06 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
5 September 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - పతితపావనుడైన తండ్రి శ్రీమతాన్ని అనుసరిస్తూ మీరు పావనంగా అవుతారు, అందుకే, మీకు పావన ప్రపంచం యొక్క రాజ్యం లభిస్తుంది, తమ సొంత మతాన్ని అనుసరిస్తూ పావనంగా అయ్యేవారికి ఎటువంటి ప్రాప్తి ఉండదు”
ప్రశ్న: -
పిల్లలు సేవ చేసేటప్పుడు విశేషంగా ఏ విషయం పట్ల అటెన్షన్ పెట్టాలి?
జవాబు:-
సేవ చేసేందుకు వెళ్ళినప్పుడు, పరస్పరంలో ఎప్పుడూ చిన్న-చిన్న విషయాలలో అలగకండి అనగా కోపగించుకోకండి. ఒకవేళ పరస్పరంలో ఉప్పునీరులా అయితే, మాట్లాడుకోకపోతే డిస్సర్వీసుకు నిమిత్తులుగా అవుతారు. చాలా మంది పిల్లలు తండ్రిపై కూడా అలుగుతారు. తప్పుడు కర్మలు చేయడం మొదలుపెడతారు. అప్పుడిక అటువంటి పిల్లల దత్తత రద్దు చేయబడుతుంది.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. పతితపావనుడైన తండ్రి కూర్చొని పావనంగా అయ్యే పిల్లలకు అర్థం చేయిస్తారు. పతితులైన పిల్లలే పావనంగా తయారుచేసే తండ్రిని పిలుస్తారు. దీనిని డ్రామా ప్లాను అని కూడా అంటారు. ఇది రావణ రాజ్యం అయిన కారణంగా మనుష్యులందరూ పతితంగా ఉన్నారు. ఎవరైతే వికారాల్లోకి వెళ్తారో, వారిని పతితులు అని అంటారు. వికారాల్లోకి వెళ్ళనివారు చాలా మంది ఉన్నారు. వారు బ్రహ్మచారులుగా ఉంటారు. మేము నిర్వికారులమని భావిస్తారు. ఉదాహరణకు ఫాదర్లు, ముల్లాలు (ముస్లిమ్ ప్రవక్తలు), బౌద్ధులు, ఇలా పవిత్రంగా ఉండేవారు ఉంటారు. వారిని ఎవరు పవిత్రంగా తయారుచేసారు? స్వయం వారే తయారయ్యారు. వికారాల్లోకి వెళ్ళనివారు ప్రపంచంలో ఇతర ధర్మాలలో కూడా చాలా మంది ఉన్నారు. కానీ వారిని పతితపావనుడైన తండ్రి పావనంగా చేయరు కదా. అందుకే వారు పావన ప్రపంచానికి యజమానులుగా అవ్వలేరు, పావన ప్రపంచంలోకి వెళ్ళలేరు. సన్యాసులు కూడా పంచ వికారాలను వదిలేస్తారు. కానీ వారి చేత సన్యాసం చేయించింది ఎవరు? పతితపావనుడైన పరమపిత పరమాత్మ అయితే సన్యాసం చేయించలేదు కదా. పతితపావనుడైన తండ్రి లేకుండా సఫలత ఉండదు, పావన ప్రపంచమైన శాంతిధామానికి వెళ్ళలేరు. ఇక్కడైతే తండ్రి వచ్చి పావనంగా అయ్యేందుకు మీకు శ్రీమతాన్ని ఇస్తారు. సత్యయుగాన్ని నిర్వికారీ ప్రపంచమని అంటారు. అంటే, సత్యయుగంలోకి వచ్చేవారు తప్పకుండా పవిత్రంగా ఉంటారని దీనితో ఋజువవుతుంది. సత్యయుగంలో కూడా పవిత్రంగా ఉండేవారు. శాంతిధామంలో కూడా ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. ఈ రావణ రాజ్యంలో అందరూ పతితంగానే ఉన్నారు. పునర్జన్మలనైతే తీసుకోవాల్సిందే. సత్యయుగంలో కూడా పునర్జన్మలు తీసుకుంటారు కానీ వికారాల ద్వారా కాదు. అది సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము. త్రేతాలో 2 కళలు తగ్గిపోతాయి కానీ వారిని వికారులు అని అనరు. భగవాన్ శ్రీ రామ, భగవతి శ్రీ సీత అని అంటారు కదా. ముందు 16 కళలు ఉంటాయి, తర్వాత 14 కళలు అని అంటారు. చంద్రుని విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది కదా. పతితపావనుడైన తండ్రి వచ్చి పావనంగా చేయనంతవరకు ఎవరూ ముక్తి-జీవన్ముక్తులలోకి వెళ్ళలేరని దీనితో ఋజువవుతుంది. తండ్రియే మార్గదర్శకుడు. ఈ ప్రపంచంలో పవిత్రులైతే చాలా మంది ఉన్నారు. సన్యాసులకు కూడా పవిత్రత కారణంగా గౌరవముంటుంది. కానీ వారు తండ్రి ద్వారా పవిత్రంగా అవ్వరు. మనల్ని పావనంగా తయారుచేసేవారు నిరాకార పరమపిత పరమాత్మ అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మిగతా వారు తమ సొంత మతం అనుసారంగా పవిత్రంగా అవుతారు. మీరు తండ్రి ద్వారా పవిత్రంగా అవుతారు. పతితపావనుడైన తండ్రి ద్వారానే పావన ప్రపంచం యొక్క వారసత్వం లభిస్తుంది. తండ్రి అంటారు – ఓ పిల్లలూ, కామం మీకు మహా-శత్రువు, దీనిని జయించండి, పడిపోవడం కూడా ఇందులోనే పడిపోతారు. మేము క్రోధం చేసాము కనుక నల్ల ముఖం చేసుకున్నాము అని ఇలా ఎప్పుడూ వ్రాయరు. మేము నల్ల ముఖం చేసుకున్నాము, పడిపోయాము అని కామం గురించే వ్రాస్తారు. ఈ విషయాల గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, ప్రపంచానికి తెలియదు. డ్రామానుసారంగా ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యేది ఉంటుందో, వారు వస్తూ ఉంటారు. ఇతర సత్సంగాలలోనైతే అసలు ఎటువంటి లక్ష్యం-ఉద్దేశ్యం ఉండదు. శివానందుడు మొదలైన వారికి ఫాలోవర్స్ అయితే చాలా మంది ఉన్నారు కానీ వారిలో కూడా ఎవరో కొంతమంది మాత్రమే సన్యాసం తీసుకుంటూ ఉండవచ్చు. గృహస్థులైతే అసలు సన్యాసం తీసుకోరు. ఇకపోతే ఇళ్ళు-వాకిళ్ళను వదిలేవారు చాలా కొద్దిమంది మాత్రమే వెలువడుతారు. సన్యాసులుగా అవుతారు కానీ ఎంతైనా పునర్జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని శివానందుని గురించి అనరు. సర్వుల సద్గతి దాత తండ్రియేనని మీరు అర్థం చేసుకున్నారు. వారే మార్గదర్శకుడు. మార్గదర్శకుడు లేకుండా ఎవరూ వెళ్ళలేరు. మన తండ్రి, తండ్రి కూడా, నాలెడ్జ్ ఫుల్ కూడా అని పిల్లలైన మీకు తెలుసు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు. మొత్తం మనుష్య సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల నాలెడ్జ్ బీజంలోనే ఉంటుంది కదా. ఫాదర్ అని అందరూ అంటారు కదా. మన గాడ్ ఫాదర్ ఒక్కరేనని పిల్లలకు తెలుసు. కావున అందరిపై దయ కూడా ఆ ఫాదర్ కే కలుగుతుంది కదా. ఎంతమంది మనుష్యులున్నారు, ఎన్ని జీవ జంతువులు ఉన్నాయి. అక్కడ మనుష్యులు తక్కువ మంది ఉంటారు కనుక జీవ జంతువులు కూడా కొన్నే ఉంటాయి. సత్యయుగంలో ఇక్కడి లాంటి అశుద్ధత ఉండదు. ఇక్కడైతే అనేక రకాల అనారోగ్యాలు మొదలైనవి ఎన్ని వెలువడుతూ ఉంటాయి. వాటి కోసం మళ్ళీ కొత్త మందులను కనుగొంటూ ఉంటారు. డ్రామా ప్లాను అనుసారంగా అనేక రకాల నైపుణ్యాలు వెలువడుతూ ఉంటాయి. అవన్నీ మనుష్యుల నైపుణ్యాలు. పారలౌకిక తండ్రి నైపుణ్యం ఏమిటి? ఓ పతితపావనా, మీరు వచ్చి మా ఆత్మలను పావనంగా తయారుచేయండి అని తండ్రి కోసమే అంటారు, అప్పుడు శరీరం కూడా పావనంగా ఉంటుంది. పతితపావనా, దుఃఖహర్త, సుఖకర్త అని ఒక్కరినే పిలుస్తారు కదా. తమ-తమ భాషలలో తప్పకుండా గుర్తు చేసుకుంటారు. మనుష్యులు మరణించేటప్పుడు కూడా భగవంతుడిని స్మృతి చేస్తారు. ఇతరులెవ్వరూ ఆధారాన్ని అందించలేరని అర్థం చేసుకుంటారు. అందుకే గాడ్ ఫాదర్ ను స్మృతి చేయండి అని అంటారు. క్రిస్టియన్లు కూడా గాడ్ ఫాదర్ ను స్మృతి చేయండి అని అంటారు. క్రీస్తును స్మృతి చేయండి అని అనరు. క్రీస్తు కంటే గాడ్ గొప్పవారని వారికి తెలుసు. గాడ్ అయితే అందరికీ ఒక్కరే ఉంటారు కదా. మృత్యులోకమంటే ఏమిటి, అమరలోకమంటే ఏమిటి అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయం ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. వారు స్వర్గం, నరకం అన్నీ ఇక్కడే ఉన్నాయని అంటారు. సత్యయుగం ఉండేదని, దేవతల రాజ్యముండేదని కొంతమంది అనుకుంటారు. ఇప్పటికీ ఎన్ని కొత్త-కొత్త మందిరాలను నిర్మిస్తూ ఉంటారు. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ మనల్ని పావనంగా తయారుచేసి తిరిగి మన ఇంటికి తీసుకువెళ్ళలేరని పిల్లలైన మీకు తెలుసు. మనం మన మధురమైన ఇంటికి వెళ్తున్నామని మీ బుద్ధిలో ఉంది. తండ్రి మనల్ని తిరిగి తీసుకువెళ్ళేందుకు యోగ్యులుగా చేస్తున్నారు. ఈ విషయం స్మృతిలో ఉండాలి.
పిల్లలూ, మీరు ఇన్ని-ఇన్ని జన్మలు తీసుకున్నారు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మనం శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము. తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వాలి, స్వర్గంలోకి వెళ్ళాలి. ఇప్పుడిది సంగమము. విరాటరూపంలో బ్రాహ్మణుల పిలక స్థానం ప్రసిద్ధమైనది. హిందువులకు కూడా పిలక గుర్తుగా ఉంటుంది. మనుష్యులైతే మనుష్యులే. సిక్కులు, ముసల్మానులు మొదలైనవారు ఎలా ఉంటారంటే వారివురి మధ్యన మీకు తేడా తెలియదు. ఇకపోతే, చైనీయులు, ఆఫ్రికన్ల మధ్యన తేడా తెలుస్తుంది. వారి ముఖ కవళికలు వేరుగా ఉంటాయి. క్రిస్టియన్లకు భారత్ తో కనెక్షన్ ఉంది కనుక వీరు నేర్చుకున్నారు. ధర్మాలలో ఎన్ని వెరైటీలున్నాయి. వారి ఆచారాలు-పద్ధతులు, వస్త్రధారణ అన్నీ వేర్వేరుగా ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది, మనం సత్యయుగాన్ని స్థాపన చేస్తున్నాము. అక్కడ ఇంకే ధర్మము ఉండేది కాదు. ఇప్పుడైతే అన్ని వెరైటీ ధర్మాలవారు హాజరై ఉన్నారు. ఇప్పుడు అంతిమంలో ఇంకే ధర్మాన్ని స్థాపన చేస్తారు. కొత్త ఆత్మలు పావనంగా ఉంటాయి కనుక కొత్త ఆత్మలు ఎవరైనా వచ్చినప్పుడు ఆ ఆత్మకు ఎంతో కొంత మహిమ జరుగుతూ ఉంటుంది. ఎవరైతే చివర్లో వస్తారో, వారికి తప్పకుండా ముందు సుఖం లభిస్తుందని వివేకం చెప్తుంది. వారి మహిమ జరుగుతుంది, తర్వాత దుఃఖం కూడా ఉంటుంది. వారికి ఒక్క జన్మయే ఉంటుంది. ఎలాగైతే మీరు సుఖధామంలో చాలా కాలం ఉంటారో, అలా వారు శాంతిధామంలో చాలా కాలం ఉంటారు. అంతిమం వరకు చాలా వృద్ధి జరుగుతుంది. వృక్షం పెద్దది కదా. ఈ సమయంలో మనుష్యుల సంఖ్య ఎంతగానో వృద్ధి అవుతూ ఉంటుంది. అందుకే దీనిని ఆపడానికి ఉపాయాలను వెతుకుతూ ఉంటారు. కానీ వీటి వలన ఏమీ ఆగదు. డ్రామా ప్లాను అనుసారంగా తప్పకుండా వృద్ధి జరగనున్నదని మీకు తెలుసు. కొత్త ఆకులు వస్తూ ఉంటాయి, తర్వాత కొమ్మలు మొదలైనవి వెలువడుతూ ఉంటాయి. ఎన్ని వెరైటీలున్నాయి. మనకు ఇంకే కనెక్షన్ లేదని ఇప్పుడు పిల్లలకు తెలుసు. తండ్రియే మనల్ని పావనంగా తయారుచేస్తారు మరియు సృష్టి ఆదిమధ్యాంతాల సమాచారాన్ని వినిపిస్తారు. మీరు కూడా – ఓ పతితపావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని వారినే పిలుస్తారు. కనుక తప్పకుండా పతిత ప్రపంచం వినాశనమవుతుంది. ఇది కూడా లెక్కే. సత్యయుగంలో కొంతమంది మనుష్యులే ఉంటారు. కలియుగంలో ఎంతోమంది మనుష్యులుంటారు. పిల్లలైన మీరు వివరించాలి కూడా. తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు వినాశనమవుతుంది. తండ్రియే స్థాపన చేస్తారు. భగవానువాచ – నేను స్థాపన చేయిస్తాను. వినాశనమైతే డ్రామానుసారంగా జరుగుతుంది. భారత్ లోనే చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మా ద్వారా రచించబడిన బ్రాహ్మణులు అనగా బ్రహ్మా ముఖవంశావళి ఎంతమంది ఉన్నారో చూడండి. ఆ బ్రాహ్మణులు గర్భం ద్వారా రచించబడినవారు. వారికి తండ్రి గురించి తెలియను కూడా తెలియదు. మీకిప్పుడు ఉత్సాహం కలిగింది. ఇప్పుడు కలియుగం వినాశనమై సత్యయుగం రానున్నదని మీకు తెలుసు. ఇది రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞము. ఇందులో పాత ప్రపంచం ఆహుతి అవ్వనున్నది. ఇక వేరే ఆహుతి ఏమీ ఉండదు. తండ్రి అంటారు – నేను మొత్తం సృష్టి అంతటిపై ఈ రాజస్వ అశ్వమేధ యజ్ఞాన్ని రచించాను. ఇది మొత్తం భూమిపై రచించబడింది. యజ్ఞ కుండం ఉంటుంది కదా. ఇందులో ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది. యజ్ఞ కుండాన్ని తయారుచేస్తారు. ఈ సృష్టి అంతా ఒక యజ్ఞ కుండంలా ఉంది. ఈ యజ్ఞ కుండంలో ఏమి జరుగుతుంది? ఇందులో అంతా సమాప్తమైపోతుంది. ఈ కుండం పవిత్రంగా, కొత్తదిగా అయిపోతుంది. ఇందులోకి తర్వాత దేవతలు వస్తారు. సముద్రమైతే నలువైపులా ఎలాగూ ఉంది. మొత్తం ప్రపంచమంతా కొత్తదిగా అయిపోతుంది. చాలా అతలాకుతలమవుతుంది. ఎవ్వరికీ చెందని స్థానం అంటూ ఏదీ లేదు. అందరూ ‘ఇది నాది’ అని అంటూ ఉంటారు. ఇప్పుడిక నాది-నాది అనే మనుష్యులందరూ సమాప్తమైపోతారు. ఇక మిగిలినవారు, ఎవరినైతే నేను పవిత్రంగా తయారుచేస్తానో, మొత్తం ప్రపంచంలో ఆ కొంతమంది మాత్రమే ఉంటారు. మొట్టమొదట ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముంటుంది. యమునా నదీ తీరంలో వారి రాజ్యముంటుంది. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో కూర్చోవాలి, సంతోషముండాలి. మనుష్యులు పరస్పరంలో కూర్చుని కథలను వినిపిస్తూ ఉంటారు కదా. ఇది కూడా సత్యనారాయణ కథ. ఇది అనంతమైన కథ. మీ బుద్ధిలో మాత్రమే ఈ విషయాలున్నాయి. అందులోనూ ఎవరైతే మంచి సర్వీసబుల్ గా ఉన్నవారు ఉంటారో, వారి బుద్ధిలో ధారణ జరుగుతుంది, వారి జోలి నిండుతుంది, దానమిస్తూ ఉంటారు. అందుకే ధనమిచ్చినా ధనం తరగదు అని అంటారు. దానమిస్తే వృద్ధి జరుగుతుందని భావిస్తారు. మీదైతే అవినాశీ ధనము. ఇప్పుడు ధనమిచ్చినా ధనం తరగదు. ఎంతగా దానమిస్తారో, అంతగా సంతోషం కలుగుతుంది. వినే సమయంలో కొంతమంది తల ఊపుతూ ఉంటారు, కొంతమందైతే వెర్రివారి వలె కూర్చొని ఉంటారు. తండ్రి ఇంత మంచి-మంచి పాయింట్లను వినిపిస్తారు కనుక వినే సమయంలో స్వతహాగానే తల ఊపుతారు. పిల్లలు ఇక్కడకు, సమ్ముఖంగా తండ్రి నుండి రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. తండ్రి కూర్చొని ఎంత యుక్తిగా పాయింట్లు వినిపిస్తారు. భారత్ లో దేవీ-దేవతల రాజ్యముండేదని మీకు తెలుసు. భారత్ ను స్వర్గము అని అంటారు, ఇప్పుడిది నరకము. నరకం మారి స్వర్గంగా అవుతుంది. ఇకపోతే, అందరి వినాశనం జరుగుతుంది. మీకైతే స్వర్గం అనేది నిన్నటి మాట వలె ఉంటుంది. నిన్న రాజ్యం చేసేవారము, ఇలా ఇతరులెవ్వరూ చెప్పలేరు. క్రీస్తుకు ఇన్ని సంవత్సరాల క్రితం స్వర్గముండేదని, అప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదని అంటారు కూడా. ద్వాపరం నుండి అన్ని ధర్మాలు వస్తాయి. ఇది చాలా సహజమైన విషయము కానీ ఇది అర్థం చేసుకోవడానికి అసలు మనుష్యుల బుద్ధి ఇటు వైపు లేదు. పతితపావనా రండి, అని పిలుస్తారు కూడా. కావున వారు వచ్చి తప్పకుండా పతితుల నుండి పావనంగా తయారుచేస్తారు కదా. ఇక్కడైతే పావనులెవ్వరూ ఉండరు. సత్యయుగాన్ని నిర్వికారీ ప్రపంచమని అంటారు. ఇప్పుడిది వికారీ ప్రపంచము. ముఖ్యమైన విషయము పవిత్రతకు సంబంధించినది. దీని కోసం మీకు ఎంత శ్రమించాల్సి ఉంటుంది. ఈ రోజు వరకు జరిగినదంతా డ్రామానుసారంగానే జరిగిందని అంటారని మీకు తెలుసు. ఇందులో ఎవరికో మంచి జరిగిందనో లేక చెడు జరిగిందనో మనం చెప్పలేము. ఏదైతే జరుగుతుందో అది డ్రామాలో నిశ్చయించబడి ఉంది. బాబా భవిష్యత్తు కోసం ఇలా అర్థం చేయిస్తారు – సేవలో ఇలాంటి కర్మలు చేయకండి లేదంటే డిస్సర్వీసు జరుగుతుంది. మీరు పరస్పరంలో ఉప్పునీరులా అయిపోయారని తండ్రియే తెలియజేస్తారు కదా. మేము ఉప్పునీరులా అయ్యామని, పరస్పరంలో కలుసుకున్నా మాట్లాడుకోవడం లేదని తెలుసు. మళ్ళీ ఎవరినైనా ఏమైనా అంటే చాలా డిస్టర్బ్ అయిపోతారు. శివబాబాను మర్చిపోతారు. అందుకే, ఎల్లప్పుడూ శివబాబాను స్మృతి చేయండి అని అర్థం చేయించడం జరుగుతుంది. ఇలాంటి-ఇలాంటి పనులు చేస్తే దుర్గతి పాలవుతారని తండ్రి పిల్లలను సావధాన పరుస్తూ ఉంటారు. కానీ భాగ్యంలో లేకపోతే అసలు అర్థం చేసుకోరు. ఎవరి నుండైతే వారసత్వం లభిస్తుందో, అటువంటి శివబాబాపై కూడా అలుగుతారు. బ్రాహ్మణిపై కూడా అలుగుతారు. వీరిపై (బ్రహ్మాపై) కూడా అలుగుతారు. ఇక ఎప్పుడూ క్లాసుకు రారు. శివబాబాపై ఎప్పుడూ అలగకూడదు కదా. వారి మురళిని చదువుకోవాలి, స్మృతి కూడా వారినే చేయాలి. బాబా చెప్తారు కదా – పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే సద్గతి కలుగుతుంది. దేహాభిమానంలోకి రావడంతో దేహధారులపై అలుగుతారు. వారసత్వమైతే తాతగారి నుండి లభిస్తుంది. తండ్రికి చెందినవారిగా అయినప్పుడే తాతగారి వారసత్వం లభిస్తుంది. తండ్రికే విడాకులిచ్చేస్తే వారసత్వమెలా లభిస్తుంది. బ్రాహ్మణ కులం నుండి బయటకు అంటే శూద్ర కులంలోకి వెళ్ళిపోతే ఇక వారసత్వం సమాప్తమైపోతుంది. దత్తత రద్దు అయిపోతుంది. అయినా అర్థం చేసుకోరు. మాయ ఎలాంటిదంటే పూర్తిగా వెర్రివారి వలె చేసేస్తుంది. తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి. కానీ అసలు స్మృతి చేయరు. నేను శివబాబా సంతానాన్ని, వారే నన్ను విశ్వానికి యజమానిగా చేస్తారు. తప్పకుండా వారు భారత్ లోనే జన్మ తీసుకుంటారు. శివజయంతిని జరుపుకుంటారు కదా. ప్రపంచ చరిత్ర-భూగోళాలు రిపీట్ అవుతాయి. కనుక మొట్టమొదట శివబాబాయే వచ్చి స్వర్గాన్ని రచిస్తారు. మనకు స్వర్గ రాజ్యాధికారం లభిస్తుందని మీకు తెలుసు. తండ్రియే వచ్చి స్వర్గవాసులుగా చేస్తారు. కొత్త ప్రపంచం కోసం రాజయోగాన్ని నేర్పిస్తారు. మీరు వెళ్ళి కొత్త ప్రపంచంలో రాజ్యాన్ని నడిపిస్తారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బుద్ధి రూపీ జోలిలో అవినాశీ జ్ఞాన రత్నాలను నింపుకొని దానం చేయాలి. దానం చేస్తేనే సంతోషం కలుగుతుంది. జ్ఞాన ధనం పెరుగుతూ ఉంటుంది.
2. ఎప్పుడూ పరస్పరంలో డిస్టర్బ్ అయి ఉప్పునీరులా అవ్వకూడదు. చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి మరియు మురళిని వినాలి. వెర్రివారి వలె అవ్వకూడదు.
వరదానము:-
మనము మాస్టర్ శిక్షకులము. ‘మాస్టర్’ అని అనడంతో తండ్రి స్వతహాగా గుర్తుకొస్తారు. తయారుచేసేవారి స్మృతి రావడంతో, స్వయం నేను నిమిత్తుడను అనేది స్వతహాగా స్మృతిలోకి వస్తుంది. నేను పుణ్యాత్మను అనే విశేష స్మృతి ఉండాలి. పుణ్య ఖాతాను జమ చేసుకోవడము మరియు చేయించడమే విశేష సేవ. పుణ్యాత్మ ఎప్పుడూ సంకల్పమాత్రంగా కూడా ఒక్క శాతం పాపం కూడా చేయలేదు. మాస్టర్ శిక్షకుడు అనగా సదా పుణ్య ఖాతాను జమ చేసుకునే మరియు చేయించేవారు అనగా తండ్రి సమానమైనవారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!