01 June 2021 TELUGU Murli Today – Brahma Kumari
31 May 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - ఈ విశ్వమంతా ఈశ్వరీయ ఫ్యామిలీ, అందుకే నీవే తల్లివి-తండ్రివి, మేము మీ పిల్లలము అని పాడుతారు, ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా గాడ్లీ ఫ్యామిలీకి చెందినవారిగా అయ్యారు’’
ప్రశ్న: -
తండ్రి నుండి 21 జన్మల పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు సహజ విధి ఏమిటి?
జవాబు:-
సంగమంలో శివబాబాను మీ వారసునిగా చేసుకోండి. తనువు-మనసు-ధనములతో బలిహారమైనట్లయితే, 21 జన్మల కోసం పూర్తి వారసత్వం ప్రాప్తిస్తుంది. బాబా అంటారు – సంగమంలో ఏ పిల్లలైతే తమ పాతదంతా ఇన్ష్యూర్ (బీమా) చేసుకుంటారో, వారికి నేను రిటర్నులో 21 జన్మల వరకు ఇస్తాను.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
నయనహీనులకు మార్గాన్ని చూపించండి….. (నయన్ హీన్ కో రాహ్ దిఖావో…..)
ఓంశాంతి. పిల్లలు పాట విన్నారు. ఇలా భక్తులు భగవంతుడిని పిలుస్తారు. భగవంతుడిని పూర్తిగా తెలుసుకోని కారణంగా మనుష్యులు ఎంత దుఃఖమయంగా ఉన్నారు. భక్తి మార్గంలో ఎంతగా తల కొట్టుకుంటూ ఉంటారు. ఇది కేవలం ఈ జీవితం యొక్క విషయమే కాదు. భక్తి ప్రారంభమైనప్పటి నుండి ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. భారత్ లోనే దేవీ-దేవతల రాజ్యముండేది, దానిని స్వర్గం, సత్యఖండమని అనేవారు. భారత్ సత్యఖండము, భారత్ మహిమ చాలా గొప్పది ఎందుకంటే భారత్ పరమపిత పరమాత్ముని జన్మ స్థలము. వారి అసలు పేరు శివ. శివజయంతిని జరుపుకుంటారు. రుద్ర జయంతి లేదా సోమనాథ జయంతి అని అనడం జరగదు. శివజయంతి లేదా శివరాత్రి అని అంటారు. స్వర్గ స్థాపన చేసేవారు ఒక్క హెవెన్లీ గాడ్ ఫాదర్ మాత్రమే. ఇప్పుడు, భక్తులందరికీ భగవంతుడు తప్పకుండా ఒక్కరే అయి ఉండాలి. అందరూ నయనహీనులుగా ఉన్నారు అనగా జ్ఞాన చక్షువు లేదా డివైన్ ఇన్సైట్ (దివ్య దృష్టి) లేదు. భగవానువాచ – నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, ముఖ్యమైనది శ్రీమద్భగవద్గీత. శ్రీ అనగా శ్రేష్ఠ మతము. ఇప్పుడు మిమ్మల్ని బుద్ధివంతులుగా తయారుచేయడం జరుగుతుంది. దివ్య చక్షువును అనగా జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని చూపిస్తారు. వాస్తవానికి జ్ఞానం యొక్క మూడవ నేత్రం బ్రాహ్మణులైన మీకు లభిస్తుంది, దీని ద్వారా మీరు తండ్రిని మరియు తండ్రి రచన యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటారు. ఈ సమయంలో అందరిలో దేహ అహంకారం మరియు 5 వికారాలు ఉన్నాయి, అందుకే ఘోర అంధకారంలో ఉన్నారు. పిల్లలైన మీ వద్ద ప్రకాశముంది. మీ ఆత్మ మొత్తం ప్రపంచ చరిత్ర-భూగోళాలను తెలుసుకుంది. ఇంతకుముందు మీరంతా అజ్ఞానంలో ఉండేవారు. జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు, అజ్ఞాన అంధకారం వినాశనమయింది. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో, వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. పూజ్యులు ప్రకాశంలో ఉన్నారు. పూజారులు అంధకారంలో ఉన్నారు. పరమాత్మను మీరే పూజ్యులు, మీరే పూజారి అని అనలేరు. వారు పరమ పూజ్యులు. వారు అందరినీ పూజ్యులుగా తయారుచేసేవారు. వారిని పరమ పూజ్యులని అంటారు. పరమపిత పరమ ఆత్మ అనగా పరమాత్మ. కృష్ణుడిని అలా అనరు. వారిని అందరూ గాడ్ ఫాదర్ అని అనరు. నిరాకార భగవంతుడినే అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు. వారు కూడా ఆత్మనే కానీ వారు పరమ (ఉన్నతమైనవారు), అందుకే వారిని పరమాత్మ అని అంటారు. ఆ పరమాత్మ సదా పరంధామంలో నివసిస్తారు. ఇంగ్లీషులో వారిని సుప్రీమ్ సోల్ అని అంటారు. తండ్రి అంటారు – ఆత్మ-పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు….. అని మీరు పాడుతారు కూడా. అంతేకానీ పరమాత్మ, పరమాత్మ నుండి చాలా కాలం వేరుగా ఉన్నారు….. అని కాదు. ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనడం – మొదటి నంబరు అజ్ఞానము. ఆత్మ జనన-మరణాలలోకి వస్తుంది. పరమాత్మ పునర్జన్మలలోకి రారు. భారతవాసులైన మీరు స్వర్గ వాసులుగా, పూజ్యులుగా ఉండేవారని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మానవాళికి చెందిన పూజ్యులందరూ దేవీ-దేవతలు. ఇదంతా ఈశ్వరుని ఫ్యామిలీ. ఈశ్వరుడు రచయిత. మీరే తల్లి-తండ్రి, మేము మీ పిల్లలము అని పాడుతారు….. అంటే ఫ్యామిలీ అయినట్లు కదా. అచ్ఛా, మీరు తల్లి-తండ్రి అని ఎవరిని అంటారో చెప్పండి. ఇలా ఎవరంటారు? ఆత్మ అంటుంది – నీవే తల్లివి-తండ్రివి….. మీ కృపతో మాకు స్వర్గం యొక్క అపారమైన సుఖం స్వర్గంలో లభించింది, తల్లి-తండ్రి అయిన మీరు వచ్చి స్వర్గ స్థాపనను చేస్తారు, అప్పుడు, మేము మీ పిల్లలుగా అవుతాము. తండ్రి అంటారు – నేను సంగమంలోనే వచ్చి కొత్త ప్రపంచం కోసం రాజయోగాన్ని నేర్పిస్తాను. మనుష్యుల బుద్ధి పూర్తిగా భ్రష్టమైపోయింది. స్వర్గాన్ని నరకమని భావిస్తారు. అక్కడ కూడా కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశిపుడు మొదలైనవారు ఉండేవారని అంటారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు – మీరు మర్చిపోయారా ఏమిటి, నా శివజయంతిని కూడా మీరు భారత్ లోనే జరుపుకుంటారు. శివరాత్రి అని గాయనం కూడా చేయబడుతుంది. ఇది ఏ రాత్రి? ఇది బ్రహ్మా యొక్క అనంతమైన రాత్రి. తండ్రి సంగమంలో వచ్చి రాత్రి నుండి పగలుగా అనగా నరకం నుండి స్వర్గంగా తయారుచేస్తారు. శివరాత్రి యొక్క అర్థం కూడా ఎవరికీ తెలియదు. భగవంతుడు నిరాకారుడు. మనుష్యులకైతే జన్మ జన్మకు శరీరాల పేర్లు మారిపోతాయి. నాకు శరీరానికి సంబంధించిన పేరు ఏదీ లేదని పరమాత్మ అంటారు. నా పేరు శివ. నేను కేవలం వృద్ధ వానప్రస్థ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. వీరు పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారిగా అయ్యారు. శివబాబా వచ్చి స్వర్గాన్ని రచిస్తారు, మనం వారి పిల్లలము కావున తప్పకుండా మనం స్వర్గానికి యజమానులుగా అవ్వాలి కదా. శివబాబా ఉన్నతోన్నతమైనవారు. బ్రహ్మా-విష్ణు-శంకరులకు తమ-తమ పాత్ర ఉంది. ప్రతి ఆత్మలో తన సుఖ-దుఃఖాల పాత్ర నిశ్చయించబడి ఉంది. మనం శివబాబాకు వారసులుగా అయ్యామని మీకు తెలుసు. శివబాబా స్వర్గవాసులుగా చేసారు, అందుకే వారిని అందరూ స్మృతి చేస్తారు. ఓ గాడ్, దయ చూపించండి అని అంటారు. సాధువులు కూడా సాధన చేస్తారు, ఎందుకంటే ఇక్కడ దుఃఖముంది కావున వారు నిర్వాణధామానికి వెళ్ళాలని కోరుకుంటారు. ఆత్మ పరమాత్మలో లీనమైపోతుందని మరియు ఆత్మనైన నేనే పరమాత్మను అని భావించడం తప్పు. ఆత్మలమైన మేము పరంధామంలో ఉండేవారమని, తర్వాత దేవతా కులంలోకి వస్తామని, ఆ తర్వాత 84 జన్మలను తీసుకుంటామని ఇప్పుడు మీరు అంటారు. ఆత్మలమైన మనం వర్ణాలలోకి వస్తాము. శివబాబా జనన-మరణాలలోకి రారు. అక్కడ కేవలం నారాయణుని వంశముండేది. ఎలాగైతే క్రైస్తవ వంశంలో ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకెండ్, థర్డ్ అని కొనసాగుతుందో, అలాగే అక్కడ కూడా లక్ష్మీనారాయణ ది ఫస్ట్, లక్ష్మీనారాయణ ది సెకెండ్, థర్డ్, అలా 8 వంశాలు కొనసాగుతాయి. ఇప్పుడు బ్రాహ్మణులైన మీ మూడవ నేత్రం తెరుచుకుంది. తండ్రి కూర్చొని ఆత్మలతో మాట్లాడుతారు. మీరు ఈ విధంగా 84 జన్మల చక్రాన్ని తిరిగి ఇన్ని-ఇన్ని జన్మలు తీసుకుంటూ వచ్చారు. వర్ణాల చిత్రాన్ని కూడా ఒకటి తయారుచేస్తారు, అందులో దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణులను చూపిస్తారు. బ్రాహ్మణులైన మనం పిలక వంటి వారము అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ సమయంలో మనం ప్రాక్టికల్ గా ఈశ్వరీయ సంతానము. ఈ సహజ రాజయోగం మరియు జ్ఞానం ద్వారా మనకు అపారమైన సుఖం లభిస్తుంది. కొందరు సూర్యవంశ రాజధాని వారసత్వాన్ని తీసుకుంటారు, కొందరు చంద్రవంశ రాజధాని వారసత్వాన్ని తీసుకుంటారు. మొత్తం రాజధాని అంతా స్థాపనవుతుంది. ప్రతి ఒక్కరూ తమ-తమ పురుషార్థం ద్వారా ఆ పదవిని పొందుతారు. ఇప్పుడు చదువుతూ-చదువుతూ మేము శరీరాన్ని వదిలితే మాకు ఏ పదవి లభిస్తుందని ఎవరైనా అడిగితే, బాబా చెప్పగలరు. యోగంతోనే ఆయుష్షు పెరుగుతుంది, వికర్మలు వినాశనమవుతాయి, పతితుల నుండి పావనంగా తయారయ్యేందుకు వేరే ఏ ఉపాయము లేదు. పతితపావనా అని అనడంతోనే భగవంతుడు గుర్తుకొస్తారు. కానీ భగవంతుడు ఎవరు అనేది తెలియదు. నేను భారత్ లోనే వస్తాను, ఇది నా జన్మ స్థలమని తండ్రి అంటారు. సోమనాథ మందిరం ఎంత ఘనంగా ఉంది అని తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. తర్వాత, భక్తి మార్గంలో స్మృతిచిహ్నాలు తయారవ్వడం ప్రారంభమవుతాయి. పూజారులుగా అయినప్పుడు మొట్టమొదట సోమనాథ మందిరాన్ని తయారుచేస్తారు. సత్య-త్రేతా యుగాలలో భారత్ చాలా షావుకారుగా ఉండేది. మందిరాలలో కూడా అపారమైన ధనముండేది. భారత్ వజ్ర సమానంగా ఉండేది. ఇప్పుడు భారత్ నిరుపేదగా, గవ్వ సమానంగా ఉంది. మళ్ళీ తండ్రి వచ్చి భారత్ ను వజ్ర సమానంగా తయారుచేస్తారు. సృష్టికర్త ఎవరు అని ఎవరినైనా అడగండి. పరమాత్మ అని అంటారు. వారు ఎక్కడ ఉన్నారు అని అడిగితే, వారు సర్వవ్యాపి అని అంటారు. ఈ వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుందని తండ్రి అంటారు.
మేము బాబా, మమ్మా యొక్క సింహాసనాధికారులుగా అయ్యేందుకు అర్హులుగా అయ్యామా అని స్వయాన్ని చూసుకోవడం జరుగుతుంది. ఇది పతిత ప్రపంచము. పవిత్రత ముఖ్యమైనది. ఇప్పుడైతే ఆరోగ్యము లేదు, సంపద లేదు, సంతోషము లేదు. ఇది ఎండమావిలోని నీటి వంటి రాజ్యము. దీని ఆధారంగా దుర్యోధనుని కథ శాస్త్రాలలో రాయబడి ఉంది. దుర్యోధనుడు అని వికారులను అంటారు. మా గౌరవాన్ని కాపాడండి అని ద్రౌపది అంటుంది. అందరూ ద్రౌపదులే కదా. ఈ కన్యలు స్వర్గానికి ద్వారాలు. బాబా ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఎవరి బుద్ధి యోగమైతే పూర్తిగా జోడించబడి ఉంటుందో, వారికి ధారణ కూడా జరుగుతుంది. బ్రహ్మచర్యంలోనే జ్ఞానాన్ని చదువుకుంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలని తండ్రి అంటారు. రెండు వైపులా నిర్వర్తించాలి. తప్పకుండా మరణించాలి కూడా. మరణించే సమయంలో మనుష్యులకు మంత్రాన్ని ఇస్తారు. మీరంతా మరణించనున్నారు అని తండ్రి అంటారు. నేను కాలుడికే కాలుడిని, అందరినీ తిరిగి తీసుకువెళ్ళేవాడిని. కావున సంతోషముండాలి కదా. ఎవరైతే బాగా చదువుకుంటారో వారు స్వర్గానికి యజమానులుగా అవుతారు. చదువుకోకపోతే ప్రజా పదవిని పొందుతారు. మీరు ఇక్కడకు రాజ్య పదవిని పొందేందుకు వచ్చారు. ఇది చదువు, ఇందులో అంధ విశ్వాసం అన్న మాటే లేదు. ఈ చదువు రాజ్యాధికారం కోసమే ఉంది. ఒకవేళ చదువులో బ్యారిస్టర్ అవ్వాలనే లక్ష్యమున్నట్లయితే, తప్పకుండా చదువు చెప్పే టీచరుతో యోగం జోడించవలసి ఉంటుంది. ఇక్కడ మీకు భగవంతుడు చదివిస్తారు కావున వారితో యోగం జోడించాలి. నేను పరంధామం నుండి, చాలా దూరం నుండి వస్తాను అని తండ్రి అంటారు. పరంధామం ఎంత ఉన్నతమైనది. సూక్ష్మవతనం కన్నా ఉన్నతమైనది, అక్కడ నుండి రావడానికి నాకు ఒక్క క్షణం పడుతుంది. వారికన్నా వేగవంతమైనది ఇంకేదీ ఉండదు. క్షణంలో జీవన్ముక్తిని ఇస్తాను. జనకుని ఉదాహరణ ఉంది కదా. ఇప్పుడు ఇది నరకము, పాత ప్రపంచము. స్వర్గాన్ని కొత్త ప్రపంచమని అంటారు. తండ్రి నరకాన్ని వినాశనం చేయించి స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్ళిపోతాయి. ఆత్మ అవినాశీ. ఆత్మకు పాత్ర కూడా అవినాశీ అయినదే లభించింది. అటువంటప్పుడు, ఆత్మ చిన్నదిగా, పెద్దదిగా ఎలా అవ్వగలదు లేదా కాలిపోయి ఎలా మరణించగలదు? అది ఒక నక్షత్రము. చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు. ఇప్పుడు మీరు గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్. గాడ్ ఫాదర్ జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు. వారు మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారా మనమే మళ్ళీ దేవీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు. మీరు భారత్ యొక్క సేవ చేస్తున్నారు. మొట్టమొదట తండ్రికి చెందినవారిగా అవ్వాలి, వేరే చోట్ల అయితే గురువుల వద్దకు వెళ్తారు, వారికి చెందినవారిగా అవుతారు అనగా వారిని తమ గురువులుగా చేసుకుంటారు. ఇక్కడ ఉన్నది తండ్రి, కావున ముందు తండ్రికి బిడ్డగా అవ్వాల్సి ఉంటుంది. తండ్రి పిల్లలకు వారి ఆస్తిని ఇస్తారు. తండ్రి అంటారు – పిల్లలూ, మీరు ఎక్స్ చేంజ్ చేసుకోండి. మీకు పనికిరానిదంతా నాకు, నాదంతా మీకు. దేహ సహితంగా మీ వద్ద ఉన్నదంతా నాకు ఇవ్వండి. నేను మీ ఆత్మను, శరీరాన్ని రెండింటినీ పవిత్రంగా తయారుచేస్తాను మరియు రాజ్యపదవిని కూడా ఇస్తాను. మీ వద్ద ఉన్నదంతా బలి ఇచ్చినట్లయితే, జీవన్ముక్తి లభిస్తుంది. బాబా, ఇదంతా మీది. తండ్రి అంటారు – మీరు నన్ను వారసునిగా చేసుకోండి. నేను 21 జన్మలకు మిమ్మల్ని వారసులుగా చేసుకుంటాను. కేవలం నా మతంపై నడుచుకోండి. వ్యాపారం మొదలైనవి చేసుకోండి, విదేశాలకు వెళ్ళండి, ఏమైనా చేయండి, కేవలం నా మతంపై నడుచుకోండి. జాగ్రత్తగా ఉండండి, మాయ పదే-పదే కింద పడేస్తుంది. ఎటువంటి వికర్మలు చేయకూడదు. శ్రీమతాన్ని అనుసరించినట్లయితే శ్రేష్ఠంగా అవుతారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఆత్మను మరియు శరీరాన్ని, రెండింటినీ పావనంగా తయారుచేసుకునేందుకు దేహ సహితంగా మీ వద్ద ఉన్నదంతా తండ్రికి అర్పణ చేసి వారి శ్రీమతాన్ని అనుసరించాలి.
2. మాతా-పితల సింహాసనాధికారులుగా అయ్యేందుకు స్వయాన్ని అర్హులుగా చేసుకోవాలి. అర్హులుగా అయ్యేందుకు ముఖ్యంగా పవిత్రతను ధారణ చేయాలి.
వరదానము:-
ఎప్పుడైనా ఏదైనా వస్తువును సాకారంలో చూస్తే, దానిని త్వరగా గ్రహించగలరు, అందుకే నిమిత్తంగా ఉన్న శ్రేష్ఠ ఆత్మల సేవ, త్యాగం, స్నేహం, అందరికీ సహయోగం చేసే ప్రాక్టికల్ కర్మలను చూసి ఏ ప్రేరణ అయితే లభిస్తుందో, అదే వరదానంగా అవుతుంది. ఎప్పుడైతే నిమిత్తంగా ఉన్న ఆత్మలను, కర్మలు చేస్తూ ఈ గుణాలను ధారణ చేయడం చూస్తారో, అప్పుడు సహజంగా కర్మయోగులుగా అయ్యే వరదానం లభిస్తుంది. ఎవరైతే ఇటువంటి వరదానాలను ప్రాప్తి చేసుకుంటూ ఉంటారో, వారు స్వయం మాస్టర్ వరదాతలుగా అవుతారు.
స్లోగన్:-
మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు – ‘‘సత్యమైన చక్రవర్తి అయిన పరమాత్మతో సత్యంగా ఉండండి’’
ఈ సమయంలో మనకు తండ్రి అయిన పరమాత్మ ద్వారా – నిరంతరం నా స్మృతిలో ఉండండి అన్న ఆజ్ఞ లభించింది. యోగమంటే అర్థము – ఈశ్వరీయ స్మృతిలో ఉండడం, అంతేకానీ యోగమంటే ధ్యానమేమీ కాదు. మన ఈ సహజ యోగంలో నడుస్తూ-తిరుగుతూ, కార్య-వ్యవహారాలు చేస్తూ వారి స్మృతిలో ఉంటాము, దీనినే ఎడతెగని అఖండ యోగమని అంటారు, కానీ నిరంతరం యోగంలో ఉండే అభ్యాసం అవసరము. ఒకవేళ వారి ఆజ్ఞ పట్ల ఆజ్ఞాకారులుగా లేకపోతే, ఏదైనా ఆజ్ఞను ఉల్లంఘిస్తే, తప్పకుండా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. వారి ఆజ్ఞ ఏమిటంటే – నేను ఏ కర్మలనైతే చేస్తానో, నన్ను చూసి మీరు కూడా అడుగు వేయండి, లేదంటే మాయ దెబ్బ తింటారు. సత్యమైన చక్రవర్తితో సత్యంగా ఉండండి, మాయ విఘ్నాలు ఏవైనా సతాయించినా, వాటిని కూడా వీరి ముందు పెట్టాలి, అప్పుడు వీరి సహాయంతో మాయ పక్కకు వెళ్ళిపోతుంది, మార్గం స్పష్టమవుతుంది, అప్పుడు వారు ఎక్కడ కూర్చోబెట్టినా, ఎలా నడిపించినా, ఏది తినిపించినా, ఆ మార్గం స్పష్టంగా ఉంటుంది. ఈ విధంగా తోడును నిర్వర్తించేందుకు చాలా ధైర్యం కావాలి. ఇటువంటి మహాన్ సౌభాగ్యశాలురు చాలా కొద్దిమందే వెలువడుతారు, వారు విజయ మాలలోకి వెళ్తారు. మిగతావారు ఎవరైతే ఎంతో కొంత తీసుకొని వెళ్ళి ప్రజలుగా అవుతారు, వారు భాగ్యశాలురు, కావున కొద్దిగా లభించడంతోనే సంతోషపడిపోకండి. మన కోరికైతే సంపూర్ణంగా ఉండాలి, ధైర్యం చేసి ముందుకు వెళ్ళాలి. మాయ విఘ్నాలను కలిగిస్తుంది కానీ దానిపై విజయం పొందాలి, ఇందులో ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినట్లయితే, నిశ్చయం లోపించినట్లు, తమ ధారణలో ఏదో లోపించినట్లు. ఇది మీ పొరపాటు, ఇక్కడ లోక-మర్యాదలను, కుల-మర్యాదలను తెంచాల్సి ఉంటుంది, వీటిని తెంచినప్పుడే సత్యమైన పారలౌకిక దైవీ మర్యాదలను పొందుతారు. ఈ వికారీ ప్రపంచం వెళ్ళిపోనున్నది. చూడండి, మీరా కూడా లోకమర్యాదలను విడిచినప్పుడే గిరిధరుడిని పొందారు. ఒకవేళ ఆ లోకమర్యాదలను పట్టుకున్నట్లయితే, ఈ దైవీ ప్రపంచ సభ్యునిగా అవ్వలేరు. ఇప్పుడు, కళ్యాణార్థం ఈశ్వరీయ సలహా ఇవ్వడం జరుగుతుంది, మరి ఇప్పుడు ఏమి చేయాలి, ఏది సరైనది అనేది మీ బుద్ధితో నిర్ణయించుకోవాలి.
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!