08 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 7, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఒక్క తండ్రి పట్ల సత్యాతి-సత్యమైన ప్రేమను ఉంచుకోండి, వారి మతంపై నడుచుకోండి, అప్పుడు మిగిలిన మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరి నుండి మమకారం తెగిపోతుంది’’

ప్రశ్న: -

ఏ పదాలను తండ్రి తప్ప ఇతర మనుష్యులెవ్వరూ చెప్పలేరు?

జవాబు:-

ఆత్మలైన మీ తండ్రినైన నేను, మిమ్మల్ని చదివించడానికి వచ్చాను, నేను మిమ్మల్ని నాతో పాటు తిరిగి తీసుకువెళ్తాను. ఇటువంటి మాటలు మాట్లాడే శక్తి తండ్రికి తప్ప, ఇతర మనుష్యులు ఎవ్వరిలోనూ లేదు. మీకు నిశ్చయముంది – ఈ కొత్త జ్ఞానం కొత్త విశ్వం కోసం ఉంది, ఇది స్వయంగా ఆత్మిక తండ్రి మనకు చదివిస్తారు, మనం ఈశ్వరీయ విద్యార్థులము.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

భోళానాథుని కన్నా అతీతమైనవారు… (భోలేనాథ్ సే నిరాలా…) 

ఓంశాంతి. ఎల్లప్పుడూ తండ్రినే పిల్లలకు ఇచ్చేవారిగా ఉంటారు. ఒకరు హద్దులోని తండ్రి, వారు తమ 5-8 మంది పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు. అనంతమైన తండ్రి, అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. వారొక్కరే అందరికీ తండ్రి. లౌకిక తండ్రులైతే చాలా మంది ఉన్నారు. అనేక మంది పిల్లలు ఉంటారు, వీరు పిల్లలందరికీ తండ్రి. బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా తండ్రి అని అనరు. శంకరుని కార్యమే వేరు. వారు ఇచ్చేటువంటి వారు కాదు. ఒక్క నిరాకార తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది. వారు పరమపిత, మూలవతనంలో అత్యంత పైన ఉండేవారు. అర్థం చేయించేందుకు చాలా యుక్తులు కావాలి. మధురమైన మాట తీరు కూడా ఉండాలి. కామం మహాశత్రువు – దీనిపై విజయం పొందాలి. ఇప్పుడు కన్యలైతే స్వతంత్రులు. ఇలా బ్రహ్మచర్యంలో ఉండడం ఇష్టపడే మనుష్యులు చాలా మంది ఉంటారు. వికారీ కుటుంబ పరివారంలోకి వెళ్ళకూడదు అనుకుంటే అలా ఉండిపోతారు, నిషేధం ఏమీ లేదు. కన్యల కన్నయ్య అయిన తండ్రి అయితే ప్రసిద్ధమైనవారు. కృష్ణుడేమీ కన్యలకు తండ్రి కాదు. వీరైతే బ్రహ్మాకుమారీలు. కృష్ణ కుమారీలు ఉండరు. కృష్ణుడిని ప్రజాపిత అని అనరు. ఈ కన్యలకు, మాతలకు సహనం చేయాల్సి ఉంటుంది. కానీ హృదయం స్వచ్ఛంగా ఉండాలి. బుద్ధి యోగం ఒక్క తండ్రితో, మంచి రీతిలో జోడించబడి ఉండాలి, అప్పుడు అనేకుల నుండి తెగిపోగలదు. మేము ఒక్క తండ్రికి చెందినవారిగా అవ్వాలని, వారి మతంపై నడుచుకోవాలి అని పక్కా నిశ్చయముండాలి. బాబా అర్థం చేయించారు, మీరు మీ పతికి కూడా అర్థము చేయించండి, ఏమని అంటే – ఇప్పుడు కృష్ణపురి స్థాపన అవుతూ ఉంది, కంసపురి వినాశనం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఒకవేళ కృష్ణపురిలోకి వెళ్ళాలంటే వికారాలను వదలాల్సి ఉంటుంది. కృష్ణపురిలోకి వెళ్ళేందుకు సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. ఇప్పుడు మీరు నా కళ్యాణాన్ని మరియు మీ కళ్యాణాన్ని కూడా చేయాలి, నేను, మీరు ఇరువురమూ ఒక్క భగవంతుని పిల్లలమే. మీరు కూడా భగవంతుడు నా తండ్రి అని అంటారు, కావున మనం పరస్పరంలో సోదరీ-సోదరులము అయినట్లు. ఇప్పుడు వికారాలలోకి వెళ్ళలేము. భారత్ పవిత్రంగా ఉన్నప్పుడు అందరూ సుఖమయంగా ఉండేవారు, ఇప్పుడైతే దుఃఖితులుగా ఉన్నారు. నరకంలో మునకలు వేస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఇరువురు చేతిలో చేయి వేసుకుని పవిత్రంగా అయి స్వర్గంలోకి వెళ్ళండి. ఇప్పుడు మనం 21 జన్మల వారసత్వాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? రోజూ అర్థం చేయించడంతో ఎముకలు మెత్తబడతాయి. కన్యలైతే స్వతంత్రులు, కేవలం వారి సాంగత్యం పాడవ్వకూడదు. ఈ అపవిత్రమైన భ్రష్టాచారీ ప్రపంచము సమాప్తమవ్వనున్నది. తండ్రి అంటారు – పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఈ విధంగా యుక్తిగా అర్థం చేయించాలి. పేడ పురుగులు వలె ఉన్నవారికి భూ-భూ చేసి, తమ సమానంగా తయారుచేయాలి. శక్తి సైన్యంకి శక్తి కూడా కావాలి కదా! పిల్లలు మొదలైనవారినైతే సంభాళించాల్సిందే. కానీ మోహంతో వేలాడకూడదు. బుద్ధి యోగం ఒక్కరితోనే ఉండాలి. ఈ చిన్నాన్నలు, మామయ్యలు, పెదనాన్నలు మొదలైనవారంతా డ్రామాలోని పాత్రధారులు. ఇప్పుడు ఆట పూర్తవుతుంది, తిరిగి వెళ్ళా్లి. వికర్మల లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి. ఈ పాత ప్రపంచం నుండి మనసును తొలగించుకోవాలి. ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి అంటారు, శ్రీమతంపై నడుచుకున్నట్లయితే స్వర్గం యొక్క రాజ్యాధికారాన్ని పొందుతారు. శ్రీమతము భగవంతునిది. రాజయోగంతో తప్పకుండా రాజులకే-రాజులుగా అవుతారు. ఈ మృత్యులోకమైతే ఇప్పుడు సమాప్తమవ్వనున్నది. కావున తండ్రి నుండి 21 జన్మల పూర్తి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు. ఒకవేళ మేము మంచి రీతిలో చదువుకున్నట్లయితే, మంచి నంబరుతో పాస్ అవుతామని విద్యార్థులు భావిస్తారు. ఒకవేళ ఇక్కడ మంచి నంబరుతో పాస్ అయినట్లయితే, అక్కడ స్వర్గంలో ఉన్నత పదవిని పొందుతారు. అవ్వడమైతే రాకుమార-రాకుమారీలుగా అవ్వాలి. అందరూ అయితే అవ్వరు. ప్రజలైతే లెక్కలేనంతమంది తయారవుతూ ఉంటారు. ప్రదర్శినీ ద్వారా నెమ్మది-నెమ్మదిగా చాలా ప్రభావం వెలువడుతూ ఉంటుంది.

ఏ పాత్ర అయితే జరుగుతూ వచ్చిందో, అది 5 వేల సంవత్సరాల క్రితం కూడా జరిగిందని మీకు తెలుసు. తండ్రి అంటారు, నేను కూడా డ్రామా బంధనంలో బంధించబడి ఉన్నాను. పాత్ర లేకుండా నేనేమీ చేయలేను. స్వదర్శన చక్రంతో ఎవరి శిరస్సునైనా ఖండిస్తానని కాదు. స్వదర్శన చక్రం యొక్క అర్థం కూడా పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. శాస్త్రాలలోనైతే ఎన్నో కథలను రాసేసారు. స్వ-దర్శనము అనగా సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడము. స్వ అనగా ఆత్మకు – తప్పకుండా మేము 84 జన్మల చక్రంలో తిరుగుతాము అని సృష్టి చక్రం యొక్క దర్శనం అయ్యింది. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు… ఇప్పుడు చక్రం పూర్తయ్యింది. మళ్ళీ, కొత్త చక్రం తిరుగుతుంది. ఇది భారత్ యొక్క చక్రమే. ఆది నుండి అంతిమం వరకు భారతవాసుల పాత్ర ఉంది. భారత్ యొక్క రెండు యుగాలు పూర్తి అయినట్లయితే, సగం ప్రపంచం పూర్తి అయినట్లు. దానినే ప్యారడైజ్ అని కూడా అంటారు. ఇకపోతే మిగిలిన ధర్మాలైతే రావడమే తర్వాత వస్తాయి. వారికి చెప్పండి, మీ కన్నా ముందు ఇది స్వర్గంగా ఉండేది, కొత్త ప్రపంచంగా ఉండేది, ఇప్పుడిది పాత ప్రపంచము. ఆదిలో సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉండేవారని మీకు తెలుసు. ఆ రాజధాని పూర్తి అయిందంటే, మధ్య భాగం వస్తుంది. కొత్త మరియు పాతదానికి మధ్య భాగము. మొదట అర్ధ కల్పం భారత్ యే ఉండేది. మొత్తం నాటకం అంతా మన పైనే తయారై ఉంది. మనమే శ్రేష్ఠాచారిగా, డబుల్ కిరీటధారీ రాజులుగా ఉండేవారము. మనమే భ్రష్టాచారులుగా అయ్యాము. పూజ్యుల నుండి పూజారులుగా అయ్యాము, ఇంకెవ్వరూ ఇలాంటి విషయాన్ని చెప్పలేరు. ఇది అర్థం చేయించాల్సిన ఎంత సహజమైన విషయము. ఈ ఆత్మిక జ్ఞానాన్ని పరమ ఆత్మ పిల్లలకు ఇస్తున్నారు. ఆత్మలమైన మాకు తండ్రి జ్ఞానాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు. తండ్రి అంటారు, నేను ఆత్మలను చదివిస్తాను, ఆత్మలను నాతో పాటు తీసుకువెళ్తాను, ఇతరులెవ్వరికీ ఈ విధంగా చెప్పేటువంటి శక్తి లేదు. ఒకవేళ ఎవరైనా స్వయాన్ని, బ్రహ్మా లేక బ్రహ్మాకుమార-కుమారీ అని చెప్పకపోయినా కానీ, ఇక్కడి జ్ఞానాన్ని కొంత కాపీ చేసినా కానీ, వారు నడుచుకోలేరు. సత్యం ఎంతైనా సత్యమే. సత్యం ఎప్పుడూ దాగి ఉండలేదు. చివర్లో తప్పకుండా అంటారు – ఓహో ప్రభూ, మీరు ఏదైతే చెప్తారో, అది సత్యము, మిగిలినదంతా అసత్యము. పరమపిత పరమాత్మ ఉన్నదే సత్యము. వారు నిరాకారుడు. శివరాత్రి అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. ఒకవేళ కృష్ణుడి తనువులోకి వచ్చినట్లయితే, నేను కృష్ణుని తనువులోకి వచ్చి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను అని చెప్పాలి, ఇది కూడా జరగజాలదు. ఇది జ్ఞానము, దీని పట్ల మంచిగా అటెన్షన్ ఇవ్వాలి. మనం ఈశ్వరీయ విద్యార్థులము, ఇది బుద్ధిలో లేనట్లయితే, బుద్ధిలో అసలేమీ కూర్చోదు. ఇది మీ అనేక జన్మల అంతిమంలోని అంతిమ జన్మ. ఈ మృత్యులోకం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది. కావున, అమరపురికి యజమానులుగా చేయడానికి నేను వచ్చాను. సత్యనారాయణ కథ అంటే నరుని నుండి నారాయణునిగా తయారయ్యే జ్ఞానము, అంతేకానీ కథ కాదు. పాతదానిని, ప్రాచీనమైన దానిని కథ అని అంటారు. ఇది జ్ఞానము. లక్ష్యము-ఉద్దేశ్యాన్ని కూడా తెలియజేస్తారు. ఇది కాలేజీ కూడా అయినట్లు. చరిత్ర-భౌగోళికం కూడా పాత కథ అయినట్లు. ఫలానా ఫలానావారు రాజ్యం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు తండ్రి అంటారు, డ్రామాలో నా పాత్ర కూడా ఉంది. బ్రహ్మా ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము. వారు వినాశనం కోసం ఈ బాంబులు మొదలైనవైతే తయారుచేసేదే ఉంది. యాదవులు, కౌరవులు, పాండవులు ఏం చేస్తున్నారు. శాస్త్రాలలోనైతే తప్పుగా రాసేసారు. యాదవుల కోసమైతే, తమ కులం యొక్క వినాశనాన్ని స్వయమే చేసుకున్నారని కరెక్ట్ గా రాసారు. ఇకపోతే పాండవులకు, కౌరవులకు హింసాత్మక యుద్ధాన్ని చూపించారు. ఇదైతే జరగలేదు. మీతో పాటు పరమపిత పరమాత్మ ఉన్నారు. వారు ముఖ్యమైన పండా మరియు గైడ్, పతితపావనుడు కూడా, ముక్తిదాత కూడా. రావణ రాజ్యం నుండి విడిపించి రామరాజ్యంలోనికి తీసుకువెళ్తున్నారు. తండ్రి అంటారు, ఈ రావణ రాజ్యం సమాప్తమై, అంతమై, మళ్ళీ పావన శ్రేష్ఠాచారీ సత్యయుగీ రాజ్యం ప్రారంభం అవుతూ ఉంది. ఇది పిల్లలైన మీకే తెలుసు, మరియు ఎవరికైనా అర్థము చేయించగలరు కూడా, ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. భక్తి మార్గపు శాస్త్రాల గురించైతే చాలా మందికి తెలుసు. భక్తితో భగవంతుడిని పొందాలని భావిస్తారు. అర్ధకల్పం భక్తి మార్గము. భక్తి యొక్క అంతిమంలో జ్ఞానసాగరుడు వచ్చి, జ్ఞానం యొక్క ఇంజక్షన్ ను వేస్తారు. పిల్లలైన మీది పతితపావనుడైన గాడ్ ఫాదర్లీ విద్యార్థి జీవితము. పతిత పావనుడు అనగా సద్గురువు. ఓ గాడ్ ఫాదర్ అనగా పరమపిత పరమాత్మ మరియు వారు మళ్ళీ శిక్షకుని రూపంలో రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది ఎంత సహజమైన విషయము. మొదట పతిత-పావనుడు అని తప్పకుండా రాయాలి. గురువు అందరికన్నా తెలివైనవారిగా ఉంటారు. గురువు సద్గతినిస్తారు, దుర్గతి నుండి విడిపిస్తారు అని భావిస్తారు. తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. కానీ మేము భగవంతుని పిల్లలము కావున తప్పకుండా వారసత్వం లభించాలి అని ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. తండ్రి అంటారు, పిల్లలూ, మీరు రావణుడిపై విజయం పొందినట్లయితే జగత్ జీతులుగా అయిపోతారు. శ్రీమతంపై నడుచుకోవాలి. తండ్రి ఎలాగైతే మధురమైనవారో, అలా పిల్లలు కూడా మధురంగా అవ్వాలి. యుక్తిగా అర్థం చేయించాలి, మున్ముందు అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని కూడా విశ్వసిస్తారు. చూస్తారు, యుద్ధమైతే మొదలైపోయింది, తండ్రి నుండి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు. యుద్ధం మొదలైన ఇలాంటి సమయంలో వికారాల విషయం గుర్తుండదు. వినాశనం జరిగే కన్నా ముందు విషం యొక్క రుచినైతే తీసుకుందాము అని ఎవ్వరూ అనరు. ఆ సమయంలో తమను తాము సంభాళించుకోవడం జరుగుతుంది. జన్మ-జన్మాంతరాలుగా ఈ కామ ఖడ్గాన్ని ఉపయోగించడంతో మీ పరిస్థితి ఇలా అయిపోయింది, దుఃఖితులుగా అయిపోయారు. పవిత్రతలోనే సుఖముంది. సన్యాసులు పవిత్రంగా ఉన్నారు, అందుకే పూజించబడుతున్నారు. కానీ ఈ సమయంలో ప్రపంచంలో చాలా మోసం ఉంది. ప్రభువు, స్వామి అయితే ఎవ్వరూ లేరు. ప్రజలపై ప్రజా రాజ్యముంది. స్వర్గంలో లక్ష్మీ-నారాయణులది ఎంతటి నంబరువన్ రాజ్యముండేది. భారత్ అని దేనినంటారు! ఇది అందరూ మర్చిపోయారు. రుద్ర మాల, ఆ తర్వాత విష్ణు మాల. బ్రాహ్మణుల మాల అయితే తయారవ్వలేదు ఎందుకంటే కిందికి-పైకి, ఎక్కుతూ-పడిపోతూ ఉంటారు. ఈ రోజు 5-6 నంబరులో ఉంటారు, రేపు చూస్తే ఉండనే ఉండరు. వారసత్వం నుండి కూడా, రాజ్యం నుండి కూడా సమాప్తమైపోతారు. ఇక మిగిలింది ప్రజా పదవి. ఇక్కడ ఉంటూ కూడా వదిలేస్తే, ప్రజల్లో కూడా మంచి పదవిని పొందలేరు. వికర్మలు చాలా తీవ్రంగా జరుగుతాయి. మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు – ఎంతటి అద్భుతమైన విషయము. కొత్త ప్రపంచం కోసం ఇది కొత్త జ్ఞానము. మీరు కొత్త విశ్వానికి యజమానులుగా ఉండేవారు, ఇప్పుడు పాత ప్రపంచంలో గవ్వ సమానంగా ఉన్నారు. తండ్రి గవ్వ సమానమైన వారిని మళ్ళీ వజ్రతుల్యంగా చేస్తారు. మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతూ ఉన్నారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ సంబంధంలోనూ మోహంతో వేలాడకూడదు. ఆంతరిక సత్యత, స్వచ్ఛత ద్వారా నిర్భంధనులుగా అవ్వాలి. వికర్మల లెక్కను సమాప్తం చేయాలి.

2. మధురమైన మాట తీరు మరియు యుక్తియుక్తమైన మాటలతో సేవ చేయాలి. పురుషార్థం చేసి మంచి నంబరుతో పాస్ అవ్వాలి.

వరదానము:-

ఎవరైతే సెకండులో కంట్రోలింగ్ పవర్ ద్వారా రాంగ్ (తప్పు) ను రైటు (ఒప్పు) లోకి పరివర్తన చేస్తారో, వారు శ్రేష్ఠ పురుషార్థులు. వ్యర్థాన్ని కంట్రోల్ అయితే చేయాలని అనుకుంటారు, ఇది తప్పు అని కూడా అర్థం చేసుకుంటారు, కానీ అర్ధ గంట వరకు అదే నడుస్తూ ఉండకూడదు. దీనిని కొంచెం-కొంచెం ఆధీనులు మరియు కొంచెం-కొంచెం అధికారి అని అంటారు. ఎప్పుడైతే ఇది సత్యం కాదు, అయథార్థము లేక వ్యర్థము అని అర్థం చేసుకుంటారో, అదే సమయంలో బ్రేక్ వేయండి – ఇదే శ్రేష్ఠమైన పురుషార్థము. కంట్రోలింగ్ పవర్ యొక్క అర్థము, బ్రేక్ ఇక్కడ వేస్తే, అక్కడ పడడము అని కాదు.

స్లోగన్:-

అమూల్యమైన జ్ఞాన రత్నాలు (దాదీల పాత డైరీ నుండి)

ఈ పురుషార్థ సమయంలో, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపము తప్పకుండా ఉంటుంది, దానిని నింపుకునేందుకు ప్రతి ఒక్కరూ పురుషార్థం చేస్తారు. కొందరిలో ఓర్పు గుణం లేదు, మరికొందరిలో సహనశీలతా గుణం లేదు, ఇంకా వేరే గుణాలు కూడా లేవు, వాటిని ధారణ చేసేందుకు స్వయం యజమానిగా అయి, ఆ గుణాలను తమ వద్దకు లాక్కోవాలి. ఆ గుణాలు ఊరికే వారి వద్దకు ఆకర్షించబడి రావు, యజమానిలో లోపమున్న కారణంగా, ఆ గుణాలు ఏమంటాయంటే – నేను ఎవరితో స్నేహం చేయాలి. వాటికి యజమాని పట్ల ప్రేమ ఉండదు. కానీ ఎవరైతే యజమానిగా అయి నిలబడి ఉన్నారో, గుణాలు కూడా వారిని ప్రేమిస్తాయి. జ్ఞానికైతే గుణాలే ప్రియమనిపిస్తాయి కదా. ఆ గుణాలు ఆకర్షించేటువంటివి, ఈ కారణం వలన యజమానిని ఆకర్షిస్తాయి కానీ స్వయం యజమానిగా అయి స్థితులై ఉండటంతో ఆ గుణాలు వాటంతట అవే వారిలోకి వచ్చేస్తాయి. కనుక తమ యజమానత్వపు నిశ్చయం పూర్తిగా ఉండాలి. నేను ఆత్మను పరమాత్మ సంతానాన్ని, ఈ నిశ్చయం ఉన్నట్లయితే సంపూర్ణ దైవీ గుణాలు కూడా వస్తూ ఉంటాయి. నిశ్చయం ద్వారానే దైవీ గుణాలు వస్తాయి. జ్ఞానం యొక్క పాయింట్లను తీసుకోవడానికి సమయం పట్టదు కానీ దైవీ గుణాలను ధారణ చేయడంలో సమయం పడుతుంది. అచ్ఛా – ఓంశాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top