11 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

11 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

10 August 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - తండ్రి అత్యంత మధురమైన శ్యాక్రిన్ కనుక మిగిలిన విషయాలన్నింటినీ వదిలి, ఆ తండ్రిని స్మృతి చేసినట్లయితే మధురమైన శ్యాక్రిన్ గా అవుతారు”

ప్రశ్న: -

మీరు తండ్రి నుండి శ్రీమతాన్ని తీసుకొని తమలో ఏ సంస్కారాలను నింపుకుంటున్నారు?

జవాబు:-

భవిష్యత్తులో మంత్రి లేకుండా పూర్తి విశ్వంపై రాజ్యం చేసే సంస్కారాలను తమలో నింపుకుంటున్నారు. మీరు ఇక్కడకు భవిష్య రాజధానిని నడిపించే శ్రీమతం తీసుకోవడానికే వచ్చారు. తండ్రి మీకు ఎటువంటి శ్రీమతాన్ని ఇస్తారంటే, దీని ద్వారా అర్ధకల్పం వరకు మీరు ఎవరి సలహాలను తీసుకోవాల్సిన అవసరముండదు. ఎవరి బుద్ధి అయితే బలహీనంగా ఉంటుందో, వారు సలహాలను తీసుకోవాల్సి ఉంటుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవే తల్లివి… (తుమ్ హీ హో మాతా…)

ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని ఎవరన్నారు? తప్పకుండా ఆత్మిక తండ్రియే అనగలరు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు మరియు తండ్రి చాలా ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. సర్వులకు సుఖ-శాంతులను ఇచ్చేవారు మరియు సర్వులను దుఃఖం నుండి ముక్తులుగా చేసేవారు, మొత్తం ప్రపంచంలో ఆత్మిక తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరని ఇప్పుడు మీకు తెలుసు, అందుకే దుఃఖంలో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. పిల్లలైన మీరు సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు. బాబా మనల్ని సుఖధామానికి యోగ్యులుగా చేస్తున్నారని మీకు తెలుసు. సదా సుఖధామానికి యజమానులుగా చేసేటువంటి తండ్రి సమ్ముఖంలోకి మీరు వచ్చారు. సమ్ముఖంగా వినడానికి మరియు దూరంగా ఉంటూ వినడానికి చాలా తేడా ఉందని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మధుబన్ లో సమ్ముఖంగా వస్తారు, మధుబన్ ప్రసిద్ధమైనది. మధుబన్ లో, బృందావనంలో వారు కృష్ణుని చిత్రాన్ని చూపించారు. కానీ అక్కడ కృష్ణుడు లేరు. ఇక్కడ నిరాకార తండ్రి పిల్లలైన మిమ్మల్ని కలుస్తారు. మీరు స్వయాన్ని పదే-పదే ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఆత్మనైన నేను, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను. పూర్తి కల్పంలో ఇటువంటి సమయం ఒకటే ఉంటుంది. ఇది కల్పం యొక్క మనోహరమైన సంగమయుగము. దీనికి – పురుషోత్తమము అన్న పేరు పెట్టడం జరిగింది. ఈ సంగమయుగంలోనే మనుష్యమాత్రులందరూ ఉత్తమంగా తయారవుతారు. ఇప్పుడు మనుష్యమాత్రులందరి ఆత్మలు తమోప్రధానంగా ఉన్నాయి, అవే మళ్ళీ సతోప్రధానంగా అవుతాయి. సతోప్రధానంగా ఉన్నప్పుడు మనుష్యులు ఉత్తములుగా ఉంటారు. తమోప్రధానంగా అవ్వడంతో మనుష్యులు కూడా కనిష్టులుగా అవుతారు. కావున తండ్రి సమ్ముఖంగా కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. పాత్ర అంతా ఆత్మనే అభినయిస్తుంది, శరీరం కాదు. ఆత్మ మరియు శరీరం, రెండు కలిసినప్పుడే పాత్ర అభినయించడం జరుగుతుంది. ఆత్మలమైన మనం నిజానికి నిరాకార ప్రపంచంలో లేదా శాంతిధామంలో నివసించేవారమని మీ బుద్ధిలోకి వచ్చింది, ఇది ఎవరికీ తెలియదు. ఇది ఎవరూ అర్థం చేసుకోరు, ఇతరులకు అర్థం చేయించలేరు. ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరుచుకుంది, నిజానికి ఆత్మలు పరంధామంలో నివసిస్తాయని మీరు అర్థం చేసుకుంటారు. అది నిరాకారి ప్రపంచము. ఇది సాకార ప్రపంచము. ఇక్కడ ఆత్మలమైన మనమంతా యాక్టర్స్, పాత్రధారులము. పాత్రను అభినయించేందుకు మొట్టమొదట మనం వస్తాము, తర్వాత నంబరువారుగా వస్తూ ఉంటారు. పాత్రధారులందరూ ఒకేసారి రారు. రకరకాల పాత్రధారులు వస్తూ ఉంటారు. నాటకం పూర్తి అయినప్పుడు, అందరూ ఒక చోటుకు చేరుకుంటారు. నిజానికి ఆత్మ శాంతిధామ నివాసి అని, పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తుందని ఇప్పుడు మీకు పరిచయం లభించింది. తండ్రి పాత్రను అభినయించేందుకు మొత్తం సమయం కోసం రారు. మనమే పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ తమోప్రధానంగా అయిపోతాము. ఇప్పుడు పిల్లలైన మీకు సమ్ముఖంగా వినడంతో చాలా ఆనందం కలుగుతుంది. మురళి చదువుకోడంతో అంత ఆనందం కలగదు. ఇక్కడ సమ్ముఖంలో ఉన్నారు కదా. కావున, ముందు సత్యయుగ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం వారే వస్తారు. భారత్ దేవీ దేవతల స్థానంగా ఉండేది, ఇప్పుడు అలా లేదని మీకు తెలుసు. ఇప్పుడు వారి చిత్రాలను చూస్తున్నారు కావున వారు తప్పకుండా ఉండేవారని అర్థము. మొట్టమొదట మనం దేవీ-దేవతలుగా ఉండేవారము – అని మీ పాత్రను గుర్తు చేసుకుంటారా లేక మర్చిపోతారా? తండ్రి అంటారు – మీరు ఈ పాత్రను అభినయించారు, ఇది డ్రామా. కొత్త ప్రపంచమే తర్వాత పాతగా అవుతుంది. మొట్టమొదటగా పై నుండి ఏ ఆత్మలైతే వస్తారో, వారు బంగారు యుగంలోకి వస్తారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. సత్యయుగ ఆదిలో పాత్రను అభినయించేందుకు మీరే వచ్చారు. మీరు విశ్వానికి యజమానులుగా, మహారాజు-మహారాణులుగా ఉండేవారు. మీ రాజధాని ఉండేది. ఇప్పుడైతే రాజధాని లేదు. మేము రాజ్యాన్ని ఎలా నడిపించాలి – అనేది ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. అక్కడ మంత్రులుండరు. సలహాలు ఇచ్చేవారి అవసరం లేదు. వారు శ్రీమతం ద్వారా శ్రేష్ఠాతి-శ్రేష్ఠంగా అవుతారు, అప్పుడు వారికి ఇతరుల నుండి సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఎవరి నుండైనా సలహా తీసుకున్నట్లయితే, వారి బుద్ధి బలహీనంగా ఉందని అనుకుంటారు. ఇప్పుడు లభించే శ్రీమతం, సత్యయుగంలో కూడా నిలిచి ఉంటుంది. ఇప్పుడు ఆత్మలైన మీరు ఫ్రెష్ అవుతున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. శాంతిధామం నుండి వచ్చి ఇక్కడ మీరు టాకీగా అయ్యారు. టాకీగా అవ్వకుండా కర్మలు జరగవు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎలాగైతే తండ్రిలో పూర్తి జ్ఞానముందో, అలా ఆత్మలైన మీలో కూడా ఇప్పుడు జ్ఞానముంది. ఆత్మ అంటుంది – నేను ఒక శరీరాన్ని వదిలి, సంస్కారాల అనుసారంగా మరొక శరీరాన్ని తీసుకుంటాను. పునర్జన్మలు కూడా తప్పకుండా ఉంటాయి. ఆత్మకు ఏ పాత్ర అయితే లభించిందో, దానిని అభినయిస్తూ ఉంటుంది మరియు సంస్కారాల అనుసారంగా తర్వాత జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఆత్మ యొక్క పవిత్రత డిగ్రీ రోజు-రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. పతితము అనే పదాన్ని ద్వాపరం తర్వాత ఉపయోగిస్తారు కానీ తప్పకుండా అప్పటికే కొంత తేడా వచ్చేస్తుంది. మీరు కొత్త ఇంటిని నిర్మిస్తే, ఒక నెల తర్వాత తప్పకుండా ఎంతోకొంత తేడా వస్తుంది.

బాబా మనకు వారసత్వాన్ని ఇస్తారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు – నేను పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇవ్వడానికే వచ్చాను. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో, అంత పదవిని పొందుతారు. అంతేకానీ తండ్రి వైపు నుండి ఎలాంటి తేడా ఉండదు. ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారని బాబాకు తెలుసు. ఆత్మలు ప్రతి ఒక్కరు ఎవరి కోసం వారు పురుషార్థం చేసుకుంటారు. స్త్రీ-పురుషుల దృష్టి ఇక్కడ ఉండదు. పిల్లలైన మీరంతా అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఆత్మలందరూ సోదరులు, వారిని తండ్రి చదివిస్తారు, వారసత్వాన్ని ఇస్తారు. తండ్రియే ఆత్మిక పిల్లలతో ఇలా మాట్లాడుతారు – ఓ గారాబమైన, మధురమైన, చాలా కాలం విడిపోయి తర్వాత కలిసిన పిల్లలు, మీరు చాలా సమయం నుండి పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ, మీ వారసత్వాన్ని తీసుకునేందుకు ఇప్పుడు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఆది నుండి మొదలుకొని పాత్ర నిశ్చయించబడి ఉంది. పాత్రధారులైన మీరు పాత్రను అభినయిస్తూ, యాక్ట్ చేస్తూ ఉంటారు. ఆత్మ అవినాశి, ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. శరీరమైతే మారుతూ ఉంటుంది. ఇకపోతే, ఆత్మ కేవలం పవిత్రం నుండి అపవిత్రంగా అవుతుంది. సత్యయుగంలో పావనంగా ఉంటారు. దీనిని పతిత ప్రపంచమని అంటారు. ఇప్పుడు సుఖధామం స్థాపనవుతుంది. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామంలో ఉంటాయి. ఈ అనంతమైన నాటకం ఇప్పుడిక పూర్తి కావస్తుంది. ఆత్మలన్నీ దోమల వలె వెళ్తాయి. ఈ సమయంలో ఏ ఆత్మ వచ్చినా కానీ, వారికి ఈ పతిత ప్రపంచంలో ఏమి విలువ ఉంటుంది. నిజానికి, ఎవరైతే మొట్టమొదటగా కొత్త ప్రపంచంలోకి వస్తారో, వారికే విలువ ఉంటుంది. ఒకప్పుడు కొత్త ప్రపంచముండేది, అది ఇప్పుడు పాతగా అయ్యింది. కొత్త ప్రపంచంలో దేవతలు ఉండేవారు, అక్కడ దుఃఖము అన్న మాటే ఉండదు. ఇక్కడ అపారమైన దుఃఖముంది. తండ్రి వచ్చి దుఃఖమయ పాత ప్రపంచం నుండి ముక్తులుగా చేస్తారు. ఎలాగైతే పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వస్తుందో, అలా ఈ పాత ప్రపంచం కూడా తప్పకుండా మారనున్నది. మనం తప్పకుండా సత్యయుగానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు, కనుక మనం స్వయాన్ని ఆత్మగా నిశ్చయించుకుని తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు. ఎంతో కొంత కృషి చేయాల్సి ఉంటుంది. రాజ్యాన్ని పొందడం సులభమేమీ కాదు, తండ్రిని స్మృతి చేయాలి. మీరు పదే-పదే మర్చిపోయేలా చేయడం అనేది మాయ చేసే అద్భుతము. దీని కోసం ఉపాయాన్ని రచించాలి. నా వారిగా అవ్వడంతో స్మృతి నిలుస్తుందని కాదు. అలా అయితే ఇక పురుషార్థం ఏమి చేస్తారు. జీవించి ఉన్నంత వరకు పురుషార్థం చేయాలి. జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలి. ఇది మన అంతిమ జన్మ అని కూడా మీకు తెలుసు. ఈ శరీర భానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి, పురుషార్థం తప్పకుండా చేయాలి. కేవలం స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయండి. త్వమేవ మాతాశ్చ, పితా… ఇదంతా భక్తి మార్గపు మహిమ. మీరు ఒక్క అల్ఫ్ ను (భగవంతుడిని) మాత్రమే స్మృతి చేయాలి. నేను ఒక్కడినే శ్యాక్రిన్ ను, మీరు కూడా మిగిలిన విషయాలన్నింటినీ వదిలి చాలా మధురమైన శ్యాక్రిన్ గా అవ్వండి. ఇప్పుడు మీ ఆత్మ తమోప్రధానంగా అయ్యింది, దానిని సతోప్రధానంగా చేసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి. తండ్రి నుండి సుఖ వారసత్వాన్ని తీసుకోండి అనే అందరికీ చెప్పండి. సత్యయుగంలోనే సుఖముంటుంది. సుఖధామాన్ని స్థాపన చేసేవారు తండ్రి, తండ్రిని స్మృతి చేయడం చాలా సులభము, కానీ మాయ అపోజిషన్ చాలా ఉంది, అందుకే ప్రయత్నించి నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యం తొలగిపోతుంది. సెకెండులో జీవన్ముక్తి అని అంటూ ఉంటారు.

ఈ డ్రామాలో ప్రతి ఒక్కరు తమ పాత్రను రిపీట్ చేయాలి. ఈ డ్రామాలో అందరికన్నా ఎక్కువ పాత్ర మనకే ఉంది. సుఖం కూడా అందరికన్నా ఎక్కువగా మనకే లభిస్తుంది. తండ్రి అంటారు – మీ దేవీ-దేవతా ధర్మం చాలా సుఖమిచ్చే ధర్మము. మిగిలినవారంతా లెక్కాచారాలను సమాప్తం చేసుకొని శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఎక్కువ విస్తారంలోకి మనమెందుకు వెళ్ళాలి. అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకే తండ్రి వస్తారు. దోమల వలె అందరినీ తీసుకువెళ్తారు. శరీరాలు సమాప్తమైపోతాయి. ఇకపోతే, అవినాశి అయిన ఆత్మ తన లెక్కాచారాన్ని సమాప్తం చేసుకొని వెళ్ళిపోతుంది. అంతేకానీ, ఆత్మ అగ్నిలో పడడంతో పవిత్రంగా అవుతుందని కాదు. ఆత్మ స్మృతి రూపీ యోగంతోనే పవిత్రంగా అవ్వాల్సి ఉంటుంది. ఇదే యోగాగ్ని. దీని గురించే వారు – సీత అగ్నిలోకి వెళ్ళినట్లుగా నాటకాన్ని తయారుచేసారు. ఆ అగ్నిని కేవలం ఎవరో ఒక్కరు మాత్రమే ఎదుర్కోరు. తండ్రి అర్థం చేయిస్తారు – సీతలైన మీరంతా ఈ సమయంలో పతితులుగా ఉన్నారు, రావణ రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతితో మీరు పావనంగా అవ్వాలి. రాముడు ఒక్కరే. అగ్ని అనే పదాన్ని వినడంతో, సీత అగ్నిలోకి వెళ్ళారని అనుకుంటారు. యోగాగ్ని ఎక్కడ, ఈ అగ్ని ఎక్కడ. ఆత్మ పరమాత్మతో యోగం జోడించడంతో పతితం నుండి పావనంగా అవుతుంది. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఆత్మలందరూ సీతలే. రావణుని జైలులో, శోక వాటికలో ఉన్నారు. ఇక్కడి సుఖము కాకి రెట్ట సమానమైనది. స్వర్గ సుఖాలు అపారమైనవి. కనుక పిల్లలు జ్ఞాన రత్నాలతో జోలిని నింపుకోవాలి. ఎలాంటి సంశయము రాకూడదు. దేహాభిమానం రావడంతో అనేక రకాల ప్రశ్నలు మొదలైనవి ఉత్పన్నమవుతాయి. అప్పుడు, తండ్రి ఏదైతే కర్తవ్యాన్ని ఇస్తారో, అది చేయరు. మనం పతితుల నుండి పావనంగా అవ్వాలి అన్నదే ముఖ్యమైన విషయము. వేరే సంకల్పాలేవీ చేయాల్సిన అవసరం లేదు. ఇది పతిత ప్రపంచము, అది పావన ప్రపంచము. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము. పావనంగా ఎవరు చేస్తారు అనేది ఏ మాత్రము తెలియదు. మీరు పతితులు అని చెప్పినట్లయితే డిస్టర్బ్ అవుతారు. ఎవరూ తమను తాము వికారులని భావించరు. అందరూ గృహస్థులుగా ఉండేవారని, సీతా-రాములకు, లక్ష్మీ-నారాయణులకు కూడా పిల్లలు ఉన్నారు కదా అని, అక్కడ కూడా పిల్లలు జన్మిస్తారని వారు అంటారు. కానీ దానిని నిర్వికారీ ప్రపంచమని అంటారని వారు మర్చిపోయారు. అది శివాలయము.

తండ్రి పిల్లలైన మీకు ఎన్ని యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. వీరు తండ్రి, టీచర్, గురువు, వీరు అందరికీ సద్గతినిస్తారు. అక్కడ ఒక గురువు మరణిస్తే, వారి పిల్లలకు సింహాసనాన్ని ఇస్తారు. ఇప్పుడు ఆ పిల్లలు సద్గతిలోకి ఎలా తీసుకువెళ్తారు. సర్వుల సద్గతిదాత ఒక్కరే. రావణ రాజ్యంలో దుర్గతి ఉంది, రామ రాజ్యంలో సద్గతి ఉంటుంది. తండ్రి అందరినీ పావనంగా చేసి తీసుకువెళ్తారు, తర్వాత ఒక్కసారిగా ఎవరూ పతితులుగా అవ్వరు, నంబరువారుగా కిందకు దిగుతారు. సతోప్రధానం నుండి సతో, రజో, తమో….. మీ బుద్ధిలో 84 జన్మల చక్రం కూర్చొని ఉంది. ఇప్పుడు మీరు లైట్ హౌస్ వలె ఉన్నారు. జ్ఞానం ద్వారా ఈ చక్రం ఎలా తిరుగుతుందనేది తెలుసుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు మిగిలిన వారందరికీ మార్గాన్ని చూపించాలి. మీరంతా సైన్యము. మీరు మార్గాన్ని తెలియజేసే పైలెట్లు. అందరికీ చెప్పండి – ఇప్పుడు శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి, కలియుగ దుఃఖధామాన్ని మర్చిపోండి, మేము మీకు చాలా మంచి మార్గాన్ని చెప్తాము, పతితపావనుడు ఒక్క నిరాకార తండ్రి మాత్రమే, వారిని స్మృతి చేయడంతో మీరు పావనంగా అయిపోతారు. మీ ఆత్మకు పట్టిన తుప్పు తొలగిపోతూ ఉంటుంది అని. భగవానువాచ – మన్మనాభవ. శివ భగవానువాచ – వినాశ కాలే విపరీత బుద్ధి వినశ్యంతి మరియు వినాశ కాలే పరమపిత పరమాత్మ పట్ల ప్రీతి బుద్ధి విజయంతి. మీకు ఎంతగా ప్రీతి బుద్ధి ఉంటుందో, అంత ఉన్నత పదవిని పొందుతారు. దేహాభిమానంలోకి రావడం వలన అంత ఉన్నత పదవిని పొందలేరు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞాన రత్నాలతో మీ జోలిని నింపుకోవాలి. ఎలాంటి సంశయము రాకూడదు. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేసి పావనంగా అవ్వాలి. వేరే ప్రశ్నలలోకి వెళ్ళకూడదు.

2. ఒక్క తండ్రి పట్ల సత్యమైన ప్రీతిని పెట్టుకొని, తండ్రి సమానంగా మధురమైన శ్యాక్రిన్ గా అవ్వాలి.

వరదానము:-

చిన్నవారైనా, పెద్దవారైనా – మీరు ప్రతి ఒక్కరి సలహాను తప్పకుండా గౌరవించండి, ఎందుకంటే ఎవరి సలహానైనా తిరస్కరించడం అనగా తమను తామే తిరస్కరించుకోవడము. అందుకే ఎవరి వ్యర్థమునైనా కట్ చేయాలనుకుంటే ముందు వారికి గౌరవమివ్వండి, స్వమానమివ్వండి, ఆ తర్వాత శిక్షణ ఇవ్వండి. ఇదే సరైన పద్ధతి. ఇలా గౌరవం ఇచ్చే సంస్కారం నిండినప్పుడు, విశ్వం నుండి మీకు గౌరవం లభిస్తుంది. దీని కోసం బాలక్ సో మాలిక్ (బాలకుల నుండి యజమానులుగా), మాలిక్ సో బాలక్ (యజమానుల నుండి బాలకులుగా) అవ్వండి. బుద్ధి అనంతంలో ఉండాలి, శుభ కళ్యాణ భావనతో సంపన్నంగా ఉండాలి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top