10 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

April 9, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘ఎగిరే కళకు ఆధారము, ఉల్లాస-ఉత్సాహాలు అనే రెక్కలు’’

♫ వినండి ఆడియో (audio)➤

ఈ రోజు పిల్లలందరి స్నేహ సంపన్న మిలన-భావన మరియు సంపూర్ణంగా అవ్వాలనే శ్రేష్ఠ కామన యొక్క శుభమైన ఉల్లాస-ఉత్సాహాల వైబ్రేషన్లను బాప్ దాదా చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిలో అందులో కూడా ఈ కల్పంలో మొదటిసారి కలిసిన పిల్లల ఉత్సాహం మరియు ఈ కల్పంలో అనేక సార్లు కలిసిన పిల్లల ఉత్సాహం ఎవరిది వారిదే. దీనినే మీరు మీ భాషలో – కొత్త పిల్లలు మరియు పాత పిల్లలు అని అంటారు. కానీ అందరూ అతి పాత కంటే పాతవారు ఎందుకంటే ఆ పాత గుర్తింపే తండ్రి వైపు, బ్రాహ్మణ పరివారం వైపు ఆకర్షితం చేసి ఇక్కడికి తీసుకొచ్చింది. ఇది కేవలం గుర్తు కోసం కొత్తవారు, పాతవారు అని చెప్పబడుతుంది. కొత్త పిల్లల్లో కొంచెం సమయంలోనే చాలా ముందుకు ఎగురుతూ బాబా సమానంగా అయి చూపించాలి అన్న ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి. పాత పిల్లల్లో, బాప్ దాదా నుండి ఏదైతే పాలన లభించిందో, ఖజానా లభించిందో – దాని రిటర్న్ ను బాబా ముందు సదా పెడుతూ ఉండాలి అనే శ్రేష్ఠ సంకల్పం ఉంది. ఇరువురి ఉల్లాస-ఉత్సాహాలు శ్రేష్ఠంగా ఉన్నాయి. ఈ ఉల్లాస-ఉత్సాహాలే రెక్కలుగా అయి ఎగిరే కళ వైపుకు తీసుకువెళ్తున్నాయి. ఎగిరే కళకు జ్ఞాన-యోగాలనే రెక్కలు ఉండనే ఉన్నాయి కానీ ప్రత్యక్ష స్వరూపంలో పూర్తి దినచర్యలో ప్రతి సమయం, ప్రతి కర్మలో, ప్రతి రోజు కొత్త ఉల్లాస-ఉత్సాహాలు స్వతహాగానే ఉత్పన్నమవుతాయి. ఉల్లాస-ఉత్సాహాలే ఎగిరే కళకు ఆధారము. ఎలాంటి కార్యమైనా, శుభ్రం చేసే పని గానీ, పాత్రలు కడిగే పని గానీ, కర్మ సాధారణంగా ఉన్నా, అందులో కూడా ఉల్లాస-ఉత్సాహాలు సహజంగా, నిరంతరంగా ఉంటాయి. జ్ఞానం యొక్క చదువును చదువుకొని ఇతరులను చదివించేటప్పుడు లేక స్మృతిలో కూర్చున్నప్పుడు, ఇతరులను స్మృతిలో కూర్చోబెట్టినప్పుడు లేక ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉన్నప్పుడు కేవలం ఆ సమయాలలో ఉల్లాస-ఉత్సాహాలు ఉండడము, సాధారణ కర్మ చేస్తున్నప్పుడు స్థితి కూడా సాధారణంగా అవ్వడము, ఉల్లాస-ఉత్సాహాలు కూడా సాధారణంగా అవ్వడము – ఇది ఎగిరే కళకు గుర్తు కాదు. ఎగిరే కళలో ఉండే శ్రేష్ఠ ఆత్మల ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలు సదా ఎగురుతూనే ఉంటాయి. కనుక బాప్ దాదా పిల్లలందరి ఉల్లాస-ఉత్సాహాలను చూస్తున్నారు. రెక్కలైతే అందరికీ ఉన్నాయి కానీ అప్పుడప్పుడు ఉల్లాస-ఉత్సాహాలలో ఎగురుతూ-ఎగురుతూ అలసిపోతారు. ఏదో ఒక చిన్న-పెద్ద కారణం అనగా ఆటంకం వస్తుంది, అప్పుడప్పుడు ప్రేమతో దాటేస్తారు కానీ అప్పుడప్పుడు గాబరా పడతారు. దీనినే మీరు తికమకపడిపోతాము అని అంటారు, అందుకే సహజంగా దాటలేని కారణంగా అలసిపోతారు. కానీ కొద్ది-కొద్దిగా అలసిపోయినా లక్ష్యం శ్రేష్ఠంగా ఉంది, గమ్యం అతి ప్రియంగా అనిపిస్తుంది, అందుకే మళ్ళీ ఎగరడం ప్రారంభిస్తారు. శ్రేష్ఠమైన లక్ష్యం, ప్రియమైన గమ్యం మరియు తండ్రి ప్రేమ యొక్క అనుభవం – ఇది అలసట ద్వారా కలిగిన కింద స్థితిలో ఆగిపోనివ్వవు, అందుకే మళ్ళీ ఎగరడం మొదలుపెడతారు. కనుక బాప్ దాదా పిల్లల ఈ ఆటను చూస్తూ ఉంటారు. అయినా కూడా తండ్రి ప్రేమ మిమ్మల్ని ఆగిపోనివ్వదు మరియు ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారు, అందుకే ఆటంకం ఎంతగా ఆపడానికి ప్రయత్నించినా మరియు చేస్తాయి కూడా. అప్పుడప్పుడు, చాలా కష్టము, దీని కన్నా ఎలా ఉండేవారమో అలాగే అయిపోతామని ఆలోచిస్తారు కానీ కోరుకున్నా కూడా గత జీవితంలోకి వెళ్ళే మజా రాదు ఎందుకంటే పరమాత్మ ప్రేమ మరియు దేహధారుల ప్రేమ – ఈ రెండింటి మధ్య తేడా ఎదురుగా ఉంది. కనుక ఎగురుతూ-ఎగురుతూ ఎప్పుడైతే ఆగే కళలోకి వస్తారో, అప్పుడు రెండు మార్గాల మధ్యలో ఉంటారు మరియు ఆలోచిస్తారు – ఇటు వెళ్ళాలా లేక అటు వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి? కానీ పరమాత్మ ప్రేమ యొక్క అనుభవం తికమక నుండి స్పృహలోకి తీసుకొస్తుంది మరియు ఉల్లాస-ఉత్సాహాలు అనే రెక్కలు లభిస్తాయి. అందుకే ఆలోచించినా కూడా ఆగిపోయే కళ నుండి ఎగిరే కళలోకి ఎగురుతారు. విషయాలు చాలా చిన్న-చిన్నవి ఉంటాయి కానీ ఆ సమయంలో బలహీనంగా ఉన్న కారణంగా పెద్దవిగా అనిపిస్తాయి. ఎలాగైతే బలహీన శరీరం ఉన్నవారికి ఒక నీటి గ్లాసును ఎత్తడం కూడా కష్టమనిపిస్తుంది మరియు ఎవరైతే ధైర్యం కలవారు ఉంటారో, వారికి రెండు బకెట్లు ఎత్తడం కూడా ఆటలాగా అనిపిస్తుంది. అదే విధంగా చిన్న విషయాన్ని పెద్దదిగా అనుభవం చేస్తారు. కనుక ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలు సదా ఎగిరిస్తూ ఉంటాయి. ప్రతి రోజూ అమృతవేళ, మొత్తం రోజంతటిలో ఏ స్మృతి ద్వారా ఉల్లాస-ఉత్సాహాలలో ఉండాలో – ఆ వెరైటీ పాయింట్లను మీ ఎదురుగా ఇమర్జ్ చేసుకోండి. కేవలం ఒక్కటే పాయింటు, నేను జ్యోతిర్బిందువును, బాబా కూడా జ్యోతిర్బిందువే, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ రాజ్యంలోకి రావాలి – ఈ ఒక్క విషయం అప్పుడప్పుడు పిల్లలను విసుగు చెందేలా చేస్తుంది. తర్వాత ఏదో కొత్తది కావాలని ఆలోచిస్తారు. కానీ ప్రతి రోజూ మురళీలో ఉల్లాస-ఉత్సాహాల యొక్క భిన్న-భిన్న పాయింట్లు ఉంటాయి. ఆ ఉల్లాస-ఉత్సాహాల యొక్క విశేషమైన పాయింట్లను తమ వద్ద నోట్ చేసుకోండి. చాలా పెద్ద లిస్ట్ తయారుచేయగలరు. డైరీలో కూడా నోట్ చేసుకోండి, బుద్ధిలో కూడా నోట్ చేసుకోండి. ఎప్పుడైతే బుద్ధిలో ఇమర్జ్ అవ్వదో, అప్పుడు డైరీ నుండి ఇమర్జ్ చేయండి మరియు వెరైటీ పాయింట్లు ప్రతి రోజు కొత్త ఉల్లాస-ఉత్సాహాలను పెంచుతాయి. మనుష్యాత్మలకు వెరైటీ ఇష్టమనిపించే స్వభావం ఉంటుంది. అందుకే, కావాలంటే జ్ఞానం యొక్క పాయింట్లను మననం చేయండి లేక ఆత్మిక సంభాషణ చేయండి. రోజంతా బిందువును స్మృతి చేసినట్లయితే బోర్ అయిపోతారు (విసుగు చెందుతారు). కానీ తండ్రి కూడా బిందువు, మీరు కూడా బిందువు సంగమయుగంలో మీరు హీరో పాత్రధారులు కూడా, జీరోతో పాటు హీరో కూడా, కేవలం జీరో కాదు. సంగమయుగంలో హీరో అయిన కారణంగా రోజంతటిలో వెరైటీ పాత్రను అభినయిస్తారు. జీరోనైన నాకు మొత్తం కల్పంలో ఏ-ఏ పాత్ర ఉంది మరియు ఈ సమయంలో ఏ హీరో పాత్ర ఉంది, ఎవరితో పాత్ర ఉంది, ఎంత సమయం మరియు ఏ పాత్రను అభినయించాలి, ఈ వెరైటీ రూపంలో జీరోగా అయి తమ హీరో పాత్ర యొక్క స్మృతిలో ఉండండి. స్మృతిలో కూడా వెరైటీ రూపంలో, ఒక్కోసారి బీజ రూప స్థితిలో ఉండండి, ఒక్కోసారి ఫరిశ్తా రూపంలో, ఒక్కోసారి ఆత్మిక సంభాషణ చేసే రూపంలో ఉండండి. ఒక్కోసారి తండ్రి నుండి లభించిన ఖజానాల ఒక్కొక్క రత్నాన్ని మీ ఎదురుగా తీసుకురండి. ఏ సమయంలో ఏది ఇష్టమనిపిస్తుందో, ఆ రీతిలో స్మృతి చేయండి. ఏ సమయంలో, ఏ సంబంధంతో తండ్రి యొక్క మిలనం, తండ్రి యొక్క స్నేహం కావాలో, ఆ సంబంధంతో మిలనం జరుపుకోండి. అందుకే సర్వ సంబంధాలతో తండ్రి మిమ్మల్ని తమ వారిగా చేసుకున్నారు మరియు మీరు కూడా తండ్రిని సర్వ సంబంధాలతో తమ వారిగా చేసుకున్నారు. కేవలం ఒక్క సంబంధమే కాదు, వెరైటీ ఉంది కదా? కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి – తండ్రి తప్ప, తండ్రి యొక్క ప్రాప్తులు లేక తండ్రి యొక్క ఖజానాలు తప్ప ఇంకేదీ గుర్తు రాకూడదు. వెరైటీ ప్రాప్తులు, వెరైటీ ఖజానాలు, వెరైటీ సంబంధాలు, వెరైటీ సంతోషకరమైన విషయాలు – ఇవన్నీ ఉల్లాస-ఉత్సాహాల యొక్క విషయాలు. అదే విధితో ఉపయోగించండి. తండ్రి మరియు మీరు – ఇదే రక్షణ రేఖ. ఈ రేఖ నుండి బయటకు రాకండి. అంతే, ఈ రేఖ పరమాత్మ ఛత్రఛాయ, ఎప్పటివరకైతే ఈ ఛత్రఛాయ లోపల ఉంటారో, అప్పటివరకు మాయకు ఎటువంటి ధైర్యం ఉండదు. తర్వాత శ్రమ అంటే ఏమిటి, ఆటంకం అంటే ఏమిటి, విఘ్నమంటే ఏమిటి – ఈ పదాలంటే ఏమిటో తెలియనివారిగా అవుతారు. ఎలాగైతే స్థాపన ఆది సమయంలో, సత్యయుగ ఆత్మలు ప్రవేశించినప్పుడు ఆ ఆత్మలకు వికారాలు అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి – ఈ పదాలంటే ఏమిటో తెలియనివారిగా ఉండేవారు. పిల్లలకు ఈ అనుభవం ఉంది కదా? పాతవారికైతే ఈ విషయాలు తెలుసు. అలా ఎవరైతే తండ్రి మరియు నేను – ఈ స్మృతి అనే రేఖ యొక్క ఛత్ర ఛాయలో ఉంటారో, వారు ఈ విషయాలంటే ఏమిటో తెలియనివారిగా అవుతారు. అందుకే సదా సురక్షితంగా ఉంటారు, సదా తండ్రి హృదయంలో ఉంటారు. మీకు హృదయమంటే ఎక్కువ ఇష్టమనిపిస్తుంది కదా. బహుమతులు కూడా హృదయం ఆకారంలోనే తయారుచేసి తీసుకొస్తారు. కేక్ కూడా హృదయం లాగ తయారుచేస్తారు, బాక్స్ కూడా హృదయం లాగ తయారుచేస్తారు. కనుక ఉండడము కూడా హృదయంలోనే ఉంటారు కదా? తండ్రి యొక్క హృదయంలోనైతే మాయ రాలేదు. ఎలాగైతే అడవిని కూడా ప్రకాశింపజేసినప్పుడు, అడవికి రాజు అయిన సింహం కూడా రాలేదు, పారిపోతుంది. తండ్రి యొక్క హృదయం కూడా ఎంత లైట్ (ప్రకాశం) మరియు మైట్ (శక్తి)గా ఉంది! దాని ఎదురుగా మాయ యొక్క ఏ రూపమూ రాలేదు. కనుక శ్రమ నుండి రక్షింపబడ్డారు కదా. జన్మ కూడా సహజంగానే జరిగింది, జన్మ తీసుకోవడంలో ఏమైనా శ్రమ అనిపించిందా? తండ్రి యొక్క పరిచయం లభించింది, గుర్తించారు, తండ్రి నా వారు, నేను తండ్రికి చెందినవాడిని అని సెకండులో అనుభవం చేసారు. జన్మ సహజంగా జరిగింది, భ్రమించే అవసరం పడలేదు. మీ దేశమనే ఇంట్లోకి తండ్రి పిల్లలను నిమిత్తంగా చేసి పంపించారు. వెతికాల్సిన లేక భ్రమించాల్సిన అవసరం రాలేదు. ఇంట్లో కూర్చునే తండ్రి లభించారు కదా. ఇప్పుడైతే కలుసుకోవడానికి ప్రేమతో భారత్ లోకి వచ్చారు. కానీ పరిచయమైతే అక్కడే లభించింది, జన్మ కూడా అక్కడే లభించింది కదా? జన్మ కూడా అతి సహజంగా జరిగింది, పాలన కూడా అతి సహజమైనది. కేవలం అనుభవం చేయండి. మరియు వెళ్ళడం కూడా సహజంగానే వెళ్తారు. తండ్రితో పాటు వెళ్ళాలి కదా లేక మధ్యలో ధర్మరాజపురిలో ఆగాలా? అందరూ తోడుగా వెళ్ళేవారే కదా. అందరికీ ఈ దృఢ సంకల్పం ఉంది, కలిసి ఉన్నాము మరియు కలిసి వెళ్తాము మరియు ముందు కూడా బ్రహ్మా తండ్రితో పాటు రాజ్యంలోకి వెళ్తాము లేదా పాత్రలోకి వస్తాము, పక్కా సంకల్పం ఉంది కదా? నడుస్తూ-నడుస్తూ అలసిపోయినట్లయితే ఆగిపోతారు, అప్పుడేం చేస్తారు? ఎందుకంటే తండ్రి అయితే ఆ సమయంలో ఆగరు, ఇప్పుడు ఆగుతున్నారు. ఇప్పుడు సమయమిచ్చారు, ఆ సమయంలో ఆగరు. ఆ సమయంలోనైతే సెకండులో ఎగురుతారు. ఇప్పుడు కొత్త-కొత్త పిల్లల కోసం లేట్ అయ్యింది కానీ టూ లేట్ యొక్క బోర్డు పెట్టలేదు. ఇప్పుడైతే కొత్త ప్రపంచం రావడం కోసం, కొత్త-కొత్త పిల్లల కోసం ఆగి ఉంది ఎందుకంటే వీరు కూడా ఆలస్యంగా వచ్చి వేగంగా వెళ్ళేవారిగా అవ్వాలి మరియు ఫస్ట్ నంబరు వరకు చేరుకోవాలి. అందరూ కలిసి వెళ్ళడం కోసం తయారుగా ఉన్నారు కదా? ఎవరైతే ఈ కల్పంలో మొదటిసారి వచ్చారో, వారికి బాప్ దాదా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిన్న-చిన్న పిల్లల పైన పెద్దవారికి చాలా ప్రేమ ఉంటుంది. కనుక తండ్రికి మరియు పెద్దవారైన సోదర-సోదరీలకు మీరంటే విశేషమైన ప్రేమ ఉంది. ప్రియమైనవారిగా అయిపోయారు కదా. కొత్త పిల్లలు ప్రియమైనవారు. కొత్తవారైనా గానీ, పాతవారైనా గానీ అందరి కోసం తీవ్ర గతితో ముందుకు వెళ్ళడం కోసం ఛత్ర ఛాయలో ఉండడము, సదా హృదయంలో ఉండడము, ఇదే అన్నింటికన్నా సహజమైన తీవ్ర గతి.

తమను తాము ఎప్పుడూ బోర్ చేసుకోకండి (విసుగు చెందేలా చేసుకోకండి). సదా తమ కోసం వెరైటీ రూపంలో ఉల్లాస-ఉత్సాహాలను ఇమర్జ్ చేసుకోండి. డబల్ విదేశీయులు కొంతమంది అప్పుడప్పుడు ఇలా కూడా ఆలోచిస్తారు, మా కల్చర్ కు మరియు ఇండియా యొక్క కల్చర్ కు చాలా తేడా ఉంది. ఇండియన్ కల్చర్ అప్పుడప్పుడు ఇష్టమనిపిస్తుంది, అప్పుడప్పుడు అనిపించదు. కానీ ఇదైతే ఇండియన్ కల్చర్ కాదు, విదేశీయుల కల్చర్ కూడా కాదు. ఇదైతే బ్రాహ్మణ కల్చర్ ఉంది. బ్రహ్మాకుమార, బ్రహ్మాకుమారీలు, ఈ పేరైతే అందరికీ ఇష్టమనిపిస్తుంది కదా? బ్రహ్మా తండ్రితో కూడా చాలా ప్రేమ ఉంది, బి.కె జీవితం కూడా అతి ప్రియమైనది. అప్పుడప్పుడు తెల్లని వస్త్రాలకు బదులుగా రంగు వస్త్రాలు గుర్తుకొస్తాయి ఎందుకంటే తెల్లని వస్త్రం తొందరగా మురికిగా అయిపోతుంది. ఆఫీసుకు వెళ్ళినప్పుడు లేదా ఎక్కడైనా కూడా అటువంటి స్థానాలకు వెళ్ళినప్పుడు, ఏదైతే డ్రెస్ మీరు వేసుకుంటారో, దాని కోసం బాబా వద్దనరు. కానీ ఈ వృత్తితో ధరించకండి, మాది విదేశీ కల్చర్, ఇదే నా పర్సనాలిటీ – ఈ రీతితో ధరించకండి. సేవా భావనతో ధరించండి, పర్సనాలిటీ యొక్క లక్ష్యంతో కాదు. బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం ఉండాలి. సేవ కోసం, ఆవశ్యకత కోసం ధరించినట్లయితే వద్దనరు. కానీ అది కూడా నిమిత్తంగా ఉన్న ఆత్మలతో వెరిఫై చేయించండి. బాప్ దాదా అయితే అనుమతినిచ్చారు, మీరు ఎందుకు వద్దంటున్నారు అని కాదు. అప్పుడప్పుడు చాలా నవ్వు వచ్చే మాటలు మాట్లాడుతారు. ఏవైతే మీకు అవసరం వచ్చే పదాలు ఉన్నాయో, వాటిని గుర్తుంచుకుంటారు కానీ వాటి వెనుక నియమం యొక్క విషయం ఏదైతే ఉంటుందో దానిని మర్చిపోతారు. తెలివితేటలైతే బాప్ దాదాకు మంచిగా అనిపిస్తాయి కానీ తెలివితేటలు హద్దులో ఉండాలి, హద్దులు దాటరాదు. తినండి, తాగండి, ధరించండి, ఆడండి – కానీ హద్దులో. కనుక ఏ కల్చర్ అంటే ఇష్టము? ఏదైతే బ్రహ్మా తండ్రి యొక్క కల్చర్ ఉందో, అదే బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీల కల్చర్, ఇష్టమే కదా? వీరిలో ఒక మంచి విషయం ఉంది, అదేమిటంటే, స్పష్టంగా చెప్పేస్తారు. అందరూ ఒకేలాగ ఉండరు – కొందరు ఎలా ఉన్నారంటే తమ బలహీనతలను వర్ణిస్తారు కానీ నిలకడలేనివారిగా అయిపోతారు. నేను బలహీనుడిని అని పదే-పదే దీనినే స్మృతిలోకి తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా నాజూకుగా అవ్వకండి. విశేషతలను మర్చిపోతారు, బలహీనతలను ఆలోచిస్తూ ఉంటారు, ఇలా చేయకండి. బలహీనతలను తప్పకుండా వినిపించండి కానీ ఎప్పుడైతే తండ్రికి ఇచ్చేసారో, ఇక అవి ఎవరి వద్ద ఉన్నాయి? నేను ఇలా ఉన్నాను అని మళ్ళీ ఎందుకు ఆలోచిస్తారు… తండ్రికి ఇచ్చేసారు కదా. బాప్ దాదాకు ఉత్తరం రాసి బలహీనతలను ఇచ్చేస్తారు లేక ఉత్తరం రాసి బాప్ దాదా గదిలో ఉంచుతారు, తర్వాత జవాబు అయితే లభించలేదని ఆలోచిస్తారు. బాప్ దాదా అలా జవాబు ఇవ్వరు. ఏదైతే బలహీనతను మీరు ఇచ్చేసారో, బాప్ దాదా వాటి స్థానంలో మీకు శక్తి, సంతోషం, ఉల్లాస-ఉత్సాహాలు నింపుతారు. కనుక ఏదైతే బాప్ దాదా ఇచ్చారో, అది తీసుకోరు, కేవలం జవాబు లభించలేదని ఆలోచిస్తారు. ఏదైతే తండ్రి ఇస్తారో, వాటిని తీసుకోవడానికి ప్రయత్నించండి. జవాబు కోసం వేచి ఉండకండి – శక్తిని, సంతోషాన్ని తీసుకుంటూ ఉండండి. తర్వాత చూడండి, ఎంత మంచి ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయో. ఏ క్షణంలోనైతే మీ బలహీనతలను రాస్తారో, లేక నిమిత్తంగా ఉన్న ఆత్మలకు వినిపిస్తారో, అప్పుడే ఇచ్చేసారు అంటే సమాప్తం అయినట్లు. ఇప్పుడు ఏం లభిస్తుందో, అది ఆలోచించండి. బాప్ దాదా వద్దకు ఒక్కొక్కరివి ఎన్ని ఉత్తరాలు వస్తాయి. బాప్ దాదా జవాబు ఇవ్వరు కానీ ఏది అవసరం ఉందో, ఏ లోపం ఉందో దానిని నింపేటువంటి రిటర్న్ ఇస్తారు. ఇకపోతే, ప్రియస్మృతులైతే రోజూ ఇస్తూనే ఉంటారు. ప్రియస్మృతులు లభించలేని రోజు ఏదైనా ఉందా? బాప్ దాదా అందరికీ రోజూ 2-3 పేజీల ఉత్తరం రాస్తారు. మురళీ ఇంత పెద్ద ఉత్తరం అయితే రోజూ ఎవ్వరూ ఎవ్వరికీ రాయరు. ఎంతగా మీ ప్రియమైనవారైనా కానీ, ఎవరైనా ఇంత పెద్ద ఉత్తరం రాసారా? మురళీ ఉత్తరం కదా. మీ విషయాలకు జవాబు ఉంటుంది కదా? కనుక ఇంత పెద్ద ఉత్తరాన్ని రాస్తూ కూడా, చెప్తూ కూడా, ఏదైతే మీరు విశేషంగా ఉత్తరం రాస్తారో, దానికి విశేషంగా బదులు కూడా ఇస్తారు ఎందుకంటే సికీలధే, ప్రియమైనవారు. బాప్ దాదా రిటర్న్ లో శక్తిని మరియు సంతోషాన్ని అదనంగా ఇస్తారు. కేవలం బుద్ధిని ఎల్లప్పుడూ అప్రమత్తంగా మరియు స్పష్టంగా పెట్టుకోండి. ముందు కూడా వినిపించారు, ఆ విషయాలన్నీ బుద్ధి నుండి తొలగించండి. ఆ విషయాలను కూడా పెట్టుకొని ఉంచినట్లయితే, బుద్ధి స్పష్టంగా ఉండదు, అందుకే తండ్రి ఏదైతే రిటర్న్ ఇస్తారో, అది మిక్స్ అయిపోతుంది. అప్పుడప్పుడు మిస్ చేస్తారు, అప్పుడప్పుడు మిక్స్ చేస్తారు.

అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తారు… ఈ రోజు మీ స్థితి గతులను వినిపిస్తున్నారు. కొంతమంది ఆలోచిస్తారు, సేవ అయితే చేస్తున్నాము కానీ తండ్రి యొక్క ప్రతిజ్ఞ ఉంది, నేను ఎల్లప్పుడూ సహాయకుడిని అని, ఈ సేవలో అయితే సహాయం చేయలేదు, సఫలత తక్కువ వెలువడింది, బాప్ దాదా ఎందుకు సహాయం చేయలేదు? అని. తర్వాత, బహుశా నేను యోగ్యుడిని కానేమో అని ఆలోచిస్తారు. నేను సేవ చేయలేను, నేను బలహీనుడిని, వ్యర్థం ఆలోచిస్తారు, కానీ పిల్లలు ఎవరైనా ఒకవేళ సేవలో సహాయం కోసం తండ్రి ముందు సంకల్పం చేసినా, పెద్ద మనసుతో చేయండి. దీనికి రిటర్న్ గా బాప్ దాదా సేవా సమయంలో విశేషమైన సహాయం చేస్తారు. కేవలం ఒక విధిని తమదిగా చేసుకోండి. ఎంత కష్టమైన సేవ అయినా కానీ తండ్రికి సేవను కూడా బుద్ధి ద్వారా అర్పించండి. నేను చేసాను, సఫలత లభించలేదు. నేను, ఎక్కడి నుండి వచ్చింది, చేసేవారు చేయించేవారు అయిన తండ్రి యొక్క బాధ్యతను మర్చిపోయి తమ పైన ఎందుకు వేసుకుంటారు. ఈ తప్పు జరుగుతుంది. తండ్రి యొక్క సేవ ఉంది, తండ్రి తప్పకుండా చేస్తారు. తండ్రిని ముందు పెట్టండి, స్వయాన్ని ముందు పెట్టకండి. నేను చేసాను, ఈ నేను అనే పదం సఫలతను దూరం చేస్తుంది. అర్థమయ్యిందా. అచ్ఛా.

నలువైపులా ఉన్న సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఎగిరేటువంటి తీవ్ర పురుషార్థీ ఆత్మలకు, సదా తండ్రి హృదయంలో ఉండేటువంటి విశేషమైన మణులకు, సదా తండ్రి మరియు మీరు, ఈ స్మృతి యొక్క ఛత్ర ఛాయలో ఉండేటువంటి, సదా ఆగే కళను – దిగజారే కళను దాటి ఎగిరే కళలో ముందుకు వెళ్ళేవారు, సదా వెరైటీ పాయింట్లతో సంతోషంలో మరియు నషాలో ముందుకు తీసుకెళ్ళే శ్రేష్ఠాత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

బ్రాహ్మణ జీవితం ఆనందాల జీవితము కానీ ఆనందంగా ఉండడం అంటే ఏది తోస్తే అది చేసాము, ఆనందంగా ఉన్నాము అని కాదు. ఈ అల్పకాలిక సుఖం యొక్క ఆనందం లేక అల్పకాలికమైన సంబంధ-సంపర్కాల యొక్క ఆనందం, సదా కాలం ప్రసన్న చిత్త స్థితి కంటే భిన్నమైనది. ఏది వస్తే అది మాట్లాడాము, ఏది వస్తే అది చేసాము – మేమైతే ఆనందంలో ఉన్నాము అని అల్పకాలికంగా మనసును ఆనందింపజేసుకునేవారిగా అవ్వకండి. సదా కాలం కోసం ఆత్మిక, అలౌకిక ఆనందంలో ఉండండి – ఇదే యథార్థమైన బ్రాహ్మణ జీవితము. ఆనందంతో పాటు కర్మల గుహ్య గతిని తెలుసుకునేవారిగా కూడా అవ్వండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top