06 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
5 July 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఈ మహాభారత యుద్ధంలో పాత వృక్షం సమాప్తమవ్వనున్నది, అందుకే యుద్ధానికి ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి”
ప్రశ్న: -
బాబాకు మాతల సంగఠన కావాలి, కానీ ఆ సంగఠనకు ఏ విశేషత ఉండాలి?
జవాబు:-
దేహీ-అభిమానులుగా ఉండేందుకు పూర్తి పురుషార్థం చేసేవారి సంగఠన ఉండాలి. వారికి మేము పావనంగా అయి పావన ప్రపంచాన్ని తయారుచేయాలనే పక్కా నషా ఉండాలి. పతితంగా అవ్వకూడదు. నష్టోమోహుల గ్రూప్ అయి ఉండాలి, అప్పుడు ఏదైనా అద్భుతం చేసి చూపించగలరు. ఎవరి పట్ల మోహం ఉండకూడదు. మోహమనే బంధం చాలా నష్టపరుస్తుంది.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. మధురమైన బాబా మమ్మల్ని స్వర్గవాసులుగా చేసేందుకు ఇక్కడకు వచ్చారని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. ఈ విషయం పిల్లల బుద్ధిలో ఉంది. ఆత్మలైన మనం ఈ స్మృతి యాత్రతో పవిత్రంగా అవుతామని ప్రతి ఒక్కరికీ అర్థం చేయించాలి. కేవలం తండ్రిని స్మృతి చేయడమనేది ఎంత సహజమైన ఉపాయము. తండ్రి ఒక్క సెకెండులో ముక్తి-జీవన్ముక్తుల వారసత్వాన్నిస్తారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు అందరూ జీవన బంధనంలో ఉన్నారు, రావణ రాజ్యం యొక్క బంధనంలో ఉన్నారు. ఈ విషయం తండ్రికి తెలుసు మరియు పిల్లలకు తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు. మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేస్తున్నామని పిల్లలైన మీకు నిశ్చయముంది కనుక ఆత్మకు లోపల చాలా సంతోషం ఉండాలి. ఏ తండ్రినైతే అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చారో, ఆ తండ్రి లభించారు. దుఃఖంలో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. ఇంతకుముందు మీరు కూడా స్మరించేవారు, ఇప్పుడు మీరు దుఃఖంతో స్మరించరు. ఎవరినైతే ప్రపంచమంతా స్మరిస్తూ ఉందో, ఆ తండ్రి వచ్చారని మీకు తెలుసు. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు, నేను ఒక ఆత్మను అని భావించండి అని బాబా పదే-పదే అర్థం చేయించారు. బాబా పరంధామం నుండి వచ్చి ఉన్నారు. కల్ప-కల్పము తమ ప్రతిజ్ఞ అనుసారంగా వస్తారు. బాబా ప్రతిజ్ఞ ఏమిటంటే – మీరు పిలిచినప్పుడు, అర్ధకల్పం పూర్తి అయినప్పుడు నేను రావాల్సి ఉంటుంది. కలియుగం తర్వాత సత్యయుగం రావాలి కనుక నేను రావాల్సి ఉంటుంది. ఇది సంగమయుగమని, బాబా వచ్చి ఉన్నారని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. పిల్లలైన మీరు కూడా సేవ చేస్తారు, రోజు రోజుకు పరిచయమిస్తూ ఉంటారు, అలా తండ్రి పరిచయం అందరికీ లభిస్తూ ఉంటుంది. అనంతమైన తండ్రి అయిన శివబాబా, మనకు మళ్ళీ అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారని, ఇక్కడ కూర్చుని ఉన్న మీకు తెలుసు. మీరు బాబా-బాబా అని అంటారు కదా. మనం శివబాబా వద్దకు వచ్చాము. కల్పక్రితం వలె నేను సాధారణ తనువులోకి వచ్చానని శివబాబా కూడా అంటారు. ఇది మర్చిపోకూడదు. ఎవరి ద్వారానైతే పతితం నుండి పావనంగా అవ్వడం జరుగుతుందో, అటువంటి బాబా స్మృతిని మాయ మరపింపజేస్తుంది. సర్వుల సద్గతిదాత ఒక్క సద్గురువేనని మీకు తెలుసు. సిక్కులు కూడా సత్ శ్రీ అకాల్ అని పాడుతూ ఉంటారు. పతితపావనుడినే సద్గురువు అని అంటారు. ఓ పతితపావన, అని పిలుస్తారు కూడా. ఆత్మ పిలుస్తుంది. మనం తండ్రిని సమ్ముఖంగా కలుసుకునేందుకు ఇక్కడకు వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. గొప్ప వ్యక్తులు పరస్పరంలో ఒకరినొకరు కలుసుకునేందుకు వెళ్ళినప్పుడు, వారికి ఎంత మహిమ జరుగుతుంది. పరస్పరంలో ఒకరినొకరు స్వాగతం చేసుకునేందుకు, చాలా ఆర్భాటంగా సంతోషపు బ్యాండ్ మేళాలు మొదలైనవి మ్రోగిస్తారు. గుప్త వేషంలో ఎవరు వచ్చి ఉన్నారు అనేది మీకు మాత్రమే తెలుసు. వారిని దూరదేశంలో నివసించే బాటసారి అని అంటారు.
ఆత్మలైన మనం పరంధామంలో నివసించేవారమని మీకు తెలుసు. పాత్రను అభినయించేందుకు ఇక్కడకు బాటసారిగా అయి వచ్చాము. తండ్రి అర్థం చేయించే ఒక్కొక్క పదము ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. మీరు తండ్రి నుండి వింటున్నారు. దానిని మంచి రీతిగా ధారణ చేయాలి. ఈ కర్మ క్షేత్రంలో మీరంతా బాటసారులని తండ్రి అర్థం చేయిస్తారు. మనం శాంతిధామంలో నివసించేవారము, తర్వాత ఇక్కడకు టాకీ వరల్డ్ లోకి వచ్చాము. మనం శాంతిధామం యొక్క బాటసారులము, ఇక్కడ 84 జన్మల పాత్రను అభినయిస్తాము. చివరికి ఇది అంతిమ సమయము. కనుక పాత సృష్టిని కొత్తగా చేసేందుకు తండ్రి వచ్చి ఉన్నారు. ఈ విషయం కూడా మీకు తెలుసు. చిత్రాలు కూడా స్పష్టంగా ఉన్నాయి, శివబాబా బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అంతేకానీ, కృష్ణుడి ద్వారానో, విష్ణువు ద్వారానో స్థాపన చేస్తారని కాదు. బ్రహ్మా ద్వారా స్వర్గాన్ని రచించేందుకే తండ్రి వస్తారు. తండ్రి సాధారణ తనువులోకి వచ్చారు. ఇది పతిత ప్రపంచము, పావనమైనవారు ఒక్కరు కూడా లేరు. మొదటి నంబరులోని లక్ష్మీనారాయణులు కూడా పతితంగా అవుతారు. ఎవరైతే పావనంగా ఉండేవారో, వారే మొత్తం రాజ్యం సహితంగా పతితంగా అయిపోయారు. దేవతా ధర్మం వారిగా ఉండే మనమే, ఇప్పుడు శూద్ర ధర్మం వారిగా అయిపోయామని మీకు తెలుసు. అమెరికా మొదలైన చోట్ల పెద్ద పెద్ద షావుకార్లు ఉంటారు. కానీ సత్యయుగంతో పోలిస్తే అమెరికా ఏమీ కాదు. ఇవన్నీ చివర్లో తయారయ్యాయి. ఇది అల్పకాలిక ఆర్భాటము. వినాశనమైతే జరగాల్సిందే. పిల్లలైన మీకు చాలా మంచి నషా ఉండాలి. ఏ తండ్రి అయితే మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారో, వారిని పిల్లలైన మనం స్మృతి చేయము, ఇది ఎంత ఆశ్చర్యము. మాయ స్మృతి చేయనివ్వదు. బాబా, మాయ మమ్మల్ని స్మృతి చేయనివ్వడం లేదని పిల్లలైన మీరిప్పుడు అంటారు. అరే, ఎవరైతే మిమ్మల్ని 21 జన్మలకు స్వర్గానికి యజమానులుగా చేస్తారో, వారిని మీరు స్మృతి చేయలేరా. ప్రజలు కూడా స్వర్గానికి యజమానులుగా అవుతారు కదా. అందరూ సుఖమయంగా ఉంటారు. ఇప్పుడైతే అందరూ దుఃఖితులుగా ఉన్నారు. ప్రైమ్ మినిష్టర్, ప్రెసిడెంట్ మొదలైనవారికైతే రాత్రింబవళ్ళు చింత ఉంటుంది. యుద్ధం మొదలైనవాటిలో ఎంతమంది మరణిస్తూ ఉంటారు. మహాభారత యుద్ధం కూడా ప్రసిద్ధి చెందినదని మీకు తెలుసు. కానీ అందులో ఏమి జరిగింది అనేది ఎవరి బుద్ధిలోనూ లేదు. తండ్రి మీకు బుద్ధిలో కూర్చోబెట్టారు. మహాభారత యుద్ధంలో అందరూ మరణించారు. ఇది ఎంత పెద్ద మనుష్య సృష్టి. ఆత్మల వృక్షం కూడా ఉంటుంది. వృక్షం ముందు కొత్తగా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉంటుంది, తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. మొదట దైవీ ధర్మమున్నప్పుడు ఎంత చిన్న వృక్షముండేది, ఆది సనాతన దేవతా ధర్మముండేదని మీకు తెలుసు. ఇప్పుడు ఎన్ని వెరైటీ ధర్మాలున్నాయి! ఈ మహాభారత యుద్ధం ద్వారా వీటన్నింటి వినాశనం జరగనున్నది. కానీ ఈ జ్ఞానం ఎవరిలోనూ లేదు. ఇది అదే యుద్ధమని అంటారు కానీ దీనితో ఏమి జరగనున్నది అనేది వారికి తెలియదు. ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. వినాశనం జరగనున్నదని మీకు తెలుసు. అందుకే మహాభారత యుద్ధానికి ముందే మీ వారసత్వాన్ని తీసుకోండి. విషయమైతే చాలా సహజమైనది. పవిత్రంగా అవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండి. చాలామంది పిల్లలపై అత్యాచారాలు జరుగుతాయి. ఒకరినొకరు రక్షించుకునేందుకు మాతలైన మీ సంగఠన ఉండాలి. కానీ దేహీ అభిమానులుగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. మేము తప్పకుండా పావనంగా అవ్వాలి అనే పక్కా నషా ఉండాలి. ఇటువంటి నషాలో ఉండేవారే అర్థం చేయించగలరు. మనం తండ్రిని స్మృతి చేయాలి, పవిత్రంగా అవ్వాలి. మేము స్వదర్శన చక్రధారులము అనే నషా ఉండాలి. మనకు రచయిత అయిన తండ్రిని గురించి మరియు రచన యొక్క చక్రం గురించి తెలుసు. ఇప్పుడు మనం తండ్రి నుండి కొత్త ప్రపంచమైన సత్యయుగ వారసత్వాన్ని తీసుకోవాలి. మనం 84 జన్మలను ఎలా తీసుకుంటాము అనేది అర్థం చేయిస్తూ ఉండండి. తండ్రి అంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు సమాప్తమైపోతాయి. పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి. పావనము అనగా పవిత్రము. కామము మహాశత్రువు. మనం 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసాము, ఇప్పుడు తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. తండ్రి అంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు రిఫ్రెష్ అయ్యేందుకే ఇక్కడకు వస్తారు. తండ్రినైన నన్ను స్మృతి చేయండి. 21 జన్మల వారసత్వాన్ని తీసుకోవాలి. ఎవరి పట్ల మోహమనే బంధం ఉండకూడదు. నష్టోమోహులుగా అవ్వాలి. ఈ శరీరం పట్ల కూడా మోహము ఉండకూడదు. ఇదైతే పాత తోలు (శరీరం). కానీ చదువు చదువుకునేందుకు వీలుగా దీనిని సంభాళించాల్సి ఉంటుంది. శరీరానికి కష్టం కలిగితే (వ్యాధులు వస్తే) అతుకులు వేయాల్సి ఉంటుంది. ఇది పాత కుళ్ళిపోయిన శరీరమని మీకు తెలుసు. దీనికి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దుఃఖమనేది ఆత్మకు కలుగుతుంది. ఇప్పుడు ఈ శరీరాన్ని వదలాలని మీకు తెలుసు. యోగబలంతో దీనిని నిలబెట్టాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి, అంతే. ఇతర లౌకిక సంబంధాలేవీ గుర్తు రాకూడదు. నేను దేహాన్ని కాదు, ఆత్మను. తండ్రి అంటారు – నేను ఆత్మలైన మీకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు ఇక శరీరం కూడా మంచిదే లభిస్తుంది.
ఇప్పుడు మన ఆత్మ పావనంగా అవ్వనున్నదని మీకు తెలుసు. మనం పావనంగా ఉన్నప్పుడు ఈ లక్ష్మీనారాయణుల వలె ఉండేవారము. ఈ లక్ష్మీనారాయణులు 84 జన్మలు తీసుకున్నారు. మొత్తం సూర్య వంశం వారందరూ 84 జన్మలు తీసుకున్నారు. చంద్ర వంశీయులకు 84 జన్మలని అనరు. ఎవరైతే సూర్యవంశంలో మొట్టమొదట దాస దాసీలుగా అయ్యి ఉంటారో, వారు మళ్ళీ త్రేతాలో ఎంతో కొంత పదవిని పొందుతారు, వారివి 84 జన్మలు అంటారు. రాజా-రాణి, ప్రజలు, దాస దాసీలు మొదలైనవారంతా, ఎవరైతే సూర్యవంశంలోకి వస్తారో, వారే 84 జన్మలు తీసుకుంటారు. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. మనం 84 జన్మలను ఎలా తీసుకుంటాము అని విచార సాగర మథనం చేయాలి. ఎంత వీలైతే అంత తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. నడుస్తూ తిరుగుతూ కూడా మేము బాబా పిల్లలమని భావించండి. ఎవరు కలిసినా సరే, వారికి బాబా పరిచయాన్నివ్వాలి. ఈ చిత్రాలలో మొత్తం నాలెడ్జ్ ఉంది. అంతా అర్థం చేయించాలి. బాబా బ్రహ్మా తనువులోకి వచ్చి ఉన్నారు. మనమంతా బ్రహ్మాకుమార-కుమారీలము కదా. బ్రహ్మాకుమార-కుమారీలైన మనల్ని స్వర్గానికి యజమానులుగా చేసేందుకు తండ్రి వచ్చి ఉన్నారు. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. మనం బ్రహ్మాకుమార-కుమారీలము. మీ కార్డులను కూడా చూపించవచ్చు. ఎక్కడైనా ఆఫీసులు మొదలైన వాటిలో కూడా కార్డులు ఇవ్వండి, కానీ బి.కె.లు ఎవరు అనేది వారు అర్థం చేసుకోలేరు. అనేక రకాల విఘ్నాలు వస్తాయి. ఇది మా ఫ్యామిలీ అని గవర్నమెంట్ కు కూడా అర్థం చేయించడం జరుగుతుంది. దాదా మరియు బాబా ఉన్నారు. దాదా ద్వారా మనం వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఇది గుర్తు చేసుకున్నప్పుడు సంతోషముండాలి, ఆస్తి అయితే దాదాది. మనవలకు దానిపై హక్కు ఉంటుంది. అన్ని భాగాలను పంచుకుంటారు.
శివబాబా నుండి బ్రహ్మా ద్వారా మనం వారసత్వాన్ని తీసుకుంటామని మీకు కూడా తెలుసు. ఇది గుర్తుంచుకోవాలి. చదువుకోవాలి, మళ్ళీ చదివించాలి. పిల్లల పాలన చేయడమనేది తండ్రి బాధ్యత. కుమారులు, కుమారీలు మేజర్ అవ్వనంత వరకు తండ్రి వారిని సంభాళించాలి. పిల్లల పని చదువుకోవడము. తమ కాళ్ళపై తాము నిలబడేందుకు చదువుకుంటారు. బాబా మనల్ని 21 జన్మల కోసం చదివిస్తున్నారని మీకు తెలుసు. తర్వాత మన కాళ్ళపై మనం నిలబడతాము. ఎంతగా చదువుకుంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. మేము శ్రీ లక్ష్మీ మరియు శ్రీ నారాయణునిగా అయ్యేందుకు ఇక్కడకు వచ్చామని మీరు స్వయంగా అంటారు. ఇది సత్య నారాయణ కథ కదా. ఈ లక్ష్మీ నారాయణులు 84 జన్మలు ఎలా తీసుకుంటారు అనేది ఎవరికీ తెలియదు. రాధ భక్తులైతే రాధ అంతటా హాజరై ఉన్నారని అంటారు. ఎక్కడ చూసినా ‘రాధనే రాధ’, ‘కృష్ణుడే కృష్ణుడు’, ‘శివుడే శివుడని’ అంటారు. అంతా కలగా పులగం చేసేసారు. ఈశ్వరుడు, రాధ, కృష్ణుడు అందరూ సర్వవ్యాపి అని, వీరంతా ఈశ్వరుని రూపాలని, భగవంతుడు ఈ రూపాలను ధారణ చేసాడని అంటారు. ఎక్కడ చూస్తే అక్కడ నీవే నీవు….. అని అంటారు, పూర్తి తెలివిహీనులుగా అయిపోయారు. ఇది వికారీ పతిత ప్రపంచము. సత్యయుగం నిర్వికారీ పావన ప్రపంచము. నిర్వికారీ ప్రపంచమంటే స్వర్గమని అర్థము. అక్కడ పిల్లలైతే ఉంటారు కదా, వారు ఎలా జన్మిస్తారని అంటారు. కేవలం ఈ ప్రశ్ననే అడుగుతారు. పిల్లలు జన్మించకపోతే సృష్టి ఎలా వృద్ధి చెందుతుంది అని అంటారు. ప్రతి సంవత్సరం ఎంతమంది మనుష్యులు పెరిగారు అని జనాభా లెక్కలు తీస్తారు. ఇంతమంది మరణించారు అని తెలపరు. కనుక పిల్లలు మొదట తమ కళ్యాణం చేసుకోవాలి. నేను ఆత్మను – ముందు ఇది నిశ్చయం చేసుకోండి. బాబాను స్మృతి చేయాలి. ఎవరైతే అంతిమ సమయంలో నారాయణుని స్మరిస్తారో….. అని అంటూ ఉంటారు, ఇప్పుడు నారాయణుడిని స్మరించడమనే మాట తప్పుగా రాసేసారు. అంతిమ సమయంలో ఎవరైతే శివబాబాను స్మరిస్తారో….. ఈ చింతనతో ఎవరైతే మరణిస్తారో, వారే స్వర్గంలో నారాయణునిగా అవుతారు. అంతిమ సమయంలో నారాయణ అని ఎందుకంటారు? కృష్ణుడే జ్ఞానాన్ని ఇచ్చారని భావిస్తారు కావున కృష్ణుడిని స్మరించాలి కదా. కృష్ణుడిని గుర్తు చేస్తారు. నారాయణుని గురించి ఎవరికీ తెలియదు. కృష్ణ జయంతిని జరుపుకుంటారు, మరి రాధ జయంతి ఏమైంది? కృష్ణుడి జన్మను జరుపుకుంటారు, మరి నారాయణుని జన్మ? ప్రపంచానికి రాజా-రాణి అయిన లక్ష్మీనారాయణుల గురించి ఎవరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మాకు ముఖవంశావళి ఉంటారు కదా. వారు ఎక్కడకు వెళ్ళిపోయారు! బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని అంటారు. బ్రహ్మా ముఖవంశావళి ఉండేవారు కదా. శివబాబా బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారని పిల్లలు అర్థం చేసుకున్నారు. బ్రాహ్మణ ధర్మాన్ని బ్రహ్మా రచించలేదు, శివబాబా రచించారు. ఇప్పుడు వీరు బ్రహ్మాగా అయ్యారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ పాత శరీరంలో ఉంటూ చదువు చదువుకొని, 21 జన్మల కోసం సంపాదించుకోవాలి, అందుకే దీన్ని సంభాళించుకోవాలి. అంతేకానీ దీని పట్ల మోహం ఉంచుకోకూడదు.
2. అంతిమ సమయంలో ఒక్క శివబాబా స్మృతియే ఉండేటువంటి అభ్యాసం చేయాలి. ఇతర ఏ చింతనల్లోకి వెళ్ళకూడదు. తమ కళ్యాణం చేసుకోవాలి.
వరదానము:-
ఎలాగైతే శివుడు మరియు శక్తి కంబైండ్ గా ఉంటారో, అలా పాండవపతి మరియు పాండవులు కంబైండ్ గా ఉంటారు. ఎవరైతే ఇలా కంబైండ్ రూపంలో ఉంటారో, వారి ఎదురుగా బాప్ దాదా సాకారంలో సర్వ సంబంధాలతో ఎదురుగా ఉంటారు. ఇప్పుడు రోజు-రోజుకు ఇంకా ఎక్కువగా, అంటే, బాప్ దాదా ఎదురుగా వచ్చినట్లుగా, చేయి పట్టుకున్నట్లుగా అనుభవం చేస్తారు. బుద్ధితో కాదు కళ్ళతో చూస్తారు, అనుభవం చేస్తారు. కానీ కేవలం ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు అనే ఈ పాఠం పక్కాగా ఉండాలి, అప్పుడు, ఎలాగైతే నీడ తిరుగుతూ ఉంటుందో, అలా బాప్ దాదా కళ్ళ ముందు నుండి పక్కకు వెళ్ళలేరు, సదా సమ్ముఖంగా ఉన్నట్లుగా అనుభూతి అవుతుంది.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!