10 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

September 9, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీరు ఆత్మిక తండ్రి నుండి కొత్త-కొత్త ఆత్మిక విషయాలను వింటున్నారు, ఎలాగైతే ఆత్మలైన మనం మన రూపాన్ని మార్చుకొని వచ్చామో, తండ్రి కూడా అలాగే వచ్చారని మీకు తెలుసు”

ప్రశ్న: -

చిన్న-చిన్న పిల్లలు తండ్రి ఇచ్చే వివరణ పట్ల మంచి రీతిలో అటెన్షన్ పెట్టినట్లయితే, ఏ టైటిల్ ను తీసుకోగలరు?

జవాబు:-

స్పిరిచ్యుల్ లీడర్ అనే టైటిల్ ను తీసుకోగలరు. చిన్న పిల్లలు ఒకవేళ ఏదైనా ధైర్యంతో కూడిన పనిని చేసి చూపిస్తే, తండ్రి నుండి విన్నదాని పట్ల అటెన్షన్ పెడితే మరియు ఇతరులకు అర్థం చేయిస్తే, వారిని అందరూ చాలా ప్రేమిస్తారు. తండ్రి పేరు కూడా ప్రసిద్ధమవుతుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఆకాశ సింహాసనాన్ని వదిలి రా….. (ఛోడ్ భీ దే ఆకాష్ సింహాసన్…..)

ఓంశాంతి. పిల్లలు పిలిచారు, తండ్రి బదులిచ్చారు – ప్రాక్టికల్ గా పిల్లలు ఏమంటారంటే – బాబా, మీరు మళ్ళీ రావణ రాజ్యంలోకి రండి అని. మాయ నీడ మళ్ళీ పడింది – అనే పదాలు కూడా ఉన్నాయి కదా. మాయ అని రావణుడిని అంటారు. కనుక, రావణ రాజ్యం వచ్చేసింది కావున ఇప్పుడు మళ్ళీ రండి అని పిలుస్తారు. ఇక్కడ రావణ రాజ్యంలో చాలా దుఃఖముంది. మనం చాలా దుఃఖితులుగా, పాపాత్ములుగా అయిపోయాము. ఇప్పుడు తండ్రి ప్రాక్టికల్ గా ఉన్నారు. మళ్ళీ అదే మహాభారత యుద్ధం ఇక్కడ ఉందని పిల్లలకు తెలుసు. తండ్రి జ్ఞానాన్ని మరియు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఓ నిరాకార పరమపిత పరమాత్మ, నిరాకార లోకం నుండి వచ్చి సాకార రూపాన్ని ధరించండి, రూపాన్ని మార్చుకోండి అని పిలుస్తారు కూడా. మీరు కూడా అక్కడ ఆ బ్రహ్మ మహాతత్వంలో, ఆ నిరాకారీ ప్రపంచంలో నివసించేవారని తండ్రి అర్థం చేయిస్తారు. మీరు కూడా రూపం మార్చుకున్నారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. నిరాకారిగా ఉండే ఆత్మయే వచ్చి సాకార శరీరాన్ని ధారణ చేస్తుంది. అది నిరాకారీ ప్రపంచము. ఇది సాకారీ ప్రపంచము మరియు అది సూక్ష్మ లోకము (ఆకారీ ప్రపంచము), అది వేరు. మేము శాంతిధామం లేక నిర్వాణధామం నుండి వస్తాము – అని మీ బుద్ధిలో ఉంది. తండ్రికి మొట్టమొదట కొత్త రచనను రచించాల్సి వచ్చినప్పుడు, సూక్ష్మవతనాన్నే రచిస్తారు. సూక్ష్మవతనంలోకి ఇప్పుడు మీరు వెళ్ళగలరు, ఇక తర్వాత ఎప్పుడూ వెళ్ళరు. మొట్టమొదట మీరు సూక్ష్మవతనాన్ని దాటుకుంటూ రారు, నేరుగా వస్తారు. ఇప్పుడు మీరు సూక్ష్మవతనానికి వెళ్ళడం-రావడం చేయగలరు. అయితే, అక్కడికి కాలి నడకనో లేక ఇంకే రకంగానో వెళ్ళరు. పిల్లలైన మీకు సాక్షాత్కారం అవుతుంది. మూలవతనం యొక్క సాక్షాత్కారం కూడా జరగవచ్చు కానీ అక్కడికి వెళ్ళలేరు. వైకుంఠ సాక్షాత్కారం కూడా జరగవచ్చు కానీ సంపూర్ణ పవిత్రంగా అవ్వనంత వరకు అక్కడికి వెళ్ళలేరు. మేము సూక్ష్మవతనంలోకి వెళ్ళగలము – అని మీరు చెప్పలేరు. మీరు సాక్షాత్కారంలో చూడగలరు. శివబాబా మరియు దాదా మరియు పిల్లలైన మీరు ఉన్నారు. పిల్లలైన మీరు ఎటువంటి కొత్త-కొత్త ఆత్మిక విషయాలను వింటారు. ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికి తెలియవు. నిరాకారీ ప్రపంచం అని అంటారు కానీ అది ఎలా ఉంటుంది అనేది తెలియదు. ముందుగా ఆత్మ గురించే తెలియదు కనుక నిరాకారీ ప్రపంచం గురించి ఎలా తెలుస్తుంది. తండ్రి వచ్చి మొట్టమొదట ఆత్మ యొక్క రియలైజేషన్ చేయిస్తారు. మీరు ఆత్మలు, తర్వాత రూపాన్ని మార్చుకున్నారు అనగా నిరాకార నుండి సాకారంలోకి వచ్చారు.

మన ఆత్మ 84 జన్మలను ఎలా అనుభవిస్తుంది అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ పాత్ర అంతా ఆత్మలో రికార్డు వలె నిండి ఉంది. బాబా ఇంతకుముందు కూడా ఈ విషయాలను వినిపించారు. తండ్రి అంటారు – ఇప్పుడు మీకు గుహ్యమైన, రమణీకమైన విషయాలను వినిపిస్తాను. ఇవి మీకు ఇంతకుముందు తెలియవు, ఇప్పుడు తెలుసు. కొత్త-కొత్త పాయింట్లు బుద్ధిలోకి వస్తూ ఉంటాయి, అందుకే ఇతరులకు కూడా వెంటనే అర్థం చేయించగలరు. రోజురోజుకు ఈ బ్రాహ్మణుల వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇదే తర్వాత దైవీ వృక్షంగా అవ్వనున్నది. బ్రాహ్మణులే వృద్ధి చెందుతారు. బ్రాహ్మణుల వృక్షం చూడడానికి ఎంత చిన్నగా కనిపిస్తుంది. ఉదాహరణకు ప్రపంచ పటంలో ఇండియాను చూస్తే, ఎంత చిన్నగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇండియా ఎంత పెద్దది! అలాగే జ్ఞానం గురించి కూడా – మన్మనాభవ అనగా అల్ఫ్ (భగవంతుడు) ను స్మృతి చేయండి అని అంటారు. బీజం ఎంత చిన్నగా ఉంటుంది. దాని నుండి ఎంత పెద్ద వృక్షం వెలువడుతుంది. అలా ఈ బ్రాహ్మణ కులం కూడా చిన్నది, వృద్ధి చెందుతూ ఉంటుంది. మనం ఈ సమయంలో బ్రాహ్మణులము, తర్వాత దేవతలుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. 84 జన్మల మెట్ల చిత్రమైతే చాలా బాగుంది. ఎవరైతే 84 జన్మలు తీసుకుంటారో, వారే వచ్చి అర్థం చేసుకుంటారని పిల్లలు అర్థం చేయించవచ్చు. కొందరు 84 జన్మలు, మరి కొందరు 80 జన్మలు కూడా తీసుకుంటూ ఉండవచ్చు. మనము ఈ దైవీ కులానికి చెందినవారమని భావిస్తారు. మనము సూర్యవంశం వారిగా అవుతాము. ఒకవేళ ఫెయిల్ అయితే, ఆలస్యంగా వస్తారు. అందరూ ఒకేసారి కలిసి రారు. చాలామంది జ్ఞానం తీసుకుంటూ ఉంటారు కానీ అందరూ ఒకేసారి కలిసి రారు కదా. వెళ్ళడం కలిసే వెళ్తారు కానీ రావడం కొంత-కొంత మంది చొప్పున వస్తారు, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా! అందరూ ఒకేసారి కలిసి 84 జన్మలు ఎలా తీసుకుంటారు. బాబా, మళ్ళీ వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపించండి అని తండ్రిని పిలుస్తారు. కావున మహాభారత యుద్ధం జరిగేటప్పుడు, ఆ సమయంలోనే వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపిస్తారని దీని ద్వారా ఋజువవుతుంది. దీనినే రాజయోగమని అంటారు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. కల్ప-కల్పము 5 వేల సంవత్సరాల తర్వాత బాబా వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తారు. సత్యనారాయణ కథను వింటారు కదా! వీరు ఎక్కడ నుండి వచ్చారు, తర్వాత ఎక్కడికి వెళ్ళారు అనేది వారికి తెలియదు. తండ్రి అర్థం చేయిస్తారు – పిల్లలూ, మీపై ఈ రావణుని నీడ పడింది, ఇప్పుడు డ్రామానుసారంగా రావణ రాజ్యం సమాప్తమవ్వనున్నది. సత్యయుగంలో రామ రాజ్యముంటుంది మరియు ఈ సమయంలో ఇది రావణ రాజ్యము. మాకు ఏ జ్ఞానమైతే లభించిందో, అది ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది మన కొత్త చదువు, ఇది కొత్త ప్రపంచం కోసము. గీతలో కృష్ణుని పేరు రాసారు, అది పాత విషయం కదా! ఇప్పుడు మీరు కొత్త విషయాలను వింటున్నారు. ఇవి ఎప్పుడూ వినలేదని అంటారు. శివ భగవానువాచ అని ఎప్పుడూ వినలేదు, మేము కృష్ణ భగవానువాచ అనే వింటూ వచ్చామని అంటారు. మీరు కొత్త ప్రపంచం కోసం అన్నీ కొత్తవే వింటారు. భారత్ ప్రాచీనమైనదని అందరికీ తెలుసు. కానీ అలా ఎప్పుడు ఉండేది, ఈ లక్ష్మీనారాయణుల రాజ్యమెలా నడిచింది, వీరు ఆ రాజ్యాన్ని ఎలా పొందారు, తర్వాత ఇది ఏమైపోయింది – ఈ విషయాలు ఎవరి బుద్ధిలోకి రావు. ఏం జరగడం వలన వీరి రాజ్యం సమాప్తమైపోయింది, ఎవరు విజయం పొందారు – ఏమీ అర్థం చేసుకోరు. వారు సత్యయుగానికి లక్షల సంవత్సరాలని అనేసారు. లక్ష్మీనారాయణులు లక్షల సంవత్సరాలు రాజ్యం చేయడం అనేది జరగదు. అలా జరిగి ఉంటే సూర్యవంశీ రాజులు ఎంతో మంది ఉండాలి. కానీ ఇప్పుడు ఒక్కరి పేరు కూడా లేదు. 1250 సంవత్సరాల గురించే ఎవరికీ తెలియదు, అంటే లక్ష్మీనారాయణుల రాజ్యం ఎంత వరకు నడిచింది అనేదే ఎవరికీ తెలియదు, అలాంటప్పుడు లక్షల సంవత్సరాల గురించి ఎవరికైనా ఎలా తెలుస్తుంది. ఎవరి బుద్ధి పని చేయడం లేదు. ఇప్పుడు చిన్న-చిన్న పిల్లలైన మీరు వెంటనే అర్థం చేయించగలరు. ఇది చాలా సహజము. ఈ మొత్తం కథ అంతా భారత్ కు చెందినదే. సత్య, త్రేతా యుగాల్లో కూడా భారతవాసులు రాజులుగా ఉండేవారు. వేర్వేరు చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే వేలాది సంవత్సరాలని అంటారు. కానీ తండ్రి అంటారు – ఇది 5 వేల సంవత్సరాల కథ. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణుల రాజ్యముండేది, రాజ్య వంశముండేది, తర్వాత పునర్జన్మలు తీసుకోవాల్సి వచ్చింది. చిన్న-చిన్న బాలికలు, ఈ కొంచెం అర్థం చేయించినా సరే, వీరు చాలా మంచి జ్ఞానాన్ని చదువుకున్నారని వారు భావిస్తారు. ఈ స్పిరిచ్యుల్ నాలెడ్జ్ (ఆధ్యాత్మిక జ్ఞానము) స్పిరిచ్యుల్ ఫాదర్ (ఆధ్యాత్మిక తండ్రి) వద్ద తప్ప ఇంకెవరి వద్ద లేదు. మాకు కూడా స్పిరిచ్యుల్ ఫాదర్ వచ్చి తెలియజేసారని మీరంటారు. ఆత్మ శరీరం ద్వారా వింటుంది. నేను ఫలానాగా అవుతానని ఆత్మయే అంటుంది. మనుష్యులు స్వయం గురించి రియలైజ్ అవ్వరు. మనకు తండ్రి రియలైజ్ చేయించారు. ఆత్మలైన మనము పూర్తి 84 జన్మలు తీసుకుంటాము. ఇటువంటి విషయాలను కూర్చొని అర్థం చేయిస్తే, వీరికి చాలా మంచి జ్ఞానముందని అంటారు. గాడ్ నాలెడ్జ్ ఫుల్ కదా. గాడ్ నాలెడ్జ్ ఫుల్, బ్లిస్ ఫుల్ (ఆనందస్వరూపులు), ముక్తిదాత, మార్గదర్శకుడు అని పాడుతారు కూడా. కానీ వారు ఎక్కడికి తీసుకువెళ్తారు అనేది ఎవరికీ తెలియదు. పిల్లలు ఈ విషయాన్ని అర్థం చేయించగలరు. స్పిరిచ్యుల్ ఫాదర్ నాలెడ్జ్ ఫుల్, వీరినే బ్లిస్ ఫుల్ అని అంటారు. ఎప్పుడైతే మనుష్యులు చాలా దుఃఖితులుగా అయిపోతారో, అప్పుడే వచ్చి విముక్తులుగా చేస్తారు. ఒక రావణ రాజ్యం ఉంటుంది. హెవెన్లీ గాడ్ ఫాదర్ (స్వర్గ రచయిత) అని అంటారు. హెల్ (నరకం) ను రావణ రాజ్యమని అంటారు. ఎవరికైనా ఈ నాలెడ్జ్ వినిపిస్తే, వారు వెంటనే, దీనిని అందరికీ వెళ్ళి వినిపించండి అని అంటారు. కానీ ధారణ చాలా బాగుండాలి. ప్రదర్శనీ చిత్రాల మ్యాగజిన్ కూడా ఉంది, వీటిని ఇంకా బాగా అర్థం చేసుకుంటే ఈ చిత్రాలపై చాలా సేవ చేయవచ్చు.

ఈ బచ్చీ (జయంతి బెహన్) కూడా అక్కడ లండన్ లో తమ టీచరుకు అర్థం చేయించవచ్చు. అక్కడ లండన్ లో ఈ సేవను చేయవచ్చు. ప్రపంచంలో చాలా మోసం ఉంది కదా! రావణుడు అందరినీ పూర్తిగా మోసగాళ్ళగా తయారుచేసేసాడు. పిల్లలు మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర-భూగోళాలను అర్థం చేయించగలరు. లక్ష్మీనారాయణుల రాజ్యం ఎంత కాలం నడిచిందని, తర్వాత ఫలానా సంవత్సరం నుండి ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు వస్తారని అర్థం చేయించగలరు. ఇలా వృద్ధి చెందుతూ-చెందుతూ వెరైటీ ధర్మాల వృక్షం ఎంత పెద్దది అయిపోతుంది. అర్ధకల్పం తర్వాత వేరే ధర్మాలు వస్తాయి. ఇటువంటి విషయాలను వీరు (జయంతి బెహన్) కూర్చొని వినిపించినట్లయితే, వినేవారు వీరిని – వీరు ఒక స్పిరిచ్యుల్ లీడర్, వీరిలో స్పిరిచ్యుల్ నాలెడ్జ్ ఉంది అని అంటారు. అప్పుడు వీరు (జయంతి బెహన్) చెప్పవచ్చు – ఈ నాలెడ్జ్ అయితే ఇండియాలో లభిస్తుంది, స్పిరిచ్యుల్ గాడ్ ఫాదర్ ఇస్తున్నారు అని. వారు బీజరూపుడు, ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షము. బీజం నాలెడ్జ్ ఫుల్. బీజానికి వృక్షం గురించిన నాలెడ్జ్ ఉంటుంది కదా. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. దీనిని భారత్ యొక్క దైవీ ధర్మమని అంటారు. ముందు లక్ష్మీనారాయణుల రాజ్యముంటుంది, తర్వాత సీతా-రాముల రాజ్యముంటుంది. అర్ధకల్పం ఈ రాజ్యాలు నడుస్తాయి, తర్వాత ఇస్లాములు వస్తారు….. వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ బచ్చీ (జయంతి బెహన్) వెళ్ళి ఇలా భాషణ చేసి, ఈ వృక్షం ఎలా ఇమర్జ్ అవుతుంది అనేది అర్థం చేయించాలి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది మనం అర్థం చేయించగలము. విదేశాలలోనైతే అర్థం చేయించడానికి ఇంకెవ్వరూ లేరు. ఈ బచ్చీ (జయంతి బెహన్) వెళ్ళి, ఇప్పుడిది ఇనుపయుగం యొక్క అంతిమము, బంగారు యుగం రాబోతుంది – అని అర్థం చేయిస్తే వారు చాలా సంతోషిస్తారు. బాబా యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. వీటిపై అటెన్షన్ పెట్టాలి. చిన్న పిల్లలకు చాలా గౌరవం లభిస్తుంది. చిన్నవారు ఏదైనా ధైర్యంతో కూడిన పనిని చేస్తే, వారిని చాలా ప్రేమిస్తారు. ఇటువంటి చిన్న పిల్లలు ఈ విషయాల పట్ల అటెన్షన్ పెట్టినట్లయితే, స్పిరిచ్యుల్ లీడర్లుగా అవుతారని తండ్రికి అనిపిస్తుంది. స్పిరిచ్యుల్ గాడ్ ఫాదర్ యే కూర్చొని నాలెడ్జ్ ఇస్తారు. కృష్ణుడిని గాడ్ ఫాదర్ అని అనడం తప్పు. గాడ్ అయితే నిరాకారుడు. ఆత్మలైన మనమందరం సోదరులము, వారు తండ్రి. ఇనుప యుగంలో అందరూ దుఃఖితులుగా అయినప్పుడు తండ్రి వస్తారు. మళ్ళీ ఇనుప యుగంగా వచ్చినప్పుడు, తండ్రికి బంగారు యుగాన్ని స్థాపన చేసేందుకు రావాల్సి ఉంటుంది. ప్రాచీన భారత్ సుఖధామంగా ఉండేది, హెవెన్ గా ఉండేది. అక్కడ చాలా తక్కువ మంది మనుష్యులు ఉండేవారు. ఆ సమయంలో మిగిలిన ఆత్మలన్నీ ఎక్కడ ఉండేవి. శాంతిధామంలో ఉండేవి కదా! ఈ విధంగా అర్థం చేయించాలి. ఇందులో భయపడాల్సిన విషయం లేదు, ఇది ఒక కథ. కథను సంతోషంగా చెప్పడం జరుగుతుంది. ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయి అనేదానిని కూడా కథ అని అనవచ్చు, నాలెడ్జ్ అని కూడా అనవచ్చు. మీకైతే ఇది పక్కాగా గుర్తుండాలి. తండ్రి అంటారు – నా ఆత్మలో మొత్తం వృక్షం యొక్క జ్ఞానం ఉంది, దానిని నేను రిపీట్ చేస్తాను. నాలెడ్జ్ ఫుల్ తండ్రి పిల్లలకు నాలెడ్జ్ ఇస్తున్నారు. వీరు (జయంతి బెహన్) వెళ్ళి నాలెడ్జ్ ఇచ్చినట్లయితే, మీరు ఇతరులను కూడా పిలవండి అని వీరితో అంటారు. అప్పుడు – సరే, పిలవగలను అని వారికి చెప్పండి, ఎందుకంటే వాళ్ళు – ఏ రాజయోగం ద్వారా భారత్ స్వర్గంగా తయారయ్యిందో, ఆ ప్రాచీన రాజయోగం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఈ విషయం వారికి ఎవరైనా అర్థం చేయించాలి. ఇది సన్యాసులు ఏం వినిపిస్తారు? స్పిరిచ్యుల్ జ్ఞానం కేవలం గీతలోనే ఉంది. కనుక వారు వెళ్ళి ఆ గీతనే వినిపిస్తారు. ఆ గీతను ఎంత మంది చదువుకుంటారు, కంఠస్థం చేస్తూ ఉంటారు. మరి ఆ గీతలో ఉన్నది స్పిరిచ్యుల్ నాలెడ్జ్ యా? అది మనిషి పేరు మీద తయారుచేయబడింది. స్పిరిచ్యుల్ నాలెడ్జ్ ను అయితే మనుష్యులు ఇవ్వలేరు. ఇప్పుడు మీరు తేడాను అర్థం చేసుకుంటారు – ఆ గీతకు మరియు బాబా ఏదైతే వినిపిస్తారో దానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. స్పిరిచ్యుల్ నాలెడ్జ్ ను ఇచ్చింది ఫాదర్ కానీ పేరు కృష్ణునిది వేసేసారు. సత్యయుగంలో కృష్ణునికి ఈ నాలెడ్జ్ ఉండదు. తండ్రియే నాలెడ్జ్ ఫుల్. ఇవి ఎంతటి ఆసక్తికరమైన విషయాలు. కృష్ణుని ఆత్మ సత్యయుగంలో ఉన్నప్పుడు జ్ఞానం లేదు. దారం ఎంతగా చిక్కు పడిపోయింది. వీరందరూ విదేశాలకు వెళ్ళి పేరును ప్రసిద్ధి చేయవచ్చు, భాషణ చేయవచ్చు. ప్రపంచ చరిత్ర-భూగోళాల జ్ఞానాన్ని మేము మీకు ఇవ్వగలమని చెప్పండి. గాడ్ హెవెన్ ను ఎలా స్థాపన చేస్తారు, అది హెవెన్ నుండి మళ్ళీ హెల్ గా ఎలా తయారవుతుంది అనేది మేము మీకు అర్థం చేయిస్తాము అని చెప్పండి. ఇవి కూర్చొని రాయండి, తర్వాత నేను ఏ పాయింటును మర్చిపోలేదు కదా అని చూసుకోండి. మళ్ళీ గుర్తు తెచ్చుకొని రాయండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా రాయగలరు, చాలా బాగా అర్థం చేయిస్తే పేరు ప్రసిద్ధమవుతుంది. ఇక్కడి నుండి కూడా బాబా ఎవరినైనా బయటకు (విదేశాలకు) పంపగలరు. వీరు (జయంతి బెహన్) వెళ్ళి అర్థం చేయిస్తే చాలా బాగుంటుంది. 7 రోజుల్లోనే చాలా తెలివైనవారిగా కావచ్చు. బుద్ధిలో బీజం మరియు వృక్షం గురించి ధారణ చేయాలి, తర్వాత వివరంగా అర్థం చేయించాలి. చిత్రాలపై చాలా బాగా అర్థం చేయించవచ్చు. సేవ పట్ల అభిరుచి ఉండాలి. చాలా ఉన్నత పదవి లభిస్తుంది. జ్ఞానం చాలా సహజము. ఇది పాత ఛీ-ఛీ ప్రపంచము. స్వర్గంతో పోలిస్తే ఈ పాత ప్రపంచం పేడ వంటిది, దీని నుండి దుర్గంధం వస్తుంది. అది బంగారు ప్రపంచము, ఇది పేడ ప్రపంచము. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి రాకుమారులు-రాకుమారీలుగా అవుతామని, అటువంటి స్కూలులో చదువుకునేందుకు వెళ్తామని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ ఫుల్ ప్రూఫ్ గా (పూర్తి సురక్షితంగా) ఉండే విమానాలు ఉంటాయి. పిల్లలకు లోపల ఈ సంతోషం ఉన్నట్లయితే, ఎప్పుడూ ఏ విషయంలోనూ ఏడుపు రాదు. మేము రాకుమార-రాకుమారీలుగా అవుతామని మీరు అర్థం చేసుకుంటారు కదా. మరి మీకు లోపల సంతోషమనేది ఎందుకు ఉండడం లేదు. మనం భవిష్యత్తులో ఇటువంటి స్కూలుకు వెళ్తాము, ఇలా-ఇలా చేస్తాము. తాము ఎందుకు మర్చిపోతున్నారు అనేది పిల్లలు తెలియదు. చాలా నషా ఎక్కాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పాత ఛీ-ఛీ పేడ సమానమైన ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోయి, సత్యయుగీ ప్రపంచాన్ని గుర్తు చేసుకుంటూ అపారమైన సంతోషంలో మరియు నషాలో ఉండాలి. ఎప్పుడూ ఏడవకూడదు.

2. తండ్రి వినిపించే గుహ్యమైన, రమణీకమైన విషయాలను ధారణ చేసి అందరికీ అర్థం చేయించాలి. స్పిరిచ్యుల్ లీడర్ అనే టైటిల్ ను తీసుకోవాలి.

వరదానము:-

మహావీర పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారిని సాకార ప్రపంచంలోని ఏ ఆకర్షణ కూడా తన వైపు ఆకర్షించలేదు. వారు స్వయాన్ని ఒక్క సెకండులో అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా తయారుచేసుకోగలరు. డైరెక్షన్ లభిస్తూనే శరీరం నుండి అతీతంగా, అశరీరిగా, ఆత్మాభిమానిగా, బంధన ముక్తులుగా, యోగయుక్త స్థితిని అనుభవం చేసేవారే సహజ యోగులు, స్వతహా యోగులు, సదా యోగులు, కర్మ యోగులు మరియు శ్రేష్ఠ యోగులు. వారు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయం, తమ సంకల్పాలను, శ్వాసను ఒక్క ప్రాణేశ్వరుడైన తండ్రి స్మృతిలో స్థితి చేయగలరు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top