12 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

May 11, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఎప్పుడైతే మీరు సంపూర్ణంగా పావనంగా అవుతారో, అప్పుడే తండ్రి మీ బలిహారాన్ని స్వీకరిస్తారు, మేము ఎంత పావనంగా అయ్యామని మీ మనసును ప్రశ్నించుకోండి”

ప్రశ్న: -

పిల్లలైన మీరు ఇప్పుడు చాలా సంతోషంగా తండ్రిపై బలిహారమవుతారు, ఎందుకు?

జవాబు:-

ఎందుకంటే ఇప్పుడు మీరు బలిహారమైతే, తండ్రి 21 జన్మల కోసం బలిహారమవుతారని మీకు తెలుసు. ఇప్పుడు ఈ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞంలో మనుష్యమాత్రులందరూ స్వాహా అవ్వాల్సిందేనని కూడా పిల్లలైన మీకు తెలుసు, అందుకే ముందు నుండే మీరు చాలా సంతోషంగా మీ తనువు-మనసు-ధనము అన్నింటినీ స్వాహా చేసి సఫలం చేసుకుంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ముఖాన్ని చూసుకో ప్రాణీ….. (ముఖడా దేఖ్ లే ప్రాణీ…..)

ఓంశాంతి. శివ భగవానువాచ. తప్పకుండా తమ పిల్లల కోసమే జ్ఞానాన్ని నేర్పిస్తారు మరియు శ్రీమతాన్ని ఇస్తారు – హే పిల్లలూ లేదా హే ప్రాణులు, శరీరం నుండి ప్రాణం వెళ్ళిపోతుంది అన్నా లేదా ఆత్మ వెళ్ళిపోతుంది అన్నా, రెండూ ఒకటే. హే ప్రాణులు లేదా హే పిల్లలూ, మీ జీవితంలో ఎంత పాపముంది మరియు ఎంత పుణ్యముంది అనేది మీరు చూసారా! మీ జీవితంలో అర్ధకల్పం పుణ్యము, అర్ధకల్పం పాపముంటుందని మీకు లెక్క చెప్పడం జరిగింది. పుణ్యం యొక్క వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది, వారిని రాముడని అంటారు. రాముడు అని నిరాకారుడిని అంటారు, అంతేకానీ సీతకు చెందిన రాముడిని కాదు. కావున, ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరైతే బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులుగా అయ్యారో, మీకు – అర్ధకల్పం మేము పుణ్యాత్ములుగానే ఉండేవారము, తర్వాత అర్ధకల్పం పాపాత్ములుగా అయ్యామన్నది బుద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు పుణ్యాత్ములుగా అవ్వాలి. ఎంత పుణ్యాత్మగా అయ్యాను అనేది ప్రతి ఒక్కరు తమ మనసును ప్రశ్నించుకోండి. పాపాత్మ నుండి పుణ్యాత్మగా ఎలా అవుతారు…. అది కూడా తండ్రి అర్థం చేయించారు. యజ్ఞ-తపాదులు మొదలైనవాటి ద్వారా మీరు పుణ్యాత్ములుగా అవ్వరు, అది భక్తి మార్గము, దీని ద్వారా మనుష్యులెవరూ పుణ్యాత్ములుగా అవ్వరు. మీరు పుణ్యాత్ములుగా అవుతున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు అర్థమవుతుంది. ఆసురీ మతం ద్వారా పాపాత్ములుగా అవుతూ-అవుతూ మెట్లు దిగుతూనే వచ్చారు. తాము ఎంత సమయం పుణ్యాత్ములుగా అవుతారు లేదా సుఖ వారసత్వాన్ని తీసుకుంటారు అనేది ఎవరికీ తెలియదు. ఆ తండ్రిని మనుష్యులందరూ స్మృతి చేస్తారు, వారినే పరమపిత పరమాత్మ అని అంటారు. బ్రహ్మా-విష్ణు-శంకరులను పరమాత్మ అని అనరు, ఇంకెవ్వరినీ పరమాత్మ అని అనలేరు. ఈ సమయంలో మీరు ప్రజాపిత బ్రహ్మా అని అంటారు, కానీ ప్రజాపితను భక్తి మార్గంలో ఎప్పుడూ స్మృతి చేయరు. అందరూ నిరాకార తండ్రినే స్మృతి చేస్తారు – ఓ గాడ్ ఫాదర్, ఓ భగవాన్ అన్న పదాలే వెలువడతాయి. ఒక్కరినే స్మృతి చేస్తారు. మనుష్యులు తమను తాము గాడ్ ఫాదర్ అని చెప్పుకోలేరు. అలానే, బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా తమను తాము గాడ్ ఫాదర్ అని చెప్పుకోలేరు. వారి శరీరాలకు పేర్లున్నాయి కదా. గాడ్ ఫాదరు ఒక్కరే, వారికి తమ శరీరం లేదు. భక్తి మార్గంలో కూడా శివుడిని చాలా పూజిస్తారు. శివబాబా ఈ శరీరం ద్వారా మీతో మాట్లాడుతున్నారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు – హే పిల్లలూ, అని ఎంత ప్రేమగా అంటారు. వారు సర్వుల పతిత పావనుడు, సద్గతిదాత అన్నది తెలుసు. మనుష్యులు తండ్రి మహిమను చేస్తారు కదా, కానీ ఆ తండ్రి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తారని మనుష్యులకు తెలియదు. తప్పకుండా కలియుగం సమాప్తమైనప్పుడే వారు వస్తారు. ఇప్పుడిది కలియుగ అంతిమము కావున తప్పకుండా ఇప్పుడు వచ్చి ఉంటారు. మిమ్మల్ని కృష్ణుడు చదివించరు. మీకు శ్రీమతం లభిస్తుంది, శ్రీమతం కృష్ణుడిదేమీ కాదు. కృష్ణుని ఆత్మ కూడా శ్రీమతం ద్వారా దేవతగా అయ్యారు. తర్వాత 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు మీరు ఆసురీ మతం వారిగా అయ్యారు. ఎప్పుడైతే మీ చక్రం పూర్తవుతుందో, అప్పుడే నేను వస్తానని తండ్రి అంటారు. ప్రారంభంలో వచ్చిన మీరు, ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నారు. వృక్షం పాతబడి, శిథిలమైనప్పుడు, మొత్తం వృక్షమంతా అలాగే అయిపోతుంది. మీరు తమోప్రధానంగా అవ్వడంతో అందరూ తమోప్రధానంగా అయిపోయారని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది మనుష్య సృష్టి యొక్క వెరైటీ ధర్మాల వృక్షము, దీనిని ఉల్టా (తలకిందులుగా ఉన్న) వృక్షమని అంటారు, దీని బీజం పైన ఉన్నారు. ఆ బీజం నుండే మొత్తం వృక్షమంతా వెలువడుతుంది. మనుష్యులు ‘‘గాడ్ ఫాదర్’’ అని అంటారు కూడా. ఆత్మ పేరు ఆత్మనే అని ఆత్మ అంటుంది. ఆత్మ శరీరంలోకి వచ్చినప్పుడు శరీరానికి పేరు పెట్టడం జరుగుతుంది, ఆట కొనసాగుతుంది. ఆత్మల ప్రపంచంలో ఆట ఉండదు. ఆట జరిగే స్థానం ఇదే. నాటకంలో లైట్లు మొదలైనవన్నీ ఉంటాయి. ఇకపోతే, ఎక్కడైతే ఆత్మలుంటాయో, అక్కడ సూర్యుడు, చంద్రుడు ఉండరు, డ్రామా యొక్క ఆట నడవదు. రాత్రి-పగలు అనేవి ఇక్కడ ఉంటాయి. సూక్ష్మవతనంలో కానీ, మూలవతనంలో కానీ రాత్రి-పగలు అనేవి ఉండవు, ఇదే కర్మక్షేత్రము. ఇక్కడ మనుష్యులు మంచి కర్మలు కూడా చేస్తారు, చెడు కర్మలు కూడా చేస్తారు. సత్య-త్రేతా యుగాలలో మంచి కర్మలు జరుగుతాయి ఎందుకంటే అక్కడ 5 వికారాల రూపీ రావణ రాజ్యము లేదు. తండ్రి కూర్చొని కర్మ-అకర్మ-వికర్మల రహస్యాన్ని తెలియజేస్తారు. కర్మలైతే చేయాల్సిందే, ఎందుకంటే ఇది కర్మక్షేత్రము. సత్యయుగంలో మనుష్యులు చేసే కర్మలు అకర్మలుగా ఉంటాయి. అక్కడ రావణ రాజ్యమే లేదు, దానిని హెవెన్ అని అంటారు. ఈ సమయంలో హెవెన్ లేదు. సత్యయుగంలో భారత్ ఒక్కటే ఉండేది, మిగిలిన ఖండాలేవీ ఉండేవి కాదు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటున్నారంటే తండ్రి తప్పకుండా హెవెన్ ను రచిస్తారు. భారత్ ప్రాచీన దేశమని అన్ని దేశాల వారికి తెలుసు. మొట్టమొదట భారత్ మాత్రమే ఉండేదని ఎవరికీ తెలియదు. ఇప్పుడు అలా లేదు కదా. ఇది 5 వేల సంవత్సరాల విషయము. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేదని కూడా అంటారు. రచయిత తప్పకుండా రచనను రచిస్తారు. తమోప్రధాన బుద్ధి కలవారిగా ఉన్న కారణంగా ఈ మాత్రం కూడా అర్థం చేసుకోరు. భారత్ అన్నింటి కన్నా ఉన్నతమైన ఖండము. ఇది మనుష్య సృష్టి యొక్క మొదటి వంశము. ఈ డ్రామా తయారై ఉంది. షావుకారులు పేదవారికి సహాయం చేస్తారు, ఇది కూడా కొనసాగుతూ వస్తుంది. భక్తి మార్గంలో కూడా షావుకారులు పేదవారికి దానం చేస్తారు. కానీ ఇది పతిత ప్రపంచము. కావున ఎవరు ఏ దాన-పుణ్యాలు చేసినా, చేసేవారు పతితులే, ఎవరికైతే దానం చేస్తారో వారు కూడా పతితులే. పతితులు, పతితులకు దానం చేస్తారు, దానికి ఏమి ఫలం పొందుతారు. ఎన్ని దాన-పుణ్యాలు చేస్తూ వచ్చినా సరే, దిగిపోతూనే వచ్చారు. భారత్ వంటి దానీ ఖండము ఇంకేదీ ఉండదు. ఈ సమయంలో మీ తనువు-మనస్సు-ధనము అన్నింటినీ ఇందులో స్వాహా చేస్తారు, దీనిని రాజస్వ అశ్వమేధ అవినాశీ జ్ఞాన యజ్ఞమని అంటారు. ఈ పాత శరీరాన్ని కూడా ఇక్కడ స్వాహా చేయాలి అని ఆత్మ అంటుంది, ఎందుకంటే మొత్తం ప్రపంచంలోని మనుష్యమాత్రులందరూ ఇందులో స్వాహా అవుతారని మీకు తెలుసు, అటువంటప్పుడు మనం సంతోషంగా తండ్రిపై ఎందుకు బలిహారమవ్వకూడదు. మీరు తండ్రిని స్మృతి చేస్తారని ఆత్మలైన మీకు తెలుసు. బాబా, మీరు వచ్చినప్పుడు మేము బలిహారమవుతామని కూడా అంటూ వచ్చారు, ఎందుకంటే ఇప్పుడు మేము బలిహారమైతే, మీరు కూడా 21 జన్మలకు మాపై బలిహారమవుతారు. ఇది వ్యాపారము. మేము మీపై బలిహారమైతే, మీరు కూడా 21 సార్లు బలిహారమవుతారు. మీ ఆత్మ పవిత్రంగా అవ్వనంత వరకు, నేను మీ బలిహారాన్ని స్వీకరించను అని తండ్రి అంటారు.

నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా అవుతుందని తండ్రి అంటారు. తండ్రిని మర్చిపోవడంతో మీరు ఎంత పతితులుగా, దుఃఖితులుగా అయ్యారు. మనుష్యులు దుఃఖితులుగా అయినప్పుడు, శరణాగతిని తీసుకుంటారు. ఇప్పుడు మీరు 63 జన్మలు రావణుని కారణంగా చాలా దుఃఖితులుగా అయ్యారు. ఇది ఒక్క సీత విషయము కాదు, మనుష్యమాత్రులందరూ సీతలే. రావణుడు సీతను శోక వాటికలో పెట్టారని రామాయణంలోనైతే కథ రాసారు. వాస్తవానికి ఆ విషయమంతా ఈ సమయానికి చెందినదే. అందరూ రావణుని అనగా 5 వికారాల జైలులో ఉన్నారు, అందుకే దుఃఖితులుగా అయి – మమ్మల్ని వీటి నుండి విడిపించండి అని పిలుస్తారు. ఇది ఒక్కరి విషయము కాదు. మొత్తం ప్రపంచమంతా రావణుని జైలులో ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది రావణ రాజ్యము కదా. రామ రాజ్యం కావాలని కోరుకుంటారు కూడా. గాంధీ కూడా కోరుకునేవారు, రామ రాజ్యం కావాలని సన్యాసులు ఎప్పుడూ అనరు. భారతవాసులే అంటారు. ఈ సమయంలో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం లేదు, మిగిలిన శాఖలున్నాయి. సత్యయుగం ఉన్నప్పుడు ఒకే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేది. ఇప్పుడు ఆ పేరే మారిపోయింది. తమ ధర్మాన్ని మరచి వేరే-వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోతూ ఉంటారు. ముసల్మానులు వచ్చి ఎంతమంది హిందువులను తమ ధర్మంలోకి కన్వర్ట్ చేసుకున్నారు. క్రైస్తవ ధర్మంలోకి కూడా చాలా మంది కన్వర్ట్ అయ్యారు, అందుకే భారతవాసుల జన సంఖ్య తగ్గిపోయింది. లేకపోతే భారతవాసుల జన సంఖ్య అందరికన్నా ఎక్కువగా ఉండాలి. అనేక ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. మీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము అన్నింటికన్నా ఉన్నతమైనదని తండ్రి అంటారు. మీరు సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు మీరే మారిపోయి తమోప్రధానంగా అయ్యారు. జ్ఞానసాగరుడు, పతితపావనుడు అని ఎవరినైతే పిలుస్తారో, వారే సమ్ముఖంలో చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. వారు జ్ఞానసాగరుడు, ప్రేమసాగరుడు. క్రీస్తును ఈ విధంగా మహిమ చేయరు. కృష్ణుడిని జ్ఞానసాగరుడు, పతితపావనుడు అని అనడం జరుగదు. సాగరం ఒక్కటే ఉంటుంది. నలువైపులా ఆల్రౌండ్ సాగరమే సాగరముంది. రెండు సాగరాలు ఉండవు. ఇది మనుష్య సృష్టి నాటకము, ఇందులో అందరివి వేరు-వేరు పాత్రలున్నాయి. నా కర్తవ్యం అందరికన్నా భిన్నమైనది, నేను జ్ఞానసాగరుడను అని తండ్రి అంటారు. హే పతితపావనా, ఓ లిబరేటర్ (ముక్తి దాత) అని మీరు నన్నే పిలుస్తారు. వారు దేని నుండి విముక్తులుగా చేస్తారు? ఇది కూడా ఎవరికీ తెలియదు. మీరు సత్య-త్రేతా యుగాలలో చాలా సుఖంగా ఉండేవారని, దానిని స్వర్గమని అంటారని మీకు తెలుసు. ఇప్పుడిది నరకము, అందుకే – దుఃఖం నుండి విడిపించి సుఖధామానికి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని సన్యాసులు ఎప్పుడూ అనరు, వారు నిర్వాణంలోకి వెళ్ళారని అంటారు. విదేశాలలో కూడా ‘‘లెఫ్ట్ ఫర్ హెవెన్లీ అబోడ్’’ (స్వర్గానికి వెళ్ళారు) అని అంటారు. గాడ్ ఫాదర్ వద్దకు వెళ్ళారని భావిస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు, కావున తప్పకుండా స్వర్గముండేది. ఇప్పుడు లేదు. నరకం తర్వాత స్వర్గం ఉండాలి. గాడ్ ఫాదర్ ఇక్కడకు వచ్చి స్వర్గాన్ని స్థాపన చేయాలి. సూక్ష్మవతనం, మూలవతనంలో స్వర్గమేమీ ఉండదు. తప్పకుండా తండ్రియే రావాల్సి ఉంటుంది.

తండ్రి అంటారు – నేను వచ్చి ప్రకృతిని ఆధారంగా చేసుకుంటాను, నా జన్మ మనుష్యుల వలె జరుగదు, నేను గర్భంలోకి రాను, మీరంతా గర్భంలోకి వస్తారు. సత్యయుగంలో గర్భ మహల్ ఉంటుంది, ఎందుకంటే శిక్షలు అనుభవించేందుకు అక్కడ ఎలాంటి వికర్మలు జరగవు, అందుకే దానిని గర్భ మహల్ అని అంటారు. ఇక్కడ వికర్మలు చేస్తారు, వాటికి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, అందుకే దీనిని గర్భ జైలు అని అంటారు. ఇక్కడ, రావణ రాజ్యంలో మనుష్యులు పాపాలు చేస్తూ ఉంటారు. ఇది పాపాత్ముల ప్రపంచము. అది పుణ్యాత్ముల ప్రపంచము – స్వర్గము. అందుకే రావి ఆకుపై కృష్ణుడు వచ్చారని అంటారు. ఇలా కృష్ణుని మహిమను చూపిస్తారు. సత్యయుగంలో గర్భంలో దుఃఖముండదు. తండ్రి కర్మ-అకర్మ-వికర్మల గతులను అర్థం చేయిస్తారు, దానినే మళ్ళీ గీతా శాస్త్రంగా తయారుచేసారు. కానీ, అందులో శివ భగవానువాచకు బదులుగా కృష్ణుని పేరును వేసేసారు. మనం అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకుంటామని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు భారత్ రావణుని ద్వారా శాపగ్రస్థమయింది, అందుకే దుర్గతి పాలయ్యింది. ఈ పెద్ద శాపం కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. తండ్రి వచ్చి – ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ, సంపత్తివాన్ భవ…… అని వరాలను ఇస్తారు. అన్ని సుఖాల వారసత్వాన్ని ఇస్తారు. వారు వచ్చి మిమ్మల్ని చదివిస్తారు, ఆ చదువు ద్వారా మీరు దేవతలుగా అవుతారు. కొత్త రచన రచించబడుతుంది. బ్రహ్మా ద్వారా తండ్రి మిమ్మల్ని తమ వారిగా చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మా అని గాయనం కూడా చేస్తారు. మీరు వారి పిల్లలుగా, బ్రహ్మాకుమార-కుమారీలుగా అయ్యారు. తాతగారి వారసత్వాన్ని తండ్రి ద్వారా తీసుకుంటారు. ఇంతకుముందు కూడా తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. తండ్రి పిల్లలు తండ్రి వద్దకే వెళ్ళాలి. కానీ, ప్రజాపిత బ్రహ్మా ద్వారా మనుష్య సృష్టి స్థాపన అవుతుందని గాయనం చేయబడింది. కావున అది ఇక్కడే జరుగుతుంది కదా. ఆత్మ సంబంధంలో మేము సోదరులమని అంటారు. ప్రజాపిత బ్రహ్మాకు సంతానంగా అవ్వడంతో మీరు సోదరీ-సోదరులుగా అవుతారు. ఈ సమయంలో మీరంతా సోదరీ-సోదరులు, మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారు. ఇప్పుడు కూడా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. నన్ను స్మృతి చేయండి అని శివబాబా అంటారు. ఆత్మలైన మీరు శివబాబాను స్మృతి చేయాలి. స్మృతి చేయడం ద్వారానే మీరు పావనంగా అవుతారు, వేరే ఏ ఉపాయము లేదు. పావనంగా అవ్వకుండా మీరు ముక్తిధామానికి వెళ్ళలేరు. జీవన్ముక్తిధామంలో మొట్టమొదట ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేది, తర్వాత నంబరువారుగా వేరే-వేరే ధర్మాలు వచ్చాయి. తండ్రి చివర్లో వచ్చి అందరినీ దుఃఖం నుండి ముక్తులుగా చేస్తారు. వారిని లిబరేటర్ (ముక్తి దాత) అని కూడా అంటారు. మీరు కేవలం నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయి అని తండ్రి అంటారు. బాబా రండి, మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయండి అని పిలుస్తారు కూడా. టీచరు చదివిస్తారు, ఇందులో మీ చరిత్ర ఏమైనా తయారుచేస్తారా? ఇది కూడా చదువే. జ్ఞానసాగరుడైన తండ్రే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. కర్మ, అకర్మ మరియు వికర్మల గతిని తెలుసుకొని, ఇప్పుడు ఎటువంటి వికర్మలు చేయకూడదు. కర్మక్షేత్రంలో కర్మలు చేస్తూ వికారాలను త్యాగం చేయడమే వికర్మల నుండి రక్షణ పొందడము.

2. మన బలిహారాన్ని తండ్రి స్వీకరించే విధంగా పావనంగా అవ్వాలి. పావనంగా అయి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. తనువు-మనస్సు-ధనమును ఈ యజ్ఞంలో స్వాహా చేసి సఫలం చేసుకోవాలి.

వరదానము:-

వర్తమాన సమయంలో మాయ సోమరితనం రూపంలో రకరకాలుగా దాడి చేస్తుంది. ఈ సోమరితనం కూడా విశేషమైన వికారము, దీనిని సమాప్తం చేసేందుకు సదా ఉత్సాహంగా ఉండండి. సంపాదించాలనే ఉత్సాహమున్నప్పుడు సోమరితనం సమాప్తమైపోతుంది, అందుకే ఉత్సాహాన్ని ఎప్పుడూ తగ్గించుకోకూడదు. ఆలోచిస్తాము, చేస్తాము, తప్పకుండా చేసేస్తాము, అయిపోతుందిలే….. ఈ మాటలన్నీ సోమరితనానికి గుర్తు. ఇటువంటి సోమరితనం కల నిర్బల సంకల్పాలను సమాప్తం చేసి ఏది చేయాలో, ఎంత చేయాలో, అది ఇప్పుడే చేయాలి అని ఆలోచించినప్పుడు, వారిని తీవ్ర పురుషార్థులు అని అంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top