08 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

7 May 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - నేను కర్మేంద్రియజీత్ గా అయ్యానా, ఏ కర్మేంద్రియమూ నన్ను మోసం చేయడం లేదు కదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి”

ప్రశ్న: -

కర్మాతీతులుగా అయ్యేందుకు పిల్లలైన మీరు తమతో తాము ఏ ప్రతిజ్ఞను చేసుకోవాలి?

జవాబు:-

ఏ కర్మేంద్రియము ఎప్పుడూ చంచలమవ్వకూడదు, నేను నా కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి అని తమతో తాము ప్రతిజ్ఞ చేసుకోండి. బాబా ఇచ్చిన ఏ డైరెక్షన్ ను అయినా, అమలులోకి తీసుకురావాల్సిందే. బాబా అంటారు – మధురమైన పిల్లలూ, కర్మాతీతులుగా అవ్వాలంటే ఏ కర్మేంద్రియముతోనూ వికర్మలు చేయకండి. మాయ చాలా శక్తివంతమైనది. కళ్ళు మోసము చేసేటువంటివి కనుక స్వయాన్ని సంభాళించుకోండి.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. పిల్లలూ, ఆత్మాభిమానులుగా అయి కూర్చొన్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రతి విషయం గురించి స్వయాన్ని ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. బాబా యుక్తిని తెలియజేస్తారు – నేను ఆత్మాభిమానిగా అయి కూర్చొన్నానా, తండ్రిని స్మృతి చేస్తున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఇది మీ ఆత్మిక సైన్యము. ఆ సైన్యములోనైతే ఎప్పుడూ యువకులే చేరుతారు. ఈ సైన్యంలో 14-15 సంవత్సరాల యువకులు కూడా ఉన్నారు, 90 సంవత్సరాల వృద్ధులు కూడా ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇది మాయపై విజయం పొందే సైన్యము. ప్రతి ఒక్కరు మాయపై విజయం పొంది, బాబా నుండి అనంతమైన వారసత్వాన్ని పొందాలి ఎందుకంటే మాయ చాలా శక్తివంతమైనది. మాయ చాలా శక్తివంతమైనదని స్వయంగా పిల్లలకు కూడా తెలుసు. ప్రతి కర్మేంద్రియము చాలా మోసం చేస్తుంది. అన్నింటికన్నా ముందుగా, ఏ కర్మేంద్రియము ఎక్కువగా మోసం చేస్తుంది? కళ్ళే అన్నింటికన్నా ఎక్కువగా మోసం చేస్తాయి. తన పత్ని ఉన్నప్పటికీ, వేరే ఎవరైనా అందమైనవారిని చూసినట్లయితే, వెంటనే ఆకర్షణ కలుగుతుంది. కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఆమెను ముట్టుకోవాలని మనసు కలుగుతుంది. బ్రహ్మాకుమారీ-కుమారులమైన మనము సోదరీ-సోదరులమని సదా బుద్ధిలో భావించాలని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇందులో మాయ చాలా గుప్తంగా మోసం చేస్తుంది, అందుకే చార్టులో కూడా దీనిని రాసుకోవాలి – రోజంతటిలో ఏయే కర్మేంద్రియాలు నన్ను మోసం చేసాయి. ఈ కళ్ళు అన్నింటికన్నా పెద్ద శత్రువు. ఫలానావారిని చూసాము, వారి వైపు మా దృష్టి వెళ్ళింది అని రాయాలి. సూరదాసుని ఉదాహరణ కూడా ఉంది కదా, తన కళ్ళను తానే తొలగించుకున్నాడు. స్వయాన్ని చెక్ చేసుకున్నట్లయితే, కళ్ళు చాలా మోసం చేస్తాయని తెలుస్తుంది. ఎవరైనా అందంగా ఉన్నవారిని చూసినట్లయితే, తమ పత్నిని కూడా వదిలి ఆమెపై బలిహారమైపోతారు. ఎవరైనా పాడడంలో చురుకుగా ఉంటే, బాగా అలంకరించుకొని ఉంటే, కళ్ళు వెంటనే చంచలమైపోతాయి, అందుకే ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి అని బాబా అంటారు. మీరు సేవ చేస్తున్నా కానీ, కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఈ శత్రువుపై పూర్తి చెకింగ్ ఉండాలి. లేదంటే మీరు మీ పదవిని భ్రష్టం చేసుకుంటారని అర్థం చేసుకోండి. తెలివైన పిల్లలు ఎవరైతే ఉంటారో, వారు తమ వద్దనున్న డైరీలో నోట్ చేసుకోవాలి – మేము ఫలానావారిని చూసాము, అప్పుడు మా దృష్టి వెళ్ళింది అని. తర్వాత తమను తామే శిక్షించుకోండి. భక్తి మార్గంలో కూడా పూజ చేసే సమయంలో బుద్ధి వేరే వైపులకు పరుగెడితే, తమను తాము గిల్లుకుంటారు. కావున అటువంటి స్త్రీ ఎవరైనా ఎదురుగా వచ్చినప్పుడు, అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోవాలి. అంతేకానీ అక్కడ నిలబడి చూస్తూ ఉండిపోకూడదు. కళ్ళు చాలా మోసం చేసేటువంటివి, అందుకే సన్యాసులు కళ్ళు మూసుకొని కూర్చొంటారు. స్త్రీలను వెనుక కూర్చోబెడతారు, పురుషులను ముందు కూర్చోబెడతారు. చాలామంది ఎలా ఉంటారంటే, స్త్రీలను అసలు చూడరు. పిల్లలైన మీరు చాలా కృషి చేయాలి. విశ్వ రాజ్య భాగ్యాన్ని తీసుకోవడమనేది చిన్న విషయమేమీ కాదు. వారు మహా అయితే 10, 12, 20 వేలు, 1-2 లక్షలు లేదా కోట్లు జమ చేసుకుంటారు కానీ తర్వాత అంతా సమాప్తమైపోతుంది. పిల్లలైన మీకు అవినాశీ వారసత్వం లభిస్తుంది. మీకు అన్నీ ప్రాప్తిస్తాయి. అక్కడ, ప్రాప్తి కోసం తల బాదుకోవాల్సి వచ్చే వస్తువులేవీ ఉండవు. కలియుగ అంతిమానికి మరియు సత్యయుగ ఆదికి రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇక్కడైతే ఏమీ లేదు.

ఇప్పుడిది మీ పురుషోత్తమ సంగమయుగము. పురుషోత్తమ అనే పదాన్ని తప్పకుండా రాయాలి. మనుష్యుల నుండి దేవతలుగా చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మనుష్యులు పూర్తిగా ఘోరమైన అంధకారంలో ఉన్నారు. స్వర్గాన్ని చూడలేని వారు చాలామంది ఉంటారు. బాబా అంటారు – పిల్లలూ, మీ ధర్మం చాలా సుఖాన్ని ఇచ్చేటువంటిది. మనుష్యులకు ఏమీ తెలియదు. హెవెన్ అంటే ఏమిటి అనేది భారతవాసులు కూడా మర్చిపోయారు. ఒకప్పుడు హెవెన్ ఉండేదని స్వయంగా క్రిస్టియన్లు కూడా అంటారు. ఈ లక్ష్మీనారాయణులను గాడ్-గాడెస్ అని అంటారు కదా. కావున తప్పకుండా గాడ్ యే అలా తయారుచేస్తారు. కనుక చాలా శ్రమించాలి అని తండ్రి అర్థం చేయిస్తారు. నన్ను ఏ కర్మేంద్రియం మోసం చేసింది అని ప్రతి రోజు తమ లెక్కాపత్రాన్ని చూసుకోండి. నోరు కూడా చాలా మోసం చేస్తుంది. ఇంతకుముందు కచేరి జరిగేది, అప్పుడు అందరూ తమ తప్పులను చెప్పేవారు. మేము ఫలానా వస్తువును దాచిపెట్టుకొని తిన్నామని చెప్పేవారు. ఫలానా విధంగా మాయ దాడి చేసిందని, మంచి-మంచి గొప్ప ఇంటి పిల్లలు చెప్పేసేవారు. దాచిపెట్టుకొని తినడం కూడా దొంగతనమే. అది కూడా శివబాబా యజ్ఞం నుండి దొంగతనము చేయడమంటే – ఇది చాలా తప్పు. ఒక్క పైసా దొంగతనము చేసినా లక్ష రూపాయలు దొంగతనము చేసినదానితో సమానము. మాయ పూర్తిగా ముక్కు పట్టుకుంటుంది. ఈ అలవాటు చాలా చెడ్డది. చెడ్డ అలవాటుంటే, మనం ఏమవుతాము! స్వర్గానికి వెళ్ళడమనేది పెద్ద విషయమేమీ కాదు కానీ అందులో మళ్ళీ పదవులు కూడా ఉంటాయి కదా. రాజు ఎక్కడ, ప్రజలు ఎక్కడ. ఎంత తేడా ఉంటుంది. కావున కర్మేంద్రియాలు కూడా చాలా మోసం చేసేటువంటివి. వాటిని సంభాళించుకోవాలి. ఉన్నత పదవిని పొందాలంటే, తండ్రి డైరెక్షన్ పై పూర్తిగా నడుచుకోవాలి. తండ్రి డైరెక్షన్ ఇస్తారు, మాయ మళ్ళీ మధ్యలోకి వచ్చి విఘ్నాలను వేస్తుంది. తండ్రి అంటారు – మర్చిపోకండి, లేదంటే అంతిమంలో చాలా పశ్చాత్తాపపడతారు. ఫెయిల్ అవుతున్నట్లు సాక్షాత్కారం కూడా జరుగుతుంది. మేము నరుని నుండి నారాయణునిగా అవుతామని ఇప్పుడు మీరు అంటారు. కానీ స్వయాన్ని ప్రశ్నించుకోండి, మీ లెక్కాపత్రాన్ని రాసుకోండి. చాలా తక్కువమంది కష్టం మీద అర్థం చేసుకొని, అమలులోకి తీసుకువస్తారు. కానీ దీని ద్వారా మీ ఉన్నతి చాలా జరుగుతుందని బాబా అంటారు. రోజంతటి లెక్కాపత్రాన్ని రాయాలి. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఎవరినైనా చూసినప్పుడు – ఈమె చాలా బాగున్నారు అని ఆలోచన వస్తుంది, తర్వాత ఆమెతో మాట్లాడుతారు. ఈమెకు ఏదైనా కానుక ఇవ్వాలి, ఇది తినిపించాలి అని మనసు కలుగుతుంది, ఆ చింతననే నడుస్తూ ఉంటుంది. ఇందులో చాలా ఎక్కువ శ్రమ ఉందని పిల్లలు అర్థం చేసుకుంటారు. కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తాయి. ఇది రావణ రాజ్యం కదా. అక్కడ చింతించే విషయమేమీ ఉండదు, ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు. చింతించే విషయమే ఉండదు. అక్కడ కూడా చింత ఉంటే, ఇక నరకానికి మరియు స్వర్గానికి తేడా ఏమున్నట్లు? పిల్లలైన మీరు చాలా-చాలా ఉన్నత పదవిని పొందేందుకు భగవంతుని ద్వారా చదువుకుంటారు. మాయ నిందింపజేస్తుందని తండ్రి అర్థం చేయిస్తారు. మీరు నాకు అపకారం చేశారు, నేను మీకు ఉపకారం చేస్తాను. పిల్లలూ, ఒకవేళ మీరు చెడు దృష్టి పెట్టకున్నట్లయితే, మీకు మీరే నష్టం కలిగించుకుంటారు. ఇది చాలా పెద్ద గమ్యము, అందుకే – ఏ వికర్మ చేయలేదు కదా, ఎవరినీ మోసం చేయలేదు కదా అని మీ లెక్కాపత్రాన్ని చూసుకోవాలని బాబా అంటారు. ఇప్పుడు వికర్మాజీతులుగా అవ్వాలి. వికర్మాజీత్ శకం కోసం పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. వికర్మాజీతులుగా అయి 5 వేల సంవత్సరాలయ్యింది, మళ్ళీ వికర్మలు చేయడంతో వామ మార్గంలోకి వెళ్తారు అని తండ్రి అర్థం చేయించారు. కర్మ-అకర్మ-వికర్మ అనే పదాలున్నాయి కదా. మాయా రాజ్యంలో మనుష్యులు ఏ కర్మ చేసినా, అది వికర్మగానే అవుతుంది. సత్యయుగంలో వికారాలుండవు కావున వికర్మలు కూడా తయారవ్వవు. ఇది కూడా మీకు తెలుసు, ఎందుకంటే మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది. మీరు త్రినేత్రులుగా అయ్యారు. కావున త్రికాలదర్శులుగా, త్రినేత్రులుగా తయారుచేసేవారు తండ్రి. మీరు ఆస్తికులుగా అయ్యారు కావున త్రికాలదర్శులుగా అయ్యారు. మొత్తం డ్రామా రహస్యమంతా మీ బుద్ధిలో ఉంది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, 84 జన్మల చక్రము, తర్వాత ఇతర ధర్మాలు వృద్ధి చెందుతాయి. ధర్మ స్థాపకులు ఎవరూ సద్గతినివ్వలేరు. వారిని గురువులని కూడా అనలేరు. సర్వులకు సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు అందరి సద్గతి జరుగనున్నది. వారు ధర్మ స్థాపకులుగా పిలువబడతారు, గురువులుగా కాదు. ధర్మ స్థాపకులు ధర్మ స్థాపన చేసేందుకు నిమిత్తులు అయ్యారు. ఇకపోతే వారు సద్గతినివ్వరు. వారిని స్మృతి చేయడంతో సద్గతి ఏమీ లభించదు, వికర్మలు వినాశనమవ్వవు. అదంతా భక్తి. కావున, మాయ చాలా శక్తివంతమైనదని, దీనితోనే యుద్ధం జరుగుతుందని తండ్రి అర్థం చేయిస్తారు. మీరు శివ శక్తి పాండవ సైన్యము. మీరంతా మార్గదర్శకులు. శాంతిధామము, సుఖధామము యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. మీరు గైడ్స్ (మార్గదర్శకులు). తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, ఇంకొకవైపు ఒకవేళ ఏవైనా పాప కర్మలు చేసినట్లయితే వంద రెట్లు పాపము అంటుకుంటుందని మీరు అంటారు. ఎంత వీలైతే అంత ఏ వికర్మలు చేయకూడదు. కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తాయి. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా తండ్రి అర్థం చేసుకుంటారు. పిల్లలకు మాయా తుఫానులు వస్తాయి. స్త్రీ-పురుషులు అని భావించడంతోనే తుఫానులు వస్తాయి. కావున ఈ కళ్ళపై ఎంత కంట్రోల్ పెట్టుకోవాలి? మనం శివబాబా పిల్లలము. తండ్రికి ప్రతిజ్ఞ చేసి రాఖీని కూడా కట్టించుకుంటారు, అయినా సరే మాయ మోసం చేస్తుంది, అప్పుడిక విడిపించుకోలేకపోతారు. కర్మేంద్రియాలు వశమైనప్పుడు కర్మాతీత అవస్థ ఏర్పడగలదు. మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని చెప్పడం సహజమే కానీ వివేకము కూడా కావాలి కదా. తండ్రి అంటారు – డైరెక్షన్ లను అమలు చేయండి, బాబా-బాబా అని అంటూ ఉండండి అని. బాబా నుండి మనము పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము. ఇలాంటి టీచరు ఎప్పుడూ, ఎక్కడా లభించరు. ఈ విషయాలన్నీ దేవతలకే తెలియకపోతే, ఇక తర్వాత వచ్చే ధర్మాల వారికి ఎలా తెలుస్తుంది. బాబా అంటారు – నేను ఏది చెప్పినా, ఇది శివబాబా చెప్తున్నారని అనుకోకండి. ఈ దాదా చెప్తున్నారని అనుకోకండి. వీరు నా రథము, వీరేమి చేస్తారు, పిల్లలైన మీకు నేను రాజ్యాన్ని ఇస్తాను. ఈ రథం ఇవ్వరు కదా. వీరు పూర్తిగా బెగ్గర్ (బికారి). వీరు కూడా బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఎలాగైతే మీరు పురుషార్థం చేస్తారో, అలాగే వీరు కూడా పురుషార్థం చేస్తారు. వీరు కూడా స్టూడెంట్ లైఫ్ లో ఉన్నారు. ఈ రథాన్ని అద్దెకు తీసుకోవడం జరిగింది, ఇది తమోప్రధానంగా ఉంది. మీరు పూజ్య దేవతలుగా అయ్యేందుకు, మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే, శివబాబా ఎలా వచ్చి చదివిస్తారు, నాకు సంశయముంది అని అంటారు. నాకైతే అర్థం కావడం లేదని అంటారు. తండ్రి స్మృతి లేకుండా వికర్మలు వినాశనమవ్వవు. శిక్షలను పూర్తిగా అనుభవించవలసి ఉంటుంది. ఈ రాజ్యం స్థాపనవుతుంది. రాజులకు ఎంతమంది దాసీలు ఉంటారు. బాబా అయితే రాజుల సంపర్కంలోకి వచ్చినవారు. దాసీలను కట్నంగా ఇస్తారు. ఇక్కడే ఇంతమంది దాసీలుంటే, సత్యయుగంలో ఇక ఎంత మంది ఉంటారు. ఈ రాజధాని కూడా ఇప్పుడు స్థాపనవుతుంది. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనేది బాబాకు తెలుసు. ఈ సమయంలో మరణిస్తే, ఏమవుతారు అనేది ప్రతి ఒక్కరి లెక్కాపత్రం ద్వారా బాబా చెప్పగలరు. కర్మాతీత అవస్థను చివర్లో అందరూ నంబరువారుగా పొందుతారు. ఇది సంపాదన. సంపాదనలో మనుష్యులు ఎంత బిజీగా ఉంటారు, భోజనం చేస్తున్నా సరే టెలిఫోన్ చెవి దగ్గర ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు జ్ఞానాన్ని తీసుకోలేరు. ఇక్కడకు పేదవారు, సాధారణమైనవారే వస్తారు. షావుకార్లు అయితే మాకు తీరిక ఎక్కడుంది అని అంటారు. అరే, కేవలం తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. కావున బాబా మధురాతి-మధురమైన పిల్లలకు పదే-పదే అర్థం చేయిస్తారు. శివబాబా వచ్చి ఉన్నారని మాకేమి తెలుసు – అని ఎవరూ అనని విధంగా ప్రతి ఒక్కరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలి. కేవలం రోజంతా బాబా-బాబా అని అంటూ ఉండండి. చాలామంది పిల్లలు చాలా స్మృతి చేస్తారు. శివబాబా అని అనడంతోనే చాలా మంది పిల్లలకు ప్రేమ అశ్రువులు వస్తాయి. మేము ఎప్పుడు వెళ్ళి కలుస్తాము అని అనిపిస్తుంది. చూడకపోయినా సరే వారు తపిస్తూ ఉంటారు మరియు చూసినవారేమో నమ్మరు. వారు దూరంలో కూర్చొని కన్నీరు కారుస్తూ ఉంటారు. ఇది అద్భుతం కదా. అనేకమందికి బ్రహ్మా యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది. మున్ముందు చాలా మందికి సాక్షాత్కారాలు జరుగుతాయి. మనుష్యులు మరణించే సమయంలో అందరూ వచ్చి భగవంతుడిని స్మృతి చేయమని చెప్తారు. మీరు కూడా శివబాబాను స్మృతి చేయండి. పిల్లలూ, పురుషార్థంలో మేకప్ చేసుకుంటూ (కవర్ చేసుకుంటూ) ఉండండి అని తండ్రి అంటారు. అవకాశం లభిస్తే మేకప్ చేసుకోండి. ఇది ఎంత గొప్ప సంపాదన. కొంతమందికి ఎంత అర్థం చేయించినా సరే బుద్ధిలో కూర్చోదు. అలా అవ్వకూడదని తండ్రి అంటారు. మీ కళ్యాణాన్ని చేసుకోండి. తండ్రి శ్రీమతంపై నడుచుకోండి. తండ్రి మిమ్మల్ని పురుషుల్లో ఉత్తములుగా తయారుచేస్తారు. ఇది మీ లక్ష్యము-ఉద్దేశ్యము. బాబా సేవ కోసం ఎన్ని యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. వీరు నిజమే చెప్తున్నారని అందరూ అర్థం చేసుకునేలా అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. ఈ యుద్ధంతోనే ముఖ్యంగా భారత్ లో, మరియు మొత్తం ప్రపంచంలో సుఖ-శాంతులు ఏర్పడతాయి. ఇలాంటి కరపత్రాలను అన్ని భాషలలోనూ ముద్రించవలసి ఉంటుంది. భారత్ ఎంత పెద్దది. ప్రతి ఒక్కరికి తెలియాలి, మాకు తెలియలేదని ఎవ్వరూ అనకూడదు. అరే, విమానాల నుండి కరపత్రాలను వేశాము, వార్తాపత్రికలలో వేశాము, మీరు మేల్కోలేదా అని మీరు అంటారు. ఇది కూడా చూపించడం జరిగింది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయంలో ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో – వాటిని పరిశీలించి తొలగించుకునేందుకు శ్రమ చెయ్యాలి. మీ సత్యాతి-సత్యమైన లెక్కాపత్రాన్ని పెట్టుకోవాలి. తండ్రి డైరెక్షన్ పై నడుచుకోవాలి.

2. తండ్రికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధమైన కర్మలేవీ చేయకూడదు. మీ ఉన్నతి పట్ల శ్రద్ధ పెట్టుకోవాలి. కొద్దిగా కూడా చెడు దృష్టి పెట్టుకోకూడదు.

వరదానము:-

దేహాభిమానాన్ని త్యాగం చేయడం ద్వారా అనగా దేహీ-అభిమానులుగా అవ్వడం ద్వారా తండ్రి నుండి సర్వ సంబంధాలు, సర్వ శక్తులు అనుభవమవుతాయి, ఈ అనుభవమే సంగమయుగం యొక్క సర్వ శ్రేష్ఠ భాగ్యము. విధాత ద్వారా లభించిన ఈ విధిని పాటించడంతో వృద్ధి కూడా జరుగుతుంది మరియు సర్వ సిద్ధులు కూడా ప్రాప్తిస్తాయి. దేహధారులతో మీకున్న సంబంధం మరియు స్నేహం కోసం మీ కిరీటాన్ని, సింహాసనాన్ని మరియు మీ అసలైన స్వరూపాన్ని, అన్నింటినీ వదిలేసారే, మరి తండ్రి స్నేహంలో దేహాభిమానాన్ని త్యాగం చేయలేరా! ఈ ఒక్క త్యాగం ద్వారా సర్వ భాగ్యాలు ప్రాప్తిస్తాయి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top