09 June 2021 TELUGU Murli Today – Brahma Kumari

8 June 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వికారాల తాపాన్ని ఆర్పి వేసి, అందరినీ శీతలంగా చేసేందుకు తండ్రి వచ్చారు, జ్ఞాన వర్షం శీతలంగా చేస్తుంది”

ప్రశ్న: -

ఏ తాపము మొత్తం ప్రపంచాన్ని కాల్చివేస్తూ ఉంది?

జవాబు:-

కామ వికారము యొక్క తాపము మొత్తం ప్రపంచాన్ని కాల్చివేస్తూ ఉంది. అందరూ కామాగ్నిలో కాలిపోయి నల్లగా అయిపోయారు. తండ్రి జ్ఞాన వర్షంతో వారిని శీతలంగా చేస్తారు. ఎలాగైతే వర్షం కురవడంతో ధరిత్రి శీతలంగా అవుతుందో, అలా ఈ జ్ఞాన వర్షంతో మీరు 21 జన్మలకు శీతలంగా అయిపోతారు. ఏ రకమైన తాపము ఉండదు. తత్వాలు కూడా సతోప్రధానంగా అయిపోతాయి, ఇక ఎవరూ తాపముతో కాలిపోరు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఆత్మిక పిల్లలు ఎవరి స్మృతిలో కూర్చున్నారు? తప్పకుండా తమ ఆత్మిక తండ్రి స్మృతిలో కూర్చున్నారు. ఆత్మిక తండ్రి వచ్చి మమ్మల్ని రిఫ్రెష్ చేసి శీతలంగా చేస్తారని, ఆత్మ తన పరమపిత పరమాత్ముని స్మృతిలో కూర్చొంది ఎందుకంటే కామ చితిపై కూర్చొని భారత్ పూర్తిగా కాలిపోయింది. తాపాన్ని చల్లార్చండి అని పాడుతారు కూడా. ఏ తాపము? కామ చితి యొక్క తాపము. తాపము ఎక్కువగా ఉన్నప్పుడు మనుష్యులు మరణిస్తారు. ఈ కామ చితి యొక్క తాపములో భారత్ పూర్తిగా కాలిపోయింది. అందుకే, మీరు వచ్చి శీతలంగా చేయండి అని తండ్రిని స్మృతి చేస్తారు. వర్షం కురిస్తే శీతలంగా అవుతుంది, ధరణి శీతలమవుతుంది. ఇది జ్ఞాన వర్షము. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి, ఇంత శీతలంగా చేస్తారు. వారు ఎంతగా ఇస్తారంటే, ఇక సత్యయుగంలో ఏ వస్తువు కోసం ఉత్సుకత ఉండదు. అర్ధకల్పం బట్టి బాగా ఎదురుచూస్తూ వచ్చారు – బాబా, మీరు వచ్చి శీతలంగా చేయండి, పతితపావనుడైన తండ్రి, మీరు వచ్చి మమ్మల్ని శీతలంగా చేయండి అని అనేవారు. ఈ జ్ఞాన వర్షంతో భారత్ మరియు మొత్తం ప్రపంచమంతా శీతలంగా అయిపోతుంది. మీరు స్వర్గానికి యజమానులుగా అయిపోతారు. మనుష్యులు మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారని అంటారు. ఇలా అంటూ వారు కేవలం నోటిని తీపి చేసుకుంటారు. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతుందని మీకు తెలుసు. తండ్రి వచ్చి ఉన్నారు, ఈ జ్ఞాన వర్షాన్ని కురిపిస్తున్నారు. శీతలత యొక్క ప్రభావం 21 జన్మలు ఉంటుంది. అక్కడ వర్షం కోసం లేదా మరే వస్తువు కోసమైనా కోరిక ఉండదు. సదా వసంతమే ఉంటుంది. అక్కడ ఏ రకమైన దుఃఖము ఉండదు. సూర్యుడు కూడా సతోప్రధానంగా అవుతాడు, ఎప్పుడు తాపాన్ని చూపించడు. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అయిపోతారు. ఇప్పుడైతే బానిసలుగా ఉన్నారు కదా. నేను బానిసను, నేను మీ బానిసను….. అని పాడుతారు, తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు – మీ సేవ చేసేందుకు నేను మీకు సేవకునిగా వచ్చాను, పిల్లలైన మీకు సేవ చేస్తాను. నేను పరాయి పతిత దేశంలో, పతిత శరీరంలోకి వస్తాను. ఈ పతిత ప్రపంచంలో పావనమైనవారు ఒక్కరు కూడా ఉండరు. సత్యయుగాన్ని పావనమని, కలియుగాన్ని పతితమని అంటారు ఎందుకంటే ఇక్కడ అందరూ వికారులుగా ఉన్నారు. భారతవాసులే ఈ నాలెడ్జ్ ను అర్థం చేసుకుంటారు. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో, వారే ఈ నాలెడ్జ్ ను వింటారు లేదా ఎవరైతే సత్య-త్రేతా యుగాలలోకి వచ్చేవారిగా ఉంటారో, వారే వచ్చి, నంబరువారు పురుషార్థానుసారంగా బ్రాహ్మణులుగా అవుతారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారని, తర్వాత మీరే దేవతా వర్ణంలోకి వస్తారని తండ్రి అర్థం చేయించారు. బ్రాహ్మణ వర్ణాన్ని అనగా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వస్తారు. బ్రహ్మా, బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. (బ్రహ్మా లేకుండా) కేవలం పరమపిత పరమాత్మ వచ్చి, శూద్రులను బ్రాహ్మణులుగా చేస్తారని అనరు. ఇక్కడ మీ పిల్లిమొగ్గలాట నడుస్తుంది. ఇది చాలా సహజము. ఈ చక్రం ఎలా తిరుగుతుంది అనేది మీకు తెలుసు. విరాట రూపంలో పిలక స్థానంలో ఉండే బ్రాహ్మణులను మరియు శివబాబాను చూపించడం మర్చిపోయారు. దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు….. అని అంటారు, మళ్ళీ శూద్రుల నుండి దేవతలుగా అవుతారు. మరి బ్రాహ్మణులు ఏమయ్యారు? బ్రాహ్మణ దేవతాయ నమః అని బ్రాహ్మణులు పాడుతారు కూడా. మరి ఆ సమయంలో ప్రజాపిత బ్రహ్మా వంశావళి ఏమైనట్లు? ప్రజాపిత బ్రహ్మా పేరు ఎంత ప్రసిద్ధమైనది. చిత్రాలలో కూడా ఎన్ని పొరపాట్లు చేసేసారు. ప్రజాపిత బ్రహ్మా సంతానానికి సంబంధించిన విషయాలేవీ లేవు. స్కూలులో టీచరు చదివిస్తారు. అది సంపాదనకు ఆధారము. లక్ష్యం-ఉద్దేశ్యం తప్పకుండా ఉండాలి. ఈ చదువుతోనే పదవి లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. భగవంతుడు పతిత ప్రపంచంలో వచ్చి పతితులను చదివిస్తారు. నేను పిల్లలైన మిమ్మల్ని చదివించి పావనంగా చేస్తానని తండ్రి అంటారు. ఈ చదువుతో ఎంత భారీ సంపాదన ఉంటుందో చూడండి. అర్ధకల్పం కోసం మీరు భాగ్యాన్ని తయారుచేసుకుంటారు. భారత్ లో 21 తరాలు అని గాయనం చేయబడింది, ఇప్పుడు మీరు 21 తరాల కోసం అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని పొందుతారు. లౌకిక తండ్రి ఇచ్చేది అల్పకాలిక క్షణ భంగుర వారసత్వము. ఈ తండ్రి నుండి మీరు ఎలాంటి వారసత్వాన్ని పొందుతారంటే, ఇక తరతరాలకు మీకు దుఃఖం ఉండదు. భారత్ లోనే అనంతమైన సుఖముండేది. ఈ జ్ఞానం ఇంకెవరి బుద్ధిలోనూ లేదు. ఈ జ్ఞానాన్నిచ్చే తండ్రికి తెలుసు మరియు ఎవరికైతే ఇస్తారో వారికి తెలుసు, ఇంకెవరికీ దీని గురించి తెలియదు. గ్రంథ్ లో కూడా ఏక్ ఓంకార్….. నిరాకార్, నిరహంకార్ అని వారి మహిమ గాయనం చేయబడింది. దీని అర్థం కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. వారు కేవలం నిరహంకారి అని పాడుతారు. ఇంత గొప్ప అథారిటీ అయి ఉండి కూడా, వారికెలాంటి అహంకారం లేదు. ఇక్కడ కొద్దిగా పొజిషన్ లో ఉన్నా సరే, వారికి ఎంత నషా ఉంటుంది. నేను ఫలానా….. అని వారికి అల్పకాలిక పదవి యొక్క నషా ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ ఆత్మిక చదువు యొక్క నషా ఉంది. ఆత్మాభిమానులుగా అవ్వాలి, అప్పుడే తండ్రిని స్మృతి చేయగలరు అని ఆత్మలైన మీకిప్పుడు తెలుసు. తండ్రితో యోగం తెగిపోవడం వలన మాయ తుపాకి గుండు తగులుతుంది, అప్పుడు వాడిపోతారు. స్మృతి చేస్తూ ఉన్నట్లయితే సంతోషపు పాదరసం ఎక్కి ఉంటుంది. ఎవరైనా పెద్ద పరీక్షలో పాస్ అయితే సంతోషం కలుగుతుంది, ఇక ఇంతకన్నా పెద్ద చదువేదీ లేదనుకుంటారు. మన ఈ చదువుకన్నా ఉన్నతమైన చదువేదీ లేదని మీకు కూడా తెలుసు. ఈ లక్ష్మీనారాయణులు తప్పకుండా గతంలో ఈ చదువును చదువుకున్నారు, రాజయోగాన్ని నేర్చుకున్నారు, అందుకే మహారాజా-మహారాణిగా అయ్యారు. రాజయోగము ప్రసిద్ధమైనది. పరమపిత పరమాత్మ వచ్చి స్వర్గం కోసం రాజయోగాన్ని నేర్పిస్తారు. గతంలో అటువంటి కర్మలు చేసారు కావుననే అలా తయారయ్యారని చెప్పుకుంటారు కూడా.

ఈ జన్మలో మనం ఎటువంటి కర్మలను నేర్చుకుంటామంటే, ఇక భవిష్యత్తులో 21 జన్మలు రాజ్యం చేస్తామని మరియు స్వర్గంలో విరాజమానమై ఉంటామని మీకు తెలుసు. యథా రాజా రాణి, తథా ప్రజా ఉంటారు కదా. ఇది రాజధాని కదా. తండ్రి రాజధాని స్థాపన చేయడానికి వచ్చారు. తర్వాత మీరు వెళ్ళి 21 జన్మలు పాలన చేస్తారు. 63 జన్మలు దుఃఖం అనుభవించారు. అదంతా సమాప్తమైపోతుంది. భారత్ ను స్వర్గమని అంటారు, ఇప్పుడు నరకంగా ఉంది. సృష్టి ఎంతగా మారిపోయింది. ఆ రాజ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? రావణ రాజ్యం ప్రారంభమవ్వడంతో, మీరు మళ్ళీ పతితంగా అయిపోతారు. మీకు మీ 84 జన్మల చక్రం గురించి తెలియదని తండ్రి అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు పదే-పదే అర్థం చేయించడం జరుగుతుంది. మీరు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసారు. ఇప్పుడిది మీ అంతిమ జన్మ. ఇప్పుడు మళ్ళీ మీ వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు ముక్తిధామంలో కూర్చుండిపోకూడదు. మీది ఆల్రౌండ్ పాత్ర. సత్యయుగం నుండి మొదలుకొని ద్వాపర, కలియుగాల వరకు కూడా, ముక్తిధామంలోనే ఉండేవారు చాలామంది ఉంటారు. ఇక్కడకు రావడం కన్నా ముక్తిధామమే మంచిదని అనరు. అలా ఉంటే దోమల గుంపు వలె ఉన్నట్లు. వస్తారు మరియు వెళ్ళిపోతారు. మనుష్యుల మహిమ గాయనం చేయబడుతుంది. ఈ మందిరాలు ఎవరివి? ఎవరైతే ప్రారంభం నుండి పాత్రను అభినయిస్తూ వచ్చారో, వారి స్మృతిచిహ్నాలే తయారవుతూ వచ్చాయి. ఎవరైతే చివర్లో వస్తారో, వారి స్మృతిచిహ్నాలు ఉంటాయా? ఏమీ ఉండవు. మీవైతే ఎంత భారీ స్మృతి చిహ్నాలు. మీరు అందరికన్నా ఎక్కువ పాత్రను అభినయిస్తారు. మీరు మీ ప్రారబ్ధ సమయాన్ని పూర్తి చేసుకొని భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు, మీ స్మృతిచిహ్నాలు మరియు శివబాబా మందిరాలు మళ్ళీ తయారవ్వడం ప్రారంభమవుతాయి. తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి, వారి ధర్మ స్థాపన జరుగుతుంది. మీకు మీ చరిత్ర-భూగోళాల గురించి కూడా తెలుసు మరియు అన్ని ధర్మాల వారి గురించి కూడా తెలుసు. ఇవి 84 జన్మల మెట్లు. ముందు మనం స్వర్గంలోకి వస్తాము, తర్వాత ఏ విధంగా దిగిపోతాము అనేది మీ బుద్ధిలో ఉంది. ప్రతి జన్మలోనూ రకరకాల నామ-రూపాల కల మిత్ర-సంబంధీకులు మొదలైనవారు లభించారు. డ్రామాలో మీ ఈ పాత్ర అంతా ముందే నిశ్చయించబడి ఉంది. ఇది అనంతమైన డ్రామా, ఇది యథావిధిగా రిపీట్ అవుతుంది. మనమే దేవీ-దేవతలుగా ఉండేవారమని, 84 జన్మలు తీసుకొని శూద్రులుగా అయ్యామని మీకు తెలుసు. మళ్ళీ మనమే దేవీ-దేవతలుగా అవుతాము. మనుష్యులు, ఆత్మనే పరమాత్మ అని అంటారు. వాస్తవానికి హమ్ సో అర్థం ఇది (దేవతలు కాల చక్రంలో తిరగడం). వారు ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని అంటారు. రాత్రి-పగలుకున్నంత తేడా ఉంది కదా. ఇప్పుడు మీరు ఈ విషయాలన్నింటి గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు పాండవులుగా అయ్యారు. కౌరవులు-పాండవులు పరస్పరంలో సోదరులుగా ఉండేవారు కదా. ఇప్పుడు తండ్రి లభించారు కనుక మీరు కౌరవుల నుండి పాండవులుగా అయ్యారు. తండ్రి మిమ్మల్ని దుఃఖం నుండి విముక్తులుగా చేసి, మార్గదర్శకునిగా అయి తీసుకువెళ్తారు. ఇంటి గురించి ఎవరికీ తెలియదు. ఆత్మ బ్రహ్మములో లీనమైపోతుందని వారంటారు. అటువంటప్పుడు అది ఇల్లు అవ్వదు కదా. ఇల్లు అంటే అందులో నివసించడం జరుగుతుంది. దానిని నిరాకార ప్రపంచమని అంటారు. నిరాకారీ ఆత్మలైన మనము నిరాకార ప్రపంచంలో, బిందువుల వలె నివసిస్తామని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. అక్కడ కూడా నిరాకారీ వృక్షముంటుంది. ఈ డ్రామా తయారుచేయబడినది. బీజం మరియు వృక్షం గురించి తెలుసుకోవాలి. దీని పేరే వెరైటీ ధర్మాల వృక్షం, ఇది మనుష్య సృష్టి. దీని బీజరూపుడు తండ్రి, ఇందులో ఎన్ని వెరైటీలున్నాయి. ప్రతి ధర్మంవారి ముఖ కవళికలు వేర్వేరుగా ఉంటాయి, ఇక్కడ కూడా ఒకరి ముఖ కవళికలు మరొకరితో కలవవు. ఈ డ్రామా ఇలా తయారుచేయబడింది. కల్పవృక్షం ఆయువు 5 వేల సంవత్సరాలని తండ్రియే అర్థం చేయిస్తారు. మనుష్యులు పాత్రధారులు, పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తారు. ఇది రంగస్థలం, ప్రకాశాన్నిచ్చేందుకు సూర్య-చంద్రులు మొదలైనవి ఉన్నాయి. ఇవి దేవతలేమీ కాదు, ఇవి దీపాలు. కానీ సేవ చేస్తాయి కావున దేవతలని అంటారు. వాస్తవానికి దేవతలు ఏమీ సేవ చేయరు, పిల్లలైన మీరు సేవ చేస్తారు. తండ్రి విధేయత గల సేవకుడు. పిల్లలు దుఃఖితులైనప్పుడు తండ్రికి దయ కలుగుతుంది. తండ్రి అర్థం చేయించేందుకు వచ్చారు. పిల్లలైన మీకు మళ్ళీ దేవీ దేవతా పదవిని ప్రాప్తి చేయించేందుకు వస్తాను. ప్రతి వస్తువుకు ఎక్కే కళ, దిగే కళ ఉంటాయి. పాత ప్రపంచాన్ని తమోప్రధానమని, కొత్త ప్రపంచాన్ని సతోప్రధానమని అంటారు. ప్రతి వస్తువు కొత్త నుండి పాతదిగా అవుతుంది. ఈ శరీరం కూడా తమోప్రధానంగా, పతితంగా ఉందని ఆత్మ అంటుంది. సత్యయుగంలో ఆత్మ మరియు శరీరం సతోప్రధానంగా ఉండేవి. అక్కడ ఇబ్బంది పెట్టేవేవీ ఉండవు. ఇప్పుడు ఆత్మకు జ్ఞానం లభించింది. మేము 84 జన్మలు తీసుకుంటామని స్మృతి కలిగింది. ఈ రహస్యాన్ని అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. దుఃఖంలో తండ్రినే పిలుస్తూ ఉంటారు. దయ చూపించండి, ఓ దుఃఖహర్త-సుఖకర్త….. అని పిలుస్తారు. భారత్ యే అన్నింటికన్నా సుఖమయంగా ఉండేది కదా. భారత్ వంటి పవిత్ర ఖండం ఇంకేదీ ఉండదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీ జోలిని అవినాశీ జ్ఞాన రత్నాలతో నింపుతున్నారు. ఇటువంటి తండ్రిని ఎప్పుడైనా చూసారా? పిల్లలూ, నేను మీ కోసం వైకుంఠాన్ని కానుకగా తీసుకువచ్చానని అంటారు. మీరు స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు పతితంగా, నరకవాసులుగా అయిపోయారు. ఎవరైతే వికారాల్లోకి వెళ్ళరో, వారిని పావనులని అంటారు. సత్యయుగంలో సంపూర్ణ నిర్వికారులుంటారు. ఈ సమయంలో సంపూర్ణ వికారులుగా ఉన్నారు. తండ్రి అంటారు – మీరు కూడా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు, ఇప్పుడు సంపూర్ణ వికారులుగా అయ్యారు, తండ్రిని స్మృతి చేసి మళ్ళీ సంపూర్ణ నిర్వికారీ దేవతా పదవిని పొందాలి. మన్మనాభవ అనే పదం ఎంత బాగుందో చూడండి. తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే, మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయిపోతారు. నేను సర్వశక్తివంతుడిని కదా. నన్ను స్మృతి చేయండి. స్మృతినే యోగాగ్ని అని అంటారు, దీనితో మీ పాపాలు దగ్ధమవుతాయి. మీరు పవిత్రంగా అయిపోతారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మిక చదువు యొక్క నషాలో ఉండాలి. తండ్రి సమానంగా నిరహంకారులుగా అవ్వాలి. పొజిషన్ మొదలైనవాటి అహంకారం ఉండకూడదు.

2. తమ జోలిని జ్ఞాన రత్నాలతో నింపుకోవాలి. సంపూర్ణ నిర్వికారులుగా అయ్యి, దేవతా పదవిని పొందాలి. ఎప్పుడూ వాడిపోకూడదు.

వరదానము:-

ఎలాగైతే సూర్యుడు తన కిరణాలతో చెత్తను మరియు మురికిలోని క్రిములను భస్మం చేస్తాడో, అలా మీరు మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయి ఎటువంటి పతిత ఆత్మనైనా చూసినప్పుడు, వారి పతిత సంకల్పాలు, పతిత వృత్తి మరియు దృష్టి భస్మమైపోతాయి. పతితపావని ఆత్మపై పతిత సంకల్పాలు దాడి చేయలేవు. పతితాత్మలు పతిత-పావని అయినవారిపై బలిహారమైపోతారు. దీనికోసం మైట్ హౌస్ అనగా మాస్టర్ జ్ఞాన సూర్యుని స్థితిలో సదా స్థితులై ఉండండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top