09 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

July 8, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - పాడైనదానిని బాగు చేసేవారు అనగా భాగ్యాన్ని తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు మీకు నాలెడ్జ్ ఇచ్చి భాగ్యవంతులుగా చేస్తారు”

ప్రశ్న: -

పిల్లలైన మీ ఈ ఆత్మిక భట్టీలో ఉన్నటువంటి ఒక నియమం ఏమిటి?

జవాబు:-

ఆత్మిక భట్టీలో అనగా స్మృతి యాత్రలో కూర్చునేవారు ఎప్పుడూ కూడా వారి ఆలోచనలను అటు-ఇటు వెళ్ళనివ్వకూడదు, ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఒకవేళ బుద్ధి అటు-ఇటు భ్రమిస్తే, కునికిపాట్లు పడుతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు. దీనితో వాయుమండలం పాడైపోతుంది. తమను తామే నష్టపరచుకుంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మనసు యొక్క ఆధారం తెగిపోకూడదు….. (దిల్ కా సహారా టూట్ న జాయే…..)

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని రెండు మాటలను విన్నారు. పిల్లలను సావధానపరచడం జరుగుతుంది. ఈ సమయంలో బ్రాహ్మణులైన మీది తప్ప అందరి భాగ్యం పాడైపోయింది. ఇప్పుడు పాడైపోయిన మీ భాగ్యం బాగవుతుంది. తండ్రిని భాగ్యం తయారుచేసేవారు అని అంటారు. శివబాబా ఎంత మధురమైనవారు అనేది మీకు తెలుసు. ‘బాబా’ అనే పదం చాలా మధురమైనది. తండ్రి నుండి ఆత్మలందరికీ వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి నుండి కొడుకులకు వారసత్వం లభిస్తుంది, కుమార్తెలకు కాదు. ఇక్కడ కొడుకులు మరియు కూతురులు, అందరూ వారసత్వానికి హక్కుదారులు. తండ్రి ఆత్మలను అనగా తన పిల్లలను చదివిస్తారు. మేమంతా సోదరులమని ఆత్మ భావిస్తుంది. తప్పకుండా బ్రదర్ హుడ్ (సోదర భావము) అని అంటారు కదా. ఆ ఒక్క భగవంతుని పిల్లలు అయినప్పుడు, ఎందుకు ఇంతగా కొట్లాడుకుంటారు-గొడవపడతారు? అందరూ పరస్పరంలో కొట్లాడుకుంటూనే ఉంటారు. అనేక ధర్మాలు, అనేక మతాలున్నాయి. ముఖ్యమైన విషయమేమిటంటే, రావణ రాజ్యంలో కొట్లాటలే జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే వికారాలు ప్రవేశించి ఉన్నాయి. కామ వికారం గురించి కూడా ఎన్ని కొట్లాటలు-గొడవలు జరుగుతాయి. ఈ విధంగా చాలామంది రాజులు యుద్ధాలు చేసారు. కామము కోసం చాలా కొట్లాడుతారు, ఎంత సంతోషిస్తూ ఉంటారు. ఎవరిపట్లనైనా మనస్సు కలిగితే, ఆమె కోసం హత్య చేయడానికి కూడా వెనకాడేవారు కాదు. కామము మహాశత్రువు. క్రోధం కలవారిని కోపిష్టి అని అంటారు. లోభమున్న వారిని లోభి అని అంటారు. కానీ ఎవరైతే కాముకులు ఉంటారో, వారికి చాలా పేర్లు పెడతారు, అందుకే అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు స్వీకరిస్తారని అంటారు. శాస్త్రాలలో అమృతమనే పేరు రాసేసారు. సాగర మథనం చేసినప్పుడు అమృతం వెలువడిందని, కలశం లక్ష్మికి ఇచ్చారని చూపిస్తారు. ఇలా ఎన్ని కథలున్నాయి. వీటిలో కూడా అన్నింటికన్నా పెద్ద విషయాలు – సర్వవ్యాపికి సంబంధించినది, గీతా భగవంతుడు ఎవరు మరియు పతితపావనుడు ఎవరు? ప్రదర్శనీలలో ముఖ్యంగా ఈ చిత్రాల గురించే అర్థం చేయించడం జరుగుతుంది. జ్ఞానసాగరుడు మరియు వారి నుండి వెలువడిన జ్ఞాన గంగలు పతితపావనులా లేక నీటి నది మరియు నీటి సాగరమా? ఎన్ని మంచి మంచి విషయాలను అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు – మధురాతి మధురమైన పిల్లలూ, మిమ్మల్ని ఎవరు పావనంగా చేసారు? పాడైనదానిని బాగుచేసేవారు ఎవరు? ఆ పతితపావనుడు ఎప్పుడు వస్తారు? ఈ ఆట ఎలా తయారయ్యింది? ఈ విషయాలు ఎవరికీ తెలియదు. తండ్రినే నాలెడ్జ్ ఫుల్ (జ్ఞాన స్వరూపుడు), బ్లిస్ ఫుల్ (ఆనంద స్వరూపుడు), పీస్ ఫుల్ (శాంతి స్వరూపుడు) అని అంటారు. పాడైనదానిని బాగుచేసేవారు ఒక్కరేనని గాయనం చేయడం కూడా జరుగుతుంది. నిజంగా రావణుడే మనదంతా పాడుచేస్తాడని అర్థమవుతుంది. ఇది గెలుపు-ఓటముల ఆట. రావణుని గురించి కూడా మీకు తెలుసు, భారతవాసులు అతడిని ప్రతి సంవత్సరం కాలుస్తూ ఉంటారు. అతడు భారత్ యొక్క శత్రువు. భారత్ లోనే ప్రతి సంవత్సరం కాలుస్తారు. ఎప్పటి నుండి కాలుస్తున్నారని వారిని అడగండి. ఎప్పటి నుండైతే సృష్టి ప్రారంభమయ్యిందో, అప్పటి నుండి ఇది అనాదిగా కొనసాగుతూ వస్తుందని అంటారు. శాస్త్రాలలో ఏదైతే చదివారో, దానిని సత్యం-సత్యం అని అంటూ వస్తారు. ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అనడమే ముఖ్యమైన పొరపాటు. ఇది ఫలానా వారి తప్పు అని తండ్రి అనరు. ఇది డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఇది గెలుపు-ఓటముల ఆట. మాయతో ఓడిపోతే ఓడినట్లు, మాయపై గెలుస్తే గెలిచినట్లు. మాయతో ఎలా ఓడిపోతారు అనేది కూడా అర్థం చేయించడం జరుగుతుంది. అర్ధకల్పం పూర్తిగా రావణ రాజ్యం నడుస్తుంది. ఒక్క సెకెండు కూడా తేడా ఉండదు. రామ రాజ్య స్థాపన మరియు రావణ రాజ్య వినాశనము, ఇవి వాటి సమయానుసారంగా ఏక్యురేట్ గా జరుగుతాయి. సత్యయుగంలో లంక ఉండదు. లంక బౌద్ధ ధర్మానికి చెందిన ఖండము. లండన్ ఇటు వైపు ఉంది, అమెరికా ఇటు వైపు ఉంది అని చదువుకున్నవారి బుద్ధిలో ఉంటుంది. చదువుతో బుద్ధి తాళం తెరుచుకుంటుంది. ప్రకాశం వస్తుంది. దీనిని జ్ఞానమనే మూడవ నేత్రం అని అంటారు. వృద్ధ మాతలు చాలా విషయాలను అర్థం చేసుకోలేరు. వారు ఆ ఒక్క ముఖ్యమైన విషయాన్ని ధారణ చేయాలి, అదే అంతిమంలో ఉపయోగపడుతుంది. మనుష్యులు శాస్త్రాలను చాలా చదువుతారు, ఆఖరులో మళ్ళీ రామ-రామ అని అనమని చెప్తారు. అంతేకానీ శాస్త్రాలను వినిపించండి, వేదాలను వినిపించండి అని అనరు. ఆఖరులో రాముడిని స్మృతి చేయండి అని అంటారు. ఎవరైనా ఎక్కువ సమయం ఏ చింతనలో ఉంటారో, అంతిమంలో కూడా అదే గుర్తుకొస్తుంది. ఇప్పుడు అందరి వినాశనం జరగనున్నది. అందరూ ఎవరిని స్మృతి చేస్తారు అనేది మీకు తెలుసు. కొందరు కృష్ణుడిని, కొందరు తమ గురువులను గుర్తు చేస్తారు. కొందరు తమ దేహ సంబంధీకులను గుర్తు చేస్తారు. దేహాన్ని గుర్తు చేసారంటే ఇక ఆట సమాప్తము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అని ఇక్కడ మీకు ఒకే విషయాన్ని అర్థం చేయించడం జరుగుతుంది. మేము ఎంతగా స్మృతి చేస్తున్నామనే చార్టు పెట్టుకోండి. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా పావనంగా అవుతూ ఉంటారు. అంతేకానీ, గంగలో స్నానం చేయడం వలన పావనంగా అవుతారని కాదు. ఇది ఆత్మకు సంబంధించిన విషయము కదా. ఆత్మయే పతితంగా, ఆత్మయే పావనంగా అవుతుంది కదా. ఆత్మ ఒక నక్షత్రమని, బిందువు వంటిదని, భృకుటి మధ్యలో ఉంటుందని తండ్రి అర్థం చేయించారు. ఆత్మ ఒక నక్షత్రమని, అతి సూక్ష్మమైనదని అంటారు. పిల్లలైన మీరు మాత్రమే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. నేను కల్పము యొక్క సంగమయుగంలో వస్తానని తండ్రి అంటారు. వారు కల్పము అనే పదాన్ని వదిలి ప్రతి యుగంలో వస్తారనే మాటను రాసారు. కనుక మనుష్యులు తప్పుగా అర్థం చేసుకున్నారు. కల్ప-కల్పము సంగమయుగంలో వస్తానని నేను అన్నాను. గాఢమైన అంధకారం మరియు అత్యంత ప్రకాశముల సంగమంలో వస్తాను. అంతేకానీ ప్రతి యుగంలోనూ రావాల్సిన అవసరము లేదు. మెట్లు దిగుతూనే వస్తారు. ఎప్పుడైతే పూర్తి 84 జన్మల మెట్లను దిగుతారో, అప్పుడు తండ్రి వస్తారు. ఈ జ్ఞానం మొత్తం ప్రపంచం కోసం ఉంది. వీరి చిత్రాలన్నీ కల్పన (ఊహ) అని సన్యాసులు అంటారు. కానీ ఇందులో కల్పన యొక్క విషయమేమీ లేదు. ఇది అందరికీ అర్థం చేయించడం జరుగుతుంది, లేదంటే మనుష్యులకు ఎలా తెలుస్తుంది. అందుకే ఈ చిత్రాలు తయారుచేయబడ్డాయి. ఈ ప్రదర్శనీలు అనేక దేశాలలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. భారతవాసి పిల్లలు చాలా మంది ఉన్నారని తండ్రి అంటారు. అయితే, అందరూ పిల్లలే కదా. ఇది అనేక ధర్మాల వృక్షము. వీరంతా కామ చితిపై కూర్చొని కాలిపోయి మరణించారని తండ్రి అర్థం చేయిస్తారు. ఎవరైతే సత్యయుగంలో మొట్టమొదట వస్తారో, వారే మళ్ళీ ద్వాపరం నుండి మొదలుకొని మొట్టమొదట కామాగ్నిలో కాలిపోతారు. అందుకే నల్లగా అయిపోయారు. ఇప్పుడు అందరి సద్గతి జరగనున్నది. మీరు నిమిత్తం అవుతారు. మీ వలన అందరి సద్గతి జరగనున్నది. తండ్రి ఎంత సహజ రీతిగా అర్థం చేయిస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేయండి అని అంటారు. ఆత్మయే దుర్గతి పొందింది. ఆత్మ పతితంగా అవ్వడంతో శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది. ఆత్మను పావనంగా చేసే యుక్తిని తండ్రి చాలా సహజంగా తెలియజేస్తారు.

త్రిమూర్తి చిత్రంలో బ్రహ్మా చిత్రాన్ని చూసి మనుష్యులు గొడవ చేస్తారు. ఇతడిని బ్రహ్మా అని ఎందుకంటారు? బ్రహ్మా అయితే సూక్ష్మవతనవాసి దేవత, ఇక్కడకు ఎక్కడ నుండి వచ్చారు? ఈ దాదా అయితే ప్రసిద్ధి గాంచినవారు. వార్తాపత్రికలలో అన్ని చోట్ల వీరి గురించి ముద్రించారు – ఒక రత్నాల వ్యాపారి, నేను శ్రీకృష్ణుడిని, నాకు 16,108 రాణులు కావాలని అంటున్నారని రాసారు. ఇలా ఎత్తుకుపోతున్నారని చాలా గొడవలు జరిగాయి. ఇప్పుడు ఒక్కొక్కరి వెనుక ఎవరు తల పాడు చేసుకుంటారు. చాలా మంది మనుష్యులున్నారు. ఎవరైనా ఆబూకు వస్తే, వారికి వెంటనే చెప్పేవారు – అరే, బ్రహ్మాకుమార-కుమారీల వద్దకు వెళ్తున్నారా, వారు ఇంద్రజాలం చేస్తారు, పతి-పత్నిని సోదరీ-సోదరులుగా చేస్తారు, ఈ విషయాలను పెద్దవిగా చేసి చెప్పి వారి తలను పాడు చేస్తారు. తండ్రి అంటారు – మీరు నన్ను జ్ఞానసాగరుడు, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు. వరల్డ్ ఆల్మైటీ అనగా సర్వశక్తివాన్, సర్వ వేదశాస్త్రాలు మొదలైనవి తెలిసినవారు. గొప్ప విద్వాంసులను కూడా అథారిటీ అని అంటారు, ఎందుకంటే వారు సర్వ వేదశాస్త్రాలు మొదలైనవాటిని చదువుతారు, తర్వాత బనారస్ కు వెళ్ళి బిరుదులను పొంది వస్తారు. మహా-మహోపాధ్యాయ, శ్రీ శ్రీ 108 సరస్వతి, ఈ బిరుదులన్నీ అక్కడే లభిస్తాయి. ఎవరైతే చాలా తెలివైనవారిగా ఉంటారో, వారికి పెద్ద బిరుదు లభిస్తుంది. శాస్త్రాలలో జనకుని గురించి రాయబడి ఉంది. ఎవరైనా నాకు సత్యమైన బ్రహ్మ జ్ఞానాన్ని వినిపించండి అని అన్నారు. ఇప్పుడు బ్రహ్మ జ్ఞానమైతే లేదు. అన్ని విషయాలు ఇక్కడివే. పెద్ద కథలను తయారుచేసేసారు. శంకరుడు పార్వతి గురించి కూడా కథను వినిపించారు, ఇలా ఎన్ని కథలను తయారుచేసారు. శంకరుడు పార్వతికి కథ వినిపించారని రాసారు, వాస్తవానికి శివుడు వినిపించారు, కానీ వారు శంకరుడు మరియు పార్వతి పేర్లను రాసేసారు. భాగవతం మొదలైనవాటిలో ఉన్న విషయాలన్నీ ఈ సమయానికి చెందినవే. కానీ కథలో ఏమని చెప్తారంటే, రాజు వద్దకు వెళ్ళి ఈ జ్ఞానాన్ని ఇవ్వాలని అతనికి (అష్టావక్రుడికి) సంకల్పం వచ్చింది అని. రాజుల వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని ఇవ్వండి అని తండ్రి కూడా అర్థం చేయిస్తారు. వారికి ఇలా చెప్పండి – మీరే సూర్య వంశీయులుగా ఉండేవారు, తర్వాత చంద్ర వంశీయులుగా, వైశ్య వంశీయులుగా, శూద్ర వంశీయులుగా అయ్యారు, మీ రాజధానియే సమాప్తమైపోయింది, ఇప్పుడు మళ్ళీ సూర్యవంశీ రాజధానిని తీసుకోవాలంటే పురుషార్థం చేయండి. రాజయోగాన్ని నేర్పించే తండ్రి వచ్చి ఉన్నారు. మీరు మళ్ళీ వచ్చి, అనంతమైన స్వరాజ్యాన్ని తీసుకోండి. రాజుల వద్దకు కూడా చాలా ఉత్తరాలు వెళ్తాయి కానీ అవి వారి వరకు చేరవు. వారి ప్రైవేట్ సెక్రటరీ ఉత్తరాలను చూస్తారు. ఎన్ని ఉత్తరాలను పడేస్తారు. ఏ ఉత్తరంలోనైనా ముఖ్యమైన విషయముంటే రాజుకు చూపిస్తారు. అష్టావక్రుడు జనకుడికి సెకెండులో జీవన్ముక్తిని సాక్షాత్కారం చేయించారని చెప్తారు. ఈ విషయం కూడా ఇప్పటిదే. ఇప్పుడు తండ్రి కూర్చొని ఎంత మంచి రీతిగా మీకు అర్థం చేయిస్తారు. ఎవరైతే అర్థం చేసుకోరో, వారు అటూ-ఇటూ చూస్తూ ఉంటారు. అటువంటివారి బుద్ధిలో ఏమీ కూర్చోవడం లేదని తండ్రి వెంటనే అర్థం చేసుకుంటారు. బాబా నలువైపులా గమనిస్తూ ఉంటారు కూడా – అందరూ బాగా వింటున్నారా, పిల్లల బుద్ధి ఎక్కడైనా భ్రమిస్తుందా. కొంతమంది ఆవలిస్తూ ఉంటారు. జ్ఞానం బుద్ధిలో కూర్చోకపోతే, కునికిపాట్లు పడుతూ ఉంటారు, నష్టం కలుగుతుంది. కరాచీలో ఈ పిల్లల భట్టి జరిగింది. ఎవరైనా కునికిపాట్లు పడితే వెంటనే బయటకు పంపించేసేవారు. మనవాళ్ళే కూర్చునేవారు. బయటివారు ఎవరూ వచ్చేవారు కాదు. ప్రారంభంలో చాలా పెద్ద పాత్ర నడిచింది. చాలా పెద్ద చరిత్ర ఉంది. ప్రారంభంలో పిల్లలు ధ్యానంలోకి ఎక్కువగా వెళ్ళేవారు. ఇప్పటికీ దానిని ఇంద్రజాలమనే అంటూ ఉంటారు. పరమపిత పరమాత్మను ఇంద్రజాలికుడు అని అంటారు కదా. వీరికి చాలా ప్రేమ ఉందని శివబాబా చూస్తారు, కనుక వారిని చూడడంతోనే వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. వైకుంఠమైతే భారతవాసులకు చాలా ప్రియమైనది. ఎవరైనా మరణిస్తే, వైకుంఠవాసులుగా అయ్యారని, స్వర్గవాసులుగా అయ్యారని అంటారు. ఇప్పుడిది నరకము. అందరూ నరకవాసులే, అందుకే ఫలానావారు స్వర్గవాసులుగా అయ్యారని అంటారు. కానీ స్వర్గానికైతే అసలెవరూ వెళ్ళరు. మేము స్వర్గవాసులుగా ఉండేవారమని, మళ్ళీ 84 జన్మలు తీసుకొని నరకవాసులుగా అయ్యామని కేవలం మీరు మాత్రమే ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బాబా స్వర్గవాసులుగా చేస్తున్నారు. స్వర్గంలో రాజధాని ఉంటుంది. రాజధానిలో చాలా పదవులుంటాయి. పురుషార్థం చేసి నరుని నుండి నారాయణునిగా అవ్వాలి. ఈ మమ్మా-బాబాలు భవిష్యత్తులో లక్ష్మీనారాయణులుగా అవుతారని మీకు తెలుసు. ఇప్పుడు వారు పురుషార్థం చేస్తున్నారు, అందుకే ఫాలో మదర్-ఫాదర్ అని అంటారు. వీరు ఎలాగైతే పురుషార్థం చేస్తారో, అలా మీరు కూడా చేయండి. స్వదర్శన చక్రధారులుగా అవుతారని కూడా గుర్తుంటుంది. మీరు తండ్రిని స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, త్రికాలదర్శులుగా అవ్వండి. మీకు ఈ చక్రం యొక్క జ్ఞానమంతా ఉంది. ఇందులో నిమగ్నమై ఉండండి, ఇతరులకు అర్థం చేయిస్తూ ఉండండి. ఈ సేవలోనే నిమగ్నమై ఉన్నట్లయితే, ఇక ఇతర వ్యాపారాలు మొదలైనవేవీ గుర్తుకు రావు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సత్యయుగంలో ఉన్నత పదవిని పొందేందుకు తల్లిదండ్రులను పూర్తిగా ఫాలో చేయాలి. వారి సమానంగా పురుషార్థం చేయాలి. సేవలో తత్పరులై ఉండాలి. ఏకాగ్రతతో చదువుకోవాలి.

2. స్మృతి యొక్క సత్యాతి-సత్యమైన చార్టును పెట్టుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. దేహాన్ని మరియు దేహధారులను గుర్తు చేయకూడదు.

వరదానము:-

ఎలాగైతే ఆత్మ మరియు శరీరం, రెండూ కలిసే ఉంటాయో, ఈ సృష్టిపై పాత్ర ఉన్నంతవరకు వేరు కాలేవో, అలా శివుడు మరియు శక్తి, ఇరువురికీ మధ్యన అంతే లోతైన సంబంధముంది. ఎవరైతే సదా శివమయి శక్తి స్వరూపంలో స్థితులై నడుచుకుంటారో, వారి తపనలో మాయ విఘ్నాలు వేయలేదు. వారు సదా సాథీపన్ ను మరియు సాక్షీ స్థితిని అనుభవం చేస్తారు. ఎవరో సాకారంలో తోడు ఉన్నట్లుగా అనుభవమవుతుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top