07 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris
6 May 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - రావణుడు మిమ్మల్ని చాలా పీడించాడు, ఇప్పుడు భక్తుల రక్షకుడైన భగవంతుడు మీ దుఃఖాన్ని దూరము చేసేందుకు వచ్చారు”
ప్రశ్న: -
సుపుత్రులైన పిల్లల యొక్క ముఖ్యమైన రెండు గుర్తులను వినిపించండి?
జవాబు:-
సుపుత్రులైన పిల్లలు సదా తల్లిదండ్రులను ఫాలో చేసి సింహాసనాధికారులుగా అవుతారు. పురుషార్థంలో పూర్తిగా తత్పరులై ఉంటారు. 2. వారు తండ్రి పట్ల సత్యమైన హృదయం కలిగి ఉంటారు. సత్యమైన హృదయం కలవారు సదా శ్రీమతంపై నడుస్తారు. ఒకవేళ లోపల సత్యత లేకపోతే స్మృతిలో ఉండలేరు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
భోళానాథుని కన్నా అతీతమైనవారు ఎవరూ లేరు….. (భోలేనాథ్ సే నిరాలా…..)
ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లలు భక్తి మార్గంలోని పాటను విన్నారు. భక్తులకు ఈ పాట అర్థం తెలియదు. మీరు భగవంతునికి పిల్లలుగా అయ్యారు. భగవంతుడు భక్తుల రక్షకుడు. మీరు కూడా భక్తుల రక్షకులే. భక్తుల రక్షణను చేస్తారు. ఏ ఆపద ఉన్న కారణంగా భక్తులు భగవంతుడిని రక్షించమని పిలుస్తారు? భక్తులకు రావణుని దుఃఖం చాలా ఉంది. రావణ సంప్రదాయం దుఃఖాలతో పీడించబడి ఉంది. కావున భోళానాథుడిని స్మృతి చేస్తారు. అది రావణుని సంప్రదాయము, ఇది రాముని సంప్రదాయము. తమ రక్షకుడు ఎవరు అనేది భక్తులకు తెలియదు. భోళానాథుడు రక్షకుడని గాయనం చేయడం చేస్తారు కానీ ఎలా రక్షిస్తారు అనేది తెలియదు. భోళానాథుడైన శివబాబానే పాడైపోయిన దానిని బాగు చేసేవారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. భగవంతుడు అని ఎవరిని అంటారు అనేది ప్రపంచానికి అసలు తెలియదు. ఒకవేళ భగవంతుని గురించి తెలిస్తే, వారి రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి కూడా తెలిసి ఉండాలి. భగవంతుని గురించి తెలియదు, రచన గురించి తెలియదు, అందుకే ఇటువంటి మనుష్య సంప్రదాయాన్ని బ్లయిన్డ్ (అంధులు) అని కూడా అనడం జరుగుతుంది. మరో వైపు దివ్యదృష్టి లభించిన మీరు ఉన్నారు. ఇప్పుడు మీ పేరు బ్రహ్మాకుమార-కుమారీలు. బోర్డు పై కూడా – బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అన్న పేరు రాయబడి ఉంది. కేవలం బ్రహ్మాకుమారీలు అని ఉంటే సరిపోదు. ప్రజాపిత బ్రహ్మా ఉన్నారు కదా. తండ్రికి కుమారులు మరియు కుమార్తెలు, ఇరువురూ ఉంటారు. ప్రజాపిత బ్రహ్మాకు మాత్రమే ఇంతమంది పిల్లలు ఉండగలరు. కావున వీరు అనంతమైన తండ్రి అని అర్థం చేసుకోవాలి. బ్రహ్మా-విష్ణు-శంకరులను రచించేవారు తండ్రియేనని, వారిని నిరాకారుడని అంటారని కూడా మీకు తెలుసు. వీరు అనంతమైన తండ్రి. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా రచనను రచిస్తారని కూడా మీకు తెలుసు. అంతా వీరి రచన – వాస్తవానికి మనుష్య మాత్రులందరూ శివవంశీయులు. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మాకు సంతానంగా అయ్యారు. ఇది కొత్త రచన. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా రచనను రచిస్తారు కావున మిమ్మల్ని బ్రహ్మాకుమార-కుమారీలని అనడం జరుగుతుంది. ఇంతమంది అనంతమైన పిల్లలున్నారు, వారు తప్పకుండా అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటూ ఉండవచ్చు. బ్రహ్మాకుమార-కుమారీలైన మమ్మల్ని శివబాబా దత్తత తీసుకున్నారని పిల్లలకు తెలుసు. మీరు నా పిల్లలు అని శివబాబా అంటారు. ఆత్మలైన మీరు కూడా నిరాకారులుగా ఉండేవారు. కానీ జ్ఞానమైతే సాకారంలో కావాలి. మనం ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారమని మీకు తెలుసు, బ్రహ్మా ద్వారా రచన ఇక్కడ జరుగుతుంది. శివజయంతి కూడా ఇక్కడే జరుపుకోబడుతుంది. ఈ మగధ దేశంలోనే జన్మ తీసుకున్నారు. ఈ దేశం ఎంతో పవిత్రమైన స్వర్గంలా ఉండేదని తండ్రి అంటారు. ఇప్పుడు దీనిని నరకము, మగధ దేశమని అంటారు. తర్వాత స్వర్గం తయారవ్వనున్నది. శివబాబా మనకు మళ్ళీ రాజయోగాన్ని నేర్పించి పవిత్రంగా తయారుచేస్తారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పతితపావనుడు, భక్తుల రక్షకుడు భగవంతుడని పాడుతారు కూడా. భక్తులే పిలుస్తారు. పతితులుగా ఉన్నప్పటికీ స్వయాన్ని పతితులుగా భావించరు. మీరందరూ పతితులని తండ్రి అర్థం చేయిస్తారు. పావన ప్రపంచమని సత్యయుగాన్ని, పతిత ప్రపంచమని కలియుగాన్ని అంటారు. తండ్రి మీకు అంతా రైట్ చెప్తారు. లక్షల సంవత్సరాల వస్తువేదీ ఉండదు. మనుష్యులు ఘోరమైన అంధకారంలో ఉన్నారు, కలియుగం ఇప్పుడింకా బాల్యంలోనే ఉందని భావిస్తారు. మరియు మీకు మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని తెలుసు. అంధకారం మరియు ప్రకాశం యొక్క వర్ణన సంగమంలోనే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అత్యంత ప్రకాశంలోకి వచ్చారు. సత్యయుగంలో మీరు ఇలా వర్ణన చేయలేరు. అక్కడ ఈ జ్ఞానమే ఉండదు. మీరు సత్యయుగంలో సూర్య వంశస్థులుగా ఉండేవారని, తర్వాత అంతిమంలో శూద్ర వంశస్థులుగా అయ్యారని, ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశస్థులుగా అయ్యారని ఈ సమయంలో తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు సర్వోత్తమమైన బ్రాహ్మణ కులానికి చెందినవారు, మీరు ఉన్నతోన్నతమైనవారు. ఇది ఈశ్వరీయ కులం కదా. తండ్రి వద్దకు వచ్చినప్పుడు, మీరు ఎవరి వద్దకు వచ్చారని బాబా అడుగుతారు. అప్పుడు, తండ్రి వద్దకు వచ్చామని అంటారు. ఇద్దరు తండ్రులున్నారు – ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. సాలిగ్రామాలందరి తండ్రి ఒక్క శివుడే. మీ బుద్ధిలో ఈ జ్ఞానము బొట్టు బొట్టుగా పడుతూ ఉంటుంది. మనం ఒక్క తండ్రి పిల్లలము, వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. నిరాకారుడు సాకారుని ద్వారానే వారసత్వాన్ని ఇస్తారు కదా. నేను సాధారణ తనువులోకి వచ్చి ప్రవేశిస్తానని తండ్రి స్వయంగా చెప్తారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తారు – పిల్లలూ, దేహీ-అభిమాని భవ. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ దేహం వినాశీ, ఆత్మ అవినాశీ. ఆత్మకే 84 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది, శరీరానికి కాదు. దేహమైతే మారుతూ ఉంటుంది, అప్పుడు వేరే వేరే మిత్ర-సంబంధీకులు లభిస్తారు. ఇప్పుడు ఆత్మ, అనంతమైన తండ్రి అయిన పరమపిత పరమాత్మ నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మీరే విని ధారణ చేస్తారు. సంస్కారాలు మీ ఆత్మలోనే ఉన్నాయి. ఆత్మలోనే సంస్కారాలుంటాయి. అంతేకానీ, శరీర సంస్కారాలని అనరు. మీ ఆత్మ సంస్కారాలు తమోప్రధానంగా ఉన్నాయి. వాటిని ఇప్పుడు పరివర్తన చేసుకోవాలి. శరీరాన్ని కల్పతరువు అని అంటారు. శరీరం కల్పవృక్ష సమానంగా తయారవుతుంది. ఆయుష్షు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆయుష్షు చాలా తక్కువగా ఉంటుందని మీకు తెలుసు. చిన్న వయసులోనే కూర్చొని-కూర్చొని అకాల మృత్యువులు జరుగుతాయి. ఇప్పుడు మీరు మృత్యువుపై విజయాన్ని పొందుతారు. అక్కడ మృత్యువు ఎప్పుడూ కబళించదు. అకస్మాత్తుగా ఎప్పుడూ శరీరాన్ని వదలరు. ఇప్పుడు ఈ శరీరం వృద్ధ శరీరంగా అయ్యిందని, దీనిని వదిలి కొత్తది తీసుకోవాలని మీకు తెలుస్తుంది. శరీరం వదిలే సమయంలో కూడా బాజాలు మ్రోగుతాయి, జన్మించే సమయంలో కూడా మ్రోగుతాయి. అక్కడ ఏడ్చే విషయమే ఉండదు. మీకు భ్రమరి యొక్క ఉదాహరణను కూడా అర్థం చేయించారు. మీరు బ్రాహ్మణ-బ్రాహ్మణీలు. బ్రాహ్మణి మరియు భ్రమరి యొక్క రాశి కలుస్తుంది. భ్రమరి ఏ కార్యాన్ని చేస్తుందో, మీరు కూడా అదే చేస్తారు. ఇది అద్భుతం కదా. భ్రమరి ఉదాహరణ, తాబేలు, సర్పం ఉదాహరణలు, ఇవన్నీ శాస్త్రాలలో ఉన్నాయి. సన్యాసులు మొదలైనవారు కూడా ఈ ఉదాహరణలను ఇస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి ద్వారా ఇవన్నీ అర్థం చేసుకుంటున్నారు. అది భక్తి మార్గము. అక్కడ గతాన్ని గాయనం చేస్తారు, ఇక్కడ జరుగుతున్నదాని మహిమ తర్వాత జరుగుతుంది. ఈ సమయంలోనే తండ్రి ఈ తనువులోకి వస్తారు, వీరిని (బ్రహ్మాను) భగవంతుడని అనరు. అలా అంటే, అది అంధ విశ్వాసమవుతుంది. రాముడిని, కృష్ణుడిని భగవంతుడు అని భావించే మనుష్యులు కూడా ఉన్నారు. కృష్ణుడిని, రాముడిని కూడా సర్వవ్యాపి అని అనేస్తారు. కొందరు కృష్ణుని సిద్ధాంతానికి చెందినవారు ఉంటారు, కొందరు రాధ సిద్ధాంతానికి చెందినవారు ఉంటారు. రాధ సిద్ధాంతానికి చెందినవారు, అంతటా రాధయే రాధ అని అంటారు. కృష్ణుని సిద్ధాంతానికి చెందినవారు, ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడని అంటారు. రాముని సిద్ధాంతానికి చెందినవారు రాముడే రాముడని అంటారు. రాముడు కృష్ణుని కన్నా పెద్దవారని భావిస్తారు, ఎందుకంటే రాముడిని త్రేతాలోకి, కృష్ణుడిని ద్వాపరంలోకి తీసుకువెళ్ళారు. ఎంత అజ్ఞానము. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఎంతమంది బ్రహ్మాకుమార-కుమారీలు ఉన్నారు, తప్పకుండా అనంతమైన తండ్రి ఉంటారు. ప్రజాపిత బ్రహ్మా పేరును ఎప్పుడైనా విన్నారా అని మీరు ఎవరినైనా అడగవచ్చు. తండ్రి స్వర్గమనే కొత్త రచనను రచించారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులని గాయనం కూడా చేస్తారు. ఎప్పటివరకైతే బ్రాహ్మణులైన మీరంతా బ్రహ్మా ముఖవంశావళిగా అవ్వరో, అప్పటివరకు తాతగారి నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. అనంతమైన పిల్లలు తండ్రి నుండే అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు. తప్పకుండా తీసుకున్నారు, స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు నరకవాసులుగా అయిపోయారు, ఇప్పుడు మళ్ళీ ప్రజాపిత బ్రహ్మా ద్వారా పరమపిత పరమాత్మ విష్ణుపురి అయిన స్వర్గాన్ని రచిస్తున్నారు. ఇది ఎంత సహజము. ఇంతకుముందు మీకు ఈ జ్ఞానముండేదా అని శివబాబా అడుగుతారు. వీరి ఆత్మ చెప్తుంది – నాలో ఈ జ్ఞానముండేది కాదు అని. నేను కూడా విష్ణువు పూజారిగా ఉండేవాడిని. పూజ్యులుగా ఉన్న మనము ఇప్పుడు పూజారులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి పూజారుల నుండి పూజ్య దేవతలుగా తయారుచేస్తున్నారు. పిల్లలైన మీకు లోలోపల సంతోషముండాలి. పరమపిత పరమాత్మ వచ్చి మనల్ని దత్తత తీసుకున్నారు. మనుష్యులు, మనుష్యులను దత్తత తీసుకుంటారు కదా. చాలామందికి తమకంటూ పిల్లలు లేకపోతే దత్తత తీసుకుంటారు. ఇప్పుడు నా పిల్లలందరూ రావణుడికి చెందినవారిగా అయ్యారు కావున నేను వచ్చి మళ్ళీ దత్తత తీసుకోవాల్సి ఉంటుందని తండ్రికి తెలుసు. బ్రహ్మా ద్వారా తమ పిల్లలను దత్తత తీసుకుంటారు. ఈ దత్తత ఎంత అద్భుతమైనది. శివబాబా మిమ్మల్ని బ్రహ్మా ద్వారా దత్తత తీసుకున్నారని మీకే తెలుసు. మీకు అనంతమైన సుఖపు వారసత్వాన్ని ఇచ్చేందుకు నేను పిల్లలైన మిమ్మల్ని దత్తత తీసుకున్నానని శివబాబా అంటారు. ఈ బ్రహ్మా అయితే ఇవ్వలేరు. వీరు కూడా మనిషే కదా. ప్రజాపిత బ్రహ్మా. మనుష్యులు ఈ జ్ఞానాన్ని ఇవ్వరు. జ్ఞానసాగరుడు, నిరాకారుడైన పరమపిత పరమాత్మనే కూర్చొని ఈ జ్ఞానాన్ని ఇస్తారు. బ్రహ్మాను లేక విష్ణువును జ్ఞానసాగరుడని అనరు. ఈ ముగ్గురి మహిమ వేరు. ఒక్క తండ్రియే జ్ఞానసాగరుడు, పతితపావనుడు. మొత్తం ప్రపంచంలోని మనుష్యమాత్రులందరూ వారిని పిలుస్తారు. ఇంగ్లీషులో కూడా వారిని లిబరేటర్ (ముక్తిదాత) అని అంటారు. ఎవరి నుండైతే దుఃఖం లభిస్తుందో, వారి నుండి విముక్తులుగా చేయడం జరుగుతుంది. తండ్రి కూడా ఇక్కడకు వచ్చి రావణుని నుండి విముక్తులుగా చేస్తారు. రావణ రాజ్యం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడే రావణుడిని కాలుస్తారు. కాల్చేసి, మళ్ళీ బంగారు లంకను దోచుకునేందుకు వెళ్తారని అంటారు. రావణుడు ఎవరు, ఎప్పటి శత్రువు అనేది వారికి ఏమీ తెలియదు. రాముని సీత అపహరించబడిందని అనుకుంటారు. మేమంతా సీతలము, మేము రావణుని జైలులో చిక్కుకొని ఉన్నామని అర్థం చేసుకోరు. ఈ జ్ఞానం ఎవరిలోనూ లేదు, వారు కూర్చొని కథలను వినిపిస్తారు. దూరదేశంలో నివసించే నేను ఈ పరాయి దేశంలోకి వచ్చానని శివబాబా అంటారు. ఈ పతిత ప్రపంచం పాతది కదా, ఇది రావణుని ప్రపంచము. హే బాబా రండి, మేము పతితులుగా అయిపోయాము అని కూడా పిలుస్తారు. మిమ్మల్ని పావనంగా చేసేందుకు నేను ఈ పతిత ప్రపంచంలోకి రావాల్సి వస్తుందని తండ్రి అంటారు. ఎవరైతే మొదటి నంబరు పావనంగా ఉండేవారో, సుందరంగా ఉండేవారో, వారిలోకే నేను రావాల్సి ఉంటుంది. వారే ఇప్పుడు శ్యామంగా అయ్యారు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. కృష్ణుడిని శ్యామసుందరుడని ఎందుకు అంటారో ఎవరికీ తెలియదు. కేవలం ఒక్క కృష్ణుడినే సర్పం కాటు వేసిందా? సత్యయుగంలో సర్పాలు మొదలైనవేవీ ఉండవు. ఈ అంతిమ జన్మలో నా కోసం పవిత్రంగా అయినట్లయితే, పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. కేవలం నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి. అల్ఫ్ ను (తండ్రిని) స్మృతి చేసినట్లయితే, బే అనగా రాజ్యాధికారం మీదవుతుంది. ఇది సహజ రాజయోగము, సహజ రాజ్యాధికారము. బిడ్డ జన్మించగానే వారసత్వానికి హక్కుదారునిగా అవుతాడు. మేము తండ్రి వారిగా అయ్యాము, కావున స్వర్గ రాజ్యాధికారానికి హక్కుదారులమని ఇక్కడ కూడా పిల్లలకు తెలుసు. మీరు సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయ్యారని ఇప్పుడు తండ్రి చెప్తారు. మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. యోగము మరియు జ్ఞానము నేర్పించేందుకు ఒక్క క్షణం పడుతుంది. బిడ్డ జన్మించగానే వారసునిగా నిర్ణయిస్తారు. మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు కావున రాజధాని యొక్క వారసత్వం మీదే. కానీ అందరూ రాజు-రాణిగా అవ్వరు. ఇది రాజయోగము. రాజు-రాణి, ప్రజలు, షావుకారులు, పేదవారు అందరూ కావాలి, అందుకే రుద్రమాల కూడా తయారయ్యింది, ఈ మాలను భక్తి మార్గంలో జపిస్తారు. మీరు రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చారని మీకు తెలుసు. మాతా-పితలను అనుసరించి మొట్టమొదట సూర్య వంశీయులుగా, చంద్ర వంశీయులుగా అవుతారు. మాతా-పితలను అనుసరించి సింహాసనాధికారులుగా అయ్యేవారే సుపుత్రులైన పిల్లలు. బాగా పురుషార్థం చేయాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు, కానీ స్మృతి చేయరు, శ్రీమతంపై నడవరు. లోపల సత్యత లేదు. మనసు సత్యంగా ఉన్నట్లయితే శ్రీమతంపై నడుస్తారు, తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. శ్రీమతంపైనే మీకు తాతగారి నుండి వారసత్వం లభిస్తుంది. బ్రహ్మా స్వర్గ వారసత్వాన్ని ఇవ్వలేరు. తాతగారి సంపాదనపై మనవులకు హక్కు ఉంటుంది. తండ్రి సంపాదనకు పిల్లలు భాగస్వాములవుతారు కావున హక్కుదారులుగా అవుతారు. ఇక్కడ మీకు శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది. జ్ఞాన రత్నాలు తండ్రి నుండే లభిస్తాయి.
బ్రాహ్మణులైన మనమే మళ్ళీ దేవీ-దేవతలుగా అవుతామని మీకు తెలుసు. జగదంబ ఎవరు? వీరు బ్రాహ్మణి, జ్ఞాన-జ్ఞానేశ్వరిగా ఉండేవారు, తర్వాత రాజరాజేశ్వరిగా అవుతారని తండ్రి అర్థం చేయిస్తారు. మీరు కూడా ఇలా తయారవుతారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఆత్మలో తమోప్రధాన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, వాటిని స్మృతి బలంతో పరివర్తన చేయాలి, సతోప్రధానంగా అవ్వాలి.
2. తండ్రి ద్వారా రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు, సదా సుపుత్రులుగా అయి, శ్రీమతంపై నడవాలి. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. మాతా-పితలను పూర్తిగా అనుసరించాలి. జ్ఞాన రత్నాలను దానం చేస్తూ ఉండాలి.
వరదానము:-
సహయోగులకు సహయోగులుగా అవ్వడమనేది మహావీరత ఏమీ కాదు, కానీ ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారో, అలా పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా అవ్వండి. ఎవరు ఎంత అసహయోగులుగా అయినా, మీరు మీ సహయోగ శక్తి ద్వారా అసహయోగులను కూడా సహయోగులుగా చేయండి, అంతేకానీ ఈ కారణంతో వీరు ముందుకు వెళ్ళడం లేదని అనుకోకండి. బలహీనులను బలహీనులుగా భావించి వదిలేయకండి, కానీ వారికి శక్తిని ఇచ్చి శక్తివంతులుగా చేయండి. ఈ విషయం పట్ల అటెన్షన్ పెట్టినట్లయితే, సేవ యొక్క ప్లాన్లు రూపీ ఆభరణాలపై వజ్రాలు మెరుస్తాయి అనగా సహజంగా ప్రత్యక్షత జరుగుతుంది.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!