10 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

10 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

9 January 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - శ్రీమతంపై మీరు అందరికీ ఆత్మిక మర్యాద ఇవ్వాలి, సంతోషం యొక్క ఔషధాన్ని తినడం మరియు తినిపించడం, ఇదే సత్యమైన ఆత్మిక మర్యాద ఇవ్వడము’’

ప్రశ్న: -

జ్ఞానంలో ఆధ్యాత్మికత యొక్క పదును నింపేటువంటి విధి ఏమిటి, దాని వలన ఏమేమి లాభాలు ఉంటాయి?

జవాబు:-

ఎవరికైనా జ్ఞానం వినిపించేటప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ, ఆత్మకు జ్ఞానాన్ని ఇవ్వండి, దీని ద్వారా ఆధ్యాత్మికత యొక్క పదును నిండుతుంది. ఈ కొత్త అలవాటుతో ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించినట్లయితే వారికి వెంటనే గురి కుదురుతుంది. శరీర భానం కూడా సమాప్తం అవుతూ ఉంటుంది. ఇక తర్వాత మాయా తుఫాన్లు లేక చెడు సంకల్పాలు కూడా రావు. వికారీ దృష్టి కూడా ఉండదు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. జ్ఞానం యొక్క మూడవ నేత్రం ఇచ్చేటువంటి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది. ఈ పాత ప్రపంచం మారనున్నది అని ఇప్పుడు మీకు తెలుసు. ఎవరు మార్చనున్నారు మరియు ఎలా మార్చనున్నారు అనేది పాపం మనుష్యులకు తెలియదు ఎందుకంటే వారికి జ్ఞానం యొక్క మూడవ నేత్రమే లేదు. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది, దీని ద్వారా మీరు సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇది జ్ఞానం యొక్క శ్యాక్రీన్. శ్యాక్రీన్ యొక్క ఒక బిందువు కూడా ఎంత మధురంగా ఉంటుంది. జ్ఞానం యొక్క పదం కూడా ఒక్కటే, మన్మనాభవ. ఈ పదం అన్నింటికన్నా ఎంత మధురమైనది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. తండ్రి శాంతిధామం మరియు సుఖధామం యొక్క మార్గాన్ని తెలియజేస్తున్నారు. తండ్రి పిల్లలకు స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. కావున పిల్లలకు ఎంత సంతోషముండాలి. సంతోషం వంటి ఔషధం లేదు అని అంటారు కూడా. ఎవరైతే సదా సంతోషంలో, ఆనందంలో ఉంటారో, వారికి అది ఔషధంలా ఉంటుంది. 21 జన్మలు ఆనందంలో ఉండేందుకు ఇది శక్తిశాలి ఔషధము. ఈ ఔషధాన్ని సదా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి. ఈ అత్యంత మర్యాదను ఒకరికొకరు ఇచ్చుకోవాలి. ఇటువంటి మర్యాదను మనుష్యులు ఎవ్వరూ మనుష్యులకు ఇవ్వలేరు.

పిల్లలైన మీరు శ్రీమతంపై అందరికీ ఆత్మిక మర్యాదను ఇస్తారు. ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే సత్యాతి-సత్యమైన క్షేమ సమాచారము. అనంతమైన తండ్రి ద్వారా మాకు జీవన్ముక్తి యొక్క ఔషధం లభిస్తుంది అని మధురమైన పిల్లలకు తెలుసు. సత్యయుగంలో భారత్ జీవన్ముక్తిగా ఉండేది, పావనంగా ఉండేది. తండ్రి చాలా గొప్ప, ఉన్నతమైన ఔషధాన్ని ఇస్తారు. అందుకే, అతీంద్రియ సుఖం గురించి అడగాలి అంటే గోప-గోపికలను అడగండి అని గాయనం ఉంది. ఈ జ్ఞానం మరియు యోగం యొక్క ఔషధం ఎంత ఫస్ట్ క్లాస్, అద్భుతమైనది, మరియు ఈ ఔషధం ఒకే ఆత్మిక సర్జన్ వద్ద ఉంది, ఇంకెవరికీ ఈ ఔషధం గురించి తెలియనే తెలియదు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలూ, మీ కోసం అరచేతిలో కానుకను తీసుకొచ్చాను. ముక్తి, జీవన్ముక్తి యొక్క ఈ కానుక నా వద్ద మాత్రమే ఉంటుంది. కల్ప-కల్పము నేనే వచ్చి మీకు ఇస్తాను. తర్వాత రావణుడు లాక్కుంటాడు. మరి ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతగా సంతోషం యొక్క పాదరసం ఎక్కి ఉండాలి. మాకు ఒకే తండ్రి, శిక్షకుడు మరియు సత్యాతి-సత్యమైన సద్గురువు ఉన్నారు, వారే మమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్తారు అని మీకు తెలుసు. అతి ప్రియమైన తండ్రి నుండి విశ్వం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది. ఇదేమైనా తక్కువ విషయమా! కావున సదా హర్షితంగా ఉండాలి. గాడ్లీ స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్ (ఈశ్వరీయ విద్యార్థి జీవితం అత్యుత్తమమైనది). ఇది ఇప్పటి గాయనమే కదా. ఇక తర్వాత, కొత్త ప్రపంచంలో కూడా మీరు సదా సంతోషాలు జరుపుకుంటూ ఉంటారు. సత్యాతి-సత్యమైన సంతోషాలు ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. మనుష్యులకైతే సత్యయుగం యొక్క జ్ఞానమే లేదు. కావున ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ పాత తమోప్రధాన ప్రపంచంలో సంతోషం ఎక్కడి నుండి వచ్చింది. ఇక్కడైతే ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఎంత దుఃఖపు ప్రపంచము.

తండ్రి పిల్లలైన మీకు ఎంత సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. కార్య వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటూ కూడా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. ఎలాగైతే ప్రియుడు మరియు ప్రేయసి ఉంటారు, వారైతే ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆమె అతనికి ప్రేయసి, అతను ఆమెకు ప్రియుడు. ఇక్కడ ఆ విషయం లేదు, ఇక్కడైతే మీరందరూ ఒక్క ప్రియునికి జన్మ-జన్మాంతరాలుగా ప్రేయసులుగా ఉంటారు. తండ్రి ఎప్పుడూ మీ ప్రేయసిగా అవ్వరు. మీరు ఆ ప్రియుడిని కలుసుకునేందుకు స్మృతి చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే దుఃఖం ఎక్కువగా ఉంటుందో, అప్పుడు ఎక్కువ స్మృతి చేస్తారు. దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు, సుఖంలో ఎవరూ చేయరు అనే గాయనం కూడా ఉంది. ఈ సమయంలో తండ్రి కూడా సర్వశక్తివంతుడు, అలాగే రోజు-రోజుకు మాయ కూడా సర్వశక్తివంతంగా, తమోప్రధానంగా అవుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు తండ్రి అంటారు, మధురమైన పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి మరియు దానితో పాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయండి, అప్పుడు మీరు ఇలా (లక్ష్మీ-నారాయణుల వలె) తయారవుతారు. ఈ చదువులో ముఖ్యమైన విషయమే స్మృతి. ఉన్నతోన్నతమైన తండ్రిని చాలా ప్రేమతో, స్నేహంతో స్మృతి చేయాలి. ఆ ఉన్నతోన్నతమైన తండ్రే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేయడానికి వచ్చాను, అందుకే ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, అప్పుడు మీ అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి. పతితపావనుడైన తండ్రి అంటారు, మీరు చాలా పతితంగా అయిపోయారు, అందుకే ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, అప్పుడు మీరు పావనంగా అయి పావన ప్రపంచం యొక్క యజమానులుగా అవుతారు. పతితపావనుడైన తండ్రినే పిలుస్తారు కదా. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున తప్పకుండా పావనంగా అవ్వాల్సి ఉంటుంది. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. తప్పకుండా సత్యయుగంలో పావన ప్రపంచం ఉండేది, అప్పుడు అందరూ సుఖంగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ అంటారు, పిల్లలూ, శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇది సంగమయుగము. నావికుడు మిమ్మల్ని ఈ తీరం నుండి ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. నావ అనేది కేవలం ఒక్కటే కాదు, మొత్తం ప్రపంచమంతా ఒక పెద్ద నావ వంటిది, దానిని ఆవలి తీరానికి తీసుకువెళ్తారు.

మధురమైన పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి. మీ కోసం అయితే సదా సంతోషమే సంతోషము. అనంతమైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు. వాహ్! ఇది ఎప్పుడూ వినలేదు, చదవలేదు. భగవానువాచ – నేను ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను కావున పూర్తి రీతిలో నేర్చుకోవాలి. ధారణ చేయాలి. పూర్తి రీతిలో చదువుకోవాలి. చదువులో నంబరువారుగా సదా ఉంటూనే ఉంటారు. తమను తాము చూసుకోవాలి – నేను ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా లేక కనిష్టంగా ఉన్నానా? తండ్రి అంటారు, తమను తాము చూసుకోండి, నేను ఉన్నత పదవి పొందేందుకు యోగ్యంగా ఉన్నానా? ఆత్మిక సేవ చేస్తున్నానా? ఎందుకంటే తండ్రి అంటారు, పిల్లలూ, సేవాధారులుగా కండి, ఫాలో చెయ్యండి. నేను సేవ కోసమే వచ్చాను. రోజు సేవ చేస్తాను, అందుకోసమే ఈ రథం తీసుకున్నాను. వీరి రథం అనారోగ్యంగా ఉన్నా సరే, నేను వీరిలో కూర్చొని మురళి రాస్తాను. నోటి ద్వారా మాట్లాడలేనప్పుడు నేను రాస్తాను, ఎందుకంటే పిల్లలకు మురళి మిస్ అవ్వకూడదు అని, కావున నేను కూడా సేవలో ఉన్నాను కదా. ఇది ఆత్మిక సేవ. మీరు కూడా తండ్రి సేవలో నిమగ్నమవ్వండి. ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్ (ఈశ్వరీయ సేవలో). తండ్రే మిమ్మల్ని మొత్తం విశ్వానికి యజమానులుగా చేయడానికి వచ్చారు, ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో, వారిని మహావీర్ అని అంటారు. బాబా డైరెక్షన్లపై నడిచే మహావీరులు ఎవరో చూడడం జరుగుతుంది. తండ్రి ఆజ్ఞ ఉంది – స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదరులను చూడండి. ఈ శరీరాన్ని మర్చిపోండి. బాబా కూడా శరీరాన్ని చూడరు. తండ్రి అంటారు, నేను ఆత్మలను చూస్తాను. ఇకపోతే, ఆత్మ శరీరం లేకుండా మాట్లాడలేదు అనే జ్ఞానమైతే ఉంది. నేను కూడా ఈ శరీరంలోకి వచ్చాను, అప్పుగా తీసుకోవడం జరిగింది. శరీరం ద్వారానే ఆత్మ చదవగలదు. బాబా కూర్చునేది ఇక్కడ. ఇది అకాల సింహాసనము. ఆత్మ అకాలమూర్తి. ఆత్మ ఎప్పుడూ చిన్నగా, పెద్దగా అవ్వదు, శరీరం చిన్నగా, పెద్దగా అవుతుంది. ఏవైతే ఆత్మలు ఉన్నాయో, వాటన్నింటి సింహాసనం ఈ భృకుటి మధ్య స్థానము. శరీరాలైతే అందరివీ భిన్న-భిన్నంగా ఉంటాయి. కొందరి అకాల సింహాసనం పురుషునిది, కొందరి అకాల సింహాసనం స్త్రీది. కొందరి అకాల సింహాసనము పిల్లలది. తండ్రి కూర్చొని పిల్లలకు ఆత్మిక డ్రిల్ నేర్పిస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మనైన నేను ఫలానా సోదరునితో మాట్లాడుతున్నాను. శివబాబాను స్మృతి చేయండి అనే తండ్రి సందేశాన్ని ఇస్తున్నాను. స్మృతితోనే తుప్పు తొలగుతుంది. బంగారంలో ఎప్పుడైతే మాలిన్యం చేరుతుందో, అప్పుడు బంగారం విలువ తగ్గిపోతుంది. ఆత్మలైన మీలో కూడా తుప్పు పట్టడంతో మీరు విలువలేని వారిగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి. ఆత్మలైన మీకు ఇప్పుడు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది. ఆ నేత్రంతో మీ సోదరులను చూడండి. సోదరులను చూడడంతో కర్మేంద్రియాలు ఎప్పుడూ చంచలమవ్వవు. రాజ్య భాగ్యాన్ని తీసుకోవాలి, విశ్వానికి యజమానులుగా అవ్వాలి అంటే ఈ శ్రమ చేయండి. సోదరులుగా భావిస్తూ అందరికీ జ్ఞానాన్ని ఇవ్వండి. అప్పుడిక ఈ అలవాటు పక్కా అయిపోతుంది. మీరందరూ సత్యాతి-సత్యమైన సోదరులు. తండ్రి కూడా పై నుండి వచ్చారు, మీరు కూడా అలాగే వచ్చారు. తండ్రి పిల్లల సహితంగా సేవ చేస్తున్నారు. తండ్రి సేవ చేసే ధైర్యాన్ని ఇస్తారు. పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం లభిస్తుంది. కావున ఆత్మనైన నేను సోదరుడిని చదివిస్తున్నాను అనే ప్రాక్టీస్ చేయాలి. ఆత్మ చదువుతుంది కదా. దీనిని ఆత్మిక జ్ఞానం అని అంటారు, ఇది ఆత్మిక తండ్రి నుండే లభిస్తుంది. సంగమంలోనే తండ్రి వచ్చి స్వయాన్ని ఆత్మగా భావించండి అనే జ్ఞానాన్నిస్తారు. మీరు నగ్నంగా వచ్చారు, తర్వాత ఇక్కడ శరీరాన్ని ధారణ చేసి మీరు 84 జన్మల పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి, అందుకే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదర దృష్టితో చూడాలి. ఈ శ్రమ చేయాలి. పిల్లలు తమ శ్రమను తాము చేయాలి, ఇతరులతో మనకేమిటి. దానం ఇంటి నుండి ప్రారంభమవుతుంది అనగా మొదట స్వయాన్ని ఆత్మగా భావిస్తూ, తర్వాత సోదరులకు అర్థం చేయించండి, అప్పుడు బాణం మంచి రీతిగా తగులుతుంది. ఈ పదును నింపుకోవాలి. శ్రమ చేస్తేనే ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి ఫలాన్ని ఇచ్చేందుకే వచ్చారు కనుక శ్రమించాల్సి ఉంటుంది. కొంత సహనము కూడా చేయాల్సి ఉంటుంది.

ఎవరైనా మిమ్మల్ని తప్పుగా ఏదైనా అంటే మీరు మౌనంగా ఉండండి. మీరు మౌనంగా ఉన్నట్లయితే ఇతరులు ఏం చేయగలరు. చప్పట్లు రెండు చేతులతో మోగుతాయి. ఒకరు నోటి ద్వారా చప్పట్లు మోగిస్తే, రెండవవారు మౌనంగా ఉంటే, మొదటివారు వారంతట వారే మౌనంగా అయిపోతారు. చేతికి చేయి కలిస్తేనే శబ్దం వస్తుంది. పిల్లలు పరస్పరం ఒకరికొకరు కళ్యాణం చేసుకోవాలి. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, సదా సంతోషంలో ఉండాలనుకుంటే మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. సోదరుల వైపు (ఆత్మలను) చూడండి. సోదరులకు కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ అలవాటు ఏర్పడితే, ఇక ఎప్పుడూ వికారీ దృష్టి మోసం చేయదు. జ్ఞానం యొక్క మూడవ నేత్రంతో మూడవ నేత్రాన్ని చూడండి. బాబా కూడా మీ ఆత్మనే చూస్తారు. సదా ఆత్మనే చూడాలి, శరీరాన్ని చూడనే చూడకూడదు అనే ప్రయత్నం చేయండి. యోగం చేయించేటప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదరులను చూస్తూ ఉన్నట్లయితే సేవ బాగా జరుగుతుంది. బాబా అన్నారు, సోదరులకు అర్థం చేయించండి. సోదరులందరూ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఈ ఆత్మిక జ్ఞానం ఒక్కసారి మాత్రమే బ్రాహ్మణ పిల్లలైన మీకు లభిస్తుంది. బ్రాహ్మణులైన మీరే మళ్ళీ దేవతలుగా అవ్వనున్నారు. ఈ సంగమ యుగాన్ని ఏమైనా వదిలేస్తారా, లేదంటే ఆవలి తీరానికి ఎలా వెళ్తారు, ఏమైనా దూకుతారా. ఇది అద్భుతమైన సంగమయుగము. కనుక పిల్లలు ఆత్మిక యాత్రలో ఉండే అలవాటు చేసుకోవాలి. ఇది మీకు లాభం కలిగించే విషయమే. తండ్రి ఇచ్చిన శిక్షణను సోదరులకు ఇవ్వాలి. తండ్రి అంటారు, నేను ఆత్మలైన మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఆత్మనే చూస్తాను. మనుష్యులు మనుష్యులతో మాట్లాడేటప్పుడు వారి ముఖాన్ని చూస్తారు కదా. మీరు ఆత్మతో మాట్లాడుతారు కనుక ఆత్మనే చూడాలి. జ్ఞానాన్ని శరీరం ద్వారా ఇస్తూ ఉండవచ్చు కానీ ఇందులో శరీర భానాన్ని తెంచాల్సి ఉంటుంది. పరమాత్మ తండ్రి మాకు జ్ఞానాన్ని ఇస్తున్నారు అని మీ ఆత్మ భావిస్తుంది. తండ్రి కూడా, నేను ఆత్మలను చూస్తాను అని అంటారు. ఆత్మలు కూడా మేము పరమాత్మ తండ్రిని చూస్తున్నాము అని అంటారు. వారి నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. దీనిని ఆత్మలు ఆత్మలకు ఇచ్చిపుచ్చుకునే ఆత్మిక జ్ఞానమని అంటారు. ఆత్మలోనే జ్ఞానం ఉంది. ఆత్మకే జ్ఞానం ఇవ్వాలి. ఇది పదును పెట్టడం వంటిది. మీ జ్ఞానంలో ఈ పదును నిండినట్లయితే, ఎవరికైనా అర్థం చేయించినప్పుడు వెంటనే బాణం తగులుతుంది. తండ్రి అంటారు, ఈ ప్రాక్టీస్ చేసి చూడండి, బాణం తగులుతుందా లేదా అని. ఈ కొత్త అలవాటు చేసుకున్నట్లయితే, ఇక శరీర భానం తొలగిపోతుంది. మాయా తుఫాన్లు తక్కువ వస్తాయి. చెడు సంకల్పాలు రావు. వికారీ దృష్టి కూడా ఉండదు. ఆత్మలమైన మనము 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చాము. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. ఇప్పుడు బాబా స్మృతిలో ఉండాలి. స్మృతి ద్వారానే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయి సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఎంత సహజము. పిల్లలకు ఈ శిక్షణ ఇవ్వడం కూడా నా పాత్ర అని తండ్రికి తెలుసు. ఇది కొత్త విషయమేమీ కాదు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత నేను రావాల్సి ఉంటుంది. ఇందుకు నేను బంధించబడి ఉన్నాను. పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తాను, మధురమైన పిల్లలూ, ఆత్మిక స్మృతి యాత్రలో ఉన్నట్లయితే అంతమతి సో గతి జరుగుతుంది (అంతిమ సమయంలో ఏ స్మృతితో చనిపోతారో, అటువంటి పుట్టుక లభిస్తుంది). ఇది అంతిమ సమయం కదా. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీకు సద్గతి లభిస్తుంది. స్మృతి యాత్రతో పాదం దృఢంగా అయిపోతుంది. దేహీ-అభిమానులుగా అయ్యే ఈ శిక్షణ పిల్లలైన మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఎంత అద్భుతమైన జ్ఞానము. బాబా అద్భుతమైనవారు కనుక బాబా జ్ఞానం కూడా అద్భుతమైనదే. దీనిని ఎప్పుడూ ఎవరూ తెలుపలేరు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి, అందుకే తండ్రి అంటారు, మధురమైన పిల్లలూ, ఈ ప్రాక్టీస్ చేయండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానం ఇవ్వండి. మూడవ నేత్రంతో సోదరులను చూడాలి. ఇందులోనే చాలా శ్రమ ఉంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానం యొక్క మూడవ నేత్రంతో ఆత్మను చూసే అభ్యాసం చేయాలి. సదా ఆత్మనే చూడాలి, శరీరాన్ని కాదు అనే ప్రయత్నం చేయాలి, అప్పుడు వికారీ ఆలోచనలు రావు. చెడు సంకల్పాలు సమాప్తమైపోతాయి.

2. చప్పట్లు రెండు చేతులతో మోగుతాయి కనుక ఎవరైనా మిమ్మల్ని తప్పుగా ఏదైనా అంటే, మీరు మౌనంగా ఉండండి. ఒకవేళ మీరు మౌనంగా ఉంటే, రెండవవారు తమంతట తామే మౌనంగా అయిపోతారు.

వరదానము:-

బ్రహ్మాబాబాపై మాకు చాలా ప్రేమ ఉంది అని అన్నట్లయితే, ప్రేమకు గుర్తు ఏమిటంటే, బాబాకు ఏది ప్రియమనిపిస్తే, దానిపై ప్రేమ ఉండాలి. ఏ కర్మ చేసినా సరే, కర్మకు ముందు, మాటకు ముందు, సంకల్పానికి ముందు, చెక్ చేసుకోండి, ఇది బ్రహ్మాబాబాకు ప్రియమైనదేనా? బ్రహ్మాబాబా యొక్క విశేషమైన విశేషత ఏమిటంటే – ఏది ఆలోచించారో అది చేసారు, ఏది చెప్పారో అది చేసారు. అపోజిషన్ ఉన్నా సరే, సదా తమ పొజిషన్ లో సెట్ అయి ఉన్నారు, కనుక ప్రేమకు ప్రాక్టికల్ ఋజువును ఇవ్వడం అనగా తండ్రిని అనుసరించి సుపుత్రులుగా, సమానంగా అవ్వటము.

స్లోగన్:-

లవలీన స్థితిని అనుభవం చేయండి

పరమాత్మ ప్రేమ తరగనిది, స్థిరమైనది, ఎంత ఉందంటే అది అందరికీ ప్రాప్తించగలదు. కానీ పరమాత్మ ప్రేమను ప్రాప్తి చేసుకునే విధి – అతీతంగా అవ్వడము. ఎంతగా అతీతంగా అవుతారో, అంతగా పరమాత్మ ప్రేమ యొక్క అధికారం ప్రాప్తిస్తుంది. ఇటువంటి అతీతమైన, ప్రియమైన ఆత్మలే లవలీన స్థితిని అనుభవం చేయగలరు.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top