10 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

9 May 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - స్వయంగా భగవంతుడే మాకు టీచర్ గా అయి చదివిస్తున్నారు అనే సంతోషంలో సదా ఉండండి, మనము వారి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము, ప్రజాయోగము కాదు”

ప్రశ్న: -

ఈ చదువు యొక్క ప్రత్యేకత ఏమిటి? మీరు ఎప్పటివరకు పురుషార్థం చేయాలి?

జవాబు:-

ఎవరైతే ఈ చదువును చాలా సమయం నుండి చదువుతూ వస్తున్నారో, వారికన్నా కొత్త పిల్లలు చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు. ఇది కూడా విశేషతయే, 3 నెలల చురుకైన బుద్ధి కల (తీవ్ర పురుషార్థీ) కొత్త పిల్లలు, పాతవారికన్నా ముందుకు వెళ్ళగలరు. ఎప్పటివరకైతే మీరు పూర్తిగా పాస్ అవ్వరో, కర్మాతీత అవస్థ ఏర్పడదో, అన్ని లెక్కాచారాలు సమాప్తమవ్వవో, అప్పటి వరకు మీరు పురుషార్థం చేయాలి.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. పిల్లలు ఎక్కడ కూర్చొన్నారు? అనంతమైన తండ్రి స్కూల్లో కూర్చొన్నారు. పిల్లలకు చాలా ఉన్నతమైన నషా ఉండాలి. ఎవరి పిల్లలకు? అనంతమైన తండ్రి పిల్లలకు అనగా ఆత్మిక పిల్లలకు. తండ్రి ఆత్మలనే చదివిస్తారు. గుజరాతీలను లేదా మరాఠీలను చదివించరు. అవి నామ-రూపాలు అయినట్లు. తండ్రి ఆత్మలనే చదివిస్తారు. వారే మన అనంతమైన తండ్రి అని పిల్లలైన మీరు కూడా అర్థం చేసుకున్నారు, వారినే భగవంతుడు అని అంటారు. భగవానువాచ కూడా ఉంది, కానీ భగవంతుడని ఎవరిని అంటారు – ఇది అర్థం చేసుకోరు. శివ పరమాత్మాయ నమః అని కూడా అంటారు. పరమాత్మ అయితే ఒక్కరే. వారు ఉన్నతోన్నతమైన నిరాకారుడు. మీకు కృష్ణ భగవానుడు చదివించడం లేదు, వారు ఇంతకుముందు కూడా చదివించలేదు. ఆత్మలైన మన బాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. భగవంతుడు నిరాకారుడే. శివుని మందిరాలకు వెళ్తారు, వారిని పూజిస్తారు కూడా, అంటే వారు తప్పకుండా ఏదో ఒకటి అయి ఉంటారు. నామ-రూపాలకు అతీతమైన వస్తువేదీ ఉండదు. ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఈ విషయం మొత్తం ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మీరు కూడా ఇప్పుడే తెలుసుకోవడం మొదలుపెట్టారు. చాలా సమయం నుండి తెలుసుకుంటూ వచ్చారు. అలాగని చాలా సమయం నుండి వస్తున్నవారి కన్నా కొత్తవారు చురుకుగా వెళ్ళలేరని కాదు. ఇది కూడా ఒక విశేషతయే. 3 నెలల కొత్త పిల్లలు కూడా చాలా చురుకుగా ఉండగలరు. బాబా, ఈ ఆత్మ బుద్ధి చాలా చురుకుగా ఉంది అని వారి గురించి అంటారు. కొత్తవారు విన్నప్పుడు చాలా పులకించిపోతారు. వాస్తవానికి అందరూ గాడ్లీ స్టూడెంట్స్ (ఈశ్వరీయ విద్యార్థులే). నిరాకారుడైన తండ్రి, జ్ఞానసాగరుడు చదివిస్తున్నారు. భగవానువాచ అని కూడా గాయనం చేయబడింది కానీ ఎప్పుడు అనేది మర్చిపోయారు.

వారి తండ్రియే వారికి టీచర్ గా ఉన్నవారు కూడా కొందరు ఉంటారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. కానీ వారు కేవలం ఒక్క సబ్జెక్టును మాత్రమే చదివిస్తారు, ఇంకొక సబ్జెక్టును వేరే టీచరు చదివిస్తారు. ఇక్కడైతే తండ్రి పిల్లలందరికీ టీచరు. ఇది అద్భుతమైన విషయము. శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు అనే నిశ్చయమున్న పిల్లలు చాలామంది ఉన్నారు. శ్రీకృష్ణుడిని బాబా అని అనరు. కృష్ణుడిని ఈ విధంగా టీచరు లేదా గురువు అని కూడా భావించరు. వీరైతే ప్రాక్టికల్ గా చదివిస్తున్నారు. రకరకాల విద్యార్థులైన మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీరు పాస్ అయ్యేంత వరకు, టీచర్ అయిన బాబా చదివిస్తూ ఉంటారు. కర్మాతీత అవస్థను పొందేంత వరకు పురుషార్థం చేయాలి. కర్మల లెక్కాచారం నుండి విముక్తులుగా అవ్వాలి. బాబా మమ్మల్ని అలాంటి ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నారని పిల్లలకు లోలోపల చాలా సంతోషముండాలి. పిల్లలు కూర్చొని, పరంధామ నివాసి అయిన బాబా వచ్చి మమ్మల్ని చదివిస్తారు అని భావించే స్కూలు ఇంకేదీ ఉండదు. ఇప్పుడు మీరిక్కడ కూర్చొని, మా అనంతమైన తండ్రి మమ్మల్ని చదివించేందుకు వస్తారని భావిస్తారు. కావున లోలోపల చాలా సంతోషముండాలి. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది ప్రజాయోగము కాదు, ఇది రాజయోగము. ఈ స్మృతితోనే పిల్లలకు సంతోషపు పాదరసం పైకి ఎక్కాలి. ఇది ఎంత పెద్ద పరీక్ష, మరియు మీరు ఎంత సాధారణంగా కూర్చొని ఉన్నారు. ముసల్మానులు పిల్లలను తివాచిపై కూర్చొబెట్టి చదివిస్తారు. మీరు నిశ్చయంతో ఇక్కడకు వస్తారు. ఇప్పుడు తండ్రి సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు. నేను జ్ఞాన సాగరుడను, నేను కల్ప-కల్పము వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తానని బాబా కూడా అంటారు. కృష్ణుని 84 జన్మలు అని అన్నా లేదా బ్రహ్మా యొక్క 84 జన్మలని అన్నా, విషయం ఒక్కటే. బ్రహ్మాయే శ్రీకృష్ణుడు. ఈ విషయాన్ని బుద్ధిలో మంచి రీతిలో ధారణ చేయాలి. తండ్రి పట్ల చాలా ప్రేమ కలిగి ఉండాలి. ఆత్మలైన మనం ఆ తండ్రికి పిల్లలము, పరమపిత పరమాత్మ వచ్చి మనల్ని చదివిస్తారు. కృష్ణుడైతే ఈ విధంగా చేయలేరు. కృష్ణుడు ఈ విధంగా చదివించి ఉండరు. కిరీటం మొదలైనవి తీసేసి వచ్చి ఉంటారా. ఇప్పుడు ఇక్కడ చదివించేవారు వృద్ధులు అయి ఉండాలి. నేను వృద్ధ తనువును తీసుకొన్నాను, ఇది ఫిక్స్ అని తండ్రి అంటారు. శివబాబా బ్రహ్మా ద్వారానే చదివిస్తారు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారని కూడా అంటారు. ఇప్పుడు బ్రహ్మా ఎక్కడ నుండి వచ్చారు అనేది అర్థం చేసుకోరు. తండ్రి కూర్చొని పదే-పదే పిల్లలను మేల్కొలుపుతారు. మాయ మళ్ళీ పడుకోబెడుతుంది. ఇప్పుడు మీరు సమ్ముఖంలో కూర్చొన్నారు, నేను మీ ఆత్మిక తండ్రిని అని మీరు అర్థం చేసుకుంటారు. నా గురించి మీకు తెలుసు కదా. పరమపిత పరమాత్మ జ్ఞానసాగరుడు, పతితపావనుడు, దుఃఖహర్త-సుఖకర్త అని పాడుతారు కూడా. కృష్ణుని గురించి ఇలా ఎప్పుడూ అనరు. అందరినీ ఒకేసారి చదివించలేరు కదా. మధువనంలో మురళీ నడుస్తుంది, అది మళ్ళీ అన్ని సెంటర్లకు వెళ్తుంది. ఇప్పుడు మీరు సమ్ముఖంలో ఉన్నారు. కల్పక్రితం కూడా బాబా ఇలాగే చదివించారని మీకు తెలుసు. గడిచిపోయిన ఆ సమయం ఇదే. అది ఇప్పుడు మళ్ళీ వర్తమానంగా అవ్వనున్నది. భక్తి మార్గపు విషయాలను ఇప్పుడు వదిలేయాలి. ఇప్పుడు మీకు జ్ఞానం పట్ల ప్రీతి ఉంది, చదివించేవారి పట్ల ప్రీతి ఉంది. కొందరు టీచర్ నుండి చదువుకున్నప్పుడు వారికి కానుకను ఇస్తారు. ఈ బాబా అయితే స్వయంగా వారే కానుకలను ఇస్తారు. ఇక్కడకు వచ్చి – వీరు నా పిల్లలు అని సాకారంలో పిల్లలను చూస్తారు. అందరూ 84 జన్మలు తీసుకోరు అన్న జ్ఞానం కూడా పిల్లలకు ఉంది. ఎవరైనా ఒక జన్మ తీసుకున్నా సరే, అందులో సుఖ-దుఃఖాలను దాటుతారు. ఇప్పుడు మీరు ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకున్నారు. ఇది మనుష్య సృష్టి యొక్క వంశ వృక్షము. మొదటి నంబరులో ఉన్నవారు బ్రహ్మా-సరస్వతి, ఆదిదేవ్, ఆదిదేవి. తర్వాత అనేక ధర్మాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. వారు సర్వాత్మలకు బీజము. మిగిలినవారంతా ఆకులు. ప్రజాపిత బ్రహ్మా అందరికీ తండ్రి. ఈ సమయంలో ప్రజాపిత హాజరై ఉన్నారు. వీరు కూర్చొని శూద్రులను బ్రాహ్మణులుగా కన్వర్ట్ చేస్తారు. ఈ విధంగా ఎవరూ చేయలేరు. తండ్రియే మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేసి, తర్వాత దేవతలుగా తయారుచేసేందుకు చదివిస్తున్నారు. ఇది సహజ రాజయోగ చదువు. రాజా జనకుడు కూడా క్షణంలో జీవన్ముక్తిని పొందారు అనగా స్వర్గవాసిగా అయ్యారు. మనుష్యులు పాడుతూ ఉంటారు కానీ ఆ విషయాన్ని అర్థం చేయించలేరు. పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి అంటారు. మీరు అశరీరులుగా వచ్చారు, తర్వాత శరీరాన్ని తీసుకొని పాత్రను అభినయించారు. 84 జన్మలను పూర్తిగా తీసుకున్నారు. తండ్రి సత్యమైనవారు, వారు సత్యాన్నే తెలియజేస్తారు. రాజధాని ఉంటుంది కదా. రాజయోగాన్ని ఒక్కరే నేర్చుకోరు. మీరంతా ఇప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ముల్లు మరియు పుష్పము అని ఎవరినంటారు అనేది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇది ఛీ-ఛీ ముళ్ళ ప్రపంచము. మనం 84 జన్మల చక్రంలో తిరిగి నరకవాసులుగా అయ్యాము. మళ్ళీ ప్రపంచ చరిత్ర-భూగోళాలను రిపీట్ చేస్తాము. మనం తప్పకుండా మళ్ళీ స్వర్గవాసులుగా అవుతాము. ఇలా మనం కల్ప-కల్పము అవుతాము. ఇది పదే-పదే గుర్తు చేసుకోవాలి మరియు జ్ఞానాన్ని అర్థం చేయించాలి. ఈ లక్ష్మీనారాయణులు సూర్యవంశీయులుగా ఉండేవారు. క్రీస్తు వచ్చారు, వారి కంటే ముందు చాలా కొద్దిమంది ఉండేవారు, రాజధాని ఉండేది కాదు. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యయుగ రాజధానిని స్థాపన చేస్తారు. సంగమయుగములోనే స్థాపన జరుగుతుంది. ఇది సత్యాతి-సత్యమైన కుంభ మేళా అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఆత్మలు అనేకము, పరమాత్మ ఒక్కరే. తండ్రి అయిన పరమాత్మ పిల్లలను పావనంగా చేసేందుకు వారి వద్దకు వస్తారు. దీనినే సంగమయుగం యొక్క కుంభ మేళా అని అంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది. తండ్రి వచ్చి స్వర్గవాసులుగా చేస్తారు, తర్వాత నరకమైన పాత ప్రపంచపు వినాశనం తప్పకుండా జరగాలి. కల్ప-కల్పము వినాశనం జరుగుతుంది. కొత్తది పాతదిగా, పాతది కొత్తదిగా అవుతుంది. తప్పకుండా ఇలా జరుగుతుంది. కొత్తదానిని స్వర్గమని, పాతదానిని నరకమని అనడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది మనుష్యుల వృద్ధి జరుగుతుంది. ధాన్యం లభించకపోతే, మేము చాలా ధాన్యాన్ని పండించాలని భావిస్తారు, కానీ పిల్లలు ఎంతగా జన్మిస్తూ ఉంటారు. ధాన్యం ఎక్కడ నుండి తీసుకొస్తారు.

ఈ పాత ప్రపంచమంతా సమాప్తమవ్వనున్నదని ఇప్పుడు పిల్లలైన మీకు బాగా తెలుసు. మనుష్యులకు ఈ జ్ఞానం బాగా అనిపిస్తుంది కానీ బుద్ధిలో ఏమీ కూర్చోదు. నరకం తర్వాత స్వర్గం వస్తుందని, సత్యయుగపు దేవీ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళారని మీ బుద్ధిలో ఉంది. ఈ లక్ష్మీనారాయణులు భారత్ కు యజమానులుగా ఉండేవారు, వారి చిత్రాలున్నాయి. సత్యయుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మముండేది. ఇప్పుడు తమను తాము దేవతా ధర్మం వారని చెప్పుకోరు, దానికి బదులుగా హిందువులని అంటారు. మనం ఇలా (దేవీ-దేవతలుగా) అవుతున్నామని పిల్లలకు బాగా తెలుసు. బాబా మనల్ని కర్మేంద్రియాల ద్వారా చదివిస్తున్నారు. లేకపోతే నేను మిమ్మల్ని ఎలా చదివించాలి అని బాబా అంటారు. ఆత్మలనే చదివిస్తారు ఎందుకంటే ఆత్మలోనే మాలిన్యం ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు సత్యమైన బంగారముగా అవ్వాలి, గోల్డెన్ ఏజ్ నుండి సిల్వర్ ఏజ్ లోకి వస్తారు అనగా వెండి యొక్క లోహం కలవడంతో మీరు చంద్ర వంశీయులుగా అయిపోతారు. సత్యయుగంలో గోల్డెన్ ఏజ్ లో ఉండేవారు, వారే మళ్ళీ కిందకు దిగుతారు, తర్వాత వృద్ధి కూడా జరుగుతుంది. మేము గోల్డెన్, సిల్వర్, కాపర్, ఐరన్ ఏజ్ లో 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. అనేక సార్లు ఈ పాత్రను అభినయించాము, ఈ పాత్ర నుండి ఎవరూ విముక్తులుగా అవ్వలేరు. మాకు మోక్షం కావాలని వారంటారు కానీ వాస్తవానికి విసుగు చెందాల్సింది మీరు. 84 జన్మల చక్రాన్ని మీరు తిరిగారు. రావడం-వెళ్ళడం అనేది జరుగుతూనే ఉంటుంది, దీని నుండి మేమెందుకు విముక్తులుగా అవ్వలేమని మనుష్యులు అనుకుంటారు. కానీ అలా జరుగదు. మీరు మోక్షాన్ని పొందుతారు, బ్రహ్మా తత్వాన్ని స్మృతి చేసినట్లయితే అందులో లీనమవుతారని గురువులు కూడా చెప్తారు. అనేక మత-మతాంతరాలు భారత్ లోనే ఉన్నాయి. ఇతర ఏ ఖండాల్లోనూ ఇన్ని లేవు. అనేక మతాలున్నాయి, ఒకటి మరొక దానితో కలవదు. మంత్ర-తంత్రాలు కూడా చాలా నేర్చుకుంటారు. కొందరు కుంకుమ పువ్వును తీస్తారు, కొందరు ఇంకేదో తీస్తారు… దానితో మనుష్యులు చాలా సంతోషపడతారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. ఆధ్యాత్మిక తండ్రి ఆత్మలైన మనకు తండ్రి అని మీకు తెలుసు. ఆత్మిక తండ్రి ఆత్మలతో మాట్లాడుతారు. వారు వచ్చి సత్యనారాయణ కథను మరియు అమరకథను వినిపిస్తారు, దీని ద్వారా అమరలోకానికి యజమానులుగా చేస్తారు, నరుని నుండి నారాయణునిగా చేస్తారు. మళ్ళీ గవ్వ సమానంగా అయిపోతారు. ఇప్పుడు మీకు వజ్ర సమానమైన అమూల్యమైన జన్మ లభించింది కావున గవ్వల వెనుక ఎందుకు పోగొట్టుకుంటున్నారు. ఈ ప్రపంచము ఇంకా ఎన్ని సంవత్సరాలుంటుంది! ఎన్ని యుద్ధాలు-గొడవలు జరుగుతూ ఉంటాయి, అంతా సమాప్తమైపోతుంది. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది, ఇక తర్వాత ఇన్ని లక్షలు, కోట్లు ఎవరు కూర్చొని తింటారు. మరి వీటిని ఎందుకు సఫలం చేసుకోకూడదు. ఈ ఆత్మిక కాలేజ్ తెరవడంతో మనుష్యులు ఎవర్ హెల్దీ, వెల్దీ, హ్యాపీగా (సదా ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతులుగా, ఆనందంగా) అవుతారు. ఇక్కడ హాస్పిటల్ మరియు యూనివర్సిటీ కంబైన్డ్ గా ఉన్నాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఉండనే ఉన్నాయి. యోగం ద్వారా తప్పకుండా దీర్ఘాయుష్షు లభిస్తుంది. మీరు ఎంతగా ఆరోగ్యవంతులుగా అవుతారో, అంతగా అనంతమైన ఖజానా కూడా లభిస్తుంది. అల్లావుద్దీన్ నాటకాన్ని కూడా చూపిస్తారు కదా. అల్లా, ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు, అందులో చాలా సుఖముంటుందని మీకు తెలుసు. దాని పేరే స్వర్గము. మీరు శాంతిధామ నివాసులుగా ఉండేవారు, తర్వాత మీరు మొట్టమొదట సుఖధామంలోకి వచ్చారు, తర్వాత 84 జన్మలు తీసుకుంటూ కిందకు పడిపోతూ వచ్చారు. నేను పిల్లలైన మీకు కల్ప-కల్పము ఈ విధంగా కూర్చొని అర్థం చేయిస్తాను. మీకు మీ జన్మల గురించి తెలియదు, నేను మీకు తెలియజేస్తాను. మీరు 84 జన్మలను తీసుకున్నారు, ఈ శరీరం పతితమైనది. ఆత్మ కూడా తమోప్రధానమైపోయింది. బాబా రైట్ చెప్తారు. బాబా ఎప్పుడూ రాంగ్ చెప్పరు. వారు సత్యము. సత్యయుగం నిర్వికారీ ప్రపంచము, ధర్మయుక్తమైన ప్రపంచము. తర్వాత రావణుడు అధర్మయుక్తంగా తయారుచేస్తాడు. ఇది అసత్య ఖండము. అసత్యమైన మాయ, అసత్యమైన కాయ, పూర్తి ప్రపంచము అసత్యము… అని పాడుతారు కూడా. ఏ ప్రపంచము? ఈ పాత ప్రపంచమంతా అసత్యమైనది. సత్యయుగంలో సత్యమైన ప్రపంచముండేది. ప్రపంచం ఒక్కటే, రెండు ప్రపంచాలు లేవు. కొత్త ప్రపంచమే మళ్ళీ పాతదిగా అవుతుంది. కొత్త ఇంటికి, పాత ఇంటికి వ్యత్యాసం ఉంటుంది కదా. కొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు, మేము కొత్త ఇంట్లో కూర్చొంటామని భావిస్తారు. ఇక్కడ కూడా పిల్లల కోసం కొత్త ఇంటిని తయారుచేస్తారు. చాలామంది పిల్లలు తయారవుతూ ఉంటారు. పిల్లలైన మీకైతే చాలా సంతోషం ఉండాలి. జ్ఞానసాగరుడినైన నా పిల్లలందరూ, కామ చితిపై కూర్చొని పూర్తిగా కాలిపోయారని తండ్రి అంటారు. ఇప్పుడు మళ్ళీ వారిని జ్ఞాన చితిపై కూర్చోబెడతాను, జ్ఞాన చితిపై కూర్చోబెట్టి స్వర్గానికి యజమానులుగా చేస్తానని తండ్రి అంటారు. కామ చితిపై కూర్చోవడంతో పూర్తిగా నల్లగా అయిపోయారు. కృష్ణునికి శ్యామ సుందరుడు అన్న పేరును పెట్టారు. కానీ దాని అర్థాన్ని ఎవరూ తెలుసుకోలేరు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నవారు ఎలా తయారవుతున్నారు! తండ్రి గవ్వ నుండి వజ్ర సమానంగా తయారుచేస్తారు, కావున అంత అటెన్షన్ పెట్టవలసి ఉంటుంది. తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ వజ్ర తుల్యమైన అమూల్యమైన జీవితాన్ని గవ్వల వెనుక పోగొట్టుకోకూడదు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది కావున తమదంతా ఆత్మిక సేవలో సఫలం చేసుకోవాలి.

2. చదువు పట్ల మరియు చదివించే వారి పట్ల సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి. భగవంతుడు మమ్మల్ని చదివించేందుకు వచ్చారు అన్న సంతోషంలో ఉండాలి.

వరదానము:-

ఒకవేళ బుద్ధి యొక్క సంబంధం సదా ఒక్క తండ్రితో జోడించబడి ఉంటే, సర్వ శక్తుల వారసత్వం అధికారం రూపంలో ప్రాప్తిస్తుంది. ఎవరైతే అధికారిని అని భావించి ప్రతి కర్మను చేస్తారో, వారికి మాటలో లేదా సంకల్పంలో కూడా అడగవలసిన అవసరం ఉండదు. ఈ అధికారీతనపు స్మృతియే సర్వ శక్తుల ప్రాప్తిని అనుభవం చేయిస్తుంది. కావున, సర్వ శక్తులు మా జన్మ సిద్ధ అధికారం అన్న నషా ఉండాలి. అధికారిగా అయి నడుచుకున్నట్లయితే, ఆధీనత సమాప్తమైపోతుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top