07 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

April 6, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఈ కలియుగంలో అందరూ రావణుడి సంకెళ్ళలో బంధించబడి ఉన్నారు, జీవన బంధనంలో ఉన్నారు, వారిని జీవన్ముక్తులుగా చేయాలి’’

ప్రశ్న: -

ఏ వారసత్వం బ్రాహ్మణాత్మలైన మీతో పాటు మనుష్యాత్మలందరికీ కూడా లభిస్తుంది?

జవాబు:-

జీవన్ముక్తులుగా అయ్యే వారసత్వం అందరికీ లభిస్తుంది. మీరు బ్రహ్మా సంతానమైన బ్రాహ్మణులుగా అవుతారు, కావున మీకు 21 జన్మల కోసం జీవన్ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. మిగిలిన వారందరికీ తమ-తమ ధర్మంలో మొట్టమొదట జీవన్ముక్తి అనగా సుఖం లభిస్తుంది, ఆ తర్వాత దుఃఖం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ అర్ధ సమయం సుఖం మరియు అర్ధ సమయం దుఃఖం అనుభవిస్తారు. ఇకపోతే, స్వర్గ సుఖాన్ని అందరూ అనుభవించలేరు. దానికోసమైతే బ్రాహ్మణులుగా అవ్వాల్సి ఉంటుంది, పాఠశాలలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది, మాయపై విజయం పొందాల్సి ఉంటుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీ ముఖాన్ని చూసుకో ప్రాణీ… (ముఖ్డా దేఖ్ లే ప్రాణీ…)

ఓంశాంతి. ఇలా ఎవరన్నారు? తమ హృదయం రూపీ దర్పణంలో చూసుకోండి – ఎన్ని పాపాలున్నాయి, ఎన్ని పుణ్యాలున్నాయి అనగా 5 వికారాలపై ఎంత విజయం పొందాను! శ్రీ నారాయణుడిని వరించేందుకు నేను యోగ్యంగా అయ్యానా? ఎందుకంటే జీవన్ముక్తికి లేక స్వర్గానికి యజమానులుగా రాజా రాణులు కూడా అవుతారు, ప్రజలు కూడా అవుతారు. తల్లి-తండ్రి అంత సేవ మేము చేయగలమా! అని స్వయాన్ని దర్పణంలో చూసుకోండి. ఇది కలియుగమని, అందరూ జీవన బంధనంలో ఉన్నారని, ఒక్కరు కూడా జీవన్ముక్తిలో లేరని కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. మీరు కూడా జీవన బంధనంలో ఉండేవారు. ఇప్పుడు జీవన్ముక్తిని పొందేందుకు తండ్రి పురుషార్థం చేయిస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు – ఈ సమయంలో మనుష్య మాత్రులందరూ జీవన బంధనంలో ఉన్నారు ఎందుకంటే ఇది ఉన్నదే కలియుగము. రావణుని సంకెళ్ళలో బంధించబడి ఉన్నారు. కలియుగం జీవన బంధనము, సత్యయుగం జీవన్ముక్తి. రామ రాజ్యంలో యథా రాజా రాణి తథా ప్రజా, అందరూ జీవన్ముక్తులు. రావణ రాజ్యంలో జీవన బంధనం ఉంది, యథా రాజా రాణి తథా ప్రజా. ఈ సమయంలో మనుష్యమాత్రులందరూ జీవన బంధనంలో ఉన్నారు, తమోప్రధానంగా దుఃఖితులుగా ఉన్నారు. ఇప్పుడు అందరూ సతోప్రధానంలోకి వెళ్ళాలి. సతోప్రధానత సత్యయుగంలో ప్రారంభమవుతుంది. ఆత్మలు ప్రతి ఒక్కరు తమ-తమ పాత్రను అభినయించాలి. ఎప్పుడైతే ఆత్మలు శాంతిధామం నుండి తమ-తమ ధర్మంలోకి వస్తారో, అప్పుడు మొట్టమొదట జీవన్ముక్తులుగా ఉంటారు. సత్య-త్రేతా యుగాలలో ఎవ్వరినీ జీవన బంధనులు అని అనరు ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే లేదు. కలియుగంలో రావణ రాజ్యముంది. మొత్తం పృథ్విపై జీవన బంధన రాజ్యముంది. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం యొక్క మొదటి నంబరు వారు ఎవరైతే ఉన్నారో, వారు కూడా జీవన బంధనంలో ఉన్నారు, ఇప్పుడు జీవన్ముక్తులుగా అవుతున్నారు. జీవన్ముక్తి లభించడమంటే, అందరూ సత్య-త్రేతా యుగాలలోకి వస్తారని కాదు. అలా కాదు, రావణుడి దుఃఖం నుండి విముక్తులుగా అవ్వడాన్నే జీవన్ముక్తి అని అనడం జరుగుతుంది. మనుష్యులు మనుష్యులకు ముక్తిని లేక జీవన్ముక్తిని ఇవ్వలేరు. తండ్రే అందరినీ ముక్తిలోకి అనగా నిర్వాణ ధామంలోకి తీసుకువెళ్తారు. మొదట అందరూ ముక్తిలోకి వెళ్తారు, ఆ తర్వాత జీవన్ముక్తిలోకి నంబరువారుగా వారి ధర్మం అనుసారంగా వస్తారు. సత్యయుగంలోకి రాకపోతే జీవన్ముక్తులని అనలేరని కాదు. మొట్టమొదట తమ ధర్మంలోకి ఎవరైతే వస్తారో, వారు జీవన్ముక్తిలో ఉంటారు. ఆత్మ మొదట సతోప్రధానంగా అవ్వాల్సి ఉంటుంది, ఆ తర్వాత సతో, రజోలలోకి వస్తుంది. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా అవుతుంది, పాతది నుండి మళ్ళీ కొత్తదిగా అవుతుంది. ఈ సమయంలో సాధువులు, సత్పురుషులు మొదలైనవారంతా జీవన బంధనంలో ఉన్నారు, ఎప్పటివరకైతే తండ్రి రారో, అప్పటివరకు ఇది కలియుగముగా ఉంటుంది. వారిని బాబా అని అంటారు, ఇక ఆ తర్వాత మహాకాలుడు అని అనండి లేక ఇంకేదైనా పేరు పెట్టండి, వారి అసలు పేరు శివబాబా. బాబా-బాబా అని అంటూనే ఉంటారు. గాడ్ ఫాదర్ పరమపిత పరమాత్మ అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు, నేను వచ్చి పిల్లలకు ముక్తి, జీవన్ముక్తి, రెండింటినీ ఇస్తాను. మొట్టమొదటగా ఎవరు వచ్చినా సరే, వారు తప్పకుండా సుఖంలోకి వస్తారు, ఆ తర్వాత దుఃఖంలోకి వచ్చేది ఉంటుంది. ముక్తి తర్వాత జీవన్ముక్తి వస్తుంది, ఆ తర్వాత జీవన బంధనం ఉంటుంది. మొట్టమొదట తప్పకుండా సుఖంలోకి రావాలి. తండ్రి అందరికీ సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. అయితే, కొందరికి కేవలం ఒక్క జన్మే సుఖం ఉంటుంది. వస్తారు, కొద్దిగా సుఖం పొందుతారు, మరణిస్తారు. డ్రామాలో వారి పాత్ర ఇంతే ఉంది. మనుష్యుల వృద్ధి అయితే జరుగుతూనే ఉంటుంది. ఇప్పటివరకు వస్తూనే ఉంటారు. ఇప్పుడు వచ్చేవారు ఎక్కువ సమయమైతే ఉండరు. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. కొత్తగా వచ్చేవారు కలియుగంలో వచ్చినా కానీ, వారు వచ్చీ రావడంతోనే దుఃఖాన్ని అనుభవించరు. తప్పకుండా వారికి ఎక్కడో ఒక చోట మంచి గౌరవమే ఉంటుంది. ముక్తిధామం నుండి వచ్చినప్పుడు ఎప్పుడూ మొదట జీవన్ముక్తిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. మాయ బంధనాల నుండి ముక్తులై మొదట సుఖంలోకి వస్తారు, ఆ తర్వాత దుఃఖంలోకి వస్తారు. ఈ సమయంలో అందరూ శిథిలావస్థకు చేరుకున్నారు. తమ సుఖ-దుఃఖాల పాత్రను అభినయించి అందరూ ముక్తి మరియు జీవన్ముక్తిధామంలోకి వస్తారు. వయా ముక్తిధామం వెళ్తారు. వెళ్తారు, మళ్ళీ తప్పకుండా వస్తారు. మొత్తం ప్రపంచంలోని మనుష్యమాత్రులంతా, ఎవరెవరు ఏ-ఏ ధర్మంలోకి వచ్చారో, వారు మళ్ళీ అలానే వస్తారు. జనకునికి కూడా జీవన్ముక్తి లభించింది కదా. ఈ సమయంలో రాజ్యం లేదని కాదు. వారు కూడా చివర్లో వచ్చి తప్పకుండా జ్ఞానాన్ని తీసుకుంటారు. జీవన్ముక్తి అయితే మీ అందరికీ లభిస్తుంది కానీ నంబరువారు పురుషార్థానుసారంగా. మిగిలిన ధర్మాలకు చెందినవారు ఎవరైతే ఉన్నారో, వారి విషయంలో నంబరువారు పురుషార్థానుసారంగా మరియు ధర్మం అనుసారంగా అని అంటారు. దేవీ-దేవతా ధర్మం వారిలో, ఎవరెవరైతే ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారో, వారంతా తిరిగి వచ్చేస్తారు. అందరూ తిరిగి రావాల్సిందే. మొదట బ్రాహ్మణులుగా అవ్వాల్సి ఉంటుంది. వాస్తవానికి అందరూ బ్రహ్మా సంతానమే కానీ అందరూ బ్రాహ్మణులుగా అవ్వరు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారి కోసం 21 జన్మల జీవన్ముక్తి అని అంటారు. రాజ్య సింహాసనంపై కూర్చోవాలంటే, రాజయోగాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది పాఠశాల. పాఠశాలలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. నియమాలు కూడా చాలా ఉన్నాయి. ఒక్కసారి లక్ష్యం లభించిందంటే ఇక ఆ తర్వాత విదేశాలలో ఉంటూ కూడా చదువుకోవచ్చు. తప్పకుండా మనం శివబాబా పిల్లలము. తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఉత్తరాలు కూడా రాస్తారు – బాబా, రావణ భూతం సతాయిస్తున్నాడు, ఒక్కోసారి కామం యొక్క, ఒక్కోసారి క్రోధం యొక్క తేలికపాటి నషా వచ్చేస్తుంది అని. తండ్రి అంటారు, వీటిపై విజయం పొందాలి. మీ ఈ యుద్ధము యోగబలానికి సంబంధించినది. మీరు స్మృతి చేస్తారు, మాయ మీ బుద్ధియోగాన్ని తెంచేస్తుంది. కావున జీవన్ముక్తి అందరికీ లభించనున్నదని బాబా అర్థం చేయించారు. అలాగని దీని అర్థం అందరూ స్వర్గంలోకి వస్తారని కాదు. అందరూ, మాకు ముక్తి కావాలని కోరుకుంటారు. ఎవరైనా పాత్రను అభినయించడానికి చివర్లో వచ్చారనుకోండి, వారు అంతవరకు ముక్తిలోనే ఉంటారు కదా. ఎంత శాంతి లభిస్తుంది. 4500 సంవత్సరాలు లేక 4750 సంవత్సరాలు శాంతిలో ఉంటారు. వారి పాత్రే అలాంటిది. మనం మళ్ళీ సుఖం మరియు శాంతి, రెండింటిలోనూ ఉంటాము. మనుష్యులు, మాకు కూడా వారిలానే శాంతి కావాలి, అక్కడే కూర్చుని ఉండిపోవాలి అని కోరుకోవడం కాదు, అలా కోరుకున్నంత మాత్రాన ఏమీ లభించదు. అనాది డ్రామా తయారై ఉంది. ఇందులో తేడా రాజాలదు. శాంతిని ఇష్టపడేవారైతే చాలామంది ఉన్నారు. మీకు లభించే సుఖం కన్నా వారికి ఎక్కువ శాంతి లభిస్తుంది. మీకు మళ్ళీ సుఖం మరియు శాంతి, రెండూ లభిస్తాయి. ఇక్కడ అల్పకాలికమైన సుఖముంది. శాంతి అయితే ఇక్కడ ఉండదు. దుఃఖధామము కదా. ఇకపోతే అడవుల్లోకి వెళ్ళి కూర్చుంటే, అదేమైనా శాంతినా. ఒకవేళ అక్కడ శాంతి ఉన్నట్లయితే, ఇక అక్కడే కూర్చుని ఉండాలి, మళ్ళీ పట్టణాలలోకి వచ్చి ఇన్ని ఫ్లాట్లు మొదలైనవి ఎందుకు తయారుచేస్తారు. అక్కడ సత్యయుగంలోనైతే శాంతియే శాంతి ఉంటుంది. చివర్లో ఎవరైతే వస్తారో, ఇక్కడ అశాంతియే అశాంతి ఉందని అర్ధం చేసుకుంటారు. వారికి శాంతి ఉంటుంది, ఇతరులు అశాంతిలో ఉన్నారని భావిస్తారు. ఈ విషయాలు చాలా అర్థం చేసుకోవాల్సినవి. జీవన్ముక్తి అందరికీ లభిస్తుంది. 21 జన్మలు మీరు రాజ్యం చేస్తారు, మిగిలినవారు ఆలస్యంగా వస్తారు, వారు పైన శాంతిలో ఉంటారు. ఎవరైనా సత్యయుగంలో లేక త్రేతాయుగంలో తర్వాత వస్తే, వారు కూడా అప్పటివరకు శాంతిధామంలో ఉన్నారు కదా. అక్కడ ఏ దుఃఖమూ ఉండదు. తర్వాత నంబరువారుగా వస్తారు, లెక్కాచారం కూడా ఉంటుంది కదా.

సైన్స్ చాలా శక్తివంతమైనదని మనుష్యులు భావిస్తారు, మా సైలెన్స్ అన్నింటికన్నా శక్తివంతమైనదని మనం అంటాము. బాబా స్మృతితోనే శక్తి లభిస్తుంది. వారు సైన్స్ శక్తితో పైన చంద్రుని మీదకు వెళ్ళే పురుషార్థం చేస్తారు కానీ మీరైతే ఒక్క క్షణంలో సూర్య చంద్రుల కన్నా పైకి వెళ్ళిపోతారు. మూలవతనం, సూక్ష్మవతనం కన్నా పైన ఇంకేమీ లేదు. సూర్య చంద్రుల కన్నా సూక్ష్మవతనం, మూలవతనం చాలా దూరంగా ఉన్నాయి. ఇది ఎవరూ తెలుసుకోలేరు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. సూర్యవంశీ రాజా-రాణిగా తయారయ్యే అదృష్టం లేకపోతే ఏమీ అర్థం చేసుకోలేరు, ఎవరికీ అర్థం చేయించలేరు. నాలో ముక్తి-జీవన్ముక్తి యొక్క జ్ఞానం ఉందని ఎవరూ చెప్పలేరు (జనకుని ఉదాహరణ). అందరినీ జైలులో వేసేసారు. ఈ సమయంలో రావణుడు అందరినీ జైలులో వేసేసాడు. రాముడు వచ్చి అందరినీ విడిపిస్తారు. అందరినీ రావణుడి పంజా నుండి విడిపించి జీవన్ముక్తులుగా చేసేందుకు మీరు తండ్రి ద్వారా నిమిత్తులుగా అయ్యారు. మీ పేరు శివశక్తి సైన్యముగా ప్రసిద్ధి చెందినది. ఈ డ్రామాలో చివర్లో మీ పేరు చాలా ఉన్నతంగా అవ్వనున్నది. తండ్రి వచ్చినప్పటి నుండి ప్రపంచంలో మాతల హోదా కూడా చాలా ఉన్నతంగా అయ్యింది. పూర్వము విదేశాలలో మాతల హోదా చాలా గొప్పగా ఉండేది. అక్కడ కూతురు జన్మిస్తే చాలా సంతోషంగా జరుపుకుంటారు, ఇక్కడ కూతురు జన్మిస్తే మంచం తిరగేస్తారు, పుట్టినరోజును కూడా జరపరు. నిజానికి కన్యల కన్నయ్య అని మహిమ చేస్తారు. వాస్తవానికి మీరంతా కన్యలే. ఇది మీ కొత్త జన్మ. ఇకపోతే, చదువులో నంబరువారుగా ఉన్నారు. ఆత్మ చిన్నగా, పెద్దగా అవ్వదు. శరీరం చిన్నగా, పెద్దగా అవుతుంది. కొందరు వెంటనే అర్థం చేసుకుంటారు, ఎవరికైనా అదృష్టంలో లేకపోతే అర్థం చేసుకోలేరు. జీవన్ముక్తి మరియు జీవన బంధనం, ఈ రెండూ ఈ స్థూల వతనానికి సంబంధించిన విషయాలే. సత్యయుగం నుండి మొదలుకొని జీవన్ముక్తులుగా అవుతారు. తర్వాత ద్వాపరంలో జీవన బంధనులుగా అవుతారు. ఇప్పుడు అందరూ సుఖాన్ని మర్చిపోయారు, దుఃఖంలో పడి ఉన్నారు. మేము 21 జన్మలు సుఖం పొందాము అని అనగలిగేవారు ఎవరూ లేరు. ఇప్పుడు రావణ రాజ్యంలా అయిన కారణంగా మురికి పట్టిన వస్త్రాలుగా అయ్యారు. అక్కడ రావణ రాజ్యమే లేదు కావున మురికి పట్టిన వస్త్రాలుగా ఎలా అవుతారు. యోగబలము, భోగబలము అని అంటూ ఉంటారు కూడా. అక్కడ యోగబలంతో పిల్లలు జన్మిస్తారు. మీకు అక్కడి ఆచారాలు తెలుసు. ఇతరులకు ఇవి తెలిసే ప్రసక్తే లేదు. అమెరికన్లు మొదలైనవారి ఆచార-వ్యవహారాలు వారికే తెలుసు. మనం మన ఆచార-వ్యవహారాల గురించి తెలుసుకున్నాము. మనం సత్యయుగంలో ఉండేవారము. అక్కడ మన ఆచార-వ్యవహారాలు కూడా కొత్తవిగా ఉంటాయి, మీరు కల్పక్రితం వాటిపై ఎలా నడుచుకున్నారో, ఇప్పుడు కూడా అలా నడుచుకుంటారు. ఏదైతే జరిగి ఉంటుందో, అదే ఇప్పుడు జరుగుతుంది. పిల్లలు ధ్యానంలోకి వెళ్ళి ఆచార-వ్యవహారాలను చూసి వస్తారు. కానీ మళ్ళీ ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి. ఎవరైతే అక్కడి ఆచార-వ్యవహారాలను చూసి చెప్పారో, వారంతా ఇప్పుడు లేరు. కనుక దీని వలన లాభమైతే ఏమీ ఉండనే ఉండదు. కనుక అంతా చదువుపై ఆధారపడి ఉంటుంది. యోగము మరియు జ్ఞానము, యోగమనగా తండ్రిని స్మృతి చేయడము, జ్ఞానమనగా చక్రాన్ని తిప్పడము. ఇదైతే సులభము. తండ్రి అంటారు, నా వద్దకు రావాలి, అందుకే నన్ను స్మృతి చేయండి. మనుష్యులకు మరణించే సమయంలో రామ-రామ అని తల్చుకోమని చెప్తారు. అర్థమేమీ తెలుసుకోరు. శ్రీకృష్ణా అని పలికినంత మాత్రాన అక్కడికైతే చేరుకోలేరు. తీసుకెళ్ళేవారు ఎంతైనా తండ్రే. వికర్మలు వినాశనం అవ్వకుండా మీరు తిరిగి ఎలా వెళ్ళగలరు. ఇప్పుడిది అందరి వినాశన సమయము. మళ్ళీ తమ-తమ సమయాలలో వస్తారు. ఈ పాయింటును ధారణ చేయాలి, నోట్ చేసుకోవాలి.

మీరు మాతా-పితలను ఫాలో చేయాలి. మమ్మా ఎప్పుడూ ఎవరినీ విసిగించేవారు కాదు. చాలామంది విషయంలో, మ్యానర్స్ లేవు అని రిపోర్ట్ వస్తుంది. పరమపిత పరమాత్మ చదివిస్తున్నారు, ఎంత తెలివి కావాలి. మంచి నడవడిక కలవారిపై అందరికీ ప్రేమ ఉంటుంది. కొంతమందైతే చాలా విసిగిస్తారు. తమకు తామే చెంపదెబ్బ వేసుకుంటారు. అప్పుడు పద భ్రష్టులైపోతారు. హిందువులు తమకు తాము చెంపదెబ్బలు వేసుకుంటారని అంటూ ఉంటారు. రాజ్య భాగ్యాన్ని ఇచ్చే ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అనేసారు. ఇది తమకు తాము చెంపదెబ్బ వేసుకోవడము, అందుకే ఈ గతి ఏర్పడింది. నేను సర్వవ్యాపి అని భగవంతుడు చెప్పినట్లుగా శాస్త్రాల్లో చూపించారు. కానీ భగవంతుడు స్వయంగా అంటారు, నాకు నేను చెంపదెబ్బ వేసుకోవడానికి నేను ఏమైనా మీలా ఉన్నానా. నేను ఏమైనా కుక్క, పిల్లిలో ఉన్నానా! తండ్రి అంటారు, మీరు నన్ను నిందించారు – ఇది కూడా డ్రామా, మళ్ళీ ఇలాగే జరుగుతుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎటువంటి తప్పుడు నడవడికను నడుచుకోకూడదు. మంచి గుణాలను ధారణ చేయాలి. మాతా-పితలను ఫాలో చేయాలి.

2. యోగబలంతో కామం మరియు క్రోధం యొక్క తేలికపాటి నషాను కూడా సమాప్తం చేయాలి. నిమిత్తులుగా అయి అందరినీ రావణుడి సంకెళ్ళ నుండి విడిపించే సేవ చేయాలి.

వరదానము:-

ప్రసన్నచిత్త ఆత్మలు ఎవరైతే ఉంటారో, వారు స్వయానికి సంబంధించి లేక సర్వులకు సంబంధించి, ప్రకృతికి సంబంధించి, ఏ విషయంలోనూ, ఏ సమయమూ సంకల్పమాత్రంగా కూడా ప్రశ్నలు వేయరు. ఇది ఇలా ఎందుకు లేక ఏం జరుగుతుంది, ఇలా కూడా జరుగుతుందా? ప్రసన్నచిత్త ఆత్మల సంకల్పంలో – ప్రతి కర్మ చేస్తూ, చూస్తూ, వింటూ, ఆలోచిస్తూ ఇదే ఉంటుంది – ఏదైతే జరుగుతుందో, అది నా కొరకు మంచిదే మరియు సదా మంచే జరుగుతుంది. వారెప్పుడూ ఏమిటి, ఎందుకు, ఇలా, అలా అనే ప్రశ్నల చిక్కుల్లోకి వెళ్ళరు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top