08 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

July 7, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మొత్తం ప్రపంచంలో మీ వంటి అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు. మీరు రాజఋషులు, మీరు రాజ్యం కోసం రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు”

ప్రశ్న: -

నిరాకార తండ్రిలో ఉన్న ఏ సంస్కారాన్ని సంగమంలో పిల్లలైన మీరు కూడా ధారణ చేస్తారు?

జవాబు:-

నిరాకార తండ్రిలో జ్ఞానం యొక్క సంస్కారం ఉంది. వారు మీకు జ్ఞానాన్ని వినిపించి పతితం నుండి పావనంగా చేస్తారు. అందుకే వారిని జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు అని అంటారు. పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఆ సంస్కారాన్ని ధారణ చేస్తారు. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని, మేము వారి నుండి విని ఇతరులకు వినిపిస్తామని మీరు నషాతో అంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

 చివరికి ఆ రోజు నేటికి వచ్చింది….. (ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్…..)

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఈ మహిమ ఎవరిది? ఒక్క తండ్రిది. శివాయ నమః. ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడు కదా. వారు మా తండ్రి అని పిల్లలకు తెలుసు. అలాగని మనమంతా తండ్రులమని కాదు. మొత్తం ప్రపంచంలో బ్రదర్ హుడ్ (సహోదర భావము) అని గాయనం చేయడం జరుగుతుంది. సన్యాసులు లేక విద్వాంసులు చెప్పినదాని అనుసారంగా ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అన్నట్లయితే ఫాదర్ హుడ్ (పితృ భావము) అవుతుంది. పరస్పరంలో సోదరులవ్వడంతో, ఎవరి నుండైతే వారసత్వం లభిస్తుందో, వారు తండ్రి అని ఋజువవుతారు. ఫాదర్ హుడ్ (పితృ భావము) అయినట్లయితే ఇక వారసత్వం అన్న మాటే ఉండదు. ఆత్మలైన మనందరి తండ్రి ఒక్కరేనని, వారినే వరల్డ్ గాడ్ ఫాదర్ అని అంటారని పిల్లలకు తెలుసు. వరల్డ్ లో ఎవరుంటారు? అందరూ సోదరులు, ఆత్మలు. అందరి గాడ్ ఫాదర్ ఒక్కరే. ఆ తండ్రిని అందరూ ప్రార్థిస్తారు. నమస్కారం లేక పూజ అనేది ఒక్కరికే జరగాలి. అది సతోప్రధానమైన పూజ. జ్ఞానం, భక్తి మరియు వైరాగ్యం అని కూడా అర్థం చేయించారు. తండ్రి సద్గతి కోసం జ్ఞానాన్నిస్తారు. జీవన్ముక్తి ధామాన్ని సద్గతి అని అంటారు. ఈ విషయాన్ని ఆత్మ బుద్ధిలో ధారణ చేయాలి. మన ఇల్లు శాంతిధామము, దానిని ముక్తిధామము, నిర్వాణధామము అని కూడా అంటారు. అన్నింటికన్నా మంచి పేరు శాంతిధామము. ఇక్కడ ఇంద్రియాలున్న కారణంగా ఆత్మ టాకీలో ఉంటుంది, మాట్లాడవలసి ఉంటుంది. సూక్ష్మవతనంలో మూవీ ఉంటుంది. సైగల ద్వారా సంభాషణ జరుగుతుంది, శబ్దముండదు. మీరు మూడు లోకాల గురించి కూడా తెలుసుకున్నారు. బుద్ధిలో మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం మంచి రీతిగా కూర్చున్నాయి. ఈ సృష్టి ఒక చక్రం వలె తిరుగుతుందని, మనుష్య సృష్టి గురించే గాయనం చేయడం జరుగుతుంది. దానిని ప్రపంచ చరిత్ర-భూగోళమని అంటారు. దాని గురించి మనుష్యులే తెలుసుకుంటారు కదా. ప్రపంచ చరిత్ర-భూగోళాలను వినిపిస్తారు. ఉన్నతాతి ఉన్నతమైనవారు తండ్రి. ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది వారికే తెలుసు. ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారానే, మీరు చక్రవర్తి రాజులుగా అయ్యారు. దేవతలు సంపూర్ణ నిర్వికారులని పాడుతారు కూడా. లక్ష్మీనారాయణుల చిత్రాలున్నాయి కదా. వారు సంపూర్ణ నిర్వికారులు మరియు మనుష్యులు తమను తాము సంపూర్ణ వికారులని అనుకుంటారు. సత్యయుగంలో సంపూర్ణ నిర్వికారులు అనగా సంపూర్ణ పావనులు ఉంటారు. కలియుగంలో సంపూర్ణ వికారులు అనగా సంపూర్ణ పతితులు ఉంటారు. ఇది భారత్ యొక్క విషయమే. దీనిని తండ్రియే వచ్చి బుద్ధిలో కూర్చోబెడతారు, ఇంకెవ్వరికీ తెలియదు. వారు సత్యయుగానికి ఎక్కువ వ్యవధిని చూపించారు. లక్షల సంవత్సరాల క్రితం సత్యయుగం ఉండేదని భావిస్తారు. కనుక ఎవరి బుద్ధిలోకి ఈ విషయాలు అసలు రావు.

ఇప్పుడు మేము సంపూర్ణ వికారుల నుండి సంపూర్ణ నిర్వికారులుగా అవుతున్నామని పిల్లలకు తెలుసు. సంపూర్ణ పతితుల నుండి సంపూర్ణ పావనులుగా అవ్వాలి. ఆత్మలోనే మాలిన్యం చేరుకుందని తండ్రి అర్థం చేయిస్తారు. బంగారు యుగం నుండి ఇప్పుడు ఇనుప యుగంగా అయిపోయింది. ఇక్కడ ఆత్మను ఇలా పోల్చడం జరుగుతుంది. ఇది మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. పిల్లలైన మీరు చాలా అదృష్టవంతులు, మీ అంతటి అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు మీరు రాజయోగంలో కూర్చున్నారు, మీరు రాజఋషులు. రాజ్యం కోసం ఎప్పుడైనా ఏదైనా చదువు ఉంటుందా? బ్యారిస్టరుగా తయారుచేస్తారు కానీ విశ్వ మహారాజుగా ఎవరు చేస్తారు? తండ్రి తప్ప ఎవ్వరూ చేయలేరు. ఇక్కడ ఎవరూ మహారాజులుగా లేరు. సత్యయుగం కోసమైతే వారు తప్పకుండా కావాలి. అందుకే తప్పకుండా ఎవరో రావాల్సి ఉంటుంది. తండ్రి అంటారు – ఎప్పుడైతే భక్తి పూర్తయ్యేది ఉంటుందో, అప్పుడు నేను వస్తాను. ఇప్పుడు భక్తి పూర్తి అయ్యింది. ఇక అది అందించడానికి ఏమీ లేదు. మమ్మల్ని తండ్రి కూర్చుని చదివిస్తున్నారనే నషా ఉండాలి. ఆత్మలైన మనల్ని నిరాకార తండ్రి అయిన పరమపిత పరమాత్మ శివుడు చదివిస్తున్నారు. శివుని గురించి అసలు ఎవరికీ తెలియదు. బాబా మళ్ళీ స్వర్గ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మనం వారిని మహారాజ శ్రీ నారాయణ మరియు మహారాణి శ్రీ లక్ష్మి అని అంటాము. భక్తి మార్గంలో సత్యనారాయణ కథను వినిపిస్తారు. అమరకథను, మూడవ నేత్రం కథను వినిపిస్తారు. తండ్రి మూడవ నేత్రాన్ని కూడా ఇస్తారు. నరుని నుండి నారాయణునిగా అయ్యే కథను వినిపించడం జరుగుతుంది. ఏ విషయాలైతే గడిచిపోయాయో, అవి మళ్ళీ భక్తి మార్గంలో పనికొస్తాయి. బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారని, మనం హక్కుదారులమని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. భగవంతుడు స్వర్గ రచయిత కదా. మనం భగవంతుని సంతానం అయినప్పుడు, మనం స్వర్గంలో ఎందుకు లేము! కలియుగంలో ఎందుకు ఉన్నాము? పరమపిత పరమాత్మ అయితే కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. భగవంతుడు పాత ప్రపంచాన్ని రచించరు. ముందు కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తారు, దాని తర్వాత పాతదానిని పడగొడతారు. మనం సత్యయుగం కోసం రాజ్యం తీసుకుంటున్నామని మీకు తెలుసు. సత్యయుగంలో ఎవరుంటారు? ఈ లక్ష్మీనారాయణుల వంశముంటుంది, ఇంకా వేరే రాజులు కొందరు ఉంటారు కదా. వీరికి గుర్తుగానే విజయమాల ఉంది. ఇప్పుడు మనం విజయమాలలో స్మరించబడేందుకు పురుషార్థం చేస్తున్నామని పిల్లలకు తెలుసు. మాల ఎందుకు పూజించబడుతుంది, పైనున్న పుష్పం ఎవరు అని ప్రపంచంలో ఎవరికీ మాల యొక్క అర్థం తెలియదు. మాలను తిప్పుతూ తిప్పుతూ పుష్పానికి నమస్కరిస్తారు, మళ్ళీ మాలను తిప్పడం మొదలుపెడతారు. ఆలోచనలు ఎక్కడా బయటకు వెళ్ళకూడదని, కూర్చొని మాలను స్మరిస్తూ ఉంటారు. వాయిద్యం మోగినట్లుగా, లోపల రామ-రామ అని జపిస్తూ ఉంటారు. చాలా అభ్యాసం చేస్తారు. ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. అయితే, చాలా భక్తి చేసేవారు ఎటువంటి వికర్మలు చేయరు. చాలా భక్తి చేసేవారి గురించి, వీరు సత్యవాదులై ఉంటారని భావిస్తారు. మందిరంలో మాల పెట్టి ఉంటుంది, మాలను తిప్పుతూ నోటితో రామ-రామ అని జపిస్తూ ఉంటారు. భక్తిలో పాపం జరగదని చాలామంది మనుష్యులు భావిస్తారు. నవ విధ భక్తితో మనుష్యులు ముక్తిని పొందుతారని అంటారు కానీ అలా ఏమీ జరగదు. ఇది ఒక నాటకము. ఇందులో సతోప్రధానము, సతో, రజో, తమోలలోకి అందరూ రావాల్సిందే. ఒక్కరు కూడా తిరిగి వెళ్ళరు. పైన ఎలాగైతే స్థలం ఖాళీ అయిపోతుందో, అలాగే ఇక్కడ కూడా చాలా స్థలం ఖాళీ అయిపోతుంది. ఢిల్లీ చుట్టుపక్కల, మధురమైన నదీ తీరాలలో రాజధాని ఉంటుంది. సముద్రం వైపు ఉండదు. ఈ బొంబాయి మొదలైనవి ఉండవు. అది ఒకప్పుడు చేపలు పట్టే స్థలంగా ఉండేది. చేపలు పట్టేవారు అక్కడుండేవారు. ఇప్పుడు సముద్రాన్ని ఎంతగా ఎండబెట్టారు. అయినప్పటికీ చేపలు పట్టేవారుంటారు. సత్యయుగంలోనైతే బొంబాయి ఉండదు. అక్కడ పర్వతాలు మొదలైనవేవీ కూడా ఉండవు. ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరముండదు. ఇక్కడ మనుష్యులు అలసిపోయినప్పుడు రెస్ట్ కోసం వెళ్తారు. సత్యయుగంలో అలసిపోయేటువంటి కష్టమేమీ ఉండదు, మీరు స్వర్గవాసులుగా అయిపోతారు. అంశమాత్రం కూడా కష్టముండదు. కనుక ఇప్పుడు పిల్లలు తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి.

తండ్రి అంటారు – మధురమైన గారాబాల పిల్లలు, శరీర నిర్వాహణార్థం వ్యాపారం మొదలైనవైతే చేసుకోవాలి. విద్యార్థులు స్కూల్లో చదువుకొని, మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకుంటారు. ఇంటి పనులు కూడా చేస్తారు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఈ చదువులో మీకు ఎటువంటి కష్టము లేదు. ఆ చదువులో ఎన్ని సబ్జెక్టులుంటాయి. ఇక్కడైతే ఒకే చదువు మరియు ఒకే పాయింటు – ‘మన్మనాభవ’, దీనితో మీ పాపాలు నాశనమవుతాయి. భగవానువాచ కదా. భగవంతుడు ద్వాపరంలో గీతను వినిపించారని వారు భావిస్తారు. కానీ ద్వాపరంలో వినిపించి ఏమి చేస్తారు? కృష్ణుని చిత్రంలో వ్రాయబడిన వాక్యాలు చాలా బాగున్నాయి. ఈ యుద్ధం కేవలం నిమిత్తమవుతుంది. అందరూ మరణించినప్పుడు తిరిగి ముక్తి-జీవన్ముక్తులలోకి వెళ్తారు. అది కూడా కేవలం యుద్ధంలోనే మరణించరు. అనేక రకాల వైపరీత్యాలు సంభవిస్తాయి. పిల్లలకు ఎటువంటి దుఃఖం కలగకూడదు. మనుష్యులకు హార్ట్ ఫెయిల్ అయినప్పుడు వారికి ఎటువంటి దుఃఖం కలగదు. మృత్యువు అంటే అలా ఉండాలి. కూర్చొని ఉండగానే హార్ట్ ఫెయిల్ అవుతుంది, అంతే, సమాప్తం. వైద్యుడు వచ్చేసరికి ఆత్మ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరి మృత్యువు జరగనున్నది. చివర్లో ఆసుపత్రి గాని, డాక్టరు గాని ఉండరు. అలానే, అంత్యక్రియలు చేసేవారు ఉండరు, ఏమీ ఉండదు. అందరి ప్రాణాలు తనువు నుండి వెళ్ళిపోతాయి. కుండపోతగా వర్షం కురుస్తుంది. మృత్యువు వచ్చేందుకు సమయమేమీ పట్టదు. మనుష్యులు వెంటనే మరణించే విధంగా బాంబులు తయారుచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి బాంబులను తయారుచేస్తూ ఉంటారు. బాంబులను అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఇది డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఇది డ్రామాలో తయారై-తయారవుతున్న ఆట, కల్ప-కల్పము వినాశనం జరుగుతుంది. సత్యయుగంలో మీకు ఈ జ్ఞానముండదు. తండ్రియే వచ్చి జ్ఞానాన్ని ఇవ్వాలి. స్థాపన పూర్తి అయ్యిందంటే ఇక తర్వాత జ్ఞానము యొక్క విషయమే ఉండదు. మళ్ళీ రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. ఇప్పుడు భక్తి పూర్తవుతుంది. ఇప్పుడు మీరు యోగబలంతో పావనంగా అవ్వాలి. పావనంగా అయినప్పుడే సుఖధామం, శాంతిధామాలకు వెళ్ళగలరు. చార్టు పెట్టాల్సి ఉంటుంది. మేము తండ్రిని స్మృతి చేసి ఇక్కడే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలని మీరు అర్థం చేసుకున్నారు. ఇలా ఏ శాస్త్రాలు మొదలైనవాటిలో రాసి లేదు. చివరికి ఆ రోజు నేటికి వచ్చింది….. అనే పాటను పిల్లలు విన్నారు. భారతవాసులు మళ్ళీ రాజులకే రాజులుగా అవుతారు. రాజులకే రాజులుగా అనగా మహారాజులుగా అవుతారు. తర్వాత త్రేతాలో రాజా-రాణులు ఉంటారు. ఎవరైతే పూజ్య మహారాజా-మహారాణులుగా ఉండేవారో, వారు ద్వాపరంలో వామ మార్గంలోకి వచ్చి పూజారులుగా అవుతారు. తామే పూజ్యులుగా, తామే పూజారులుగా అవుతారు. నేను పూజారిగా అవ్వనని తండ్రి అంటారు. దేవతలు పూజ్యులుగా ఉంటారు, నేను పూజ్యునిగాను అవ్వను, పూజారిగా కూడా అవ్వను. భారతవాసులు దేవీ దేవతలకే మందిరాలను నిర్మించి వారిని పూజిస్తారు. మొదట్లో పూజ్యులుగా ఉన్న లక్ష్మీనారాయణులే మళ్ళీ భక్తి మార్గంలో శివబాబాకు పూజారులుగా అవుతారు. ఏ శివబాబా అయితే మహారాజా-మహారాణులుగా తయారుచేసారో, వారికి మందిరాలను నిర్మించి పూజిస్తారు. ఎవరూ ఒక్కసారిగా వికారులుగా అవ్వరు, నెమ్మది-నెమ్మదిగా అవుతారు. వామ మార్గంలో దేవతలకు సంబంధించిన గుర్తులను కూడా చూపిస్తారు. ఎవరైతే పూజ్య లక్ష్మీనారాయణులుగా ఉండేవారో, వారే మళ్ళీ పూజారులుగా అవుతారు. మొట్టమొదట శివుని మందిరాన్ని నిర్మిస్తారు. ఆ సమయంలో పూజ కోసం వజ్రాలను కట్ చేయించి లింగాన్ని తయారుచేస్తారు. పరమాత్మ అతి చిన్న బిందువని ఎవరికీ తెలియదు. పెద్ద లింగం కాదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మందిరాలనైతే చాలా నిర్మిస్తారు. రాజులను చూసి ప్రజలు కూడా అలాగే చేస్తారు. మొట్టమొదట శివబాబా పూజ జరుగుతుంది. దానిని అవ్యభిచారి, సతోప్రధాన పూజ అని అంటారు, తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తారు. మీరు రజో, తమోలలోకి వచ్చారు కావున హిందువులని పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి దేవీ దేవతలుగా ఉండేవారు. వాస్తవానికి మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారని తండ్రి అంటారు. కానీ మీరు చాలా పతితంగా అయిపోయారు. అందుకే మిమ్మల్ని మీరు దేవతలని చెప్పుకోలేరు ఎందుకంటే అపవిత్రంగా ఉన్నారు. హిందు అనే పేరైతే చాలా కాలం తర్వాత పెడతారు.

మనమే పూజ్యులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు సంగమయుగంలో పూజ్యులుగాను లేరు, పూజారులుగాను లేరు. మీరు ఏమి చేస్తున్నారు? శ్రీమతానుసారముగా పూజ్యులుగా అవుతున్నారు, ఇతరులను కూడా తయారుచేస్తున్నారు. మీరు బ్రాహ్మణులు, మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది. పూర్తిగా పవిత్రంగా అయినప్పుడు, ఈ పాత శరీరాన్ని వదలాల్సి ఉంటుంది. ఇది చాలా సహజమని తండ్రి అంటారు. వృద్ధ మాతలకు ధారణ జరగదు. తండ్రి అంటారు – నేను ఒక ఆత్మను అని అయితే భావిస్తున్నారా? ఆత్మలోనే మంచి మరియు చెడు సంస్కారాలు ఉంటాయి. ఆత్మ ఏ కర్మనైతే చేస్తుందో, దానిని మరుసటి జన్మలో అనుభవించవలసి ఉంటుంది. తండ్రి కూడా ఆత్మలతోనే మాట్లాడుతారు. తండ్రి అంటారు – ఓ పిల్లలూ, ఆత్మాభిమానులుగా అవ్వండి. నిరాకార శివబాబా నిరాకారి ఆత్మలను చదివిస్తారు. నిరాకార బాబాలో జ్ఞానం యొక్క సంస్కారముంది. వారికి శరీరమైతే లేదు. కనుక వారు జ్ఞానసాగరుడు, పతితపావనుడు. వారిలో అన్ని గుణాలు ఉన్నాయి. నేను వచ్చి పిల్లలైన మిమ్మల్ని పావనంగా చేస్తానని తండ్రి అంటారు. ఈ యుక్తి ఎంత సహజమైనది. పదం కూడా ఒకటే – ‘మన్మనాభవ’, నన్నొక్కడినే స్మృతి చేయండి. స్మృతితోనే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు మనము బ్రాహ్మణులమని కూడా మీకు తెలుసు. తర్వాత సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా, వైశ్య, శూద్ర వంశీయులుగా అవుతాము. మనమే ఈ 84 జన్మల చక్రంలోకి వస్తాము. పై నుండి కిందకు దిగుతాము, తర్వాత బాబా వస్తారు. ఈ సృష్టి చక్రం తప్పకుండా తిరుగుతూ ఉంటుంది. ఈ సృష్టి పాతదిగా అవుతుంది, దీనిని కొత్తగా చేయడానికి మళ్ళీ బాబా వస్తారు. ఈ విషయం బుద్ధిలో కూర్చుంటుంది కదా. ఈ చక్రం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు, దీనితో చక్రవర్తీ రాజులుగా అవుతారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీమతానుసారముగా పూజ్యులుగా అవ్వాలి. ఆత్మలో ఏ చెడు సంస్కారాలైతే ఏర్పడ్డాయో, వాటిని జ్ఞాన-యోగాలతో సమాప్తం చేయాలి. సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి.

2. శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ కూడా చదువు చదువుకోవాలి మరియు చదివించాలి. యోగబలంతో పావనంగా అయి రాజ్య పదవిని తీసుకోవాలి.

వరదానము:-

దుఃఖము మరియు దుఃఖ రహితము గురించిన నాలెడ్జ్ ఇప్పుడే ఉంది. దుఃఖపు ప్రపంచం ఎదురుగా ఉన్నా కూడా, సదా దుఃఖ రహిత రాజ్యాధికారాన్ని అనుభవం చేయడమే అష్ట శక్తి స్వరూపులు, కర్మేంద్రియజీత్ పిల్లల గుర్తు. ఇప్పుడు మాత్రమే తండ్రి ద్వారా సర్వ శక్తులు ప్రాప్తిస్తాయి. కానీ ఒకవేళ ఏదో ఒక సాంగత్య దోషానికి గాని, ఏదైనా కర్మేంద్రియానికి గాని వశమై తమ శక్తులను పోగొట్టుకుంటే, ప్రాప్తించిన దుఃఖ రహిత పురి యొక్క నషా మరియు సంతోషం స్వతహాగానే కోల్పోతారు. దుఃఖరహిత పురి యొక్క చక్రవర్తి కూడా నిరుపేదగా అయిపోతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top