10 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris
9 June 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని ఇవ్వడానికి అమరుడైన బాబా వచ్చారు, ఇప్పుడు మీకు మూడు కాలాలు మరియు మూడు లోకాల గురించి తెలుసు”
ప్రశ్న: -
ఏ ఆధారంపై ఆత్మిక తండ్రి ఆత్మలకు వారసత్వాన్ని ఇస్తారు?
జవాబు:-
చదువు ఆధారంగా. ఏ పిల్లలైతే మంచి రీతిలో చదువుకుంటారో, దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేస్తారో, వారికి మాత్రమే తండ్రి వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి కేవలం కొడుకులకు మాత్రమే వారసత్వాన్ని ఇస్తారు, కానీ పారలౌకిక తండ్రి సంబంధం ఆత్మలతో ఉంటుంది, అందుకే వారు ఆత్మలకు వారసత్వాన్ని ఇస్తారు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
భోళానాథుని కన్నా అతీతమైనవారు….. (భోలేనాథ్ సే నిరాలా…..)
ఓంశాంతి. ఆత్మిక పిల్లలు, ఈ మృత్యులోకం నుండి అమరలోకంలోకి వెళ్ళేందుకు ఆత్మిక తండ్రి నుండి అమరకథను వింటున్నారు. నిర్వాణధామాన్ని అమరలోకమని అనరు. అమరలోకం అంటే అక్కడ మీరు అకాల మృత్యువును పొందరు, అందుకే దానిని అమరలోకమని అంటారు. ఆత్మిక తండ్రిని అమరనాథుడని అంటారు. అమరలోకానికి తీసుకువెళ్ళేందుకు తప్పకుండా మృత్యులోకంలో కథను వినిపిస్తారు. భారత్ లోనే మూడు కథలు ప్రసిద్ధి చెందాయి – అమరకథ, సత్యనారాయణుని కథ, మూడవ నేత్రం కథ. భక్తి మార్గంలో ఎవరికీ మూడవ నేత్రం కథ యొక్క అర్థం తెలియదు. జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని జ్ఞాన సాగరుడు, అమరుడైన బాబా తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు. ఇక్కడివారు అసత్య కథలను వినిపిస్తారు. మాకు ఇప్పుడు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభిస్తుందని మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు తెలుసుకున్నారు, ఆ మూడవ నేత్రంతో మీరు మూడు కాలాల గురించి, మూడు లోకాల గురించి తెలుసుకున్నారు. మీరు మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం యొక్క ఆదిమధ్యాంతాలను కూడా తెలుసుకున్నారు కావున పిల్లలు తమను తాము త్రికాలదర్శులుగా కూడా భావిస్తారు. మధురాతి-మధురమైన పిల్లలైన మీరు తప్ప సృష్టిలో ఇంకెవరూ త్రికాలదర్శులుగా ఉండరు. ఇంకెవరికీ మూడు కాలాలు అనగా సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం గురించైతే చాలా మందికి తెలుసు. కానీ మూడు కాలాల ఆదిమధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ద్వారా వింటున్నారు. మనం వారి పిల్లలుగా అయ్యాము. ఆత్మిక పిల్లలైన మీకు ఆత్మిక తండ్రి ఒక్కసారి మాత్రమే లభించారు. వారు ఆత్మలను చదివిస్తారు, మిగిలినవారంతా దేహాభిమానులుగా ఉన్న కారణంగా – నేను ఇది చదువుతున్నాను, నేను ఇది చేస్తున్నానని అంటారు. దేహాభిమానం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సంగమయుగంలో ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు – మీరు మంచి రీతిలో చదువుకోండి అని చెప్తారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు ప్రతి బిడ్డ హక్కుదారుడే, ఎందుకంటే అందరూ ఆత్మిక పిల్లలు కదా. లౌకిక సంబంధంలో కేవలం కొడుకులు మాత్రమే వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. ఈ పారలౌకిక సంబంధంలో పిల్లలందరికీ అనగా ఆత్మలందరికీ వారసత్వం లభిస్తుంది. అమరనాథుని కథ కూడా వినిపిస్తారు. పార్వతికి పర్వతంపై ఉన్న గుహలలో కథ వినిపించారని చెప్తారు. ఇది తప్పు కదా. ఇప్పుడు అసత్యమేమిటి, సత్యమేమిటి అనేది పిల్లలైన మీకు తెలుసు. సత్యాన్ని తప్పకుండా సత్యమైన బాబాయే వినిపిస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే సత్యం వినిపించి సత్య ఖండానికి యజమానులుగా తయారుచేస్తారు. ఈ అసత్య ఖండానికి నిప్పు అంటుకోనున్నదని మీకు తెలుసు. ఇప్పుడు ఈ కంటికి కనిపిస్తున్నదేదీ మిగలదు. ఇక కొద్ది సమయమే మిగిలి ఉంది. ఎలాగైతే లౌకిక సంబంధంలో కూడా తండ్రి యజ్ఞాన్ని రచిస్తారో, అలా ఇది శివబాబా జ్ఞాన యజ్ఞము. కొందరు రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు, కొందరు గీతా యజ్ఞాన్ని రచిస్తారు. కొందరు రామాయణ యజ్ఞాన్ని రచిస్తారు. ఇది శివబాబా జ్ఞాన యజ్ఞము లేదా రుద్ర జ్ఞాన యజ్ఞము. ఇది అంతిమ యజ్ఞము.
ఇప్పుడు మనం అమరపురికి వెళ్తున్నామని మీకు తెలుసు. ఇక కొన్ని నిమిషాల మార్గమే మిగిలి ఉంది. ఇది మనుష్యులెవరికీ తెలియదు. వారు మృత్యులోకం నుండి అమరలోకానికి వెళ్ళడానికి ఇంకా 40 వేల సంవత్సరాలు మిగిలి ఉన్నాయని అంటారు. అమరలోకమని సత్యయుగాన్ని అంటారు. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు సమ్ముఖంగా కూర్చొని అమర కథను, మూడవ నేత్రం కథను, సత్యనారాయణుని కథను వినిపిస్తున్నారు. భక్తి మార్గంలో ఏమేమి జరుగుతుంది అనేది మీరు చూసారు. భక్తి మార్గం యొక్క విస్తారం ఎంత ఉంది. ఎలాగైతే వృక్షం యొక్క విస్తారం పెద్దగా ఉంటుందో, అలా భక్తి కూడా పెద్ద కర్మ కాండల వృక్షము వంటిది. యజ్ఞాలు, వ్రతాలు, నియమాలు, జప-తపాలు మొదలైనవి ఎన్ని చేస్తారు. ఈ జన్మలోని భక్తులే చాలా మంది ఉన్నారు. మనుష్యుల వృద్ధి జరుగుతూ ఉంటుంది. మీరు భక్తి మార్గంలోకి వచ్చినప్పటి నుండి వేరే ధర్మాలు స్థాపనయ్యాయి. ప్రతి ఒక్కరికీ తమ ధర్మంతో కనెక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరి ఆచార-పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి. భారత్ అమరపురిగా ఉండేది, భారత్ ఇప్పుడు మృత్యులోకంలా ఉంది. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారు. కానీ ఇప్పుడు పతితులుగా అయిన కారణంగా మీరు స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. మేమే దేవతలుగా ఉండేవారము అన్న విషయాన్ని మీరు మర్చిపోయారు. క్రీస్తు మా ధర్మాన్ని స్థాపన చేసారు కావున క్రైస్తవులు కొనసాగుతూ వచ్చారు – అని వారు అంటారు. అంతేకానీ వారు యూరోపియన్ ధర్మానికి చెందినవారని కాదు. వాస్తవానికి హిందుస్థాన్ లో నివసించేవారు అనగా భారత్ లో నివసించే మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు. కానీ తమను తాము దేవతలుగా పిలుచుకోలేరు. మేము పాపులము, నీచులము, నిరుపేదలము, వికారులము అని స్వయాన్ని భావిస్తారు. భక్తి మార్గంలో మనుష్యులు దుఃఖితులుగా అయినప్పుడు తండ్రినే పిలుస్తారు. ఏ తండ్రినైతే పిలుస్తూ వచ్చారో, ఆ తండ్రి మాకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు అమరకథను వినిపిస్తున్నారని కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనం అమరపురికి యజమానులుగా అవ్వబోతున్నాము. అమరపురిని స్వర్గమని అంటారు. మేము స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని మీరంటారు. కలియుగంలో మనుష్యులు మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారని అంటారు. మరి వారు స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థమేమీ చేయలేదు. మీరు అమరపురికి, వైకుంఠానికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. పురుషార్థం చేయించేవారు ఎవరు? అమరుడైన బాబా, వారిని అమరనాథుడని కూడా అంటారు. ఈ యజ్ఞాన్ని పాఠశాల అని కూడా అనడం జరుగుతుంది. వేరే ఏ పాఠశాలలనూ యజ్ఞము అని అనడం జరగదు. యజ్ఞాలను వేరుగా రచిస్తారు, అక్కడ బ్రాహ్మణులు కూర్చొని మంత్రాలు జపిస్తూ ఉంటారు. తండ్రి అంటారు – ఇది మీ కాలేజీ కూడా, యజ్ఞం కూడా, రెండూ కలిసి ఉన్నాయి. ఈ జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యిందని మీకు తెలుసు, ఇందులో మొత్తం ప్రపంచం స్వాహా అవ్వనున్నది. తర్వాత కొత్త ప్రపంచం తయారవ్వనున్నది, దీని పేరే మహాభారీ మహాభారత యుద్ధము. ఇలాంటి యుద్ధం ఇంకేదీ ఉండదు. యుద్ధము ముసలాల ద్వారా జరిగిందని అంటారు. యుద్ధము మీతో ఏమీ జరగదు. దీనిని మహాభారత యుద్ధమని ఎందుకు అంటారు? భారత్ లో ఒక్క ధర్మమే ఉంటుంది కదా. మృత్యువు బయట జరుగుతుంది. ఇక్కడ యుద్ధము యొక్క విషయమేమీ లేదు. మీ కోసం కొత్త ప్రపంచం కావాలి కావున తప్పకుండా పాత ప్రపంచం వినాశనమవుతుందని తండ్రి అర్థం చేయిస్తారు.
పిల్లలైన మీ బుద్ధిలో విరాట రూపానికి సంబంధించిన జ్ఞానమంతా కూడా ఉంది. ఎవరైతే కల్పక్రితం వచ్చారో, వారు దేవతలుగా అయ్యేందుకు మళ్ళీ వస్తారని కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇదంతా బుద్ధి పని. మనం ఎంతమంది అయితే బ్రాహ్మణులుగా అయ్యామో, మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము. ప్రజాపిత బ్రహ్మాను కూడా మహిమ చేసారు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు, అందుకే బ్రహ్మాను ప్రజాపిత అని అంటారు. కానీ ఎలా రచిస్తారు, ఎప్పుడు రచిస్తారు అనేది ఎవరికీ తెలియదు. వారు రచించాల్సిన అవసరం రావడానికి ప్రారంభంలో మనుష్యులు ఎవరూ లేరా? పతితపావనా రండి, అని పిలుస్తారు కూడా. కావున మనుష్యులు పతితులుగా అయినప్పుడే తండ్రి వస్తారు. ప్రపంచం పరివర్తన అవ్వాల్సి ఉంటుంది. తండ్రి మిమ్మల్ని కొత్త ప్రపంచానికి యోగ్యులుగా తయారుచేస్తారు. ఇప్పుడు మీరందరూ తమోప్రధాన పాత ప్రపంచంలో ఉన్నారు, మళ్ళీ సతోప్రధానంగా తయారవ్వాలి. ప్రతి మనిషి, ప్రతి వస్తువు, సతో-రజో-తమోలలోకి రావాల్సి ఉంటుందని తండ్రి అర్థం చేయించారు. ప్రపంచం తప్పకుండా పాత నుండి కొత్తగా అవుతుంది. వస్త్రాలు కూడా కొత్తవి ధరిస్తారు, అవి తర్వాత పాతబడతాయి. మీకు జ్ఞానం లభించింది, ఇప్పుడు మీరు సత్యాతి-సత్యమైన సత్యనారాయణుని కథను వింటున్నారు. గీత సర్వశాస్త్రమయి శిరోమణి. మిగిలినవన్నీ దాని పిల్లలు. బ్రహ్మా వంశావళి వలె గీత ముఖ్యమైనది. తల్లిదండ్రులు ఉన్నతోన్నతమైనవారు, మిగిలినవారంతా పిల్లలు. ఇప్పుడు తల్లిదండ్రుల నుండి వారసత్వం లభిస్తుంది. మిగిలిన శాస్త్రాలు ఎన్ని చదివినా, ఏమి చేసినా సరే, వారసత్వం లభించదు. మహా అయితే, శాస్త్రాలు చదివేవారికి చాలా సంపాదన ఉంటుంది. కానీ అది అల్పకాలికమైనది. ఇక్కడ పిల్లలైన మీరు వింటున్నారంటే, ఎంత సంపాదిస్తారు – 21 జన్మల కోసం సంపాదిస్తారు, ఆలోచించండి. అక్కడ ఒకరు వినిపిస్తారు, అందరూ వారికి డబ్బులు ఇస్తారు. ఇక్కడ పిల్లలైన మీకు తండ్రి వినిపిస్తారు – మీరు 21 జన్మలకు ఎంత షావుకారులుగా అవుతారు. అక్కడ వినిపించేవారి జేబులు నిండిపోతాయి. భక్తి మొదలైనవి చేయడం ప్రవృత్తి మార్గం వారి పని. మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. స్వర్గ లోకంలో మీరు పూజ్యులుగా ఉండేవారని మీకు తెలుసు. లేదంటే 84 జన్మల లెక్క ఎక్కడ నుండి వస్తుంది? ఇది ఆత్మిక జ్ఞానము, ఇది జ్ఞాన సాగరుడైన పరమ ఆత్మ ద్వారా లభిస్తుంది. పతితపావనుడైన తండ్రి మాత్రమే సర్వుల సద్గతిదాత. వారు పిల్లలైన మనకు అమరకథను వినిపిస్తున్నారు. మీరు జన్మ-జన్మలుగా అసత్య కథలను వింటూ వచ్చారు. ఇప్పుడు సత్యమైన కథను విని మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. చంద్రుడిని 16 కళల సంపూర్ణుడని అంటారు, సూర్యుని కోసం అలా అనరు.
ఆత్మలైన మనం భవిష్యత్తులో సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా అవుతామని మీకు తెలుసు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత మాలిన్యం ఏర్పడుతుంది. మనం మళ్ళీ సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపన్నులుగా……. అనగా దేవతలుగా మళ్ళీ తయారవుతున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఆత్మలైన మనం ముందు మన ఇంటికి వెళ్తాము, తర్వాత మనం శరీరాన్ని ధరించి దేవతలుగా అవుతాము, ఆ తర్వాత చంద్రవంశంలోకి వస్తాము. 84 జన్మల లెక్క ఉండాలి. ఏ యుగంలో ఎన్ని జన్మలు తీసుకున్నామని తండ్రి మనకు 84 జన్మల సత్యాతి-సత్యమైన కథను ఇప్పుడు వినిపించారు. భారతవాసులైన మీరు 84 జన్మలు తీసుకుంటారని ఇప్పుడు పిల్లలైన మీకు చెప్తారు. ముందు స్వయాన్ని బ్రాహ్మణులమని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మమ్మా-బాబా అని అంటారు కదా. బ్రహ్మాబాబా ద్వారా శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. బ్రహ్మా కూడా శివబాబాకు చెందినవారిగా అయ్యారు. బ్రహ్మా నుండి వారసత్వం లభించదు. వీరు కూడా సోదరుడు అయినట్లు. వీరు శరీరధారి కదా. పిల్లలైన మీరంతా శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. వీరి నుండి (బ్రహ్మా నుండి) కాదు. ఎవరి నుండి అయితే వారసత్వాన్ని పొందమో, వారిని స్మృతి చేయకూడదు. ఒక్క శివబాబానే స్మృతి చేయాలి. మీరే తల్లి-తండ్రి, మేము మీ పిల్లలమని వారినే అంటారు. మీరు వీరి వద్దకు వెళ్ళినప్పుడు, శివబాబా వద్దకు వెళ్తున్నామని బుద్ధిలో ఉంటుంది. ఒక్క శివబాబాను మాత్రమే స్మృతి చేయాలి. ఆత్మ బిందువు, ఆత్మలో 84 జన్మల పాత్ర నిశ్చయించబడి ఉంది. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది. క్షణంలో ఎగురుతుంది. ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాను. భృకుటి మధ్యలోకి వెళ్ళి విరాజమానమవుతాను. నా ఆత్మ ఈ విధంగా ఉంది అన్న వివేకం బుద్ధిలో ఉంది. సత్యయుగంలో ఇటువంటి వస్తువు (ఆత్మ) ను చూడాలనే ఆశ ఉండదు. ఆత్మను దివ్యదృష్టి ద్వారా చూడగలరు. ఈ కళ్ళతో చూసే విషయమేమీ కాదు. భక్తి మార్గంలోనే సాక్షాత్కారాలు కలుగుతాయి. రామకృష్ణుని శిష్యుడు వివేకానందుడు. అతను – నేను రామకృష్ణుని ఎదురుగా కూర్చొన్నప్పుడు వారి ఆత్మ బయటకు వచ్చి నాలో ప్రవేశించింది – అని చెప్పారు. కానీ అలాగేమీ జరగదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది అనే విషయాలన్నింటినీ పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. మనం అమరలోకంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నామని, అమరలోకంలో జన్మ తీసుకుంటామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అక్కడ మనం గర్భ మహల్ లో ఉంటాము. ఇక్కడ గర్భ జైలులో చాలా దుఃఖపడుతూ రక్షించమని వేడుకుంటూ ఉంటారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని అర్ధకల్పం కోసం అన్ని దుఃఖాల నుండి విడిపిస్తారు. కావున ఇటువంటి తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి. అచ్ఛా.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ, ఆత్మిక తండ్రి నుండి చదువుకొని, పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. సత్య ఖండానికి యజమానులుగా అయ్యేందుకు సత్యమైన కథను వినాలి మరియు వినిపించాలి.
2. ఏ తండ్రి నుండి అయితే అనంతమైన వారసత్వం లభిస్తుందో, వారినే స్మృతి చేయాలి. ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు. ఈ పాత ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది, అందుకే దీనిని చూస్తూ కూడా చూడకూడదు.
వరదానము:-
ఏ పిల్లలైతే ఇనుప సంకెళ్ళ బంధనాలను మరియు సూక్ష్మ దారాల బంధనాలను తెంచుకొని బంధనముక్త స్థితిలో ఉంటారో, వారు కలియుగంలోని స్థూల వస్తువుల పట్ల ఆకర్షణ మరియు మనసు యొక్క ఆకర్షణ నుండి ముక్తులైపోతారు. వారిని దేహాభిమానం లేదా దేహానికి సంబంధించిన పాత ప్రపంచంలోని వస్తువేదీ కొద్దిగా కూడా ఆకర్షించదు. ఏ ఇంద్రియాల రసం అనగా వినాశీ రసం వైపు ఆకర్షణ లేనప్పుడు అలౌకిక అతీంద్రియ సుఖము మరియు మనోరస స్థితి అనుభవమవుతుంది. దీని కోసం నిరంతర మన్మనాభవ స్థితి కావాలి.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!