10 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

July 9, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీ స్వధర్మంలో స్థితులై పరస్పరంలో ప్రేమగా ఒకరికొకరు ఓం శాంతి అని చెప్పుకోండి. ఇది కూడా ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకోవడము”

ప్రశ్న: -

భక్తిలో కూడా భగవంతునికి భోగ్ సమర్పిస్తారు, ఇక్కడ పిల్లలైన మీరు కూడా భోగ్ పెడతారు – ఈ ఆచారం ఎందుకు ఉంది?

జవాబు:-

ఎందుకంటే భోగ్ సమర్పించడం కూడా వారికి గౌరవాన్ని ఇవ్వడమే. శివబాబా నిరాకారుడు, అభోక్త అని మీకు తెలుసు. వారు తినరు కానీ భావన అయితే వారికి చేరుతుంది. తండ్రి సర్వుల సద్గతిదాత, పతితపావనుడు. కనుక తప్పకుండా వారికి భోగ్ కూడా సమర్పించాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

 మా తీర్థము అతీతమైనది….. (హమారే తీర్థ్ న్యారే హై…..)

ఓంశాంతి. పిల్లల మనసులో కూడా ఓం శాంతి అని మాట వచ్చింది. ఎలాగైతే ఎవరికైనా నమస్తే చెప్పినప్పుడు, వారు కూడా రిటర్న్ లో నమస్తే అని అంటారు. ఇక్కడ తండ్రి ఓం శాంతి అని అన్నారు కనుక వీరి (బ్రహ్మా) ఆత్మ సహితంగా పిల్లలందరి మనసు నుండి ఓం శాంతి అని వస్తుంది, అనగా నేను ఆత్మను, శాంత స్వరూపాన్ని. రెస్పాన్స్ (బదులు) ఇవ్వాలి కదా. ఇది రెస్పాన్స్ కదా. ఇతరులెవ్వరూ ఇలా అర్థ సహితంగా చెప్పలేరు. జ్ఞాన సూర్యుడైన తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు. జ్ఞాన చంద్రుడు కూడా ఓం శాంతి అని అంటారు. జ్ఞాన నక్షత్రాలు కూడా ఓం శాంతి అని అంటారు. నక్షత్రాలు అని అన్నప్పుడు అందులో అందరూ వచ్చేస్తారు. మేము శాంత స్వరూపులము మరియు శాంతిధామ నివాసులము – అని ఇప్పుడు పిల్లలైన మీకు మీ స్వధర్మం గురించి తెలిసింది. ఆత్మ గురించి మంచి రీతిగా తెలుసునని మీకు నిశ్చయం ఏర్పడింది. తప్పకుండా మహానాత్మ, పాపాత్మ అని కూడా అంటూ ఉంటారు. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. కానీ ఆత్మ యొక్క యథార్థ పరిచయం ఎవరికీ తెలియదు. ఆత్మలైన మనం చాలా చిన్నగా ఉంటాము, 84 జన్మల పాత్రను అభినయిస్తాము. ఇంతకుముందు ఈ విషయాలు మీకు తెలియవు, ఇతరులకు కూడా తెలియవు. ఇప్పుడు పిల్లలైన మీరు సమ్ముఖంగా కూర్చున్నారు. తండ్రిని మీ వారిగా చేసుకుంటారు. పిల్లలు వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రిని తమవారిగా చేసుకుంటారు.

ఆత్మలైన మన అనంతమైన తండ్రి ఈ బ్రహ్మా తనువులోకి వచ్చి ఉన్నారని, బ్రహ్మా తనువులోకి వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. కల్ప క్రితం కూడా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అనగా సూర్యవంశీ రాజధాని స్థాపన అయ్యింది. ఈ స్థాపనా కార్యాన్ని కల్ప-కల్పము తండ్రియే చేస్తారు, వారిని భగవంతుడు అని అంటారు. దుఃఖం హరించండి, సుఖం ఇవ్వండి అని తండ్రి అయిన భగవంతుడిని అందరూ అడుగుతారు. సుఖం లభించినప్పుడు ఇక అడగాల్సిన అవసరముండదు. ఇక్కడ అడుగుతారు, ఎందుకంటే దుఃఖముంది. అక్కడ ఏమీ అడగాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే తండ్రి తమదంతా ఇచ్చి వెళ్తారు, అందుకే సత్యయుగంలో ఎవరూ తండ్రిని స్మృతి చేయరు. నేను పిల్లలను సుఖధామానికి యజమానులుగా చేస్తానని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ బాబా నుండి మనం మళ్ళీ సుఖధామం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖం తీసుకుంటారు. భక్తి మార్గం ఎలా నడుస్తుంది, మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క ఉత్పత్తి, పాలన మరియు వినాశనం ఎలా జరుగుతాయి, డ్రామా ఆది మధ్యాంతాలు ఏమిటి అనేవి మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇది సాకార ప్రపంచం, అది నిరాకారి ప్రపంచం. తాము అర్ధకల్పమంతా భక్తి చేసారని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడిది కలియుగాంతము. వారసత్వం సంగమంలోనే లభిస్తుంది. ఈ విషయాలను పిల్లలు మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారని పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. పరిచయమివ్వనంత వరకు ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. పాత ప్రపంచం మారి కొత్తదిగా అయినప్పుడు, సంగమయుగం తప్పకుండా వస్తుంది. ఇదంతా పాత ప్రపంచము, దీనిని ఇనుప యుగమని అంటారు. మొట్టమొదట ప్రపంచమంతటా ఒకే ధర్మముంటుందని కూడా మీకు తెలుసు. కొత్త ప్రపంచంలో కేవలం భారత ఖండము మాత్రమే ఉంటుంది, కొద్దిమంది మనుష్యులే ఉంటారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గమని అంటారు. కొత్త ప్రపంచంలో కొత్త భారత్ ఉండేదని దీని ద్వారా ఋజువవుతుంది. ఇప్పుడు పాత ప్రపంచంలో పాత భారత్ ఉంది. కొత్త ప్రపంచం, కొత్త భారత్ ఉండాలని, కొత్త ఢిల్లీ ఉండాలని గాంధీ కూడా అనేవారు. ఇప్పుడు కొత్త భారత్ లేక కొత్త ఢిల్లీ లేదు. కొత్త భారత్ లో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. ఇప్పుడు అదే భారత్ లో రావణ రాజ్యముంది. కొత్త ప్రపంచం, కొత్త ఢిల్లీ, ఫలానా సమయం నుండి ఫలానా సమయం వరకు ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది అని కూడా రాయాలి. కొత్త ప్రపంచాన్ని తయారుచేసేవారే ఈ విషయాలను అర్థం చేయించగలరు. బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తారు, ఆ స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు వస్తారు. తండ్రి మీకు యుక్తులను తెలియజేస్తారు అనగా పురుషార్థం చేయిస్తారు. సమ్ముఖంగా కలుసుకునేందుకు కూడా వస్తారు మరియు అక్కడ కూర్చుని కూడా చదువుకుంటారు. సమ్ముఖంగా కలవాలని మనసు కలుగుతుంది. అక్కడ మనుష్యులు, మనుష్యులను సమ్ముఖంగా కలుస్తూ ఉంటారు. ఇక్కడ మీరు – మేము శివబాబాను కలుసుకునేందుకు వెళ్తున్నామని అంటారు. వారు నిరాకారుడు కదా అని అంటారు. ఆత్మలైన మనం కూడా నిరాకారియే. మనం కూడా పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తాము కదా. ఎవరికైతే పేరు ఉంటుందో, వారు తప్పకుండా పాత్రధారియై ఉంటారు. భగవంతుడికి కూడా పేరు ఉంది కదా. నిరాకార శివుడినే భగవంతుడని అంటారు. వేరెవ్వరినీ భగవంతుడని అనరు. భగవంతుడు అని నిరాకారుడినే అంటారు. వారికి పూజ జరుగుతుంది, ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది. రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు కదా. వారు మట్టితో సాలిగ్రామాలను తయారుచేస్తారు. రాతితోనైనా లేక మట్టితోనైనా తయారుచేయవచ్చు. మట్టితో చేసిన వాటిని పగలగొట్టడం మరియు మళ్ళీ తయారుచేయడం సులువుగా ఉంటుంది. ప్రపంచంలోని వారికి ఈ విషయాల గురించి తెలియదు. రుద్ర యజ్ఞంలో ఎంతమంది ఆత్మల పూజ చేయవచ్చు. పిల్లలైతే చాలా మంది ఉన్నారు. భక్తులందరూ భగవంతుని పిల్లలు, తండ్రిని స్మృతి చేస్తారు. శివబాబా భారత్ లోనే వస్తారని బాబా అర్థం చేయించారు. కొద్దిమంది పిల్లలైన మీరు మాత్రమే భగవంతునికి సహాయకులుగా, ఈశ్వరీయ సేవాధారులుగా అవుతారు, భక్తులు వారికి మాత్రమే సాలిగ్రామాలను తయారుచేసి పూజిస్తారు. ఏ యజ్ఞాలనైతే రచిస్తారో, వాటిలో చిన్న యజ్ఞాలు కూడా ఉంటాయి, పెద్దవి కూడా ఉంటాయి. పెద్ద షావుకార్లు పెద్ద యజ్ఞాలను రచిస్తారు. లక్షలాది సాలిగ్రామాలను తయారుచేస్తారు. చిన్న యజ్ఞమైతే 5-10 వేలు తయారుచేస్తారు. సేఠ్ ను బట్టి యజ్ఞముంటుంది మరియు దాని బట్టి సాలిగ్రామాలను తయారుచేస్తారు. ఒకరు శివుడు, మిగిలినవి సాలిగ్రామాలు తయారుచేస్తారు, మళ్ళీ అంతమంది బ్రాహ్మణులు కూడా కావాలి. చాలా మంది యజ్ఞాలను చూసి ఉంటారు. బాబా పిల్లలైన మనకు సేవ చేస్తున్నారని, మనం మళ్ళీ ఇతరుల సేవను చేస్తామని, అందుకే పూజ జరుగుతుందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు పూజ్యులుగా అవుతారు. బాబా, మీరైతే సదా పూజ్యులు, మమ్మల్ని కూడా పూజ్యులుగా చేస్తున్నారు అని ఆత్మ అంటుంది. పూజ్యాత్మలైన మీరు శరీరాలను తీసుకున్నప్పుడు పూజ్య దేవీ-దేవతలని అంటారు. ఆత్మయే పూజ్యముగా మరియు పూజారిగా అవుతుంది. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. తండ్రి మళ్ళీ ఎప్పుడూ ఆత్మలను చదివించడమనేది జరగదు. ఆత్మయే వింటుంది. ఎలాగైతే ఆత్మ శరీరం ద్వారా వింటుందో, అలా పరమపిత పరమాత్మ, సుప్రీమ్ ఆత్మ కూడా శరీరాన్ని ఆధారంగా తీసుకొని వీరి (బ్రహ్మా) ద్వారా వింటారు. వీరి ద్వారా మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. వారికి తమ శరీరమంటూ లేదు. బ్రహ్మా-విష్ణు-శంకరులకు కూడా తమ-తమ సూక్ష్మ శరీరాలున్నాయి. ఇక్కడైతే అందరికీ తమ-తమ శరీరాలున్నాయి. ఇది సాకార ప్రపంచము. శివబాబా నిరాకారుడు. వారు జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు కూడా. వారు వచ్చి అందరినీ పతితుల నుండి పావనంగా చేస్తారు. ఇందులో ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. ఒకవేళ నేను ప్రేరణతోనే పావనంగా చేయాల్సి వస్తే, ఇక ఇక్కడకు వచ్చి రథాన్ని తీసుకునే అవసరమేముంది? శివుని మందిరంలో వారి ఎదురుగా ఎద్దును (నంది) పెడతారు. మనుష్యుల బుద్ధి పూర్తిగా రాతి బుద్ధి వలె అయిన కారణంగా ఏమీ అర్థం చేసుకోరు. శివుని ఎదురుగా ఎద్దును ఎందుకు పెట్టారు? గోశాల అనే పేరు వినేసరికి ఎద్దును పెట్టేసారు. ఇప్పుడు ఎద్దుపై ఎవరు స్వారీ చేసారు! కృష్ణుని ఆత్మ సత్యయుగంలో ఉంటుంది. వారికి జంతువులోకి వచ్చి కూర్చునే అవసరం ఏముంటుంది? ఏమీ అర్థం చేసుకోరు. ద్రౌపది కూడా ఒక్కరు మాత్రమే కాదు. ఆ తండ్రిని పిలిచేవారు ఎంతోమంది ఉన్నారు. శ్రీ కృష్ణుడు చీరలు ఇస్తూ ఉన్నట్లుగా, వారు ఒక నాటకాన్ని తయారుచేసారు. దాని అర్థమేమీ తెలియదు. మీరు 21 జన్మల వరకు వివస్త్రగా అవ్వరని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఎక్కడి విషయాన్ని ఎక్కడకు తీసుకువెళ్ళారు! భక్తి మార్గంలో అనేక కథలున్నాయి. ఈ కథలు మొదలైనవన్నీ అనాదిగా ఉన్నాయని అంటారు. పునర్జన్మలు తీసుకుంటూ కథలు వింటూ వచ్చారు. అనాది అన్నా కూడా, ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది అనేది ఏమీ తెలియదు. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అనేది కూడా తెలియదు. దాని గురించి వర్ణన ఏమీ లేదు. మీరు ఎంత సేవ చేస్తారు! ఆ సూర్య, చంద్ర, నక్షత్రాలు మొదలైనవి ఎలాగూ ఉన్నాయి. అవి సత్యయుగంలో కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. వాటిలో మార్పు-చేర్పులు ఉండవు. ఇప్పుడు మీరు మళ్ళీ భారత్ నే అంధకారం నుండి బయటకు తీసి ప్రకాశంలోకి తీసుకువచ్చేందుకు నిమిత్తులయ్యారు. భక్తి మార్గాన్ని అంధకారమని అంటారు. మీరు ధరిత్రి సితారలు అని మీకు మహిమ ఉంది. నక్షత్రాలుంటే సూర్య-చంద్రులు కూడా ఉండాలి.

ఇది మీ ఆత్మిక తీర్థ స్థానము. మీరు ఎటువంటి యాత్రకు వెళ్తున్నారంటే, అక్కడ నుండి మళ్ళీ ఈ మృత్యులోకములోకి రారు. ఇప్పుడిది మృత్యులోకము, మళ్ళీ ఇక్కడే అమరలోకముంటుంది. ద్వాపరం నుండి మృత్యులోకం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు అమరలోకములోకి వెళ్ళేందుకు, సత్యాతి-సత్యమైన అమరకథను వింటున్నారు. ఆత్మలైన మన యాత్ర అతీతమైనదని మీరు అర్థం చేసుకున్నారు. మీరిక్కడ కూర్చొని, యాత్ర చేసే పురుషార్థం చేస్తారు. స్మృతితోనే మీ వికర్మలు వినాశనమవుతాయి. వారు యాత్రలకు వెళ్తారు కానీ వికర్మలు ఎక్కడ వినాశనమవుతాయి. మనుష్యులకు మద్యం సేవించే అలవాటు ఎంతగా ఉంటుందంటే, దానిని యాత్రలకు వెళ్ళేటప్పుడు కూడా దాచిపెట్టి తప్పకుండా తీసుకువెళ్తారు. ఈ రోజుల్లో యాత్రలలో చాలా అశుద్ధమైనవారు కూడా ఉంటారు. వాస్తవానికి అందరూ పతితులే కదా. ఎలాగైతే ఆ పూజారి బ్రాహ్మణులు పతితంగా ఉన్నారో, అలా యాత్రికులు కూడా పతితంగానే ఉన్నారు. ఆ పండాలు యాత్రలు చేయిస్తారు కానీ పావనంగా ఉండరు. మీరైతే పవిత్రంగా ఉంటారు. మీరు సత్యమైన బ్రాహ్మణులు. మీ ఆత్మ పవిత్రంగా ఉంటుంది. స్మృతి యాత్రతోనే మీరు పవిత్రంగా అవుతారు. సతోప్రధానముగా అవ్వాలి. మధురమైన పిల్లలూ, అని బాబా పదే పదే రాస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే, మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయి, సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారని శివబాబా ఆత్మలకు రాసారు. కేవలం ఒక్క డైరెక్షనే ముఖ్యమైనది. ఇది ఎంత సహజమైనది. స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చేయకపోతే వికర్మలు వినాశనమవ్వవు, ఇక శిక్షలు అనుభవిస్తారు. బాబా అంటారు – మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, సంపాదన చేసుకోవచ్చు. లేవండి, కూర్చోండి, తినండి, కేవలం తండ్రిని స్మృతి చేయండి. ఇది మీ సంపాదన. పిల్లలకైతే ఇంకా సహజము. ఇందులో వారికి అటెన్షన్ మొదలైనవాటి విషయమేమీ లేదు. శ్రీనాథుని మందిరంలో శ్రీనాథుని స్మృతిలో కూర్చుంటారు. భోగ్ పెడతారు. వాస్తవానికి అది రాతి మూర్తియే కదా. భోగ్ కూడా ఎవరికి పెట్టాలి? అధికారి అయితే ఒక్క శివబాబా మాత్రమే. వారు సర్వుల సద్గతిదాత, పతితపావనుడు. తండ్రి అంటారు – నేనైతే స్వీకరించనే స్వీకరించను. మీరు నాకు అభిషేకం కూడా నీళ్ళు కలిపిన పాలతో చేస్తారు. నాకు ఈ భోగ్ ఎందుకు పెడతారు? నేను నిరాకారుడను, అభోక్తను! నన్ను ఎలా పూజిస్తారు? నా ఎదురుగా భోగ్ ను ఉంచుతారు, కానీ భక్తులు భోగ్ పెడతారు, తర్వాత వారే పంచుకుని తింటారు. శివబాబాకైతే తప్పకుండా భోగ్ పెట్టాలని మీకు తెలుసు. తర్వాత మీరు అది పంచుకుని తింటారు. ఇది వారి పట్ల గౌరవాన్ని ఉంచడము. మనం శివబాబాకు భోగ్ సమర్పిస్తాము. ఇది శివబాబా భండారా కదా. ఎవరి భండారానో, వారికి తప్పకుండా భోగ్ పెట్టవలసి ఉంటుంది. మీరు భోగ్ పెడతారు కానీ తినేది కూడా పిల్లలైన మీరే. ఈ బ్రహ్మా తింటారు, నేను తినను. ఇకపోతే, భావన అయితే చేరుకుంటుంది కదా. చాలా మంచి భోగ్ తయారుచేసారు అని అనేందుకు బ్రహ్మాకు కర్మేంద్రియాలైతే ఉన్నాయి కదా. ఈ బ్రహ్మా తినగలరు. ఈ శరీరమైతే వీరిదే కదా. నేను కేవలం వీరిలో ప్రవేశిస్తాను. పిల్లలైన మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసేందుకు, వీరి నోటిని మాత్రమే ఉపయోగిస్తాను. గోముఖం అని కూడా అంటారు కదా. తప్పకుండా గోవు కూడా ఉంది. వీరి ద్వారానే పిల్లలైన మిమ్మల్ని దత్తత తీసుకుంటానని మీకు తెలుసు. తల్లి-తండ్రి, ఇరువురూ వీరే. కానీ మాతలను ఎవరు సంభాళించాలి! అందుకే డ్రామా ప్లాన్ అనుసారంగా, సరస్వతిని నిమిత్తంగా పెట్టారు. మాతా గురువుకు మహిమ కూడా ఉండాలి కదా. మొదటి నంబరు గురువుగా వీరు ప్రసిద్ధి చెందారు. గురు బ్రహ్మా అని అనడము సరైనదే. తండ్రి ఎలా ఉంటారో, పిల్లలు కూడా అలాగే ఉంటారు. బ్రాహ్మణులైన మీరు కూడా సత్యమైన గురువులుగా అవుతారు. అందరికీ స్వర్గం యొక్క సత్యమైన మార్గాన్ని తెలియజేస్తారు. మన్మనాభవ, మధ్యాజీభవ అని ఆత్మయే నోటి ద్వారా మార్గాన్ని తెలియజేస్తుంది. తల్లి, తండ్రి, పిల్లలు అందరూ అదే మార్గాన్ని తెలియజేస్తారు. ఇక్కడ మీరు సమ్ముఖంగా కూర్చున్నారు, స్మృతి ఉంటుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే, చాలా మంది పిల్లలు మర్చిపోతారు. బాబా వద్దకు వచ్చామని ఇక్కడ ఆనందము కలుగుతుంది. బాబా అంటారు – స్వదర్శన చక్రధారులుగా అయి, ముక్తిధామాన్ని, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అనే యుక్తిని తెలియజేయండి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పరస్పరంలో ఒకరికొకరు మరియు తండ్రికి యథార్థమైన గౌరవాన్నివ్వాలి. తండ్రి అభోక్త అయినా కానీ, ఎవరి భండారా నుండైతే పాలన జరుగుతుందో, ముందు వారికి తప్పకుండా స్వీకరింపజేయాలి.

2. పూజ్యనీయులుగా అయ్యేందుకు ఈశ్వరీయ సేవాధారులుగా అవ్వాలి. సేవలో తండ్రికి సహాయకులుగా అవ్వాలి. ఆత్మ మరియు శరీరం, రెండూ పావనంగా అయినప్పుడే పూజ జరుగుతుంది.

వరదానము:-

ఈ సమయంలో సంగమయుగీ శ్రేష్ఠాత్మలైన మీ ప్రతి శ్రేష్ఠ కర్మ మొత్తం కల్పానికి నియమములా తయారవుతుంది. కనుక స్వయాన్ని నియమము యొక్క రచయితగా భావిస్తూ ప్రతి కర్మ చేయండి. దీనితో నిర్లక్ష్యం స్వతహాగా సమాప్తమైపోతుంది. సంగమయుగంలో మేము నియమము యొక్క రచయితలము, బాధ్యత కల ఆత్మలము – ఈ నిశ్చయంతో ప్రతి కర్మను చేసినట్లయితే, యథార్థ విధి ద్వారా చేసిన కర్మలకు, సంపూర్ణ సిద్ధి తప్పకుండా ప్రాప్తిస్తుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top