11 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

August 10, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఈ ఆత్మిక చదువును ధారణ చేసేందుకు బుద్ధి పవిత్రమైన బంగారు పాత్ర వలె ఉండాలి, పవిత్రతా రాఖీని కట్టుకోండి, అప్పుడు రాజ్య తిలకము లభిస్తుంది’’

ప్రశ్న: -

ఈ సమయంలో పిల్లలందరూ తండ్రి ద్వారా ఏ సర్టిఫికెట్ ను తీసుకునే పురుషార్థం చేయాలి?

జవాబు:-

పావన ప్రపంచంలోకి వెళ్ళేందుకు పావనులుగా అనగా యోగ్యులుగా అయ్యే సర్టిఫికెట్ ను తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ సమయంలో పవిత్రతా ప్రతిజ్ఞను చేస్తారో, అప్పుడు బుద్ధి బంగారు యుగముదిగా అవుతుంది. పవిత్రతా సర్టిఫికెట్ ను తీసుకునేందుకు తండ్రి సలహా ఏమిటంటే – పిల్లలూ, ఇతరులందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి జ్ఞాన చితిపై కూర్చోండి. ఒక్క తల్లి-తండ్రినే ఫాలో చేయండి. పావనంగా ఉండాల్సిందే, ఈ ప్రతిజ్ఞను చేయండి. తండ్రితో సత్యంగా నడుచుకోండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

సోదరా, నా రాఖీ బంధాన్ని నిర్వర్తించండి… (భయ్యా మేరే రాఖీ కే బంధన్ కో నిభానా…)

ఓంశాంతి. ఈ పాటనైతే పిల్లలు చాలా సార్లు విన్నారు. ఈ రక్షాబంధన ఉత్సవాన్ని మరియు పాటలను భక్తి మార్గంలో జరుపుకుంటూ, పాడుతూ ఉంటారు. ఇప్పుడిది జ్ఞాన మార్గము. తండ్రి పిల్లలతో అంటారు – పిల్లలూ, ఈ మాయా రావణునిపై విజయం పొందడంతో మీరు జగత్ జీతులుగా అనగా జగత్తుకు యజమానులుగా అవుతారు. 5 వికారాలపై విజయం పొందడంలోనే శ్రమ ఉందని పిల్లలైన మీకు తెలుసు. అందులో కూడా కామ వికారము పెద్ద శత్రువు. పవిత్రత విషయంలోనే కొట్లాటలు, అలజడులు మొదలైనవి జరుగుతాయి. ఉన్నతోన్నతమైన తండ్రి మాత్రమే మాయపై విజయం పొందేలా చేసి జగత్తుకు యజమానులుగా చేయగలరు. ఇది పిల్లలకు తెలుసు. అనంతమైన తండ్రి యొక్క వారసత్వాన్ని పొందేందుకు మనం తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. లౌకిక చదువును కూడా పవిత్రంగా ఉన్నప్పుడే చదువుకోవడం జరుగుతుంది. ఇది ఆత్మిక చదువు. ఇందులో జ్ఞాన ధనం నిలవగలిగేలా పాత్ర బంగారముది అనగా పవిత్రమైనది కావాలి. పవిత్రంగా అవ్వడానికి సమయం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు అందరి పాత్ర రాతి వలె అయ్యింది. తండ్రి అర్థం చేయిస్తారు, ఇప్పుడు మీరు పవిత్రంగా అయి తిరిగి వెళ్ళాలి. ఎంతెంతగా జ్ఞాన-యోగాల ధారణ జరుగుతూ ఉంటుందో, అంతగా బుద్ధి పవిత్రంగా అవుతూ ఉంటుంది ఎందుకంటే మనం తిరిగి వెళ్ళాలి అని ఇప్పుడు బుద్ధిలో ఉంది. ఇనుప యుగము నుండి రాగి యుగములోకి రావాలి, ఆ తర్వాత వెండి యుగములోకి, ఆ తర్వాత బంగారు యుగములోకి రావాలి. ఈ చదువు ఎటువంటిదంటే నడుస్తూ-నడుస్తూ ఉండగా మాయ యొక్క దాడి జరుగుతుంది. అందరూ అయితే పవిత్రంగా ఉండలేరు. మాయ చాలా తుఫానులు తీసుకొస్తుంది. ఇనుప యుగము నుండి రాగి యుగము వరకు వస్తూ ఉండగా మాయా తుఫానులు చుట్టుముట్టినట్లయితే, బుద్ధి మళ్ళీ ఇనుప యుగముదిగా అవుతుంది మరియు పడిపోతారు. పడిపోవడము మరియు ఎక్కడము, ఇదైతే తప్పకుండా జరుగుతుంది. ఎక్కిన తర్వాత రాగి యుగము, వెండి యుగము, బంగారు యుగములోకి రావాలి. చదువుతూ-చదువుతూ, జ్ఞానం వింటూ-వింటూ చివర్లో మనది బంగారు యుగపు బుద్ధిగా తయారవుతుంది, అప్పుడు మనం శరీరాన్ని విడిచిపెడతాము. ఈ సమయంలో పడిపోవడము-ఎక్కడము చాలా జరుగుతుంది. సమయం పడుతుంది. ఎప్పుడైతే బుద్ధి బంగారు యుగముదిగా అవుతుందో, అప్పుడు రాజ్యాధికారులుగా అవుతారు. పవిత్రతా రాఖీని కట్టుకోవడంతో రాజ్య తిలకము లభిస్తుందని అంటూ ఉంటారు. మనం రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు పవిత్రతా ప్రతిజ్ఞను చేయాలని పిల్లలైన మీకు తెలుసు. జ్ఞానాన్ని మరియు యోగాన్ని ధారణ చేయడానికి ఎంత సమయం పడుతుంది. బంగారు యుగము నుండి ఇనుప యుగము వరకు రావడానికి 5000 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడైతే చదువుకోవాలి – అది కూడా ఈ ఒక్క జన్మలోనే జరగాలి. ఎంత గొప్పగా చదువుకుంటూ ఉంటారో, అంతగా సంతోషం పెరుగుతూ ఉంటుంది. మనం బుద్ధియోగ బలముతో మరియు జ్ఞాన బలముతో రాజధానిని స్థాపన చేస్తున్నాము. ప్రతి విషయంలో బలము ఉంటుంది. కొద్దిగా చదువుకుంటే కొంచెం బలము, ఎక్కువ చదువుకుంటే ఎక్కువ బలము లభిస్తుంది, పెద్ద పదవి లభిస్తుంది. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. తక్కువగా చదువుకుంటే పదవి కూడా తక్కువది లభిస్తుంది. తండ్రి అర్థం చేయించారు – ఈ బ్రాహ్మణ ధర్మము చాలా చిన్నది. బ్రాహ్మణులే దేవతలుగా, సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతారు. ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. మీరు ఎలా అర్థం చేసుకోండంటే – ప్రస్తుతం మనం రాగి యుగము వరకు చేరుకున్నాము, ఇంకా వెండి యుగము, బంగారు యుగము వరకు చేరుకోవాలి. చివర్లో పిల్లలు కూడా చాలా మంది అవుతారు కదా. మొత్తమంతా పవిత్రతపై ఆధారపడి ఉంది. ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా బలం లభిస్తుంది. మేము పవిత్రంగా అయి భారత్ ను పవిత్రంగా చేస్తామని తండ్రితో ప్రతిజ్ఞ చేసారు. పిల్లలూ, రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు కూడా ఇలా అర్థం చేయించాల్సి ఉంటుంది – నేటికి 5000 సంవత్సరాల క్రితం కూడా పతితం నుండి పావనంగా అవ్వడం కోసం మేము ఈ రాఖీని కట్టడానికి వచ్చాము. కావున రాఖీ బంధనమనేది ఒక్క రోజుకు సంబంధించిన విషయం కాదు. చివరి వరకు నడుస్తూ ఉంటుంది. ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. చదువు పట్ల ధ్యాస పెడుతూ ఉంటారు. జ్ఞాన-యోగాలతో మనము ఇనుప యుగము నుండి బంగారు యుగములోకి వెళ్ళాలని మీకు తెలుసు. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలి. ఈ విషయాలను కొత్తవారెవరూ అర్థం చేసుకోలేరు, అందుకే మీ 7 రోజుల భట్టి ప్రసిద్ధమైనది. ముందుగా నాడిని చూడాల్సి ఉంటుంది. ఎప్పటివరకైతే తండ్రి పరిచయం లభించదో, నిశ్చయం ఏర్పడదో, అప్పటివరకు అర్థం చేసుకోరు. మీ ద్వారా పరిచయం పొందుతూ ఉంటారు. వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. స్వరాజ్యము స్థాపనవ్వడానికి సమయం పడుతుంది. ఎప్పటివరకైతే మీరు బంగారు యుగములోకి రారో, అప్పటివరకు సృష్టి వినాశనం జరగదు. ఆ సమయం వచ్చేటప్పటికి అనేకమంది పిల్లలుగా అవుతారు. ఇప్పుడు రక్షా బంధనం నాడు పెద్ద-పెద్ద వ్యక్తుల వద్దకు వెళ్తారు. వారికి కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. పతితపావనుడైన తండ్రి ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా చేసేందుకు ఈ సంగమంలోనే వస్తారు. తప్పకుండా భారత్ ఒకప్పుడు పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా ఉంది. మహాభారత యుద్ధం ఎదురుగా నిలబడి ఉంది. భగవంతుడైన తండ్రి అంటారు – పిల్లలూ, మాయా రావణుడు మీకు పెద్ద శత్రువు. మిగిలినవారు దైహికమైన చిన్న-చిన్న శత్రువులు. భారత్ కు అందరికన్నా పెద్ద శత్రువు రావణుడు, అందుకే పవిత్రతా రాఖీని కట్టుకోవాలి. ప్రతిజ్ఞ చేయాలి – ఓ బాబా, భారత్ ను శ్రేష్ఠాచారిగా చేసేందుకు మేమూ పవిత్రంగా ఉంటాము, ఇతరులను కూడా పవిత్రంగా చేస్తూ ఉంటాము. ఇప్పుడు అందరూ రావణుడితో ఓడిపోయి ఉన్నారు. భారత్ లోనే రావణుడిని కాలుస్తూ ఉంటారు. అర్ధకల్పం రావణ రాజ్యం నడిచింది. ఇది మీరు అర్థం చేయించాల్సి ఉంటుంది. ఇది అర్థం చేయించకుండా రాఖీ కట్టడమనేది ఎందుకూ ఉపయోగపడదు. ఈ కథ మీకు మాత్రమే తెలుసు. పవిత్రంగా అయినట్లయితే సత్యయుగంలో నరుని నుండి నారాయణుని పదవిని పొందుతారని 5000 సంవత్సరాల క్రితం కూడా తండ్రి చెప్పారని ఇంకెవ్వరూ ఇలా చెప్పరు. ఈ సత్యనారాయణుని కథను మరియు అమరనాథుని కథను మీరు మాత్రమే వినిపించగలరు. ఈ విషయాన్ని అర్థం చేయించాల్సి ఉంటుంది – ఒకప్పుడు భారత్ పవిత్రంగా ఉండేది, బంగారు పిచ్చుకగా ఉండేది, ఇప్పుడు పతితంగా ఉంది, దీనిని ఇనుప పిచ్చుక అని అంటారు. తండ్రి గురించి పరిచయాన్ని ఇచ్చి, తండ్రి బ్రహ్మా ద్వారా తప్పకుండా వారసత్వాన్ని ఇస్తారని మీరు అంగీకరిస్తారా అని అడగండి. తండ్రి అంటారు, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. 84 జన్మలు పూర్తవుతాయి. మాయతో ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ మాయపై విజయం పొందాలి. తండ్రే వచ్చి, పిల్లలూ, ఇప్పుడు పవిత్రంగా అవ్వండి అని అంటారు. పిల్లలంటారు, సరే బాబా, మేము మీకు సహాయకులుగా తప్పకుండా అవుతాము, పవిత్రంగా అయ్యి భారత్ ను తప్పకుండా పవిత్రంగా చేస్తాము. ఈ విధంగా చెప్పండి – మేము ఏమీ మీ నుండి డబ్బు తీసుకోవడానికి రాలేదు, మేము తండ్రి పరిచయాన్ని ఇవ్వడానికి వచ్చాము. మీరంతా తండ్రి యొక్క తోటివారు కదా. తండ్రి వచ్చి సందేశాన్ని ఇస్తారు, సలహానిస్తారు – ఓ పిల్లలూ, మిగిలినవారందరినీ బుద్ధితో త్యాగం చేయండి, మీరు వివస్త్రగా (అశరీరిగా) వచ్చారు. మొట్టమొదట మీరు స్వర్గంలో పాత్రను అభినయించారు. మీరు తెల్లగా అనగా పవిత్రంగా ఉండేవారు. తర్వాత కామ చితిపై కూర్చోవడంతో ఇప్పుడు నల్లగా అయ్యారు. భారత్ బంగారు యుగముగా ఉండేది, ఇప్పుడు భారత్ ను ఇనుప యుగముగా ఉందని అంటారు. ఇప్పుడు మళ్ళీ కామ చితిపై నుండి దిగి జ్ఞాన చితిపై కూర్చోవాలి. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేయండి. మనము ఒక్క తండ్రికి పిల్లలము, సోదరీ-సోదరులము. మీరు కూడా పిల్లలే కానీ అర్థం చేసుకోవడం లేదు. బి.కె.లుగా అయినప్పుడే శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకోగలరు. ఇది ఉన్నదే పతిత భ్రష్టాచారుల ప్రపంచము. శ్రేష్ఠాచారులు ఒక్కరు కూడా లేరు. సత్యయుగంలో భ్రష్టాచారులు ఒక్కరు కూడా ఉండరు. ఇది అనంతమైన విషయము. మొత్తం శేష్ఠాచారీ ప్రపంచం యొక్క స్థాపన చేయడము – ఇది ఒక్క తండ్రి కర్తవ్యమే. బ్రహ్మాకుమార-కుమారీలైన మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేస్తాము. ఎవరైతే పవిత్రత యొక్క గ్యారెంటీ ఇస్తారో, వారి ఫొటోలు తీసి మనం ఒక ఆల్బమ్ ను తయారుచేస్తాము. పావనంగా అవ్వకుండా పావన ప్రపంచంలోకి వెళ్ళేందుకు సర్టిఫికెట్ లభించజాలదు. తండ్రే వచ్చి యోగ్యులుగా చేసి సర్టిఫికెట్ ను ఇస్తారు. సర్వుల పతితపావనుడు, సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. పతితులు యోగ్యులు కారు కదా. భారత్ యే నిరుపేదగా, దుఃఖమయంగా అయ్యింది ఎందుకంటే పతితంగా ఉంది. సత్యయుగంలో పావనంగా ఉండేవారు కావున భారత్ సుఖమయంగా ఉండేది. ఇప్పుడు తండ్రి అంటారు, పావనంగా అవ్వండి. చట్టాన్ని జారీ చేయండి, ఎవరైతే పావనంగా అవ్వాలని అనుకుంటారో, వారిని వివస్త్రగా చేయకండి. పురుషులు వికారాల కోసం చాలా విసిగిస్తారు, అందుకే మాతలు భారత్ ను శ్రేష్ఠంగా చేయడంలో సహాయం చేయలేరు. అందుకే జ్ఞానానికి సంబంధించిన రహస్యయుక్తమైన లేక గుప్తమైన విషయాలను తెలియపరిచే విధంగా ఒక ప్రశ్నావళిని తయారుచేయాలి. కానీ పిల్లలలో ఆ శక్తి ఇంకా రాలేదు. ఎప్పుడైతే బంగారుయుగపు స్థితి వరకు చేరుకుంటారో, అప్పుడు ఎవరికైనా అర్థం చేయించేటువంటి ఆ మెరుపు వస్తుంది. పిల్లలకు రోజురోజుకూ చాలా పాయింట్లు లభిస్తూ ఉంటాయి. ఇది చాలా ఎత్తుకు ఎక్కడమని పిల్లలు అర్థం చేసుకుంటారు. తల్లి-తండ్రిని ఫాలో చేయాల్సి ఉంటుంది. తల్లి-తండ్రి అని అంటారు కదా. వారు తండ్రి, కావున వీరు తల్లి అయినట్లు. కానీ వీరు పురుషుడు కావున మాతకు కలశం ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా మాతలే, పురుషులు సోదరులు. సోదరుడు సోదరికి, సోదరి సోదరునికి పవిత్రతా ప్రతిజ్ఞను చేయిస్తారు. మాతలను ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. వారు మాతలను ఉద్ధరిస్తున్నారు. ఇంతకుముందు స్త్రీలు ఏమైనా ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ మొదలైనవారిగా అయ్యేవారా. ఇంతకుముందైతే రాజుల రాజ్యము ఉండేది. ఒకప్పుడు ఏవైనా కొత్త ఆవిష్కరణలు చేస్తే, మొదట రాజుకు వెళ్ళి చెప్పేవారు. వారు అప్పుడు వాటిని ఇంకా ఎక్కువగా తయారుచేసేందుకు డైరెక్షన్లు ఇచ్చేవారు. ఇక్కడ ఉన్నదే ప్రజా రాజ్యము. కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. శ్రమించాల్సి ఉంటుంది. గీతలో శ్రీకృష్ణుని పేరు వేసి పెద్ద పొరపాటు చేసారని మీకు తెలుసు. మన మాటను ఒకరు ఒప్పుకుంటారు, ఇంకొకరు ఒప్పుకోరు. మున్ముందు మీలో శక్తి వస్తుంది. మనమిప్పుడు బంగారు యుగంలోకి వెళ్ళాలని ఆత్మ అంటుంది. బుద్ధి తాళము ఇప్పుడు తెరుచుకుంది. ఇప్పుడు జ్ఞానాన్ని మంచి రీతిలో అర్థం చేసుకోగలరు. చివర్లో అందరూ తప్పకుండా అర్థం చేసుకుంటారు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపది వస్త్రాలను అపహరించారని శాస్త్రాలలో ఉంది. ఇక ఆ సమయంలో స్మృతి చేయడం తప్ప ఇంకేం చేయగలరు? లోలోపల శివబాబాను స్మృతి చేసినట్లయితే ఆ పాపము అంటదు. ఎందుకంటే పరుల వశంలో ఉన్నారు. అయితే, స్వయాన్ని రక్షించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరి కర్మ బంధనము వేర్వేరుగా ఉంటుంది. కొంతమందైతే స్త్రీని హతమారుస్తారు కూడా. అప్పుడు ఆమె అక్కడ మంచి పదవిని పొందుతారని అర్థం చేయించడం జరుగుతుంది. ఇంకేమి చేయగలరు. పవిత్రంగా ఉండేందుకు యుక్తిని తండ్రి మంచి రీతిలో అర్థం చేయిస్తారు. బ్రహ్మాకుమార-కుమారీలు సోదరీ-సోదరులవుతారు, వికారీ దృష్టి ఉండకూడదు. తండ్రి అంటారు, ఒకవేళ ఈ ప్రతిజ్ఞను ఉల్లంఘించినట్లయితే చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. అనంతమైన తండ్రి చెప్పింది వినకపోతే దెబ్బ తగులుతుందని, కింద పడిపోతారని బుద్ధి కూడా చెప్తుంది. ఇక పదే-పదే కింద పడిపోతూ ఉన్నట్లయితే ఓడిపోతారు. ఇది బాక్సింగ్ కదా. ఇవన్నీ గుప్తమైన విషయాలు. ఇక్కడ ముఖ్యమైనవి – పవిత్రత మరియు చదువు. వేరే చదువేదీ లేదు. భక్తి మార్గంలో అనేక వ్యవహారాలుంటాయి. భక్తులు భక్తి చేస్తూ కూడా – భగవంతుడు కణకణంలో ఉన్నారని అంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. ఇంతకుముందు మీరు కూడా ఇలా అనేవారు – భగవంతుడు సర్వవ్యాపి అని, ఎక్కడ చూసినా మీరే ఉన్నారని, అంతా భగవంతుని లీలనే అని, భగవంతుడు రకరకాల రూపాలను ధరించి లీలలు చేస్తున్నారని అనేవారు. అచ్ఛా, కణకణంలో ఉంటూ ఏం లీలలు చేస్తారు? అనంతమైన తండ్రిని నిందిస్తారు. ఇది కూడా ఆట, అందుకే తండ్రికి రావాల్సి ఉంటుంది. పిల్లలకు సంతోషము ఉండాలి. తండ్రి డైరెక్షన్ లభిస్తుంది – ఒకవేళ పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలనుకుంటే మీరు పవిత్రంగా అవ్వాలి. స్వర్గంలోకైతే వెళ్తాము కదా అని అనుకోకండి, అప్పుడిక ఏ పదవిని పొందుతారు. అలా అనుకోవడమనేది పురుషార్థమేమీ కాదు. రాజు-రాణిగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి. డ్రామా రహస్యాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. మనము కల్ప-కల్పము తండ్రి నుండి వారసత్వము తీసుకుంటామని ఇప్పుడు మీకు తెలుసు. బాబా వస్తారు. చిత్రాలు కూడా ఎంత మంచివి తయారై ఉన్నాయో చూడండి. పెద్ద-పెద్ద చిత్రాల ముందుకు తీసుకురావాలి. మీరందరూ సర్జన్లు – శివబాబా అవినాశీ గోల్డెన్ సర్జన్. మీరు కూడా నంబరువారుగా సర్జన్లు. ఇప్పుడు ఇంకా ఎవరూ సంపూర్ణంగా బంగారు యుగము వారిగా తయారవ్వలేదు. మీరు సేవ చేయాలి. అర్థం చేయించే సమయంలో ప్రతి ఒక్కరి నాడిని చూడాలి. మహారథులైనవారు నాడిని బాగా చూస్తారు. మీరు పూర్తిగా బంగారు యుగము వారిగా అవ్వాలి. ఇప్పుడింకా తయారవ్వలేదు. తయారవ్వడానికి సమయం పడుతుంది. మాయా తుఫానులు చాలా విసిగిస్తాయి. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాల్సినవి. తండ్రి నుండి పూర్తి వారసత్వము తీసుకోవాలి మరియు చాలా సత్యంగా నడుచుకోవాలి. లోపల ఏ విధమైన చెడు ఉండకూడదు. మాయ హైరానా పెడుతుంది, ఎందుకంటే యోగము లేదు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రితో ప్రతిజ్ఞ చేసి మళ్ళీ దానిని ఉల్లంఘించకూడదు, పవిత్రత మరియు చదువుతో ఆత్మను బంగారు యుగముదిగా తయారుచేసుకోవాలి.

2. ఇతరులందరినీ బుద్ధి ద్వారా త్యాగము చేసి అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. యోగబలముతో మాయా తుఫానులపై విజయం పొందాలి.

వరదానము:-

ఏ విధంగా తండ్రి విశ్వ కళ్యాణకారినో, అలా పిల్లలు కూడా విశ్వకళ్యాణానికి నిమిత్తంగా ఉన్నారు. నిమిత్త ఆత్మలైన మీ వృత్తి ద్వారా వాయుమండలం పరివర్తన అవ్వాలి. ఎటువంటి సంకల్పమో అటువంటి వృత్తి ఉంటుంది, అందుకే విశ్వకళ్యాణానికి బాధ్యులైన ఆత్మలు ఒక్క క్షణము కూడా సంకల్పాన్ని లేక వృత్తిని వ్యర్థము చేయలేరు. ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి వ్యక్తి అయినా, స్వయం యొక్క భావన, స్వయం యొక్క వృత్తి కళ్యాణకారిగా ఉండాలి, నింద చేసేవారి పట్ల కూడా శుభ భావన ఉండాలి, అప్పుడు వ్యర్థము నుండి ముక్తులని, తండ్రి సమానులని అంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top