1 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

July 31, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - తండ్రి జ్ఞానం యొక్క మధురాతి-మధురమైన విషయాలను ఏవైతే వినిపిస్తారో, వాటిని ధారణ చేయాలి - చాలా మధురంగా, క్షీర ఖండంగా అయి ఉండాలి, ఎప్పుడూ ఉప్పు నీరు వలె అవ్వకూడదు’’

ప్రశ్న: -

ఏ మహామంత్రము ద్వారా పిల్లలైన మీకు కొత్త రాజధాని యొక్క తిలకము లభిస్తుంది?

జవాబు:-

తండ్రి ఈ సమయంలో పిల్లలైన మీకు మహామంత్రాన్ని ఇస్తారు – మధురమైన ప్రియమైన పిల్లలూ – తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఇంట్లో-గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉన్నట్లయితే రాజధాని యొక్క తిలకం మీకు లభిస్తుంది.

ప్రశ్న: -

ఎటువంటి దృష్టినో అటువంటి సృష్టి… అని అంటారు, ఈ సామెత ఎందుకు ఉంది?

జవాబు:-

ఈ సమయంలో మనుష్యులు ఎలాగైతే పతితంగా, నల్లగా ఉన్నారో, అలాగే తమ పూజ్య దేవతలైన లక్ష్మీ-నారాయణులను, సీతా-రాములను, శివబాబాను కూడా నల్లగా తయారుచేసి వారిని పూజిస్తున్నారు. దాని అర్థమేమిటో వారికి తెలియదు, అందుకే ఈ సామెత ఉంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ముఖాన్ని చూసుకో ప్రాణీ… (ముఖుడా దేఖ్లే… )

ఓంశాంతి. మధురాతి-మధురమైన చాలాకాలం క్రితం విడిపోయి కలిసిన పిల్లలు పాటలోని లైన్ ను విన్నారు, ఏమనంటే – ఎంత పాపము చేసారు మరియు ఎంత పుణ్యము చేసారు అని హృదయం రూపీ దర్పణంలో చూసుకోండి. పాపము మరియు పుణ్యము గురించి హృదయం రూపీ దర్పణంలో ఆలోచించడము జరుగుతుంది కదా. ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము. పుణ్యాత్ముల ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు. ఇక్కడికి పుణ్యాత్ములు ఎక్కడ నుండి వస్తారు. అందరూ పాపాలే చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది రావణ రాజ్యము. ఓ పతిత-పావనా రండి, అని స్వయము అంటారు కూడా. భారత్ యే పుణ్యాత్ముల ఖండముగా ఉండేదని మనకు తెలుసు. అక్కడ ఎవరూ పాపము చేసేవారు కాదు. సింహము, మేక కలిసి నీళ్ళు తాగేవి, క్షీరఖండము వలె ఉండేవి. తండ్రి కూడా అంటారు, పిల్లలూ, క్షీర ఖండము వలె అవ్వండి. పుణ్యాత్ముల ప్రపంచంలో తమోప్రధాన ఆత్మలు ఎక్కడ నుండి వస్తారు. ఇప్పుడు తండ్రి ప్రకాశాన్ని అందించారు. మనమే సతోప్రధానమైన దేవీ-దేవతలుగా ఉండేవారమని మీకు తెలుసు. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు… అన్నది వారి మహిమనే. స్వయం మనము కూడా వారిని మహిమ చేస్తాము. మనుష్యులు అంటారు – నిర్గుణులమైన మాలో ఏ గుణాలు లేవు. ప్రభూ, ఎప్పుడైతే మీరు వచ్చి మాపై దయ చూపిస్తారో, అప్పుడు మేము కూడా అలా తయారవ్వగల్గుతాము. ఆత్మ ఈ విధంగా అంటుంది. ఈ సమయంలో మేము పాపాత్ములము అని ఆత్మ భావిస్తుంది. పుణ్యాత్ములైతే పూజింపబడేటువంటి దేవీ-దేవతలు. అందరూ వెళ్ళి దేవతల చరణాలకు తల వంచి నమస్కరిస్తారు. సాధు-సన్యాసులు మొదలైనవారు కూడా తీర్థ యాత్రలకు వెళ్తారు. అమరనాథ్ కు, శ్రీనాథ ద్వారానికి వెళ్తారు. కనుక ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము. భారత్ యే పుణ్యాత్ముల ప్రపంచముగా ఉండేది, అప్పుడు లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేది. దానినే స్వర్గమని అంటారు. మనుష్యులు మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారని అంటారు. కానీ స్వర్గము ఎక్కడ ఉంది? స్వర్గము ఉన్నప్పుడు సత్యయుగము ఉండేది. మనుష్యులకు ఏది తోస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఏమీ అర్థము చేసుకోరు. స్వర్గంలోకి వెళ్ళారంటే తప్పకుండా అంతకుముందు నరకంలో ఉండేవారు. సన్యాసులు మరణించినప్పుడు జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని అంటారు. అంటే వ్యత్యాసము ఉన్నట్లే కదా. జ్యోతిలో కలిసిపోయారంటే మళ్ళీ ఇక్కడకు రాకూడదు. ఎక్కడైతే ఆత్మలమైన మనము ఉంటామో, దానిని నిర్వాణధామము అని అంటారని మీకు తెలుసు. వైకుంఠాన్ని నిర్వాణధామము అని అనరు. పిల్లలకు చాలా మధురాతి-మధురమైన జ్ఞానం యొక్క విషయాలను వినిపిస్తారు, వీటిని చాలా మంచి రీతిలో ధారణ చేయాలి.

మనకు వైకుంఠం యొక్క మార్గాన్ని తెలియజేసేందుకు బాబా వచ్చారని మీకు తెలుసు. తండ్రి రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చారు. పావన ప్రపంచం యొక్క మార్గాన్ని తెలిపి గైడ్ గా అయి తీసుకువెళ్తారు. తప్పకుండా వినాశనము కూడా ఎదురుగా నిలబడి ఉంది. పాత ప్రపంచం యొక్క వినాశనము జరుగుతుంది. పాత ప్రపంచంలోనే ఉపద్రవాలు మొదలైనవి సంభవిస్తాయి. బాబా ఎంత మధురమైనవారు. అంధులకు చేతి కర్రగా అవుతారు. మనుష్యులైతే ఘోర అంధకారములో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. బ్రహ్మా యొక్క పగలు మరియు బ్రహ్మా యొక్క రాత్రి అని అంటూ ఉంటారు. బ్రహ్మా అయితే ఇక్కడే ఉన్నారు కదా. రాత్రిని పగలుగా చేసేందుకే తండ్రి వస్తారు. అర్ధకల్పము రాత్రి, అర్ధకల్పము పగలు. ఇప్పుడు మీకు తెలిసింది కానీ వారైతే కలియుగము ఇంకా బాల్యావస్థలో ఉందని భావిస్తారు. ఈ ప్రపంచం యొక్క వినాశనం జరగనున్నదని అప్పుడప్పుడు అంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఈ రోజుల్లోనైతే కష్టం మీద ఇళ్ళు-వాకిళ్ళను విడిచిపెడతారు. ఏదైనా జరిగితే ఇంటి నుండి వెళ్ళిపోయి సన్యాసులుగా అవుతారు. ఆ మధ్య గవర్నమెంట్ సన్యాసులకు కూడా లైసెన్స్ ఉండాలి అని చట్టాన్ని జారీ చేసింది. అంతేకానీ, ఎవరైతే ఇంటిపై అలుగుతారో, వారు వెళ్ళి సన్యాసులుగా అవ్వడము కాదు. వారికి ఉచితంగా చాలా సంపద లభిస్తుంది. అది హద్దు సన్యాసము, మీది అనంతమైన సన్యాసము. ఈ సమయంలో మొత్తము ప్రపంచము పతితముగా ఉంది, దానిని మళ్ళీ పావనముగా తయారుచేయడము అనేది ఒక్క పతిత-పావనుడైన తండ్రి పని మాత్రమే. సత్యయుగంలో పవిత్ర గృహస్థ ధర్మము ఉండేది. లక్ష్మీ-నారాయణుల చిత్రాలు కూడా ఉన్నాయి. సర్వగుణ సంపన్నులు… అని దేవీ-దేవతల మహిమను పాడుతారు కదా. వారిది హఠయోగము, కర్మ సన్యాసము. కానీ కర్మను సన్యసించడమైతే జరగదు. కర్మ లేకుండానైతే మనుష్యులు ఒక్క క్షణం కూడా ఉండలేరు. కర్మ సన్యాసము అన్న పదమే తప్పు. ఇది కర్మయోగము, రాజయోగము. మీరు సూర్యవంశీ దేవీ-దేవతలుగా ఉండేవారు. మనం 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుందని మీరు తెలుసుకున్నారు. వర్ణాల గురించి కూడా చెప్తూ ఉంటారు. బ్రాహ్మణ వర్ణము గురించి ఎవ్వరికీ తెలియదు.

తండ్రి పిల్లలైన మీకు మహామంత్రాన్ని ఇస్తారు – తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి, అప్పుడు మీకు రాజధాని యొక్క తిలకము లభిస్తుంది. మధురాతి-మధురమైన ప్రియమైన పిల్లలూ, ఇంట్లో-గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. ఎంతైతే ప్రేమతో పని కానివ్వగలరో, అంతగా క్రోధంతో చేయలేరు. చాలా మధురంగా అవ్వండి. తండ్రి స్మృతిలో సదా చిరునవ్వుతో ఉండండి. దేవతల చిత్రాలను చూడండి, ఎంత హర్షితముగా ఉంటారు. ఆ దేవతలు మనమేనని ఇప్పుడు మీకు తెలుసు. మనమే దేవతలుగా ఉండేవారము, మళ్ళీ మనమే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాము. ఇప్పుడు మనం సంగమములో బ్రహ్మా ముఖ వంశావళిగా అయ్యాము. బ్రహ్మా ముఖ వంశావళియే ఈశ్వరుని వంశీయులు. తండ్రి నుండి ముక్తి మరియు జీవన్ముక్తుల వారసత్వము లభిస్తుంది. ఇది కూడా మీకు తెలుసు, ఎప్పుడైతే దేవీ-దేవతల రాజ్యం ఉండేదో, అప్పుడు ఇంకే ధర్మమూ ఉండేది కాదు, చంద్రవంశీయులు కూడా ఉండేవారు కాదు. ఇది అర్థము చేసుకునే విషయము కదా. హమ్ సో యొక్క అర్థంలో కూడా, వారు ఆత్మయే పరమాత్మ అని అన్నారు. మనమే దేవతలుగా, మళ్ళీ క్షత్రియులుగా… అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ ఈ విధంగా అంటుంది. ఆత్మలమైన మనం పవిత్రంగా ఉన్నప్పుడు శరీరం కూడా పవిత్రంగా ఉండేది. అది ఉన్నదే నిర్వికారీ ప్రపంచము, ఇది వికారీ ప్రపంచము. దుఃఖధామము, సుఖధామము ఉంటాయి మరియు ఎక్కడైతే ఆత్మలమైన మనమందరము ఉంటామో, అది శాంతిధామము. హిందువులు, చైనీయులు, మనమందరము పరస్పరంలో సోదరులము అని అంటారు, కానీ అర్థం కూడా తెలుసుకోవాలి కదా. ఈ రోజు పరస్పరంలో సోదరులము అని అంటారు, రేపు తుపాకులతో కాల్చుకుంటూ ఉంటారు. ఆత్మలందరూ సోదరులు. పరమాత్మను సర్వవ్యాపి అని అన్నట్లయితే అందరూ తండ్రులు అవుతారు. తండ్రి వారసత్వాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సోదరులు వారసత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. వారు పతిత-పావనుడు కదా, వారి ద్వారానే పావనంగా అవ్వాలి. మనం మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలనుకుంటాము. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు… అని గ్రంథ్ లో కూడా ఉంది, క్షణంలో జీవన్ముక్తి అని అంటూ ఉంటారు కూడా. దేవతలైన మనము జీవన్ముక్తులుగా ఉండేవారము, ఇప్పుడు జీవన బంధనములో ఉన్నాము. రావణ రాజ్యము ద్వాపరము నుండి మొదలవుతుంది, తర్వాత దేవతలు వామ మార్గంలోకి వెళ్తారు. ఆ గుర్తులు కూడా ఉన్నాయి. జగన్నాథపురిలో దేవతలవి చాలా అశుద్ధమైన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందైతే ఇదేమీ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఎంతగా అర్థమయ్యింది. దేవతలవి ఇటువంటి అశుద్ధమైన చిత్రాలను ఇక్కడ ఎలా పెట్టారని ఇంతకుముందు ఆశ్చర్యపోయేవారు మరియు లోపల నల్లని జగన్నాథుడు కూర్చున్నారు. శ్రీనాథ ద్వారములో కూడా నల్లని చిత్రాలను చూపిస్తారు. జగన్నాథుని ముఖాన్ని నల్లగా ఎందుకు చూపించారు అన్నది ఎవరికీ తెలియదు. కృష్ణుని గురించైతే, వారిని సర్పం కాటేసిందని అంటారు. రాముడికి ఏమయ్యింది? నారాయణుడి ముఖాన్ని కూడా నల్లగా చూపిస్తారు, శివలింగాన్ని కూడా నల్లగా చూపిస్తారు, అందరినీ నల్లగానే చూపిస్తారు. ఎటువంటి దృష్టినో, అటువంటి సృష్టి. ఈ సమయంలో అందరూ పతితంగా, నల్లగా ఉన్నారు, అందుకే భగవంతుడిని కూడా నల్లగా చేసేసారు. మొట్టమొదట శివుడిని పూజించేవారు, వజ్రాల లింగాన్ని తయారుచేసేవారు. ఇప్పుడు ఆ వస్తువులన్నీ మాయమైపోయాయి. అవి అతి విలువైన వస్తువులు. పాత వస్తువులకు ఎంత గౌరవము ఉంటుంది. పూజలు ప్రారంభమై 2500 సంవత్సరాలు అయ్యింది, కనుక ఆ వస్తువులు అంతే పాతవిగా ఉంటాయి కదా! దేవీ-దేవతలవి పురాతనమైన చిత్రాలు ఉన్నాయి. కానీ వారు లక్షల సంవత్సరాలవి అని అంటారు.

5000 సంవత్సరాల క్రితము భారత్ స్వర్గముగా ఉండేదని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడిది కలియుగము, వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. అందరూ వెళ్ళాల్సిందే. తండ్రే అందరినీ తీసుకువెళ్తారు. బ్రహ్మా ద్వారా మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, తర్వాత దేవతలైన మీరు పాలన చేస్తారు. ఈ విషయాలు భాగవతములో గాని, గీతలో గాని లేవు. తండ్రి అంటారు, ఈ జ్ఞానం మాయమైపోతుంది. లక్ష్మీ-నారాయణులు త్రికాలదర్శులు కారు, అటువంటప్పుడు ఈ జ్ఞానం పరంపరగా ఎలా కొనసాగగలదు. కేవలం మీరు మాత్రమే ఈ సమయంలో త్రికాలదర్శులు. అందరికన్నా మంచి సేవను ఈ సమయంలో మీరు చేస్తారు. కావున మీరు సత్యాతి-సత్యమైన ఆత్మిక సోషల్ వర్కర్లు. మీరిప్పుడు ఆత్మాభిమానులుగా అవుతారు. ఆత్మలో ఏదైతే మాలిన్యము చేరుకుందో, అది ఎలా తొలగుతుంది? తండ్రి రత్నాల వ్యాపారి కూడా కదా. బంగారములో ఇనుము యొక్క మాలిన్యము చేరుకుంటూ-చేరుకుంటూ ఆత్మ పతితముగా అయ్యింది. ఇప్పుడు పావనముగా ఎలా అవుతుంది? తండ్రి అంటారు, ఓ ఆత్మా, నన్నొక్కరినే స్మృతి చేయండి. పతిత-పావనుడైన తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు. భగవానువాచ, ఓ ఆత్మలూ, మీలో మాలిన్యము చేరుతుంది, ఇప్పుడు మీరు పతితంగా ఉన్నారు. పతితులు మళ్ళీ మహాత్ములుగా ఏమైనా అవ్వగలరా. ఒకే ఒక ఉపాయం ఉంది – నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ యోగాగ్నిలో మీ వికర్మలు దగ్ధమవుతాయి. ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి. అనేక రకాల హఠయోగాల చిత్రాలు పెట్టి ఉన్నాయి. ఇది యోగ భట్టీ లేక స్మృతి యొక్క భట్టీ. గృహస్థ వ్యవహారములో ఉండండి, భోజనము మొదలైనవి తయారుచేసుకోండి, పిల్లలను సంభాళించండి. అచ్ఛా, ఉదయమైతే సమయం ఉంటుంది కదా. ఓ నా మనసా, ప్రభాత వేళలో రామ నామాన్ని స్మరించు అని అంటారు కూడా. ఆత్మలో బుద్ధి ఉంది. భక్తి కూడా ఉదయాన్నే చేస్తారు. మీరు కూడా ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయండి, వికర్మలను వినాశనము చేసుకోండి. మొత్తం చెత్త అంతా తొలగిపోయి ఆత్మ బంగారంగా అవుతుంది, తర్వాత శరీరము కూడా బంగారముది లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ రెండు క్యారట్ల అంత విలువ కలదిగా కూడా లేదు. భారత్ లోని దేవీ-దేవతల యొక్క 84 జన్మల లెక్కను తీయాలి. ప్రపంచం యొక్క చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతాయి. కానీ దాని ఆయువు ఎంత అన్నది వారికి తెలియదు. కల్పము ఆయువు గురించి తెలియదు. తండ్రి అంటారు, నేను శ్రీమతాన్ని ఇవ్వడానికి, శ్రేష్ఠంగా తయారుచేయడానికి వచ్చాను. స్మృతి యొక్క అగ్ని ద్వారానే మాలిన్యము తొలగుతుంది, ఇంకే ఉపాయమూ లేదు. పిల్లలు సాహసవంతులుగా అవ్వాలి, భయపడకండి. ఎవరికైతే స్వయంగా తండ్రి అయిన భగవంతుడు రక్షకునిగా కూర్చుని ఉన్నారో, వారు ఎవరికి భయపడాలి? మీకు ఎవరైనా శాపాలు మొదలైనవి ఏమైనా ఇస్తారా? ఏమీ ఇవ్వరు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ పని అయినా ప్రేమతో కానివ్వండి, క్రోధముతో కాదు. తండ్రి స్మృతిలో సదా హర్షితంగా ఉండాలి. సదా దేవతల వలె చిరునవ్వుతో ఉండాలి.

2. ఆత్మలో ఏదైతే మాలిన్యము చేరుకుందో, దానిని యోగాగ్నితో తొలగించుకోవాలి. వికర్మలు వినాశనం చేసుకోవాలి. సాహసవంతులుగా అయి సేవ చేయాలి. భయపడకూడదు.

వరదానము:-

ఎవరైతే రాజుగా అయి తమ కర్మేంద్రియాల రూపీ ప్రజలను లా అండ్ ఆర్డర్ అనుసారంగా నడిపిస్తారో, వారే మాస్టర్ సర్వశక్తివాన్ రాజయోగులు. ఏ విధంగా రాజు రాజ దర్బారును ఏర్పాటు చేస్తారో, అదే విధంగా రోజూ మీరు మీ రాజ్యంలోని కర్మేంద్రియాలనే కర్మచారుల దర్బారును ఏర్పాటు చేయండి మరియు వాటి స్థితి-గతుల గురించి అడగండి, ఏ కర్మచారి అయినా వ్యతిరేకించడము లేదు కదా, అన్నీ కంట్రోల్ లో ఉన్నాయా. ఎవరైతే మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉంటారో, వారిని ఒక్క కర్మేంద్రియము కూడా ఎప్పుడూ మోసం చేయలేదు. ఆగు అనగానే ఆగిపోతాయి.

స్లోగన్:-

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

1. వాస్తవానికి జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకోవడమనేది అయితే ఒక్క క్షణం యొక్క పని మాత్రమే కావున ఒకవేళ మనుష్యులు ఒక్క క్షణంలో అర్థం చేసుకుంటే, వారికి ఒక్క క్షణమే పడుతుంది. నిజానికి నేను శాంత స్వరూప ఆత్మను మరియు పరమాత్మ సంతానాన్ని అని కేవలం తమ స్వధర్మాన్ని తెలుసుకోవడానికి ఒక్క క్షణమే పడుతుంది. ఇప్పుడిది అర్థం చేసుకోవడమనేది ఒక్క క్షణం యొక్క విషయమే కానీ దీని పట్ల నిశ్చయం ఏర్పరచుకునేందుకు ఏ హఠయోగము, ఏ జప తపాదులు, ఏ రకమైన సాధన, ఏమీ అవసరం లేదు, కేవలం తమ నిజ స్వరూపాన్ని పట్టుకోండి, చాలు. ఇకపోతే, మనం ఇంత పురుషార్థము ఏదైతే చేస్తున్నామో, అది దేని కోసము? ఇప్పుడు దీని గురించి అర్థం చేయించడము జరుగుతుంది, మనం ఇంత పురుషార్థము ఏదైతే చేస్తున్నామో, అది కేవలం ఏ విషయం కోసము చేస్తున్నామంటే – తమ ప్రాక్టికల్ జీవితాన్ని తయారుచేసుకోవాలంటే, తమ ఈ దేహాభిమానాన్ని పూర్తిగా తొలగించాలి. వాస్తవానికి ఆత్మాభిమాని రూపంలో స్థితులవ్వడానికి మరియు ఈ దైవీ గుణాలను ధారణ చేయడానికి తప్పకుండా శ్రమ అనిపిస్తుంది. ఇందులో మనం ప్రతి సమయము, ప్రతి అడుగున జాగ్రత్తగా ఉంటాము. ఇప్పుడు మనం ఎంతగానైతే మాయతో జాగ్రత్తగా ఉంటామో, అంతగా ఎన్ని ఘటనలు ఎదురు వచ్చినా కానీ మనల్ని ఎదిరించలేవు. ఎప్పుడైతే మనల్ని మనం మర్చిపోతామో, అప్పుడు మాయ ఎదిరిస్తుంది, ఇప్పుడు ఈ మాత్రం అవకాశమేదైతే ఉందో, అది కేవలం మన ప్రాక్టికల్ జీవితాన్ని తయారుచేసుకునేందుకు ఉంది. ఇకపోతే, జ్ఞానమైతే క్షణం యొక్క విషయమే.

2. మన ఈ ఈశ్వరీయ జ్ఞానం మన బుద్ధి నుండి వెలువడింది కాదు, ఇది మన తెలివి లేక మన కల్పన లేక మన సంకల్పము కాదు. కానీ ఈ జ్ఞానము మొత్తం సృష్టి యొక్క రచయిత ఎవరైతే ఉన్నారో, వారి ద్వారా విన్నటువంటి జ్ఞానము. మరియు దానితో పాటు జ్ఞానాన్ని విని అనుభవంలోకి మరియు వివేకంలోకి ఏదైతే తీసుకువచ్చామో, దానిని ప్రాక్టికల్ గా మీకు వినిపిస్తున్నాము. ఒకవేళ ఇది మన వివేకానికి సంబంధించిన విషయమైతే కేవలం మన వద్ద మాత్రమే నడుస్తుంది. కానీ దీనిని పరమాత్మ ద్వారా విని మన వివేకముతో, అనుభవంతో ధారణ చేస్తాము. ఏ విషయాన్ని అయితే ధారణ చేస్తామో, అది తప్పకుండా వివేకములోకి మరియు అనుభవంలోకి వచ్చినప్పుడే తమదిగా భావించడము జరుగుతుంది. కనుక పరమాత్మ యొక్క రచన ఏమిటి, పరమాత్మ ఎవరు అన్న విషయాలను కూడా వారి ద్వారా మనం తెలుసుకున్నాము. ఇకపోతే, ఇది మన సంకల్పానికి సంబంధించిన విషయమేమీ కాదు, ఒకవేళ అదే నిజమైతే, మన మనసులో ఉత్పన్నమయ్యేది. అందుకే మనకు స్వయంగా పరమాత్మ ద్వారా లభించిన ముఖ్యమైన ధారణా యోగ్యమైన పాయింటు ఏమిటంటే – ముఖ్యంగా యోగం జోడించాలి. కానీ యోగం కన్నా ముందు జ్ఞానం కావాలి. యోగం చేయడము కోసము ముందు జ్ఞానము కావాలి అని ఎందుకంటారు? మొదట ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి మరియు ఆ తర్వాత యోగం జోడించాలి… మొదట అర్థం చేసుకోవాలి అని ఎప్పుడూ అంటూ అంటారు, లేకపోతే తప్పుడు కర్మలు జరుగుతాయి, అందుకే మొదట జ్ఞానం అవసరము. జ్ఞానము ఒక ఉన్నతమైన స్టేజ్, దానిని తెలుసుకునేందుకు బుద్ధి కావాలి ఎందుకంటే ఉన్నతోన్నతమైన పరమాత్మ మనల్ని చదివిస్తున్నారు. అచ్ఛా – ఓం శాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top