08 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

7 January 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - జ్ఞాన రత్నాలను ధారణ చేసి ఆత్మిక హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరుస్తూ వెళ్ళండి, దాని ద్వారా అందరికీ ఆరోగ్యం, సంపద లభిస్తాయి’’

ప్రశ్న: -

తండ్రి యొక్క ఏ కర్తవ్యాన్ని మనుష్యాత్మలు ఎవ్వరూ చేయలేరు?

జవాబు:-

ఆత్మకు జ్ఞానం యొక్క ఇంజెక్షన్ ఇచ్చి, దానిని సదా కోసం నిరోగిగా తయారుచేయడము – ఈ కర్తవ్యాన్ని మనుష్యులు ఎవ్వరూ చేయలేరు. ఎవరైతే ఆత్మను నిర్లేపి అని నమ్ముతారో, వారు జ్ఞానం యొక్క ఇంజెక్షన్ ఎలా ఇస్తారు? ఈ కర్తవ్యం ఒక్క అవినాశీ సర్జన్ ది మాత్రమే. వారు ఎలాంటి జ్ఞాన-యోగాల మందును ఇస్తారంటే, దాని ద్వారా అర్ధకల్పం కోసం ఆత్మ మరియు శరీరం రెండూ ఆరోగ్యంగా, సంపన్నంగా అయిపోతాయి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఈ సమయం వెళ్ళిపోతోంది..

ఓంశాంతి. ఇంకా కొంత సమయమే ఉందని ఎవరన్నారు? చాలా గడిచిపోయింది. ఇప్పుడు కొంతలో కూడా కొంత మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు మీరు ఈ పాత ప్రపంచంలో కూర్చున్నారు. ఇక్కడ దుఃఖమే దుఃఖముంది. సుఖం యొక్క నామ రూపాలు కూడా ఉండవు. సుఖం సుఖధామంలోనే ఉంటుంది. కలియుగాన్ని దుఃఖధామము అని అంటారు. ఇప్పుడు బాబా అంటారు – నేను వచ్చాను మిమ్మల్ని సుఖధామానికి తీసుకువెళ్ళడానికి, మరి ఎందుకు ఆగిపోయి ఉన్నారు. దుఃఖధామంతో ఎందుకు మనసు పెట్టుకున్నారు? దుఃఖధామం యొక్క సభ్యులతో అనగా ఈ పాత శరీరాలతో ఎందుకు మనసు పెట్టుకున్నారు? మిమ్మల్ని సుఖధామానికి తీసుకువెళ్ళడానికి మేము వచ్చాము. ఈ ప్రపంచం యొక్క సుఖం కాకిరెట్టతో సమానమని సన్యాసులు అంటారు. అందుకే దానిని సన్యసిస్తారు. పిల్లలైన మీకు ఇప్పుడు సుఖధామం యొక్క సాక్షాత్కారం అయ్యింది. ఈ చదువు ఉన్నదే సుఖధామం కోసము మరియు ఈ చదువులో ఏ కష్టమూ లేదు. తండ్రిని స్మృతి చేయాలి. ఈ స్మృతితో కూడా మీరు నిరోగిగా అవుతారు. మీ శరీరం యొక్క ఆయువు కల్పవృక్షం సమానంగా ఎక్కువగా ఉంటుంది. ఈ మనుష్య సృష్టి యొక్క వృక్షం ఏదైతే ఉందో, దాని ఆయుష్షు 5 వేల సంవత్సరాలు. ఇందులో అర్ధకల్పం సుఖం, అర్ధకల్పము దుఃఖం ఉన్నాయి. దుఃఖాన్ని అయితే అర్ధకల్పం మీరు చూసారు. తండ్రి అంటారు – పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే పవిత్రంగా అవ్వండి. ఈ విషాన్ని ఇచ్చి పుచ్చుకోవడం విడిచిపెట్టండి అని శ్రీమతం చెప్తుంది. జ్ఞానాన్ని మరియు యోగాన్ని ధారణ చేయండి. ఎంతగా జ్ఞాన రత్నాలను ధారణ చేస్తారో, అంతగా నిరోగిగా అవుతారు.

ఇది ఆత్మిక హాస్పిటల్ కూడా, యూనివర్సిటీ కూడా అని తండ్రి అర్థం చేయించారు. పరమపిత పరమాత్మ వచ్చి ఆత్మిక హాస్పిటల్ ను మరియు యూనివర్సిటీని స్థాపన చేస్తారు. హాస్పిటల్స్ అయితే ప్రపంచంలో చాలా ఉన్నాయి కానీ ఇలా హాస్పిటల్ మరియు యూనివర్సిటీ రెండూ కలిపి ఎక్కడా ఉండదు. ఇక్కడ ఇది అద్భుతము, హాస్పిటల్ మరియు యూనివర్సిటీ, ఆరోగ్యం మరియు సంపద కలిపి లభిస్తాయి. మరి ఎందుకు ఈ ఖజానాను తీసుకోవడానికి నిలబడరు? ఈ రోజు-రేపు అంటూ అకస్మాత్తుగానే వినాశనం వచ్చేస్తుంది. తండ్రి శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతాన్ని ఇస్తారు. మీరు గవర్నమెంట్ కు కూడా అర్థం చేయించండి – ఈ సమయంలో అనంతమైన తండ్రి అందరికీ ఆరోగ్యం, సంపద రెండూ లభించేటువంటి హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరుస్తారు. గవర్నమెంట్ కూడా హాస్పిటల్ మరియు యూనివర్సిటీలను తెరుస్తుంది. వారికి అర్థం చేయించండి, ఈ దైహిక హాస్పిటల్ తెరవడం వలన ఏం జరుగుతుంది. ఇవి అర్ధకల్పం నుండి నడుస్తూ వచ్చాయి. రోగులు కూడా పెరుగుతూనే వచ్చారు. ఇదైతే ఆత్మిక హాస్పిటల్ మరియు యూనివర్సిటీ, దీని ద్వారా మనుష్యులు 21 జన్మల కోసం సదా ఆరోగ్యవంతంగా, సంపన్నంగా అవ్వగలరు కావున ఎడ్యుకేషన్ మినిస్టర్ కు, హెల్త్ మినిస్టర్ కు కూడా అర్థం చేయించండి – అనంతమైన తండ్రి ఈ కంబైండు హాస్పిటల్ మరియు యూనివర్సిటీ రెండింటినీ తెరిచారు. మీకు కూడా సలహా ఇస్తున్నాము – ఇటువంటివి తెరిచినట్లయితే, మనుష్యుల కళ్యాణం జరుగుతుంది. ఇకపోతే, ఈ వ్యాధులు మొదలైనవన్నీ ఎప్పటి నుండైతే రావణ రాజ్యం మొదలయ్యిందో, అప్పటి నుండి మొదలయ్యాయి. ఒకప్పుడైతే వైద్యుల మందులుండేవి. ఇప్పుడైతే ఇంగ్లీషు మందులు చాలా వెలువడ్డాయి. వీరు అవినాశీ సర్జన్, అవినాశీ మందును ఇస్తారు. అందుకే అంటూ ఉంటారు – జ్ఞాన అంజనాన్ని కాటుకను సద్గురువు ఇచ్చారు అని. ఆత్మిక తండ్రే ఆత్మలకు జ్ఞానమనే ఇంజెక్షన్ ఇస్తారు. ఆత్మకు ఇంజక్షన్ ఇచ్చేవారు ఇంకెవ్వరూ ఉండజాలరు. వారైతే ఆత్మ నిర్లేపి అని అంటారు. కనుక మీరు అర్థం చేయించండి, ఆ హాస్పిటల్ మరియు యూనివర్సిటీలోనైతే లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇక్కడైతే ఖర్చు యొక్క విషయమే లేదు. మూడు అడుగుల భూమి కావాలి. ఎవరు వచ్చినా కూడా, వారికి అర్థం చేయించగలిగేందుకు. తండ్రిని స్మృతి చేసినట్లయితే సదా ఆరోగ్యవంతంగా అయిపోతారు మరియు చక్రాన్ని తెలుసుకుంటే చక్రవర్తీ రాజుగా అవుతారు. ధనవంతులు అయితే పెద్ద హాస్పిటల్, యూనివర్సిటీ తెరుస్తారు. పేదవారు చిన్నవి తెరుస్తారు. గవర్నమెంట్ ఎన్ని తెరుస్తోంది. ఈ రోజులలోనైతే టెంట్ మొదలైనవి వేసి కూడా చదివిస్తారు మరియు 2-3 సెక్షన్లు పెడతారు ఎందుకంటే స్థలమూ లేదు, ధనం లేదు. కానీ ఇందులో ఖర్చు యొక్క విషయం లేదు. ఏ స్థలం లభించినా ఫర్వాలేదు, పనిముట్లు మొదలైనవేవీ పెట్టేది లేదు కదా. చాలా సింపుల్ విషయము. పురుషులు కూడా తెరుస్తారు, మాతలు కూడా తెరుస్తారు. తండ్రి అంటారు – మీరే తెరవండి, మీరే సంభాళించండి. ఎవరు చేస్తారో, వారు పొందుతారు. చాలామంది కళ్యాణం జరుగుతుంది. అనంతమైన తండ్రి శ్రేష్ఠంగా అవ్వడానికి శ్రీమతాన్ని ఇస్తారు. చాలామంది వింటారు కానీ చేయరు ఎందుకంటే భాగ్యంలో లేదు. ఆరోగ్యం, సంపద తండ్రి నుండి లభిస్తాయి. బాబా వైకుంఠం యొక్క రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. వజ్ర-వైఢూర్యాల మహళ్ళు లభిస్తాయి. భారత్ లోనే లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. తప్పకుండా తండ్రే వారికి వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు. ఇప్పుడు కలియుగంలో దుఃఖమే దుఃఖముంది. మళ్ళీ సత్యయుగం యొక్క స్థాపన నేనే చేయాలి. మనుష్యులు ఏదైనా హాస్పిటల్ మొదలైనవి తెరిస్తే, ప్రారంభోత్సవం చేస్తారు. తండ్రి అంటారు, నేను స్వర్గం యొక్క ప్రారంభోత్సవం చేస్తాను. ఇప్పుడు మీరు శ్రీమతంపై స్వర్గానికి యోగ్యులుగా అవ్వండి. కల్ప-కల్పము మీరు యోగ్యులుగా అవుతారు, ఇది కొత్త విషయం కాదు. పేదవారు చాలామంది రావడాన్ని చూస్తూ ఉంటారు. బాబా కూడా అంటారు – నేను పేదల పెన్నిధిని. షావుకార్ల వద్ద ధనం చాలా ఉంటుంది. అందుకని వారు మేము స్వర్గంలో కూర్చున్నామని భావిస్తారు. భారత్ పేదది, దానిలో కూడా ఎవరైతే ఎక్కువ పేదవారిగా ఉన్నారో, వారినే తండ్రి పైకి లేపుతారు. షావుకార్లు అయితే నిద్రలో ఉన్నారు. బాబా ఎంతగా జ్ఞానం మరియు యోగమును నేర్పిస్తారు, మూడవ నేత్రాన్ని కూడా బాబానే ఇస్తారు. దీని ద్వారా మీరు మొత్తం చక్రాన్ని తెలుసుకుంటారు. మిగిలిన వారంతా ఘోర అంధకారంలో ఉన్నారు. డ్రామా ఆది మధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు. పతితపావనుడైన తండ్రినే మర్చిపోయారు. రాయి, రప్పలలో ఉన్నారని శివ పరమాత్మ కోసం అనేస్తారు.

మీకు తెలుసు ఇప్పుడు అందరిదీ వినాశనం యొక్క సమయము. అగ్నిలో దహించుకుపోయి మరణించి సమాప్తమైపోతారు. తర్వాత అందరినీ తిరిగి తోడుగా తీసుకువెళ్తాను. నేను పండా (మార్గదర్శకుడి)గా అయి వచ్చాను. మీరు పాండవ సైన్యం కదా. వారు భౌతిక యాత్రలకు తీసుకువెళ్తారు, అవి జన్మ-జన్మాంతరాలుగా చేస్తూ వచ్చారు. ఇది ఆత్మిక తీర్థయాత్ర, ఇందులో ఎక్కడకూ, తిరగాల్సిన అవసరం లేదు. తండ్రి అంటారు – కేవలం నన్ను స్మృతి చేయండి. రాత్రి కూడా మేల్కొని నన్ను స్మృతి చేయండి. నాతో మీ బుద్ధియోగాన్ని జోడించండి. నిద్రను జయించేవారిగా అయినట్లయితే సమీపంగా వస్తూ ఉంటారు. వారు కుఖవంశావళి బ్రాహ్మణులు. మీరు బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణులు. ఇప్పుడు మీరు ఆత్మిక యాత్రలో తత్పరులై ఉన్నారు, మీరు పవిత్రంగా ఉండాలి. ఆ బ్రాహ్మణులు స్వయం అపవిత్రులు కనుక ఇతరులను పవిత్రంగా చేయలేరు. మీరైతే పవిత్రంగా ఉండాలి. రుద్ర జ్ఞాన యజ్ఞంలో పవిత్ర బ్రాహ్మణులే ఉంటారు. ఆ బ్రాహ్మణులైతే మందిరాలలో ఉంటారు. పేరుకు బ్రాహ్మణులు అన్న పేరు ఉన్న కారణంగా కనుక దేవతల మూర్తులను చేతితో ముట్టుకోగలుగుతారు మరియు వారికి స్నానం మొదలైనవి చేయిస్తారు. కానీ వారు పతితులు. ఇకపోతే, మిగతా మనుష్యులు ఎవరైతే మందిరాలకు వెళ్తారో, వారు ఒకవేళ పేరుకు బ్రాహ్మణులు కాకపోతే వారిని ముట్టుకోనివ్వరు. బ్రాహ్మణులకు చాలా గౌరవం ఉంది. కానీ వారు పతితులు, వికారులు. కొందరు బ్రహ్మాచారులుగా ఉంటారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు – ఎవరైతే 21 కులాలను ఉద్ధరిస్తారో, వారు సత్యాతి-సత్యమైన బ్రాహ్మణ-బ్రాహ్మణీలు. కన్య ఉద్ధరిస్తున్నట్లయితే, ఆమె తల్లితండ్రులు కూడా ఉద్ధరింపబడతారు. మీరు 21 తరాలకు స్వర్గానికి యజమానులుగా అవ్వగలరు అని ఈ తల్లిదండ్రులు నేర్పిస్తారు. తండ్రి గుప్తంగా ఉన్నారని పిల్లలకు తెలుసు. శివబాబా బ్రహ్మా ద్వారా మనకు అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. ఈ దాదా అయితే వ్యాపారం మొదలైనవి చేసేవారు. ఇప్పుడు అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమంలో వచ్చి శివబాబా ప్రవేశించారు మరియు వీరి ద్వారానే జ్ఞానం వినిపిస్తారు. వీరు రథము, శివబాబా రథసారథి. ఇప్పుడు నిరాకార పరమాత్మ అర్థం చేయిస్తారు – ఈ రథం అనేక జన్మలు పతితంగా ఉన్నది. మొట్టమొదట వీరే పావనంగా అవుతారు, సమీపంగా ఉన్నారు. నేను భగవంతుడిని అని వీరు అనరు. వీరంటారు – ఇది నా అనేక జన్మల అంతిమంలో కూడా అంతిమ జన్మ, వానప్రస్థ అవస్థ ఉంది, పతితంగా ఉన్నారు. బాబా దీనిలో ప్రవేశించారు. ఇప్పుడు తండ్రి అంటారు – మీకు మీ జన్మల గురించి తెలియదు. నేను మీకు చెప్తాను. ఇది కూడా బుద్ధిలోకి వస్తుంది, పతిత-పావనుడు పరమపిత పరమాత్మనే. వారు తండ్రి కూడా, టీచరు కూడా, గురువు కూడా. మొత్తం డ్రామా ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. బాబా తమతో పాటు తీసుకువెళ్తారని మీకు తెలుసు. ఈ తండ్రి, టీచరు, గురువు యొక్క సలహా తీసుకుంటే మీరు ఉన్నత పదవిని పొందుతారు. ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తారు. కొంతమందైతే ధారణ చేసి శ్రీమతంపై నడుచుకుని ఉన్నత పదవిని పొందుతారు. ఎవరైతే శ్రీమతాన్ని అంగీకరించరో, వారు ఉన్నత పదవిని పొందరు. తండ్రి అంటారు – సుఖధామాన్ని, శాంతిధామాన్ని స్మృతి చేస్తూ ఈ దుఃఖధామాన్ని మర్చిపోతూ వెళ్ళండి. స్వయాన్ని అశరీరిగా భావించండి. ఇప్పుడు మనం తిరిగి వెళ్తున్నాము. బాబా తీసుకువెళ్ళడానికి వచ్చారు. ప్రతి ఒక్కరు తమ-తమ పాత్రను రిపీట్ చేయాలి. ప్రతి ఒక్కరి ఆత్మ అవినాశీ పాత్రధారి. ప్రపంచంలో ప్రళయం ఎప్పుడూ జరగదు. ఇది దుఃఖధామం, తర్వాత శాంతిధామానికి, సుఖధామానికి వెళ్తారు. బుద్ధిలో స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ మరియు పవిత్రంగా ఉన్నట్లయితే నావ తీరానికి చేరుతుంది. మీరు కాలుడిపై విజయాన్ని పొందుతున్నారు. అక్కడ మీ అకాల మృత్యువు జరగదు. ఎలాగైతే సర్పం పాత కుబుసాన్ని విడిచిపెట్టి కొత్తది తీసుకుంటుందో, అలా మీరు కూడా పాత శరీరాన్ని మార్చి కొత్తది తీసుకుంటారు. ఇటువంటి అవస్థను ఇక్కడ తయారుచేసుకోవాలి. ఇక మేము ఈ శరీరాన్ని విడిచిపెట్టి మధురమైన ఇంటికి వెళ్తాము. మమ్మల్ని కాలుడు కబళించలేడు. సర్పం యొక్క ఉదాహరణ వాస్తవానికి సన్యాసులకు ఇవ్వలేరు. భ్రమరి ఉదాహరణ కూడా ప్రవృత్తి మార్గం వారిదే. సెకెండులో జీవన్ముక్తి ఇవ్వగలరు, జనకుడి లాగ అని అంటారు. ఇది కూడా కాపీ చేస్తారు. జీవన్ముక్తిలో ఇరువురూ కావాలి. ఆ సన్యాసులు జీవన్ముక్తిని ఎలా ఇవ్వగలరు? ఇప్పుడు తండ్రి అంటారు – తిరిగి పదండి, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి లేదంటే చాలా శిక్షలు అనుభవిస్తారు. మరియు పదవి కూడా భ్రష్టమైపోతుంది. అంతిమంలో ఎవరి స్మృతి అయినా వస్తే తర్వాత పునర్జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఇదైతే యోగంతో ఆరోగ్యం మరియు జ్ఞానంతో సంపద, క్షణంలో జీవన్ముక్తి అని దీనిని అంటారు. మళ్ళీ ఇంత ధనాన్ని వృథా చేసి, భ్రమించడం మొదలైనవాటి అవరమేముంది అందుకే హెల్త్ మినిష్టర్ కు, ఎడ్యుకేషన్ మినిష్టర్ కు అర్థం చేయించండి, మీరు ఈ హాస్పిటల్, యూనివర్సిటీని తెరిచినట్లయితే, మీకు చాలా లాభముంటుంది. ఎవరు చేస్తారో, వారు పొందుతారు. షావుకార్ల పని, షావుకార్లను ఉద్ధరించడము. పేదవారే వారసత్వాన్ని తీసుకుంటారు. ఇకపోతే, కోటీశ్వరులు ఎవరైతే ఉంటారో, వారి గురించి అనడం జరుగుతుంది – కొందరి ధనం మట్టిలో కలిసిపోతుంది… చివర్లో నిప్పు అంటుకుంటుంది. అప్పుడు అంతా సమాప్తమైపోతుంది. కావున వినాశనానికి ముందు ఎంతో కొంత ఎందుకు చేసోకూడదు, అప్పుడు ఏదో ఒక పదవి లభిస్తుంది. మరణించడమైతే తప్పనిసరి. డ్రామా అంతం కూడా జరిగేది ఉంది. బాబా ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తారు. నదులైతే అన్ని వైపులా తిరుగుతూ ఉంటాయి. ఇకపోతే, బ్రహ్మాపుత్ర అయితే ఈ బ్రహ్మానే. మమ్మా అనగా సరస్వతి. మిగిలిన వారు జ్ఞాన గంగలు. నీటి గంగలు పావనంగా ఎలా చేస్తాయి? అది నిజమైన మేళా కాదు. ఇది సత్యమైన మేళా. ఎప్పుడైతే జీవాత్మలు పరమాత్మతో కలుస్తాయో. అప్పుడు అంటారు ఆత్మ – పరమాత్మ చాలాకాలం నుండి వేరుగా ఉండేవారు. ఇప్పుడు జీవాత్మ యొక్క మేళా పరమాత్మతో జరుగుతుంది. పరమాత్మ కూడా దేహాన్ని అప్పుగా తీసుకున్నారు, లేదంటే ఎలా చదివిస్తారు? కావున వారిని శివ భగవాన్ అని అంటారు. వారు వీరిలో ప్రవేశించి జ్ఞానాన్ని ఇస్తారు. సరస్వతిని జ్ఞానం యొక్క దేవి అని అనడం జరుగుతుంది. బ్రహ్మాకు కూడా జ్ఞానముంటుంది. వారికి జ్ఞానాన్ని ఇచ్చేవారు ఎవరు? జ్ఞానసాగరుడు. మీ వద్ద ఈ జ్ఞానం నంబరువారు పురుషార్థానుసారంగా ఉంది కావున ఈ జ్ఞానాన్ని ధారణ చేసి శ్రీమతంపై నడవాలి. మొత్తం అంతా పవిత్రత పైనే ఆధారపడి ఉంది. ఈ విషయం పైనే అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపది ఇందుకే పిలిచించి. సహనం చేస్తూ- చేస్తూ 21 జన్మల కోసం వివస్త్రగా అవ్వడం నుండి రక్షింపబడతారు. నేను సాధువులను కూడా ఉద్ధరిస్తాను అని గీతలో కూడా ఉంది. కానీ సాధువులు ఈ పదాలను వినిపించరు.

ఈ సమయంలో ప్రపంచమంతా లంచగొండిగా అయిపోయిందని మీకు తెలుసు, అందుకనే ఇదంతా వినాశనం అవ్వాల్సిందే. ఎవరైతే వారసత్వం తీసుకునేదే ఉందో, వారే తీసుకుంటారు. బాబాతో చాలామంది పిల్లలు, మేము పేద ఇంట్లో ఉండి ఉంటే ఎంత బాగుండేది అని అంటారు. షావుకార్లు అయితే బయటకు రానివ్వరు. బాబా మేము కన్యలమై ఉంటే ఎంత మంచిగా ఉండేది. మాతలు మెట్లు దిగవలసి వస్తుంది. బాబా అంటారు – వారసత్వం తీసుకోండి. మనుష్యులు మరణించడానికి సమయమేమీ పట్టదు. ఆపదలు మొదలైనవి చాలా వస్తాయి. మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. 84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలా లేక ఇక్కడే మునకలు వేస్తూ ఉండాలా? మన్మనాభవ, మధ్యాజీ భవ. రావణుడి వారసత్వాన్ని మర్చిపోండి. రావణుడు శాపాన్ని ఇస్తాడు. తండ్రి అంటారు – పిల్లలుగా అయినట్లయితే వారసత్వాన్ని పొందుతారు. శ్రీమతంపై నడుచుకోకపోతే వారసత్వాన్ని ఎలా పొందుతారు? ఈ ఆత్మిక హాస్పిటల్ ను తెరుస్తూ వెళ్ళండి. భూమి ఖాళీగా పడి ఉంటుంది. అద్దెకు ఇచ్చినా మంచిదే. చాలా లాభం ఉంటుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సమీపంగా వచ్చేందుకు ఆత్మిక యాత్రలో ఉండాలి. రాత్రి మేల్కొని కూడా ఈ బుద్ధి యొక్క యాత్రను తప్పకుండా చేయాలి.

2. సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి 21 కులాలను ఉద్ధరించాలి. స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. కాలుడిపై విజయం పొందడం కోసం ఈ పాత శరీరం నుండి మమకారాన్ని తొలగించాలి.

వరదానము:-

బ్రహ్మా తండ్రి యొక్క మాటలు, నడత, ముఖం మరియు నడవడికలో ఏ రాయల్టీనైతే చూసారో – దానిని ఫాలో చేయండి. బ్రహ్మా తండ్రి ఎప్పుడూ చిన్న-చిన్న విషయాలలో తమ బుద్ధిని మరియు సమయాన్ని వెచ్చించలేదు. వారి ముఖం నుండి ఎప్పుడూ సాధారణ మాటలు వెలువడలేదు. ప్రతి మాట యుక్తి-యుక్తంగా అనగా వ్యర్థ భావానికి అతీతంగా అవ్యక్త భావం మరియు భావన కలిగినదిగా ఉండేది. వారి వృత్తి ప్రతి ఆత్మ పట్ల సదా శుభభావన, శుభకామన కలిగి ఉండేది. దృష్టి ద్వారా అందరినీ ఫరిశ్తా రూపంలో చూసేవారు. కర్మలతో అందరికీ సుఖాన్ని ఇచ్చారు, సుఖాన్ని తీసుకున్నారు. అలా ఫాలో చేయండి, అప్పుడు అంటారు బ్రహ్మా తండ్రి సమానము అని.

స్లోగన్:-

లవలీన స్థితిని అనుభవం చేయండి

ఎలాగైతే లౌకిక రీతిలో ఎవరైనా ఎవరి స్నేహంలోనైనా లవలీనులై ఉన్నట్లయితే, వారి ముఖం ద్వారా, నయనాల ద్వారా, వాణి ద్వారా – వీరు లవలీనులుగా ఉన్నారు, ప్రేయసిగా ఉన్నారు అన్నది అనుభవమవుతుందో, అలా మీలో తండ్రి స్నేహం ఇమర్జ్ అయి ఉన్నట్లయితే, మీ మాటలు ఇతరులను కూడా స్నేహంలో ముంచేస్తాయి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top