06 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

5 January 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - దేహాభిమానంలోకి రావడంతోనే వికర్మలు జరుగుతాయి, అందుకే ప్రతిజ్ఞ చేయండి - ఇతర సాంగత్యాలన్నింటినీ తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడిస్తాము’’

ప్రశ్న: -

ఏ ఆట ప్రకృతికి సంబంధించినది కానీ మనుష్యులు దానిని గాడ్లీ యాక్ట్ (భగవంతుని కార్యము) గా భావిస్తారు?

జవాబు:-

డ్రామాలో ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే వస్తాయో, వినాశన సమయంలో ఒక్క సముద్రపు అలతోనే అన్ని ఖండాలు, ద్వీపాలు మొదలైనవి సమాప్తమైపోతాయి, దాని రిహార్సల్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా ప్రకృతి ఆట. దీనిని మనుష్యులు గాడ్లీ యాక్ట్ అని అంటారు. కానీ బాబా అంటారు – నేను ఏ డైరెక్షన్ ఇవ్వను, ఇదంతా డ్రామాలో రచించబడి ఉంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నా మనసు యొక్క ద్వారం వద్దకు ఎవరు వచ్చారు..

ఓంశాంతి. ఎవరు వచ్చారు అనగా ఎవరి స్మృతి వచ్చింది? వచ్చి మనసులో కూర్చున్నారు అని కాదు. అలాగైతే సర్వవ్యాపి అయినట్లు, అలా కాదు. ఎవరు నా స్మృతిలోకి వచ్చారు? అకాల మూర్త్. వారిని కాలుడు కబళించలేడు. సిక్కుల వద్ద అకాల సింహాసనం కూడా ఉంది. వారి వద్ద అకాలీ వ్యక్తులు కూడా ఉన్నారు. వారు స్వయంగా అర్థం చేసుకోరు – సిక్కు ధర్మం ప్రవృత్తి మార్గానికి చెందిన ధర్మం అని. ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం మాత్రమే ప్రాయః లోపం అయ్యింది. రెండవది సన్యాస ధర్మం, నివృత్తి మార్గానికి చెందినది. ఇళ్ళు-వాకిళ్ళు విడిచి హద్దు యొక్క సన్యాసం చేసి పవిత్రంగా అవుతారు. అడవుల్లో అయితే తప్పకుండా పవిత్రంగా ఉంటూ ఉండవచ్చు. ప్రతి ఒక్క ధర్మం యొక్క ఆచార-పద్ధతులు వేరుగా ఉంటాయి. శిక్షణ కూడా వేరుగా ఉంటుంది. అది నివృత్తి మార్గం యొక్క ధర్మం, దానిని ఫాలో చేసేవారు కూడా ఇళ్ళు-వాకిళ్ళు వదిలి కాషాయ వస్త్రాలు ధరించవలసి ఉంటుంది. ఇంట్లో, గృహస్థంలో ఉంటూ కూడా జ్ఞానాన్ని పొందవచ్చు అని అయితే వారంటారు. కానీ అదేమీ జ్ఞానం కాదు. అలానే సన్యాసులు ఆ విధంగా చేయించలేరు. వాస్తవానికి ఎవరైతే సద్గతినిస్తారో, వారే గురువు. వారైతే ఒక్కరే. గురునానక్ కూడా శిక్షణనిస్తారు. వారు కూడా పరమాత్మ యొక్క మహిమనే చేస్తారు. ఏక్ ఓం కార్, అకాల మూర్త్, మీకు ఇప్పుడు ఆ అకాల మూర్త్ అనగా పరమపిత పరమాత్మ స్మృతియే ఉంది. మహిమ చేస్తారు – అకాల మూర్తి, అయోని అని. స్వయంభు అనగా రచయిత, నిర్భయుడు, నిర్వైరుడు (వైరం లేనివారు) అకాల మూర్త్, సద్గురు ప్రసాద్, జప్ సాహెబ్ మొదలైనవన్నీ పరమపిత పరమాత్మ యొక్క మహిమ. అకాల మూర్తినే నమ్ముతారు. వారే చెప్తారు – సత్యయుగం మొదలైనవి సత్యము, జరగనున్నది కూడా సత్యము. ఇది కూడా అంటారు – మురికిపట్టిన వస్త్రాలను శుభ్రం చేస్తారు… పతిత-పావనుడు అంటేనే మురికి పట్టిన వస్త్రాలను ఉతికేవారు, శుభ్రం చేస్తారు. అందుకే వారి మహిమను కూడా పాడుతారు. మళ్ళీ అంటారు – ఇతరుల సంపాదనను భక్షించే దొంగలు, దోపిడీదారులు లెక్కలేనంతమంది ఉన్నారు. ఇది కూడా ఈ సమయం యొక్క మహిమనే. మళ్ళీ – నీచంగా ఉన్నవారా ఆలోచించండి… అని నానక్ అంటారు. ఇక వారిపై బలిహారమవుతారు. తప్పకుండా ఎప్పుడైతే వారు వచ్చారో, అప్పుడే బలిహారమవుతారు. బాబా అంటారు – నేను అహల్యలను, వేశ్యలను, సాధువులను కూడా ఉద్ధరించడానికి వస్తాను కనుక తప్పకుండా అందరూ పతితులుగా ఉన్నట్లే. ఇప్పుడిది అనంతమైన విషయము. కనుక తప్పకుండా అనంతమైన యజమానే వచ్చి అర్థం చేయిస్తారు. బ్రహ్మా, విష్ణు, శంకరులు కూడా నా రచన. బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం యొక్క స్థాపన, శంకరుని ద్వారా అనేక ధర్మాల వినాశనం. ఇతరులు ఎవరైతే వస్తారో, కేవలం తమ ధర్మం యొక్క స్థాపన చేస్తారు. అలాగని ఆ గురువులు సద్గతి దాతలు అని కాదు. సద్గతి ఎవరిది చేస్తారు? వారి వంశావళిదే పూర్తి వృద్ధి జరగలేదు, అటువంటప్పుడు సద్గతి ఎలా చేస్తారు. తండ్రి అంటారు – నేను వచ్చి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం యొక్క స్థాపన మరియు ఇతర అధర్మాల యొక్క వినాశనం చేయిస్తాను. ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా, పాపాత్ములుగా అయిపోయారు. మనుష్యులు ఎవరైతే ఈ అనంతమైన డ్రామాలో పాత్రధారులుగా ఉన్నారో, వారికి సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న విషయం తెలియాలి. తండ్రి వచ్చి పిల్లలైన మనల్ని త్రికాలదర్శులుగా చేస్తారు. ఇది కూడా అర్థం చేసుకుంటారు – తప్పకుండా తండ్రి వచ్చి స్వర్గమును, సత్య ఖండమును స్థాపన చేస్తారు మరియు అసత్య ఖండాన్ని వినాశనం చేస్తారు. సత్య ఖండాన్ని స్థాపన చేసేవారు సత్యమైనవారు కదా. ఈ విషయాలన్నీ బాబాయే అర్థం చేయిస్తారు. అందరూ అయితే ధారణ చేయలేరు ఎందుకంటే దేహాభిమానం చాలా ఉంది. ఎంతగా దేహీ-అభిమానులుగా ఉంటారో, తమను తాము అశరీరి ఆత్మగా భావిస్తారో, బాబాను స్మృతి చేస్తారో, అప్పుడు ధారణ జరుగుతుంది. దేహాభిమానులకు ధారణ జరగదు. యోగంతోనే ఆత్మ యొక్క పాపాలు దగ్ధమవుతాయి. పగలులోనైతే దేహాభిమానం ఉంటుంది. కనుక దేహీ-అభిమానులుగా అయ్యే ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి?

తండ్రి అంటారు – నిద్రను జయించేవారిగా అవ్వండి. తండ్రి ఎంత మంచి పాయింట్లను అర్థం చేయిస్తారు. కానీ కొందరు ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు, మురళీని అసలు విననే వినరు. చదువైతే ముఖ్యమైనది. ఏదైనా చేసి మురళీని అయితే చదవాలి. కానీ, అలాగని వికారాలలో పడిపోతూ ఉండడము మరియు మురళీని అడుగుతూ ఉండడము, కాదు. ఎప్పటివరకైతే గ్యారంటీ ఇవ్వరో, అప్పటివరకు మురళీని పంపించకూడదు. ఎవరైతే మురళీ చదవరో, వారి గతి ఏమవుతుంది? మంచి-మంచి పిల్లలు కూడా మురళీ చదవరు, నషా ఎక్కిపోతుంది. లేదంటే ఒక్క రోజు కూడా మురళీని మిస్ చేయకూడదు. ధారణ జరగడం లేదు అంటే దేహాభిమానం ఉంది అని అర్థం చేసుకోవాలి. వారు ఉన్నత పదవిని పొందలేకపోతారు. బాబా మంచి రీతిలో అర్థం చేయిస్తారు. పిల్లలు కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. బాబా అయితే బయటకు వెళ్ళలేరు. బాబా పిల్లల ఎదురుగానే అర్థం చేయిస్తారు. వీరు పెద్ద తల్లి కూడా, గుప్తంగా ఉన్నారు. శక్తులు బయటకు వెళ్ళగలరు. కాన్ఫరెన్స్ లు జరుగుతాయి, వాటిలో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం యొక్క ప్రతినిధి అయితే ఎవ్వరూ లేరు. ఈ పాయింటును కూడా అర్థం చేయించాలి. మిగిలిన ధర్మ పితలు ఎవరైతే వస్తారో, వారు కేవలం ధర్మ స్థాపన చేయడానికే వస్తారు, అంతేకానీ, అధర్మాలను వినాశనం చేయడానికి కాదు. సత్య ధర్మం యొక్క స్థాపన, అనేక ధర్మాల వినాశనం సంగమంలోనే జరుగుతుంది. ఎప్పుడైతే దిగే కళ ఏర్పడుతుందో, అప్పుడు తండ్రి వస్తారు. ఎక్కే కళ అయితే ఒక్కసారే ఉంటుంది. దీని గురించి ఒక శ్లోకం కూడా ఉంది – చిన్నతనంలో చదివాము. గురునానక్ అన్నారు – అందరూ నింద చేసేవారు, అసత్యమైనవారు, ఎవ్వరూ కూడా పవిత్రంగా ఉండరు. సిక్కు ధర్మంలో అకాలీలు ఉంటారు (అనగా సిక్కు ధర్మంలో ఒక కులానికి చెందినవారు). వారి పైన నల్లని చక్రాన్ని కూడా చూపిస్తారు. ఇది స్వదర్శన చక్రము. ఇది కూడా పవిత్రతకు గుర్తు. కంకణం కూడా ధరిస్తారు – ఈ రెండూ పవిత్రతకు గుర్తులు. కానీ వారికి దీని అర్థం తెలియదు, పవిత్రంగా కూడా ఉండరు. జంధ్యం కూడా పవిత్రతకు గుర్తు. ఈ రోజుల్లో అయితే అన్నింటినీ తొలగించేసారు. బ్రాహ్మణ కులం ఉత్తమమైనది. అందులో మళ్ళీ పెద్ద పిలకను పెట్టుకుంటారు. కానీ పావనంగా అయితే ఎవ్వరూ అవ్వరు. పతిత-పావనుడైన ఒక్క పరమాత్మనే వచ్చి అందరినీ పావనంగా తయారుచేస్తారు. బుద్ధుడు, క్రైస్టు మొదలైనవారు ఎవ్వరూ కూడా పతిత-పావనులు కాదు. అలా కాదు, గురువులైతే ప్రపంచంలో అనేకులు ఉన్నారు, నేర్పించేవారు, చదివించేవారు. ఇకపోతే, సర్వుల సద్గతిదాత, పతిత-పావనుడు ఒక్కరే. అందరినీ పావనంగా తయారుచేసి నాతో పాటు తీసుకువెళ్ళడానికి నేనే వస్తాను. జ్ఞాన సాగరునితో పాటు సహాయకులుగా జ్ఞాన గంగలైన మీరు కూడా ఉన్నారు. గంగా నదిపై కూడా దేవీ చిత్రాన్ని పెట్టేసారు. ఇప్పుడు వాస్తవానికి జ్ఞాన గంగలు మీరు. కానీ మీ పూజ అయితే ఇప్పుడు జరగదు ఎందుకంటే మీరిప్పుడు యోగ్యులుగా అవుతూ ఉన్నారు. పూజారుల నుండి పూజ్యులుగా అవుతూ ఉన్నారు. తర్వాత మీ పూజారితనం సమాప్తమైపోతుంది. ఈ రహస్యాన్ని అర్థం చేయిస్తారు. కానీ ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. అడుగడుగునా బాబా యొక్క శ్రీమతంపై నడవాలి. దేహాభిమానాన్ని విడిచిపెడుతూ ఉండండి. ఈ మిత్ర సంబంధీకులు మొదలైనవారంతా సమాప్తం అవ్వనున్నారు. మనమంతా వెళ్ళిపోతాము. కానీ ప్రపంచమైతే ఉంటుంది కదా. తండ్రి అంటారు – నేను కొత్త సృష్టి రచయితను. కానీ నేను పతిత ప్రపంచంలోనే వస్తాను కదా, అప్పుడు నన్ను పతిత-పావనుడు అని అంటారు, కనుక తప్పకుండా పతిత ప్రపంచం ఉంటుంది. పావన ప్రపంచంలోనైతే పతితులు ఉండరు. పరమాత్మ అయితే హెవెన్ (స్వర్గం) ను స్థాపన చేయాలి, అందుకే వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. క్రైస్టు స్వర్గ స్థాపన చేయరు. అయితే, ఆ సమయంలో ఏ ఆత్మలైతే పై నుండి వస్తారో, వారు సతోప్రధానంగా ఉంటారు. ఇంకెవ్వరూ పతితం నుండి పావనంగా చేయరు. పతితులు అని పిలిపించుకునేలాంటి వికర్మలేవీ పిల్లలైన మీరు ఇప్పుడు చేయకూడదు. దేహాభిమానంతోనే వికర్మలు జరుగుతాయి. మీరు గ్యారంటీ ఇస్తారు – ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడిస్తాము అని. ఇప్పుడు మీరు ప్రతిజ్ఞ పూర్తి చేయండి, లేదంటే శిక్షలు అనుభవిస్తారు. గ్రంథ్ లో కూడా ఉంది – మీరు ఎక్కే కళలోకి వెళ్ళే సమయంలో, మీ కారణంగా సర్వులకు మేలు జరుగుతుంది. పదాలు బాగున్నాయి కానీ ఏదైతే చదివారో, అదైతే మర్చిపోవలసి ఉంటుంది. బాబాకైతే పిల్లల పేర్లు కూడా పూర్తిగా గుర్తు లేవు ఎందుకంటే శివబాబాను స్మృతి చేయాలి. అందుకే బాబా అంటారు – సంతోషంగా ఉండండి, సమృద్ధిగా ఉండండి, మర్చిపోవద్దు, గుర్తుంచుకోవద్దు. కానీ సేవాధారీ పిల్లలను బాబా తప్పకుండా గుర్తు చేస్తారు – ఫలానావారు చాలా మంచి సహాయకులు అని. షావుకార్లు అయితే ఘోర అంధకారంలో పడి ఉన్నారు. ఎవ్వరికీ తెలియదు, మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది అని. భగవానువాచ – నేను రాజయోగాన్ని నేర్పిస్తాను. కావున తప్పకుండా జ్ఞానం ద్వారా ధనం యొక్క దేవీగా అవుతారు. ఈ మొత్తం రాజధాని అంతా నంబరువారుగా తయారవుతుంది. మీకు తెలుసు, మనం అందరం నంబరువారుగా చదువుతున్నాము. బాబా అంటారు – నేను రాజధానిని స్థాపన చేస్తున్నాను, అనేక ధర్మాలను వినాశనం చేయిస్తాను. పరమ సద్గురువు ఒక్కరే, ఉన్నతాతి ఉన్నతమైనవారు అని ఒక్క భగవంతుడినే అంటూ ఉంటారు. ఉన్నతాతి ఉన్నతమైన బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా భగవంతుడు అని అనరు. అటువంటప్పుడు రాముడిని, కృష్ణుడిని భగవంతుడు అని ఎలా అంటారు. వారైతే జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు. భక్తులు భగవంతుడిని స్మృతి చేస్తారు, బ్రహ్మా, విష్ణువు, శంకరులను ఏమైనా స్మృతి చేస్తారా. ఈ విధంగా ఇప్పుడు వ్యభిచారిగా అయిపోయారు. కనుక ధారణ చేయాల్సిన ఎంత మంచి-మంచి విషయాలు ఉన్నాయి. ఎవరు చేస్తారో, వారు పొందుతారు. మీరు జ్ఞాన గంగలు. నదులైన మీకు మాత్రమే తీరాలు ఉంటాయి. సాగరమైతే ఎక్కడికీ వెళ్ళలేదు. కానీ అదైతే జడమైన సాగరము. వీరు చైతన్యమైనవారు. దానిలోనైతే ఒక్క తుఫాను యొక్క అల ఎగసిపడినా, చాలా నష్టం జరుగుతుంది. వినాశన సమయంలో తీవ్రతతో తుఫాన్లు వస్తాయి. అన్ని ఖండాలు, ద్వీపాలు మొదలైనవి సమాప్తమైపోతాయి. ఎక్కువ సమయం పట్టదు. ప్రకృతి వైపరీత్యాలను గాడ్లీ యాక్ట్ (భగవంతుని కార్యము) అని అంటారు. శంకరుని ద్వారా వినాశనం అయ్యింది అంటే అది గాడ్లీ యాక్ట్ (భగవంతుని కార్యము) కదా అని అంటారు. కానీ తండ్రి అంటారు – నేనేమీ అటువంటి డైరెక్షన్స్ ఇవ్వను. ఇవన్నీ డ్రామాలో రచించబడి ఉన్నాయి. తుఫానులు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవన్నీ తమ పని చేస్తాయి. కల్ప-కల్పము ఈ వైపరీత్యాలు వచ్చేదే ఉంది మిగిలిన అన్ని ఖండాలు సమాప్తమైపోతాయి. ఇకపోతే, ఒక్క భారత్ ఉండిపోతుంది. దాని కోసం ఏర్పాట్లు జరుగుతాయి. రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. ప్రకృతి యొక్క ఈ ఆట తయారుచేయబడింది.

శివశక్తులైన మీరే ఎక్కడికైనా వెళ్ళి అర్థం చేయించగలరు – మీరందరూ శాంతి స్థాపన జరగాలి అని కోరుకుంటున్నారు కానీ శాంతి ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా? సుఖం ఎక్కడ ఉంటుంది, దుఃఖం ఎక్కడ ఉంటుంది – ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడిది దుఃఖధామము. ఈ భారత్ యే సుఖధామంగా ఉండేది. ఆది సనాతన దేవీ-దేవతల రాజ్యముండేది. కలియుగం దుఃఖధామము, దీని వినాశనం తప్పకుండా జరగాలి. మొదట అంతము, తర్వాత ఆది జరగాలి. మధ్యలో అనేక ధర్మాలున్నాయి. సత్యయుగంలో ఒక్క ధర్మముండేది. ఇది డ్రామా యొక్క చక్రము. ఇందులో నాలుగు ముఖ్య ధర్మాలున్నాయి. ఒక ధర్మం యొక్క పాదం మాయమైపోయింది. దేవతా ధర్మాన్ని స్థాపన చేసినవారు ఎవరు? – ఇది చెప్పండి? పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన చేయిస్తారు. వాస్తవానికి మీరు కూడా ప్రజాపిత బ్రహ్మా యొక్క సంతానము. శివునికి కూడా సంతానము. బ్రహ్మా సంతానమైన కారణంగా పరస్పరంలో సోదరీ-సోదరులు. మేము వారికి చెందినవారిగా అయ్యామని మీకు తెలుసు. పరమపిత పరమాత్మ మొదట బ్రాహ్మణ ధర్మాన్ని రచిస్తారు. బ్రాహ్మణ ధర్మం పిలక వంటిది, మిగిలిన ధర్మాలవారు అందరూ తర్వాత నంబరువారుగా వస్తారు. చివర్లో మీ ప్రత్యక్షత తప్పకుండా జరగనున్నది. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్, ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానం యొక్క ధారణ కోసం ఎంత వీలైతే అంత దేహీ-అభిమానిగా ఉండాలి. అశరీరిగా అయ్యే అభ్యాసం రాత్రి మేల్కొని చేయాలి.

2. ఏదైనా చేసి మురళీని రోజూ వినాలి లేక చదవాలి. ఒక్క రోజు కూడా మిస్ చేయకూడదు, ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితో సాంగత్యాన్ని జోడించే ప్రతిజ్ఞ చేయాలి.

వరదానము:-

సదా స్మృతిలో పెట్టుకోండి – మేము తండ్రి నయనాల యొక్క సితారలము. నయనాలలో సితార అనగా బిందువే ఇమిడిపోగలదు. కళ్ళలో చూసే విశేషత కూడా బిందువుదే. కనుక బిందు రూపంలో ఉండాలి – ఇదే ఎగిరే కళలో ఎగరడానికి సాధనము. బిందువుగా అయి ప్రతి కర్మ చేసినట్లయితే, తేలికగా ఉంటారు. ఏ బరువును కూడా మోసేటువంటి అలవాటు ఉండకూడదు. ‘నాది’ అనేందుకు బదులుగా ‘నీది’ అని అన్నట్లయితే, డబల్ లైట్ గా అయిపోతారు. స్వ ఉన్నతి లేక విశ్వ సేవా కార్యం యొక్క బరువు కూడా అనుభవమవ్వదు.

స్లోగన్:-

లవలన స్థితిని అనుభవం చేయండి

దేహం యొక్క స్మృతి నుండి ఏ విధంగా మర్చిపోయి ఉండాలంటే దేహ భానం, రాత్రి-పగలు, ఆకలి-దప్పికలు, సుఖం, విశ్రాంతి సాధనాలు – ఏ విషయం యొక్క ఆధారం పైనా జీవితం ఉండకూడదు, అప్పుడు అంటారు, ప్రేమలో లవలీనమైన స్థితి అని. ఎలాగైతే దీపం జ్యోతి స్వరూపమో, లైట్ మైట్ రూపమో, అలా దీపం సమానంగా, స్వయం కూడా లైట్-మైట్ రూపంగా అయిపోండి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top