09 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

May 8, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఏ తండ్రినైతే మీరు అర్ధకల్పం స్మృతి చేసారో, ఇప్పుడు వారి ఆజ్ఞ లభిస్తుంది కనుక ఆ ఆజ్ఞను పాటించండి, దీని ద్వారా మీ ఎక్కే కళ జరుగుతుంది’’

ప్రశ్న: -

పిల్లలైన మీరు మీ నేచర్ క్యూర్ ను మీరే చేసుకోవాలి, ఎలా?

జవాబు:-

ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండడం మరియు ప్రేమతో యజ్ఞ సేవను చేయడం ద్వారా నేచర్ క్యూర్ అవుతుంది ఎందుకంటే స్మృతితో ఆత్మ నిరోగిగా అవుతుంది మరియు సేవ ద్వారా అపారమైన సంతోషం లభిస్తుంది. కనుక ఎవరైతే స్మృతి మరియు సేవలో బిజీగా ఉంటారో, వారి నేచర్ క్యూర్ అవుతూ ఉంటుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవు రాత్రిని పోగొట్టుకున్నావు… (తూనే రాత్ గవాయి…)

ఓంశాంతి. పిల్లలు పాటను విన్నారు. మాలలు తిప్పుతూ తిప్పుతూ యుగాలు గడచిపోయాయి. ఎన్ని యుగాలు? రెండు యుగాలు. సత్య-త్రేతాయుగాలలోనైతే ఎవరూ కూడా మాల తిప్పరు. మనం ఉన్నతిలోకి వెళ్తాము మళ్ళీ కిందకు వస్తాము అని ఎవరి బుద్ధిలోనూ లేదు. మనది ఇప్పుడు ఎక్కే కళ జరుగుతుంది. మనది అనగా భారత్ ది. ఎంతగా భారతవాసులది ఎక్కే కళ మరియు దిగే కళ జరుగుతుందో, అంతగా ఇంకెవ్వరికీ జరగదు. భారత్ యే శ్రేష్ఠాచారిగా మరియు భ్రష్టాచారిగా అవుతుంది. భారత్ యే నిర్వికారిగా, భారత్ యే వికారిగా అవుతుంది. ఇతర ఖండాలు లేక ధర్మాలతో ఇంత సంబంధం లేదు. వారేమీ స్వర్గంలోకి రారు. భారతవాసుల చిత్రాలే ఉన్నాయి. తప్పకుండా రాజ్యం చేసేవారు. కనుక తండ్రి అర్థం చేయిస్తారు, ఇప్పుడు మీది ఎక్కే కళ. ఎవరి చేతినైతే పట్టుకున్నారో, వారు మిమ్మల్ని తోడుగా తీసుకువెళ్తారు. భారతవాసులైన మనదే ఎక్కే కళ. ముక్తిలోకి వెళ్ళి, మళ్ళీ జీవన్ముక్తిలోకి వస్తాము. అర్ధకల్పం దేవీ-దేవతా ధర్మం యొక్క రాజ్యం నడుస్తుంది. 21 తరాలు ఎక్కుతాము, తర్వాత దిగే కళ అయిపోతుంది. మీరు ఎక్కే కళలోకి వెళ్తే, మీ కారణంగా సర్వుల మేలు జరుగుతుంది అని అంటారు. ఇప్పుడు సర్వులకు మేలు జరుగుతుంది కదా. కానీ ఎక్కే కళ మరియు దిగే కళలోకి మీరు వస్తారు. ఈ సమయంలో భారత్ ఎంతగా అప్పు తీసుకుంటుందో, అంతగా ఇంకెవరూ తీసుకోరు. పిల్లలకు తెలుసు, మన భారత్ బంగారు పిచ్చుకగా ఉండేది. చాలా షావుకారుగా ఉండేది. ఇప్పుడు భారత్ యొక్క దిగే కళ పూర్తవుతుంది. విద్వాంసులు మొదలైనవారైతే కలియుగం యొక్క ఆయుష్షు ఇంకా 40 వేల సంవత్సరాలు నడుస్తుందని భావిస్తారు. పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. అర్థం చేయించడం కూడా చాలా యుక్తితో అర్థం చేయించాలి లేకపోతే భక్తులు దిగ్భ్రాంతి చెందుతారు. మొట్టమొదట అయితే ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇవ్వాలి. భగవానువాచ, గీత అన్నింటికీ తల్లి-తండ్రి. వారసత్వము గీత ద్వారా లభిస్తుంది, మిగిలినవన్నీ గీతకు పిల్లలు వంటివి. పిల్లల ద్వారా వారసత్వం లభించదు. పిల్లలైన మీకు గీత ద్వారా వారసత్వం లభిస్తుంది కదా. గీతా మాతకు మళ్ళీ తండ్రి కూడా ఉన్నారు. బైబిల్ మొదలైన వాటిని మాత అని అనరు. కనుక మొట్టమొదట ఇదే అడగాలి, పరమపిత పరమాత్మతో మీ సంబంధం ఏమిటి? అందరికీ తండ్రి ఒక్కరే కదా. ఆత్మలందరూ సోదరులు కదా. ఒక్క తండ్రికి పిల్లలు. తండ్రి, ప్రజాపిత బ్రహ్మా ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు, కనుక మీరు పరస్పరంలో సోదర-సోదరీలుగా అయ్యారు. అందుకే తప్పకుండా పవిత్రంగా ఉంటూ ఉంటారు. పతిత పావనుడైన తండ్రే వచ్చి యుక్తితో మిమ్మల్ని పావనంగా చేస్తారు. పిల్లలకు తెలుసు, పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతాము. ఇది చాలా గొప్ప సంపాదన. 21 జన్మల రాజ్యాధికారం కోసం పవిత్రంగా అవ్వని వారు ఎవరుంటారు. మళ్ళీ శ్రీమతం కూడా లభిస్తుంది, ఏ తండ్రిని అర్ధకల్పం స్మృతి చేసారో, వారి ఆజ్ఞను మీరు పాటించరా! వారి ఆజ్ఞపై నడుచుకోకపోతే, మీరు పాపాత్ములుగా అవుతారు. ఈ ప్రపంచమే పాపాత్ములది. రామ రాజ్యము, పుణ్యాత్ముల ప్రపంచంగా ఉండేది. ఇప్పుడు రావణ రాజ్యము, పాపాత్ముల ప్రపంచంగా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీది ఎక్కే కళ. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఎంత గుప్తంగా కూర్చున్నారు. కేవలం తండ్రిని స్మృతి చేయండి. మాల మొదలైనవేవి తిప్పే విషయం లేదు. తండ్రిని స్మృతి చేస్తూ మీరు పని చేయండి. బాబా, మీ యజ్ఞ సేవను స్థూలంగా, సూక్ష్మంగా, రెండు విధాలుగా మేము ఎలా కలిపి చేస్తున్నాము. ఈ విధంగా స్మృతి చేయండి అని బాబా ఆజ్ఞను ఇచ్చారు. నేచర్ క్యూర్ చేయిస్తారు కదా. మీ ఆత్మ నయమైతే, శరీరం కూడా నయమవుతుంది. కేవలం తండ్రి స్మృతి ద్వారానే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. పావనంగా కూడా అవ్వండి మరియు యజ్ఞ సేవ కూడా చేస్తూ ఉండండి. సేవ చేయడం వలన చాలా సంతోషం కలుగుతుంది. మేము ఇంత సమయం తండ్రి స్మృతిలో ఉండి స్వయాన్ని నిరోగిగా చేసుకున్నాము మరియు భారత్ కు శాంతి దానాన్ని ఇచ్చాము. భారత్ కు శ్రీమతంపై మీరు శాంతిని మరియు సుఖాన్ని దానమిస్తారు. ప్రపంచంలో ఆశ్రమాలైతే చాలా ఉన్నాయి కానీ అక్కడ ఏమీ ఉండదు. వారికి 21 తరాల కోసం స్వర్గ రాజ్యం ఎలా లభిస్తుంది అనేది తెలియదు.

ఇప్పుడు మీరు రాజయోగం యొక్క చదువును చదువుకుంటారు. ఆ మనుష్యులు కూడా అంటూ ఉంటారు, గాడ్ ఫాదర్ వచ్చేసారు, ఎక్కడో ఒక దగ్గర తప్పకుండా ఉండి ఉంటారు. ఇది తప్పకుండా జరుగుతుంది కదా. వినాశనం కోసం బాంబులు కూడా వెలువడ్డాయి. తప్పకుండా తండ్రే స్వర్గం యొక్క స్థాపన, నరకం యొక్క వినాశనం చేయిస్తూ ఉండవచ్చు. ఇదైతే నరకం కదా. ఎంతగా గొడవలు, కొట్లాటలు మొదలైనవి ఉన్నాయి. చాలా భయముంది. పిల్లలను ఏ విధంగా అపహరించి తీసుకువెళ్తారు. ఎన్ని ఉపద్రవాలు జరుగుతాయి. ఇప్పుడు మీకు తెలుసు, ఈ ప్రపంచం మారుతుంది. కలియుగం మారి మళ్ళీ సత్యయుగంగా అవుతుంది. మనం సత్యయుగ స్థాపనలో బాబాకు సహాయకులము. బ్రాహ్మణులే సహాయకులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులు జన్మిస్తారు. వారు కుఖవంశావళి, మీరు ముఖవంశావళి. వారు బ్రహ్మాకు సంతానమైతే అవ్వరు, మిమ్మల్ని దత్తత తీసుకోవడం జరుగుతుంది. బ్రాహ్మణులైన మీరు బ్రహ్మా యొక్క సంతానము, ప్రజాపిత బ్రహ్మా అయితే సంగమంలోనే ఉండగలరు. బ్రాహ్మణులే మళ్ళీ దేవీ-దేవతలుగా అవుతారు. మీరు కుఖవంశావళి అని మీరు ఆ బ్రాహ్మణులకు కూడా అర్థం చేయించవచ్చు. బ్రాహ్మణ దేవీ-దేవతాయ నమః అని అంటారు. బ్రాహ్మణులకు కూడా నమస్కరిస్తారు, దేవతలకు కూడా నమస్కరిస్తారు. కానీ బ్రాహ్మణులు ఇప్పుడు ఉంటేనే కదా, వారికి నమస్కరిస్తారు. బ్రాహ్మణులైన వీరు, తనువు-మనసు-ధనముతో బాబా యొక్క శ్రీమతంపై నడుస్తారు అని భావిస్తారు. ఆ బ్రాహ్మణులు దైహిక యాత్రలకు తీసుకువెళ్తారు. మీది ఆత్మిక యాత్ర , మీ యాత్ర ఎంత మధురమైనది. ఆ దైహిక యాత్రలైతే చాలా ఉన్నాయి. గురువులు కూడా చాలా మంది ఉన్నారు. అందరినీ గురువులు అని అనేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, మనం మధురమైన శివబాబా యొక్క మతంపై నడుచుకుని, వారి నుండి బ్రహ్మా ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నాము. వారసత్వం శివబాబా నుండి తీసుకుంటాము. మీరిక్కడకు వచ్చినప్పుడు, వెంటనే, ఎవరి వద్దకు వచ్చారు? అని అడుగుతారు. బుద్ధిలో ఉంటుంది, వీరు శివబాబా లోన్ తీసుకున్న రథము, మనం వారి వద్దకు వెళ్తాము. బ్రాహ్మణులు నిశ్చితార్థం చేయిస్తారు. కానీ సంబంధం ప్రేయసీ-ప్రియుల మధ్య ఉంటుంది అంతేకానీ నిశ్చితార్థం చేయించే బ్రాహ్మణుడితో కాదు. స్త్రీ పతిని గుర్తు చేస్తుందా లేక ముడి వేసేవారిని స్మృతి చేస్తుందా? మీకు కూడా ప్రియుడు, శివుడు. మళ్ళీ మీరు ఏ దేహధారినైనా ఎందుకు స్మృతి చేస్తారు? శివుడినే స్మృతి చేయాలి. ఈ లాకెట్ మొదలైనవి కూడా అర్థం చేయించడం కోసం బాబానే తయారు చేయించారు. బాబా స్వయంగా మధ్యవర్తి అయి నిశ్చితార్థం చేయిస్తారు. కనుక మధ్యవర్తిని స్మృతి చేయకూడదు. ప్రేయసుల యోగము, ప్రియునితో ఉంది. మమ్మా-బాబా వచ్చి పిల్లలైన మీ ద్వారా మురళి వినిపిస్తారు. బాబా అంటారు, ఇలా చాలామంది పిల్లలు ఉన్నారు, వారి భృకుటి మధ్యలో కూర్చుని కళ్యాణం చేయడానికి నేను మురళిని నడిపిస్తాను. కొంతమందికి సాక్షాత్కారం చేయించడానికి, మురళిని వినిపించడానికి, కొంతమందికి కళ్యాణం చేయడానికి వస్తాను. బ్రాహ్మణీలలో ఇంత శక్తి లేదు, వీరిని ఈ బ్రాహ్మణి పైకి లేపలేరు అని నాకు తెలుసు, అందుకే నేను ఎలాంటి బాణాన్ని వేస్తానంటే, వారు ఆ బ్రాహ్మణి కన్నా చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు. వీరికి మేమే అర్థం చేయించామని భావిస్తారు. దేహాభిమానంలోకి వచ్చేస్తారు. వాస్తవానికి ఈ అహంకారం కూడా రాకూడదు. అంతా చేసేవారు శివబాబా. ఇక్కడైతే, బాబాను స్మృతి చేయండి అని మీకు చెప్తారు. సంబంధం శివబాబాతో ఉండాలి. వీరైతే మధ్యలో ఉన్న మధ్యవర్తి. వీరికి దాని ప్రతిఫలం లభిస్తుంది. ఎంతైనా కూడా ఇది వృద్ధ అనుభవీ తనువు. ఇది మారడం జరగదు. డ్రామాలో నిర్ణయించబడి ఉంది. వేరే కల్పంలో ఇంకొక తనువులోకి వస్తారని కాదు. అలా కాదు. ఎవరైతే చివర్లో ఉన్నారో, వారే మళ్ళీ మొదట వెళ్ళాలి. వృక్షంలో చూడండి – చివర్లో నిలబడి ఉన్నారు కదా. ఇప్పుడు మీరు సంగమంలో కూర్చున్నారు. బాబా, ఈ ప్రజాపిత బ్రహ్మాలోకి ప్రవేశించారు. జగదంబ కామధేనువు మరియు కపిల్ దేవ్ అని కూడా అంటారు. కపుల్ అనగా జోడీ, బాప్-దాదా, మాత-పిత, ఈ కపుల్ జోడీ అయింది కదా. తల్లి నుండి వారసత్వం లభించదు. వారసత్వం అయినా కూడా శివబాబా నుండి లభిస్తుంది కనుక వారిని స్మృతి చేయాల్సి ఉంటుంది. నేను వచ్చాను, వీరి ద్వారా మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి. బ్రహ్మా కూడా శివబాబానే స్మృతి చేస్తారు. శంకరుని ఎదురుగా కూడా శివుని చిత్రాన్ని పెడతారు. ఇదంతా మహిమ కోసము. ఈ సమయంలోనైతే శివబాబా వచ్చి వారి పిల్లలుగా చేసుకుంటారు. తర్వాత మీరు తండ్రిని ఏమైనా కూర్చుని పూజిస్తారా. తండ్రి వచ్చి పిల్లలను పుష్పాలుగా చేస్తారు. మురికి నుండి బయటకు తీస్తారు. తర్వాత, మేమెప్పుడూ పతితంగా అవ్వము అని ప్రతిజ్ఞ కూడా చేస్తారు. తండ్రి అంటారు , ఒడిని తీసుకుని మళ్ళీ నల్ల ముఖం చేసుకోకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే, కుల కళంకితులుగా అయిపోతారు. ఓడిపోతే గురువు యొక్క పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు. మాయతో ఓడిపోతే పదభ్రష్టులు అయిపోతారు. ఇతర ఏ సన్యాసులు మొదలైనవారు ఈ విషయాలను నేర్పించలేరు. కొంతమంది నెలకి ఒకసారి వికారాలలోకి వెళ్ళండి అని అంటారు. మరికొంతమంది 6 నెలలకు ఒకసారి వెళ్ళండి అని అంటారు. కొంతమందైతే చాలా అజామిళ్ వలె ఉంటారు. బాబా అయితే చాలా మంది గురువులను ఆశ్రయించారు. వారెప్పుడూ పవిత్రంగా అవ్వండి అని చెప్పరు. మేమే ఉండలేము అని భావిస్తారు. తెలివైనవారు ఎవరైతే ఉంటారో, వారు వెంటనే, మీరే ఉండలేకపోతే మాకెలా చెప్తారు అని అంటారు. మళ్ళీ అంటారు, జనకుని వలె సెకండులో జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలపండి. అప్పుడు గురువులు అంటారు, బ్రహ్మ తత్వాన్ని స్మృతి చేస్తే మీరు నిర్వాణధామానికి వెళ్తారు. వెళ్ళడం ఎవ్వరూ వెళ్ళరు, శక్తే లేదు. సర్వాత్మలు నివసించే స్థానము, మూలవతనము, అక్కడ ఆత్మలైన మనం నక్షత్రం వలె ఉంటాము. పూజ కోసం పెద్ద లింగాన్ని తయారుచేస్తారు. బిందువు యొక్క పూజ ఎలా జరుగుతుంది? భృకుటి మధ్యలో అద్భుతమైన నక్షత్రం మెరుస్తుంది అని అంటారు కూడా. కనుక ఆత్మల యొక్క తండ్రి కూడా అలాగే ఉంటారు కదా. తండ్రికి దేహం లేదు. ఆ నక్షత్రం యొక్క పూజ ఎలా జరగగలదు. తండ్రిని పరమాత్మ అని అంటారు. వారైతే ఫాదర్. ఆత్మ ఎలాగైతే ఉంటుందో, పరమాత్మ కూడా అలాగే ఉంటారు. వారేమీ పెద్దగా ఉండరు. వారిలో ఈ జ్ఞానముంది. ఈ అనంతమైన వృక్షం గురించి ఇంకెవరికీ తెలియదు. తండ్రే నాలెడ్జ్ ఫుల్. జ్ఞానంలో కూడా ఫుల్ గా ఉన్నారు, పవిత్రతలో కూడా ఫుల్ గా ఉన్నారు. సర్వులకు సద్గతిదాత, సర్వులకు సుఖ-శాంతులను ఇచ్చేవారు. పిల్లలైన మీకు ఎంత గొప్ప వారసత్వం లభిస్తుంది, ఇంకెవ్వరికీ లభించదు. మనుష్యులైతే ఎంతమంది గురువులను పూజిస్తారు. తమ చక్రవర్తిని కూడా అంతగా పూజించరు. కనుక ఇదంతా అంధశ్రద్ధ కదా. ఏమేమి చేస్తూ ఉంటారు. అన్నింటిలోనూ నిందయే నింద ఉంది. కృష్ణుడిని లార్డ్ అని కూడా అంటారు మరియు గాడ్ అని కూడా అంటారు. గాడ్ కృష్ణ స్వర్గం యొక్క మొదటి రాకుమారుడు, లక్ష్మి-నారాయణల గురించి కూడా, వీరిద్దరూ గాడ్-గాడెస్ అని అంటారు. పాత-పాత చిత్రాలను చాలా మంది కొనుగోలు చేస్తారు. పాత-పాత స్టాంపులు కూడా అమ్ముడుపోతాయి కదా. వాస్తవానికి అన్నింటికన్నా పాతవారు అయితే శివబాబా కదా, కానీ ఎవ్వరికీ తెలియదు. మహిమ అంతా శివబాబాదే ఉంది. వారైతే లభించజాలరు. అతి పురాతనమైన వస్తువేది? నంబరువన్ శివబాబా. ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేరు, మన తండ్రి ఎవరు? వారి నామ-రూపాలు ఏమిటి? వారికి నామ-రూపాలు ఏమీ లేవు అని అనేస్తారు, అప్పుడు ఎవరిని పూజిస్తారు? శివ అన్న పేరైతే ఉంది కదా. దేశం కూడా ఉంది, కాలం కూడా ఉంది. నేను సంగమంలో వస్తానని స్వయంగా అంటారు. ఆత్మ శరీరం ద్వారా మాట్లాడుతుంది కదా. శాస్త్రాలలో ఎన్ని కట్టు కథలు రాసారు అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. వాటి ద్వారా దిగే కళ జరిగింది. ఎక్కే కళ సత్య-త్రేతాయుగాలు, దిగే కళ ద్వాపర-కలియుగాలు. ఇప్పుడు మళ్ళీ ఎక్కే కళ జరుగుతుంది. తండ్రి తప్ప ఎవరూ ఎక్కే కళను ఏర్పరచలేరు. ఇవన్ని విషయాలు ధారణ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగానైతే శ్రీనాథ ద్వారంలో నోటికి వస్త్రాన్ని కట్టుకుని పని చేస్తారు కదా, అలా ఏదైనా పని మొదలైనవి చేస్తూ స్మృతిలో ఉండాలి. శ్రీనాథ్ అని కృష్ణుడిని అంటారు. శ్రీనాథునికి భోజనం తయారవుతుంది కదా. శివబాబా అయితే భోజనం మొదలైనవి తినరు. మీరు పవిత్రమైన భోజనం తయారుచేస్తారు కనుక స్మృతిలో ఉండి తయారుచేయాలి, అప్పుడు దాని ద్వారా బలం లభిస్తుంది. కృష్ణలోకంలోకి వెళ్ళేందుకు వ్రతాలు, నియమాలు మొదలైనవి పాటిస్తారు. మనం కృష్ణపురిలోకి వెళ్తున్నామని ఇప్పుడు మీకు తెలుసు. అందుకే మిమ్మల్ని యోగ్యులుగా తయారుచేయడం జరుగుతుంది. మీరు తండ్రిని స్మృతి చేస్తారు, కనుక మీరు కృష్ణపురిలోకి తప్పకుండా వెళ్తారని మళ్ళీ బాబా గ్యారంటీ ఇస్తారు. మీకు తెలుసు, మనం మన కోసమే కృష్ణపురిని స్థాపన చేస్తున్నాము, మళ్ళీ మనమే రాజ్యం చేస్తాము. ఎవరైతే శ్రీమతంపై నడుచుకుంటారో, వారు కృష్ణపురిలోకి వస్తారు. లక్ష్మీ-నారాయణుల కన్నా కూడా కృష్ణుడి యొక్క పేరు ప్రసిద్ధి చెందింది. కృష్ణుడు చిన్న బాలుడు కనుక మహాత్మతో సమానము. బాల్యావస్థ సతోప్రధానమైనది, అందుకే కృష్ణుడికి ఎక్కువ పేరు ఉంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ పూర్తి సంబంధం ఒక్క శివబాబాతో పెట్టుకోవాలి. ఎప్పుడూ ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు. ఎప్పుడూ తమ గురువు (తండ్రి) పేరును అప్రతిష్టపాలు చేయకూడదు.

2. తమ ద్వారా ఒకవేళ ఎవరిదైనా కళ్యాణం జరిగినట్లయితే, నేను వీరి కళ్యాణం చేసాను అన్న అహంకారం రాకూడదు. ఇది కూడా దేహాభిమానము. చేయించే వారైన తండ్రిని స్మృతి చేయాలి.

వరదానము:-

రోజూ అమృతవేళ 3 బిందువుల తిలకాన్ని పెట్టుకోండి అని బాప్ దాదా ఎల్లప్పుడూ చెప్తారు. మీరు కూడా బిందువు, తండ్రి కూడా బిందువు మరియు ఏదైతే జరిగిపోయిందో, ఏదైతే జరుగుతూ ఉందో, నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు), కనుక ఫుల్ స్టాప్ కూడా బిందువే. ఈ 3 బిందువుల యొక్క తిలకం పెట్టుకోవడం అనగా స్మృతిలో ఉండడము. అప్పుడు రోజంతా అచంచలంగా-స్థిరంగా ఉంటారు. ఎందుకు, ఏమిటి అనే అలజడి సమాప్తమైపోతుంది. ఏ సమయంలోనైతే ఏదైనా విషయం జరుగుతుందో, ఆ సమయంలో ఫుల్ స్టాప్ పెట్టేయండి. నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు), జరగాల్సి ఉంది, జరుగుతుంది… సాక్షిగా చూడండి మరియు ముందుకు వెళ్తూ ఉండండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top