07 November 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
6 November 2022
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - మనుష్యులెవరైతే తండ్రిని మర్చిపోయి ఊబిలో చిక్కుకుపోయారో, వారిని బయటకు తీసేందుకు కృషి చేయండి, విచార సాగర మథనం చేసి అందరికీ తండ్రి యొక్క సత్య పరిచయాన్ని ఇవ్వండి’’
ప్రశ్న: -
గీతను ఏ ధర్మ శాస్త్రము అని అంటారు, అందులో అర్థం చేసుకోవలసిన రహస్య యుక్తమైన విషయమేమిటి?
జవాబు:-
గీతా శాస్త్రము బ్రాహ్మణ దేవీ-దేవతా ధర్మం వారి శాస్త్రము. బ్రాహ్మణ దేవీ-దేవతాయ నమః అని అంటారు. దీనిని కేవలం దేవతా ధర్మ శాస్త్రము అని మాత్రమే అనరు ఎందుకంటే దేవతలలోనైతే అసలు ఈ జ్ఞానమే లేదు. బ్రాహ్మణులు ఈ గీతా జ్ఞానాన్ని విని దేవతలుగా అవుతారు, కావున ఇది బ్రాహ్మణులు మరియు దేవీ-దేవతలు, ఇరువురి శాస్త్రము. దీనిని హిందూ ధర్మ శాస్త్రమనేమీ అనరు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. గీతా జ్ఞానాన్ని స్వయంగా నిరాకారుడైన శివబాబా మీకు వినిపిస్తున్నారు, శ్రీకృష్ణుడు కాదు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
వారు మా నుండి దూరం కారు… (నా వహ్ హమ్సే జుదా హోంగే…)
ఓంశాంతి. బాబా కూర్చొని పిల్లలకు బాగా అర్థం చేయిస్తారు. ఏ తండ్రి? పారలౌకిక తండ్రి. లౌకిక తండ్రికి ఇంతమంది పిల్లలు ఉండరు. పారలౌకిక తండ్రికి ఇంతమంది ఆత్మలు పిల్లలుగా ఉన్నారు, వారిలా తలచుకుంటూ ఉంటారు – ఓ పతిత పావనా, సర్వుల సద్గతిదాత, ఓ పరమపిత పరమాత్మా, ఇలా పిత అని అంటూ పిలుస్తారు. నిరాకారుడైన పరమపిత పరమాత్ముని భగవానువాచ. నిరాకార పరమాత్మ అయితే ఒక్కరే ఉంటారు కదా, ఇద్దరు ఉండరు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు అని పిల్లల బుద్ధిలో కూర్చుంది. వారు ఎక్కడ ఉంటారు? ఎక్కడైతే ఆత్మలు ఉంటాయో అక్కడ. ఈశ్వరుడు, ప్రభువు, భగవంతుడు అని అంటే సుఖ వారసత్వాన్ని తీసుకునే విషయమే ఉండదు. తండ్రి అని అనడంతో వారసత్వం గుర్తుకొస్తుంది, కానీ మనుష్యులకు తండ్రి గురించి తెలియదు. భారతవాసులు డ్రామా అనుసారంగా రావణ మతంపై తమ దుర్గతిని చేసుకుంటారు. కావున మొట్టమొదట ఇది అర్థం చేయించాలి – బ్రహ్మా-విష్ణు-శంకరులు సూక్ష్మ శరీరధారులు, మనుష్యులు స్థూల దేహధారులు, కానీ స్థూల లేక సూక్ష్మ దేహధారులను తండ్రి అని అనరు. నిరాకారుడైన పరమపిత పరమాత్మను తండ్రి అని అంటారు. ఏ పొరపాటు జరిగినందుకు దుర్గతి కలిగింది? తండ్రి ద్వారా సత్యమైన గీతను వినడంతో సద్గతి కలుగుతుంది. కావున ఎవరికైనా మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇదే ముఖ్యమైన విషయము. కానీ ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు, అందుకే, గీతా భగవంతుడు బాలుడైన శ్రీకృష్ణుడా లేక పరమపిత పరమాత్మనా అన్న పోస్టర్ ను బాబా ముద్రింపజేసారు. గీత ఏ ధర్మం యొక్క శాస్త్రము? బ్రాహ్మణ దేవీ-దేవతా ధర్మం యొక్క శాస్త్రము అని అనడం కరక్టు. ఏ విధంగానైతే క్రిస్టియన్ల ధర్మ శాస్త్రము బైబిల్. అదే విధంగా గీతను కేవలం దేవీ-దేవతా ధర్మం యొక్క శాస్త్రము అని మాత్రమే అనరు, బ్రాహ్మణులను కూడా కలపవలసి ఉంటుంది. బ్రాహ్మణ దేవీ-దేవతాయ నమః అని అంటారు. దేవతలలో జ్ఞానం లేదని బాబా తెలియజేసారు. గీత మా ధర్మ శాస్త్రం అని కూడా వారికి తెలియదు. జ్ఞానము బ్రాహ్మణులకు ఉంటుంది, అలాగని గీతను కేవలం బ్రాహ్మణ ధర్మం యొక్క శాస్త్రమని అనరు ఎందుకంటే తండ్రి రెండు ధర్మాలనూ స్థాపన చేస్తారు కావున దీనిని ఈ రెండు ధర్మాల శాస్త్రము అని అంటారు. అక్కడైతే దీనిని హిందూ ధర్మ శాస్త్రము అని అంటారు. అలాగే ఆర్యులది అని కూడా అంటారు. ఆర్య సమాజాన్ని అయితే దయానంద్ స్థాపన చేసారు. అది కొత్త ధర్మమే. కానీ వారు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారేమీ కారు. అయితే ముఖ్యమైన విషయము – గీతా భగవంతుడు ఎవరు? గీతలో శ్రీకృష్ణుని పేరు వేసి గీతను ఖండితం చేసారు ఎందుకంటే దాని వలన నా నుండి బుద్ధి యోగము తెగిపోయింది. గీతలో చూడండి, ఎన్ని విషయాలను వినిపించారు మరియు గీతా పాఠశాలలకు ఎంత గౌరవం ఉంది. కావున ఇప్పుడు దేవతా మరియు బ్రాహ్మణ ధర్మము కనుమరుగైపోయింది. పూజారులు బ్రాహ్మణ దేవీ-దేవతాయ నమః అని అంటారు, వారికి బ్రాహ్మణులు దేవతలుగా ఎలా అవుతారు అన్నది తెలియదు. మరి ఇది ఎవరు తెలియజేయాలి? తండ్రి అంటారు – నేను బ్రహ్మా ముఖవంశావళిగా తయారుచేసి దేవతలుగా చేస్తాను. కావున గీత బ్రాహ్మణ దేవీ-దేవతా ధర్మ శాస్త్రము అవుతుంది. దానిని కేవలం దేవతా ధర్మం యొక్క శాస్త్రము అని అనరు ఎందుకంటే లక్ష్మీ-నారాయణులలో జ్ఞానం లేదు, ఈ విషయం అర్థం చేసుకోవాల్సినది. కానీ ఎవరు అర్థం చేయించాలి? రుద్ర జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమైందని శివబాబా వినిపిస్తున్నారు. రుద్ర యజ్ఞం ఎక్కడ, శ్రీకృష్ణుడు ఎక్కడ, తేడా ఉంది. ఈ జ్ఞాన యజ్ఞం తర్వాత ఇక సత్యయుగంలో స్థూలమైన యజ్ఞాలు ఏవీ రచింపబడవు. ఇప్పుడు యజ్ఞాలను ఆపదలను తొలగించేందుకు రచిస్తారు. యజ్ఞాలను రచించడానికి అక్కడ ఆపదలనేవే ఉండవు. గీతలో రుద్ర యజ్ఞము గురించి కూడా రాసారు, అలాగే భగవానువాచ అని కూడా రాసారు, కావున గీతలో సత్యమనేది పిండిలో ఉప్పు అంత మాత్రమే ఉంది, మిగిలినదంతా అసత్యము. ఇప్పుడు ఈ విచార సాగర మథనము శివబాబా చేయరు. బ్రహ్మా మరియు బ్రహ్మాకుమార-కుమారీలు చేయాలి. ఈ సమయంలో మనుష్యులు పూర్తిగా ఊబిలోనే చిక్కుకొని ఉన్నారు. ఊబి నుండి బయటపడడానికి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. అందుకే తండ్రిని పిలుస్తారు. తండ్రి అంటారు – మీరు 5 వికారాల రూపీ రావణుని పైనే విజయం పొందాలి. ఆ తర్వాత సత్యయుగంలో జీవాత్మలైన మీరు సుఖములో ఉంటారు. ఎక్కడ సత్సంగం జరుగుతున్నా, అక్కడకు వెళ్ళి మీరు అడగవచ్చు, భయపడవలసిన విషయమేమీ లేదు. అందరూ అంధకారంలో పడి ఉన్నారు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. మరియు ఇప్పుడింకా కలియుగానికి 40,000 సంవత్సరాలు ఉన్నాయని అంటారు, దీనినే ఘోర అంధకారమని అంటారు. కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు. భక్తి ఫలాన్ని ఇవ్వడానికి భగవంతుడు వస్తారు, సద్గతిని ఇస్తారని అంటారు, అంటే దుర్గతిలో ఉన్నారు కదా, గీతలో ఒకవేళ శివ పరమాత్మ పేరు ఉన్నట్లయితే దానిని అందరూ అంగీకరిస్తారు. కావున తప్పకుండా నిరాకారుడు రాజయోగాన్ని నేర్పించారు. యుద్ధ మైదానము యొక్క విషయమేమీ లేదు. యుద్ధ మైదానంలో ఇంత పెద్ద జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు? ముఖ్యమైన ధర్మాలు నాలుగు, ధర్మ శాస్త్రాలు కూడా నాలుగు. ఇప్పుడైతే అనేకానేక ధర్మాలు, అనేక శాస్త్రాలు, అనేక చిత్రాలు ఉన్నాయి. ఉన్నతోన్నతమైనవారు శివబాబా అని, ఆ తర్వాత కిందకు వస్తే బ్రహ్మా-విష్ణు-శంకరులని, ఆ తర్వాత సాకారములో లక్ష్మీ-నారాయణులు, ఆ తర్వాత వారి వంశమని ఇప్పుడు పిల్లల బుద్ధిలో కూర్చొంది. సంగమములో బ్రహ్మా-సరస్వతులు ఉంటారు, అంతే. రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు శివలింగాన్ని తయారుచేసి, పూజించి మళ్ళీ దానిని ముంచేస్తారు. దేవీలను కూడా పూజించి మళ్ళీ ముంచేస్తారు, మరి అది బొమ్మల పూజ అయింది కదా ఎందుకంటే వారి కర్తవ్యము గురించి ఎవరికీ తెలియదు. పతితపావనా అన్నది వారి మహిమ. మరి వారు పాపాత్ములను పావనంగా ఎలా తయారుచేస్తారు. ఇప్పుడు మీరు మేల్కొని అందరినీ మేలుకొలపాలి అనగా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి గురించి తెలియదు. కేవలం ధనం సంపాదిస్తూ కథలను వినిపిస్తూ ఉంటారు. దీని వలన ఏమి జరుగుతుంది! మీరు విద్వత్ మండలిలోకి కూడా వెళ్ళి అర్థం చేయించండి. ఈ యుద్ధంలో అందరూ తప్పకుండా మరణించవలసిందే. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమవుతూ ఉంటుంది. మేము ఇంత పెద్ద-పెద్ద బాంబులను తయారుచేసాము అని రాస్తూ ఉంటారు కూడా, కావున కల్పక్రితం కూడా వీటి ద్వారా వినాశనం జరిగింది. ఈ బాంబులు అన్నింటినీ కల్ప క్రితం సముద్రంలోనేమీ వేయలేదు. కావున ఇప్పుడు కూడా వినాశనం జరగనున్నది. వినాశ కాలే విపరీత బుద్ధి అని అంటారు, అది ఎవరిది? కౌరవులది మరియు యాదవులది. ఇప్పుడైతే ప్రజలపై ప్రజల రాజ్యము ఉంది. కావున ఈ పోస్టర్లను లక్షల సంఖ్యలో అన్ని భాషల్లోనూ ముద్రించండి. ఇంగ్లీషులోనైతే తప్పకుండా ముద్రించాలి. ఎక్కడెక్కడైతే గీతా పాఠశాలలు ఉంటాయో, అక్కడ పంచుతూ ఉండండి. పోస్టర్లపై చిరునామా కూడా రాసి ఉండాలి. బాబా డైరెక్షన్లు అయితే ఇస్తూ ఉంటారు, కానీ చేయడమనేది పిల్లల పని. శివబాబా అని రాయబడి ఉంది. కావున శివబాబా కూడా తండ్రి, బ్రహ్మా కూడా తండ్రి కానీ పిల్లలకు వారసత్వం శివబాబా నుండి లభిస్తుంది, బ్రహ్మా నుండి కాదు. బ్రహ్మాకు కూడా వారి నుండే లభిస్తుంది.
బాబా ఎంతగానో అర్థం చేయించారు – గీతా మ్యాగజీన్ లో కూడా మొట్టమొదట తండ్రి యొక్క యథార్థ పరిచయాన్ని వ్రాయండి, తద్వారా బ్రాహ్మణులుగా అవ్వవలసినవారు ఎవరైతే ఉంటారో వారికి వెంటనే బాణం తగులుతుంది. లేకపోతే అది తీసుకుంటారు మరియు పారేస్తారు. ఏ విధంగానైతే కోతికి ఏదైనా పుస్తకాన్ని ఇస్తే అది దానిని వెంటనే పారేస్తుంది, ఏమీ అర్థం చేసుకోదు. కావుననే తండ్రి అంటారు, ఈ జ్ఞానాన్ని నా భక్తులకు మరియు గీతా పాఠకులకు ఇవ్వండి. వారిలోనూ ఎవరి భాగ్యములో ఉంటుందో, వారే అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు, అసలు ఈ ప్రపంచమే నరకము. ఇక్కడ పిల్లలు మొదలైనవారు ఎవరైతే పుడతారో, వారు ఒకరికొకరు దుఃఖము ఇచ్చుకుంటూ ఉంటారు, ఒకరినొకరు ఖండించుకుంటూ ఉంటారు. ఇకపోతే, గరుడ పురాణంలో విషయ వైతరణి నదిని ఏదైతే చూపించారో, నిజానికి అదేమీ లేదు. ఈ ప్రపంచము నరకము. కావున ఈ రోజు నరకవాసులుగా ఉన్నవారు తర్వాత సంగమవాసులుగా అవుతారని, రేపు మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారని పిల్లలకు తెలుసు, అందుకే పురుషార్థం చేస్తున్నారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
రాత్రి క్లాసు – 23-3-68
ఉన్నతోన్నతమైనవారు ఒక్క భగవంతుడే, అనగా తండ్రి. ఎవరి తండ్రి? ఆత్మలన్నీ ఏవైతే ఉన్నాయో, వాటన్నింటికీ తండ్రి. మనుష్యమాత్రులెవరైతే ఉన్నారో, వారిలో ఆత్మలేవైతే ఉన్నాయో, వాటికి తండ్రి. ఇప్పుడు ఆత్మలన్నీ ఏవైతే పాత్రను అభినయించేందుకు వస్తాయో, అవి పునర్జన్మను తప్పకుండా తీసుకుంటాయి. కొన్ని చాలా తక్కువ జన్మలు తీసుకుంటాయి, కొన్ని 84 జన్మలు తీసుకుంటాయి, కొన్ని 80 మరియు కొన్ని 60, వీరంతా దేహధారులైన మనుష్యులు. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వముపై రాజ్యం చేసేవారు. ఆ సమయములో కొత్త ప్రపంచములో మరే ఇతర వంశము ఉండేది కాదు. దేహధారులైన మనుష్యులెవరైతే ఉన్నారో, వారెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు. మొట్టమొదటగా ఉన్నది స్వీట్ సైలెన్స్ హోమ్. అది ఆత్మలందరి ఇల్లు. తండ్రి కూడా అక్కడే ఉంటారు. దానిని నిరాకారీ ప్రపంచము అని అంటారు. తండ్రి ఉన్నతోన్నతమైనవారు, కావున నివసించే స్థానము కూడా ఉన్నతోన్నతమైనది. తండ్రి అంటారు, నేను ఉన్నతోన్నతమైనవాడిని. నేను కూడా రావలసి ఉంటుంది. అందరూ నన్ను పిలుస్తారు. మనుష్యమాత్రులెవరైతే ఉన్నారో, వారు తప్పకుండా పునర్జన్మలు తీసుకోవలసిందే. కేవలము ఒక్క తండ్రి మాత్రమే తీసుకోరు. పునర్జన్మలనైతే అందరూ తీసుకోవలసిందే. ఏ ధర్మ స్థాపకులనైనా గాని అవతారము అని అంటారు, బుద్ధ అవతారము అని అంటారు కదా. తండ్రిని కూడా అవతారమని అంటారు. వారు కూడా రావలసే ఉంటుంది. ఇప్పుడు ఆత్మలన్నీ ఇక్కడ ఉపస్థితమై ఉన్నాయి. ఎవరూ తిరిగి వెళ్ళలేరు. పునర్జన్మలు తీసుకుంటారు కనుకనే వృద్ధి జరుగుతుంది కదా. పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ ఈ సమయములో అందరూ తమోప్రధానంగా ఉన్నారు. తండ్రే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రే జ్ఞానసంపన్నులు, ఆదిమధ్యాంతాల జ్ఞానం వారిలో ఉంది. వారినే జ్ఞానసంపన్నులు, ఆనందసంపన్నులు అని అంటారు. వారే శాంతి స్వరూపులు, సదా పవిత్రులు. ఇకపోతే మనుష్యులు పవిత్రంగా, అపవిత్రంగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు దైవీ వంశములోని మొదటివారు. వీరే పూర్తి 84 జన్మలను తీసుకోవలసి ఉంటుంది. పునర్జన్మలను ఇక్కడే తీసుకుంటారు. మళ్ళీ అంతిమంలో తండ్రి వచ్చి అందరినీ పవిత్రముగా చేసి తమతో పాటు తీసుకువెళ్తారు. తండ్రినే ముక్తిదాత అని అంటారు. ఈ సమయములో ధర్మ స్థాపకులందరూ ఇక్కడ హాజరై ఉన్నారు. చాలా కొద్దిమంది మాత్రమే రావలసి ఉంది. వృద్ధి జరుగుతూ ఉంటుంది. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియే. శాంతిధామానికి మరియు సుఖధామానికి యజమానిగా చేస్తారు. మీరే పూర్తి 84 జన్మలను తీసుకుంటారు. మీరు ఎవరైతే మొదట వచ్చారో, వారే మళ్ళీ మొదట వస్తారు. క్రైస్టు మళ్ళీ తమ సమయములో వస్తారు. ఎవరినైనా తిరిగి తీసుకువెళ్ళేంత శక్తి క్రైస్టులో లేదు. తిరిగి తీసుకువెళ్ళగలిగే శక్తి ఒక్క తండ్రిలోనే ఉంది. ఈ సమయములో ఉన్నది రావణ రాజ్యము, ఆసురీ రాజ్యము. 84 జన్మలలో వికారాలు పూర్తిగా ప్రవేశిస్తాయి. తండ్రి అంటారు, మీరు దైవీ ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు, మళ్ళీ రావణ రాజ్యంలో మీరు వికారులుగా అయ్యారు. పునర్జన్మలను అందరూ తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. ధర్మ స్థాపన చేసి తిరిగి వెళ్ళిపోవటమనేది జరగదు. వారు తప్పకుండా పాలనను చెయ్యాల్సి ఉంటుంది. బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచ స్థాపన అని అంటూ ఉంటారు. పాత ప్రపంచపు వినాశనము జరుగుతుంది. కొత్త ప్రపంచములో ఒకే ధర్మము, ఒకే దైవీ వంశము ఉండేవి. ఇప్పుడు అవి లేవు. కేవలము చిత్రాలు మాత్రమే ఉన్నాయి. కేవలం ఒక్క గాడ్ ఫాదర్ తప్ప మిగిలిన అన్ని ధర్మాలు ఇక్కడ ఉన్నాయి, దేహధారులెవరైతే ఉన్నారో, వారు పునర్జన్మలు తప్పకుండా తీసుకుంటారు. భారత్ అవినాశీ ఖండము, ఇది ఎప్పుడూ వినాశనమవ్వదు. ఇది అవినాశీ. ఎప్పుడైతే వీరి రాజ్యం ఉండేదో, అప్పుడు వేరే ఏ ఖండము ఉండేదే కాదు. కేవలము వీరి రాజ్యం మాత్రమే ఉండేది. సూర్యవంశము, చంద్రవంశము ఉండేవి, అంతే. ఇంకెవరూ ఉండేవారు కాదు. కొత్త ప్రపంచాన్ని స్వర్గము, దైవీ ప్రపంచము అని అంటారు. నిరాకారీ ప్రపంచాన్ని స్వర్గము అని అనరు. అది స్వీట్ సైలెన్స్ హోమ్. నిర్వాణధామము. పరమపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ ఆత్మకు జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఆత్మ చాలా చిన్నని బిందువు. ఆత్మలందరి తండ్రి పరమ ఆత్మ. వారిని సుప్రీమ్ ఫాదర్ అని అంటారు. వారు ఎప్పుడూ పునర్జన్మలలోకి రారు. ఈ సమయము నాటకము యొక్క అంతిమము. ఈ ప్రపంచమంతా ఒక రంగస్థలము, ఇందులో ఆట నడుస్తూ ఉంది. దీని కాల పరిమితి 5000 సంవత్సరములు. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఈ సమయంలో తండ్రి వచ్చి అందరినీ ఉత్తమోత్తములుగా తయారుచేస్తారు. ఆత్మలు అవినాశీగానే ఉంటాయి. ఈ డ్రామా కూడా అవినాశీయే. ఇది తయారై తయారుచేయబడిన ఆట. ఎవరైతే వెళ్ళిపోయారో వారు మళ్ళీ అదే సమయములో వస్తారు. మొట్టమొదటగా వీరు వచ్చారు. లక్ష్మీ-నారాయణులు ఇప్పుడు లేరు. సత్యాతి-సత్యమైన సత్య సాంగత్యము ఇదే. అచ్ఛా!
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి మరియు దాదా యొక్క ప్రియస్మృతులు, గుడ్ నైట్. ఓం శాంతి.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. విచార సాగర మథనం చేసి మనుష్యులను ఊబి నుండి బయటకు తీయాలి. ఎవరైతే కుంభకర్ణుని నిద్రలో నిదురించి ఉన్నారో, వారిని మేలుకొలపాలి.
2. సూక్ష్మ మరియు స్థూల దేహధారుల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క నిరాకారుడైన తండ్రిని స్మృతి చేయాలి. అందరి బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడింపజేయాలి.
వరదానము:-
సంపూర్ణ పవిత్రత యొక్క పరిభాష చాలా శ్రేష్ఠమైనది మరియు సహజమైనది. సంపూర్ణ పవిత్రతకు అర్థము – అపవిత్రత అనేది స్వప్నమాత్రము కూడా మనసు మరియు బుద్ధిని స్పర్శించకూడదు – దీనినే సత్యమైన వైష్ణవులుగా ఉండటము అని అంటారు. ఇప్పుడు నంబరువారు పురుషార్థులుగా ఉన్నప్పటికీ పురుషార్థము యొక్క లక్ష్యము సంపూర్ణ పవిత్రత మరియు ఇది సహజము కూడా ఎందుకంటే అసంభవాన్ని సంభవము చేసే సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క తోడు ఉంది.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!