06 June 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

June 5, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - జ్ఞానానికి పునాది నిశ్చయము, నిశ్చయ బుద్ధి కలవారిగా అయి పురుషార్థం చేసినట్లయితే గమ్యము వరకు చేరుకుంటారు’’

ప్రశ్న: -

ఏ విషయం బాగా అర్థం చేసుకోవాల్సినది మరియు నిశ్చయం చేసుకోవాల్సినది?

జవాబు:-

ఇప్పుడు ఆత్మలందరి లెక్కాచారాలు సమాప్తమయ్యేదే ఉంది. అందరూ దోమల వలె తమ మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు, తర్వాత కొత్త ప్రపంచంలోకి కొన్ని ఆత్మలు వస్తాయి. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన మరియు నిశ్చయం చేసుకోవాల్సిన విషయము.

ప్రశ్న: -

తండ్రి ఏ పిల్లలను చూసి సంతోషిస్తారు?

జవాబు:-

ఏ పిల్లలైతే తండ్రిపై పూర్తిగా బలిహారమవుతారో, ఎవరైతే మాయకు చలించరో అనగా అంగదుని వలె స్థిరంగా, చలించకుండా ఉంటారో, అటువంటి పిల్లలను చూసి తండ్రి కూడా సంతోషిస్తారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓర్పు వహించు మానవా… (ధీరజ్ ధర్ మనువా…)

ఓంశాంతి. పిల్లలు ఏం విన్నారు? ఇలా తండ్రి మాత్రమే అనగలరు కదా. సన్యాసులు ఎవ్వరూ అనలేరు. పారలౌకిక అనంతమైన తండ్రే పిల్లలతో అంటారు ఎందుకంటే ఆత్మలోనే మనసు-బుద్ధి ఉన్నాయి. ఇప్పుడు ఓర్పు వహించండి, అని ఆత్మలతో అంటారు. పిల్లలకే తెలుసు, ఈ అనంతమైన తండ్రి మొత్తం ప్రపంచమంతటికి చెప్తారు, ఓర్పు వహించండి, ఇప్పుడు మీ సుఖ-శాంతుల రోజులు వస్తున్నాయి. ఇదైతే దుఃఖధామము, దీని తర్వాత మళ్ళీ సుఖధామము రావాల్సిందే. సుఖధామం యొక్క స్థాపన అయితే తండ్రే చేస్తారు కదా. తండ్రే పిల్లలకు ఓర్పునిస్తారు. మొదట అయితే నిశ్చయం కావాలి కదా. బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణులకు నిశ్చయం ఉంటుంది. లేదంటే ఇంతమంది బ్రాహ్మణులు ఎక్కడ నుండి వస్తారు? బి.కె. యొక్క అర్థమే కుమారులు మరియు కుమారీలు. ఇంతమంది బి.కె.లు అని పిలవబడుతున్నారు అంటే తప్పకుండా ప్రజాపిత బ్రహ్మా ఉంటారు కదా! ఇంతమందికి తల్లి-తండ్రి ఒక్కరే, మిగిలిన వారందరికీ తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటారు. ఇక్కడ మీ అందరికీ ఒక్కరే తల్లి-తండ్రి. కొత్త విషయం కదా. ఇంతకుముందు మీరు బ్రాహ్మణులుగా లేరు, ఇప్పుడు అయ్యారు. ఆ బ్రాహ్మణులు కుఖ వంశావళి, మీరు ముఖ వంశావళి. ప్రతి విషయంలో మొదట, ఎవరు మాకు అర్థం చేయిస్తున్నారు అన్న నిశ్చయం కావాలి. భగవంతుడే అర్థం చేయిస్తారు, ఇప్పుడిది కలియుగం యొక్క అంతిమము, యుద్ధం ఎదురుగా నిలబడి ఉంది. యూరోపువాసులైన యాదవులు కూడా ఉన్నారు, వారు బాంబులు మొదలైనవాటిని కనుగొన్నారు. కడుపు నుండి ముసలము వెలువడింది, దానితో తమ కులాన్ని తామే వినాశనం చేసుకున్నారు అని అంటూ ఉంటారు. నిజంగా కులం యొక్క వినాశనం తప్పకుండా చేస్తారు. వాస్తవానికి ఒకే కులానికి సంబంధించినవారు. మేము వినాశనం చేస్తాము అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. ఇది కూడా తప్పకుండా రాసి ఉంది. కనుక ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, ఓర్పు వహించండి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. కలియుగం సమాప్తమైనప్పుడు సత్యయుగం ఉంటుంది కదా. తప్పకుండా దానికన్నా ముందే స్థాపన జరగాలి. బ్రహ్మా ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనం అని అంటూ ఉంటారు కూడా. మొదట స్థాపన చేస్తారు, మళ్ళీ ఎప్పుడైతే స్థాపన పూర్తి అవుతుందో, అప్పుడు వినాశనం జరుగుతుంది. స్థాపన జరుగుతూ ఉంది. ఇది ఉన్నదే అతీతమైన మార్గము, దీనిని ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఎవ్వరూ ఎప్పుడూ వినలేదు, కనుక ఏ విధంగా ఇతర మఠాలు, మార్గాలు ఉంటాయో, అలాగే ఈ బి.కె.లది కూడా ఉంది అని భావిస్తారు. ఆ అభాగ్యుల దోషమేమీ లేదు. కల్ప క్రితము కూడా ఇదే విధంగా విఘ్నాలు కలిగించారు. ఇది ఉన్నదే రుద్ర జ్ఞాన యజ్ఞము. రుద్రుడు అని శివుడిని అంటారు. వారే రాజయోగాన్ని నేర్పిస్తారు, దీనిని ప్రాచీన సహజ రాజయోగము అని అంటారు. ప్రాచీనము యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. ఈ సంగమయుగం యొక్క విషయమే, పతితులు మరియు పావనులు అన్నప్పుడు సంగమము అయ్యింది కదా. సత్యయుగం ఆదిలో ఒకే ధర్మం ఉంటుంది. వారు ఆసురీ సంప్రదాయమువారు, మీరు దైవీ సంప్రదాయము వారు. యుద్ధం మొదలైన విషయాలేవీ లేవు. ఇది కూడా తప్పు. పరస్పరంలో సోదరులైన మీరు ఎలా కొట్లాడుకుంటారు.

తండ్రి కూర్చుని బ్రహ్మా ద్వారా అన్ని వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. వాస్తవానికి ముఖ్యమైన ధర్మాలు నాలుగు. వాటికి నాలుగు ధర్మ శాస్త్రాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆది సనాతనా దేవీ-దేవతా ధర్మము, దాని శాస్త్రము సర్వశాస్త్రమయి శిరోమణి గీత, అది భారత్ యొక్క మొదటి ముఖ్యమైన శాస్త్రము, దీని ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము అనగా సూర్యవంశీయుల మరియు చంద్రవంశీయుల ధర్మ స్థాపన జరిగింది. అది కూడా తప్పకుండా సంగమంలోనే జరిగి ఉంటుంది. దీనిని కుంభము అని కూడా అంటారు. మీకు తెలుసు, ఈ కుంభ మేళా – ఆత్మ-పరమాత్మల మేళ, ఇది మనోహరమైనది, కళ్యాణకారి. కలియుగం మారి సత్యయుగంగా అవ్వాల్సిందే, అందుకే కళ్యాణకారి అని అంటారు. సత్యయుగం నుండి త్రేతా వస్తుంది, మళ్ళీ త్రేతా నుండి ద్వాపరము వస్తుంది, అప్పుడు కళలు తగ్గిపోతూ ఉంటాయి. అకళ్యాణము జరుగుతూనే ఉంటుంది. కావున మళ్ళీ తప్పకుండా కళ్యాణము చేసేవారు కావాలి. ఎప్పుడైతే పూర్తిగా అకళ్యాణము జరుగుతుందో, అప్పుడు అందరి కళ్యాణము చేయడానికి తండ్రి వస్తారు. బుద్ధిని ఉపయోగించాల్సి ఉంటుంది. తప్పకుండా తండ్రి కళ్యాణము చేసేందుకు సంగమంలోనే వస్తారు. తండ్రి సర్వుల సద్గతిదాత. సర్వులైతే ద్వాపరములో లేరు. సత్య-త్రేతా యుగాలలో కూడా అందరూ ఉండరు. ఎప్పుడైతే ఆత్మలందరూ వచ్చేస్తారో, అప్పుడు తండ్రి అంతిమంలోనే వస్తారు. కనుక తండ్రే వచ్చి ఓర్పునిస్తారు. పిల్లలు అంటారు, బాబా, ఈ పాత ప్రపంచంలో దుఃఖం చాలా ఉంది. బాబా, త్వరగా తీసుకువెళ్ళండి. తండ్రి అంటారు – లేదు పిల్లలూ, ఈ డ్రామా తయారుచేయబడి ఉంది, వెంటనే భ్రష్టాచారి నుండి శ్రేష్ఠాచారిగా అయితే అవ్వరు. నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి పురుషార్థం చేయాలి. క్షణంలో జీవన్ముక్తి, ఇదైతే సరైనది. పిల్లలుగా అయ్యారు అంటే వారసత్వానికి హక్కుదారులుగా అయ్యారు, కానీ తర్వాత అక్కడ కూడా నంబరువారుగా పదవులైతే ఉంటాయి కదా. ఉన్నత పదవిని పొందేందుకు చదువులో పురుషార్థం చేయడం జరుగుతుంది. అంతేకానీ, వెంటనే కర్మాతీత అవస్థ ఏర్పడుతుందని కాదు. అప్పుడిక శరీరాన్ని కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది. అటువంటి నియమం లేదు. మాయతో అయితే మంచి రీతిలో యుద్ధం చేయాలి. మీకు తెలుసు, యుద్ధం 8-10-15 సంవత్సరాలు కూడా జరుగుతూ ఉంటుంది. మీ యుద్ధమైతే మాయతో ఉంది. ఎప్పటివరకైతే తండ్రి ఉంటారో, అప్పటివరకు మీ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఎవరు ఎంతగా మాయపై విజయం పొందారు! ఎంతవరకు కర్మాతీత అవస్థకు చేరుకున్నారని చివర్లో రిజల్టు వెలువడుతుంది తండ్రి అంటారు – ఎంత వీలైతే అంత తమ ఇంటిని స్మృతి చేయండి. అది శాంతిధామము. అది వాణి నుండి అతీతమైన స్థానము. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో సంతోషం ఉంది. మీకు ఈ డ్రామా ఎలా తయారుచేయబడిందో తెలుసు. మూడు లోకాల గురించి కూడా మీకు తెలుసు, ఇతురులెవ్వరి బుద్ధిలోనూ లేదు. బాబా కూడా శాస్త్రాలు మొదలైనవి చాలా చదివి ఉన్నారు. కానీ బుద్ధిలో ఈ విషయాలు ఏమైనా ఉండేవా. గీత మొదలైనవైతే చదివారు, కానీ మనం దూరదేశము పరంధామ నివాసులము అని బుద్ధిలో ఏమైనా ఉండేదా. ఇప్పుడు తెలిసింది, మన బాబా, ఎవరినైతే పరమపిత పరమాత్మ అని అంటారో, వారు పరంధామంలో ఉంటారు. పతిత పావన రండి, అని వారిని అందరూ స్మృతి చేస్తారు. తిరిగి అయితే ఎవ్వరూ వెళ్ళలేరు. ఏ విధంగా తికమకదారుల ఆట ఉంటుంది కదా, ఎక్కడి నుండి వెళ్ళినా తలుపు ఎదురుగా వస్తుంది. గమ్యానికి చేరుకోలేరు. అలసిపోతారు, దుఃఖంతో మొరపెట్టుకుంటూ ఉంటారు, ఎవరైనా మార్గం చెప్పాలి అని. ఇక్కడ కూడా ఎన్ని వేద శాస్త్రాలైనా చదవండి, తీర్థ యాత్రలకు వెళ్ళండి, మనం ఎక్కడికి వెళ్తున్నాము అన్నది ఏమీ తెలియదు. ఫలానా జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని కేవలం అంటారు. తండ్రి అంటారు – ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. నాటకం ఎప్పుడైతే పూర్తవుతుందో, అప్పుడు పాత్రధారులందరూ స్టేజ్ మీదకు వస్తారు. ఇది నియమము. అందరూ ఆ డ్రెస్ లోనే నిలబడతారు. అందరికీ ముఖాన్ని చూపించి తర్వాత వస్త్రాలు మొదలైనవి మార్చుకుని, ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ అదే పాత్రను రిపీట్ చేస్తారు. ఇది అనంతమైన నాటకము. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవుతారు, ఆత్మలైన మనం ఈ శరీరాన్ని విడిచి మరొకటి తీసుకుంటామని మీకు తెలుసు. పునర్జన్మలైతే ఉంటాయి కదా. 84 జన్మలలో 84 పేర్లను మనం ధారణ చేసాము. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అయిపోయింది, అందరిదీ శిథిలావస్థ ఉంది. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. ప్రపంచ చరిత్ర-భౌగోళికము మళ్ళీ రిపీట్ అవుతుంది. మీకు తెలుసు, ఇప్పుడు మన పాత్ర పూర్తి అవుతుంది, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాము. తండ్రి ఆజ్ఞ ఏమైనా తక్కువా ఏమిటి. పతిత-పావనుడైన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, పిల్లలూ, మీకు చాలా సహజమైన ఉపాయాన్ని తెలియజేస్తాను – లేస్తూ-కూర్చుంటూ, తిరుగుతూ, ఇదే మనసులో ఉంచుకోవాలి, మేము పాత్రధారులము, 84 జన్మలు ఇప్పుడు పూర్తి అయ్యాయి. ఇప్పుడు తండ్రి, పుష్పాలుగా చేయడానికి, మనుష్యులను దేవతలుగా చేయడానికి వచ్చారు. పతితులైన మనల్ని పావనంగా చేస్తున్నారు. పతితుల నుండి పావనులుగా మనం అనేక సార్లు అయ్యాము మరియు అవుతాము. చరిత్ర-భౌగోళికము రిపీట్ అవుతుంది. మొదట అయితే దేవీ-దేవతా ధర్మం వారే వస్తారు. ఇప్పుడు అంటు కట్టబడుతుంది. మనం గుప్తంగా ఉన్నాము. మనం వేడుక మొదలైనవి ఏం జరుపుకుంటాము. మనకు లోపల జ్ఞానముంది, లోపల సంతోషం ఉంటుంది. మన దేవీ-దేవతా ధర్మం యొక్క అనగా వృక్షం యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ ధర్మ భ్రష్టముగా, కర్మ భ్రష్టముగా అయ్యాయి. ఇదే భారతవాసీయుల ధర్మం, కర్మ శ్రేష్ఠంగా ఉండేవి. మాయ ఎప్పుడూ పాపము చేయించేది కాదు. అది పుణ్యాత్ముల ప్రపంచంగా ఉండేది. అక్కడ రావణుడు ఉండనే ఉండడు, అక్కడ కర్మలు, అకర్మలుగా అవుతాయి. మళ్ళీ రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగా అవ్వడం మొదలవుతుంది. అక్కడైతే వికర్మలు జరగవు. ఎవ్వరూ భ్రష్టాచారులుగా ఉండరు. పిల్లలైన మీరు యోగబలముతో శ్రీమతముపై విశ్వానికి యజమానులుగా అవుతారు. బాహుబలంతోనైతే ఎవ్వరూ విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. మీకు తెలుసు, వీరు ఒకవేళ పరస్పరంలో కలిస్తే విశ్వానికి యజమానులుగా అవ్వగలరు. కానీ డ్రామాలో పాత్రనే లేదు. రెండు పిల్లులు కొట్లాడుకుంటూ ఉంటే, మధ్యలో కోతి వెన్నను తినేసిందని చూపిస్తారు. కృష్ణుడి నోటిలో వెన్న ఉన్నట్లుగా సాక్షాత్కారం కూడా చేసుకుంటారు. ఈ సృష్టి యొక్క రాజ్యమనే వెన్న లభిస్తుంది. ఇకపోతే, యుద్ధమైతే యాదవులు మరియు కౌరవులది, అదైతే చూస్తారు, ఇప్పుడు జరుగుతూ ఉంది. ఫలానా చోట ఇంత పెద్ద హింస జరిగింది అని వార్తాపత్రికలలో చదువుతారు – అప్పుడు వెంటనే ఎవరో ఒకరిని చంపేస్తారు. భారత్ లోనైతే మొదట ఒకే ధర్మం ఉండేది. మళ్ళీ వేరే ధర్మాల రాజ్యం ఎక్కడి నుండి వచ్చింది? క్రిస్టియన్లు, శక్తివంతంగా ఉండేవారు, అందుకే వారు రాజ్యం చేసారు. ఇప్పుడు వాస్తవానికి మొత్తం ప్రపంచమంతటినీ రావణుడు ఆక్రమించుకున్నాడు. ఇది గుప్తమైన విషయము. శాస్త్రాలలో ఈ విషయం ఏమైనా ఉందా. తండ్రి అర్థం చేయిస్తారు, ఈ వికారాలు మీ అర్ధకల్పపు శత్రువులు, వీటి ద్వారా మీరు ఆది-మధ్యాంతాలు దుఃఖాన్ని పొందుతారు, అందుకే సన్యాసులు కూడా, కాకిరెట్ట సమానమైన సుఖము అని అంటారు. స్వర్గంలోనైతే సదా సుఖమే సుఖము ఉంటుందని వారికేమైనా తెలుసా. భారతవాసులకైతే తెలుసు, అందుకే ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. స్వర్గానికి ఎంత మహిమ ఉంది, తప్పకుండా ఇది ఆట, కానీ ఎవరినైనా, మీరు నరకవాసులు అని అన్నారంటే డిస్టర్బ్ అవుతారు. ఎంత అద్భుతమైన విషయము. నోటితో స్వర్గవాసులయ్యారు అని అంటున్నారంటే తప్పకుండా నరకం నుండి వెళ్ళినట్లే కదా. మళ్ళీ మీరు వారిని పిలిచి నరకంలోని పదార్థాలను ఎందుకు తినిపిస్తారు? స్వర్గంలోనైతే వారికి చాలా మంచి వైభవాలు లభిస్తూ ఉండవచ్చు కదా! దీనికి అర్థము మీకు నిశ్చయం లేదనే కదా. అక్కడ ఏమేమి ఉంటాయి అనేది పిల్లలు అంతా చూసారు. నరకంలో చూడండి, ఏమేమి చేస్తూ ఉంటారు, పిల్లలు తండ్రిని హతమార్చడానికి కూడా ఆలస్యం చేయరు. స్త్రీకి ఎవరి పట్లనైనా మనసు కలిగినట్లయితే పతిని కూడా హతమార్చేస్తుంది. భారత్ గురించి ఒక పాట తయారుచేయబడి ఉంది – ఒకవైపు అంటారు, ఈనాటి మానవునికి ఏమయ్యింది… అని. మళ్ళీ, మా భారత్ అన్నింటికన్నా మంచిది, బంగారం వంటిది అని అంటారు. అరే, భారత్ అన్నింటికన్నా మంచిగా ఉండేది, ఇప్పుడు ఏమైనా అలా ఉందా. ఇప్పుడైతే నిరుపేదగా ఉంది, ఎటువంటి రక్షణ లేదు. మనం కూడా ఆసురీ సంప్రదాయం కలవారిగా ఉండేవారము. ఇప్పుడు బాబా మనల్ని ఈశ్వరీయ సంప్రదాయం కలవారిగా చేయడానికి పురుషార్థం చేయిస్తారు. ఇది కొత్త విషయము కాదు. కల్ప-కల్పము, కల్పం యొక్క సంగమంలో మనం మళ్ళీ మన వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి వారసత్వాన్ని ఇచ్చేందుకు వస్తారు. మాయ మళ్ళీ శాపాన్ని ఇస్తుంది. ఎంత సమర్థమైనది. తండ్రి అంటారు, మాయా, నీవు ఎంతటి శక్తిశాలివి, మంచి-మంచివారిని పడేస్తావు. ఆ సైన్యంలోనైతే చంపడానికి, చావడానికి ఆలోచించరు. దెబ్బ తిని మళ్ళీ మైదానంలోకి వచ్చేస్తారు, వారి వ్యాపారమే ఇది, వారు ప్రొఫెషనల్ (నిపుణులు). వారికి మళ్ళీ కానుక కూడా లభిస్తుంది. ఇక్కడ పిల్లలైన మీరు శివబాబా నుండి శక్తి తీసుకుంటారు, మాయపై విజయం పొందుతారు. తండ్రి బ్యారిస్టరు, వారు మాయ నుండి మిమ్మల్ని విడిపిస్తారు. మీరు శివశక్తి సైన్యము, మాతలను ఉన్నతంలో ఉంచారు, వందే మాతరం. ఇది ఎవరన్నారు? తండ్రి, ఎందుకంటే మీరు తండ్రిపై బలిహారమవుతారు. బాబా సంతోషిస్తారు – వీరు బాగా నిలబడ్డారు, కదలరు అని. అంగదుని ఉదాహరణ ఉంది కదా, అతడిని రావణుడు కదిలించలేడు. ఇది చివరి సమయంలోని విషయము. చివర్లో ఆ అవస్థ ఏర్పడాలి. ఆ సమయంలో మీకు చాలా సంతోషం కలుగుతుంది, ఎప్పటివరకైతే వినాశనం జరగదో, భూమి పవిత్రంగా అవ్వదో, అప్పటివరకైతే దేవతలు రాలేరు. ప్రపంచానికి తప్పకుండా నిప్పు అంటుకోనున్నది. ఆత్మలందరూ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని దోమల వలె మధురమైన ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఎన్ని కోట్ల దోమలు మరణిస్తాయి, అందుకే, రాముడూ వెళ్ళిపోయాడు, రావణుడూ వెళ్ళిపోయాడు… అని పాడడం జరుగుతుంది. తిరిగి అయితే వెళ్ళాలి కదా. మళ్ళీ మీరు కొత్త ప్రపంచంలోకి వస్తారు. అక్కడ చాలా కొద్దిమంది ఉంటారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన మరియు నిశ్చయం చేసుకోవాల్సిన విషయాలు. ఈ జ్ఞానాన్ని బాబా మాత్రమే ఇవ్వగలరు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. లేస్తూ-కూర్చుంటూ, తిరుగుతూ, స్వయాన్ని పాత్రధారిగా భావించాలి, మనసులో ఇదే ఉండాలి – మేము 84 జన్మల పాత్రను పూర్తి చేసాము, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. దేహీ-అభిమానులుగా అయి ఉండాలి.

2. నిశ్చయబుద్ధి కలవారిగా అయి ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యే పురుషార్థం చేయాలి. మాయతో యుద్ధం చేసి విజయులుగా అయి కర్మాతీతులుగా అవ్వాలి. ఎంత వీలైతే అంత తమ ఇంటిని స్మృతి చేయాలి.

వరదానము:-

మనసు-బుద్ధి మరియు సంస్కారము – ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు ఏవైతే ఉన్నాయో, మూడింటిలోనూ లైట్ ను (తేలికదనాన్ని) అనుభవం చేయండి, ఇదే తండ్రి సమానంగా అతీతంగా-ప్రియంగా అవ్వడము, ఎందుకంటే సమయమనుసారంగా బయట తమోప్రధాన వాతావరణంలో, మనుష్యాత్మల వృత్తులలో భారీతనం ఉంటుంది. ఎంతగా బయట వాతావరణం భారీగా ఉంటుందో, అంతగా పిల్లలైన మీ సంకల్పాలు, కర్మలు, సంబంధాలు తేలికగా అవుతూ ఉంటాయి మరియు తేలికదనం కారణంగా మొత్తం కార్యము తేలికగా నడుస్తూ ఉంటుంది. కార్య-వ్యవహారాల ప్రభావం మీపై పడదు, ఈ స్థితియే తండ్రి సమానమైన స్థితి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top