10 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

9 August 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఘడియ-ఘడియ దేహీ-అభిమానిగా అయ్యే అభ్యాసం చేయండి - నేను ఆత్మను, ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాను, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి’’

ప్రశ్న: -

అన్నింటికన్నా ముఖ్యమైన పండుగ ఏది మరియు ఎందుకు?

జవాబు:-

అన్నింటికన్నా ముఖ్యమైన పండుగ రక్షాబంధనము ఎందుకంటే తండ్రి ఎప్పుడైతే పవిత్రత యొక్క రాఖీని కడతారో అప్పుడు భారత్ స్వర్గంగా అవుతుంది. ఈ పండుగను జరుపుకోవడం ఎప్పటి నుండి మొదలయ్యింది మరియు ఎందుకు అన్నది రక్షాబంధనం రోజు పిల్లలైన మీరు అందరికీ అర్థం చేయించవచ్చు. సత్యయుగంలో ఈ రక్షాబంధనము అవసరమే ఉండదు. కానీ వారు, ఈ రక్షాబంధనం అయితే పరంపరగా కొనసాగుతూ వచ్చిందని అంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

జయ జయ అంబ మాతా… (జయ జయ అంబే మా…)

ఓంశాంతి. ఇది కూడా భక్తి మార్గపు పాట. భక్తి మార్గములో అనేక రకాల మహిమలు జరుగుతాయి. మహిమ అనేది నిరాకారుడు, ఆకారుడు మరియు సాకారుడు ముగ్గురికీ జరుగుతుంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, మేము ఆత్మలము, మాకు అర్థం చేయించేవారు పరమపిత పరమాత్మ అని పిల్లలైతే అర్థం చేసుకున్నారు. సర్వ మనుష్యమాత్రులకు సద్గతినిచ్చేవారు ఒక్కరే. వారితో పాటు ఎవరైతే సేవ చేసేవారుంటారో, వారి మహిమను కూడా పాడుతారు. తండ్రి అయితే నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు. ఇప్పుడు పరమపిత పరమాత్మ మాకు సమ్ముఖంలో జ్ఞానాన్ని ఇస్తారని ఆత్మ భావిస్తుంది. ఆ తండ్రి యొక్క అవ్యభిచారి స్మృతినే ఉండాలి, ఇతరులెవ్వరి నామ రూపాల స్మృతి రాకూడదు. అందరూ ఆత్మలే. ఇకపోతే, శరీరం లభించడంతో శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి. ఆత్మకు ఏ పేరూ ఉండదు. శరీరానికే పేరు ఉంటుంది. తండ్రి అంటారు – నేను కూడా ఆత్మను. కానీ పరమ ఆత్మ అనగా పరమాత్మను. నాకు పేరైతే ఉంది కదా. నేను ఒక ఆత్మను. నేను ఎప్పుడూ శరీరాన్ని ధారణ చేయను, అందుకే నాకు శివ అని పేరు పెట్టడము జరిగింది, మిగిలినవారందరికీ శరీరాలకు పేర్లు ఉంటాయి, నాకు శరీరమైతే లేదు. పేరైతే కావాలి కదా. లేదంటే నేను కూడా ఆత్మనే అయితే మరి పరమాత్మ ఎవరు. నేను పరమ ఆత్మను, నా పేరు శివ. ఎవరైతే పూజలు చేస్తారో, వారు లింగానికే చేస్తారు. లింగం వలె ఉన్న రాతినే పరమాత్మ అని అంటూ ఉంటారు. ఎటువంటి భాషనో అటువంటి పేరు. కానీ విషయం ఒక్కటే. మీ ఆత్మ ఎలా ఉంటుందో, నాది కూడా అలాగే ఉంటుంది. మీరు కూడా బిందువు, నేను కూడా బిందువునే. బిందువైన నా పేరు శివ. గుర్తించడము కోసం పేరు అయితే కావాలి కదా. ఈ సమయంలో బ్రహ్మా-సరస్వతులు ఎవరైతే అందరికన్నా పెద్దవారో, వారికి కూడా సద్గతి లభిస్తుంది. సద్గతి అయితే ఆత్మలందరికీ లభించనున్నది. ఆత్మలందరూ పరంధామంలో ఉంటారు, అయినా కూడా పరమాత్మనైతే వేరుగా పెడతారు కదా. అందరికీ వారి-వారి పాత్ర లభించి ఉంది. మొత్తం రుద్ర మాల యొక్క బీజరూపుడు తండ్రి కదా. అందరూ వారిని ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి చేస్తారు. అన్ని చోట్ల తండ్రిని స్మృతి చేస్తారు, తల్లిని కాదు. వారు ఇక్కడ భారత్ లోనే వచ్చి పతితులను పావనంగా చేస్తారు. తల్లి కూడా దత్తత తీసుకోబడినవారే. సరస్వతిని కూడా పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా దత్తత తీసుకున్నారు, మళ్ళీ వీరిలో ప్రవేశించారు. ఈ దత్తత వేరే విధమైనది, ఎవరో ఒకరి ద్వారా జరగాల్సి ఉంటుంది కదా. వీరి ద్వారా నేను జ్ఞానాన్ని వినిపిస్తాను, వీరి ద్వారా పిల్లలను దత్తత తీసుకుంటానని అంటారు. కావున వీరు తల్లి అని కూడా ఋజువు అవుతుంది. ఇది ప్రవృత్తి మార్గము కదా. కానీ వీరు పురుషుడు, అందుకే ముఖ్యమైన సరస్వతిని తల్లి పదవిలో పెట్టడం జరుగుతుంది. ఇవి అర్థము చేసుకోవాల్సిన చాలా గుహ్యమైన రహస్యాలు. వీరు ప్రజాపిత కదా, ప్రజలను రచించేవారు. వీరి ద్వారా వారు రచిస్తారు, అంతేకానీ సరస్వతి ద్వారా ఎవరో దత్తత తీసుకుంటారని కాదు, అలా జరగదు. ఇది చాలా అర్థము చేసుకునే విషయము. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. పతిత-పావనా రండి అని పాడుతారు కూడా. ఇలా ఎవరు అన్నారు? ఆత్మ అన్నది ఎందుకంటే ఆత్మ మరియు శరీరము రెండూ పతితంగానే ఉన్నాయి. మొదట స్వయాన్ని ఆత్మగా భావించాలి. నేను శరీరాన్ని తీసుకుంటాను, విడిచిపెడతాను అని ఆత్మనే అంటుంది. ఒక్కొక్క విషయంపై నిశ్చయం కూర్చోబెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే కొత్త విషయము కదా. మిగిలినవారు ఎవరైతే వినిపిస్తారో, వారు మనుష్యులు. భగవంతుడైతే కాదు. ఎవరైనా వచ్చినప్పుడు మొట్టమొదట ఆత్మ మరియు శరీరము రెండు వస్తువులు అని అర్థం చేయించండి. ఆత్మ అవినాశీ. మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను మెజిస్ట్రేట్ ను అని ఇలా ఎవరు అన్నారు? ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా అంటుంది. నా శరీరానికి పేరు కూడా ఉంది మరియు మెజిస్ట్రేట్ అన్న పదవి కూడా ఉంది అని ఆత్మకు తెలుసు. ఈ శరీరాన్ని విడిచిపెడితే మెజిస్ట్రేట్ పదవి మరియు శరీరం యొక్క నామ రూపాలు అన్నీ మారిపోతాయి. పదవి కూడా వేరొకటి వస్తుంది. కావున మొట్టమొదట ఆత్మాభిమానిగా అవ్వాలి. మనుష్యులకైతే ఆత్మ జ్ఞానము కూడా లేదు. మొదట ఆత్మ జ్ఞానమిచ్చి తర్వాత ఆత్మ యొక్క తండ్రి అయితే పరమాత్మ అని అర్థం చేయించండి. ఆత్మ దుఃఖితముగా ఉన్నప్పుడు ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తుంది. వారే పతిత-పావనుడు. ఆత్మలందరూ పతితంగా అయ్యారు. కావున తప్పకుండా పరమపిత పరమాత్మకు పతిత ప్రపంచంలోకి మరియు పతిత శరీరంలోకి రావలసి ఉంటుంది. తండ్రి స్వయంగా అంటారు, దూరదేశంలో ఉన్న నన్ను పిలుస్తారు, ఎందుకంటే మీరు పతితంగా ఉన్నారు. నేను సదా పావనుడిని. భారత్ పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా ఉంది. పతిత-పావనుడైన తండ్రి వచ్చి ఆత్మలతో మాట్లాడుతారు. బ్రహ్మా తనువులోకి వచ్చి అర్థం చేయిస్తారు, అందుకే వీరికి ప్రజాపిత అన్న పేరు ఉంది. బ్రహ్మా ద్వారా ప్రజలను రచిస్తారు. ఏ ప్రజలను? తప్పకుండా కొత్త ప్రజలను రచిస్తారు. ఏ ఆత్మలైతే అపవిత్రంగా ఉన్నారో, వారిని పవిత్రంగా తయారుచేస్తారు. మమ్మల్ని దుఃఖం నుండి విడిపించండి, విముక్తులుగా చేయండి అని ఆత్మ పిలుస్తుంది. అందరినీ విముక్తులుగా చేస్తారు. మాయ అందరినీ దుఃఖితులుగా చేసింది. సీతలు పిలిచారు కదా. సీత అంటే ఒక్కరే కాదు. అందరూ రావణుని జైలులో వికారిగా, భ్రష్టాచారిగా అయ్యారు. ఇది ఉన్నదే రావణ రాజ్యము. రాముడు ఉన్నదే నిరాకారుడు. రామ, రామ అని అంటారు కదా. ఒక్కరినే జపిస్తారు. గాడ్ ఫాదర్ అయిన శివుడు నిరాకారుడు, కావున వారికి ఇంద్రియాలు కావాలి కదా. కావున శివబాబా కూర్చుని వీరి ద్వారా అర్థం చేయిస్తారు. ఆత్మలైన మీరు కూడా పతితంగా ఉన్నారు, కనుక శరీరం కూడా పతితంగా ఉంది. ఇప్పుడు మీరు శ్యామముగా (నల్లగా) ఉన్నారు, మళ్ళీ సుందరంగా అవుతారు. బాబా జ్ఞాన సాగరుడు, జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. దానితో మీరు తెల్లగా అవుతారు. భారతవాసులు తెల్లగా ఉండేవారు, తర్వాత కామ చితి పైకి ఎక్కి నల్లగా వైశ్య, శూద్ర వంశీయులుగా అయ్యారు. తండ్రి ఎక్కే కళలోకి తీసుకువెళ్తారు, మళ్ళీ రావణుడు వచ్చిన తర్వాత అందరిదీ దిగే కళగా అవుతుంది. భారత్ లో మొదట దేవతల రాజ్యము ఉండేది. ఇప్పుడు లేదు. పరమాత్మ ఈ శరీరం ద్వారా పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు, ఎవరైతే వారసత్వాన్ని తీసుకునేవారుంటారో, వారికి సంతోషం యొక్క పాదరసం ఎక్కుతూ ఉంటుంది. శ్రీమతముపై అయితే తప్పకుండా నడుచుకోవాల్సి ఉంటుంది. మీరు పావనంగా చేయడానికి వచ్చారు, నేను కూడా తప్పకుండా పావనంగా అవుతాను, అప్పుడే పావన ప్రపంచానికి యజమానిగా అవుతాను – ఈ ప్రతిజ్ఞను చేయాల్సి ఉంటుంది. ఇదే రక్షా బంధనము. పిల్లలు తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు. వీరేమీ లౌకిక దేహధారి తండ్రి కాదు, నిరాకారుడు. వీరిలో ప్రవేశించారు. మీరు కూడా దేహీ-అభిమానిగా అవ్వండి అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమపిత పరమాత్మనైన నన్ను స్మృతి చేయండి. భారత్ లోనే పవిత్రత ఉండేది, అప్పుడు ఎంత శాంతి, సమృద్ధి ఉండేవి, ఇంకే ధర్మమువారు ఉండేవారు కాదు. మీరంటారు, బాబా మాకు ఇలా అర్థం చేయిస్తారు, మీరు కూడా అర్థము చేసుకోండి. బాబాను స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి అర్థం చేయిస్తారు, మీరు ఆత్మ, మీ స్వధర్మము శాంతి. మీరు శాంతిధామంలో నివసించేవారు. మీరు కర్మయోగులు. సైలెన్స్ లో మీరు ఎంత సమయం ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. కలియుగంలో అందరూ పతితులే ఉంటారు. మనం సంగమములో పావనంగా అవుతున్నామని మీకు తెలుసు. పతిత ప్రపంచం యొక్క వినాశనం జరగనున్నది. ఇది మహాభారత యుద్ధము. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి, వీటి ద్వారా పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. కొత్త ప్రపంచంలో ఉన్నదే దేవతల రాజ్యము. కనుక ఇప్పుడు మనం పరమపిత పరమాత్మ ఆజ్ఞానుసారముగా నడుచుకుంటాము. వారి శ్రీమతము లభిస్తుంది. ఈ జ్ఞానం బాగా అర్థము చేసుకోవాల్సినది. అంతేకానీ, ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయడం కాదు అని చెప్పండి. ఇక్కడైతే చదువుకోవాలి. 7 రోజుల భట్టీ కూడా ప్రసిద్ధి చెందింది. 7 రోజులు కూర్చుని అర్థం చేసుకోండి. తండ్రిని మరియు తమ జన్మలను తెలుసుకోండి. మనం పతితముగా ఎలా అయ్యాము, మళ్ళీ పావనముగా ఎలా అవ్వాలి అన్నది ఒకవేళ అర్థం చేసుకోకపోతే పశ్చాత్తాపపడవలసి వస్తుంది ఎందుకంటే తలపై పాపాల భారము చాలా ఉంది.

ఒక్క తండ్రి మాత్రమే అత్యంత ప్రియమైనవారు, వారు మనల్ని పావన ప్రపంచానికి యజమానిగా చేస్తారు. మిగిలినవారందరూ ఒకరినొకరు పతితంగానే చేసుకుంటూ ఉంటారు. సత్యయుగంలో పవిత్ర గృహస్థము ఉండేది, ఇప్పుడు అపవిత్రంగా అయ్యారు. ఇది ఉన్నదే రావణ రాజ్యము. ఇప్పుడు స్వర్గంలోకి వెళ్ళాలి అంటే పావనంగా అవ్వాలి, అప్పుడే అనంతమైన తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. దీనినైతే గుర్తుంచుకోండి – మనం శాంతిధామ నివాసులము తర్వాత సుఖధామంలోకి వెళ్ళాము, ఇప్పుడిది దుఃఖధామము, మళ్ళీ శాంతిధామంలోకి వెళ్ళాలి, అందుకే దేహీ-అభిమానిగా అవ్వాలి. తండ్రి అంటారు, ఇంట్లో ఉంటూ ఒకటేమో, పవిత్రంగా అవ్వండి, రెండవది, నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు నశిస్తాయి. స్మృతి చేయకపోతే, పవిత్రంగా ఉండకపోతే వికర్మలు ఎలా వినాశనమవుతాయి. రావణ రాజ్యము నుండి ఎలా విడుదల అవుతారు. ఇక్కడ అందరూ శోక వాటికలో ఉన్నారు. భారత్ అర్ధకల్పము శోక వాటికలో మరియు అర్ధకల్పము అశోక వాటికలో ఉంటుంది. మీరు కూడా పతిత ప్రపంచంలోనే ఉన్నారు కదా. మీరు అథారిటీతో అర్థం చేయించేవారు, అయినా కూడా గౌరవపూర్వకంగా మాట్లాడాలి – మేము గాడ్ ఫాదర్ సంతానమని మీరంటారు, కానీ ఫాదర్ కు సంబంధించిన జ్ఞానం ఎక్కడ ఉంది! లౌకిక తండ్రి గురించి అయితే తెలుసు కానీ పారలౌకిక తండ్రి, ఎవరైతే ఇంతటి అనంతమైన సుఖాన్ని ఇస్తారో, స్వర్గానికి యజమానిగా చేస్తారో, వారి గురించి మీకు తెలియదు. భారత్ ను ఎవరైతే స్వర్గంగా చేసారో, వారిని మీరు మర్చిపోయారు, అందుకే ఈ పరిస్థితి ఏర్పడింది. అందరూ భ్రష్టాచారిగా ఉన్నారు ఎందుకంటే విషము ద్వారా జన్మిస్తారు. దీనినైతే ఎవరైనా అర్థము చేసుకుంటారు, ఇందులో అవమానము యొక్క విషయమేమీ లేదు. ఇది వివరణ ఇవ్వడము జరుగుతుంది. రక్షాబంధనానికే మహత్వము ఉంది. తండ్రి అంటారు, వికారాలపై విజయాన్ని పొంది నన్ను స్మృతి చేయండి మరియు శాంతిధామాన్ని స్మృతి చేయండి, అప్పుడు మీరు అక్కడికి వెళ్తారు. మనం శాంతిధామము నుండి సుఖధామములోకి వెళ్తామని బుద్ధిలో ఈ స్మృతి ఉండాలి. మొదట దేహీ-అభిమానిగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. నేను ఆత్మను, ఒక శరీరాన్ని విడిచి మరొకదానిని తీసుకుంటాను. మనుష్యులు కుక్కగా, పిల్లిగా అవ్వరని తండ్రి ఇది కూడా అర్థం చేయించారు. మనుష్యులైతే భక్తి మార్గంలో ఎన్ని ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు భాషణలో ఇలా అర్థం చేయిస్తూ ఉండండి – మీరు పతితులు కదా, అందుకే పతిత-పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు. సీతలందరూ శోక వాటికలో ఉన్నారు. రోజు రోజుకు శోకము పెరుగుతూనే ఉంటుంది. ఎవరైతే రాజ్యాన్ని తీసుకున్నారో, వారు కూడా చాలా దుఃఖము ఉందని భావిస్తారు. ఎంతగా తల కొట్టుకుంటూ ఉంటారు. ఒకరిని శాంతపర్చగానే ఇంకొకరు నిలబడిపోతారు. గొడవలైతే జరుగుతూనే ఉంటాయి. శాంతికి బదులుగా ఇంకా అశాంతిగా అవుతూ ఉంటుంది. తండ్రి వచ్చి ఈ దుఃఖము, అశాంతిని తొలగించి సుఖధామాన్ని తయారుచేస్తారు. పాత ప్రపంచంలో దుఃఖము ఉంటుంది. కొత్త ప్రపంచంలో సుఖము ఉంటుంది.

ఈ రక్షాబంధనము అనేది పెద్ద పండుగ. ఈ ఆచారము ఎవరు ప్రారంభించారు అన్నది అర్థము చేయించాలి. పతిత-పావనుడైన పరమపిత పరమాత్మ వచ్చి పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేయించారు. 5 వేల సంవత్సరాల క్రితము ప్రతిజ్ఞ చేసారు. ఇప్పుడు మళ్ళీ పరమపిత పరమాత్మతో బుద్ధియోగము జోడించినట్లయితే మీరు పావనంగా అవుతారు. రాఖీ ఎప్పటి నుండి కడుతూ వచ్చారు అని అడగండి. ఇది అనాది నియమము అని అంటారు. అరే, పావన ప్రపంచంలో రాఖీని ఏమైనా కడతారా. ఇక్కడైతే పావనమైనవారు ఒక్కరు లేరు. ఇప్పుడు తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు, పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచంలోకి వెళ్తారు. పవిత్రత ఫస్ట్. ఒకప్పుడు పవిత్ర ప్రవృత్తి మార్గము ఉండేది, ఇప్పుడు లేదు. స్వర్గంలో దుఃఖం యొక్క పేరే ఉండదు. నరకంలో మళ్ళీ సుఖము యొక్క పేరు ఉండదు. భ్రష్టాచారులకు అల్పకాలిక సుఖము లభిస్తుంది, శ్రేష్ఠాచారులకు అర్ధకల్పము యొక్క సుఖము లభిస్తుంది. ఇది మీకు తెలుసు, రాఖీ ఉత్సవము జరుగుతుంది, కల్పక్రితము కూడా ఇలాగే జరిగిందని అంటారు. డ్రామాను పూర్తిగా అర్థము చేసుకోని కారణంగా తికమక పడతారు కూడా. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రే వచ్చి విముక్తులుగా చేస్తారు. రక్షాబంధనం ఎప్పటి నుండి ప్రారంభమయింది? దీనికి కూడా చాలా మహత్వము ఉంది. వచ్చి అర్థం చేసుకోండి అని రాయాలి. ఎవరికైనా అర్థం చేయించండి, ఎక్కడైనా భాషణ కోసం స్థానం ఇవ్వనివ్వండి. కాంగ్రెసు వారు దుకాణాల వద్ద నిలబడే భాషణ చేస్తారు, అప్పుడు చాలామంది వస్తారు. సేవ కొరకు పురుషార్థము చేయాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అథారిటీతో పాటు చాలా గౌరవపూర్వకంగా మాట్లాడాలి. అందరికీ పతితము నుండి పావనముగా తయారుచేసే యుక్తిని తెలియజేయాలి.

2. ఒక్కరి అవ్యభిచారీ స్మృతిలోనే ఉండాలి, ఏ దేహధారి నామ రూపాలను స్మృతి చేయకూడదు. తండ్రితో పావనంగా అయ్యే ప్రతిజ్ఞను చేయాలి.

వరదానము:-

ఎవరైతే హద్దు కోరికలను పెట్టుకుంటారో, వారి కోరికలు ఎప్పుడూ పూర్తి కావు. మంచిగా అయ్యేవారి అన్ని శుభమైన కోరికలు స్వతహాగా పూర్తవుతాయి. దాత పిల్లలకు ఏదీ అడగాల్సిన అవసరం లేదు. అడగడము వలన ఏమీ లభించదు. అడగడము అంటేనే కోరిక. హద్దు కోరిక లేకుండా ఉన్నప్పుడే అనంతమైన సేవా సంకల్పము తప్పకుండా పూర్తవుతుంది, అందుకే హద్దు కోరికకు బదులుగా మంచిగా అయ్యే విధిని తమదిగా చేసుకున్నట్లయితే సర్వ ప్రాప్తులతో సంపన్నులుగా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

ఎందుకంటే ఈ ప్రపంచం కుంభీపాక నరకంగా అయ్యింది, ఇందులో అందరూ చేదుగా ఉన్నారు. చేదుగా ఉన్నారని పతితులను అంటారు. అందరూ విషయ వైతరణీ నదిలో మునకలు వేస్తూ ఉంటారు. అందుకే మీకిప్పుడు దీని పట్ల అయిష్టం కలుగుతుంది.

ఎందుకంటే ఈ ప్రపంచం కుంభీపాక నరకంగా అయ్యింది, ఇందులో అందరూ చేదుగా ఉన్నారు. చేదుగా ఉన్నారని పతితులను అంటారు. అందరూ విషయ వైతరణీ నదిలో మునకలు వేస్తూ ఉంటారు. అందుకే మీకిప్పుడు దీని పట్ల అయిష్టం కలుగుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top