13 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
12 August 2022
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - స్వర్గానికి యజమానిగా అవ్వాలి అంటే తండ్రితో ప్రతిజ్ఞ చేయండి, మేము పవిత్రంగా అయి, మీకు సహాయకులుగా తప్పకుండా అవుతాము. సుపుత్రులైన పిల్లలుగా అయి చూపిస్తాము’’
ప్రశ్న: -
ఎవరి లెక్కాచారాలను సమాప్తం చేయించేందుకు చివర్లో ట్రిబ్యునల్ (న్యాయ సభ) కూర్చుంటుంది?
జవాబు:-
ఎవరైతే క్రోధంలోకి వచ్చి బాంబులతో ఇంతమందిని హతమారుస్తారో, వారిపై ఎవరు కేసు పెడతారు! అందుకే చివర్లో వారి కోసం ట్రిబ్యునల్ కూర్చుంటుంది. అందరూ తమ-తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకుని తిరిగి వెళ్తారు.
ప్రశ్న: -
విష్ణుపురిలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా ఎవరు అవుతారు?
జవాబు:-
ఎవరైతే ఈ పాత ప్రపంచంలో ఉంటూ కూడా, దీనిపై తమ మనసు పెట్టుకోరో, మేము ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి, అందుకే పవిత్రంగా తప్పకుండా అవ్వాలి అని బుద్ధిలో ఉంటుందో 2. చదువే విష్ణుపురిలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేస్తుంది. మీరు ఈ జన్మలో చదువుకుంటారు. చదువు యొక్క పదవి మరుసటి జన్మలో లభిస్తుంది.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
నీవే తల్లివి… (తుమ్హీ హో మాతా…)
ఓంశాంతి. అనంతమైన తండ్రి మహిమను పాడుతారు ఎందుకంటే అనంతమైన తండ్రి అనంతమైన శాంతి మరియు సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. భక్తి మార్గంలో బాబా రండి, వచ్చి మాకు సుఖాన్ని మరియు శాంతిని ఇవ్వండి అని పిలుస్తారు కూడా. భారతవాసులు 21 జన్మలు సుఖధామంలో ఉంటారు. మిగిలిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారు శాంతిధామంలో ఉంటారు. కనుక తండ్రి యొక్క వారసత్వాలు రెండు, సుఖధామము మరియు శాంతిధామము. ఈ సమయంలో శాంతి లేదు, సుఖమూ లేదు ఎందుకంటే ఇది భ్రష్టాచారీ ప్రపంచము. కనుక తప్పకుండా దుఃఖధామము నుండి సుఖధామంలోకి తీసుకువెళ్ళేవారు ఎవరో ఒకరు కావాలి. తండ్రిని నావికుడు అని కూడా అంటారు. విషయ సాగరము నుండి క్షీర సాగరములోకి తీసుకువెళ్ళేవారు. పిల్లలకు తెలుసు, తండ్రే మొదట శాంతిధామంలోకి తీసుకువెళ్తారు ఎందుకంటే ఇప్పుడు సమయం పూర్తయ్యింది. ఇది అనంతమైన ఆట. ఇందులో ఉన్నతోన్నతమైనవారు, ముఖ్యమైన క్రియేటర్, డైరెక్టర్, ముఖ్యమైన పాత్రధారి ఎవరు? ఉన్నతోన్నతమైన భగవంతుడు. వారిని అందరికీ తండ్రి అని అంటారు. వారు స్వర్గ రచయిత, మళ్ళీ మనుష్యులు ఎప్పుడైతే దుఃఖితులుగా అవుతారో, అప్పుడు విముక్తులుగా కూడా చేస్తారు. వారు ఆత్మిక పండా కూడా. ఆత్మలందరినీ శాంతిధామంలోకి తీసుకువెళ్తారు. అక్కడ ఆత్మలందరూ ఉంటారు. ఈ ఇంద్రియాలు ఇక్కడ లభిస్తాయి, వీటి ద్వారా ఆత్మ మాట్లాడుతుంది. ఆత్మ స్వయంగా అంటుంది కూడా – నేను సుఖధామంలో ఉన్నప్పుడు, శరీరము సతోప్రధానంగా ఉండేది. ఆత్మనైన నేను 84 జన్మలు అనుభవిస్తాను. సత్యయుగంలో 8 జన్మలు, త్రేతాలో 12 జన్మలు పూర్తి అయ్యాయి, మళ్ళీ ఫస్ట్ నంబరులోకి వెళ్ళాలి. తండ్రే వచ్చి పావనంగా చేస్తారు. ఆత్మలతో మాట్లాడుతారు. ఆత్మ శరీరం నుండి వేరైనప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఎలాగైతే రాత్రిలో శరీరము నుండి వేరైపోతుంది. ఆత్మ అంటుంది, నేను ఈ శరీరముతో పని చేసి అలసిపోయాను, ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటాను. ఆత్మ మరియు శరీరము రెండూ వేర్వేరు వస్తువులు. ఈ శరీరము ఇప్పుడు పాతదిగా ఉంది. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. భారత్ కొత్తదిగా ఉండేది, అప్పుడు దీనిని స్వర్గమని అనేవారు. ఇప్పుడు నరకంగా ఉంది. అందరూ దుఃఖితులుగా ఉన్నారు. తండ్రి వచ్చి అంటారు, ఈ కుమార్తెల ద్వారా మీకు స్వర్గ ద్వారము లభిస్తుంది. తండ్రి శిక్షణనిస్తారు, పావనంగా అయి స్వర్గానికి యజమానిగా అవ్వండి. పతితముగా అవ్వడంతో మీరు నరకానికి యజమానిగా అయ్యారు. ఇక్కడ 5 వికారాలు దానముగా తీసుకోబడతాయి. ఆత్మ అంటుంది, బాబా, మీరు మమ్మల్ని స్వర్గానికి యజమానిగా తయారుచేస్తారు. మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము, మేము పవిత్రంగా అయి మీకు సహాయకులుగా తప్పకుండా అవుతాము. ఎవరైతే తండ్రికి విధేయత కల పిల్లలుగా ఉంటారో, వారిని సుపుత్రులు అని అనడము జరుగుతుంది. కుపుత్రులకు వారసత్వము లభించదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, నిరాకార భగవంతుడికి నిరాకార ఆత్మలే పిల్లలుగా ఉంటారు. తర్వాత ప్రజాపిత బ్రహ్మా సంతానంగా అయినప్పుడు సోదరీ-సోదరులుగా అవుతారు. ఇది ఈశ్వరీయ ఇల్లు వంటిది, ఇంకే సంబంధమూ లేదు. ఇంట్లో మిత్ర-సంబంధీకులు మొదలైనవారిని చూస్తారు కానీ మేము బాప్ దాదాకు చెందినవారిగా అయ్యామని బుద్ధిలో ఉంటుంది. వారు తండ్రి, వీరు దాదా కూర్చుని ఉన్నారు. ఇక్కడ గర్భ జైలులోనైతే శిక్షలు అనుభవిస్తారు. సత్యయుగంలో జైలు ఉండదు. అక్కడ అసలు పాపమే ఉండదు ఎందుకంటే అక్కడ రావణుడే లేడు, అందుకే అక్కడ గర్భ మహల్ అని అంటారు. ఎలాగైతే రావి ఆకుపై కృష్ణుడిని చూపిస్తారు. అక్కడ గర్భము కూడా క్షీరసాగరము వలె ఉంటుంది. సత్యయుగంలో గర్భ జైలూ ఉండదు, ఆ జైలూ ఉండదు. అర్ధకల్పము కొత్త ప్రపంచము ఉంటుంది. అక్కడ సుఖము ఉంటుంది, ఎలాగైతే ఇల్లు మొదట కొత్తగా ఉంటుంది, తర్వాత పాతదిగా అవుతుంది. అలాగే సత్యయుగము కొత్త ప్రపంచము, కలియుగము పాత ప్రపంచము. కలియుగము నుండి మళ్ళీ సత్యయుగముగా తప్పకుండా అవ్వాలి. చక్రము రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది అనంతమైన చక్రము, దీని జ్ఞానాన్ని తండ్రే అర్థం చేయిస్తారు. తండ్రే నాలెడ్జ్ ఫుల్. వీరి ఆత్మ కూడా అర్థం చేయించలేదు. వీరు మొదట పావనంగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మలు తీసుకొని పతితంగా అయ్యారు. మీ ఆత్మ కూడా పావనంగా ఉండేది, మళ్ళీ పతితంగా అయ్యింది.
తండ్రి అంటారు, నేను ఈ పతిత ప్రపంచం యొక్క యాత్రికుడిని ఎందుకంటే మీరు వచ్చి పావనంగా చేయండి అని పతితులు పిలుస్తారు. నేను నా పరంధామాన్ని వదిలి పతిత ప్రపంచంలోకి, పతిత శరీరములోకి రావలసి వస్తుంది. ఇక్కడైతే పావన శరీరము లేదు. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో, వారు మంచి కులములో జన్మ తీసుకుంటారని మీకు తెలుసు. చెడు కర్మలు చేసేవారు చెడు కులములో జన్మ తీసుకుంటారు. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతూ ఉన్నారు. మొట్టమొదట మీరు విష్ణు కులములో జన్మ తీసుకుంటారు. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఆది సనాతన ధర్మాన్ని ఎవరు స్థాపన చేసారు అన్నది ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే శాస్త్రాలలో 5 వేల సంవత్సరాల చక్రాన్ని లక్షల సంవత్సరాలుగా చూపించారు. ఇదే భారత్ స్వర్గంగా ఉండేది. ఇప్పుడైతే నరకంగా ఉంది. ఇప్పుడు ఎవరైతే తండ్రి ద్వారా బ్రాహ్మణులుగా అవుతారో, వారే దేవతలుగా అవుతారు, స్వర్గ ద్వారాన్ని చూడగలరు. స్వర్గము యొక్క పేరే ఎంత బాగుంది. దేవీ-దేవతలు వామ మార్గంలోకి వచ్చినప్పుడు పూజారులుగా అవుతారు. సోమనాథ మందిరాన్ని ఎవరు తయారుచేసారు? ఈ సోమనాథ మందిరం అన్నింటికన్నా పెద్దది. ఎవరైతే అందరికన్నా షావుకార్లుగా ఉండేవారో, వారే నిర్మించి ఉంటారు. ఎవరైతే సత్యయుగంలో మొదట మహారాజ-మహారాణి, లక్ష్మీ-నారాయణులుగా ఉండేవారో, వారే ఎప్పుడైతే పూజ్యుల నుండి పూజారులుగా అవుతారో అప్పుడు విశ్వానికి యజమానిగా తయారుచేసే శివబాబా యొక్క మందిరాలను నిర్మిస్తారు. స్వయం వారు ఎంత షావుకార్లుగా ఉండి ఉంటారు, అందుకే ఇంతటి మందిరాన్ని నిర్మించారు, దాన్ని మహమ్మద్ గజనీ దోచుకున్నాడు. అన్నింటికన్నా పెద్ద మందిరము శివబాబాది. వారు స్వర్గ రచయిత. స్వయం యజమానిగా అవ్వరు. తండ్రి ఏ సేవనైతే చేస్తారో, దానిని నిష్కామ సేవ అని అంటారు. వారు పిల్లలను స్వర్గానికి యజమానులుగా చేస్తారు, స్వయం అలా అవ్వరు. స్వయం నిర్వాణధామంలో కూర్చుండిపోతారు. ఎలాగైతే మనుష్యులు 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థంలోకి వెళ్తారు. సత్సంగాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. మేము వెళ్ళి భగవంతుడిని కలుసుకోవాలి అని ప్రయత్నిస్తారు. కానీ ఎవ్వరూ నన్ను కలవరు. అందరి లిబరేటర్, గైడ్ బాబా ఒక్కరే. మిగిలినవారందరూ భౌతిక యాత్రలు చేయించేవారు. అనేక రకాల యాత్రలను చేస్తారు. ఇది ఆత్మిక యాత్ర. తండ్రి ఆత్మలందరినీ తమ శాంతిధామంలోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని విష్ణుపురిలోకి తీసుకువెళ్ళేందుకు యోగ్యులుగా చేస్తున్నారు. తండ్రి సేవ చేయడానికి వస్తారు. తండ్రి అంటారు, ఈ పాత ప్రపంచంలో ఎవరి పైనా మనసు పెట్టుకోకండి. ఇప్పుడు కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. ఆత్మలైన మీరంతా సోదరులు. ఇందులో పురుషులు కూడా ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. సత్యయుగంలో మీరు పవిత్రంగా ఉండేవారు, దానినే పవిత్ర ప్రపంచమని అంటారు. ఇక్కడైతే 5-7 మంది పిల్లలను కడుపు కోసి కూడా తీస్తారు. సత్యయుగంలో నియమం తయారుచేయబడి ఉంది, సమయం వచ్చినప్పుడు బిడ్డ జన్మించబోతున్నాడని ఇరువురికీ సాక్షాత్కారమవుతుంది. దానిని యోగబలము అని అంటారు, సరైన సమయానికి బిడ్డ జన్మిస్తాడు. ఏ కష్టమూ ఉండదు, ఏడ్చే శబ్దము ఉండదు. ఈ రోజుల్లో అయితే ఎంత కష్టముతో బిడ్డ జన్మిస్తాడు. ఇది ఉన్నదే దుఃఖధామము. సత్యయుగము ఉన్నదే సుఖధామము. సుఖధామానికి యజమానిగా అయ్యేందుకు మీరు చదువును చదువుతున్నారు. ఆ చదువు యొక్క ఫలమైతే ఈ జన్మలోనే అనుభవిస్తారు. మీరు ఈ చదువు యొక్క ఫలాన్ని మరుసటి జన్మలో పొందుతారు.
తండ్రి అంటారు, నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా చేస్తాను, వారిని భగవాన్, భగవతి అని అంటారు. లక్ష్మీ భగవతి, నారాయణుడు భగవాన్. కలియుగాంతములో ఏమీ లేనప్పుడు, సత్యయుగంలో వారిని ఎవరు అలా తయారుచేసారు? భారత్ ను చూడండి ఎంత నిరుపేదగా ఉంది. నేనే అందరికీ సద్గతినివ్వడానికి వస్తాను. సత్య, త్రేతా యుగాలలో మీరు సదా సుఖమయంగా ఉంటారు. తండ్రి ఎంత సుఖాన్ని ఇస్తారంటే భక్తి మార్గంలో కూడా మళ్ళీ వారిని స్మృతి చేస్తారు. కొడుకు మరణించినప్పుడు, ఓ భగవంతుడా, మా కొడుకును హతమార్చారు అని అంటారు. తండ్రి అంటారు, అంతా ఈశ్వరుడే ఇచ్చారని మీరు అంటున్నప్పుడు, వారే తీసుకున్నారు, మళ్ళీ ఎందుకు ఏడుస్తారు? మోహము ఎందుకు పెట్టుకుంటారు? సత్యయుగంలో మోహము ఉండనే ఉండదు. అక్కడ ఎప్పుడైతే శరీరము విడిచిపెట్టే సమయము వస్తుందో, ఆ సమయానికే విడిచిపెడతారు. స్త్రీ ఎప్పుడూ విధవగా అవ్వదు. సమయం పూర్తయినప్పుడు – వృద్ధులుగా అయినప్పుడు, ఇప్పుడు వెళ్ళి బిడ్డగా అవుతానని భావిస్తారు. అప్పుడు సర్పము వలె శరీరాన్ని విడిచిపెడతారు. ఇది కలియుగీ శరీరమని, చాలా పాత శరీరమని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ కూడా పతితముగా ఉంది, శరీరము కూడా పతితముగా ఉంది. ఇప్పుడు తండ్రితో యోగము జోడించి పావనంగా అవ్వాలి. ఇది భారత్ యొక్క ప్రాచీన రాజయోగము. సన్యాసులదైతే హఠయోగము. శివబాబా అంటారు, నేను ఈ మాతల ద్వారా స్వర్గ ద్వారాలను తెరుస్తాను. గురువైన మాత లేకుండా ఎవ్వరి ఉద్ధరణ జరగజాలదు. తండ్రే వచ్చి అందరికీ సద్గతినిస్తారు, మీకు కూడా నేర్పిస్తారు, తర్వాత మీరు మాస్టర్ సద్గతిదాతలుగా అవుతారు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది, తండ్రిని స్మృతి చేయండి అని అందరికీ చెప్తారు. అందరూ సమాప్తమవ్వనున్నారు. బాంబులు మొదలైనవి తయారుచేసేవారు స్వయం వారు కూడా అంగీకరిస్తారు, వీటి ద్వారా వినాశనం జరగనున్నది, కానీ మమ్మల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారో తెలియదు. ఒక్క బాంబు వేస్తే అందరూ సమాప్తమవుతారని భావిస్తారు. ఇంకా కొంత సమయమే మిగిలి ఉంది, అప్పటికల్లా మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవ్వండి. ఇది ఉన్నదే ముళ్ళ ప్రపంచము. భారత్ యే పుష్పాల తోటగా ఉండేది. ఇప్పుడిది వేశ్యాలయము, మళ్ళీ శివాలయముగా అవుతుంది అనగా శివుని ద్వారా స్థాపించబడిన స్వర్గము. భగవంతుడైతే నిరాకారుడు ఒక్కరే. మనుష్యులను ఎప్పుడూ భగవంతుడు అని అనలేరు. దుఃఖహర్త, సుఖకర్త తండ్రి ఒక్కరే. భగవానువాచ, నేను మిమ్మల్ని నరుని నుండి నారాయణునిగా చేస్తాను. ఇది పాత పతిత ప్రపంచము, ఇప్పుడు సమాప్తమవ్వనున్నది. నేను పతితుల నుండి పావన దేవతలుగా చేస్తాను, తర్వాత మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు. డ్రామాను అర్థము చేసుకోవాలి. ఈ సమయంలో చూడండి, మనుష్యులలో ఎంత క్రోధం ఉంది. కోతుల కన్నా హీనంగా ఉన్నారు. క్రోధము వస్తే బాంబులతో అందరినీ ఎలా హతమారుస్తారు. ఇప్పుడు వీరిపై ఎవరు కేసు వేస్తారు! వీరి కొరకు తర్వాత చివర్లో ట్రిబ్యునల్ కూర్చుంటుంది. అందరి లెక్కాచారాలను సమాప్తం చేస్తారు. ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు. తండ్రి అంటారు, ఓ ఆత్మలూ, నేను మీ తండ్రిని, వచ్చి ఉన్నాను. మీరు నా శ్రీమతముపై నడిచినట్లయితే శ్రేష్ఠమైన స్వర్గానికి యజమానిగా అవుతారు. ఆ మనుష్యులైతే మనుష్యులకు గైడ్ గా అవుతారు. తండ్రి సర్వాత్మలకు గైడ్ గా అవుతారు. ఓ పతిత-పావనా, అని ఆత్మనే అంటుంది. ఇప్పుడు తండ్రి మనల్ని పుణ్యాత్మగా చేస్తున్నారు. స్వర్గములో ఆత్మిక తండ్రి ఉండరు. అక్కడ ఉండేదే ప్రారబ్ధము. ఇది యూనివర్సిటీ – రాజయోగాన్ని తండ్రి తప్ప ఎవరూ నేర్పించలేరు. తండ్రి అంటారు, నేను ఈ శరీరాన్ని లోన్ గా తీసుకొని వస్తాను. ఆత్మ అయితే మరొక శరీరంలోకి రాగలదు కదా. ఇది డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఇది తిరగడానికి 5 వేల సంవత్సరాలు పడుతుంది. ఆకు-ఆకులో ఈశ్వరుడు ఉన్నారు, ఆకు కదులుతుంది అంటే ఇందులో ఆత్మ ఉంది అని అంటారు. కానీ అలా కాదు. అది గాలి వలన కదులుతుంది. ఇక్కడ మీరు ఎలాగైతే కూర్చున్నారో, మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత కూర్చుంటారు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వము తీసుకుంటే తీసుకున్నట్లు. లేదంటే తర్వాత ఎప్పుడూ తీసుకోలేరు. ఈ సమయంలోనే ఉన్నతమైన సంపాదనను చేసుకోగలరు. మళ్ళీ మొత్తం కల్పములో ఇటువంటి ఉన్నతమైన సంపాదన జరగజాలదు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సమయము చాలా తక్కువగా ఉంది, అందుకే ముళ్ళ నుండి పుష్పాలుగా అయి అందరినీ పుష్పాలుగా తయారుచేయాలి. శాంతిధామము మరియు సుఖధామము యొక్క మార్గాన్ని తెలియజేయాలి.
2. వైష్ణవ కులములోకి వెళ్ళేందుకు మంచి కర్మలు చేయాలి. పావనంగా తప్పకుండా అవ్వాలి. సదా ఆత్మిక యాత్రను చేయాలి మరియు చేయించాలి.
వరదానము:-
దాత పిల్లలైన మీరు మాస్టర్ దాతలు, ఎవరి నుండి అయినా ఏదైనా తీసుకొని తర్వాత ఇవ్వడము – అది ఇవ్వడము కాదు. తీసుకున్నారు మరియు ఇచ్చారు అంటే ఇది బిజినెస్ అయినట్లు. దాత పిల్లలు విశాల హృదయులుగా అయి ఇస్తూ వెళ్ళండి. తరగని ఖజానా ఉంది, ఎవరికి ఏది కావాలో అది ఇస్తూ నిండుగా చేస్తూ వెళ్ళండి. కొందరికి సంతోషం కావాలి, స్నేహం కావాలి, శాంతి కావాలి, ఇస్తూ వెళ్ళండి. ఇది తెరిచి ఉన్న ఖాతా, లెక్కాచారాల ఖాతా కాదు. దాత యొక్క దర్బారులో ఈ సమయంలో అంతా తెరిచి ఉంది, అందుకే ఎవరికి ఎంత కావాలో అంత ఇవ్వండి, ఇందులో పిసినారిగా అవ్వకండి.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!