12 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
11 July 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - తండ్రి వంటి నిరహంకారి మరియు నిష్కామ సేవాధారి ఎవరూ లేరు, మొత్తం విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని పిల్లలకు ఇచ్చి వారు స్వయం వానప్రస్థంలో కూర్చుంటారు”
ప్రశ్న: -
తండ్రి యొక్క ఏ సందేశాన్ని మీరు విశ్వమంతటికీ తెలియజేయాలి?
జవాబు:-
ఈ సందేశాన్ని అందరికీ తెలియజేయండి – మీరు దుఃఖహర్త-సుఖకర్తకు పిల్లలు. మీరు ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. మీరు సుఖదాత అయిన తండ్రిని స్మృతి చేయండి, మీరు వారిని ఫాలో చేసినట్లయితే, అర్ధకల్పం కోసం సుఖధామానికి వెళ్ళిపోతారు. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఎవరైతే ఈ సందేశాన్ని జీవితంలో ధారణ చేస్తారో, వారు 21 జన్మలకు మాయ వలన మూర్ఛితులవ్వడం నుండి విముక్తులుగా అవుతారు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
మా తీర్థము అతీతమైనది….. (హమారే తీర్థ్ న్యారే హై…..)
ఓం శాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట అర్థాన్ని తెలుసుకున్నారు. వారు ఆత్మలైన మనకు తండ్రి. ఆత్మయే ముఖ్యమైనది. మీ ఆత్మ పరమపిత పరమాత్మ సమ్ముఖంలో కూర్చొని ఉందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీ ఆత్మ, పరమ ఆత్మ ఎదురుగా కూర్చొని ఉంది. మీకు మీ శరీరముంది, వీరికి అప్పుగా తీసుకున్న శరీరముంది. గురువులు మనుష్యులను యాత్రలకు తీసుకువెళ్తారు. భక్తి మార్గంలో అనేకమంది గురువులున్నారు. భారత్ లో, స్త్రీ తన పతిని కూడా గురువుగా, ఈశ్వరుడిగా భావిస్తుంది. మీరు పిల్లలు కదా, అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. మేము అనంతమైన తండ్రికి పిల్లలము – అని భావిస్తారు. అనంతమైన వారసత్వాన్ని మళ్ళీ తీసుకునేందుకు వచ్చారు. ఇప్పుడు మనం సద్గతిని పొందాలి. ఈ నిశ్చయమైతే ఉంది కదా. మొత్తం ప్రపంచమంతా దుర్గతిలో ఉంది, పతితంగా ఉంది. పావనంగా అయ్యేందుకు పిలుస్తారు. భారత్ లో ఎంతమంది గురువులున్నారు. కొందరికి 100 మంది ఫాలోవర్స్ ఉంటారు, కొందరికి 500 మంది, కొందరికి 50 మంది కూడా ఉంటారు. కొందరికి లక్షల, కోట్ల మంది ఫాలోవర్స్ కూడా ఉంటారు. ఉదాహరణకు ఇస్లామ్ ధర్మంలోని ఒక వర్గానికి ఆగాఖాన్ అనే గురువు ఉన్నారు. అతనికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అతనికి ఎంత గౌరవాన్నిస్తారు. ఆ గురువు ఏమి చేసినా సరే, అతనికి ఎంత గౌరవముంటుంది. భక్తి మార్గంలో అనేకమంది గురువులున్నారు, వారు కూడా నంబరువారుగా ఉంటారు. కొందరి పదమాల సంపాదన ఉంటుంది. ఆగాఖాన్ కు చాలా సంపాదన ఉంటుంది. అతని శిష్యులు, అతడిని వజ్రాలతో తూచి అవి ఆయనకే దానం రూపంలో ఇచ్చేసారు. త్రాసులో ఒక వైపు వజ్రాలు, మరొక వైపు వారి గురువు. వజ్రాలను దానం చేసారంటే, ఎన్ని వజ్రాలు ఉండి ఉండవచ్చు. ఈ రోజుల్లో చాలా మందిని బంగారంతో తూకం వేస్తారు. ప్లాటినం అని మరొకటి ఉంటుంది, అది బంగారం కన్నా ఎక్కువ విలువైనది. దానితో కూడా తూకం వేస్తారు. గురువు పదవి ఎంత గొప్పగా ఉందో చూడండి….. ఇటువంటి గురువులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఈ సద్గురువుకు మీరేమిస్తారు? వారిని తూకం వేస్తారా? వజ్రాలతో తూకం వేస్తారా? అసలు వారిని తూకం వేయగలరా? అసలు వారికి బరువు అనేదే ఉండదు. శివుడు బిందువు, వారిని మీరేమి తూకం వేయగలరు? మీ ఈ గురువు ఎంత అద్భుతమైనవారు, అందరికంటే తేలికైనవారు, చాలా సూక్ష్మమైనవారు. మీ గురువు ఒక్కరే. శివబాబా దాత అని మీకు తెలుసు. భగవంతుడు ఎప్పుడూ ఏమీ తీసుకోరు. వారు ఇస్తూ ఉంటారు. ఈశ్వరార్థము అందరూ దానం చేస్తారు, అప్పుడు మరుసటి జన్మలో దానికి ప్రతిఫలం లభిస్తుందని భావిస్తారు. కోరికలైతే పెట్టుకుంటారు. ఇప్పుడు వీరు అనంతమైన తండ్రి. వీరి వంటి నిష్కామ సేవను ఎవరూ చేయలేరు. ఆ నిష్కామ సేవ కూడా ఎటువంటిది! పిల్లలను విశ్వానికి, సుఖధామానికి యజమానులుగా చేస్తారు. బాబా స్వయం విశ్వానికి యజమానులుగా అవ్వరు. వారిని సుఖ సాగరుడు, శాంతి సాగరుడు, పవిత్రతా సాగరుడని అంటారు. పిల్లలకు ప్రతి విషయము మంచిరీతిగా అర్థం చేయించడం జరుగుతుంది. ఒక్క తండ్రి నుండి మాత్రమే మీకు జీవన్ముక్తి లభిస్తుంది. బాబా నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది. నిశ్చయం ఏర్పడింది, అంతే చాలు. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. వీరిని జ్ఞాన సాగరుడని అంటారు. సాగరాన్ని అంతా సిరాగా చేసినా, అడవినంతా కలముగా చేసినా….. ఈ జ్ఞానానికి అంతము అనేది ఉండదు. మీరు ప్రారంభం నుండి రాసుకుంటూ వెళ్తే, అనేక పుస్తకాలు తయారవుతాయి. ఈ నాలెడ్జ్ అయితే చాలా విలువైనది, ఇది ధారణ చేయవలసినది. ఇదేమీ పరంపరగా కొనసాగడం లేదని మీకు తెలుసు. ఇప్పుడు మీకు సారము లభిస్తుంది. తండ్రి వచ్చి పిల్లలకు తన పరిచయాన్నిస్తారు, అది చాలు. తండ్రి పరిచయం లభించడంతో, రచయితను తెలుసుకోవడంతో, రచన యొక్క జ్ఞానం కూడా తెలుస్తుంది. ఎవరైతే సత్యయుగంలో వస్తారో, వారికి ఎక్కువ పునర్జన్మలు ఉంటాయని బుద్ధి చెప్తుంది. ఎవరైతే చక్రంలో ముందు వచ్చారో, వారే మళ్ళీ వస్తారు. ఈ చక్రాన్ని కూడా మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. మా తీర్థము అతీతమైనది అని పాటలో కూడా విన్నారు. వారు జన్మ-జన్మలుగా తీర్థ యాత్రలు మొదలైనవి చేస్తూ వచ్చారు. ఇది కేవలం మీ ఒక్క జన్మ యొక్క యాత్ర. ఈ ఆత్మిక యాత్రలో కొద్దిగా కూడా ఏ కష్టం లేదు. జ్ఞానాన్నిచ్చేవారు ఒక్క సద్గురువు మాత్రమే. సద్గతి అనేది ఎవరికీ కలగదు. వారు సుప్రీమ్ జ్ఞాన సాగరుడు, వారి ద్వారా సర్వుల సద్గతి జరుగుతుంది. ఇంకేమి కావాలి! తత్వాలు కూడా సతోప్రధానంగా అవుతాయి. ఇక్కడ తత్వాలు తమోప్రధానంగా ఉన్నాయి కనుక వాయువు మొదలైనవి కూడా అలాగే తమోప్రధానంగా ఉంటాయి. భూకంపాలు మొదలైనవి ఎన్ని సంభవిస్తాయి. సత్యయుగంలోనైతే దుఃఖమిచ్చే వస్తువేదీ ఉండదు. తండ్రి దుఃఖహర్త-సుఖకర్త. మీరు వారి సంతానము, మీరు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందరికీ సుఖం యొక్క వారసత్వాన్ని పొందే మార్గాన్ని తెలియజేయాలి.
మీరు సుఖాన్నే ఇవ్వాలని ఇప్పుడు తండ్రి అంటారు. బాబా మీకు అర్ధకల్పానికి ఎటువంటి సుఖాన్ని ఇస్తారంటే, అక్కడ దుఃఖమనే పేరే ఉండదు. తండ్రి నుండి 21 జన్మల వారసత్వాన్ని పొందేందుకు మనం ఇక్కడకు వచ్చామని మీకు తెలుసు. మీరు విద్యార్థులు కదా. శివబాబా నుండి స్వర్గ సుఖాన్ని తీసుకుంటే, అన్ని దుఃఖాలు దూరమైపోతాయని మీ మనసులో ఉంది. బాబా మనల్ని పునర్జీవితులుగా చేసేందుకు, సంజీవని మూలికను ఇస్తారు. ఇక 21 జన్మలు ఎప్పుడూ మూర్ఛితులుగా అవ్వరు. ఆ సంజీవని మూలిక – మన్మనాభవ. సర్వుల సద్గతిదాత తండ్రి ఒక్కరే. వారిని నిరాకారి, నిరహంకారి అని అంటారు. వారు ఏ తనువులోకైతే వస్తారో, వారు కూడా సాధారణమైనవారే. తండ్రి అంటారు – ప్రియమైన పిల్లలూ, నేను మీ విధేయుడైన తండ్రిని. గొప్ప వ్యక్తులు ఎప్పుడూ ఇలాగే రాస్తారు – నేను విధేయుడైన సేవకుడను. స్వయానికి, శ్రీ అని ఎప్పుడూ రాసుకోరు. ఈ రోజుల్లో శ్రీ శ్రీ ఫలానా అని రాసుకుంటారు. తమకు తామే శ్రీ శ్రీ అని రాసుకుంటూ ఉంటారు. ఆ తండ్రి నిరాకారి, నిరహంకారి. ఇప్పుడు మీరు వారి సమ్ముఖంగా కూర్చున్నారు. వారు మన తండ్రి, టీచరు, సద్గురువు అని మీకు తెలుసు. మిగిలినవారంతా భక్తి మార్గం యొక్క అనేకమంది గురువులు. గురువులకు కూడా గురువు ఉంటారు. వీరికి గురువంటూ ఎవరూ లేరు. వీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సద్గురువు.
ఆత్మయే సంస్కారాన్ని ధారణ చేస్తుందని మీకు తెలుసు. బాబా కూడా ఆత్మనే కదా, వారిలో కూడా గుణాలున్నాయి. మీ గుణాలు, తండ్రి గుణాలు వేర్వేరు ఉంటాయి. ఈ సమయంలో మీలో ఏవైతే గుణాలు ఉన్నాయో, అవే తండ్రివి. తర్వాత సత్యయుగంలో మీవి దైవీ గుణాలుగా ఉంటాయి. తండ్రి జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు. కృష్ణుని మహిమ వేరు. శివబాబాను 16 కళల సంపూర్ణులు అని అనలేము. వారు స్థిరమైనవారు. తండ్రి అంటారు – మీరు ఈ టైటిల్స్ ను నాకు ఇవ్వలేరు, సర్వగుణ సంపన్నుడిగా అవ్వడానికి నేను వికారిగా అవ్వను. నన్ను ఈ కృష్ణుని వలె మహిమ చేయరు. ఎవరైతే కల్పక్రితం ఈ నాలెడ్జ్ ను విన్నారో, వారే వస్తారు, వచ్చి తండ్రి నుండి వింటారు మరియు తండ్రిని స్మృతి చేస్తారు. అంతిమంలో అయ్యో-అయ్యో అని అంటూ ఏడుస్తారు, తర్వాత జయ-జయకారాలు జరుగుతాయి. ఇప్పుడు మీరు యాత్ర యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు. మీరు ఈ యాత్ర నుండి మళ్ళీ ఎప్పుడూ మృత్యులోకానికి తిరిగి రారు. ఆ యాత్రల నుండి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. ఎంతమంది మనుష్యులు స్నానాలు చేసేందుకు వెళ్తారు, భక్తి విస్తారం ఎంతగా ఉందో చూడండి. ఉదాహరణకు, వృక్షం ఎంత పెద్దదిగా, విస్తారంగా ఉంటుంది, బీజమైతే చాలా చిన్నదిగా ఉంటుంది. అలాగే, భక్తి విస్తారం కూడా ఎంతగానో ఉంటుంది. జ్ఞానంలోనైతే ఒక మునక కూడా సద్గతినిస్తుంది. భక్తిలో దిగజారుతూ-దిగజారుతూ అర్ధకల్పం పడుతుంది. ఇక్కడ మీకు మెట్లు ఎక్కడానికి ఒక్క సెకెండు పడుతుంది – ఈ లిఫ్ట్ ఎంత బాగుంది. కింద నుండి పూర్తిగా పైకి, తమ ఇంటికి తీసుకువెళ్తుంది. దీనినే, మీ ఎక్కే కళ ద్వారా సర్వులకు మేలు జరుగుతుందని అంటారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు జ్ఞానానికి, భక్తికి గల తేడాను చూడండి. జ్ఞానం, భక్తి, వైరాగ్యము ఉన్నాయి కదా. సన్యాసులది హద్దు వైరాగ్యము. వైరాగ్యము రెండు రకాలుగా ఉంటుందని తండ్రి అర్థం చేయించారు. ఒకటి హద్దు వైరాగ్యము, దీనితో సద్గతి ఏమీ కలగదు. రెండవది అనంతమైన వైరాగ్యము – దీనితో మీకు సద్గతి కలుగుతుంది. ఇప్పుడు సద్గతి కోసం పిల్లలైన మీకు శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా తయారుచేసే శ్రీమతం లభిస్తుంది. ఇప్పుడు శ్రీమతమనుసారంగా శ్రేష్ఠ ప్రపంచ స్థాపన జరుగుతుంది. రావణుని మతం అనుసారంగా ఈ భ్రష్ట ప్రపంచం తయారయ్యింది. మనం శ్రేష్ఠంగా అవుతున్నాము – ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు. ప్రపంచానికి అసలు తెలియవు. ఈ బ్రహ్మాకుమారీలు వినాశనం చేయించేవారని మీ గురించి అంటూ ఉంటారు. వినాశనమైతే నిజంగా జరగనున్నది. దీనితోనే కళ్యాణం జరగనున్నది. కళ్యాణకారీ తండ్రి వస్తారు కనుక మహాభారీ యుద్ధం జరుగుతుంది. బ్రహ్మాకుమారీలు వినాశనం చేస్తారని మేము చెప్పాము కదా అని అంటారు. తప్పకుండా వినాశనం జరగాల్సిందే, పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది. మనం కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాము. పాతదాని తర్వాత కొత్తది తప్పకుండా ఉంటుంది. కల్ప-కల్పము వినాశనం జరుగుతుంది. అప్పుడే భారత్ లో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. కానీ ఆ మనుష్యులు ఎలా అర్థం చేసుకుంటారు? మున్ముందు చాలా మంది అర్థం చేసుకుంటారు. తండ్రి వచ్చినప్పుడు పాత ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది. మీ ఈ యజ్ఞం అద్భుతమైనది. ఇందులో ఆహుతి జరగనున్నది. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. విజయమైతే పాండవులకే లభిస్తుంది. మిగిలినవారంతా సమాప్తమైపోతారు. ఇకపోతే, పాండవులైన మీరు మాత్రమే మిగులుతారు. తర్వాత కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. ఈ నాలెడ్జ్ చాలా అద్భుతమైనది. అందరి దుఃఖహర్త-సుఖకర్త, సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు ఎంత మధురమైన తండ్రి, ఎంత ప్రియమైన తండ్రి. మధురమైన బాబా, మీరు వచ్చినప్పుడు మేము మీపై బలిహారమవుతాము, మాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని అంటూ వచ్చారు. దీని అర్థం, ఇళ్ళు-వాకిళ్ళను వదిలి ఇక్కడకు వచ్చి కూర్చుంటారని కాదు. గృహస్థ వ్యవహారంలో ఉండండి. 7 రోజుల కోర్సు తీసుకొని, తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి – ‘మన్మనాభవ’. తండ్రిని స్మృతి చేయాలి మరియు వారసత్వాన్ని పొందాలి. స్మృతి యాత్రలో ఉండాలి, అంతే, దీనితోనే నావ తీరానికి చేరుకుంటుంది. పవిత్రంగా ఉండాలని కూడా మీకు తెలుసు. ఛీ-ఛీ ఆహారం మొదలైనవి తినకూడదు. మురళీ అయితే లభిస్తూనే ఉంటుంది. ఒకానొక సమయంలో మురళీ కూడా లభించదు, ఆపదలు సంభవిస్తాయి, హంగామాలు మొదలైనవి జరుగుతాయి, అప్పుడు మురళీ లభించదు. మీరు ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో అది ఉండదు, అంతా భస్మమైపోతుంది. ప్రళయమైతే జరగదు. ప్రపంచమైతే ఒక్కటే ఉంటుంది, కొత్తదాని నుండి పాతదిగా అవుతుంది. కొత్త ప్రపంచం, పాత ప్రపంచం అని అంటారు. ఇప్పుడిది పాత ప్రపంచమని అంటారు. ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. కల్పం ఆయువు లక్షల సంవత్సరాలని వారంటారు. కలియుగం గురించి, ఇంకా 40 వేల సంవత్సరాలుందని అంటారు. వాస్తవానికి ఇది 5 వేల సంవత్సరాల చక్రము. మీ బుద్ధిలో నాలెడ్జ్ అంతా ఉంది. మనుష్యులు పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. పాత్రధారులై ఉంటూ, డ్రామా యొక్క క్రియేటర్, డైరెక్టర్ గురించి తెలియకపోతే వారినేమంటారు? ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది తెలుసుకోవాలి కదా. ఎవరైతే మంచి రీతిగా తెలుసుకుంటారో, బుద్ధిలో ధారణ చేసి, ఇతరుల చేత ధారణ చేయిస్తారో, వారు ఉన్నతాతి ఉన్నతమైన పదవిని పొందుతారు. నాలో ఏదైతే నాలెడ్జ్ ఉందో, దానిని ఇప్పుడు మీకు ఇస్తున్నానని తండ్రి అంటారు. డ్రామా ప్లాన్ అనుసారంగా నేను రిపీట్ చేస్తాను. డ్రామాలో నాకు కూడా పాత్ర ఉంది. భక్తి మార్గంలో కూడా పాత్రను అభినయించాను. ఇప్పుడు నేను వచ్చి, మీకు నా పరిచయాన్ని మరియు రచన ఆదిమధ్యాంతాల పరిచయాన్ని ఇస్తాను. నేను కూడా డ్రామా బంధనంలో ఉన్నాను. నేను నా పరిచయాన్ని ఇచ్చేందుకు మరియు రచన ఆదిమధ్యాంతాల నాలెడ్జ్ ను వినిపించేందుకు ఒక్కసారి మాత్రమే వస్తాను. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి సమానంగా విధేయులుగా అవ్వాలి. ఎప్పుడూ ఏ విషయంలోనూ తమ అహంకారాన్ని చూపించకూడదు. నిరాకారిగా మరియు నిరహంకారిగా ఉండాలి.
2. తండ్రి, టీచరు మరియు సద్గురువుల వ్యత్యాసాన్ని అర్థం చేసుకొని నిశ్చయబుద్ధి కలవారై శ్రీమతాన్ని అనుసరించాలి. ఆత్మిక యాత్రలో ఉండాలి.
వరదానము:-
ఎలాగైతే ఇప్పుడు నలువైపులా, ఈ శ్వేత వస్త్రధారులు ఎవరు మరియు ఎక్కడ నుండి వచ్చారు, అనే శబ్దం వ్యాపిస్తుందో, అదే విధంగా, ఇప్పుడు నలువైపులా ఫరిశ్తా రూపాన్ని సాక్షాత్కారం చేయించండి – దీనినే డబల్ సేవ యొక్క రూపమని అంటారు. ఎలాగైతే మేఘాలు నలువైపులా కమ్ముకుంటాయో, అదే విధంగా, నలువైపులా ఫరిశ్తా రూపంతో ప్రత్యక్షమవ్వండి. ఎక్కడ చూసినా సరే, ఫరిశ్తాలే కనిపించాలి. కానీ ఎప్పుడైతే శరీరం నుండి డిటాచ్ అయి, అంతఃవాహక శరీరంతో తిరిగే అభ్యాసం కలవారిగా ఉంటారో, అప్పుడే ఇది సాధ్యమవుతుంది, మనసు శక్తిశాలిగా అవుతుంది.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!