07 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

July 6, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీ శరీరం సహితంగా మొత్తం ప్రపంచం వారందరి శరీరాలను కల్పతరువుగా చేసేందుకు మీరిక్కడకు వచ్చారు, స్మృతితోనే శరీరం కల్పతరువుగా తయారవుతుంది”

ప్రశ్న: -

నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యే విధి ఏమిటి? ఇప్పుడు పిల్లలైన మీకు ప్రాణదానం లభిస్తుంది, ఎలా?

జవాబు:-

నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు, తప్పకుండా మరణించవలసి ఉంటుంది. తండ్రి అంటారు – మీ అందరికీ మృత్యువునిచ్చేందుకు నేను వచ్చాను. మీ ఈ దేహాలను సమాప్తం చేయించి, ఆత్మలను తీసుకువెళ్తాను, ఇదే సత్యమైన ప్రాణదానము. దీని కోసమే ఈ మహాభారత యుద్ధము జరుగుతుంది, ఇందులో అందరి వినాశనం జరుగుతుంది. తర్వాత ఆత్మలు పావనంగా అయి తిరిగి ఇంటికి వెళ్తాయి, ఆ తర్వాత స్వర్గంలోకి వస్తాయి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మాతా ఓ మాతా….

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని లైన్ ను విన్నారు. జగదంబ మహిమను విన్నారు. జగదంబ గురించి ఇక్కడ భారత్ లోనే గాయనం చేయడం జరుగుతుంది. జగదంబ ఉన్నప్పుడు తప్పకుండా జగత్ పిత కూడా ఉంటారు. జగదంబ అని సరస్వతినే అంటారు. వాస్తవానికి వారికి ఒక్క పేరే ఉండాలి. మీకు కూడా ఒక్క పేరే ఉంటుంది కదా, 2-3 పేర్లు అయితే ఉండవు. ఇప్పుడు జగదంబను తప్పకుండా సాకారంలో శరీరధారిగా చూపిస్తారు. జగత్ పిత కూడా ఉన్నారు, వారిని ప్రజాపిత అని కూడా అంటారు. ఎలాగైతే మొత్తం జగత్తుకు అంబ ఉంటారో, అలా మొత్తం జగత్తుకు పిత కూడా ఉంటారు. తప్పకుండా ఇరువురు ఇక్కడే ఉంటారు. ఇరువురి పేర్లను కూడా వినిపించాను. ప్రజాపిత మరియు ప్రజామాత, ఇరువురూ ఉన్నారు. ఇప్పుడు ఇంకొక జగత్ పితగా నిరాకార శివబాబాను అంటారు. వారు అందరికీ తండ్రి, వారి పేరు పరమపిత పరమ ఆత్మ శివ. కేవలం ఈశ్వర లేక పరమాత్మ అని అనకూడదు. వారికి నామ రూపాలు కూడా ఉన్నాయి కదా. వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. ఒకరేమో ఆత్మల తండ్రి, రెండవవారు సాకార మనుష్యాత్మల తండ్రి మరియు మమ్మా కూడా ఉన్నారు. శివుడు ఆత్మలకు తండ్రి. వారు మా తండ్రి అని ఆత్మ అంటుంది. తర్వాత ఆత్మకు ఈ సాకార శరీరం లభించినప్పుడు బ్రహ్మాబాబా అని అంటారు. కావున ఇద్దరు తండ్రులయ్యారు. ఒకరు శివబాబా, రెండవవారు ప్రజాపిత బ్రహ్మా. శివబాబా పుత్రుడు బ్రహ్మా. ఒకరు నిరాకార తండ్రి, మరొకరు సాకార తండ్రి. నిరాకార తండ్రిని పతితపావనుడని అంటారు. బ్రహ్మా లేక సరస్వతిని పతితపావన అని అనరు. పతితపావనుడు ఒక్కరే. వీరు ఇరువురయ్యారు. పతితపావనా రండి, అని అందరూ పిలుస్తారు. కనుక ఇద్దరు తండ్రులయ్యారు. శివబాబా రచయిత, వారు కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. కనుక మొదట బ్రహ్మాను తప్పకుండా రచించాలి. విష్ణువును లేక శంకరుడిని ఎప్పుడూ ప్రజాపిత అని అనరు. బ్రహ్మానే ప్రజాపిత అని అంటారు. కనుక శివబాబా, ప్రజాపిత బ్రహ్మా ద్వారా దత్తత తీసుకుంటారు. మేము శివబాబా పిల్లలమని అంటారు. శివబాబా వీరిలో ప్రవేశించి దత్తత తీసుకున్నారు. వారే ఆత్మలను పావనంగా చేస్తారు. ఆత్మయే పతితంగా అయిపోయింది. ఈ కారణంగా శరీరం కూడా పతితమైనదే లభిస్తుంది. బంగారంలో వెండి, రాగి, ఇనుముల మాలిన్యం కలిపినట్లుగా, ఆత్మలో కూడా మాలిన్యం చేరుకుంటుంది. వాస్తవానికి ఆత్మ పవిత్రమైన ముక్తిధామంలో ఉండేటువంటిది, శివబాబా కూడా అక్కడ ఉంటారు. ఇప్పుడు శివబాబా, ప్రజాపిత బ్రహ్మా – ఒకరిని తండ్రి అని, ఒకరిని దాదా అని అంటారు. మనుష్యమాత్రులందరూ శివుని సంతానమని మీకు తెలుసు. మీరు ముందు శివవంశీయులు, ఆ తర్వాత బ్రహ్మాకుమార-కుమారీలు అవుతారు. శివబాబా మరియు దాదా కలిసే ఉన్నారు. శివబాబా వీరిలో విరాజమానమై ఉన్నారు. మనల్ని బ్రాహ్మణులుగా చేసి, మనుష్యులను దేవతలుగా తయారుచేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తారు. దేవతలు సత్యయుగంలో ఉంటారు. దేవతలను పతితపావనులని, జ్ఞాన సాగరులని అనరు. వారిని బాబా అని కూడా అనలేము. ఇప్పుడు మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతున్నారు. విష్ణువు యొక్క రెండు రూపాలు లక్ష్మీ-నారాయణులు అని మనుష్యులకు తెలియదు. ఎవరైతే భక్తి చేస్తారో, వారికి తప్పకుండా ఇద్దరు తండ్రులుంటారు. సత్యయుగంలో ఒకే తండ్రి ఉంటారు. అక్కడ ఓ పరమపిత పరమాత్మ, దుఃఖహర్త-సుఖకర్త రండి అని పిలవరు. అక్కడ దేవీ దేవతల రాజ్యముండేది. వారెప్పుడూ ఓ గాడ్ ఫాదర్, ముక్తిదాత అని అనరు. పతితపావనుడిని పిలిచేందుకు అక్కడ పతితులు గాని, దుఃఖితులు గాని, అసలెవరూ ఉండరు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం భారత్ లో దేవీ దేవతల రాజ్యముండేదని మీకు తెలుసు. 1250 సంవత్సరాల తర్వాత సీతా-రాముల రాజ్యముంటుంది. సత్య-త్రేతా యుగాలలో మీరు 21 జన్మలు తీసుకున్నారని, తండ్రి ఋజువు చేసి తెలియజేస్తారు. బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు….. అందరూ భారత్ లోనే ఉంటారు. తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తారు, పూర్తిగా కొత్తదిగా చేస్తారు, శరీరాన్ని కల్పతరువుగా చేస్తారు, అమరులుగా చేస్తారు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని అమరలోకానికి యజమానులుగా చేస్తారు. భారత్ అమరలోకములా ఉన్నప్పుడు దేవీ దేవతల రాజ్యముండేది. మెట్లు దిగుతూ-దిగుతూ మృత్యులోకానికి యజమానులుగా అయ్యారు. మా భారత్ అని అంటారు కదా కనుక ప్రజలు కూడా యజమానులు అయినట్లే కదా. మీరు కూడా మా భారత్ అని అంటారు. ఇంతకుముందు మనం భారత్ కు యజమానులుగా ఉండేవారము, కానీ ఇప్పుడు నరకవాసులుగా ఉన్నాము. మేము స్వర్గవాసులమని దేవతలంటారు. మీరు కూడా స్వర్గవాసులుగా ఉండేవారు, తర్వాత 84 జన్మలను అనుభవించి నరకవాసులుగా అయ్యారు. ఇక్కడ భారత్ లోనే శివబాబా జన్మిస్తారు. శివరాత్రి లేక శివజయంతి గాయనం చేయడం జరుగుతుంది. కృష్ణ జయంతిని కూడా జరుపుకుంటారు, వారు జన్మించిన సమయాన్ని కూడా తెలియజేస్తారు. ఫలానా సమయంలో తల్లి గర్భం నుండి జన్మించారని అంటారు. సత్యయుగంలో తప్పకుండా తల్లి గర్భం నుండే జన్మించి ఉంటారు. కృష్ణ జయంతి సత్యయుగ కొత్త ప్రపంచంలో జరుగుతుంది, తర్వాత పునర్జన్మలలోకి రావడం మొదలుపెట్టారు. తండ్రి కేవలం ఒక్కరి గురించే చెప్పడం లేదు. కృష్ణపురియే విష్ణుపురి. రాజులు దిగజారిపోతే మొత్తం వంశమంతా దిగజారిపోతుంది. అందులో రాజా-రాణి, ప్రజలు అందరూ వచ్చేస్తారు. చంద్రవంశీయుల రాజ్యం వచ్చేటప్పటికి సూర్యవంశీయుల రాజ్యం గతించిపోయింది. రాజ్యం ట్రాన్స్ఫర్ అయి చంద్రవంశీయులకు లభిస్తుంది, తర్వాత వైశ్యవంశీయులకు లభిస్తుంది.

మనం బ్రాహ్మణ కులానికి చెందినవారము, పిలక వంటి వారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పిలక స్థానం కన్నా పై భాగంలో తండ్రి ఉంటారు. మనం ముందు బ్రాహ్మణులుగా ఉండేవారము, తర్వాత శూద్రులుగా అనగా కాళ్ళ స్థానానికి చేరుకున్నాము. కాళ్ళ స్థానం నుండి ఒక్కసారిగా పిలక వలె అవుతారు. ముందు శివబాబా, తర్వాత పిలక స్థానం కలవారు. బాబా మిమ్మల్ని బ్రాహ్మణులుగా చేసారు. ఇప్పుడు మీరు శివబాబాను ‘బాబా-బాబా’ అని అంటారు. ఈ లెక్క ప్రకారం మనవలు-మనవరాళ్ళుగా అయ్యారు. బ్రాహ్మణ, బ్రాహ్మణీలైన మనమంతా బ్రహ్మా సంతానమని మీకు తెలుసు. మనమంతా ఒక్క తండ్రి పిల్లలము. సోదరి-సోదరులు ఎప్పుడూ వికారీ పనులు చేయలేరు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు, అందరూ బాబా….. అని అంటారు. మరి ఇంతమంది అసత్యము కాలేరు. అందరికీ తండ్రి అయితే ఆ నిరాకార శివుడు మరియు సాకారంలో ప్రజాపిత బ్రహ్మా, అంతే. ఒక్క తండ్రి పిల్లలు సోదరీ-సోదరులు. మీరు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. స్త్రీ-పురుషులు (పతి-పత్ని) పవిత్రంగా ఎలా అవ్వగలరు? అందుకే డ్రామాలో ఈ యుక్తి నిశ్చయించబడి ఉంది. ఇక్కడ కేవలం బ్రహ్మాకుమార-కుమారీలు ఉన్నారు. శూద్ర కుమార-కుమారీలు ఎవరూ లేరు. వారు పతితులు, శూద్రులు, తుచ్ఛ బుద్ధి కలవారు, ఎందుకంటే వారికి తండ్రి గురించి తెలియదు. ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. అచ్ఛా, వారి కర్తవ్యం గురించి తెలుసా? వారి నామ, రూప, దేశ, కాలాలు చెప్పండి. వారి జీవిత కథ చెప్పండి. ఒకవేళ తెలియకపోతే నాస్తికులు అయినట్లు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. ఇది పతిత ప్రపంచము. సత్యయుగాన్ని పావన ప్రపంచమని, కలియుగాన్ని పతిత ప్రపంచమని అంటారు. ఈ సమయంలో పూర్తిగా తమోప్రధానంగా ఉన్నారు, దీనిని రౌరవ నరకమని అంటారు. దీనికి కూడా స్టేజులు ఉంటాయి. ద్వాపరం నుండి నరకంగా అవ్వడం మొదలవుతుంది, తర్వాత వృద్ధి చెందుతుంది. భక్తి కూడా ముందు సతోప్రధానంగా, అవ్యభిచారిగా ఉండేది, తర్వాత సతో, రజో, తమోగా అవుతుంది. ఎక్కడైతే మూడు రోడ్లు కలుస్తాయో, దానిని కూడలి అని అంటారు, అక్కడ నూనె మొదలైనవి వేసి తల వంచి నమస్కరించడాన్ని మీరు చూసే ఉంటారు. ఇప్పుడు శివబాబాను పూజించడం ఎక్కడ? కూడలిని పూజించడం ఎక్కడ? దీనిని తమోప్రధాన భక్తి అని అంటారు. నీటిని కూడా పూజిస్తారు. పతితపావని గంగ అని చాలా పాడుతారు. ఇప్పుడు పతితపావన ఎవరు? నీటి గంగ పతిత పావని ఎలా అవ్వగలదు? అది నీరు కదా. పతిత పావనుడైతే తండ్రి. శివ జయంతి కూడా భారత్ లోనే జరుగుతుంది కావున పతితులను పావన దేవతలుగా చేసేందుకు తప్పకుండా భారత్ లోనే వచ్చి ఉంటారు. బ్రహ్మా తనువులోకి వచ్చి మనుష్యులను దేవతలుగా చేస్తారు. మీరు ఇక్కడకు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు వస్తారు. ఎలాగైతే మీకు రెండు భుజాలుంటాయో, అలాగే దేవతలకు కూడా రెండు భుజాలుంటాయి. 4-8 భుజాలున్న మనుష్యులెవరూ ఉండరు. ఈ అలంకారాలను చూపించారు. ప్రవృత్తి మార్గాన్ని చూపించేందుకు చతుర్భుజుడను చూపించారు. విష్ణుపురి అని లక్ష్మీ-నారాయణ పురిని అంటారు. వైష్ణవ అనే పదం కూడా విష్ణువు నుండే వెలువడింది. దేవతలు వైష్ణవులు. వల్లభాచారి వైష్ణవులు శాకాహారిగా ఉంటారు కానీ వారు నిర్వికారులుగా ఏమీ ఉండరు. వారికి పెద్ద భవనాలు ఉంటాయి. వైష్ణవులంటే అర్థం కూడా తెలియదు. విష్ణుపురిలో ఉండేవారిని వైష్ణవులని అంటారు. పవిత్రులను వైష్ణవులని అంటారు. రాధ-కృష్ణులకు వేరే మందిరాలను, లక్ష్మీ-నారాయణులకు వేరే మందిరాలను నిర్మించారు. వారి మధ్యన ఉన్న తేడా ఏమిటి అనేది భారతవాసులకు అసలు తెలియదు. రాధ-కృష్ణులే లక్ష్మీ-నారాయణులుగా అవుతారని ఎవరికీ తెలియదు. అది బాల్య రూపము, ఇది పెద్దవారైన తర్వాత రూపము. లక్ష్మీనారాయణుల బాల్యపు చిత్రాలేవీ లేవు. లక్ష్మీనారాయణులను సత్యయుగంలోకి, రాధ-కృష్ణులను ద్వాపరంలోకి తీసుకువెళ్ళారు. ఇప్పుడు మీరు రచయిత అయిన తండ్రి గురించి మరియు రచన ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. బాబా వృక్షం యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. వృక్షాన్ని చూస్తే, శంకరాచార్యులు కలియుగంలో వస్తారని అర్థం చేసుకుంటారు. సన్యాసుల వంశం సత్యయుగంలోనైతే ఉండదు. అందరూ భగవంతునికి పిల్లలే కనుక స్వర్గవాసులుగా ఉండాలి, కానీ అందరూ స్వర్గవాసులుగా అవ్వరు. కేవలం దేవతలు మాత్రమే అవుతారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు, తర్వాత దేవతలుగా అవుతారు. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి.

చిన్న-పెద్దా అందరూ బ్రహ్మాకుమార-కుమారీలని మీకు తెలుసు. బాబా, మేము మీ పిల్లలము, బ్రాహ్మణులమని ఇరువురూ అంటారు. వీరు బాప్ దాదా – ఆది దేవ్ బ్రహ్మా మరియు శివబాబా. మేము బ్రహ్మాబాబా మరియు శివబాబా ఎదురుగా కూర్చున్నామని మీకు తెలుసు. తండ్రి అంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే పతితం నుండి పావనంగా అయిపోతారు. మనం శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. శివబాబా మన తండ్రి కూడా, పతితపావనుడు కూడా, గురువు కూడా. ఇప్పుడిది సంగమయుగము. పతితుల నుండి పావనంగా అయ్యే మేళా ఇది. పతితపావనుడి ద్వారానే పావనంగా అవుతారు. సంగమంలో నదులు మరియు సాగరం యొక్క మేళా జరుగుతుంది. కేవలం నదుల మేళా అయితే ఉండదు. ఇప్పుడు జ్ఞానసాగరుడు మరియు ఆత్మలైన (పిల్లలైన) మీ యొక్క మేళా జరుగుతుంది. మీరు జ్ఞానసాగరుని వద్దకు వచ్చారు. జ్ఞాన గంగలైన మీరు జ్ఞాన సాగరుడి నుండి వెలువడ్డారు. మీరు జ్ఞాన స్నానం చేయించి పావనంగా చేస్తారు, యోగం నేర్పిస్తారు. సాగరుని పరిచయాన్నిచ్చి, మీరు ఇక్కడకు మేళాకు తీసుకువచ్చారు. ఈ సమయంలో మీరు బ్రాహ్మణులుగా అయినప్పుడు, మీకు ముగ్గురు తండ్రులుంటారు. లౌకిక తండ్రి కూడా ఉన్నారు మరియు ప్రజాపిత కూడా ఉన్నారు, ఇంకా శివబాబా కూడా ఉన్నారు. భక్తి మార్గంలో ఇద్దరు తండ్రులుంటారు. సత్యయుగంలో ఒక్క తండ్రి ఉంటారు. ఇవి అర్థం చేసుకునే విషయాలు. నాకైతే ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరని ఇప్పుడు మీ ఆత్మ అంటుంది. మిత్ర సంబంధీకులు మొదలైనవారున్నా కూడా, నాకైతే ఒక్క శివబాబాయే ఉన్నారని అంటారు. వారి స్మృతితోనే పతితం నుండి పావనంగా అవ్వాలి. వారు మనకు తండ్రి కూడా, టీచరు కూడా, సద్గురువు కూడా అని ఆత్మకు తెలుసు. తండ్రి మన ఆత్మను తీసుకువెళ్ళేందుకు వచ్చారు. బ్రహ్మా తనువులో ప్రవేశించి పావనంగా చేస్తారు. మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. మీ అందరికీ మృత్యువునిచ్చేందుకు వచ్చాను. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు తప్పకుండా మరణించాల్సి ఉంటుంది కదా. మీ ఈ దేహాలను సమాప్తం చేయించి ఆత్మలను తీసుకువెళ్తాను. మీకు ప్రాణ దానం ఇస్తానని తండ్రి అంటారు. ఇది మహాభారత యుద్ధం కదా. అందరి వినాశనం జరుగుతుంది. లేదంటే ఎలా తీసుకువెళ్తాను. ఆత్మలను పవిత్రంగా చేసి ఇంటికి తీసుకువెళ్తాను. అది శాంతిధామము. సత్యయుగం వస్తుందంటే కలియుగం తప్పకుండా వినాశనమవుతుంది. అందుకే మహాభారత యుద్ధం ప్రసిద్ధి చెందినది. ఆ యుద్ధము ఈ సంగమంలోనే జరుగుతుంది, ఇప్పుడే మీరు మనుష్యుల నుండి దేవతలుగా కూడా అవుతారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞాన సాగరునిలో జ్ఞాన స్నానం చేసి స్వయాన్ని పావనంగా చేసుకోవాలి. మిత్ర సంబంధీకులతో పాటు ఉంటూ, నాకైతే ఒక్క శివబాబా తప్ప ఇతురులెవ్వరూ లేరని బుద్ధిలో ఉండాలి.

2. విష్ణుపురిలోకి వెళ్ళేందుకు పక్కా వైష్ణవులుగా అనగా పవిత్రంగా అవ్వాలి. నరకంలో జీవిస్తూ మరణించి బుద్ధి యోగాన్ని స్వర్గంతో జోడించాలి.

వరదానము:-

కర్మలు చేసే సమయంలో ధర్మం అనగా ధారణ కూడా సంపూర్ణంగా ఉండాలి, అప్పుడు ధర్మం మరియు కర్మ రెండింటి బ్యాలెన్స్ సరిగ్గా ఉండడంతో ప్రభావం పెరుగుతుంది. అంతేకానీ కర్మ సమాప్తమైన తర్వాత, ధారణ స్మృతిలోకి రావడం కాదు. బుద్ధిలో రెండింటి బ్యాలెన్స్ సరిగ్గా ఉన్నప్పుడు, శ్రేష్ఠమైన మరియు దివ్యమైన బుద్ధివాన్ అని అంటారు. లేదంటే బుద్ధి సాధారణంగా, కర్మ కూడా సాధారణంగా, ధారణలు కూడా సాధారణంగానే ఉంటాయి. కనుక సాధారణతలో సమానతను తీసుకురాకూడదు, కానీ శ్రేష్ఠతలో సమానత ఉండాలి. ఎలాగైతే కర్మలు శ్రేష్ఠంగా ఉంటాయో, అలా ధారణలు కూడా శ్రేష్ఠంగా ఉండాలి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top