కొరకు గురువులు మొదలైనవారిని ఆశ్రయిస్తారు. కానీ వారందరూ భక్తి మార్గం కోసము, హఠయోగం మొదలైనవి నేర్పిస్తారు. వారి నుండి ఏమీ అనంతమైన వారసత్వం లభించజాలదు. గురువులను ఆశ్రయిస్తారు, వారి నుండి అల్పకాలము కోసం కొద్దిగా సుఖం లభిస్తుంది. వారంతా హద్దు సుఖాన్ని ఇచ్చేవారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు. తండ్రి ముక్తి-జీవన్ముక్తుల కానుకను తీసుకొని వస్తారు. సత్యయుగంలో కేవలం ఒకే ధర్మం ఉంటుంది. ఇక్కడైతే ఎన్ని అనేక ధర్మాలున్నాయి, వృద్ధి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది ఆత్మలు మళ్ళీ తిరిగి శాంతిధామానికి వెళ్తాయి. పిల్లలైన మీకు ఈ సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానం లభిస్తూ ఉంది. తండ్రి ఈ మనుష్య సృష్టికి బీజరూపుడు, వారి వద్ద మొత్తం జ్ఞానం ఉంది. సర్వవ్యాపి అనడంతో జ్ఞానం లేదా భక్తి యొక్క ఏ విషయం నిలవదు. భగవంతుడు సర్వవ్యాపి అయితే మరి భగవంతుడిని భక్తి చేయాల్సిన అవసరం ఏముంది! భక్తి చేస్తారు కానీ అర్థం చేసుకోరు. రాళ్ళు-రప్పలు అన్నింటికీ భక్తి చేస్తూ ఉంటారు. గంగలో స్నానం చేయడానికి ఎంతమంది వెళ్తారు. ఒకవేళ అది పతిత-పావని అయినట్లయితే అందరూ పావనంగా అవ్వాలి, ముక్తి-జీవన్ముక్తి ధామంలోకి వెళ్ళాలి. కానీ ఎవ్వరూ వెళ్ళరు. ఒక గురువు తిరిగి వెళ్ళనట్లయితే ఇతర ఫాలోవర్స్ (అనుచరులు)ను కూడా తీసుకువెళ్ళాలి. కానీ స్వయం వారు వెళ్ళరు, ఫాలోవర్స్ కు ఏమీ చెప్పలేరు. దేహాభిమానంలో చాలామంది ఉన్నారు. నిరాకార పరమపిత పరమాత్మనైన నేను పిల్లలైన మీకు తండ్రిని, మిమ్మల్ని తోడుగా తీసుకెళ్ళేందుకు వచ్చానని ఇలా ఎవ్వరూ కూడా చెప్పలేరు. ఈ తండ్రికి మాత్రమే హక్కు ఉంది. ఇప్పుడు పాత ప్రపంచాన్ని విడిచిపెట్టాలి, అందుకే యోగబలం తప్పకుండా కావాలి. నిర్లక్ష్యంగా ఉంటే పదవిని పొందలేరు.
బాబా మనల్ని యోగ్యులుగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఏ పిల్లలైతే అయోగ్యులుగా అవుతారో, వారు దివాలా తీస్తారు. కల్ప-కల్పము మిమ్మల్ని 100 శాతం సంపన్నంగా చేస్తారు. మళ్ళీ రావణుడు మిమ్మల్ని నిరుపేదగా చేస్తాడు. ఇది సరైన విషయము, ఇప్పుడు నిజంగా కలియుగాంతము, సత్యయుగం ఆది యొక్క సంగమము అని అర్థం చేసుకుంటారు కూడా. ఒక ఇంటి ఆయువు 100 సంవత్సరాలనుకోండి. ఒకవేళ 25 సంవత్సరాలు గడిచిపోయినట్లయితే 1/4 వంతు పాతది అయినట్లు. 50 సంవత్సరాలు గడిచిపోతే పాతది అన్న పేరు వస్తుంది. దీనిని కూడా 4 భాగాలు చేయడం జరుగుతుంది. సతో, రజో, తమో, ఇప్పుడు మళ్ళీ ఇది పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంగా అవుతుంది. అనగా మొత్తం ప్రపంచానికి కొత్త జన్మ లభించనున్నది. ఇది పాత ప్రపంచము. తండ్రి అంటారు, ఇప్పుడు నేను కొత్త జన్మను ఇస్తున్నాను. ప్రపంచం పాతది నుండి కొత్తదిగా అవుతూ ఉంది. మీరు రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చారు. మీకు కూడా తెలుసు, ఈ డ్రామాలో మనం పాత్రధారులము, ఆత్మలైన మనం ఈ శరీరాన్ని తీసుకొని ఇక్కడ పాత్రను అభినయించేందుకు వచ్చాము. ప్రపంచంలో ఇది ఎవ్వరికీ తెలియదు. తమను తాము పాత్రధారిగా భావించినట్లయితే క్రియేటర్, డైరెక్టర్ ల గురించి కూడా తెలుసుకుంటారు. ఇది కర్మక్షేత్రము అని కేవలం నామ మాత్రం అంటారు. కానీ ఎప్పటి నుండి ఆట మొదలయ్యింది, దాని రచయిత ఎవరు అన్నది ఏమీ తెలియదు. మనుష్యులే తెలుసుకోవాలి కదా. ఇకపోతే, పరస్పరంలో కొట్లాడుకోవడమైతే అనాథల పని. దేవతలను అనాథలని అనరు. అక్కడ గొడవలు, కొట్లాటలు ఉండనే ఉండవు. ఇక్కడైతే చూడండి, పిల్లలు తండ్రిని కూడా హతమారుస్తారు. అందరూ పతితులుగా, భ్రష్టాచారులుగా ఉన్నారు, అందుకే దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. అర్ధకల్పము సంపూర్ణ నిర్వికారీ దేవీ-దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడైతే సంపూర్ణ నిర్వికారులు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు తండ్రి మీకు శ్రీమతాన్ని ఇస్తారు. ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. నేను కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వచ్చాను. మీరు ప్రతిజ్ఞ కూడా చేస్తారు, బాబా, మీరు వచ్చినట్లయితే మేము ఇతర సాంగత్యాలను తెంచి ఒక్క మీతో సాంగత్యం జోడిస్తాము. నాకైతే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు బాబా వచ్చారు, వారంటారు, పిల్లలూ, దేహ సహితంగా దేహం యొక్క సంబంధాలన్నింటినీ త్యాగం చేసి నన్ను స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. బాబా, ఈ మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వీరంతా మరణించి ఉన్నారని మాకు తెలుసు అని అంటారు. ఈ శరీరం కూడా సమాప్తమైపోతుంది, పాతది. ఇప్పుడు మేము పాత శరీరాన్ని వదిలి కొత్త దానిలోకి వెళ్తాము. పాత శరీరం నుండి మనసు తొలగిపోతుంది. ఇప్పుడిక మేము వెళ్ళిపోయినట్లే. పాత ప్రపంచం భస్మం కానున్నది. తండ్రి అర్థం చేయిస్తారు, ఉదయాన్నే లేచి ఈ విధంగా ఆలోచించండి. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది, మనం తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు ఒక్క తండ్రి శ్రీమతంపైనే నడవాలి. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి, అందుకే జీవిస్తూనే అందరి నుండి బుద్ధి యోగాన్ని తెంచి ఒక్కరితో జోడించవలసి ఉంటుంది, ఇందులో చాలా అభ్యాసం కావాలి. అభ్యాసం కోసమే ఉదయమే లేవండి అని తండ్రి అంటారు. పగలు అయితే శరీర నిర్వహణార్థము కర్మ చేయాలి. రాత్రి యొక్క అభ్యాసం వృద్ధి చెందుతుంది. ఎంత సమయం లభిస్తే, అంత బాబాను స్మృతి చేయండి. బాబా స్మృతిలో మీరు ఎంతగా నడుస్తూ వెళ్ళినా కూడా, ఎప్పుడూ అలిసిపోలేరు. యోగబలం యొక్క సంతోషం ఉంటుంది. స్మృతి యొక్క అభ్యాసం ఉన్నట్లయితే ఎక్కడ కూర్చున్నా సరే స్మృతి వచ్చేస్తుంది. భోజనం సమయంలో కూడా స్మృతిలో ఉండాలి. వ్యర్థమైన సంభాషణ జరగకూడదు. తండ్రి స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి. తర్వాత అంత మతి సో గతి అవుతుంది. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. అందరి సద్గతిదాత, అందరినీ శ్రేష్ఠాచారిగా చేసేవారు, శాంతి దేశానికి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే. జన్మ-జన్మాంతరాలు మీకు తండ్రి, టీచరు, గురువు లభించారు కానీ వారంతా దైహికమైనవారు. ఎవ్వరూ కూడా దేహీ-అభిమానులుగా అవ్వడము నేర్పించరు. వీరైతే అనంతమైన తండ్రి, జ్ఞానసాగరుడు. ఆత్మలు ఏవైతే ఉన్నాయో, వాటిలో సంస్కారాలు నిండి ఉన్నాయి. తర్వాత శరీరాన్ని ధారణ చేయడంతో అవి ఇమర్జ్ అవుతాయి. ఇప్పుడు మీకు మొత్తం డ్రామా యొక్క జ్ఞానం ఉంది, మిగిలిన మనుష్యులందరూ ఘోరమైన అంధకారంలో ఉన్నారు. జ్ఞానమనే అంజనాన్ని(కాటుకను) సద్గురువు ఇచ్చినప్పుడు మనసులో అజ్ఞాన అంధకారం తొలగిపోతుంది అని అంటూ ఉంటారు కూడా. మరి జ్ఞానమనే అంజనాన్ని ఇచ్చేవారు జ్ఞాన సూర్యుడైన తండ్రి. సత్యయుగాన్ని పగలు అని, కలియుగాన్ని రాత్రి అని అనడం జరుగుతుంది. ఆత్మలు ఆ నిరాకారీ తండ్రిని స్మృతి చేస్తాయి. తండ్రి అర్థం చేయిస్తారు, నేను పిల్లలైన మీకు బ్రహ్మా ముఖం ద్వారా కల్పక్రితం వలె భక్తి మార్గం యొక్క శాస్త్రాల రహస్యాలన్నింటినీ అర్థం చేయిస్తాను. ఇదంతా భక్తి మార్గం యొక్క సామగ్రి, ఇది అర్ధకల్పము నుండి నడుస్తూ వస్తుంది. మనుష్యులైతే, ఇది పరంపరగా నడుస్తూ వచ్చింది, రావణుడిని కూడా పరంపరగా కాలుస్తూ వచ్చాము అని అంటారు. పండుగలు ఏవైతే జరుపుకుంటారో, అవన్నీ పరంపరగా నడుస్తున్నాయని వారంతా అంటారు. పరంపర అనగా అర్థమేమిటి? అది అర్థం చేసుకోరు. సత్యయుగం యొక్క ఆయుష్షును లక్షల సంవత్సరాలుగా రాసేసారు, కనుక మనుష్యులు ఘోరమైన అంధకారంలో ఉన్నారు కదా. భక్తి ఎప్పటి నుండి మొదలయ్యింది, పావనంగా ఎప్పుడు అయ్యారు, ఏమీ తెలియదు. భగవంతుడు పతితులను పావనంగా చేయడానికి ఎప్పుడు వచ్చారు? క్రైస్టుకు 3 వేల సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని అంటారు కూడా, అయినా కానీ అనేక మతాలు ఉన్నాయి కదా. ప్రపంచంలో ఎన్ని మతాలు పని చేస్తున్నాయి. తండ్రి వచ్చి శ్రేష్ఠ మతాన్ని ఇస్తారు. శ్రీమతముతో మీరు శ్రేష్ఠము నుండి దేవతలుగా అవుతారు. రుద్ర మాల కూడా ఉంది. రుద్రుడు కూడా నిరాకార భగవంతుడే. వారు శ్రీ శ్రీ. దేవతలను శ్రీ అని అంటారు అనగా శ్రేష్ఠమైనవారు. శ్రీ శ్రీ ద్వారా శ్రేష్ఠ ప్రపంచం తయారవుతుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి శ్రీ శ్రీ, శ్రీ గా తయారుచేసేవారు. ఈ విషయాలన్నింటినీ గుర్తు చేసుకోవాలి. కల్ప క్రితం వారే అర్థం చేసుకుంటారు. ఈ జ్ఞానం అన్ని ధర్మాల వారి కోసము. స్వయాన్ని ఆత్మగా భావించండి అని అందరికీ తండ్రి చెప్తారు. అనంతమైన తండ్రి ద్వారా ఎంత సుఖం లభిస్తుంది. అనంతమైన తండ్రి వచ్చి ఇంతమంది పిల్లలను దత్తత తీసుకుంటారు. ఇది ముఖ వంశావళి కదా. ఎంతమంది బి.కె.లు ఉన్నారు, వీరే మళ్ళీ దేవతలుగా అయ్యేవారు. ఇది ఈశ్వరీయ కులము. తాతగారు నిరాకారుడు. వారి పుత్రుని పేరు ప్రజాపిత బ్రహ్మా, వీరి ద్వారా దత్తత తీసుకుంటారు. బ్రాహ్మణులైన మీరు శివబాబా యొక్క ఫ్యామిలీ, మళ్ళీ వృద్ధి చెందుతారు. ఇప్పుడు మీది నంబరువన్ వంశము. మీరు సేవ చేస్తారు, అందరి కళ్యాణం చేస్తారు. మీ జడ స్మృతి చిహ్నమైన మందిరం ఏక్యురేట్ (ఖచ్చితం)గా తయారుచేయబడి ఉంది. ఇక్కడ మీరు చైతన్యంలో కూర్చుని ఉన్నారు. మనం మళ్ళీ స్థాపన చేస్తున్నామని తెలుసు. భక్తిలో మన స్మృతి చిహ్న మందిరాలు తయారవుతాయి. శివబాబా లేకపోతే మీరు ఎక్కడ ఉంటారు. బ్రహ్మా, విష్ణు, శంకరులు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు శివబాబా రచనను రచిస్తున్నారు కదా. ప్రజాపిత బ్రహ్మా చిత్రం వేరుగా ఉండాలి. త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు కానీ దానికి అర్థమేమీ లేనే లేదు.
పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారని మీకు తెలుసు. చేసేవారు చేయించేవారు శివబాబా. ఈ విషయాలన్నీ ధారణ చేయాల్సిన విషయాలు. శివబాబా స్వయంగా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. జ్ఞానాన్ని ఇస్తున్నారు కనుక దానిని ధారణ చేయాలి, ఇందులో పవిత్రత ఫస్ట్. ధైర్యం కూడా చూపించాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండి చూపించాలి. ఎవరైనా కుమార్తెను రక్షించేందుకు కూడా స్వయంవరం జరుపుతారు, దానిని గంధర్వ వివాహమని అంటారు. తర్వాత అందులో కూడా కొందరు ఫెయిల్ అవుతారు. కొందరు ఈ విధంగా కూడా ఉంటారు, వివాహం చేసుకొని మళ్ళీ పవిత్రంగా ఉంటారు. పవిత్రంగా ఉంటూ జ్ఞానాన్ని కూడా తీసుకోవాలి. ధారణ చేసి ఇతరులను కూడా తమ సమానంగా తయారుచేసి చూపించాలి, అప్పుడే ఉన్నత పదవిని పొందగలరు. ఈ జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు కూడా చాలా వస్తాయి. ఇవన్నీ అయితే జరుగుతాయి. డ్రామాలో నిశ్చయించబడి ఉంది. చాలామంది కుమార్తెలు, మేము షావుకారుతనాన్ని ఏం చేసుకోవాలి, దీని కన్నా పాత్రలు శుభ్రం చేసుకొని రొట్టెలు తినడం మంచిది, పవిత్రంగా అయితే ఉంటాము అని అంటారు. కానీ చాలా ధైర్యం కావాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. భోజనం చేసే సమయంలో స్మృతిలో ఉండాలి, వ్యర్థమైన సంభాషణ చేయకూడదు. స్మృతితో పాపాల ఖాతాను సమాప్తం చేసుకోవాలి.
2. పగలు శరీర నిర్వహణార్థము కర్మలు చేసి, రాత్రి మేల్కొని తమతో తాము మాట్లాడుకోవాలి. ఈ నాటకం పూర్తి అయ్యింది, మనం ఇప్పుడు తిరిగి వెళ్తాము, అందుకే జీవిస్తూనే మమకారాన్ని తొలగించాలి అని ఆలోచించాలి.
స్లోగన్:-
‘‘మాలిక్ సో బాలక్’’ (యజమానుల నుండి బాలకులు) – ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యజమానత్వపు స్థితిలో స్థితులవ్వండి మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బాలకుని స్థితిలో స్థితులవ్వండి, ఈ డబల్ నషా సదా నిర్విఘ్నంగా చేసేటువంటిది. ఇటువంటి ఆత్మల టైటిల్ విఘ్న వినాశకులు. కానీ కేవలం స్వయం కోసమే విఘ్న వినాశకులు కాదు, మొత్తం విశ్వానికి విఘ్న వినాశకులు, విశ్వ పరివర్తకులు. ఎవరైతే స్వయం శక్తిశాలిగా ఉంటారో, వారి ముందు విఘ్నాలు స్వతహాగానే బలహీనమైపోతాయి.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!